సూర్యశతకము (తెలుగు)/రవి వర్ణనము

రవి వర్ణనము

చ. శ్రితవిధులై బుధుల్ క్రుతుల సిద్దులు గీతిని సౌరగాతలున్
జతురతఁ జాటు గర్భముగఁ జారణులు న్యతబుద్ధియాతుధా
నతతి ముహుర్ముహుర్నతిఘనాహులు సార్ఘ్యము సాధ్యులున్ మహా
వ్రతనియతిన్ ముముక్షువులు పక్షతఁ గొల్చు నవాద్రి మీకగున్.

తా. సిద్ధులు సిద్ధాంతవాక్యముల చేతను, విబుధులు వేదవాక్యముల చేతను, చారణులు చాటువుల చేతను, గంధర్వులు గీతముల చేతను, బ్రాహ్మణులు ప్రాతఃకాలమున అర్ఘ్యములతోడను, రాక్షసులు మనోనిగ్రహముతోడను నెవని స్తుతింతురో అట్టి సూర్యుడు మీ యఘముల నడగార్చు గాక.[81]

ఉ. చెంగట నంగుగా వెలుఁగు చిచ్చులకొల్మినిఁ గాచి కాచి వె
ట్టం గతిమ త్తురంగ ఖురటంకముల న్వడిఁ గోసి కోసి ని
స్సంగ రథాంగసంభ్రమ లసన్నికషాప్తిని గీసి గీసి ము
బ్భంగుల మేరువుం దిరిగి వన్నియగట్టు నినుండు మీ కగున్.

తా. బంగారము పరీక్షించుటకు మూడు విధములు గలవు. 1.పుటము పెట్టుట 2) కొంచెము ఖండించి పరీక్షించుట 3) ఆకురాతి యొరపిడి.
ఎవని కిరణముల తీవ్రతచే. బంగారు పర్వతము (మేరు పర్వతము - సూర్యుడు దానిచుట్టు పర్యటించును.) పుటము పెట్టినట్లయినదై, రథాశ్వముల గొరిజల తాకుడుచే, పైకి పెట్లుచున్న ముక్కలు గలదై రథచక్రముల యొరపిడి - యను మూడు పరీక్షలకు లోనగుచున్నదో అట్టి రవి మీకు నభ్యుదయములు ప్రసాదించు గాత.[82]

ఉ. బంగరుతమ్మి గంగఁ బ్రతిభం గనువాడదు నందనంబునన్
దుంగు సుమాళిలక్ష్మి కడు దోడదు నెండదు మేరుశృంగముల్

రంగు లెసంగుగాని చెదరంగఁ గరంగవు సత్కృపాప్తి ని
బ్బంగిని మార్దవంబు గలభాగ్య మహమ్ము వినుండు మీకగున్.

తా. చాల వేడి గలవియయ్యు సూర్యకిరణము లాకాశగంగ నీటిని నింకజేయవు సరికదా, అందలి కమలములను వికసింప జేయును, అట్లే చెక్కు చెదరకుండ నందనోద్యాసమును ప్రకాశింప జేయును - మేరుగిరి బంగారు శృంగములు నెవ్వని తెల్లనైన కాంతిచేత తెల్లబడవో అట్టి సూర్యుడు మీ కాయుర్భాగ్యము ప్రసాదించుగాక.[83]

ఉ. చీకటి నొక్కదానిన గ్రసింపదు కల్మష కిల్బిషంబులన్
నూకునుఁ దమ్మిమాత్రమ వినోది నొనర్పదు భక్తబోధన
శ్రీకము కేవల మ్మహిమ చేయదు శ్రేయముగూర్చు మద్యమం
బేకము పూనియుం బనులనేకము నేయు నినుండు మీ కగున్.

తా. ఎవ్వడు కేవలము చీకటిని నశింప జేయుటయే గాక పాపములను పోగొట్టుచున్నాడో, ఎవడు కిరణముల తాకుడు వలన, తామరులను కాంతిమంతము చేయుటయే గాక తనయడుగు దామరల మ్రొక్కు వారిని తేజోవంతులుగా జేయుచున్నాడో, ఎవడు, పగటికి కర్తయగుటయే గాక, మోక్షమునకు కర్త యగుచున్నాడో, ఆ భానుడు, మీకు, నిరంతర శుభములు చేకూర్చుగాక.[84]

చ. పరవశవృత్తి చెయ్వుడిగి ప్రక్కలఁ బండి నివాళ నూర్చి యే
దరిఁ గనఁ జీఁకటై నెగులు దాల్చినయట్లు జగంబుఁ జేయుచున్
మఱియొక లోక మభ్యుదయమాన్యము సేయఁగఁబోవునట్టి భా
స్కరుఁడు శుభక్రియాకలన సంతసము న్మిముఁ బ్రోచుఁ గావుతన్.

తా. ఏ సూర్యుడు లేకపోయిన యెడల - ఉదయింపని యెడల లోకము చైతన్య రహితమై మట్టిపెల్ల వలె బడియుండునో మండము పట్టి చేష్టలు దక్కి, బ్రదుకుదునో, బ్రదుకనో యను సందేహము గల మానవుని వలె జగము పడియుండునో, నలుదిక్కులను కటిక చీకటి గమ్మినట్లుండునో అట్టి సూర్యుడు మీ కవారైశ్వర్యముల నిచ్చుగాత. సూర్యుడుదయింపనిచో లోకవికాసమే లేదని భావము.[85]


చ. నిలుకడలేదు లోకగతి నిల్చునుఁ దత్పరిపాలనంబునన్
వెలుఁగున లోకదృష్టి మిఱుమిట్లగు లోపలిదృష్టి మే లగున్
బలితపు లోకతాపమగు మౌనుల నిర్వృతి కారణం బగున్
లలి నిటుఁ బ్రాగ్దిశాధికవిలాసుఁడు భానుఁడు మీకు మేలిడున్.

తా. ప్రపంచమున కంతకు కాంతిని ప్రసాదించుటకు నాతడు తిరుగుచునే యుండును - కాని స్థిరముగా నుండును. జనులు చూచుటకు దుర్నిరీష్యుడుగా నుండును కాని, భద్రములను గలిగించును. అతడు మనుజులను తపింప జేయును, అయినను ముక్తి నిచ్చును. అట్టి సూర్యుడు మీకు సంపద లొసంగు [86]

ఉ. కాలము దప్పవాఱయిన కాఱులు పండు సువృష్టిఁ జేలు దే
వాళి మఘంబులం దనియు నప్పవమానుఁడు వీఁచుఁ జుక్కలున్
దూలవు, మోచు నద్రు లిలఁ గోయధిమేరను మీఱ దాశలున్
మేలగు నిట్లు ముజ్జగము నిల్పు దివాకరుఁ డేలు మిమ్ములన్.

తా. ఋతువులు తప్పక క్రమముగా వర్తిల్లును - వానలు సకాలమున వర్షించును - దిక్కులు చెక్కు చెదరక నిలచును - కులపర్వతములు కదలక యుండును - ఇట్లు ముల్లోకములను స్థిరముగా నిలిపిన తీవ్రాంకుడు మీకు తేజస్సు నొసగు గాత.[87]

ఉ. చక్కనిచుక్కఁ బ్రక్క నిడి శంభుఁడు గ్రుమ్మంబు వెండి కొండపై
నక్కడలి న్మురారి యహియందు సుఖంబుగ నిద్రబోవు దా
నక్కమలాసనుండు దినమంతయుఁ జీత్తనిరోధ మూనుఁ బెం
పెక్క నితండు ముజ్జగమునేలఁగ నీ రవి మిమ్ముఁ బ్రోచుతన్.

తా. కైలాసమున శివుడు అర్ధనారీశ్వరుడై సుఖముగా నుండును. పాల సముద్రమున శేషశయ్యపై విష్ణువు హాయిగా నుండును. కాని ఎవడు. ఒక్క క్షణమైనను విశ్రమింపక, లోకరక్షణ కొఱకు ఉదయము మొదలు సాయం కాలము వఱకు తిరుగుచుండునో, అట్టి సూర్యుడు మీదొసగుల, తొలగించు గాక.[88]


ఉ. బింబము ఋక్కులై, లసదభీశులు సామములై యణుస్థితిన్
బింబము నొందువాఁడు మహనీయయజుశ్రుతియై త్రయీమయా
డంబరమూర్తి యంచు నెదుటంబడి వైదికులెల్ల మ్రొక్క స్వ
ర్గం బపవర్గ మిచ్చు గ్రహరా జొసగున్ సిరి మీకు నిత్యమున్.

తా. సూర్యబింబము ఋగ్వేదము - కాంతి సామవేదము, సూర్యమండలాంతస్థుడైన పురుషుడు యజుర్వేదము. ఇట్లు త్రయీమూర్తియై స్వర్గాపవర్గములను ప్రాణికోటిని కటాక్షించు సూర్యుడు మిమ్ములను రక్షించుగాత.[89]

శా. అయ్యల్ లోకహితప్రచారులు సురేంద్రాదుల్ సుతుల్ దైత్యులున్
వ్రయ్యల్ నేసిన జోదు లయ్యదితి కెవ్వారున్న మౌనివ్రజం
బయ్యాదిత్యపదంబు వీని కగుఁగా కంచు న్నుతుల్ సేయు న
క్షయ్యప్రాభపుఁ డైన సూర్యుఁడు సమస్తశ్రీలు మీకిచ్చుతన్.

తా. అదితి సంతానమగు దేవతలందఱు నెవని సేవించి సూర్యుడాదిత్యుడను శబ్దమను సార్థకము చేయుదురో సమస్త మునిగణము నెవని సంతతము స్తుతించుచుండునో, అట్టి సూర్యుడు మీకు శుభ ప్రారంభముల్గూర్చుగాక.[90]

చ. వెలుఁగున మంటిమేలిమియు వృష్టిజలాకృతి సంస్కృతి న్మహా
నిల తనువుష్టిమన్ జగతి నిప్పుమెయిన్ మదిఁ గోర్కెలిచ్చి యు
జ్జ్వలలితమూర్తి యున్కి మినుచాయయు దర్శనుఁ జంద్రురూపు ని
ట్లలరి స్వమూర్తితో నెనిమిదౌ శివలీలల ప్రొద్దు మీ కగున్.

తా భూమిని కాంతిచేతను జగమును, జలముచేతను గాలిని పొవనత్వము చేతను, అగ్నిని దాహకత్వముచేతను, నిరంతరము ప్రార్జించు యజమానులను నిలిపి, ఆకాశమున చం[దకిరణ (ప్రసారము చేయుచు చీకటిని పోగొట్టి, జగదైశ్వర్యసంపదను అష్టమూర్రియైన శివునివలె నొసంగు సూర్యుడు మీకు శ్రేయోదాయకు డగుగాత. [91]

చ. లలిత నవ ప్రఫుల్ల కమలాకరభూషణ పాదళోభియై
దల మగు భక్తి మింట వినతాసుతుఁ డర్మిలి దారితోడుగా
నెలమిని యేడుగుజ్జముల యెక్కుడు లోకముమీఁది దేవతల్‌
గొలువ మురారి పాటి నెసగుం గమలాప్తండు మిమ్ము బ్రోచుతన్‌.

తా. విష్ణుమూర్తి గరుత్మంతు నెక్కి స్పప్తలోకములు పర్యటించునట్లుగాగరుత్మంతుని సోదరుడైన అనూరుడు రథసారథిగా ఏడు గుజ్జములతో నేడు లోకములను, రెండవ విష్ణవువోలె సంచరించు సూర్యుడు మీకు శుభము లధికముగా నిచ్చుగాత. [92]

చ. కమలము లుద్భవం బొసఁగు కారణమై యచలోదయ్యప్రధా
న మయిన ముజ్జగంబుపయినం గల ధామము దుర్గమంబుగా
నమరఁ (బ్రసన్నకాంతి జతురాస్యత రెండవబ్రహ్మయో యనం
విమలతరాత్మభూతి గల వే వెలుఁ గిచ్చును మీకు సిద్దులున్.

తా. ఎవడు (బహ్మవలె, భూర్చువస్వర్గలోకములకు పైగా తేజముతో నిండియండునో, ఎవడు (బహ్మవలె (పతిదినము సృష్టి యొనర్చునో, (బహ్ నాలుగు మట్లు తన కాంతులను నలుదిశలను (పసరింపజేయునో, అట్టి రెండవ బ్రహ్మ యైన కమల మిత్రుడగు సూర్యుడు మీ కానందామీదుగాక మీ కానంద మిడుగాత.[93]

చ.మలలిలయుం దిశల్ జలధిపాళి బయల్ కనులన్ మెలంచి వే
ల్చుల నిలయంబునం దులనము ల్తలసూపని వేవెలుంగు ని
మ్ముల విలయంబునందె నలుమూళ్ల్ళయొడళ్లఁ జెలంగి పాపబు
వ్వలు గల వేలుపన్న రథసాలునిఁ జేయు నినుండు మీ కగున్.

తా. ఎవడు తూర్చుదిశ యందు కొండలను, సదులను, భూమిన్కి సముద్రమును నతి త్వరితముగా వెలిగించునో, వేయి కన్నులు గల ఇంద్రుని రాజ్యమగు స్వర్గమున నెవ్వ డలభ్యుడో ఎవ్వడు ప్రళయకాలమున పండ్రెండు మూర్తులుగా ప్రకాశించునో అట్టి యత్యాశ్చ ర్యచర్య గల నూర్కడు మీక ుమేలు చేకూర్చుగాత. [94]

చ. కొలను నదంబు వాగు లలుగుల్ గల చెఱ్వులు తీర్థభావముగ్‌
దొలఁగు పయోధినీటఁ బడ(ద్రోచు నమంగళ మార్చలేదు వే
ల్ప్బుల నది స్నాతులం బరమపుణ్యులఁ జేయదుగాదె యన్యలో
కుల నితఁ డేలఁ టోవ సురకుంజరుఁ డిట్టి యినుండు మీకగున్.

తా. ఎవ డుదయింపనియెడల సకల నదీనదములు, వాగులు, మడుగులు, కోనేళ్లు, వీనియందలి నీళ్ళు పుణ్యఫల ప్రదములుగాక వ్యగ్థమగునో, ఆకాళగంగలో నీళ్ళనైతము, తమలో మునిగిన వాని పాపమును బోగొట్టలేవో అట్టి నూర్యభగవానుడు మీకు శుభముల నొసగుగాత. [95]

చ. భువన మథోగతిం బుఱద మున్గినయట్లు తమంబు మూగుచో
నవగతి లేక జ్ఞానము వియత్సుమమై గుఱుతేది కూర్కు న
ర్గ విధికిఁ బూర్వమట్లు (ప్రతి రాతిరి తన్నెడఁ బాయు లోకమున్
దవిలి యొనర్చునట్టి శని తండ్రి సుఖంబులు మీకు నిచ్చుతన్.

తా. ఎవని యుదయము లేకపోయిన- సమ స్తలోకములు, పాతాళము వఱకు వ్యాపించిన చీకటియందు మునిగిపోవునో, ఎవడు నిద్రావస్థయందున్న సకల జగములను మేల్కొల్పజేసి, సృష్టి సమానోదయుడగునో, అనగా సృష్టితోనే యదయించునో ఆ నూర్యుడు మిమ్ము రక్షించుగాత రగ [96]

ఉ. ఇక్కడి పశ్చిమా(ద్రి నిజమెంచిన నక్కడి తూర్చుకొండ యౌ
నిక్కడ పండువెన్నెల పయింబడ నక్కడ నెండ మెండగున్.

జిక్కఁడు దేశకాలముల చేతికి వానిన లోఁగొనున్ సదా
యిక్కతనం ద్రిలోకహితుఁ డౌ నుతుఁ డా తపనుండు మీకగున్.

తా. ఒక ద్వీపమున నెండ కాయుచుండగా, మఱియొక ద్వీపమున వెన్నెల కాయుచుండును. దేశ కాలములు సంధ్యాద్యవస్థా విశేషములు, ఎవనికి వశమైనవో, ఎవుడు తన పాలనా సామర్థ్యముచేత లోకమునకంతకు హితము గావించునో అట్టి సూర్యుడు మీ కహరహము శోభనల నొసగును.[97]

ఉ. వ్యగ్రము లగ్యసుగ్రహభహారిగురుల్' సముదగ్రలీలఁ బ్ర
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవు గౌరతా
భాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలచి ప్రాచీ సరాగసురాగగా, దినం
బగ్రమునందుఁ జేసెడి గ్రహాగ్రణి మీ కగు నగ్రగస్థితిన్.

తా. ప్రాతశ్శైలమున నుదయించి, వడివడిగా లోకముల నెల్ల పర్యటించుచు, చంద్రాది గ్రహములను వెలవెల బాఱజేయుచు, మేరుగిరి శిలలకు పసుపువన్నె నాపాదించుచు జగచ్ఛ్రేయము గలిగించి, ఎవ డేకైకముగా వెలుగొందుచున్నాడో, అట్టి గ్రహరాజగు సూర్యుడు ఘోరమగు మీ పాపములను రూపుమాపుత.[98]

ఉ. వేదగురుండు పద్మజుఁడు విష్ణుఁ డజేయుఁడు శూలి శంభుఁడున్
శ్రీదుఁడు యక్షుఁ డయ్యముఁడు మృత్యువు పావకుఁ డగ్నిమంచు డి
ద్ధాదిపదంబు లట్లని సుధాంధులకుం బడెనంచు నామ మ
ర్యాదలు సార్థకంబుగఁ దనంత వహించిన ప్రొద్దు మీకగున్.

తా. సామవేదమున కుత్పత్తికారణము బ్రహ్మ - బ్రహ్మ, మధువైరి యగు విష్ణువు అజితుడు. జడముడి దాల్చిన మహాదేవుడు శంకరుడు. మృత్యువు కాలుడు. అలకాధిపతి ధనదుడు. జాతవేదుడు, పావకుడగు అగ్ని - అని యిట్ల అమృతభోక్తలగు దేవతలకు, క్రియాగుణములు లేకయే డిత్తుడు - డవిత్తుడు అను నామములు కేవలము సాంకేతికములు మాత్రమే యగుచున్నవి కాని, దేవతల నామములలో గుణములను, సార్థకము చేయు నామము గలవా డొక్క సూర్య భగవానుడే. ఆతడు మిమ్మ నెల్లప్పుడు రక్షించుగాక.[99]

చ. చుట్టము పక్కముం గురువు చూపును గావును జ్ఞాతి జ్యోతియుస్
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదా
పెట్టనికోటయై సకల పృథ్వికి నన్నము నీళ్లు నిచ్చుచున్
దిట్టపు వెల్గులం దనరు దేవుఁడు మీకిడు వాంఛితంబులన్.

తా. దైవమో, గురుడో, తండ్రియో, స్నేహితుడో, చుట్టమో, కనువెలుగో, రక్షక్షడో యని పరిపరి విధములుగా నేవని సర్వజనులు భావింతురో, అట్టి సర్వాకాలోపకారి యగు సూర్యుడు మిమ్మును నిరంతరము బ్రోచుగాక.[100]

చ. నలుబదిమూఁట, నాఱిఁ ట, గనం బది రెంటనుఁ బద్నకొంట బెం
వలరఁగ నెన్మిదింట, నిరు పంక్తుల తేజము వాజులున్ హయ
మ్ముల నదలించువాని రథమున్ ఘనబింబము సూర్యదేవునిన్
దెలియగ నమ్మయూరుఁడు నుతించిన శ్లోకళతమ్ము మీరగున్.

చ. పొలుపుగఁజేసె లోకహితబుద్ధి మయూరుఁడు సూఱుల్లోకముల్
చెలువగు భ క్తితోఁ బఠన చేసిన పుణ్యుఁడు ముక్తపాపుఁడై
బలధిషణాయువుల్ చదువు భాగ్యము సత్కవితార్థ పుత్రభా
క్కలన నరోగతామహిమఁగాంచును సూర్యుననుగ్రహంబునన్.

తా. మయూరుడను కవి భక్తి పరశచే రచించిన యీసూర్యస్తోత్రము నూఱు శ్లోకములను నెవరు ప్రతినిత్యము పఠింతురో, వారికి ఆరోగ్యము, కవిత్వము, సంపద, బలము, తేజస్సు, ఆయుర్వృద్ధి, విద్య, ఐశ్వర్యము, ధనములతో సూర్యలోకప్రాప్తి చేకూరును. [102]

దాసు శ్రీరామవిరచిత సూర్యశతకము సంపూర్ణము.