షోడశకుమారచరిత్రము/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

ప్రథమాశ్వాసము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కథాకల్పవల్లికామతల్లికకు నాలవాలం బగుహస్తినాపురం బెట్టిదనిన.

1


గీ.

ఆది..............ప్పురమునం
గాఁపురంబుండఁగాఁ జూడఁ గడలి వచ్చి
కోటసొరరాక కూతుపైఁ గూర్మిఁ జుట్టు
వారియున్నట్టు లొప్పారి పరిఖ మెఱయు.

2


గీ.

అక్షయఖ్యాతి నెంతయు నందమంది
యమలకమలోదయస్థాన మనఁగ వెలసి
కువలయప్రియహేతువై కొమరుమీఱి
యలరు నప్పురిపరిఖ దుగ్ధాబ్ధిభంగి.

3


గీ.

మహితసన్మార్గవర్తనమాన్యు లనఁగఁ
బొలుచు నినరాజకవిగురుబుధులనైనఁ
దగులువడఁ జేయు పెంపునఁ దనరు వీటి
కోటకొమ్మలు తారకాస్ఫోటనములు.

4


సీ.

ధామాద్భుతోద్దామహేమకుంభంబులు
        తరణిమండలముతోఁ దడఁబడంగ

నుపరిభాగసాపితోజ్జ్వలరత్నంబు
        లలతితారకముల గలసి బెరయఁ
బ్రమదకేళీలోలబాలముఖేందులు
        చంద్రబింబంబుతో సరసమాడఁ
గనకరత్నవిభాసఘనచంద్రశాలలు
        ఖచరవిమానసంఘములఁ గలయఁ
జారుమౌక్తికమణిమయతోరణముల
బహుమనోహరచిత్రసంపదల మహిత
విభవములతోడ నెంతయు విస్తరిల్లు
సురపురం బన హస్తినాపురవరంబు.

5


చ.

అమరులకంబం దత్పురి ధరామరవల్లభు లెక్కుడంట త
థ్యము తలపోయ నాగమవిధానములై తనరాగు తారు ని
త్యము నొనరించు దానముల యజ్ఞములం బరితృప్తిఁ బొంది సం
భ్రమమునఁ దేలి వారు వడిఁ బ్రస్తుతిసేయఁగఁ బెంపుఁజెందుటన్.

6


క.

రాలెల్లను రత్నంబులు
చేలెల్లను రాజనంబుఁ జెఱకును బౌర
స్త్రీలెల్లఁ బద్మినులు పురి
శ్రీలను నుతియింప వశమె శేషున కైనన్.

7


సీ.

గిరులఱెక్కలు ద్రుంచి గిరిభేది భూమిపైఁ
        గ్రుమ్మరుఁ డనిన మేల్కొండ లనఁగ
హరుఁ డొకగజమూర్తి నణఁచుట నీసుచే
        బహుగజాకృతులమైఁ బరఁగె ననఁగ

వెలవెల్లఁ బాటించి విడిచెడు గజములు
        హగినీలమూర్తుల నమరె ననఁగ
జడధిని గిరులను నడయాడనొల్లక
        మేఘబృందము లుర్వి మెలఁగెననఁగ
నున్నతాకృతి నెంతయుఁ జెన్ను మిగిలి
వందనీయభద్రస్ఫూర్తి నందమొంది
వినుతసత్త్వంబులను దానవృష్టి మెఱసి
తనరు నప్పురి భద్రదంతావళములు.

8


గీ.

సిరులు మెఱసిన వారణపురములోన
మెలసితిరిగెడుహయములమిసిమి చూచి
యినునితురగంబు లిలఁ గాలుకొనఁగ వెఱుచు
వెల్లనై యుండు వేలుపువీటిహయము.

9


చ.

అరదము పూన్పునొక్కయెడ నప్పుడు నెక్కుడు.....హయంబులో
ఖరకరునశ్వముల్ .......................................
............................సూడఁడు నెన్నఁడు నౌదురయ్య య
ప్పురిఁగల యుత్తమాశ్వములఁ బోఁడిగ నెక్కెడు వాహకోత్తముల్.

10


క.

నవముక్తాతోరణములఁ
బ్రవిమలవజ్రాభిరామభవనముల సుధా
ధవళప్రాసాదంబు.....
.............గనిండు ప్రభ నవ్వీటన్.

11


గీ.

నెఱయ నప్పురి వప్రాగ్రనీలమణుల
కాంతిసంగతి నాకాశగంగ యొప్పుఁ

జందమున మింటిమీఁదఁ గాళిందితొ
.............................

12


సీ.

....................తేనియల్
        నిండారఁ దొరగినన
సౌగంధికముల వాసనగల విరినీటఁ
        బ్రబలి కైవ్రాలిన రాజనములు
నిరుదెసం జెలువొందు త.......
        ....................
...................
        చిలుకలు చిందిన ఫలరసంబు
...........................కలును
గలిగి బహిరంగణంబులు పొలుపు మిగులు
జనుల కెల్లకాలంబు నామనియెక్యాగ
సాధ్వ...... సేయ నలవియగునె.

13


సీ.

.........................
        ........౦బు లెసకమెసఁగ
మెఱుఁగారుఱేకులు నెఱిదప్పి యొండొంటిఁ
        గడవ సందడిపడి........
...............................
        కుత్తుకకొలఁదులు గ్రోలిక్రోలి
అన్నా......................౦గమ్మ
        పుప్పొడి తిప్పలఁ బొగలిపొరలి
చెలువు మిగిలిన యవ్వీటికొలఁకులందు
దాఁటులై కూ......................

..............................
మన్ననఁగని వెగడువానిఁ గ్రేళ్ళుదా

14


సీ.

రాజితపుష్పపరాగంబుఁ బరఁగించు
        మదభృంగమోహనాస్సదత గాంచి
రమణీయ..................
        ................కలన మెఱయ
కర్పూరచందన................
        ణంబుల నాకర్షణంబు సేయ
వివిధకేళీలోలవిటవిటీసురతశ్ర
        మంబుల నుచ్చాటనం బొనర్చు
గర........................
.........నెంతయుఁ గరముతోడు
మంద.......................
............................

15


వ.

అప్పురంబుస కధీశ్వరుండు.

16


సీ.

లీల వేల్పులనెల్ల నసిననాజిలో
        ముక్కంటి గెల్చి విఖ్యాతి
..............................
        ...........గా నేరాజు తాతతండ్రి
దర.................గలంచె
        రారాజుల బలము నేరాజుతాత
కాలికాలములయందున............
        ......ట్టి రాజాన్వయఖ్యాతుఁ డహిత

..........................
రాజరాజకిరీటవిభ్రాజరత్న
కిరణనీరాజనారమ్యచరణుఁ డాది
రాజగుణరాజితుఁడు జనమేజయుండు.

17


చ.

.............................శుండాలకే
సరిదైతేయభయార్తదేవగణరక్షాదక్షుఁ డుగ్రారిభీ
కరతేజోనిధి! సర్వసన్నుతకృపాగారంబు ధర్మక్రియా
నిరతుం డాజనమేజయుండు వె...............

18


వ.

ప్రభావతియుం గమలయు నగ్రమహిషులుగా మహనీయరాజ్యభోగంబు లనుభవించుచుండఁ బ్రభావతికి శతానీకుం డనుకుమారుం డుదయిం(చె).

19


క.

వరపుత్రుఁ గోరి కమలా
తరుణీమణి చాల నియతిఁ దరుణేందుకళా
ధరు నారాధింపంగం
బరమేశ్వరుఁ డొక్కనాఁ డపారకరుణతోన్.

20


సీ.

చెన్నొం...................
        .....................గుత్తి
జిగిమీఱు వెలిపట్టుచేలసంగడమున
        నెరుసార మూఁడువన్నియలచీర
బాగొందెడి పసిండిపచ్చలపదకంబు
        దాపున నొప్పారుపాఁపకంటె
తావులు సంగడిఁ..............
        బొలుపారు తెల్లని భూతిపూఁత

యమర నతివయు మగవాడు నైనవేల్పు
దనపొడవుఁ గలలోన నందముగఁ జూపి
రమణ మీఱంగ నొక్కయరంటిపండు
నేలఱేనితెఱవ కిచ్చె నెమ్మితోడ.

21


వ.

అట్టి మేలికలఁ గని యాక్షణంబునన మేలుకని యయ్యతివ తనప్రాణవల్లభునకుం జెప్పుటయు నతం డుల్లంబున నుల్లసిల్లి నీ కొక్క పుత్రరత్నం బుదయించు నని చెప్పి యానందకందళితమానసుం డగుచున్నంతఁ గొన్నిదివసంబులకు నెల మసలిన.

22


సీ.

మానినీరత్నఁబుమధ్యంబుతోడన
        వలుద లై యూరులు చెలువు మిగిలె
సుదతీలలామంబుచూచుకంబులతోన
        యారు గప్పారి యొప్పొరఁ దొడఁగె
నలినీలకుంతలయంగవల్లికతోడఁ
        బలుచగాఁ జెక్కులు పలుకఁబాఱె
శీతాంశుబింబాస్యచెయ్వులతోడన
        నలసంబు లయ్యె నేత్రాంచలములు
జలజలోచననడపుల జడను దోఁచెఁ
జామనెమ్మదిఁ గోర్కులు సందడించెఁ
దరుణినాలుక చవులకు నెరవుపడియె.
జెన్ను దఱుఁగుచు గర్భదశ్రీకతమున.

23


చ.

అలసము లయ్యుఁ జెయ్వు లసయంబుఁ బ్రియం బొనరించెఁ జూడ్కికి
న్నలుపును జెంది యుండియు మనఃప్రమదావహ మయ్యెఁ జన్నుదో
య్వెలవెలఁబాఱియుండియు నవీనవిలాసము చెక్కులందులం

బొలుపెసలారె గర్భమునఁ బోఁడిమి నయ్యిగురాకుఁబోఁడికిన్.

24


గీ.

పడఁతిచనుదోయి హేమకుంభములకంటె
నొప్పు గజకుంభములకంటె నొప్పు నసఁగ
జనులకనుఁబాటు దాఁకి కందెనొ యనంగ
గర్భసంపదఁ జనుమొన ల్కప్పు దాల్చె.

25


గీ.

నిధుల నన్నింటి నింటింట నెలవుకొలిపి
ధరణిఁ బేదలు లేకుండ నరయఁ గోరు
నేడుదీవుల నేలంగ నిచ్చఁ గోరు
గురుబుధానంద మొనరింప గోరు నతివ.

26


వ.

ఇవ్విధంబున గర్భసంపదఁ బెనుపు వహించి నవమాసంబులుం బరిపూర్ణంబు లగుడు నంత నొక్కశుభసమయంబున.

27


క.

మారుని.........గు
మారునిఁ బోల్పంగఁ దగిన మహనీయశుభా
కారు మనోహరతేజః
స్ఫారు వరకుమారుఁ గనియెఁ బ్రమదం బెసఁగన్.

28


క.

....నిం గాంచిన
యావత్త మహీశుమనమునం దలరంగాఁ
దా వెలయఁజేసి బంధుజ
నావలి కత్యంతశుభము నాపాదించెన్.

29


సీ.

మంగళతూర్యసమాజంబునకు మున్న
        న(భమున సౌర)దుందుభులు మ్రోసె
నర్తకీమోహననాట్యంబునకు మున్న
        నిర్జరీనృత్యంబు నింగిఁ జెలఁగె

నతివలు శోభనాక్షతలు చల్లగమున్న
        సురపుష్పవర్షము ల్గురియఁదొడఁగె
బ్రాహ్మణాశీర్వాదరావంబునకు మున్న
        యనిమిషకోటి దీవనలు దోఁచెఁ
బొలసి దక్షిణపవనుండు వెలసె దిశల
హవ్యవాహనుఁడు ప్రదక్షిణార్చి యయ్యె
జనవరుఁడు వేడ్క బ్రియ మందె సకలలోక
మోదకర మైన యక్కుమారోదయమున.

30


వ.

అట్టి మహోత్సవమున జనమేజయమహీనాథుండు నానావిధదానఁబులుఁ గామితవస్తుత్యాగంబులు బంధమోక్షణంబులు జపహోమంబులు నొనరించి నముచితపరివారుండై కుమారునకుం గమలాకరుం డనునామం బిడిన మొదలిపక్షంబున విదియచందురుం బోలె ననుదినప్రవర్ధమానుం డగుచు ముద్దుఁబలుకులు పచరించుచుండ.

31


చ.

హృదయము లుబ్బ నొండొరుల కిట్టివిధం బని చెప్పఁబంపుచున్
మృదుమధురంపుటాటలను మేనలరంగను గౌఁగిలించుచు
న్ముదితయు నాథుఁడుం గొడుకుముద్దులఁ దేలనకాని యెన్నఁడు
న్మదిని దలంప రంచితరమావిభవోజ్జ్వలరాజ్యభోగముల్.

32


వ.

ఇట్లతిగౌరవంబునం బెరుపం బెరింగి సముచితసమయసమాచరితచౌలోపనయనుం డై.

33


సీ.

వేదవేదాంగము ల్వివిధపురాణేతి
        హాసము ల్తక్కుధర్మార్థశాస్త్ర

ములును నాయుర్వేదమును ధనుర్వేదంబు
        భరతశాస్త్రంబును బంచబాణ
శాస్త్రంబు కామందచాణక్యభార్గవ్య
        కౌణపదంతముఖ్యప్రదీప
భూపాలనయశాస్త్రములు శిల్పిశాస్త్రంబుఁ
        గావ్యము ల్లక్షణగ్రంథములును
నాటకంబులు నర్హనానాకళాప్ర
పంచమును నలవడఁగ శీలించి దుష్ట
కుంజరరథాధిరోహణకుశలుఁ డై ని
రూఢిఁ జెన్నొందె మిగులంగఁ బ్రౌఢి మెఱసి.

34


వ.

నవయౌవనంబు నొందుసమయంబున జనమేజయజననాథుండు రాజకుమారానీకశేఖరుం డగు శతానీకుని నిజరాజ్యంబునకు నభిషిక్తునిం జేసి యక్కమలాకరకుమారునకు యౌవరాజ్యపట్టంబు గట్టి సమస్తంబు నప్పగించి తానును దేవీద్వయంబును దపోవనంబున కరిగిన.

35


క.

లోకోన్నతగరిమ శతా
నీకుఁడు రాజ్యం బొనర్ప నెమ్మిని యువరా
జై కమలాకరుఁ డురువిభ
వాకరుఁడై యనుదినంబు నన్నం గొలుచున్.

36


సీ.

అంగహీనతయును హరవిరోధము మాని
        కనుపట్టు మకరకేతనుఁ డనంగ
వనవాసమును గృష్ణవర్ణత్వమును మాని
        విలసిల్లు నిందిరావిభుఁ డనంగ

బడుగుఁజందంబును నొడలికందును మాని
        సంపూర్ణరుచినొప్పు చంద్రుఁ డనఁగ
ఘనపిధానంబును ఖరకరత్వము మాని
        తనువుమైఁ నుపొందు తపనుఁ డనఁగ
రూపతనుకాంతి లక్ష్మీప్రతాపమహిమ
లఖిలవర్ణనీయంబులై యతిశయిల్ల
యౌవనోజ్జ్వలతరమూర్తి నంద మొందు
నఖిలకమలాకరుఁడు కమలాకరుండు.

37


మ.

జగదానందవిహార హారమకుటచ్ఛత్రాదిసంపన్న ప
న్నగభూషార్పితభావ భావజకళానైపుణ్య పుణ్యక్రియా
సుగమాచారగభీర భీరహితతేజోదీవ్యమానక్షమా
గగనాభోగదీశాంత శాంతమదరాగద్వేషగర్వోదయా.

38


క.

ఆఖ్యానకల్పితకథో
పాఖ్యానాఖ్యాయికాప్రపంచరహస్య
వ్యాఖ్యానవ్యవహరణ
ప్రఖ్యాతచరిత్ర వికచపంకజనేత్రా.

39


మాలిని.

శమదమగుణమోదీ శైవసిద్ధాంతవేదీ
సముచితనయబుద్ధీ సంచితైశ్వర్యసిద్ధీ
యమనియమధురీణా యజ్ఞకర్మప్రవీణా
శమితదురితవేగా సాధితాష్టాంగయోగా.

40


గద్యము.

ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందుఁ బ్రథమాశ్వాసము.