షోడశకుమారచరిత్రము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
షోడశకుమారచరిత్రము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీమద్విరించితరుణీ | 1 |
వ. | అక్కమలాకరుండు, బుద్ధిసాహాయ్యుండును వివేకనిధియును గాంతిమంతుందును యశఃకేతుండును గరుణాకరుండును బ్రభాకరుండును జిత్రకరుండును నీతిమంతుండును ననుమంత్రితనూజు లెనమండ్రును, భీమభటుండును దీర్ఘబాహుండును దృఢముష్టియు విక్రమకేసరియు నను దండనాయకతవయులు నలువురును మతిమంతుండును గళానిధియు వసంతకుండు నను పురోహితపుత్రకులు మువ్వురును, బ్రాణమిత్రులై నిరంతరంబును బరివేష్టించి కొలువ నొక్కనాఁడు. | 2 |
మ. | చెలులుం దానును వేడ్కమీఱ విలసచ్ఛృంగారుఁడై తత్పురీ | 3 |
వ. | ఇట్లు వినోదపరాయణుండై యొక్కశీతలతరుచ్ఛాయాతలంబున నెచ్చెలులుం దానును సుఖాసీనులై యున్నసమయంబున సాధకుం డొక్కరుండు నిజేచ్ఛ నరిగి వారలం గని చేరవచ్చిన నక్కుమారుండు వినతి నాతని నాదరించి మీ రెవ్వ రెచటి కేగెద రని యడిగిన. | 4 |
క. | సాధకుఁడ నేను సుమహా | 5 |
సీ. | అది యెట్టి దనిన వింధ్యాటవిలోపల | 6 |
శా. | ఏను న్మంత్రులుఁ దోడువచ్చెదము నీ కీప్రొద్ద యన్నన్ ధరి | |
| నూనం జేసి రసంబు తత్పదములం దొట్టించి యద్రిస్థలీ | 7 |
గీ. | పాంశుసంఛన్న మైనకూపంబుఁ దడవి | 8 |
వ. | సుస్థిరాసనాసీనుండై సాధకుండు ఖదిరేంధనంబుల వేల్వం దొడంగిన. | 9 |
క. | బిగిచన్నులుఁ దెలికన్నులు | 10 |
సీ. | ఘనవేణికచాంధకారంబుచే | 11 |
వ. | ఇట్లు సాధకుండు కామాతురుండై మంత్రసామర్థ్యంబు గోలుపోయిన. | 12 |
క. | పారావతాక్షుపనుపున | 13 |
వ. | కడకాలు పట్టి దవ్వులం బడవైచిన వాని వెదక సంభ్రమించి యందఱు నన్నివంకల నమ్మహాటవి దరియం జొచ్చి వెదకి వెదకి దిగ్భ్రమనొంది వచ్చిన జాడ యెఱుంగక యొండొరులం బొడగానక తిరుగుచుండ భూపాలనందనుండు కొన్నిదివసంబులు చెలులం దడవి యొక్కనాఁ డొక్కయేటిదరి నరుగు సమయంబున. | 14 |
ఉ. | గ్రాహము తన్నుఁ బట్టినఁ గిరాతుఁ డొకండు ఘనార్తిఁ గూయుడు | 15 |
క. | పూని యకారణబంధుఁడ | 16 |
వ. | అని తా నేలెడి కిరాతపల్లికిం దోడ్కొని చని సముచితసంభావనంబు లొనరించి నిజగృహంబులలో నొక్కరమ్యసదసంబున నునిచిన నుండి నాఁటినిశాసమయంబున రత్నదీప | |
| ప్రభావిభాసితం బగు తన్నివాసంబు గలయం గనుంగొనునప్పుడు దైవయోగంబున. | 17 |
చ. | ఒకపురినెమ్మిఁ గాంచి ప్రియ మొందఁగ బంధము లూడ్చి పట్టి యం | 18 |
వ. | అత్యంతసంభ్రమంబునం బరిరంభణం బొనరించి యతనిపునఃపునఃప్రణామంబు లాదరించి సమీపంబున నునిచికొని కరంబు కరంబునం గీలించి నీ రూపంబునకుం గారణం బేమి యని యడిగినఁ గరంబు వినయంబున న(తం డ)తని కిట్లనియె. | 19 |
క. | ఆపన్నగంబు కతమున | 20 |
సీ. | ఏ నొకముదుసలియింటికి నరిగి నా | |
| యొక్కపాత్రంబులోపల నునిచి ప్రాఁత | 21 |
వ. | అది కపటకృత్యంబుగా నెఱింగి. | 22 |
గీ. | పాత్రముల సక్తువులు వీడుపడఁగఁ బెట్టి | 23 |
వ. | ఆజంత యరుగుదెంచి నేఁ జేసినవిధం బెఱుంగక యత్యంతరయంబున. | 24 |
క. | నా పేర నిర్ణయించిన | 25 |
వ. | దానం గనుంగొని నివ్వెఱఁ గందుచు నాకుం బన్నినయురుల నీవ తగిలితే యనుచు నవ్వుచు భుక్తోత్తరంబున నొక్క రజ్జువున దానికంఠంబు బంధించి తిగిచికొనుచు నొక్కసూనరిగృహంబునకుం జని బట్టి యిచ్చెద ననిన నతనిభార్య యెఱింగి నా చెలియలి నిట్లు చేసితే కాని మ్మని జంకించిన వెఱచి యయ్యజంబు విడిచిపెట్టి దేవాలయంబునకుం జని నిద్రించితి నదియు నదియ వైరంబుగాఁ బాటించి నాచొప్పునం జనుదెంచి యేను మయూరం బగునట్లుగా నీత్రాడు మత్కంధరాంతరంబున బంధింపంబోలు నేనును బర్హిభావంబు | |
| నొంది బోయలచేతం బట్టువడి యిచ్చటికి వచ్చి దేవరచే పడి తిర్యగ్భావనిర్ముక్తుండ నై భవదీయదర్శనంబునఁ గృతార్థుంగుండ నైతి నని పలికి యొక్కవిన్నపం బవధరింపుమని యిట్లనియె. | 26 |
సీ. | వేగంబ యిచ్చట వెడలంగ వలయుఁ గి | 27 |
వ. | తనమతమున కుల్లసిల్లుమహినాథకుమారుండునుం దానును గాననమార్గంబున నరిగి యరిగి. | 28 |
చ. | దళ మగుచీఁకటిం దెరువు దప్పి వదంబులు నొప్పిగూరినన్ | 29 |
చ. | నెలవొడువంగఁ చిత్రముగ నీరసభూరుహ మాకువెట్టి మొ | |
| దళముగ వారు మోదమునఁ దద్రస మాదటఁ గ్రోలి దాన నాఁ | 30 |
గీ. | ఆకుజము గుణాకరాఖ్యమిత్రుం డగు | 31 |
సీ. | ఆపాముకినుకచే నందఱఁ బెడఁబాసి | 32 |
క. | దళముగ ఫలింప నీఫల | 33 |
| |
వ. ఆక్షణంబ నీరసవృక్షంబ నైతి దేవర యిచ్చటికి విచ్చేయుకతంబున శాపవిముక్తుండ నై తావకదర్శనంబున ధన్యుండ నైతి నిప్పు డప్పరమమునీంద్రుం డందేని యున్నవాఁ డనినం దద్దర్శనలాభప్రమోదతరంగితాంతరంగు లగుచు నతఁడును దారును నొక్కపథంబున నరుగుసమయంబున.34
క. | 35 |
చిత్రకరుని వృత్తాంతము
వ. | వీఁడె మనచిత్రకరుండు వచ్చె నిట్టిచిత్రంబునుం గలదె యనియుల్లంబున నుల్లసిల్లుచు వానిం బరిపాటి నందఱుం బరిరంభణం బొనరింప నంగనయుఁ ముసుంగిడి తొలంగి యుండె నంతఁ దారొక్కయెడ నాసీనులై యున్నచోఁ గమలాకరుండు చిత్రకరుని వదనంబునం జూడ్కి నిలిపి నీ కీఖేచరత్వంబు మహత్త్వంబు నెట్లు గలిగె నని యడిగిన. | 36 |
మ. | అహిరోషంబున నట్లు వాసి చని వింధ్యారణ్యమధ్యంబున | 37 |
వ. | ఒక్కపాత్రంబును నొక్కలాతంబును నొక్కపాగదోయినిం జూపి. | 38 |
శాా. | ఈ పాత్రంబు నిరంతరేష్టఫలదం, బీయష్టి వ్రాయంగ నే | 39 |
క. | అనుటయు నతిముత్సరతం | 40 |
క. | ఇరువురు సంగడి విడువక | 41 |
క. | ఏ విడువఁగ సమసత్త్వులు | 42 |
క. | త్వరతో యష్టియుఁ బాత్రయుఁ | 43 |
క. | అందొక్క వృద్ధకామిని | 44 |
ఉ. | రత్నరథుండు దానసురరత్నము మాపురిరాజు తత్సుతన్ | 45 |
వ. | నాఁటినిశాసమయంబున మదీయపాదుకామహానుభావంబునఁ దదీయసౌధంబునకుం జని రత్నకళికాలోకం బగు తదంతరంబున. | 46 |
క. | తొంగలిఱెప్పల మెఱుఁగులు | 47 |
క. | నాగతి మున్ను నెఱుంగదు | 48 |
ఉ. | అగ్గల మైనమోహమున నల్లన నేనొకయింత డాసినన్ | 49 |
క. | అనుచుండ సౌధపాలుఁడు | 50 |
ఉ. | లాలితరూపయౌవనవిలాసమనోహర యైతనర్చు నీ | 51 |
క. | అనుపలు కుపదేశముక్రియ | 52 |
క. | చంచలనేత్రము లమరఁగ | 53 |
ఉ. | ఇచ్చ జనించు వేడ్క నొకయించుక వింతదనంబు సేయమిన్ | 54 |
వ. | ఇ ట్లయ్యింతయు నేనును నత్యంతమోదంబునం గంతునిం గృతార్థునిం గావించి తదనంతరంబ. | 55 |
క. | నావృత్తాంతముఁ బేరును | 56 |
ఉ. | ఇప్పగిది న్రహస్యముగ నే నొనరింపఁగ బోటు లొక్కనాఁ | |
| జెప్పకయున్నఁ ద ప్పనుచు శీఘ్రమునం జని యేకతంబునం | 57 |
చ. | తనసుతవర్తనంబు విదితంబుగ నారయఁ బ్రోడ నోర్తు బం | 58 |
క. | అంబుజముఖి యిటు లడియా | 59 |
వ. | ఆవృత్తాంతం బంతయు రాజసదనాంతర్వర్తిని యగు నావృద్ధజంతచేత విని యచ్చట నునికి యకార్యం బని నిశ్చయించి పాదుకాసమన్వితపాదుండ నై పాత్రయు లాతంబునుం గొని యాక్షణంబ కమలాక్షి యున్నసౌధంబునకుం జని సకలంబు నెఱింగించి గమనోన్ముఖుండ నగుటయు నిన్నుం బాసి నిమేషం బైనను బ్రాణంబులు నిర్వహింపనేర నీతోడన వచ్చెదఁ దోడుకొనిపొ మ్మనిన నిమ్మగువం గరంబులం బొదివికొని గగనగమనంబున వచ్చి వచ్చి యిచ్చట దేవరం గాంచి యానందకందళితభావుండ నగుచు నవతరించితి ననుచు విన్నవించి. | 60 |
గీ. | భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యముల్ | 61 |
వ. | మఱియు నక్కుమారు నాలోకించి. | 62 |
క. | నాయష్టిమహత్త్వంబున | 63 |
సీ. | మణిహేమవిస్తారమందిరప్రాకార | 64 |
వ. | ఇట్లు చిత్రంబుగాఁ జిత్రకరుండు పురంబు నిర్మించి దానికిం జిత్రపురం బని పేరిడి యందు రాజమందిరంబునఁ గమలాగరకుమారుని సింహాసనాసీనుం గావించి తానును భీమభటుండును గరుణాకరుండును, సముచితప్రకారంబులం గొలుచుచు మణికనకభాసురనివాసంబుల విశిష్టవిభవంబుల నుల్లసిల్లుచున్నంత. | 65 |
చ. | చెలువుగ నొక్కలాతమునఁ జిత్రకరాఖ్యుఁడు పట్టణంబుగా | 66 |
క. | ఎసఁగిన యీవార్తలు విని | 67 |
క. | ఆనెచ్చెలులం గని యా | 68 |
వ. | సింహాసనంబు చేరువ సముచితాసనాసీనులం గావించి వారివదనంబు లవలోకించి. | 69 |
గీ. | మమ్ము బాసి యరిగి.......... | 70 |
క. | ఆనృపనందను సోదరి | 71 |
క. | విలసితమరాళరాజీ | |
| గలనూపురకాంచీమం | 72 |
క. | హారావళిలో నయ్యం | 73 |
ఉ. | అవ్వనజాక్షిఁ జూచి హృదయంబున రాగము నివ్వటిల్లఁగా | 74 |
క. | పులకలు జెమరును గంపము | 75 |
వ. | ఏనును మీనకేతనోదారశరాసారవిదారితమానసుండ నగుచు విజయసేనం గొలువ నరిగి యవసరం బగునంతకు నగరిలో నొక్కెడ వసియించి మదిరావతినిం జింతింపుచున్నంత నన్నాతి యుపమాత గనుంగొని కన్నుసన్న నన్నుం జేరి ధవళాంబరంబునం బొదివినకందుకంబుచందంబున నున్న పూదండ నాకుం జూపి యిట్లనియె. | 76 |
క. | ఏతపం బొనరించితొ | 77 |
క. | వేయింటికి నీవ మనో | 78 |
క. | ఆలలన తాన కట్టిన | 79 |
వ. | అ ట్లత్యంతమోదాయత్తచిత్తుండ నై యన్నాతి నన్ను వరియించు నని యున్నంత. | 80 |
క. | జగతీపతి తన పుత్రికి | 81 |
క. | అమ్మాట పిడుగుమ్రోఁత వి | 82 |
వ. | అత్తఱి మదిరావతి పుత్తెంచినపరిచారిక యొక్కతె యరుగుదెంచి న న్నూఱడించి యబ్బోటి తనయాడినమాటలు విను మని యి ట్లనియె. | 83 |
ఉ. | భూమివరుండు తన్ను నొకభూపకుమారున కిచ్చునంచు నీ | |
| బ్రేమ దలిర్ప నొడ్లను వరింపఁగ నామది కియ్యకోలు గా | 84 |
గీ. | అనెడుపల్కు సుధాసేక మగుచుఁ జవుల | 85 |
వ. | అమ్మగువమాటలు విని నమ్మి యిమ్మెయి నూఱడిల్లి యున్నంతఁ గొన్నిదినంబులకు లగ్నదివసంబు వచ్చుటయు. | 86 |
సీ. | రాజనిశ్చితుఁ డైన రాజకుమారకుం | 87 |
క. | ఏ నావిభవము గనుఁగొని | 88 |
క. | కాయజవేదన కోర్వక | 89 |
వ. | గాఢాలింగనం బొనరించి వృత్తాంతం బంతయు నెఱింగించినం జింతింపవలదు నీహృదయవల్లభ నీక సిద్ధించునుపాయంబు గలిగెడు నని యూఱడించి నీపడినయట్ల యేనునుం బడితి నాకథ విను మని యిట్లనియె. | 90 |
గీ. | అట్లు వింధ్యాద్రి మిముఁ బాసి యరిగి యేను | 91 |
క. | పలువురుబోటులతోడను | 92 |
క. | అంగనకబరీమేఘము | 93 |
క. | ఆకాంతయు న న్నచట వి | 94 |
మ. | గళదుద్యన్మదరంజితభ్రమరరేఖం గాలకూటచ్ఛవిః | 95 |
వ. | ఓడ కోడకు మని యమ్మానినిం జేర నరుగుటయు. | 96 |
క. | అతిభీతిరాగయోగో | 97 |
చ. | కనుకలిఁ జిక్కి యేను బిగికౌఁగిటఁ జేర్పఁగఁ గోరునాసరో | 98 |
వ. | ఇవ్విధంబున నభినవసౌఖ్యంబు లనుభవించి యే నయ్యేనుంగు నుద్దేశించి. | 99 |
ఉ. | ఓకరిరాజ నీకతన నుత్పలలోచన దాన వచ్చి న | 100 |
వ. | అని దీవించితిం దదనంతరంబ యాసామజంబు నపారాశుసీత్కారపూరితశీకరాసారమండితం బైన కరదండం బార్చుచు నామీఁదన కవిసిన నయ్యింతి నోసరిలం జేసి. | 101 |
క. | కరికరము వట్టికొని | |
| వెరవుమెయి దాఁటి యరిగితి | 102 |
క. | ఏను గరి కడ్డుపడునా | 103 |
వ. | .........రంబ ప్రవేశించి యున్నంత దంతావళంబు సరఃప్రాంతంబున నెంతయుం దడపు విహరించి యది తొలంగి చనుట యెఱింగి యయ్యెడ వెడలి యయ్యెలనాఁగ చనిన | 104 |
ఉ. | ఆవనజాక్షి నేవలన నారసి కానక యాతురుండ నై | 105 |
వ. | అప్పు డేపారు మదనానలతాపంబున కోర్వక మరణోద్యుక్తుండ నై యాంగికంబు లగుశుభసూచకంబులు గల్గిన నంగనం గనుంగొనియెద నను......డ నై పెక్కెడలం జరించి యిక్కడకు నరుదెంచి నిన్నుఁ గాంచితి నని తనవృత్తాంతంబుఁ జెప్పిన యనంతరంబ మనోభవాధీనమానసుండ నైనన న్నూఱడించి యిట్లనియె. | 106 |
క. | ................. | 107 |
క. | అని పలికి నన్నుఁ దోడ్కొని | 108 |
వ. | .......యంబునం గరదీపికాసముదయంబు వెలుంగ నాందోళికారూఢ యై యమందవిభవంబున. | 109 |
క. | ఘనవాద్యఘోషభీషణ | 110 |
గీ. | వచ్చి చెలువందఁగా నెల్లవారి నిలిపి | 111 |
క. | అగణితవిలాసు నొక్కని | 112 |
క. | ప్రాణేశవిరహ మోర్వం | 113 |
వ. | నిర్భరతరం బగుసాహసంబున గర్భగృహంబు సొచ్చి కంఠంబున నురి యిడుకొనుటయు. | 114 |
క. | బాలిక డగ్గఱి యెత్తి కు | 115 |
క. | ఆనందకంపలజ్జల | 116 |
వ. | అట్లు ప్రియాలింగనసౌఖ్యతరంగితాంతరంగుండ నై యాకురంగలోచనం గనుంగొని. | 117 |
క. | వనజాతనేత్ర యడలకు | 118 |
వ. | అని యూఱడించు సమయంబున బుద్ధిసహాయుండు నన్ను గనుంగొని యిట్లనియె. | 119 |
చ. | వెలఁదుక భూషణంబులును వేషము నచ్చుపడంగఁ దాల్చి యే | 120 |
చ. | కచభర మూడ్చి నుందురుముగా నిడి మించిన పూవుగుత్తులం | |
| నచలగతి న్ముసుంగిడి లతాంగిగతి న్వెలి కల్ల నేగినన్. | 121 |
వ. | పరిజనంబులు సంభ్రమంబున నెద్దియు నెఱుంగక యాందోళిక యెక్కించుకొని క్రందుకొనం గొలిచి యందఱు నరిగిన. | 122 |
క. | మదిరావతిఁ దోడ్కొనిచని | 123 |
వ. | అట్లుండునంత బుద్ధిసాహాయ్యుండు మూఁడవజామునఁ బ్రియకామినీసహితుం డై యచ్చటికి వచ్చిన నచ్చెరు వంది పిచ్చలించుచునున్న యంతరంగంబు లలక గాఢాలింగనం బాచరించి యిచ్చెలువ యెచ్చట నీకుం జేకుఱె ననిన హాసభాసితవదనుం డగుచు నిట్లనియె. | 124 |
ఉ. | ఏ వనితాకృతి న్నగరి కేగి నృపాత్మజ యుండునట్టి య | 125 |
వ. | ఎవ్వరు వినకుండ నల్లన నిట్లనియె. | 126 |
ఉ. | వందఁగ నేల యిట్లు వలవంత దొఱంగుము రాజకన్యకుం | 127 |
క. | ఈవేగుజాము పెండిలి | 128 |
క. | మానసభవుశిఖివేఁడిమి | 129 |
గీ. | శంఖపాలాఖ్య నొప్పారుసరసి పొంత | 130 |
క. | కరి ప్రాణేశ్వరుఁ బాపిన | 131 |
క. | నావుడు మత్ప్రియఁగా మది | 132 |
క. | అంగము తాపము వాయఁగ | 133 |
క. | ఈమదిరావతితల్లియు | 134 |
వ. | అని చెప్పిన నత్యంతసంతుష్టాంతరంగుడ నై మదిరావతీకల్యాణనిమిత్త మదిరాపానమత్తపరిజన ప్రతీహార ద్వారపాలాదుల వంచించి వచ్చితి నని చెప్పిన నుప్పొంగుచు నీ ప్రొద్ద కదలి యిద్దఱము నన్నార్థుల(?)మై యింతులం దడవికొని కాంతారమార్గంబున నరుగుదెంచి యిచ్చట దేవరం గాంచి కృతార్థుల మైతి మని చెప్పిన నద్భుతరసాయత్తచిత్తుం డయ్యెఁ దదనంతరంబ. | 135 |
క. | ఆనరనాయకుఁ డత్తఱి | 136 |
వసంతకునికథ
క. | పరమేశ్వరి కతిభక్తిని | 137 |
క. | బుద్ధ్యధికుండు వసంతకు | 138 |
క. | తనమంత్రులుఁ దానును వా | 139 |
వ. | అతండును దానును సముచితోపాయనంబు లిచ్చి దేవికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి శీతలతరుచ్ఛాయ నాసీనులై యుల్లాసంబున నతం డడుగఁ దమవృత్తాంతం బెఱిఁగింపఁ దదనంతరంబ వసంతకుండు గరయుగంబు మొగిచి మహీకాంతున కి ట్లనియె. | 140 |
రూపిణికథ
క. | భూరమణ నిన్ను వెదకుచు | 141 |
క. | మొఱ వెట్టఁగ నావైశ్యుని | 142 |
వ. | అత్యంతసంతోషంబున నతండు వినతుం డై నన్ను బహువిధంబులం గొనియాడి మదనోల్లాసం బనుతనపురంబునకుఁ దోకొనిపోయి యపారధనంబు లిచ్చి సంభావించె నప్పురంబు బహువిధవినోదాస్పదంబు. | 143 |
సీ. | శుకుఁ డైన నవ్వీటిజోటులఁ జూచిన | |
| శివుఁ డైన నప్పురిచెలువలఁ జూచిన | 144 |
సీ. | హాటకహర్మ్యంబు లంగరేఁకులవారు[3] | 145 |
వ. | ఇట్లు మనోహరం బై యొప్పునప్పురంబున నుండి యొక్కనాఁడు దేవాలయంబున కరిగి రూపిణి యనునర్తకీనృత్యంబు చూచుచుండ నయ్యంగన నన్నుం గనుంగొని యంగజాయత్తచిత్త యై తనయనురక్తి చెప్పి నాపాలికి దూతికం బుత్తెంచిన నది ప్రార్థించి తోడ్కొనిపోవఁ దత్సదనంబునకుం జనిన నది యనురాగంబున నాతోడి యిప్టోపభోగంబులం దగిలి. | 146 |
ఉ. | మెచ్చదు వీటిలోనఁ బెఱమిండల నెవ్వరుఁ దన్నుఁ గోరి వే | 142 |
క. | ఎడపక నాఁడు న్నాఁటికిఁ | 148 |
వ. | నిరంతరానుమోదంబున నున్నయవసరంబున. | 149 |
సీ. | జత్తుల వట్టంబు జఱభి మాటలపోతు | 150 |
క. | ఈపగిదిఁ బోరియును నను | |
| పాపాత్మిక యది నాప్రా | 151 |
క. | రూపిణికి నాకుఁ జొక్కిడి | 152 |
క. | మోచుకొని యరుగునప్పుడు | 153 |
క. | అంగంబు నీటిలోన ము | 154 |
క. | ఆయేనుఁగుడొక్కను బా | 155 |
వ. | కొంతతడవునకు సేదదేఱి యున్నంత నాదంతీకళేబరంబు నదీవేగంబున నంబునిధానంబు సొచ్చిన. | 156 |
ఉ. | ఒక్క మహాఖగం బెచటనుండియొ యచ్చటి కేగుదెంచి యా | |
| ఱెక్కలు వీచుమ్రోఁతల నెఱింగితి దాని మహాఖగంబుగన్. | 152 |
వ. | అంత నమ్మహాఖగంబు లంకాద్వీపంబునకుం బోయె నప్పు డక్కరికళేబరంబు ప్రిదిలి ధరం బడిన నేనును బోరున నందు వెడలి తలచీర యలవరించుకొని యన్నెలవు వాసి నలుదిక్కులుం జూచుచు నరుగ నత్యంతశాంతులగు దైత్యులు కొంద ఱరుగుదెంచి నన్నుం గాంచి నీవు నరుండ విది లంకానగరం బిచ్చటికి నీవు వచ్చుట యచ్చెరు వని పలికి మమ్ము నేలిన కరుణావిభూషణు విభీషణుం గానుపించెదము ర మ్మని కొనిపోయి సముఖంబు చేసిన నాపౌలస్త్యుండు చాలం గరుణించి నన్నతుండనైన నన్నుఁ బ్రసన్నావలోకనంబున నిరీక్షించి యెక్కడనుండి వచ్చి తని యడిగిన నంతలోనన యొక్కయుక్తిం బొడగాంచి కరంబులు మొగిడ్చి. | 158 |
సీ. | అనఘ జంబూద్వీపమున మదనోల్లాస | |
| నిఖిలభాగవతాగ్రణి నిన్నుఁ గంటిఁ | 159 |
వ. | అనిన నెంతయు సంతసిల్లి కనకరత్నమయంబు లగు శంఖచక్రంబులును గదాంబుజంబులును చెప్పించి యవి యద్దేవునకు సమర్పింపు మని యిచ్చి నాకు దివ్యాంబరాభరణమాల్యంబులు నపరిమితకనకంబును నొసంగి యిరువురు దైత్యుల రావించి వీని నీవస్తుసంతానంబును భరియించి మదనోల్లాసపురంబు సమీపంబున నునిచి రండని పనిచిన వారు నన్నుం గొనివచ్చి యన్నగరంబు చేరువ నునిచి మగుడ నరుగ నత్యంతమోదాయత్తచిత్తుండ నై నాకిచ్చినధనంబు నొక్కకందువ దాఁచి తత్క్షణంబ. | 160 |
చ. | కరముల శంఖచక్రములు గైకొని కాంచనరత్నభూషణో | 161 |
క. | వనజాక్షుఁడు వచ్చె నటం | 162 |
గీ. | నేఁడు మొదలుగ వరియింతు నిన్ను నింక | 163 |
వ. | ఇట్లుండ నంత నొక్కనాఁడు దనకూఁతును వేడికొని యది యిట్లనియె. | 164 |
క. | ఓకాంత నిన్ను వేఁడెద | 165 |
గీ. | అనుచుఁ బ్రార్థించుటయుఁ దన యమ్మమాట | 166 |
సీ. | ఎల్లి యేకాదశి నెంతయు నిష్ఠను | 167 |
వ. | అనుచుం జెప్పినయప్పలుకులు నిజంబుగా మనంబున నిశ్చయించి మఱునాఁడు మద్వచనప్రకారంబున నన్నియుం జేసి | |
| నాఁటి నిశాసమయంబునఁ దోరణస్తంభంబున కరుగునప్పు డంతకుమున్న యేనును నతిరయంబునం జని హరిమందిరం బెక్కి యేకాదశీవ్రతపరాయణులై యున్న విప్రులు విన నేఁడు మహామారీపతనం బగు నేమఱకుండుం డని పలికి వారు గానకుండ నేను సురిఁగి యరిగితి వారు వెడలి వచ్చి చూచి యరసి యెవ్వరిం గానక యది యాకాశవాణిపలుకుగా నిశ్చయించి. | 168 |
క. | హస్తములు మోడ్చి శాంతి | 169 |
వ. | అంతకమున్న యెవ్వరు నెఱుంగకుండఁ దోరణస్తంభం బెక్కి యున్న మకరదంష్ట్ర యయ్యవసరంబున. | 170 |
క. | స్తంభాగ్రతలమునను సం | 171 |
వ. | ఎలుఁ గిడిన నయ్యెలుంగు విని యిదియ మహామారీభాషణం బనుచు నమ్మహీసురులు మస్తకన్యస్తహస్తులై ప్రస్తుతించుచు నోదేవీ! మాకీర్తనంబు లుల్లంఘింపక మామీఁద లఘింపక మమ్ము మన్నింపు మనుచు నుండ సైరింపలేక మకరదంష్ట్ర కంపంబు నొందుచు మఱియును. | 172 |
క. | పడుదుం బడుదు ననంగాఁ | |
| నెడపని పలుకులమ్రోఁతయు | 173 |
క. | తెలతెలవాఱినఁ బౌరులు | 174 |
వ. | ఏ ని ట్లాగోరంపుజఱభి యభిమానంబును బ్రాణంబునుం గొని సమాధానంబున రూపిణితో నభిమతసుఖంబు లనుభవించుచు నున్నంత. | 175 |
క. | కమలాకరుఁ డనుపతి చి | 176 |
క. | ఆవార్తలు విని తత్పతి | 177 |
క. | ఏనును నీవుఁ గదలి య | 178 |
ఉ. | దేవరఁ గాన నర్థిఁ జనుదేరఁగ నొక్క వనంబులోఁ గిరా | |
| చేవ దలిర్ప ఖడ్గమునఁ జెండఁదొడంగిన బంధుల న్వెస | 179 |
క. | తెగి యేను దునుమం దొడఁగినఁ | 180 |
క. | బెట్టు వడియుండ నొక్కటఁ | 181 |
వ. | అంత నాభాగ్యంబున నిచ్చటికి దేవర విచ్చేసితి రనిన నత్యంతసంతుష్టాంతరంగుం డై భీమభటాదులవలనుం గనుంగొని 'నేఁ డిట్టిపుణ్యదివసం బగునే యని పలికి వసంతకువలను గనుగొని వలయుభటవర్గంబుం గొని చని కిరాతపల్లి ముట్టుకొని మనసొమ్ములతోడ రూపిణిం గొనితెం డనిన నపరిమితపరివారుం డై చిత్రకరాదులతోడ దాడి వెట్టి శబరాలయంబు ముట్టికొని. | 182 |
చ. | అమితకిరాతవీరులఁ గృతాంతునిపాలికిఁ బుచ్చి బోరునన్ | 183 |
శా. | తారానాయకబింబరత్నకలశీధారాళనిర్యత్సుధా | |
| పారంపర్యపరాభవారభటికుప్రాగల్భ్యభాస్వద్యశో | 184 |
క. | శ్రీరామాయణభారత | 185 |
మాలిని. | శరదమృతమయూఖశ్లాఘతేజోమయంగా | 186 |
గద్యము. | ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన షోడశకుమారచరిత్రంబునందు ద్వితీయాశ్వాసము. | |