సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆండ్రియాస్ వెసేలియస్

ఆండ్రియాస్ వెసేలియస్ (1514-1584): -ఇతడు బ్రసెల్సు పుర నివాసి, వైద్యవృత్తిలో నిమగ్నమైన ఒక కుటుంబమున జన్మించెను. లోవియన్ విశ్వవిద్యాలయములో ఉన్నతవిద్య సభ్యసించెను. పిమ్మట వైద్యశాస్త్రా భ్యాసమునకై పారిస్ విశ్వవిద్యాలయమున కేగెను. విషయ సామగ్రి ప్రోగుచేయు కుతూహలమున శవములను రహస్యముగ చేజిక్కించుకొనుట కీతడు చేసిన ప్రయత్నము లీతనిని పెక్కు పర్యాయములు ప్రమాదావస్థలోనికి దింపినవి. 1537 వ సం. న పడూరాయందు శస్త్ర చికిత్సాచార్య పదవి ఇతనిని వరించినది. 1543 వ సం.న ఫేబ్రికాయను ఉద్గ్రంథమును ప్రచురించెను. అది పెక్కు వర్ణచిత్రములుగల గ్రంథము. గాలన్ అను ప్రసిద్ధ వైద్య శాస్త్రవే త్త యందలి తప్పులను సవరించ సాహసించినందున కొందరితని భావములకు ప్రబల వ్యతిరేకులైరి. పిమ్మట అతడు తన ఆచార్య పదవికి స్వస్తిచెప్పి అయిదవ ఛార్లెస్ చక్రవర్తి యొద్ద ఆస్థాన వైద్యుడుగ పనిచేయుటకు మాడ్రిడు పట్టణమున కేగెను. 1564 వ సం.న ఒక నౌకా ప్రమాదమందీ వైద్యశాస్త్రవేత్త జీవిత మంతమయ్యెను.

డా. యస్. వేం. రా.

[[వర్గం:]]