షోడశకుమారచరిత్రము/షష్ఠాశ్వాసము
శ్రీరస్తు
షోడశకుమారచరిత్రము
షష్ఠాశ్వాసము
క. | శ్రీహర్షముఖ్యసుకవిస | 1 |
సీ. | దేదీప్యమనమై తేజరిల్లుచునున్న | 2 |
వ. | అయ్యవసరంబున. | 3 |
సీ. | చిత్తజాజ్ఞాలక్ష్మి చేతి పూసెలకట్టె | 4 |
చ. | పలికెడుఁ బెక్కుదేశములభాషలు నచ్చుపడంగ సర్వవి | 5 |
గీ. | మాట లమృతరసముతేట లై పరఁగ వా | 6 |
వ. | అనిన విని యమ్మహీపతి యత్యంతకుతూహలంబున మంత్రులం గనుంగొని. | 7 |
క. | చిలుక యటె పెక్కుభాషలఁ | 8 |
వ. | అనిన నత్తెఱం గతిచిత్రంబు రావించి యవధరింపు మనుటయు నవ్విభునాజ్ఞం జేసి యాప్రతీహారి యాకాంతం దోడ్కొని తెచ్చి సమ్ముఖంబు సేయుటయు. | 9 |
చ. | చిలుకకు దాది యైన సరసీరుహలోచన రాజసూతి కిం | 10 |
వ. | ఇట్లు మ్రొక్కి తదనంతరంబ పరిచారికకరంబున నున్నరత్నపంజరం బల్లన యందికొని. | 11 |
క. | రాజితమణిపంజరయుత | 12 |
సీ. | అష్టభాషల మధురాశువిస్తరచిత్ర | |
| నేపురాణంబుల నేకథ యడిగినం | 13 |
వ. | అని పలికినయనంతరంబ యారాజకీరంబు రాజు నవలోకించి. | 14 |
ఉ. | తామరచూలినెమ్మొగము దామరల న్మనునంచలేమ నె | 15 |
వ. | అని యాశీర్వాదం బొనరించి ఋగ్యజుస్సామాధర్వణంబులయందును శిక్షాకల్పజ్యోతిర్నిరుక్తవ్యాకరణచ్ఛందంబులందును మీమాంసాదు లగుతత్త్వాపబోధనంబులయందును బ్రాహ్మంబు శైవంబు పాద్మంబు వైష్ణవంబు భాగవతంబు భవిష్యత్తు నారదీయంబు మార్కండేయంబు నాగ్నేయంబు బ్రహ్మవైవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు గౌతమంబు గారుడంబు మాత్స్యంబు వాయవ్యంబు నను మహాపురాణములయందును, నారసింహంబు, నారదంబు, శివధర్మంబు, మాహేశ్వరంబు, గాలవంబు, మానవంబు, బ్రహ్మాండంబు, వారుణకాళికంబులు, సాంబంబు, సౌరంబు, మారీచంబు, కూర్మంబు, బ్రాహ్మభార్గవసౌరవైష్ణవంబులు నను నుపపురాణంబులయందును, సరసకవినిర్ణయంబు లగుకావ్యనాటకంబులయందును, సకలప్రసంగంబు | |
| లయందునుం దనకు నత్యంతపరిచయంబు గలుగుట తేటపడ నతిహృద్యవిద్యాగోష్ఠి యొనరించిన సకలజనంబులు నద్భుతానందకందళితమానసు లయి కనుంగొన రాజుపుంగవుండు రాజకీరంబు నవలోకించి. | 16 |
క. | ఏవీటనుండి వచ్చితి | 17 |
వ. | అనుటయు. | 18 |
సీ. | శ్రుతులు పుట్టినయిల్లు మతిజనంబులపంట | 19 |
క. | అందుందు భారతి శతా | |
| బృందారక బృందార్పిత | 20 |
గీ. | అమ్మహాదేవి లీలావనాంతరమున | 21 |
(ఇక్కడ గ్రంథపాతము)
ఉ. | ........................................... | 22 |
వ. | అని నిశ్చయించి ధీరోదాత్తుం డగుట సభాజనులసన్నిధి నడుగక యేకాంతంబున నడుగం దలంచి నానావిధభూషణచీనాంజరంబులు నలిమధురరసవత్ఫలంబులు నొసంగి శుకంబుతోడం గళావతిని వీడుపట్టున కనిచి సత్వరంబుగా మజ్జనభోజనంబు లొనరించి యేకతంబున నుండి కళావతిని రావించి యారాజశుకంబుతో నిట్లనియె. | 23 |
క. | శుకవర నీచదివినయా | 24 |
వ. | అనవుడు శుకం బిట్లనియె. | 25 |
క. | త్రిదశాధిపుపురిపోలిక | |
| పద నైలింపవధూజన | 26 |
క. | ఆవీడు మేఘమాల | 27 |
సీ. | కమలాక్షు చేపట్టు గలిగియు శంఖంబు | 28 |
గీ. | చన్నుదోయి చాల నున్నతిఁ జెలువొందెఁ | 29 |
సీ. | నెలచందురునికాంతి నెమ్మోము సృజియించి | |
| కలువరేకుల మించు కన్నులు గావించి | 30 |
గీ. | కాంత మెఱుఁగుఁజన్నుఁగవయును బొదలింపఁ | 31 |
సీ. | కరతలంబులయొప్పు సరసిజంబులఁ బోల | |
| డవయవముల కనుచు నతిచింత డస్సె నా | 32 |
వ. | అని మఱియు బహుప్రకారంబుల నయ్యంబుజవదనవిలసనం బభినందించి యయ్యిందువదన న న్నెఱింగినతెఱం గవధరింపు మని యిట్లనియె. | 33 |
క. | సిద్ధులచే నను బడసి స | 34 |
క. | అది కారణంబుగా మా | 35 |
క. | అనుపమవనితారూపం | 36 |
క. | ఈవిధముల యొప్పిదములు | 37 |
క. | ఆకాశగతి యదృశ్యత | |
| లోకవిశేషంబు లదృ | 38 |
క. | సకలజనమోహనాకృతి | 39 |
క. | విను సిద్ధులచేఁ బలుమఱు | 40 |
క. | ఈరూపువాఁడు సోమకు | 41 |
క. | ఈరూపుచెలువ మాళవ | 42 |
క. | నిత్యముగా వారికి దాం | 43 |
క. | నలుని దమయంతిఁ గూర్చిన | |
| చిలుకా పలుకులనేర్పులు | 44 |
వ. | అని చెప్పి యప్పురుషవరుండు నిజేచ్ఛ నరిగిన. | 45 |
క. | మిమ్మిరువురఁ దగఁ గూర్పఁగ | 46 |
సీ. | హేలాసమాగతమాళవీలోచన | 47 |
వ. | ఏ మప్పురంబు సొచ్చి యందుల యొప్పిదంబులు గన్నులపండువులు సేయుచుండ రాజమందిరంబున కరిగి. | 48 |
సీ. | దౌవారికాలోకధవళమరీచులు | |
| ద్వారదారుస్థితగారుత్మతద్యుతి | 49 |
వ. | నూతనకౌతుకంబున మమ్ముం గానుపించుకొని బహుమానం బొనరించి. | 50 |
క. | దిన మెల్లను మాగోష్ఠిన | 51 |
వ. | సకలసంవిధానంబులు సేయించి మాకు నొక్కమణిహర్మ్యంబు విడిదల నిచ్చిన నుండి మఱునాఁడు. | 52 |
సీ. | హాటకరచితకవాటనాసాశిలా | |
| రత్నరాజితచిత్రరంగవల్లీజాల | 53 |
క. | అమలమణికుట్టిమంబులఁ | 54 |
గీ. | చిత్రసరసులలో వ్రాసి చెలువు మిగులు | 55 |
వ. | ఇట్లతిరమ్యం బయిన నాట్యభవనం బంతయుం గలయం గనుంగొని యం దొక్కరుచిరకుడ్యభాగంబున భవదీయమనోహరాకారం బచ్చుపడ వ్రాసి యచ్చోటు వాసి చని విడిదల నున్నంత హంసావళి యచ్చటికిం జని యచ్చిత్రరూపంబుం గనుంగొని యత్యంతమనోహరంబు లగుతద్విలాసంబులం దగిలి చూచి పచ్చవిలుతుబారిం బాఱి యే నారూపంబు లిఖయించుట యచ్చటిజనంబులవలన విని పరిచారికలచేతం దనపాలికి నన్నుం బిలిపించికొని సముచితసంభావనంబు లొనరించి భవద్రూవచిత్రరూపంబుఁ జూపి యిట్లనియె. | 56 |
క. | చిలుకా యిట్టివిలాసము | 57 |
వ. | అనిన నానేర్పువిధంబును దేవరయన్వయనామధేయవిలాసరాజ్యవైభవంబులు వినిపించి మనోభవాధీనమానసం గావించిన నతిప్రయత్నంబున నీచీనాంబరంబునందుం దాన యీయార్య లిఖియించి యిచ్చి నాకు వివిధవిశేషసంభావనంబు లొసరించి పుత్తేర నిచ్చటికి వచ్చితి నని యాయార్యాక్షరపంక్తి మనోహరం బైనకళావతీకరస్థం బగునంబరం బవ్విభునిముందటం బెట్టి యవధరింపు మనిన వేడ్కలు సందడింపం గరంబు చాచి యందుకొని. | 58 |
క. | పద్యము రెండర్థములను | 59 |
క. | కీరత దొఱంగి యది గుణ | 60 |
వ. | దిగ్గన సింహాసనంబు డిగ్గి యిచ్చ యలరం గవుంగిలించుకొని తా నెప్పటియట్ల యాసీనుండై యతని సముచితాసనంబున నునిచికొని యాక్షణంబ భీమభటాదు లగుమంత్రుల రావించిన వార లతనిం గని ప్రమోదమానసు లై పరిరంభ | |
| ణంబు లాచరించి రయ్యందఱ నుచితాసనంబుల నుండ నియమించి సకలవిద్యాధారం బగుకీరంబు వివేకనిధి యగుట జెప్పి యతని నవలోకించి నీ వింతతడవు శుకంబ వై యుండి సహజాకారంబు దాల్చుటకుం గారణం బేమి యని యడిగిన ముకుళితకరకమలుండై యతం డిట్లనియె. | 61 |
గీ. | ఉరగకోపంబుచేత నాతురతఁ బొంది | 62 |
ఉ. | అతఁడు మౌనసన్నియతుఁ డౌట యెఱుంగఁగనీనియట్టి కా | 63 |
వ. | సమాధివైకల్యంబునకుఁ గోపంబు దీపించిన. | 64 |
క. | బాలిశవృత్తిం బలుమఱుఁ | 65 |
చ. | అమితభయంబు సందుచుఁ దదంఘ్రులకుం బ్రణమిల్లి కార్యదా | 66 |
చ. | అనవుడు దివ్యదృష్టి ననఘాత్మునిఁగా ననుఁ జూచి యత్తపో | 67 |
సీ. | రాజకీరంబ వై యాజన్మవిధ మెఱుం | 68 |
వ. | ఇచ్చ నచ్చెరు వందుచు నత్తఱి నత్తెఱంగునకుం జింతాక్రాంత యై యున్న కళావతిం గనుంగొని నీవు నెమ్మనంబున నుమ్మలికంబు నొందకుము సర్వజ్ఞత్వంబున నీచిలుక యగునట్టిచిలుకం గలిగించి నీ కిచ్చెద మని యూఱడించి చిత్రకరు నవలోకించిన నమ్మహాచతురుఁడు. | 69 |
క. | వెలసిన సర్వజ్ఞతచేఁ | |
| చిల నొక్కశుకాకారముఁ | 70 |
క. | అచ్చిలుక తాన క్రమ్మఱ | 71 |
క. | ఆరాజశుకము వేడుక | 72 |
వ. | ఇచ్చి సముచితప్రకారంబుల వీడుకొలిపి హంసావళివలని కోరికలు గుఱి[1] కొలుపఁ దద్దిగ్విజయంబు నెపంబున నప్పురంబునకుం జన నిశ్చయించి సకలదండనాథుల దండయాత్రకు నియమించి ప్రయాణభేరి వేయించిన. | 73 |
సీ. | ఉలికివాహములు లంకెలు వైచుకొనుటయు | |
| దిక్కు లల్లాడె ధర మ్రొగ్గె దిగ్గజములు | 74 |
వ. | ఇట్లు ప్రస్థానభేరీరవంబు చెలంగ సైన్యంబు నలుగడ నడవం దొడంగిన. | 75 |
సీ. | ఘనరేణువులు గప్పి ఖచరవిమానముల్ | 76 |
ప్రభాకరుని కథ
వ. | ఇ ట్లతిభయంతరం బగుసైన్యంబు నడచి నడచి యొక్కయతిరమ్యస్థలంబున విడిదల గావించి మంత్రుల రావించి కొలువిచ్చి సముచితసల్లాపం బొనరించు సమయంబున గగనంబున నరిగి యరిగి యత్యుజ్జ్వలప్రభావిరాజమానం బగు విమానం బొక్కటి యాకొలువుచక్కటిం గొంతతడవు నిలిచి | |
| తదనంతరంబ తత్ప్రాంతంబున నవతరించినం గనుంగొని డెందంబున నద్భుతంబు నొంది. | 77 |
గీ. | ఈవిమానంబు గలుగువాఁ డెవ్వఁ డగునొ | 78 |
క. | తమచెలియైన ప్రభాకరుఁ | 79 |
వ. | సముద్ధితు లగునంత సంతసంబునఁ బఱతెంచి భూపాలునకుం బ్రణామం బాచరించి యతని కౌఁగిలి వడసి క్రమంబున భీమభటాదులం బరిరంభణం బాచరించి యనంతరంబ సింహాసనంబున నాసీనుండై కమలాకరుండు ప్రత్యేకంబు నందఱి నిజాసనాసీనులం గావించి ప్రభాకరునకు సముచితాసనంబు పెట్టించి యతనివదనంబునం జూడ్కి నిలిపి నీకు విమానయానం బెట్లు గలిగె నని యడిగినం గరంబులు మొగిడిచి. | 90 |
క. | భూనాథ మిమ్ముఁ గానక | 81 |
క. | తనదివ్యబోధమున నా | |
| జనపతిఁ గలసెదు నలువురు | 82 |
క. | ధర వర్ధమానపురమునఁ | 83 |
సీ. | నరులకు దూరమై పరువంపునెత్తావి | 84 |
క. | ఆనెలఁతఁ గోరి తిరుగుము | 85 |
వ. | ఆమునీంద్రునకు వినతుండ నై చని వర్ధమానపురంబుం జొచ్చుసమయంబున. | 86 |
క. | కనకపురిఁ గనినవారికి | 87 |
శా. | ఏచందంబున నబ్బునో యబల యం చే నాత్మ నూహింపఁగా | 88 |
వ. | సముచితాలంకారశోభితుండ నై రాజమందిరద్వారంబున కరిగి ప్రతీహారపాలు నాలోకించి. | 89 |
క. | కనకపురం బేఁ జూచితి | 90 |
సీ. | కామినీనీలాలకములఁ జిక్కినవేడ్క | |
| కోరిక లెలర్ప భావజుబారిఁ బాఱి | 91 |
వ. | ఆసమయంబున. | 92 |
క. | అప్పొలఁతి కనకనగరం | 93 |
క. | నామాటలు విని నవ్వుచుఁ | 94 |
క. | నను వెడలఁగఁ ద్రోపించిన | 95 |
క. | ఏనును మునివరుఁ గాంచిన | 96 |
క. | మునివరుఁడుం......దప | |
| బున నే దేశములోనిది | 97 |
సీ. | కనకపురంబుఁ గల్గొనినవారును విన్న | 98 |
క. | అనఘుఁడు సముద్రదత్తుం | 99 |
క. | శ్రీలలనాధీశ్వరు నఱ | 100 |
క. | అంభోదపటలదర్శన | |
| నంభోధరమార్గం బపు | 101 |
సీ. | వితతవర్ణవితీర్ణవిద్రుమవల్లులు | 102 |
వ. | ఆలో నమ్మహావాయువు తలక్రిందుగా వేసిన. | 103 |
| క. కలజను లందఱు నెంతయుఁ | 104 |
క. | నను నప్పు డొక్కమీనము | 105 |
శా. | నాపుణ్యంబున నొక్కజాలరి వలం దన్మత్స్యముం బట్టి గ | 106 |
క. | యతిపతి చెప్పిన సత్య | 107 |
క. | నామాటలు విని దాశ | 108 |
ఉ. | దీవులవార లెల్లఁ జనుదెంతుగు బారసి గాఁగ నెల్లి ల | 109 |
క. | నను నాదీవికిఁ దోడ్కొని | 110 |
గీ. | చలన మొందక యవ్వటశాఖఁ బట్టి | |
| నిన్ను నెక్కించుకొనియెద నన్న నట్ల | 111 |
క. | సుడివెంపర వడి ముంపఁగ | 112 |
వ. | ఆలోన లో నార్తిం బొంది యిట్లంటిని. | 113 |
మ. | చెలులం గానక కానలో దిరుగఁగాఁ జేమాయల న్మానినుల్ | 114 |
క. | తరుణుల వరించి కనియెద | 115 |
వ. | ఆక్రోశంబు దనర నాకాశవాణి యిట్లనియె యక్షుం డొక్కరుం డొక్కమహామునిశాపంబున నిచ్చట నీవృక్షం బై నిలిచె నీవు దొఱంగిపోయిన శాపమోక్షంబు నొందెడు నీవు మరణోద్యోగంబు మాని నేఁ డీతరువుస వసియింపు మెల్లి గనకపురంబుఁ గనియెద వనిన సద్భుతం బంది యదియుం జూచెదఁగాక యని యున్నంతను. | 116 |
క. | భూపాల నాఁటిరాత్రి మ | |
| ఖాపంక్తి నంది యాశ్చ | 117 |
వ. | అట్లుండి యమ్మహావిహంగంబు లెల్ల రేపకడఁ గదలి కనకపురంబునకుం బోద మని తమలో మనుష్యభాషల సంభాషించిన సంతోషించి. | 118 |
క. | అం దొక్కపక్షిఱెక్కల | 119 |
క. | వేవినఁ గద లెఱుఁగుచు నే | 120 |
క. | ఆపులుఁగుఱేనిఱెక్కల | 121 |
క. | మేడపయినుండి కనుఁగొని | 122 |
వ. | అప్పుడు. | 123 |
సీ. | జిగిదొలఁకాడెడు చిగురాకుఁగెమ్మోవి | |
| నిడువాలుఁగన్నుల నెఱయు క్రొమ్మించులు | 124 |
క. | ననుఁ గనుఁగొని యయ్యంగన | 125 |
సీ. | వీరచూడుఁ డనెడువిద్యాధరుఁడు గాంచె | |
| చున్నదాన మనంబున నొండుతలఁపు | 126 |
క. | నరుఁ డొకరుం డాతురుఁ డై | 127 |
ఉ. | అంబిక యాన తిచ్చిన సమగ్రవిలాసివి నీవ కాఁగ డెం | 128 |
క. | ఏ మరిగి వచ్చుదాఁకను | 129 |
వ. | ఇంతి యరిగినయనంతరంబ. | 130 |
క. | ఈమీఁది నెలవు చూడకు | 131 |
క. | వరరత్నమయమునుం గడుఁ | 132 |
వ. | ముసుం గిడినరూపంబుఁ గనుంగొని తదావరణంబు దొలఁగించిన. | 133 |
సీ. | గవిసన వుచ్చిన నవకాంతి నొప్పారు | 134 |
క. | ఆరూపు చూచి మదనవి | 135 |
గీ. | తెలిపి తెలిపి యెట్లుఁ దెలియకయుండిన | 136 |
వ. | కొంతతడవునకు డెందంబునం దెలివి నొంది యూర్పు లరసి సజీవం బని నిశ్చయించి యాశ్చర్యంబు నొంది. | 137 |
క. | చైతన్యము లే కుండియు | 138 |
వ. | అని యెప్పటియట్ల చేల గప్పి తొలఁగి వచ్చి యాసంగడి సున్నమందిరంబుఁ బ్రవేశించి ముందటిచందంబు రూపు గనుంగొని ముసుంగు వుచ్చిన. | 139 |
క. | చంచత్ప్రభఁ గనుపట్టెను | 140 |
క. | తొంగలిఱెప్పలమెఱుఁగులు | 141 |
వ. | తెలిపి యెట్లునుం దెలియకున్న మున్నింటియింతిచందం బగుట యెఱింగి నివ్వెఱఁ గందుచు. | 142 |
క. | అత్తరుణి రూపురేఖయుఁ | 143 |
వ. | అని యచ్చెలువచెలు వుగ్గడించి. | 144 |
క. | ఆవనితకు ముసుఁ గిడి చని | 145 |
వ. | పరోపకారిభూపాలనందనరూపం బగుటయు నాపోవక కనుంగొని విస్మయంబుఁ బొంది యరసి మున్ను పొడగన్న యన్నాతులయట్ల యగుటం దెలిసి యుల్లంబు జల్లన మూర్ఛిల్లి యెంతయుం దడవునకుం గొంతతెలివిం బొంది. | 146 |
శా. | ఈవామాక్షి సముద్రముం గడచి యెట్లేతెంచెనో వచ్చెఁబో | 147 |
వ. | అని దైవంబు దూఱి యవ్వామనయన నుద్దేశించి. | 148 |
సీ. | తరుణి నీకుచపర్వతము లెక్కఁగాఁ గోరి | |
| నేల వచ్చి తిచట కేల యీదశ నొంది | 149 |
వ. | అని విలాపించుచు మదనతాపంబునం గాలుకొనలేక సౌధోపరిభాగంబునం జరియించుచున్నంత. | 150 |
క. | క్షితినాథ మాయతురగం | 151 |
క. | పడి మూర్ఛ నొంది యెంతయుఁ | 152 |
క. | కనకపురి గనినవారికిఁ | 153 |
క. | ఆచాటు విని కనకపురి | 154 |
క. | ఆనరపతిపుత్రికయునుఁ | 155 |
సీ. | నాఁ డెఱుంగం గాని నేఁ డెఱింగితిఁ శైలి | 156 |
వ. | అనినమాటలు విని యాక్షణంబ యమ్మానిని విగతజీవ యైన నాశ్చర్యంబు నొంది యంతన తెలి వొంది యాకనకపురిసౌధాగ్రంబునం గనినమానినీరూపంబులు మూఁడును దత్సోదరుల నైజరూపంబులు గానోపు నందు మూఁడవరూపం బీయింతిది, దీని జీవం బచ్చటి కరిగినది నాకు నిచ్చటం దడయం బని లే దన్నలువుర వరియింపక కమలాకరమహీవరదర్శనంబును సమకూరదు గాన మున్ను చనినమార్గంబునం జనియెదం దత్తరుణీవరణంబు దైవనిర్మితం బగుట నాకు నవశ్యంబును హేమపురదర్శనంబు సిద్ధించు ననుచు నిశ్చయించి వెడలి మున్ను చవినసముద్రతీరంబున కరిగి యచ్చట. | 157 |
క. | జలనిధిలోపల నాఁ డట | |
| చెలికాని వైశ్యునిం గని | 158 |
ఉ. | న న్నొకయోడఁ బెట్టి జతనంబుగ వారిధిలోనఁ బంచినన్ | 159 |
క. | చండికి బలిసేయుద మని | 160 |
ఉ. | అన్నువకౌను మించుదొలఁకాడెడుమేనును వల్దచన్నులుం | 161 |
చ. | జలజదళంబులం జఱచి చంద్రమరీచుల గేలిసేయుచుం | 162 |
గీ. | దాశరాజపుత్రి తద్దయు వేడ్కతో | 163 |
వ. | అట్లు నన్నుం దగులించి తనమనంబున మిగులన్ దిగు లొంది. | 164 |
క. | పర్వినకూరిమిఁ జనవున | 165 |
శా. | ఆలీలావతితోడిలీలలఁ బ్రియం బారంగ నం దుండఁగా | 166 |
చ. | చని కూడముట్టి యుజ్జ్వల | 167 |
క. | వెంటనె యతలమునకుఁ జని | 168 |
ఉ. | అన్నగుమోమునుం జిగియు నా తెలిగన్నులక్రొమ్మెఱుంగు లా | 169 |
వ. | అమ్మోహనాకారం జేరం జనుటయు నది యి ట్లనియె. | 170 |
క. | ధరణీశ్వరనందన నే | 171 |
క. | అనుపమ మగునా తొయ్యలి | 172 |
సీ. | కనకరేఖయు దాశకన్యయు నేను జం | 173 |
క. | ఏ నీమేను దొఱఁగిచనఁ | |
| నానిజదేహము నొంది వి | 174 |
వ. | అని పలికి యాక్షణంబ మే ననలజ్వాలలం దొఱంగి యరుగుటయును నావచ్చిన మార్గంబున వెలువడి విమానంబున కెదురుచూచుచున్నంత. | 175 |
క. | రాజితమణిఘృణు లెసఁగ | 176 |
క. | ఆవరయానము నెక్కి న | 177 |
క. | శ్రీ నెఱయఁగఁ దనకన్యల | 178 |
వ. | ఆలీలావతులతోడి యభీష్టలీలల విహరించి మిమ్ముఁ గాంచుతెఱం గూహించి. | 179 |
ఉ. | మానినుల న్వరించి మఱి మానవనాథునిఁ గాంచె దంచు నా | 180 |
వ. | వచ్చి వచ్చి యిచ్చట దేవరం గాంచి కృతార్థుండ నైతి ననిన నందఱు బ్రమోదభరితు లైరి తదనంతరంబ. | 181 |
ఉ. | భట్టియుగంధరాదినరపాలకమంత్రిమహాప్రవాహసం | 182 |
క. | శారదనీరదనారద | 183 |
మందారదామము. | సంగీతసాహిత్యసారస్యలోలా | 184 |
గద్యము. | ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందు షష్ణాశ్వాసము. | |