శ్రీనాథకవి జీవితము/పంచమాధ్యాయము

అధ్యాయము 5

హరవిలాసరచనము,

అంతట కొండవీడు రాజ్యము పరహస్తగతమై పోవుటను దలపోసి శ్రీనాథుఁడు: ---

చ. అలగుల వెన్ని యేటికిని, వంత మైన శాల యామిపై
గలుగుల పెన్ని పామునకుఁ గానల వెంబడి సంచరించునా
పులంగున కెన్ని వృక్షములు, పొల్పు వహించిన భూదరాళిలో
నెలఁగును కెన్ని రోమములు నేలికలందఱు కొండవీటికిన్.,


అను చాటువును జెప్పి మిక్కిలి చింతించెనని చెప్పుదురు.

ఇతఁ డావెను వెంటనే అనఁగా క్రీ. శ. 1421 ప్రాంతముల తన పూర్వ స్నేహితుఁడైన కోటీశ్వరుఁడు తిప్పయ పెట్టి తన్నాదరించునను విశ్వాసముతోఁ గాంచీనగరమునకుఁ దన శిష్యుఁడును మఱదియునగు దుగ్గనతోడఁ బోయి యాతని సందర్శించెను. అతఁడును
నత్యాదరము జూపి కొంతకాల మాతని నచట నిలిపి యొకనాఁడతనితో నిట్లనియెను.

<poem>సీ. కనులనాభుని పౌత్రు గవితామహారాజ్య
భిద్రావనారూఢుఁ బరమఫుణ్యు
బాత్రునాపస్తంబు సూత్రు భారద్వాజ
గోత్రు సజ్జ : మిత్రు గుల పవిత్రు
భీమాంబి కామార నామాత్యనందను
సథలపురాణ విద్యా ప్రవీణు
సధ్వర్యు వేదశాఖతిధి నిష్ణాతు
నంద్రభాషా నైషద , భవుని

గీ. సుభయ భాషాకవిత్వ ప్రయోగ కుళలు
బాలసఖుగారిపించి తాత్పర్యమొప్ప
సవచి దేవయత్రి పురారి యక్ష రాజు
హితమితోక్తులు వెలయంగ నిట్టులనియె

1 . నైషధము తరువాత హరవిలాసము రచింపబడినది వాస్తవ మనియు హరవిలాస రచనకాలము 1421 ప్రాంతమనియు చేయుట సాధ్యమైనది. కుమాకగిరెడ్డి కాలముననే రచింపఁబడియుండినయెడల గలిగెఫి యాక్షేపణములను గూర్చి పూర్వ ప్రకరణముస విశేషముగా జర్చించి యున్నాను. హరవిలాసమును గూర్చి తన యేగ్రంథము నందుఁ బ్రసించి యుండకపోవుటచేత వార్ధక్యమున రచించియుండునని యనేకులభి ప్రాయపడుచున్నారు. ఇందలి యవతారికలోని పద్యముల నుబట్టి ద్వితీయ హరిహర రాయలు, కుమారగిరి, ఫిరోజిషాహమూవురు రాజులు బ్రదికియున్న కాలముననే హరవిలాసము రచింపబడి యుండవలయునని శ్రీలక్ష్ముణ రావుగారు ప్రయత్నించినారు. ఈవాదమునందు కొంత బలము గలదుగాని యావాదము నంగీకరించుటకితర విషయము లనేకములు బాధించుచున్నవి. వానిని జాలవలకు జర్చించియే యున్నాను. ఈ గ్రంథము నైషధమునకు భీమేశ్వర పురాణమునకు నడిమికాలమున ననఁగాఁ బెదకోమటి వేమభూపాలుని యనంతరము రచింప బడినదనట సత్యము. ఈ హరవిలాసమును ప్రథమమున ముద్రింపించిన శ్రీ పోలవరము జమీందారుగారగు కోచ్చర్ల తోట రామ చంద్ర వేంకటకృష్ణ రావు బహదరుగారు హరవిలాస ముద్రణ పీఠికలో నిట్లు వ్రాసియున్నారు.

“ ఈ గ్రంథము సయితము సామావశిష్టము గాక యొక్క ప్రతి మాత్రము: పీఠిక లేక తప్పులు కుప్పలుగా తంజావూరు పుస్తక భాండాగారములో నుండిన దాని వ్రాయించి తెప్పించి చిర కాలము ప్రత్యంతరము కోసము ప్రతీక్షించియు లభింప నేరకయ యస్మదాస్థానవిద్వత్కవు లును, శతావధానులునగు తిరుపతి వేంకటేశ్వరుల సహాయంబునం బరి ష్కరించి మాసరస్వతీ పత్రికాముఖమునఁ బ్రచురించుచుండఁగా నైదాశ్వాసము లచ్చుపడువఱకు 'దై పకృపవలనఁ బీఠిక తో నైదాశ్వాసములు : వఱ కే యుండిన యొక శిథిల తాళపత్ర గ్రంథము దొరకినందులకు మిగుల సంతసించి తుట్టతుద వఱకు ముద్రింపించితిమి. యథామతిఁ బరిష్కరిం చినను నిందుఁ గొన్ని స్టాలిత్యము: లింకను నుండవచ్చును గాన వానిమన్నించుటకు బండితులను వేడు కొనుచున్నాను."

పీఠిక భౌగమగల ప్రతియొక్కటియె దొరకుటను బట్టి హరవిలాసము గొన్ని సాలిత్యములకు లోనయి యుండునన్న సచ్చెరువొందుబని లేదు. ఇందు ముందుగా విచారించవలసిన గొప్ప సందేహము తిప్పయ పెట్టి ప్రోలయ వేనూ రెడ్డి కాలములో వ్యాపారముఖ్యుడుగా నున్న వాఁడాయనునది. ఇది వఱకు ముద్రిత గ్రంథములోని తృతీయ శ్వాసము మొదటనున్న,


క. శ్రీపర్వతసోపాన
స్థాపక "వేము క్షితీశ సామ్రాజ్యం
హ్యాపారిను ఖ్య యంవయ
దీపక యలకాధీ రాజీ దేవయతిప్పా,


అనుపద్య పాఠమే సరియైన దైన 'యెడల స్థిర సిద్ధాంతము లనేకములకు ప్రతిబంధక మగుచున్నది. ఆవిషయమును బూర్వ ప్రకరణమునఁహరవిలాసముజర్చించి యున్నాఁడను. శ్రీకృష్ణ రావు బహదరుగారు హరవిలాసమునకు వ్రాసిన పీఠికలో


క. శ్రీపర్వతసోపాన
స్థాపక వేమక్షితీశ సామ్రాజ్య శ్రీ
వ్యాపాముఖ్య సత్కుల
దీపికప యలకాధి రాజ దేవయతిప్పా


అని దిద్దినచోఁ దిప్పన తండ్రియగు దేవయ వేమా రెడ్డి కాలము లోని వాడనియు . . . . . .కొమరగిరిభూపాలునికాలము నాటివాఁడు తిప్పం డనియుఁ,, ననీ సూచించి యున్నారు, అట్టి మార్పువలన మార్గము గొంతవరకు సుగమముగానుండు నసుటకు సందేహము లేదు. మనము

హరివిలాసపీఠికను జక్కగా బరిశీలించిన పక్షమున నాగ్రంథము కుమారగిరి రెడ్డి బ్రదికీ యుండఁగా రచింపఁబడియుండ లేదని తేటపడ గలదు.


శ్రీనాథుఁడు హరవిలాసావ తారికలో "అని ప్రార్ధించి . . . . . ......................... కొండవీడు పురంబు రాజధానిగా గీర్తిల తాధిష్టి తాష్టాదశ ద్వీ. పొంతరాళుండునగు కొమరగిరి వసంతనృ పొలువలన నాందోళికా ఛత్ర చామర తురంగాది రాజచిహ్నముల వడసి యమ్మహా రాజునకుం బ్రతి సంవత్సరోత్సవఁ బునకుం దగిన కస్తూరి కుకుకు ఘనసార సంకుమద హీమాంబ కాలాగురుగఁ ధసారప్రభ్రుతి సుగంధ ద్రవ్యంబు లొనగూర్చియుఁ జీవిసింహళతవాయి హుగుమంజూ జలనోగి ప్రభుతి నానాద్వీప నగ రాకరంబులగు ధనకనక వస్తువాహన మాణిక్యంబులు తెప్పించియుఁ గవి నైగమిక వాది వాంశిక వై తాళి కాదులగు సర్ధిజనంబులకును నర్థం గుప్పించియు ధీరుడును నుదారుండును గంభీరుండును సదాచారుండు నన విఖ్యాతిగాంచిన యవచిదేవయతిప్పయప్రభుం డొక్కనా డాస్థాన మంటపంబున సుఖో పవిష్టుండై" అనీ వాసియున్నాఁడు. పైవచన మునందు కింద నడ్డుగీట్లు గీయఁబడిన పదముల ప్రయోగముల వైఖరులనుజూడఁగా భూత కాలమున జరిగిన విషయములనే సూచించి యున్నాఁడనియు,తిప్పయకంకితము గావించినది కొండవీటి పురములోఁ గాదనియు, అప్పటికి గుమారగిరి రెడ్డి మరణము నొందిన వాడనియు, బోధపడకమానదు. కుమారగిరి రెడ్డి దిప్పయకుటుంభమువారు పొందిన యున్న తస్థానస్థితినిగవి వర్ణించి యశస్సును గలిగించుచున్నాడు. గాని వవర్తమానకాల స్థితిని దెలిపిన వాడు కాడు. "(ప్రతిసంవత్సరోత్సవమునకు) --ఒడ..... గూర్చియు.--- చెప్పించియు.......... కుప్పించియు - విఖ్యాతిగాంచిన" అను భూతార్ధక క్రియలకు మాఅఱుగా, ఒడఁగూర్చుచును.......దెప్పిం


చుచును.........కుప్పించుచుచును.--- ప్రఖ్యాతి గాంచుచున్న అను వర్తమానార్ధక క్రియలను బయోగించి యున్న యెడల కుమారగిరి రెడ్డి కాలమున హారవిలాసము రచింపబడియుండెనని చెప్పవచ్చును గాన భూతకాలమును దెలువు క్రియలను ప్రయోగించుటవలన హరవిలాసము కుమారగిరి రెడ్డి మరణాంతరము రచింపఁబడియుం డెననుటను మనము విశ్వసింపవచ్చును,


చ. హరిహర రాయ ఫేరొజసహాసుర ధాణగజాదిపాది భూ
వరులు నిజప్రభావ మభివర్ణన సేయఁ గుమారవర్య దీ
శ్వరుని వసంత వైభవము సర్వము నొక్కడ నిర్వహించు మా
తిరుమల నాధ సెట్టికిని ధీగుణ భట్టికీ నెవ్వడీగున్


అని పద్యములోని నిర్వహించు' అను క్రియ భూతార్థక క్రియకుబదులుగా ప్రయోగించినదనియే యగ్గము చేసికోవలయును. అట్లర్దముచేసికొనక పోయినయెడల


<poem>ఉ.ఆతభక్తి సంపద సహర్నిశము ఘృతఖండ శర్కగా
పాతముతో నపూపములు పాయసమున్ గదళీ ఫలంబులుమ్
స్ఫీతము గాగ నన్నములు పెట్టును శంకరభక్తకోటికా
సేతు హిమాచల బవచి సెట్టికి నెవ్వరు డు సాటియిమ్మహిన్.


'అను పద్యములో పెట్టుట్టును' అను క్రియా భూతార్ధమును దెలుపకున్న యెడల తిప్పయ సెట్టితండ్రియగు దేవయ సెట్టికూడ పోలయ వేమా రెడ్డి మరణాంతరము 10 సంవత్సరములవఱకు బ్రదికియుండి కుమారగిరి రెడ్డి కాలమునఁ గూడ శివభక్తులయిన వీరమహేశ్వరుల కెల్లరకు నన్న ములు పెట్టుచున్నా డని యర్ధము చేయవలసివచ్చును. అట్టి దసంభవము గదా: కాఁబట్టి పెట్టున నిర్వహించు, వను క్రియలకు నేను జెప్పిన యర్థమును, భావమును సరిపడకున్నచో • పెట్టెను, నిర్వహించె'నని సవ రించుటయే సమంజసముగా నుండును. హరవిలాసమునందు నోక్కనైష ధమున మాత్రము పేర్కొని భీమేశ్వరపురాణమునుగాని కాశీఖండము నుగాని పేర్కొనకపోవుటచేత నైషథమునకు భీమేశ్వర పురాణమునకును నడిమి కాలమునరచింపబడెసని చెప్పవచ్చును. మఱియు నీ రెండునుశైవులకు ప్రధానములైన మతగ్రంథములు గావున శైవుఁడైన తిప్పయసెట్టికీ హరః లాసము నంకితము సేయుచు శై పగ్రఁథములను బేర్కొనక శృంగారనైషధమును మాత్రము పేర్కొనుట చూడగా నారెంటికిని పూర్వమె హరవిలాసము రచించియుండె ననుట విశ్వసింపవలసి వచ్చుచున్నది. మఱియును

ము.ఖుసీమీరన్ సురధాణీనిండు కొలువై గూర్చున్నచో నీశరా
భ్యసనంబులున్నుతి యించుగా యవచి తిప్పాచంద్ర సారంగ నా
బిసముత్పాదిత తాళవృంతపవన ప్రేంఖోలన ప్రక్రియా
నసరోదంచిత సారసౌరిభరసన్యాలలోల గోలంబులన్.


ఈపద్యములోఁ బేర్కొనఁబడిన సురధాణి ఫిరోజిషాహా ఇతఁడు 1422 వఱకుఁ
బరిపొలనము చేసిన వాఁడుగావున హరవిలాసము రచించునాటికి ఫిరో జిజహా బ్రతికియుండెనని చెప్పవచ్చును. అనఁగా పెద్దకోమటి వేముని మరణాంతరమున ఫిరోజసాహ మరణమునకుఁ బూర్వమును హరవిలాసము రచింపఁబడి యుండుననుట సందేహము లేదు. హరవిలాసము పీఠికలో --

<poem> క. కంటీని విశుద్ధసంతతి
వింటీబురాణములు "ఫెక్ట్కు విశ్వము వొగడన్
నుంటి బహువత్సరంబులు
గొంటీ యశోధనము సుకవికోటి నుతింపన్


అని తిప్పయ పెట్టి చెప్పుకొనియుండుటచేత 60 , సంవత్సరములు వయస్సు చెల్లినవాడై యుండెననుటకు సందేహము లేదు. కుమారగిరి రెడ్డి సుగంధ భాండాగారాధ్యక్షు, డైయున్న యవచితిప్పయతోడ శ్రీనాథుడు బాలుఁడుగానున్న కాలమున మైత్రికలిగి యుండవచ్చును. అనఁగా దిప్పయ సెట్టికిని శ్రీనాథునకును వయస్సులో 20 సంవత్సరము భేద ముండునని యూహింపవచ్చును. ఇదియే నిశ్చయమైనయెడల హరవిలా సరచనకాలము నాటికి శ్రీనాథునకు 45సంవత్సరములకన్న నెక్కువ పంచమాధ్యాయము యుండవు. ఎట్లయినను హరవిలాసము 1461వ సంవత్సరమున రచింపబడనేమి తరువాత రచింపఁబడిన నేమి, కుమారగిరి రెడ్డి, పెద కోమటి వేమారెడ్డి మొదలగువారు, మరణమునొందిన వెనుక రచింపఁబడిన దనియే సాదృఢమైన యభిప్రాయము. హరవిలాసములోని గద్య మిట్లున్నది

"ఇది శ్రీమత్కమలనా భవిత్రమారయామాత్యపుత్రూసుకవిజనవీ ధేయ శ్రీనాథనామ ధేయ ప్రణీతంబైన హరవిలాసంబను మహాప్రబంధము నందు.”


అని యుండుటచేతను, శృంగారనై షధమున 'ఇవి శ్రీమత్కమల నాభ పౌత్ర సకలవిద్యాసనాధ శ్రీనాథ ప్రతంబై న' అని యుండుట చేతను,

భీమేశ్వరపురాణమున ఇది శ్రీమత్కమలనాభ పౌత్రమారయూమాత్యపుత్త సుక విజనవిధేయ సకలవిద్యా సనాథ శ్రీనాధ నామ ధేయప్రణీతంబైన యుండుట చేతను సకలవిద్యాసనాభ' అను విశేషణము హరవిలాసములోఁ గూడ జేర్పవలసి యున్నట్లు గనంబడుచున్నది. అది లేఖకులఁ దోషముగాని మఱియొకటిగా భాషింష రాదు. హరవిలాసరచనాకాలము నేను చెప్పినదే క్రమమైనదని నాయభిప్రాయము, దానికీ గల సాధక బాధకములను జాలవఱకుఁ జర్చించినాఁడను,


శ్రీవీరేశ లింగముగారు కవి ధనలాభముకొఱకు కృతిపతిని తిప్పప్రభుఁడనియు, ఆస్థానమంట సంబున సుఖో పవిష్టుండై అనియు, అతిశ యోక్తులతో సెంత యెక్కువగా వర్ణించినను తిప్పయ సెట్టి సముద్రవ్యా పారమును జేయుచు, కుమారగిరికి వలెనే యితర రాజులకును కస్తూరీకుంకు మాది సుగంధ ద్రవ్యములను చీనాంబరాదులను హయరత్నాదులను ఏ దేశములనుండి తెప్పించి విక్రయించుచు పెద్దయంగడి పెట్టిన లజధికారియైన పెద్దకోమటియె గానీ మహారాజు గాఁడు. శ్రీ నా ధ కవి


ప్రథమాశ్వాసాంతమునందలి

క.కొమరగిరి నృప వసంతా
గమకవివర గంధ సాతకస్తూరి కుం
కమకర్పూర హిమాంభ
స్సముచంచిత జహనుగంధి శాలాధ్యక్షా

అన్న పద్యములోని సంబోధనము తిప్పయ పెట్టి కుమారగిరి నిమిత్తము చెప్పించిన కర్పూరమును గంధ సారమును కస్తూరిని విక్రయించుగొప్పసుగంధదవ్యముల వాణిజ్య శాలను బెట్టినవాడని చెప్పుచున్నది. ”అని శ్రీనాథుఁడు తిప్పనిఁబ్రభువ న్నందులకును అతని కాస్థానమండపంబు గలదన్నందులకును నధి క్షేపించుచున్నారు. శ్రీనాథుఁడు తిప్పయను వర్ణించిన వర్ణనములలో నతిశయోక్తులు లేవని నేను చెప్ప జాలను కానివీరియాక్షేషణములు మాత్రమొక లెక్కలోనికిఁ దీసికొని రోడగినవికావు. తిప్పయను ప్రభుఁడనుటలో దోష మేమియు లేదు. శ్రీవీ రేశలింగ ముగారే యొక చోట శ్రీనాథునకు కుమారగిరిభూపాలుని సుగంధ భాండాగారా ధ్యక్షుఁడై కోటీశ్వరుఁడుగానుండిన యవవితిప్పయ సెట్టితోడ మైత్రిక లిగినది!" అని తిప్పయకోటీశ్వరుఁడైన ధనికుఁడని వ్రాసియున్నారు.మఱియును కుమారగిరిభూపాలునివలన నాందోళి కాఛతదాని తురంగాది 'రాజచిహ్నంబులను బడసెనని శ్రీనాథుఁడే చెప్పియున్నాఁడు.అటువంటివానిని శ్రీనాథుఁడు ప్రభువని వక్కాణించుట దోషమయ్యేనా?తిప్పయ మహారాజు కాకపోయినను మహా రాజసంపత్తికలవాడు. మహారాజులకు సయితమాశ్రయుఁడని చెప్పుదగినవాఁడు. వాణిజ్యశాల యున్నంతమాత్రము చేత సతని కాస్థానమండపము లేదని చెప్పఁదగునా! ఇంక నతిశ యోక్తులందురా కవితానాసనగల ప్రతి వారును కొంచెమో గొప్పయో వీనియం దభిమానముగలవారే. తమరే తులు పన్నీయకున్న వానిని రాఁబట్టుకొన లేక దొరతనమువారి న్యాయ స్థానముల కెక్కి తగవు పరిష్కరింపుమని కోరెడీ జమీందారులను సయి అతనికి గొప్ప

తము మనుజపతులని వీరేశలింగమువంటివారే శ్లాఘించుచు వానిని మఱచి శ్రీనాథుని నధిక్షేపించుట నాకంత సరసముగాఁ గన్పట్ట లేదు. అవచి తిప్పయ సెట్టి పూర్వులు చాలఁ బ్రసిద్ధిగాంచిన వారైనట్లుగా నీక్రిందిపద్యములోఁ జెప్పీయున్నాడు.

సీ.కట్టించె నొక తాత కంచిహ్నర్మ్యంబులు
హరిణా కధూళిఫ్ కేకార్క
బాలార్క మనియెడి పద్మరాగముదాచె
నొక తాత కంచీ నాయకుని నాభి
నొక తాతఁ గట్టిం చె యోగిశ్రయ ధీర్ఘ
తరతటా కాంబోజ తరువకు
గావేరి గట్టించెఁ గార్పా సరాసుల
నుబ్బి రోడఁడు మెచ్చ నొక్క తాత

గీ.ప్రతిదినమ్ములగపు పు పములు వేయు
మతము గా నొక్క తాత యీశ్వరునికొసఁఘే
నిభలలోక ప్రసిద్ధ వాణిజ్య వంశ
ధరులు మా తాత లుభయగోత్రములవారు.

ఈతిప్పయ సెట్టియు వీనితమ్ములు తిరుమలనాధ సెట్టియుసు జామీ సెట్టియును నౌకాయాత్రలం చేయుచు విదేశములతో వ్యాపారముసేయుచుఁగడుఁ బ్రఖ్యాతిగాంచిన వారని హరవిలాస పీఠికలోని యీక్రింది పద్యముల వలనఁ దేటపడుచున్నది .

సీ. పంజాబు కర్పూర పాదపంబులు దెచ్చి
జలమోగి బంగారు మొలక దెచ్చి
సింహారంబున గంధ సింధురంబులు దెచ్చి
హరుమంజి బులు తేటి హరులు దెచ్చి
గోవసంశుద్ధ సంకుమదద్రవము దెచ్చి
యాపఁగ నాణిముత్యాలు తెచ్చి
చోటంగికిస్తూరిరు కాటంకములు దెచ్చి
చీని చీనాంబర శ్రేణి దెచ్చి

<గీ. జగద గోపాలరాయ వేశ్యాభుజంగా
పల్లవాదిత్య మాచాన పరశురామ
కుమారగిరి రాజదేవేంద్రకూర్మిహితుడు
జాలుజగజెట్టి దేవయశామి సెట్టి

గీ. తమ్ము లిద్దరు దనయాగ్నదలధరించి
యున్ని దీవులదెచ్చు లాభార్థ కోటి
యగ్దలరు దెచ్చి కీర్తి బేహారమాడు
నవచిత్త పురాంతకుడువంశాబ్ది విభుడు.


మ. తను తనికవాయి గోవ నమతాస్థానంబుల జందనా
గడకర్పూర హిమాంబు మా బు సంకుమరజ కస్తూరి కౌద్రవ్యముల్"
కధల నప్ప జోగులు వినిగా సామాన్ల దెప్పించునే
.........లోర్థముండవని తిప్పం డల్పుఁదే యిమ్ముహిన్ .

గీ, పండువాకిల్లి రాధా పట్టణముల -
యదిపతులుమౌలి దాల్చు రత్నాంపరంబు
లవచి త్రిపురాంతకానీత యాన పాత్ర
సింహళ ద్వీపమండల క్షేత్రజములు

పెదకోమటి వేమభూపొలుని యనంతరము రాచవేమారెడ్డి కొండవీటి రాజ్యమున కలిభిషిక్తుంక్తుఁడయ్యెను. ఇతఁడు పెదకోమటి వేమభూపాలుని పుత్రుడనియు, తండ్రి బ్రదికీ యున్న కాలముననే 1426 లో జగవొబ్బ గండకాలువను ద్రవ్వించి శాసనము వ్రాయించెననియింతకుబూర్వము తెలిసికొంటిమి, ఇతఁ డే సంవత్సరమున సింహా సనమెక్కేనో, ఏ సంవత్సరమున మరణముఁ జెందెనో సరిగాఁ జెప్పఁ జూలము కాని యితఁడు నాలుగుసంవత్సరములు పరిపాలనము చేసెనని కొండవీటిదండకవులే తెలుపుచున్నది. ఇతనికి రాచ వేమనయని పేరెట్లువచ్చేనో తెలిసికొనవలసి యున్నది. ఇతనికి తల్లి సూరాంబిక యని అమీనాబాదు శాసనమునలనను, యీ సూరాంబిక "శ్రీ ధాన్య వాటీ పురాధిపతియు, కృష్ణ వేణ్ణా జల క్రీడా వినోదుండు' నగు గన్న భూపాలు ననుఁగుఁబుత్రి ” అని ఫిరంగపుర శాసనమువలనను, వేద్యమగుచున్నది. ఈ గన్నభూపాలునింటి పేరు దంతులూరి వారు. వీని మూలపురుషుఁడు ధనంజయు గోత్రులైన (కోట) కేతరాజు 'మొదలగువారు కాకతీయ రాజులతోను, చందనోలు రాజులతోను సంబంధ బాంధవ్యములు గలిగి రాచవారని ప్రఖ్యాతి గాంచియున్నారు. వీరు మొదట చతుర్థ కుల సంపన్నులుగాఁ బరిగణింపఁబడినను రాను రాను రాచవారను నొక శాఖవారుగ నేర్పడిరి. అట్టికుటుంబములతో జేరిన వారొకరు డంతు లూరు నందుండుటచే వానింబట్టి దంతులూరివారను నింటి పేరు కలిగినది. దంతులూరి గన్న భూపాలుడు రాచవేమునకు మాతామహుఁడనియు, పెదకోమటి వేమభూపాలుని కాలమున ధాన్య వాటిపురా(ధరణికోట) ధిపతిగ నుండిన యొక సేనాని. ఇతఁడే శ్రీనాధ కవి వర్యునిచేధనంజయ విజయమను కావ్యమును గృతినొందెనను విషయము దంతులూరి బాపిరాజకవి ప్రణీతమైన మూర్తి త్రయోపాఖ్యానము సందలియీకింది పద్యము:నలనఁ దేటపడుచున్నది.


సీ. ఆహిత దుర్గాధ్యక్షు లందఱుధయమంద
గ్రీడి కైవడినిల్చెఁ దాడి నాడ
నక్షుద్ర దాన విద్యాక్షేత్రముల చేతఁ
బ్రతిమెవ్వడును లే ప్రతిభగాంచె
దనకీర్తిదశదిగంఅదగీయమానమై
కనుపట్టధర్మమార్గంబు నెఱపె
శ్రీ నాధసుకవీంద్రుచే ధనుంజయ విజ
యంబనుసత్కావ్యమంది వెలెసె
సృపతి మాత్రుడే నిజపాదనీర జాత
ఘటిత కోటీర వైరి భూ కాంత మాన
సాంతర భయాపహారి శ్రీదంలూరి
గన్న భూపాల మౌళిళ దోగ్గర్వశాలి"

దీనిని దెలిసికొని వీరేశలింగముగారు తమకవుల చరిత్రములో " నీక్రింది విధముగా శ్రీనాథుని నెత్తిపొడిచియున్నారు తరువాత శ్రీనామఁడు మైలారరెడ్డి మొదలయిన సామంతసంస్థాన ప్రభువులనుగూడ సందర్శించి యర్హ సంభాపనలు పొంది దేశ సంచారము ముగింపవలసిన వాఁడయ్యెను. ఈసంచారము ముగింపక ముందే శ్రీనాథుఁడు ధాన్యవాటీపురమున కోదారిలో కృష్ణ గోదావరీ ముఖ్యాంతర్వేది సీమకోపోయి యచ్చటి యప్పటి సంస్థానాధిపతియైన డంతులూరి గన్నన్నపాలునికడఁ గొంతకాలముండి యాతనికి ధనంజయ విజయమంకితము చేసినట్టు గనంబడుచున్నది." అని తమకలము యొక్క వాడిపోటును జూసినారు. శ్రీనాథునిపట్ల 'అర్హ సంభావన' శబ్దమును పలుమాఱు వినియోగించినను శ్రీనాథునకుఁ గలుగఁబోవు నవమానము గాన రాదు. కాని, సర్వజ్ఞసింగ భూపతి వంశీయులని చెప్పఁబడెడి శ్రీపీటికాపురాధీశ్వరునిచే నర్ఘ సంభావనలంబును పొంది,యనేక ముద్రణములను బొంది ముప్పది సంవత్సరములకుఁ బిమ్మట ఆంధ్రకవులచరిత్ర'మనువృద్ధకృతి కన్యను వారికి సంకితము చేసిన వీరేశలింగముగారికంటెఁ దనకాశ్రయుఁ డైన దంతలూరి గన్నభూపాలుచే సర్హ సంభావనలనుబొంది ధనంజయమును నూత్న కావ్యకన్యనంకితము చేసిన శ్రీనాథకవి సార్వభౌముఁడుధన్యుడనియే నాయభిప్రాయము. ఈదంతులూరి గన్నభూపాలుఁడు తనమనుమఁడయిన రాచవేమారెడ్డి "కాలమునగూడ ధాన్యపాటీపురాధి పతిగనుండియుండును. శ్రీనాథుఁడు కొంచీపురమునకుఁ బోవుటకుఁబూ ర్వము 1419 లోఁగాని 1420 లోఁగాని లేక కొంచీపురమున హరవిలాసము రచించి తిప్పయ సెట్టికి నంకితముచేసి తిరిగి కొండవీటికి వచ్చిన వెనుక 1423 లో గాని ధనంజయవిజయమును రచియించి గన్న భూపా లునకు నంకితముచేసియుండును. ఈధనంజయ విజయ మిప్పుడెచ్చటను గంటఁ బడకున్నది. శ్రీనాథకవి జీవితము యొక్క ప్రథమ ముద్రణగ్రంథ మునందు ఆ కాలమున ధాన్య పాటీపురము నేలుచుండినది, పెదకోమటి "వేమారెడ్డి మామగారగు గన్నా రెడ్డిగాని దంతులూరి. గన్న భూపతి కాడ నివ్రాసినది, సరికాదని యిటీవలఁ దెలిసికొన్న విషయములను బట్టి తెలిసి కొనుచున్నాను.

రాచవేమారెడ్డి. (1987-036)


ఇతని పరిపాలనము జనరంజకమైనదిగా గనుపట్టదు. ఎవరెన్నివిధములఁ దన రాజ్యమాక్రమించుకొనవలయునని ప్రయత్నించినను నితనితండ్రి పెద కోమటి వేముఁడు వారలను బరాజతుగావించి నై పుణ్యము మీఱ జనరంజకముగా ధరా పాలనము గావించెను. కొత్త సుంకములను వేయక పాతపద్ధతులనే బలపజీచి సుంకములు రాబట్టుచుండెను. ఆర్యమతమును పోషించి వేదాధ్యయస సంపన్నులను శాస్త్రవేత్తలను భూదానములు మొదలగు వానిచే సత్కరింపుచు సమస్త విద్యలను బోషించు చుండెను. దేశమున వర్తకవ్యాపొర మాభివృద్ధియగు మార్గములను వెదకుచుండెను. బావులు, చెఱువులు, కాలువలు తవ్వించి వ్యవసా యములకు మహోపకారములను గావించెను. అతని పరిపాలనము సర్వో త్కృష్టమైనదిగ నుండెను. ఇతని తరువాత రాజ్య భారమును వహించిన యీతని కుమారుఁడగు రాచవేమన తనదుష్ప్రవర్తనము చేతఁ దండ్రికి నపయశస్సుకలిగించుటయే గాక తుదకు రాజ్యమును ప్రాణయులనుగూడ గోల్పోయెను. కరాచవేమన తనపూర్వుల మార్గము:మునుగాని తనతండ్రి మార్గమునుగానీ యవలంబింపక తానొక కొత్త నూర్గ మవలంబి .చికొత్తపన్నులను విధించి ప్రజలను బాధింప మొదలకలు పెట్టెనని దండకవిలె తెలుపుచున్నది. రాచ వేమన ప్రజలపై పురిటి పన్ను విధించి యక్రమముగా రాఁబట్టుచుండె ననియు, తనభృత్యుడగు సౌరముఎల్లయ యను నొక బలిజ నాయకునిపై పురుటిపన్ను వేసి బలా త్కారముగావసూలు చేసినందున నాతఁడా గ్రహించి యొకనాడు ముత్యాలమ్మ నాతని కఠారితోఁ బొడిచిచంపెననియు: బైనండకవిలే నుడువుచున్నది.ఇతఁడు బతికియుండఁగనే కొండవీటి రాజ్యములో రెండువంతులు కర్ణా ట రాజ్యూదీశ్వరుఁడగు ప్రౌఢ దేవరాయనికి వశ్యమైపోయెను. ఇతని మరణ ముతో రాజ్యమాతనికి వశ్యమైపోయెను. ఏదియెట్టిదిగానున్నను. ఇతని పొలనము జనరంజకముగ లేదనియు, అత్యల్ప కాలములోనే యితనిపరిసా లనము తుదముట్టెననియుఁ జెప్పవచ్చును.


తెలుఁగురాయని సందర్శించుట

"పెడ కోమటి వేమభూపాలుడు 1460 దవ సంవత్సర ప్రాంతమున మరణముఁ జెందిన "వెనుక శ్రీనాథుఁడు రాచవేముని పరిపాలము ముగి యువఱకును కొండవీడునగరమున నుండి యాపిమ్మట ప్రౌఢ దేవరాయ నికీ సేనాధిపతులును సామంతులునైన తెలుగురాయనికడఁ గొంతకా లమును, పంట మైలార రెడ్డికడ కొంత కాలమును గడపెను. తెలుఁగురా యఁడు శ్రీమన్మహామండలేశ్వర మేదినిమీసరగండక శారిసాళువ రాయవిభాళమహా రాజు యొక్క కుమారుడైన శ్రీ మహామండలేశ్వర మేదిని మీసరగండకఠారిశాళువంశంబురా దేవ మహారాజు పుత్రుడైన 'తెలుఁగు రాయఁడు గాని మఱియొక తెలుఁగురాయఁడు గాఁడు. ఇతఁడు కొంత కాలము కృష్ణానదీ ముఖ ద్వారమునందున్న శ్రీకాకుళమున నున్నట్లు తెలియవచ్చునున్నది. తెలుఁగురాయని తండ్రియగు శంభు రాయఁడును, సాళ్వమంగు జయింపఁబడిన శంభురాయఁడును. వేట్వేఱుపురుషులని నేనాంధ్రుల చరిత్రములోని మూఁడవభాగమున నిట్లు వ్రాసియున్నాను.

"బుక్కరాయలకు దేవాయియను భార్యవలన మూవురుకుపుత్రు గలిగిరి. వారిలో జేష్ఠుఁ డైన కంపరాయలు తండ్రియాజ్ఞను శిరసా వహించి దక్షిణదిగ్విజయ యాత్రకు బయలు దేఱెను. ఈ దిగ్విజయయాత్రలో వైష్ణవము మతావలంబకుఁడైన గోపన్న మంత్రియును, సాళువమంగరాజును సైన్యాధిపతులుగనుండి తోడ్పడిరి. తండ్రి యజ్ఞానుసారముగా కంపభూపతి తుండీరమండలమును ద్రావిడ దేశమున కధిపతియైన రాజు నారాయణ సాంబువరాయలను (సోంపరాయలను) జయించుటకై ముందుగ ద్రావిడ దేశముపై డండ యాత్ర వెడలెకు. ఈ దండయాత్ర 1360- 65 సంవత్సకములలోజరిగియుండును. ఇతఁ డసంఖ్యాకముగు సైన్యములతో మొగిలి కసమ మార్గముగఁ బాలేరునది యొడ్డునున్న విరించిపురమునకు బోయి దండువిడిచెను. ఈసమాచారమును సాంప రా యలు విని పా లేరుకునదిని దాటి తన రాజ్యములోఁ బ్రవేశింపకుండ విశేష సైన్యములతో కప్పుకొని విరించిపురము కడ ఘోరయుద్ధమును సలిగానీ యాంధ్రకర్ణాటకులతో బోరాడఁ జాలక ద్రావిడసైన్యములు పలాయనముకాగాఁ సాంపరాయలును పలాయనుఁడై పడవీటి వైపునకు బాఱీపోయి స్వల్ప సైన్యములో రాజగంభీపర్వతమును శరణ్యముగా జేసికొని తగురక్షణ చేసికొనుచుండెను గాని విజయనగర సైన్యములు వెంటాడించి రాజగంభీర పర్వతమును (పడవీ సుదుర్గమునకు నామాంత రము) ముట్టడించినవి. రాజగంభీర సాంపరాయలను నాతఁడు శా. శ.1180

లో పరిపాలనము చేయుచున్న మూఁడవ రాజు రాజను చోళ

రాజునకు సామంతుఁడుగ నుండెను. అతని పేరిటనే పడవీడు దుర్గమునకు 'రాజగంభీరమల' యని నానుము గలిగినది. అతని వంశమునందే కంప భూపతితో సమకాలికుఁడగు రాజనారాయణ సాంబువరాయలు జనించి రాజగంభీజీ రాజ్యమును (తుండీరమండనమును లేక తొండైమండలమును), పరిపాలించుచుండెను. విజయనగర సైన్యములు పడవీదుర్గమును ముట్ట డించినప్పుడు మరలవారలకు భయంకరమైన యుద్ధము జరెగెను. ఈ యుద్ధములో సాంప రాయలు కంపభూపతిచేఁ జంపఁబడినటులు గంగా దేవి విరచితమైన మధురవిజయము లేక కంపరాయచరిత్రము వలనఁ దెలియు చున్నది. కాని సంస్కృత కావ్యము లగు రామాభ్యుదయము, సాళువా భ్యుదయము, ఆంధ్ర కాన్యములగు జైమినీభారతమును వరాహపురాణమును సాంప రాయలు పరాజితుఁడై వేడగా విజయనగర సైన్యాధిపతులలో నొక్కఁడగు సాశ్వమంగరాజు వానిని మరల సామ్రాజ్యమున

20 నిలిపి సొంప కాయస్థాపనాచార్య బిరుదమును గాంచెనని చెప్పబడియుం డుటచేత మధురవిజయములోఁ జెప్పినది యతిశ యోక్తిగా భావింపవలసి యున్నది. ఈసాంపరాయలే 'తెలుంగాధీశుని తండ్రియని జయప్తి రామ య్యగారును కొమఋజు లక్ముణరావు గారును నభిప్రాయులగుచున్నారు గాని తెలుగురాయల కుటుంబమువేఱు, ఈ రాజనారాయణసాంపరా యని కుటుంబము 'వేఱు. తెలుగు కాయుకు నీసాంప రాయలకు నేను బది సంవత్సరములు వ్యత్యాసము గలదు " ఈ తెలుఁగురాయని తండ్రి మేదినిమీసరగండకణారి సాళువబిరుదాంచితుఁడైన శంభు యఁడుగాని రాజనా రాయణ ఐకు జాంచితుఁడై న యాశంభు రాయఁడు గాఁడు. శ్రీనా థుఁడు తెలుఁగురాయని సందర్శించినప్పు డిట్లాశీర్వదించెనట!

శా. ధాటీఘోటకరత్న ఘట్టక మిళవ్రాఘిక ళ్యాణ ఘం
టాటం కార వీలుంగలుం తమహోన్మత్తా హితక్షోణి భృ
త్కోటిగాంకితకుంబినీధర సముత్కూటాటఝ్టటక
ర్ణాటాంధ్రాధిప సాంపరాయని తెలుంగా నీకు బ్రహ్మాయునౌ<poem>


ఈపద్యము తెలుఁగు రాయుఁ డశ్వారూఢుఁడై యుధోన్ముఖుఁడై దండయాత్ర, వెడలనున్న కాలమునఁజూచి చెప్పిన పద్యమైయున్నది. మఱియు నీతెలుఁగు రాయఁడు కవులకు కస్తూరి యొసఁగు చుండెడివాఁడట. అందుచే శ్రీనాథకవి యొకప్పుడీ క్రింది పద్యమును జెప్పెనని కొందఱు చెప్పవత్తురు,

అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ ! కస్తూరి కా
బిక్షా దానము చేయు రాసుకవి రాడ్బృందారక స్వామికిన్
దాక్షారామపురీ విహార వనగంధర్వాప్సరో భామినీ
పక్షోజద్వయ కుంభి కుంభముల వై నాసించుఁ దద్వాసనల్

,

ఈపద్యమేభావముతో నేకాలమున నేసందర్భమునఁ జెప్పఁ బడినదోయదార్ధమును గ్రహింపఁజాలక కవి హృదయమును బెలిసి కొన లేక ప్రభాకరశాస్త్రి గారు నల్లేరు పై బండిపఱువికినట్లు తమ విమర్శాఖడ్గమును తళత్తళలాడునట్లు మెజపించుచుఁ బదునైదశతాబ్దిలో 'విశ్వకీర్తి సూక్తికర్సూరములు దిశాంగణముల కుందు నెగ చల్లినట్టి శ్రీనాథ కవిసార్వభౌముని యశస్సును చించి చెండాడుటకై పఱు విడునట్టి సాహసము భరింపరానిదిగ నున్నది.

శ్రీనాధుడికి వైషయికక వాంఛలత్యున్నతములఁట, భోగపరాయణత మొండఁట. ప్రౌఢ నిర్భకనయ, పరీవాక కాలమగుటచే నాతడప్పుడు శృంగార సముద్రమునఁ దెప్ప దేలు చున్నాడట. దాక్షారామాస్సరో రామల యొడళ్ళపయి బుగబుగలొల్పుట కని తెలుంగురాయని కస్తూరి కోరినాఁడఁట. ఇయ్యవి ప్రభాకర శాస్త్రి గారు తమ నేతి బీర' లోఁ జొప్పిన సభావములు. ఇట్టి భావములు లోకజ్ఞాన మెరుంగని శుద్ధి ఛాందసులు వెల్వరంపవలసిన భౌవములు గాని ప్రభాకరశాస్త్రీగారివంటి కోవిదుడు శృంగార రసాస్వాదన తత్పరుండయిన సరసకవి శిఖామణి నెల్వరింపనలసిన భావములు గావు. ఈపద్యము రచింపఁబడుటకుఁ గల కారణమిద్ధి. పాపము. ప్రభాకరశాస్త్రిగారు పై పద్యములోని సుకనిగాడ్బృందారక స్వామికిన్ " అనఁగా శ్రీనాథునికని యర్ధముఁ జేసికొనిరి.అందువలన శ్రీనాథుని కొంపకుఁ జిచ్చు పెట్టుట సంభవించెను. ఆ సమాసపదమునకు శివుఁడని యర్థము. ఇచ్చట దాక్షారామ భీమేశ్వర స్వామికవి భావము. తెలుఁగురాయఁడు దాక్షా రామ భీమేశ్వర స్వామిని సందర్శింపఁగోరి వచ్చినప్పుడు భీమేశ్వరస్వామివారి సన్నిధానమున శ్రీనాధకవిగానిండు, మఱియొక కవిగానిండు భీమేశ్వరస్వామివారికిఁ గస్తూరిబాసము చేయవలసినదని హెచ్చరించిన పద్యముగాని మఱియొండు గాదు. కవిచమత్కరించి చెప్పినాఁడు. ఆకాలమునఁ బ్రభుపుంగవులుగాని, సామాన్య గృహస్థులుగానీ సుగంధి దవ్యములను స్వామివారికి గాన్కగా నొసంగు నోకయాచారము గలదు. అయ్యది చిరకాలము నుండి జరుగుచుండెను. అట్టి సుగంధి ద్రవ్యములలోఁ గస్తూరిమిగుల విలువ గలడి. అయ్యది ప్రభుపుంగవులకుగాని సాధ్యపడునది కాదు. ప్రభువులు దానము చేసెడు కస్తూరిని దేవస్థానమునకు సేవఁ జేయునట్టి దేవదాసీలు కొంతభాగమును గైకొని తమవక్షస్థలములందు రాచుకొనుచుందురు. ఇట్టివగుట చేతనే తెలుఁగు రాయఁకు ద్రాక్షారామభీమేశ్వరసన్నిధాన ముననున్నప్పుడు కని కస్తూరిని వేడుచు చెప్పిన పద్యమము యున్నది. .. ఈ పద్యము శ్రీ నాధుని దేయని చెప్పుటకు వారొక హేతువును జూపిరి. ఇటువంటి పద్యమే 'క్ష' ప్రాసముతో నున్న దొకటి కాశీ ఖండ మున గలదని చెప్పి, వాపద్యము సుదాహరింపక పోయినను నేను దాని నిట సుదాహరించుచున్నాఁడు.


శా. ఈ క్షోణిన్నిమ బోలు సత్కవులు లేరే నేటి కాలంబునన్
చాక్షారామచాళుక్య భీమువగ గంధర్వాప్పలీ భామినీ
వక్షోజప్పయగంధ పారముసృణ ద్వైరాజ్య భావంబున
ధ్యక్షించున్" గవిసార్వభౌమ భవదీయ పౌన సాహిత్యముల్ "


ఈపద్యమే ప్రభాకరశాస్త్రి గారిని పెడమార్గముఁ బట్టించినది. ఈపద్య ముయొక్క. భావమును దెలిసికొనవలెనన్న నాకాలమునాటి దర్బారుల తీరు పెట్టివో, ప్రభుచిత్తవృత్తులెట్టివో, ప్రజలమర్యాద లెట్టివో, యాచా రములలోను, నడవళ్లలోను నేవి దూష్యములో నేవి దూష్యములుగావో కవిసంప్రదాయము లెట్టివో, కనులపోకడ లెట్టివో, దేవదాసీప్రతిష్టాపన మెట్టిదో దీని నెల్ల నవగాహనముఁ జేసికోన్న మీదట సాధ్యపడును గాని స్థూలదృష్టితో జూచువారికి బోధపడదు. కవి హృదయమును గ్రహీం చినఁగాని న్యాఖ్యలపహాస్య భాజనము లగును. ఈపద్యము వీరభదా రెడ్డి త్రైలోక్య విజయాభడం బైన సౌధములోఁ జంద్ర శాలాప్రదేశంబునందు, సచిన సెన్యా ధీశ సామంతనృప వారసీమంతిణీ జనజన శ్రేణిగొలువ, శాస్త్ర మీమాంసయు,సాహిహిత్యగోష్టియు విద్వాంసులు విస్తరింపుచుండ కర్పూరకస్తూరికా సంకుమన గంథ సార సౌరభము దిక్పూరిత మగుచు నుండ, నిజభుజావిక్రముంబున నిఖిలదీశలు గెలిచి తన్ను రాజ్యపీటమె క్కించినట్టి యన్న వే మేస్వేశ్వరుని యంకమాళయించి, విముధర్మశీలుం డగు వీరభద్రభూపాలులకు గన్నులపండువుగా నిండుగొలువుండు వేళ సల్లాక వేమవిభుఁడు శ్రీనాధకవి సార్వభౌమునికప్పించి పలికి నట్లుగా గాశీఖండ మునఁ జెప్పుఁబడిన పద్యమిది. శాస్త్రి గారు తలుచినట్టులు ద్రాక్షారామస్సరోరాయల యదల్లపై బుగబుగలొల్పుట కీచ్చట కస్తూరి కాదు. ఇక్కడవ క్కాణింపఁబడినది ప్రౌఢసాహిత్యము. దీనిన: దాహరింపక నీపద్యము పై తమభావమేమో దెలుపక బడబడ తిట్టి వేయుట సవ్విమర్శకులక్షణము కాదు. అందువిషయమైన చర్చరాబోవు ప్రకరణములలో విస్తరింపఁబడును గావున నిప్పటికిచ్చట విరమించెదను.

పంటమైలార రెడ్డిని సందర్శించుట

శ్రీనాథకవి కొంతకాలము పంట మైలార రెడ్డితో మైత్రిగలిగి యాతనివలన సత్కారములను బొందుచుండెనని చెప్పుదురు. శ్రీనాధుని దిన వెచ్చము నంతయు నాకాలమున నాతఁడు భరించుచుండెనట. ఇతఁడు ప్రౌఢ దేవరాయని విశ్వాసమునకఁ బాత్రు లైన వారిలో నొక్కఁడు, ఇత డతిపరాక్రమవంతుఁడు. తురుష్కులతోడను, గజపతులతోడను, జరిగిన యుద్ధములలో రాయలకు విజయమునుసంఘటింపఁ జేయుచుండెను. ఇతఁడు సూరారెడ్డి మునిమనుమఁడును, పోతిరెడ్డి మనుముడును, ముమ్మడీంద్రు నకు ముమామ్మయందుజనించిన పుత్రుఁడు నయియుండెను: ఇతనికీ థరణీ వరాహుఁడు, చౌహుత మల్లుఁడునను బిరుదములుగలవు. ఇతని వీరఘంట ధ్వనివినంబడినతోడనే శత్రు రాజులగుం డెలదరుచుండునట. ఈమహా పరాక్రమ వంతుఁడైన మైలారవిభుఁడు తసకొనఁగూర్చిన జయములకు సంతోపించినవాఁడై యొకనాఁడు ప్రౌఢ దేవరాయల వారు మైలారువిభునిరప్పించి నీవేమికోరెదవో కోరుమన నుడివెనట. అందులకాతఁడు వినమృడగుచుదేవరా! నాకు నగలు నాణెములక్కర లేదు. ధనమక్కరలేదుగజాస్వాందోలికాది వాహనము లక్కర లేదు. ఎవ్వరి హృదయ సీమలందు మహేశ్వరుడు మొదలగు దైవతములు నివసించు చున్నారో, వేద వేదాంగములు నివసించుచున్నవో ఎవరు మత సంరక్షణాభివృద్ధికై ఏర్పడినారో అట్టి బాహ్మణోత్తములకు నొకచక్కని గ్రామమును దానము చేయవలసినదిగా నా ప్రార్ధన మని వేడుకొనెయెనట, అప్పుడాతని కోరిక మన్నించి శా. శ. 1351 కీలక నామసంవత్సర మాఘమాసములో భాస్కర క్షేత్రమున హేమకూటమున నివసించు వీరూపాక్ష దేవుని సన్నిధిని పూగినాటి సీమలో గుండకమ్మనది యొడ్డున నుండు పోలసరమనుగ్రామమునకు చేజెర్ల యని పేరు పెట్టి బ్రాహ్మణులకు దానము చేసెనట.


రాజమహేంద్రపుర రాజ్యము

అల్లాడ భూపతీ.

కాటయ వేమభూపాలుఁడు స్వర్గస్థుడయిన పిమ్మట నతనిబంధ వుడు సైన్యాధ్యక్షుఁడు నగు అల్లాడ రెడ్డి రాజమహేంద్ర పుర రాజ్యము సౌక్రమించుకొని పరిపాలనము చేయనారంభించెను. ఇతఁడు క్రీ.శ.1416 మొదలుకొని 1426 సంవత్సరాంతము వఱకుఁ బరిపాలనము చేసెను. అల్లాడభూపతి రాజమహేంద్రపుర రాజ్యము పరిపాలనము చేయు నట్లు శ్రీనాథకవి విరచితములయిన భీమేశ్వర పురాణము, కాశీ ఖండమ వలననేగాక అల్లాడ వేమారెడ్డి శాసనమువలన సువ్యక్తమగుచున్నది కాటయవేమభూపాలుఁడు కాల ధర్మము నొందిన వెనుక బెడకోమటి వేమభూపాలుఁడు రాజమహేంద్రపుర రాజ్య మాక్రమించుటకై రాగా నల్లాడభూపతి రామేశ్వరముకడ వాని నెదుర్కొని యుద్ధము జేసి కోమటి వేముని సైన్యముల హతము గాగించి యోడించెననియు సల్లాడ రెడ్డి శాసనమువలన స్పష్టమగుచున్నది.*[1] నిశ్శంక కొమ్మనామాత్మ పంచమాధ్యాయము విరచితమై అల్లాడదొడ్డాభూపాలున కంకిత మియఁబడిన శివలీలావిలా సమున "పెద్దకోమటివేమపృధివీశు వెనుసొచ్చి యతనిసంపదలెల్ల సప హరించె, నని వ్రాయఁబడియుండెకు. అల్లాడభూపతి కాటయ వేముని శత్రువునువినాశముగాపించెనని పలివెల శాసనమున వక్కాణి పఁబడినది. కాటయ వేమునికి శత్రువు. పెదకోమటి వేముఁడముడనుట నిశ్చయము, కాటయ వేమునికి గాటయ కుమారగిరియని యిరువుకు కొమాళ్లుగలరని యెఱుంగుడుము, కాటయ వేమున కిరువురు పుత్రులుండఁగా నల్లాడభూపతి రాజమహేండ్ర వపుర రాజ్యమును నశ్యముఁ జేసి తానే రాజు నెట్లుపరి పాలించెను? 'కాటయ వేమారెడ్డిని అల్లాడ రెడ్డికినిఁ బూర్వపు బాంధవ్యమె గాక కాటయ వేముఁడు తనకు దొడ్డాంబిక యందు జనియించిన 'అనితల్లి' యను కొమార్తెను అల్లాడ రెడ్డికి వేమాంబిక వలనఁ బుట్టిన నల్వురు కొమాళ్లలోను 'రెండవవాఁడయిన వీరభద్రాఅ రెడ్డికిచ్చి వివాహముఁ గావిం చెను*.[2] కోరుమిల్లి శాసనములో నునాహరింపఁబడిన కాటయ కాటయ వేముని పుత్రుడగునోకాడో సందిగ్ధవిషయముగానున్నది. కానీ కాట వేముని ప్రథమభార్య యగుమల్లాంబికకు 'కుమారగిరి' యను పుత్రుఁడుగలఁడు. కెండవ భార్యయగు దొడ్డాంబిక కూతురనితల్లి అల్లాడ రెడ్డికోడలు. కోడలిపక్షమువహించి శత్రువుల నుజయించి రాజ్యము నాక్ర మించుకొని పదిసంవత్సరములు స్వతంత్రపరిపాలనము చేసినను రాజ్యము కోడలి దేయని మనమూహింపవచ్చును. ఇతఁడు కర్ణాటగజపతి భూపతు లతోడ సఖ్యము వహించియుండెను. ఇతనివంశము నాలుగవజాతివంశ ముఁ గాశీఖండమున నీ క్రింది పద్యములలో వర్ణింపఁబడినది.


కలగర కన్య కాక రిపల్లవ ద్వయా
సంనాహత కనూ సముచితంబు
నిఖిల పేదాంత వాణీవధమ్మిల్ల
బహుళ పుష్పామోద ఛాదితంబు
ప్రణుత నానాసుపర్వకిరీట సంఘాత
రత్నాఁశు నీరాజీ రాజితంబు
సనకాది సమ్మ నీశ్వర మనోమంట పొ
భ్యంతర రత్న దీపాంకుశంబు
సతర కేతను శ్రీపాద పంక జంబు
గారణంబుఁగ జన్మించె భూరిమహిమ
గంగపయిరోడుయికోడు రిపుకోటి గళము త్రాడు
నాలుగవజాతి సమధికోన్నత విభూతి.

ఇట్టి నాలుగవ వర్ణంబున పెరుమాణి రెడ్డి పుట్టె ననియు నాతని వంశము నల్లాడరెడ్డి జనించెననియుఁ జెప్పఁబడియెను. ఇట్లు కాశీఖండమున నీతని వంశము నాలుగవవర్ణము వర్ణించియుండ నిశ్శంక కొమ్మ

 మ. ఘ్గనుతుల్యుం డగుఁ గాట భూపాలుని వేరుక్ష్మాతలాధీశుసం-
దనబాణీగ్రహనంబు చేసి ప్రియమొందన్ వీరభద్రేశ్వరు
డనితల్లి ంవినతామతల్లి నుదయస్తాంద్ర సీమావనీ
ఘనసాంరాజ్య సముర్థ సుప్రధితపాక్షాడిందిరాదేవతన్

(కశీఖండము) నామాత్యుడు, తన శివరీలావిలాసము నుందు నితని కుమారుఁ డైన భద్రారెడ్డి ని వర్ణించు సందర్బమున శ్రేష్టమయిన సూర్యవంశములుగా నీక్రింది పక్యములో సభివర్ణి౦చి యున్నాడు.


చ. వనమలాప్తవంశమున వర్ణన గాంచి పంచుమో మార్గతా
దనమున మించిశాంభవకథా ఫణితో ముదిగుచ్చి యుల్లన
ద్భుతమత స్రచక్తళ్క మనంబున వహించి రజతునిలుపు స్వా
పురుదుగగ రామభద్రుఁడును " పాలకువీరభద్రుండున్ :


ఇతనికిఁ గొండవీటి సామ్రాజ్యాధిపతి యగు అనవేమారెడ్డి పౌత్రి దౌహిత్రి - (పుత్ర్యాపుత్రియని యర్థము ! గ్రహింపవలయును. )యగు వేమాంబామహా దేవివలన వేనూ రెడ్డి, వీరభద్రా-డ్డి, దొడ్డా రెడ్డి, అన్నా రెడ్డి, అన నల్వురు పుత్రులుదయించిరని కాశీఖండమున శ్రీనాథుఁడు వక్కాణించినాఁడు. నిశ్శంక కొమ్మనామాత్యుఁడు తన శివ లీలా విలాసము నందు;-


మ. భక్త శ్రీనిధి యమ్ము హీర మణుఁ డొప్పన్ శోభభక్తిక్షితీ
శ్వర నూనుం డగు భీమలింగ మును జేశ శ్రేష్ఠు సత్పుతి భా
స్వం కారుణ్య దళాజునా వవిధాసం ఖాతాలో వేమాంబికన్
వరియించెం బతిభక్తి గౌర వచృష్ణ వ్యాపార నిత్యాంబిక •

అనియు, మఱియుం గోరుమిల్లి శాసనమున (గరకు),

శ్లో. శచీన శక్తస్య శ్రీ వేవశంభో ! పద్మేవసాపద్మ విలోచన స్య వేమాంబికా చోళకు లేందు భీమభూపాత్మజా చూస్మహిళాశ్యజాగూ శ్రీ నేమభూమీశ్వర వీర భధ్రభూ నాథ దొడ్డగీతి పొన్న భూపో? అల్లాడ శాకర భవన్కుమారా స్తస్యా యథాపం కి కథస్యపుత్రా

అనియు, వేమాంబికా దేవి భక్తీశ్వరచోడుని కుళూరుఁ డగు భీమ భూపాలుని పుత్రియనియుఁ జెప్పుటవలన సూర్యవంశ క్షత్రియుందయిన భీమలింగచోడుఁ డన వేమారెడ్డి యల్లుఁడని థృవపడుచున్నది. పదు నేనవ శతాబ్ద ప్రారంభమునఁ గూడఁ గొండవీను, , ద్రపురముఁ బౌలించిన రెడ్లకును రాచవారికిని సంబంధ బాంధవ్యములు కలవని పదృష్టాంతములు చాటుచున్నవి.

లింగనామాత్యుడు

కాశ్యపగోత్రసంజాతుఁడగు బెండపూడి దేవనమంత్రిపుత్త్రు డగు లింగనామాత్యుఁడు అల్లాడ భూపాలునకుఁ బ్రధానను, మంత్రిగనుండెను. ఇతఁడు పరాళమవిజృంభితుఁడగు శూరశిఖామణియు, రాజ్యాంగ వేత్తయు, నగుటవలన నాకాలమునఁ గడు, బ్రఖ్యాతి గాంచి తన ప్రభు వర్యునకు సమరయముల సమకూర్చుచువచ్చెను. అట్టి సమరవిజయ ములను బెక్కింటిని బేర్కొనుచు నీ క్రిందిపద్యమున నిట్లభివర్ణింపఁబడి యుండెను.

సీ. ఝూడేనవసప్తమాడెవనస చారుహదొంతి
పంతు నాటిక్షిరీశ్వరౌల గెలచి
యెడ్డాదిస్త్య వంశోదయార్జును చేతఁ
బల్లహధిపు చేతఁ ఖలవ మంది
దండకారణ్యమధ్య పుళిందరాజు రం
బాహిత వంశజులకు సభయ మొసంగి
భానుమత్కు ల బీరభద్రాన్న దేవేంద్ర
గర్వసంరంభంజు కొట్టి పెట్టి

గీ. యవన కర్ణాటకటక భూధవులతోడ
జెలిమిపాటించి యేలించే దెలుఁగుభూమి
దన నిజస్వామీ నల్లాడ భరణి నాథు
బళిరా యదియేటి లింగన ప్రభువరుండు,

ఈ పై పద్యము నందుఁ బేర్కొనఁబడిన రాజ్యము లన్నియును, విశాఖ

పట్టణమ, గంజాము మండలములలోనివియు,జయపురము, బిస్తరుంస్థానములలో నివియుఁ గావున ఆంగనామాత్యుఁడు వీనినన్ని టిని జయించి తురుష్క, కర్ణాట, కటక రాజులతో మైత్రీ పాటించి యల్లాడూపతి చేతఁ దెలుఁగుభూమి నేలించాను. మరియు నీతని ప్రతిభా విశేష

పంచమాధ్యాయము163


మును శ్రీనాథుఁడిట్లభివర్ణించియున్నాఁడు.


సీ. వాహ్యాళి భూమి రేవంత నైషధులట్లు
హయరత్నముల నెక్కి యాడవచ్చు
విభుద శ్రేణికిం జెపులు పండువులుగా
నాస్థానమున మాటలాడ నేర్చు
శక్తి త్రయంబున జురు కషాయంబుల
పౌడ్గుణ్యణ్యముల బుద్ధి - పరుప నేచ్చు -
గైనేనీ ప్రత్యక్ష కందర్ప మూర్తి యై
నిర్వికారంబున నిలువ నేర్చు

తే. నిష్ఠురాలోప విస్ఫూర్తి నృహళిక వేణి
నతికనకోరమగాదకురాంచలమున
వైరివక్షస్తల వ్రచ్చవైప నేర్చు
సంగ రార్జునుఁ డ యేటి లింగ విభుఁడు.

ఈలింగనామాత్మ్యనకుఁ భీమ్మట వీని రెండవతమ్ముఁడయిన అన్నామాత్యుఁడు వీరభద్ర వేమ పృధ్వీధవులకుఁ బ్రధానమంత్రియై, తద్రాజ్యూభివృద్ధి కారుఁడై అసదృశమగు కీర్తి సంపాదించెను. భీమేశ్వర పురాణమున;---

సీ. ఏ ముంత్రికుల దైవ మిందు శేఖకుడు ద
క్షారామ భీమేశుఁ డఖిలకర్త
యేమంత్రి యేలిక యక్ష్వాకుమా ధాతృ
రామసన్ని భుఁ డైన నేమనృపతి
యేమంత్రీ విళకీర్తి యేడం వాదానంలు
కడ కొండ యవుల చీకటికి కొంగ
యేముంత్రీ సౌభాగ్యమిదురుఁ 'గైదుపనోడు
లాశిత్య లీలకు మేలు బంతి
యతఁడు కర్ణాటలాట లోటాంగ సంగ
కురుడుకురుడంత లావంత ఘూర్జరాది
నృపసభా స్థాన బుధ వర్ణనీయ సుగుణ
మండనుడు బెండపూడన్న మంత్రివరుడు,

శ్రీనాథకవి

164


అని వర్ణింపబడి యున్నాడు. భీమేశ్వరపురాణము రచించు నాటికీ వీరభద్ర వేమపృధ్వశ్వరుల రాజ్యము సింహాద్రి పర్యంతము మాత్రమె వ్యాపించి యుండినను కాశీ ఖండము రచించునాటికి చిల్క సముద్రము వఱకు వ్యాపించినట్టు గన్పట్టుచున్నది.అన్నా మాత్యుఁడు బహుభాషల నేర్చి రాజస్తానమునకు వివిధ దేశములనుండి యే తెంచిన రాయ బారులతో వారివారి భాషలతోనే ప్రసంగములు సలుపుచుండు సనియు, పారసిభాష చక్కగ వాయునట్టి వ్రాయస కాడనియు, బహమనీసుల్తా నగుఅహమదుపాతో నుత్తర ప్రత్యుత్తరములు జగుపు చుండు వాడనియు, శ్రీనాథకవివ రేణ్యుఁడీ క్రింది పద్యములలోఁ జెప్పి వర్ణించియున్నాడు.

</ఆరబీభాష, తురుష్క భాష, గజకర్ణాటాంధ్ర గాంధార ఘూ
ర్జర భాషల్" మళయాళ భాష కక భాషా సిందుధు సౌవీర బ
క్బర భాషల్ క హాటభాష మఱియుం భాషావి శేషంబు ల
చ్చేరు వైవచ్చున రేటియన్న నికి గోష్టీ సంప్రయోగంబులన్".

ఉ. అన్నయమంత్రి శేఖకుఁర డహమ్మదు శాసనదానభూమి భృ
త్సన్నిధికి స్మడిస్సముగ వేమ మహిమహసురేంద్ర రా
జ్యోన్నతి సంతతాభ్యుదయ మొందగల పౌరసీ భాష, వాసినం
గన్నులపండువై యనుగు గాకితమందలి వర్ణ పద్ధతుల్ •


శ్రీనాథకవి రాక.

పెదకోమటి వేమభూపాలుడు స్వర్గస్థుఁడయిన వెనుక సకలవిద్యా సనాథుఁడగు శ్రీనాధుఁడు కర్ణాట సామాజ్య సార్వభౌముఁ డగు ప్రౌఢ దేవరాయనికి సామంత సృపతులుగనున్న తెలుఁగురాయనికడఁ గొంత కొలమును, పంటమైలారు విభునికడఁ గొంత కాలమునుగడపి రాజమ హేంద్ర పుర రాజ్యము ప్రవర్ధమానముగ సుండుటయు, తనకు మిత్రు డును బాంధవుఁడు నగు బెండపూడి అన్నామాత్యుఁడు వేమవీరభద్ర పృధ్వీశ్వరులకు మంత్రియై, పండిత పక్ష పాతియై, విద్యాభిమానియై,

పంచమాధ్యాయము

విఖ్యాతి గాంచుచుండుట దలపోసి తనకర్హసత్కారము లారాజ్యమునఁ గలుగఁ గలవని యూహించి రాజమహేద్రపురమునకు విచ్చేసెను. రాజమహేంద్రపుర విద్వజ్జనము తోడి ప్రఛమసమావేశ మంత యుత్సాహకరమైనదిగ శ్రీనాథునకు గన్పట్టలేదు. రాజస్తానమున నీతనిబ్రవేశము గల్గిన దమయాధిక్యతకు కెక్కడ న్యూనతవచ్చునోయని పెక్కంక్కండ్రు పండితులు భయకుడుచుండిరి. అయినను అన్న మంత్రి యొక్క నాఁడు విద్వజ్జనపరివేష్ఠితుడై కొలువుకూటము నుండి తన్ను తప్పించిన విధము నీవిధముగా వర్ణించి యున్నాడు.

సీ. బొట్ట సభాకస్థాన ఏం జేద్య
లుద్దండపొండిత్య లొక్కవంక
ఫణి పభాషిత భోకి వాన
లుత్తమ పొగల్యు ఇక్కవంక
భుమ్మిత గ్రంథ గాధా విముల బా
హుశ్రుక్య సంపన్ను మొక్కవ్వక
వేదాంత పాప నావి కొంత హృషయజు
లుపనిషత్తు జు కొక్క వరకు

తే. సుభయభాషాకవీశ్వరు కొక్క వంక
వేశ్యలొక వంక నోకవంక వీర భటులు
నిలసికొలు వంగఁ గొలువుండి పిలువంబుపై
బెండపూడన్న మంత్రీశ్వరుండ సన్ను .

అట్లు విద్వజ్జన మహజ్జనులచే నలంకరింపఁబడిన యాస్థానమంటపమునకు సకలవిద్యాసనాథుడగు శ్రీనాథుని రప్పించి సముచితాసనమునఁ గూర్చుండ జేసి యమంత్రిపుంగవుఁడు గంభీరధీర సంభాషణములతోడ నామహాకవి నిట్లు ప్రార్థించేను.


<poem>సీ. వినుపించి నాఁడవు వేమభూపాలున కఖిలపురాణ విద్యాగమములు కల్పించినాడవు "గాఢ పాకంబైన

హర్ష నైషధ కావ్య మాంధ్రభాష

శ్రీనాథకవి


భాషించి నాఁడవు బహుదేశ బుదులతో
విద్యాపరీక్షణ వేళయందు
వెదజల్లినాడవు విశద కీర్తి స్పూర్తి
కర్నూరములు దిశాంగణము లందు
బాకనాటీంటి వాడవు బాంధవుఁడవు
కమలనాభుని మనుమడ విమలమతవి
నాకుఁ గృపసేయు నొక ప్రబంధంబు నీవు
వినుతతగుణగణ్య శ్రీనాథః కవివ రేణ్య.

మ. అరవిందాప్తకృతి ప్రతిష్టుడగుదాక్షారాభీమేశ్వరే
శ్వరు మహాత్మ్యముతోడఁ గూడి భువనశ్లాఘాశ్లాఘాస్పదం బైయభం
గుంమైస్కాంద పురాణ సార మగు శ్రీగోదావఖండమున్
బరిపాటిన్ రచియింపు మంధ్ర జగతీ భాషా పంబంధంబుగన్

అనిపలికిన బహుమానంబుగాఁ గర్పూర తాంబూల జాంబూన దాంబర భరణంబులొసఁగి వీడుకోల్చెసు. అంతటఁ బుడితులును గవు లును ఈర్ష్యాళువులై ప్రవర్తించినట్లు గన్పట్టుచున్నది. పండితమ్మన్యు లును గుకవులు నగువారు గొందఱు శ్రీనాధుని కవిత్వమాంధ్రకవిత్వము గాదనియు భాషకర్ణాట భాషయనియు, వెర్రి మొర్రియాక్షేపణలు చేయ నారంభించిరి. శ్రీనాధుఁడు సకలవిద్యాసనాధుఁడని యెఱుంగక శాస్త్ర పండితు లనేకులు వివాదములు పెట్టుకొని యెట్టులయిననీతని వంచించిసాగ సంపవలయునని ప్రయత్నించిరిగాని తుదకు శ్రీనాధుఁడే విజయమునొంది రాజమహేంద పురమునఁ గాశీ ఖండ రచనము నాటికీ బాదుకొని పురంబునకుఁ బ్రాత కాపయ్యెను. ఇతఁడు పండితులను గుకవులను నీరా కరించి చెప్పిన పద్యములను నీగంథము మొదట నుదాహరించి యు యావిధము గోంత చవిచూచి యున్నాఁడను,

భీమఖండము రచించిన కాలము క్రీ. శ.1425 వ సంవత్సరము నకు దరువాత నే అనఁగా 1430 ప్రాంతములనయి యుండునని యీ క్రింది విషయములు ధృవపజచుచున్నది. అన్న మాత్యుని, సత్కా

ర్యములఁ గొన్ని టిని శ్రీ నాధుఁడు తన భీమేశ్వర పురాణమున నీకింది పద్యములో వివరించియున్నాడు.\


సీ. రాజమహేంద్రదుర్గమున గావించెశ్రీ
వీరభద్రునకు బ్రాకారరేఖ
నిలిపె మాక్కండేయ నీలకఠుని మ్రోల
నా మేశుం నమతల్లి నామకము,
సంగా మేశ్వరదివ్యశంభులింగమునకు
గల్పించెగళ్యాణ గర్బ గృహము
దక్ష వాటికియందు దరుణేందు మౌళికి
మొగలివాకిట దామమును చించెచే

.
గీ.పాగ్ది శాపవస్త్ర గోపుర ప్రాంగణమున
సప్త మునిసింధుసోపాన స కెలగ
దిన్చెభవనంబు భీమయదేణంగడ
మంత్రదేవయ యన్న భూమాత్యువరుడు,

- పైధర్మకార్యములలో నొక్కటగు భనవనిర్మాణ ధర్మకార్యమును గూర్చినశాసన మొకటి దాక్షారామభీమేశ్వరుని యాలయమునఁ గానం బకుచున్నది.[3]* ఈశాసనము శా. శ.1350 అనగా క్రీ.శ.

1428 వ సంవత్సరమున లిఖింపబడినది. కావున నీధర్మకార్యములు భీమఖండములో నుదాహరింపఁబడినవి కావున నాగ్రంథము కాలమునకు తరువాతనే రచియింపఁబడినదన స్పష్టము.


శ్రీ నాథుని కనకాభి షేకము.

పెదకోమటి వేమభూపాలుని యనంతర మైదారుసంవత్సరము కాలము తెలుఁగు రాయఁడు, మైలార రెడ్డి మొదలగు వారలకడఁ గాల మును గడపి పిమ్మట నీతఁడు కర్ణాట రాజధానికి బోయెనని కొందరు చెప్పుదురు. "నేనాధ్రుల చరిత్రములో దేవరాయమహా రాయలు కర్ణాట సామాజ్యాధిపత్యము వహించియున్న కాలమున శ్రీనాథ మహాకవి 'పెదకోమటి వేమభూపాలునికడ విద్యాధి కారిగ నుండియుఁ గర్ణాటరాజ ధానియగు విద్యానగర మను నామాంతరముగల విజయనగరమును జూడఁబోయేను. కర్ణాటసింహాసనాధ్యక్షుఁ డగు దేవరాయ లీయఖండ పండితుని సన్మానించి నివాసస్థలం బెయ్యది యని ప్రశ్నింపఁగా నీత "డీక్రిందిపద్యమును జదివెనఁట.."


సీ. పగరాజగిరి దుర్గవర వై భవశ్రీల
గొనకోని చెడ నాడుకోండవీడు
పరిపంది రాజన్య బలములబంధించి
కొమరుమించిన బోడుకొండవీడు
ముగురు రాజులకును 'మోహంబుఁ బుట్టించు
గుఱుతైన యురితాడు కొండవీడు
చటులవి క్రమకళా సాహసంబొనరించు
కుటీలాత్ములకు గాడు కొండవీడు

గీ. జనన ఘోటక సామంత సరసవీక
భటనటా నేక హాటక ప్రకటగంధ
సింధుగా రావ మోహన శ్రీలఁదనము
కూర్మి నమరావతికి జోడు కొండవీడు,

అని వాసీయున్నాడ. పెదకోమటి వేమవిభుని ,మరణానంతరము హరవిలాసము వ్రాసి అప్పయ పెట్టి కంకితము చేసినది వాస్తవముగాన శ్రీనాధుఁము -ప్రౌడ దేవరాయని యాస్థానమునకుఁ బోయినది గోమటి వేమభూపాలుని కాలమునఁగాదని చెప్పవలసియుండును. హర విలాసము లక్ష్మణ రావు గారు చెప్పినట్లు కుమారగిరి రెడ్డి కాలమునఁగాని, మరికొందరు చెప్పినట్లు కాళీఖండ రచనానంతరమున గాని రచింపఁబడి యుండుట వాస్త వమయ్యె నేని శ్రీ నాథునకు పెదకోమటి వేమభూ పొలుని కాలముననే చూడఁ బోయేనని చెప్పఁగును. ఏదియెట్లున్నను పై పద్యము నే సందర్భముసవో శ్రీనాథుడే చెప్పి యుండవలయు 'సని నిర్దా రింపచ్చును. కాని శ్రీనాథకవి ); ప్రౌడదేవ రాయల యాస్థానమునకుఁ బోయినది భీమేశ్వరపురాణ వచనమునకుఁ తరువాత, కాశీఖండవచన మునకుఁ బూర్వమునై యుండుట వాస్తవముగా గన్పట్టుచున్నది, ఎందుకన నీసంగతి భీమేశ్వరపురాణమున నెత్తకపోవుటయే గాక తనకు గవిసార్వభౌమ బిరుద మున్నట్లే చెప్పుకొని యుండ లేదు. కాశీఖండ మందన్ననో


శా, కర్ణాటక్షితి నాధచూ క్తిక సభాగారాంత సంక ల్పిత
స్వర్ణ స్నాన జగత్ప్రసిద్ధ కవిరాట్నంస్తుత్యచారిత్ర! దు
గ్దార్ణో రాశీగ బీర ప్రొహ్న ముఖము ధ్యాహ్నా పరాహోర్చతా
పర్ణావల్లభ! రాజు శేఖరమణీ! పట్వాయ గ్రామణీ !


కృతిపతి సంబోథ నపద్యమున సూచింపఁబడి యుండెను. మఱియు నవతారిక లో నల్లాడ వేమభూ పాలుఁడు తన్ను గూర్చి పలికిన యీకింది.---


శా, ఈక్షోణిన్ని సుబోలు సత్కావులు లేరీ "నేటి కాలంబునన్
దాక్షారానుచళుక్య భీమవరగంధి ర్వాప్సరో భామినీ
వక్షద్వయగంధ సోరఘుశృణద్వై రాజ్య భోగంబున
ధ్యక్ష్మించుకు గవిసార్వభౌమ భవదీయ ప్రౌడ సాహిత్యముల్ .

అను పద్యములోఁ దన్నుఁ 'గవిసార్వభౌమ' అని సంబోధించినట్లుగాఁ జెప్పియున్నాఁడు. అట్టి దేమియును భీమేశ్వరపురాణ ముసఁ జెప్పియుండ లేదు గనకనీనడిమి కాలముననే యీతఁడు . పౌఢ దేవ రాయని

యస్థానమునకుఁ బోయి గౌడడిండ మభట్టునునోడించి యుండవలయు సనియే నాముఖ్యాభిప్రాయము. కొండవీటి పురవర్ణనము గూర్చిన పద్య మును దేననాయని యాస్థానమునం జదివే నను విశ్వాసబుద్ధిలో డట్లు వాసియున్నాడను. ఇప్పుడు చూడ నాయీకడపటి యభిప్రొ యమే సత్యమని తోఁచుచున్న ది. భీమేశ్వరపురాణమునకు ముందే యీకథ నడిచియున్న యెడల శ్రీ నాధుఁడు తప్పక యా గ్రంథమున సూచించియే యుండును.


అష్ట భాషాకవితా సామ్రాజ్యాభిషిక్తుఁడును', డిండిమ . కవిసార్వ భౌమ బికుదాంకితుఁడును, శ్రీకంఠాగమశిఖండమఃడనమణియై ప్రప్రథ మమున విజయుడిండి మము నార్జించిన డిండిమ ప్రభుని దౌహిత్రుఁడును, సభాపతి భట్టారకాచార్య భాగి నేయుండును, సరస్వతీ సౌదలబ్ధ కవితా సనాథుడును, యోగానంద ప్రహసనకర్తయు నగు నరుణగిరినాధుడను మహావిద్వాంసుఁడొకఁడు దేవరాయ మహా రాయల వారి యా యాస్థానమలం కరించి యెట్టిపండితులను, ఎట్టికవులను సరకుగొనక విజృంభించి మనేక పండితుల నోడించెను. కారణమేమో తెలియదు గాని యట్టిపండితాగ్ర గణ్యునకును మన శ్రీనాథభట్ట సుకవికి నుద్భటమైన వివాదము పొసంగినది.

డిండిముని జయించుట.

డిండిమకవిసార్వభౌమ బిరుదాంక ముగల కవి శ్రేష్ఠులు మూవురు గనంబడుచున్నారు. వీరిలో మన శ్రీనాథునకుఁ బ్రత్యర్థిగనున్న యోగా నందప్రహసనకర్త యగు నరుణగిరినాథుఁడను కవియని పైని జెప్పియున్నాఁడను. ఇతఁడు గౌడ బ్రాహ్మణుడు. ఈ మహాకవి తన ప్రహ సనమునందలి భరత వాక్యములో దీర్ఘాయుర్దేక రాయో దధతువసుమతీ చక్రమాచంద్రతారామ్' అని చెప్పియున్నందున నితఁడు ప్రౌఢదేవరా యల కాలములోనేగాక యతని తాతయగు దేవరాయల కాలములో, గూడ నుండెనని విస్పష్టముగాఁ దెలియుచున్నది. తన పితామహుఁడు కవి ప్రభుఁ డనియు, బల్లాలు మాస్థాన కవీశ్వగల గర్వమడం చిననాడనియుడు: నాగణయడు కవీశ్వరుని నోడించిన నాడనియును, తనతండ్రి రాజనాధ దేశీకుఁడనియును, మాతా మహుడు డిండిమ ప్రభుఁడ నియును, విజయదిండిమము గలవాడనియును శైవవేదాంశ పారంగతు: డనియును, తల్లి యభి రామనాయిక యనియును మేనమామ సభాపతి భట్టా కాచార్యు డనియును, యోగానంద ప్రహ సనమున బట్టి తెలియుచున్నది.*[4] శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వారి చేరచింపఁబడిన కనకాభి షేకము ఈ గ్రంధమున నిట్లు వ్రాసి యున్నారు.


"దేవరాయ లను పేరు విద్యానగర ప్రభువులలోఁ బలువురకుఁ బొసంగున దేయైనను ద్వితీయ హరిహరరాయ" కుమారుఁ డగు దేవరా యలయందును కూమారుఢగు రూడముగా గన్పట్టుచున్నది. రెండవ దేవరాయల కిమ్మడిదేవరాయ లని, ప్రౌఢ దేవరాయలని, ప్రతాప దేవ రాయలని నామాంతరములు గలవు. యో "సంవప్రహసనమున ( బేర్కొనఁబడిన దేవరాయ లీ యిర్వురి దేవరాయలలో నొక్కఁడై యుండవలయును. రెండవ దేవరాయలే కాఁడగుననుట కొక యాధారముగలదు. సంస్కృ తమున నిమ్మడి దేవరాయలు రచించిన ట్లాతని పేరు మహానాటక సుధా నిధి యును నొక యింపై నకావ్యము గలదు. బాలకాండాంతమునఁగల పద్యమిది:-


శ్లో.శ్రీమానిమ్మడిదేవరాయకతీచుల్లసూక్త విగో నిక్వజ్ఞాపితం కల్లోలప్రతిమల్లమూర్తి విభవ కాంచి వస్తునకు సాన్మహా నాటక 'కాపు సజ్జ -స్ మ్యాన కాస్ట్ డ్వెభుః

ఈశ్లోకమునఁగల 'కల్లోల ప్రతిమల్ల సూక్తివిభవి' యను పద్య మేథీనముకు లేక యల్లే డిండిమభట్టారకుని చాటుపద్యమునఁ గూడఁ గలదు. ఉదాహరింతును;--

శ్లో. ఆ డికీ మనం తత ఇతో.. ది షణు

" శ్చిత్ర పటాయతీ రుచ ప్రోని పద్యానిన ,

ఆసాంతాన దినం మహేశమము కో ! 75 kE.. నీ కల్లోల ఫలిచుల్లసగా ! . నచ్చే ప్యాన్ని జీష్యా ను హే.

దీనివలన నిమ్మడి దేవరాయల కాలమున డిండిమభట్టారకుఁడుండి నట్లు తేలుచున్నది. మఱియు, మహానాటక సుధానిధి కూడ నాడిండిమ భట్టారకుని కూర్చే యగునో యనిసందియము పొడముచున్నది. దేవరాయలు రచించినట్లుగ రతిరత్న ప్రదీపిక యను కామశాస్త్రము గూడ నిట్టి దేయగుఁగాబోలు! అయియుండును. అన్యకవీశ్వర రచితము లై ధనలోభమున రాజుల పేళ్ళఁ బ్రచురించబడిన గంథములు మన తెల్గు దేశముననే పరశ్శతము గలపు. ఆ కుళ్ళు నెల్లడింప వేఱ గ్రంథ మే కూర్చవలసి యున్నది. ఈప్రౌఢ దేవరాయలవారి కాలముననే అరుణ గిరినాముఁడను కవీశ్వరునిచే ద్రావిడ భౌషయందుఁ గొన్ని ప్రాథములగు శైవస్తోత గ్రంథములు రచియింపఁబడినవి. ఆరుణగిరినాముఁడీ యోగా నంద ప్రహసనకర్త యగునేమో విచారింపవలసియున్నది.

శ్రీనాథుఁడుద్భటవివాదముఁ బెట్టుకొని జయించినది రెండవడిండి మకవిసోర్వభౌముని. ఈడిండిమక విసార్వభౌముని మాతామహుఁడగు డిండిమక విసార్వభౌముఁడు (ప్రథముఁడు) కవితార్కిక సింహసర్వతంత స్వతం తాది బిరుద మండనుఁడై విశిష్టాద్వైతమతమును బెంపొందించిన వేదాంత దేశికునితడుటవివాదము జరిగించినట్లొక గాధ పండిత పరంపరాగతముగా దక్షిణ దేశమునఁ జెప్పుకోనబడుచున్నది. వేదాంత దేశకులనాడు క్రీ. శ. 1270 మొదలుకొని 1320 వఱకు నుండుట చేత ప్రథమ డిండిమకవిసార్వభౌమునితో వాదింప లేదనుట స్పష్టము, శ్రీడాభిరామము పీఠికలో 'సాళువనరసింహ రాయల కాలములోనున్న మూడవ డిండీమకవిసార్వభౌముని నోడించెనని శ్రీమానవిల్లి రామ కృష్ణకవిగారు పొరపాటున వ్రాసియున్నారు. తరువాత శ్రీ వేటూరి పభాకరశాస్త్రిగారి కనకాభిషేకమను పొత్తము వెలువడినది. ఆగ్రంథ మును జదివిసపిమ్మట శామకృష్ణకవిగారు పొరపడితిమని నాతోఁ జెప్పియున్నారు. ప్రభాకరశాస్త్రి గారి వాక్యములనే నాయాంధ్రుల చరిత్రములో నుదాహరించి యున్నాను.

శ్రీ వీరేశలింగముగారు మాత్రము వీరి వాక్యములను మఱువక "సాళువగుండ నరసింహరాయలు 1450 వ సంవత్సరమునకు పైని 1450-90 సంవత్సన ప్రాంతములయం దుండిన వాఁడగుటచేతను, శ్రీనాథకవి 1450 వ సంవత్స రమునకు ముందే మృతినొంది యుండుట చేతను ఈకవిసార్వభౌమసనూర్జనకథ 1435 దవ సంవత్సర ప్రాంతమున రచింపఁబడిన 'కాశీ ఖండ రచనకుఁ బూర్వమునందే సడచియుండుటచేతను శ్రీనాథుఁడు సాళువగుండ నరసింహరాయు యాస్థానములో నుండిన డిండిమభట్టుతో వాదము చేసి జయించుట సంభవింప నేరదు. అని ఖం డించియున్నారు. రామకృష్ణకవిగారు క్రీడాభిరామపీఠిక వ్రాయునప్పటికి డిండిమభట్టారకుల చరిత్రము వెలువడి యుండ లేదు. వారి చరిత్రమును 'డెలిపి యందలి చిక్కును దొలఁగించినది శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రీ గారి కనకాభిషేక మను గ్రంథము. ఆ గ్రంథ సహాయమును గొని నే నాంధ్రులచరిత్రములో నీవిషయమును జర్చించినాఁడను. ఆకనకాభి షేక మును, ఈయాంధ్రుల చరిత్రమును బయలు-వెడలిన తరువాత నాంధ్ర కవుల చరిత్రములో రామకృష్ణకవిగారి యభిప్రాయములను ఖండన చేయుట సుసాధ్యమే. ఆంధ్రకవి చరిత్రకారుడు తనకింతచరిత్రజ్ఞాన మును కలిగించి నందులకు కనకాభి షేక గ్రంథమునకుఁ గృతజ్ఞ తజూపి యుండనలయును. ఇప్పటి చరిత్ర గ్రంథముల నన్నిటిని జదివియు శ్రీవీరే శలింగము గారింకను సుప్రసిద్ధములైన చరిత్రాంశములను సయితముఁ తెలిసికొనఁ జాలక మమమని గొడుకునిజేసి చదువరులకుఁ దమ యపూర్వచరిత్ర జ్ఞానమును బోధించు చునే యున్నారని తెలుపుటకు విచార మగుచున్నది. బ్రౌఢ దేవరాయఁడు విజయబుక్క రాయల కొడు కై యుండఁగా విజయబు బుక్కరాయని తండ్రియైన దేవరాయని కొడుకై నట్లుగా వ్రాయుచున్నారు. రామకృష్ణకవిగారు శ్రీనాథకవితో వాదము జరిపిన డిండిమభట్టును గుర్తింప లేకుంకుట వింతకాదు గాని సుప్రసిద్ధమైన చరితాంశమై కన్నులకు విస్పష్టముగా గోచరమగుచున్న దేవరాయని కిని ప్రౌ దేవరాయనికిని గలసంబంధము నాంధ్రకవి చరిత్రకారుఁడు గుర్తింపలేకుండుట వింతగానే గన్పట్టక మానదు.

డిండిమవంశ్యుల పూర్వచరిత

ఒకప్పుడు కొంచీపురమునే చోళ రాజు . ". కాశీయాత) బయలు దేరి గంగావిశ్వేశ్వరుల సందర్శించి కాంచీపురమున నొక శివాలయ మును బ్రతిష్ఠంభనిశ్చయించి, ప్రాసానవల్ల భయజ్వ, భౌస్కరకవి, రాజ నాథకవి, సుబ్రహ్మణ్యకవి, జటాధ రేశయజ్వ, నీలకంఠకవి, సోమనాథ దీక్షితుఁడు, మల్లి కార్జునభట్టు నను. నెనమండ్రు గంగాతీరస్థు లయిన బ్రాహ్మణులను వారికుటుంబములతోడ నేంటఁగొని కాంచీపురమునకు మరలివచ్చెను. తరువాత నారాజు తుండీరమండలమునఁ దల్పగిరికి పశ్చిమభాగమున నొక యగ్రహారము నొసంగీ వారల నందుఁ బ్రవేశ పెట్టెను. వార లాయగ్రహారమున శివునిఁ బ్రతిష్ఠించి రాజనాథు డని పేరు పెట్టి యా దేవుని నింటి వేల్పుగాఁ జేసికొని యా రాధించుచు నందు నివసించియుండిరి. అటుపిమ్మట ప్రాసాదవల్ల భయజ్వకు సభాపతీయను

పుత్రుడు పుట్టెను. అతనికిఁ జోళ చేర పాండ్య రాజులు శిష్యులై ఢక్కా వాద్యాదిసమ్మానముల బహూకరించి.. ఆతని మునిమురుమఁడే భాస్క. రార్యుండు. ఈతఁడు ప్రసన్న కావ్యకర్త. ఇతని వంశమున "త్యాగ రా జననతఁడు పుట్టి కామకోటి పీఠమున విద్యా జయ స్తంభమును స్థాపించి నాడు. ఇతనికి స్వయంభూయజ, గురుస్వామి బుధుఁడు నజనుదయించిరి. ఇతర వంశములందు నిట్లే పల్వురు ప్రఖ్యాతవిద్వాంసు లుదయించిరి. ఇట్లు క్రమముగా వీర లేక వింశతివంశములవారయిరి. స్వయంభూ యజ్వకు సభాపతి యను కుమారుఁడను, గురుస్వామి బుధునకు సోమ నామథుడను కుమారుడును, అభిరామాంబిక యను కూతురు జనియిం చిరి. అభిరామాంబికను గౌతమడగు రాజనాథుఁడు పెండ్లి చేసికొనియెను. ఆయభి రామాంబిక పుష్పవతి కాక పూర్వము పదమూఁడవ సంవత్సర ప్రాయమున 'అరుణగిరినాధు' డను కుమారుని గనియెను. కుమారున కుపనయనము కాక పూర్వమే తండ్రి రాజనాథుఁడు శివసాయుజ్యమును బొందెను.

అభిరామాంబిక తనకుమారుని సోమనాధ మఖియను తనసోదరున కప్పగించి సహగమనము గావించెను. సోమనాథముఖ మేనల్లునిఁదనకొ డుకుల కంటె మొక్కువ ప్రేమతోఁ బోషింపుచుండెను. అరుణగిరినాధుఁడు వేదాధ్యయనము సేయుచునుండ నేమి కారణము చేతనో మేనమామ భార్యకీతనియెడ నసూయపుట్టి క్రోధముతో "మెలఁగుచుండెను. ఈవిష యమును మేనమామకుఁ దెలియకుండెను. అరుణగిరినాధుఁడీ బాధపడ లేక యొక నాఁడిల్లు విడిచి నవగ్రామము చేరి యక్కడ నొకశివాలయమున శివ సాన్ని థ్యమున శివునా రాధించుచుండెను. అంతటసోమనాథమఖ మేన ల్లునిఁ గానక యూళ్లునాళ్లు వెదుక మనుష్యులను బంపించెను. కానిమూ డవనాటి యుదయమున నదీతీరమున నా బాలునిఁ దమ్మయుమ్మి చే 'నెర్ర, బారిన పెదవితో గానంబడఁగాఁజూచి సోమనాధమఖ మేనల్లునిఁ గౌగ లించుకొని నాయనా! ఇదియేమిరా యిట్లుంటి వనిప్రశ్నించెను.అంత నతఁడు 'మామా!' ఊరకవచ్చితిని, బడలికచే నీశ్వరాలయమున నిద్రించి తిని అర్దేందుశేఖరుఁడు నాకు ప్రత్యక్షమై నన్ను నిద్రనుండి మేల్కొల్పి విదాస్వభావమునఁ 'దేఱిపిగా నున్న నానోర డమ్మనుమిసెను; అందు చేనానో రెజ్జ వారి యున్నది. పరిశుభ్రము చేసికొనుటకై నేనిచ్చటికీ వచ్చితి" ననిపలికేనట. అప్పుడాతఁడు శివుని ననేక స్తోత్రములను రచియించెను. ఇతఁడే క్రొత్తగాఁ ఒట్టాభిషిక్తుఁడయిన ప్రౌఢ దేవరాయల వారినిదన కవిత్వశక్తి చేతను, వివాదచాతుర్యముచేతను మెప్పించి యాకవిమన్ననకుఁ బాత్రుడయ్యెను. ఈతఁడుకు ప్రౌఢ దేవ రాయుఁడునుతుల్యాంబ భరణధారులై యేకమనస్కులయి వర్దిల్లుచుండెవారట.ఇతఁడు యజ్ఞంబికయను కన్యను వివాహమై యనేక యజ్ఞములను గావించెను. ఔదుఁబరపురమునకుఁ దూర్పుగానున్న,తల్ప గ్రామమునకు దక్షిణముగాను, ననగ్రామమునకు వాయవ్యముగాను ప్రౌఢ దేవరాయలవారొక యారామమును నిర్మింపనయ్యది తూర్పు పడమరల కొక క్రోసును,ఉత్తరదక్షిణ ములకొక యకక్రోసుకు వ్యాపించి యనేక ఫలపుష్పాదులతోను, నాగవల్లీక్షు ఖండాదులతోను 'బెంపొందుచుండెను. రాయలాయారామమునకు 'నీలగిరి' యను పేరుగల యొక బేరిని నధికారిగా నియోగించేనట. ఈయారామమునుజూచి వాని గారాము రాణి యగు రుక్మిణీరామాలలామ దానిప్రమదోద్యానముగాఁ గైకొనియుండ నారామజీవి యగు నీలగిరి ధనాధికుఁ డై గర్వితుఁడై యుండెనఁట. అరుణగిరినాధుని పమలాయరామములోని కనవునకలవాటు పడియెనఁట. నీలగిరి వానిని నావలకుఁ దోలించుచుండెడివాఁడు. ఒకనాఁడు నీలగిరికోపముతో పసులురేపటినుండి తోటకు మరల వచ్చె నేనిఁ గట్టి పెట్టించెద, వాని విడిపించుకోదలఁచితీ లేని దక్షిణాధీశుఁడగు దేవరాయల యుత్తరువు నొందవలసినదెయనిగద్దించిపలి కెనట. మఱునాఁడు ఫసు లెప్పటి యట్లేయరిగెను. నీలగిరి .

తనమాటనిలిచి పసుల గట్టివైచి పాలకు విడువ డయ్యెను. అంతట నరుగ గిరినాధుడాసంగతి రాయలకు నివేదించి 'దేవరా నీతోటపట్టు నాగ్ర హారముగా దానము చేయుము. అట్లు చేసుకుంటినేని నప్పుడే సీరాజ్య ముకు విడిచిపోయెద సని పలికెనఁట. అందునకు గాను బిట్లు ప్రత్యుత్తు మిచ్చెను. " అది ప్రమదావంబగుటచే నీయంబడదు. ఇతరస్థలమున నొసం గెదనని పలికెనుగాని యతడు కోపించి ఢిల్లీ నగరమునకుఁబో మెనఁట, ఢిల్లీ సురత్రాణుని దర్శనము సామాన్యముగా లభించుననీ కాదు గనుక దుర్గ ద్వారమున నొకశ్లోకమును వ్రాసెనట.సుకత్రాణా! నీరాణి చెంతనిద్రింప ననుదెంచితి అనుసర్దనముగల యాశ్లోకమును అసూయాళువు లగుపండితుతు లాసంగతిని సురాత్రాణుని కెఱింగించిరి. అతఁడా గ్రహ చిత్తుఁడై వాని కోమరిత మరిత లవంగియనునది వానిని వారించి 'నాయనా! నీయాశ్రయము కోరివచ్చిన కవీశ్వరుఁ డెన్నడు నట్లు వ్రాసియుండఁడు; దాని కెది యో మఱియొక యుర్దదముండును; వానిరప్పించి విచారింపు' డని పలికెనఁట. అతఁడా మెపలుకులనాదరించి రప్పించి విచారింపఁగా నరుణగిరినాథకవి యాలంకారికుల పద్ధతి నను స రీచిచి యుత్తరార్థమునుబూరించి శ్లోకముఁజదివి నీధాటివలని భయ ముచేఁ బర దేశములందు నిద్రాభావము గలిగినందున నీరాణీ చెంత నిదు రింప నరుదెంచితి; రాణి అనఁగా నిచటపరి పాలిత దేశమని యర్ధము. అంతీయగాని విపరీ తార్దమిందేమియు లేదనునుడివెనట. ఢిల్లీ సురత్రా ణుని యాస్థానమున 'అన పోయుఁ" డను కవిమల్లుఁడు గలఁడఁట. అతఁడు జయనూపురమును బాదరమున ధరించి డిండిమ వాద్యముతోఁ బూజితుఁ డై యుండెనఁట, అతఁడీయరుణగిరినాధునిఁ బ్రవేశమున కసమ్మతిని గనుపఱచె. అంతనిర్వురకు వివాద మేర్పడియెను. సర్వశాస్త్రములు యందు విచారముజరిగెను. ఇరు వదిమూడు దినములు చర్చసాగెను. కడ పటఁ గవిమల్లుఁడు నిగ్రహింపబడియెను. ఢిల్లీ సురత్రాణుడు సంతోషించి వాని బిరుదములనన్నిటిని నరుణగిరినాథుని కిప్పించి మణిరంజతమయిన సువర్ణాసనమున సభిషిక్తునిగావించి "విద్యా డిండిమశోణ శైలకవి' యని యతని సగ్గించెనఁట. తరువాతమణి కొన్ని విద్వత్త్వకవిత్వ పరీక్షలు పెక్కులు జరిగిననఁట. అప్పుడాయరుణగిరినాథుఁడు 'కవిసార్వభౌమ' బియదమును గాంచి రామపదాంకిత మగుకావ్యమును, డిమమను రూపక మును రచించి బహుప్రఖ్యాతిని గాంచిమించెచెనట. అతఁడు ఢిల్లీ సురత్రా ణునీ వశ్యునిగాఁజేసికొని యతనిచే నాజ్ఞా పత్రమును బొంది మరలవిద్యా నగరమునకు వచ్చి రాయల వారికి జూపించి తాను తొలుతకోరిన ప్రము డావనమునే యగ్రహారముగఁ దానము బడ సెనఁట, ఇయ్యది వాని వంశ్యులచే వ్రాయఁబడిన విభాగరత్నమాలనుండి వ్రాయబడిన కథా సారము, కాని యీకథనంతయు మనము విశ్వసింపరాదు. అరుణగిరి నాధుఁడుద్దండపండితుడై డిండిమభట్టారకుఁ డను నామముతోఁ గవిసార్వ భౌముఁడై ప్రౌఢ దేవరాయని యాస్థానమున నున్న మాట వాస్తవము.

శ్రీనాథుని విద్యానగర ప్రయాణము.

శ్రీనాథుఁడు భీమఖండరచనము తరువాత రాజమహేంద్రపురమున నుండ నిష్టము లేక విద్యానగరమునకుఁ బోవఁగారణ మేమని చదు వరులకు సంశయము జనింపక మానదు. అందునకుఁ గారణము మహేంద్రపుర పండితు తోడి వివాదము లనియె మఱియొకమాఱు చెప్పవలసి వచ్చుచున్నది. శ్రీనాథుఁడు సకలవిద్యాసనాథుఁడయ్యు నెంత వైదుష్యదర్పము గలవాఁ డయ్యు, ప్రశాంతమనస్కుడై వినయ సంపత్తి నధికముగాఁ జూపుచు 'సుకవిజనవిధేయుఁడ' నని తాను తెలుపు కొనుచున్నను పండి తకవులు మత్సర గ్రస్థు లగుచు వివాదములు గల్పించి వేధింపసాగిరి. తనభీమఖండమున వేరు వీరభద్రా రెడ్ల నాకర్షించుటకై కృతిపతివంశవర్ణనా సందర్భమునఁ గృతిపతికిఁ బ్రభువులగు వారి వంశమును గూడఁ జేసినను వారలచిత్తముల “నాకర్షింపఁ జూలకపోయెను. లీతనిదమ శత్రుపక్షమువాఁడని యనుమానములో మొదట నలక్ష్య భానముతో నుండిరని తలంపవలసి వచ్చుచున్న ది. శ్రీనాథుఁడు తనకు గల లోకగ్నతకు, నిర్మతను, ప్రశాంతతను, పాండితీ దర్పమును చాటించి భీమేశ్వార పురాణమునఁ గుకవిని రావలమున సంతమృదువుగా మందలించినను, కార్పణ్యము వహించిన పండిత ప్రకాండులతో శ్రీనా ధునికిఁ బ్రచండ వాదముల సల్పుటమాత్రము తప్ప లేదని రాజమహేం ద్రపున పంతుల సీతఁడు తిరస్కరించుచు నుల్లసమాడిన విధమును దెలి పెడు శ్రీనాథుని చాటువులె వేనోళ్ల ఘోషించుచున్నవి. నాటి ప్రధ్వం సౌభావ ప్రాగభావములపై గల్పించిన కల్పనకుఁ దొర్కికులు తలలు వంప వలసియుండును. ఆచాటున నాధోరణులిచట సుదాహరింపఁ దగినవీ కావు అన్నా మాత్యుడు సాహసించి యీతనిఁ జేరఁదీసి భీమే శ్వరపురాణమును రచియింపఁ జేసి తాసంకితము పొందివను బండితుల చాడీకోరుతనమునకు వెఱచి యేమియుఁ జేయక సమయమునకై నిరీక్షించుచు మిన్నకుండెఁ గావలయును. ఎట్టి దైనను ప్రథమసమావేశ కాల మీతని కనుకూలముగా లేదని తోచుచున్నది.

 గీ.వికటముననుండి శ్రు తిపుట నిష్ణురముగ
నడర కాకులు బిట్టు పెద్ఱఱ చినప్పు
డుడిగి రాయంచ యూరక యుంట లెస్స
సైఁపరాకున్న నెందేనిఁ జనుటయొప్పు

అని భీమేశ్వరపురాణమునఁ దాను జెప్పినన్యాయమును నీతిని బాటీంచి కొంత కాలమాపురమున వీడిచి యుండుటకు నిశ్చయించి మహో న్న తదశయందుండిన కర్ణాట రాజ్యమునకుఁబోయి యాసామ్రాజ్య సార్వ భౌముఁ డగు ప్రౌఢ దేవరాయల సందర్శించి సత్కారములఁబొంద సంక ల్పించుకొని విద్యానగరమునకు బయలు నెడ లిపోయెను. శ్రీనాధుఁడు వైదుష్యడర్పములుగల యుద్దండపండితుఁడని యాధ్ర దేశమున నెఱుఁ గుదురు కాని కర్ణాటము లోని పండితు లెఱుంగరు. అచటిపండితుల దుర్మం గొడవీటికీ త్రమువలన వితనికొకపట్టున రాయలసుదర్శన భాగ్యముల భింప లేదు. శ్రీనాధుఁడు విద్యానగరమునకుఁబోయినప్పుడతనియునికిపట్టెయ్య దీయని యడిగినపుడు చెప్పిన కొండవీటి వర్ణస సీసపద్యము శ్రీనాధుఁడీ సమయము ననే చెప్పినది గా కుంకఁ డగునని ప్రభాకరశాస్త్రీగారు చెప్పినది వాస్తవ ముగాదు. కనకాభి షేకము కథనడ చినది. క్రీ. శ. 1430వెను1435 వ ప్రాంతమునని యొక మూల వ్రాయుచునీపద్యమాకాలమునఁ జెప్పినదని వ్రాయుట సందర్భశుద్దిగాన రాదు. అప్పటికీ గొంకవీటి రాజ్యము గర్ణాట సొమాజ్యమునఁ గలుపుకోసం బడినది. అప్పుడుబ్రభువు కర్ణాట సార్వభౌముఁడగు ప్రౌఢ దేవరాయలే గావునఁ గొండవీటి వైభవము పోయిన పిమ్మటనే యీపద్యము చదువం బకినదనుట హాస్యొస్పదమగును. ఈ విషయమును ప్రథమముద్రణగ్రంథమునందు నేను స్పష్టముగా వక్కాణించియుండిన.నుజూచియు ప్రభాకర శ్రాస్త్రీ గారీమభిప్రాయమును విడిచి పెట్టక వ్రాయుట యాశ్చర్యజనకముగా నున్నది. విద్యానగరయాస్థానపం పండితు లలో ముమ్మకవియు, డిండిమకవియు సను నిర్వురు కవులు గలరు. అందును డిండినభట్టారకుఁడు గవిసార్వభౌముఁడుగదా. శ్రీనాథుఁడు తొలుదొల్త ముమ్మ కవిని సందర్శించి యీ క్రిందిపద్యమును జెప్పెనఁట,

"సీ. పంపావిరూపాక్ష బహుజటాజూటీ కా
రగ్వగప్రసవ సాగత్యములకు
తుంగభద్రాసముత్తుంగ వీచీఘటా
గంభీరఘుమఘుమా రంభములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర
ద్రాక్షాలతాభలస్త బకములకు
కర్ణాట కామినీ కర్ణహాటకరత్న
తాటంక యుగ ధాళ ధళ్యములకు
గీ.నిర్నీని బంధ నిభంధమై నెనయుకవిత
తెలుగులోనేను సంస్కృతంబునఁ బలుక నేస్త

ప్రౌడదేవేంద్ర భూపాల బరుని సమ్ముతంబున జూడు ముమ్మమగని.


. అప్పుడు మమ్మకావి ముమ్మకవి " శ్రీనాథుని జూచి మీరు రెడ్డీ రాజులు యాస్తానమున విద్యాధికారిగా నుంటిరికదా మీబిరుదమెట్టిదో తెలూరైతిరే" అని ప్రశ్నించెనట. అంత శ్రీనాధుడాతనితో నిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

చ. తరువున గాండీవి విడండె ధర్మరాజాన .యేగువా
శ్వర కేసులో నూ ఇము "న్నున హే:క:
ము. ఆకు ను కసమాగత కొనిపోవు నాకు
కుకు కు కు నా వినక పం పెట్టి సన స్వాముఁడ


ఈపద్యమునందు సత్క విసార్వభౌముఁడ నని శ్రీనాథుఁడు చెప్పుకొనుట యష్టదిగ్విజయ • పటకాకృతబిరుద. డిండినూడంబరు డనఁగవిసార్వభౌ ముండునగు డిండిమ భట్టారకునకు భరింపరానిది గనుండి సంతప్త కుపితుని గావించి స్పర్థ కలిగించున దయ్యెను. ఎన్నాళ్లున్నను రాయల దర్శనము లభించినది కాదు. అతఁడు కన్నడ రాజ్యలక్ష్మిని దలపోసికొని యిట్లు వేడెనని యీ క్రింది చాటుపద్యమును జూపుచున్నారు.'


శా.కల్లా యుంచతిగోఁక సుట్టితి ఈ మహాకూ శ్వాసము" దోడ్డితిన్ వెల్లుల్లిన్ దిల్పష్టము మెసవితి " విశ్వ స్తవడ్డింపఁగాఁ జల్లాయంబలేదానితిన్ రుచుం దోషంబంచుఁ బోనాడితిన్ దల్లీ! కన్నడ రాజ్య లక్ష్మీ ! దయలేదా? నేను శ్రీనాథుఁడన్" ,

దేశమర్యాదను బట్టి తలకుఁ గుళ్ళాయును, మేలి కంగరళాయును దాల్చుట 'మొదలగు ననభ్యస్త విషయము లక్కడ శ్రీనాథునకుఁ దటస్థించెననియు, ఆ దేశము విధము తనకు సరిషడకుండెననియు, అందువలన నాతఁడు అన్మూ! నాకఁ బెందలకడ "రాజదర్శ నాదికము సమకూర్చి స్వదేశ గుస కరుగ సెలవిమ్మా' యని కర్ణాట రాజ్యలమ్ముని వేడుకొనుచుఁ 'బై పద్యమును చెప్పేయుండు సని ప్రభాకరశాస్త్రీ గారి యభిప్రాయము. పయిపద్యములోని కడపటి పాదము కేవలము దైన్య భావమును సూచిం చుచున్నది. ఈకాలమున శ్రీధుఁడు గంభీరహృదయమును జాటుచు దర్పమును బ్రకటించుచున్నవాఁడు గాని దైన్య భావమును సూచింపు చుండలేము అదియునుంగాక కన్నడ రాజ్యలక్ష్మికి నొక మహోత్కృష్ట విషయమును జ్ఞపై కిఁ దెచ్చుచున్నట్టు దయ లేదా నేను శ్రీనాథుఁడ! ' అనుదానివలనసువ్యక్త మగుచున్నది. అదివఱకుఁ గన్నడ రాజ్యలక్ష్మి కెఱకపడక క్రొత్తగఁ బోయిన వాడు దయలేదా? నేను శ్రీనాధుఁడన్ ” అని జ్ఞప్తికిఁ దెచ్చునట్లు సంభవింపదు. కనుక నీ పద్యము వార్ధక్యమున రెండవతూరి శ్రీనాథుడు కర్ణాట దేశమునకు, బోయిన కాలమునఁ జెప్పి సదై యుండవలయునని ప్రథమాధ్యాయముననేఁ జెప్పినట్టు ఓతల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! అప్పుడే నన్ను మఱచిపోతివా ?లేదా? ఇచ్చట ముత్యాలశాలలో స్వర్ణాభి షేకమనుభ భవించిన శ్రీనాథుఁడడును జుమా' యని జ్ఞప్తికిఁ దెచ్చిన విషయముగా భావింపవలయునే గానిమఱియొక సుదర్భమునఁ జెప్పినదిగా భావింపరాదు. డిండిమభట్టారకుఁడుమొదలగువారు, తనకు రాయదర్శనము లభింపకుండ నడ్డుపడుచున్నారను విషయముఁ 'చెలియవచ్చినప్పుడు శ్రీనాథుఁడు మిక్కిలి దర్పమునుజూపుచు నీక్రిందిపద్యమును వ్రాసి పౌఢ దేవరాయలికి, బంపెసను విష యముగూడ నాయభిప్రాయమును బలపఱచునదిగా యున్నదిగాని ప్రభాకరశాస్త్రి గారి యభిప్రాయమును బలపఱచుచుండ లేదు.


 సీ. డంబుచూసినారా తలంబుపైదిరు గాడు
కవిమీఁదఁగాసనా కవచమేయ
దుష్ప్రప్రయోగంబుల దొరకొని చెప్పెడు
కవిశీరస్సునగాని కాలుచాప
సంగీత సాహిత్య సర్వి ద్విలొల్లని
కవులఱొమ్ములగాని కోల్చివీడువ
చదివి చెప్పగ లేక సభయందు విలసిల్లు
కవిపోరు గాని ప్రక్కల్పుదన్న

దంటకపులుగబలుపైన యింటిమగడ
గవుల వాదంబు విని వేడ్కంగల్గెనేని
నన్నుం బిలిపింపు మాస్థానాన సన్నిధికిని
లక్షణాపేంద్ర ప్రౌడరాయక్షితీంద్ర


ప్రౌఢ దేవరాయలు వీరితని దర్పమును జూచి యూశ్చర్యపడుచు దాను పేక్షించుటఁ దన యాస్థానవిద్వడ్బృదమునకు నగుబా టుగునని యెవ్వరిమాటలను సరకుగొనక యాతని దన యాస్థానమున కాహ్వా నించెను. తరువాత నాతని కోరికను 'దెలిసికొని యొక విద్వత్సభను కూర్పించెను. కర్ణాటసామ్రాజ్య సార్వభౌముఁ డగుప్రౌఢ దేవరాయల సన్నిధానమునఁ గవితావిషయముస శ్రీనాథకవి భట్టారకునకును, డిండిమ కవిభట్టారకునకును వైరము వర్దిల్లి పిజిగీషువులై వారిరువురును చర్చకు దొరకొనిరి. వారెందునుగూర్చి యట్టియుద్భుటవివాదమును పెట్టుకొ నిరో తెలియదు గాని డిండిమభట్టారకునకున్న కవిసార్వభౌమ బిరుద మును శ్రీనాథుఁడుగూడ వహించుటచేత గలిగినదని యూహింపవచ్చును. " బిరుదులు నారివాగుకడఁ బెట్టితి సత్కవిసార్వభౌముఁడ " అనునదియే మూల కారణము. అరుణగిరినాధ డిండిమభట్టారకుని మనుమఁడగు రాజ నాధభట్టారకునితోబాటుగా నచ్యుత దేవ రాయల వారి యాస్థానకవు లలో నొక్కడగు రాధామాధవకవి.


 శా, సూనాస్త్ర, ప్రమదా మద స్పురితత వక్షో జాత కాఠిన్యమున్
బూనంజాలు వరోవిలాసమున నింపుల్ మీఱ గర్ణాటక
క్ష్మానాథేంద్రు, సభన్ జా గవిత్వ విజయోత్సాహంబు కై కొన్న మా
శ్రీ నాధుం గవిసార్వభౌముఁ గొలుతున్ సేవాంజలుల్ గీల్కొనన్


కవిత్వ విజయము కొఱకే యీపోరాటమని సూచించియున్నాఁడు. ఈవివాదమునందుఁ గర్ణాటరాజ్యసార్వభౌములకుఁ గులగురు వయిన 'చంద్రభూషక్రియాశక్తి ' యొడయఁడు మధ్యవర్తిగ నుండెను. ఈవివాదములో మాధ్యస్థ్యము నెఱిపిన చంద్రభూష క్రియాశక్తి పండి తుడు డిండిమభట్టారకుఁడే "యోడిపోయె సని నిర్ణయించి విద్వత్పరిష డంబునకు నివేదించెను. కవిసార్వభౌమ బిరుదము నాతనికి దొలగించి శ్రీనాథునకు 'బాదుకొల్పిరి. అంతటితో డిండిమభట్టారకుని డిండిమా డంబకము గూడ నడగారినది. కర్ణాట సామ్రాజ్య సార్వభౌముఁడు శ్రీనా ధకవిసార్వభౌముని పాండిత్య కౌండీన్యమునకు నద్భు తాశ్చర్యములు : మానసమును బురికొల్పి నపరిమితానందముఁ జెందినవాఁడై డత్యంత గౌరనాస్పద మగు తన ముత్యాలశాలలో బహు విద్వజ్జన పండిత పరివార బహుమానపూర్వకముగా నాకాలమునాటి బంగరునాణె ములగు దీనారములతోను టంకములతోను స్వర్ణ స్నానోత్సవము సలుప దెలిసిగాని శ్రీనాథకవి సార్వభౌముఁ డీపద్యమును జెప్చెనట.


చ, జన నాదోత్తను! దేవరాయంనృపతీ ! శ్రీవత్సలాం
చన సం కాళ మహాప్రభావ! హక్షాదక్షు! నాఁచోటికిన్
గునృపస్తోత్రం సముచ్ఛవంబ.లయిన నాబోటికిన్
గనక స్నానము చేసి కాక పొగడంగా శక్యమే' దేవరకు.


కనకాభి పేకసత్కార క్రమము రాజ్య లక్ష్మీ పీఠికా కాతంత్రమున వివరింపఁ బడినది. మహారాజు విద్వద్ఘోష్టి.లో నసామాన్య పాండితీ మహిమంబుఁ జూపఁగల్గిన విద్వాంసునకుఁగాని కవి శేష్ఠునకుఁ గాని కన కాభి షేక సత్కారముఁ గాపింపవలయు సనీయుఁ గనకాభి షేక మనఁగా నాకొలమునాటి బంగారునాణెములను సభామధ్యమున నున్న తాసనము నామహనీయునిఁ గూర్చుండఁ బెట్టి వాని శిరస్సున జలముఁ గ్రుమ్మరిం చునట్లుగా గ్రమ్మరించి యానాణెములను నాసమ్మానోత్సవమున కరు గుదెంచిన విద్వాంసులు మొదలగువారికిఁ బంచి పెట్టవలయు ననియు సందుఁ జెప్పఁబడినది. ప్రాచీనకాలమున నిట్టి సత్కారమును ప్రభు పుంగవులచేఁ బెక్కండ్రు విద్వాంసులు పొందియుండిరి. ' అట్టి ప్రాచీనా చారమును శిరసావహించి కర్ణాటసామ్రాజ్య సార్వభౌముఁడు ప్రౌడ దేవరాయలవారు శ్రీ నాథకవి సార్వభౌముని నట్టి కనకాభిషేక సత్కా కముచే గౌరవించిరి.మన కవిసార్వభౌముఁడు ప్రౌడదేవరాయని ముత్యాల శాలలో గనకాభిషేక సత్కారమను బొందిందినపిదప ప్రౌడ దేవయ రాయలవారి నిట్ల భినందించినాడు.


శా.జోటీ యార్భాటిన్ మెఱయు మీ చోద్యంబు గానేడుగ
ర్ణాటాదూశ్వారు దేవరాయపతైన్ నాసీదాటీడమా
బోటి ఘోటధట్టి వా...........భాట్టాకసంఘట్టన
స్పోటి సూరధరా .............వెడన్

 :


ఇట్లకఖండపండితుడగు డిండిమభట్టానకుని ప్రౌఢ దేవరాయల యస్థానంబున విద్వద్బృందము నడుముడీకొని వాదించి యోడించి యామ హనీయుని లోహడిండిమమును (కంచుఢక్కను) బగుల గొట్టించి శ్రీనాథ కవిసార్వభౌముఁడు నార్జించిన యశోడిండిమముతో బయలు వెడలి యాంధ్ర దేశమునందంటట మ్రోగింప జేయుచు నాంధ్ర దేశమున జన్మించిన యే యాంధ్ర మహాకవియు బొందని మహా భాగ్యము ననుభవించెను.

వల్ల భౌభ్యుడయము.

శ్రీనాథుఁడు కర్ణాటరాజధానికిఁ బోయినపు డీ రాయలరత్న భాం డాగారాధ్యక్షుడైన వినుకొండపల్లఛానూత్యునితో మైత్రి నెఱపి వల్లభా భ్యుదయ మన గ్రంథమును రచించి యాతని కంకితము చేసెనని శ్రీ వీరేశ లింగముగారు వ్రాయుచున్నారు. అయ్యని స్వవచన వ్యాఘాతముల తోఁ గూడుకొన్నవి. వల్లభరాయని చరిత్రమున " ఈ క్రీడాభిభిరామము 1420 వ సంవత్సర ప్రాంతమునందు రచియింపఁబడియెను. ఈ కాలము నందు శ్రీనాథుఁడు కర్ణాట దేశము నకుఁబోయి వల్ల భామాత్యుని దర్శించి వల్ల బొభ్యుదయమును రచించియుండుట చేతను" అనియు; ~ _శ్రీనాథ కవిచరిత్రమున ' రాజదర్శనము క్రీ డా భి రామక ర్తయైనవినుకొండ వల్లభ రాయని నాశ్రయించి యాతని కంకితముగా వల్ల భాభ్యుదయమును జేయుటవలన నాతనిమూలమున లభించిన దని చెప్పుదురు.” అనియు, శ్రీ ,వీరేశలింగముగారు వ్రాయుచున్నారు. దీనింబట్టి శ్రీనాథుఁడు కర్ణాట రాజధానికిఁ బోయినది దేవరాయని కాలముననా? ప్రౌఢ దేవరాయని కాలము: ననా? దేవరాయలు 1406 , మొదలుకొని 1422... వఱకును, .. 1422 మొదలు1423 వరకును వానికొడుకు విజయబుక్కరాయ లును, 1423 "మొదలుకొని 1447 వఱకును వానికొడుకు ప్రౌడ దేవ రాయలును కర్ణాటక సామాజ్యమును బరిపాలించి యుండుట చేత 1420 లో దేవరాయలే పరిపాలనము చేయుచుండుట స్పష్టము. శ్రీ వీరేశలింగముగారి వాక్యముల నే విశ్వసించిన యెడల నిదివఱకు వారు వ్రాసినదంతయు వ్యర్థమగుచున్నది. అవియేమి కర్మ మోగాని యొక విషయమును గూర్చియే రెండేసియభి ప్రాయము లిచ్చుచుం డుటచేత , విమర్శకుల కనావశ్యకమయిన శ్రమము కలుగుచుండును. 1423 వ సంవత్సరము తరువాతనే శ్రీనాథుఁడు కర్ణాటక రాజధానికిఁ బోయి డిండి మభట్టారకుని జయిం చెనని ఫుటలకుఁ బుటలనింపియు నొక్కమారుగా నాకాశమునండి క్రిందికి జూి నట్లుగా 1420 వ సంవత్సరములో దేవరాయని కాలముననే శ్రీనాధుఁగు కర్ణాట రాజధానికిఁ బోయి వల్ల భాభ్యుదయమును రచించెనని చెప్పుటహాస్యాస్పదముగలేదా? పోనిండు ; ఇంకొక చిత్రమును జూడుడు. ఇంతకును, శ్రీవీరేశలింగముగారు వల్ల ఖాభ్యుదయమును తాము చూడలేదని వాయుచున్నారు. శ్రీ మాన వల్లి రామకృష్ణ కవిగారు క్రీడాభిరామపీఠికలో శ్రీనాథుని వల్ల భాభ్యుద యములోఁ గృష్ణాతీరముననుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్లలో జరుగు నసభ్యములు దీనికంటెఁ బచ్చిగా నున్నవి. ............మరియు వల్లభా భ్యుదయమున నాంధ్ర వల్లభుని తిరునాళ్ళలోని విధ వాదుర్వర్తనములు శ్రీ నాముథుడు కు శు విశదము గా వర్ణించి యున్నాడు........... .. శ్రీనాథుడు శ్రీ కుళాదీశ్వర తెలుఁరాయని సందర్శించి యతని కంకితముగావల్లభాభ్యుదయమును జెప్పెనుగదా." అని వ్రాసియున్నారు. ఈవాక్యములను బట్టి చూడగా వల్లభాబ్యుదయము శ్రీకాకుళాంద్ర దేవుని యుత్సవములలో నడచు చుండెడు విస్వస్తాదుల దుర్వర్తనములుగలది యనియు అది యాంధ్ర విష్ణుదేవునకే యంకితమొనర్చ బడినదియు దెలియవచ్చుచున్నది." అని వ్రాసియున్నాడు. దీన్ని బట్టి వల్ల భాభ్యుదయము వల్లభామాత్యుని కంకితము చేయబడినమాట వ్యర్థమగుచున్నది. ఇంకను వీటికి కామకృష్ణకవిగారి వాక్యము లే యాధారములై యున్నవి. ఆగ్రంథమును జూడనిదే వారి వాక్యముల నాధారము చేసికొని సిద్ధాంతము చేయబూనిన బరిహాసాస్పదుల మగుటనిక్కము, రామకృష్ణకవిగారుతొమ్మిది సంవత్సరముల క్రిందట నాపీఠికను వ్రాసినారు. తరువాత వారొకప్పుడు నాతో నల్ల భాభ్యుదయమును శ్రీనాథుఁడు రచించినాఁడనితాము' వాసినది పొర బాటని చెప్పినట్లు నాకు జ్ఞప్తి యందున్న ది.వల్ల భాభ్యుదయము మనకు లభించినప్పుడుగాని యాగ్రంథముశ్రీనాథుడురచించినదియు, లేనిదియు నిర్ధారణము కాజాలదు. శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ప్రప్రథముమునఁ దమ పీఠికలలో కొన్ని పొరబాటభిప్రాయములను 'దెలిపినమాట వాస్తవము. భ్రమప్రమాదములచే నొకప్పుడు తప్పుటూహలు కలుగవచ్చును. విమర్శకులు వానిని నంధ ప్రాయముగా విశ్వసింపకపరిశీలించియథార్థవిషయమునుగ్రహించితక్కిసదిత్రోసిపుచ్చుచుండవలయును. నల్లేరు పై బండి పఱువిడునట్లుగా రామకృష్ణకవిగారి యభిప్రాయములను ఖండించుటకై పఱువిడుచుండెడి యాంధ్రకవిచరిత్ర కారుఁ డీయభిప్రాయమును తాము గ్రంథమును పోయినను ప్రేమపూర్వకముగా స్వీకరించుటకుఁ గారణ మందు విశ్వస్తాదుల దుర్వర్తనము లభివర్శింపఁబడి యున్న వని వారు నుడివిన వాక్యములేయై యుండును. క్తీడాభిరామము

ఇది వీధి యను పేరంబరగిన యొక దృశ్య కావ్యము. ఇది దేశరూప

నాటక భేదములలో నొకటి. ఇది వినుకొండ వల్లభామా

త్యుని పేర శ్రీనాథుఁనిచే రచింపఁబడినదిగా దోచుచున్నది. వినుకొండ వల్లభ బాయఁడు నియోగి బ్రాహ్మణుడు. విశ్వామిత్ర గోత్రుఁడు; ఆశ్వలాయన సూత్రుఁడు; తిప్పనార్యుని పుత్రుడు. తిప్పనా ర్యుని ముత్తాతయైన చంద్రామాత్యుఁడు బుక్క రాజు నకు మంత్రియై నట్లుగా నీ క్రింది పద్యమునఁ చెప్పఁబషియుండెను,

శా, కర్ణాటక్షితీనాథుడెం పెదబుక్కక్ష్మాన్ దేవేంద్రున :
భ్యర్ణామాత్యుని దానశేఖారుడని ...బ్రాదీడు బంధుప్రియున్
వర్ణిచు గవి కోటి గందర జటావాటాతటారత్నదీ
స్వర్ణద్వంబుతరంగరంఖణలసత్సాహిత్యసాహిత్యమై

.


పల్లభరాయని పిన తాతయైన లింగమంత్రి హరిహరరాయల కొలువులోనుండి న ట్లీపద్యమునఁ దెలుపఁబడెను.

మ. కనకాద్రి ప్రతిమాన వైద్యనాధ లింగ క్ష్మాపమంత్రీంద్రుతో
ననతారాతినృపాలమంత్రి జనతాహంకారతారాహిమా
ర్కునితో రూపరతీద్రుతో హరిహరక్షోణీంద్ర సామ్రాజ్యవ
ర్దనుతోసాటి సమానమీడుగలా రాజన్యసైన్యాధిపుల్.


వల్లభ రాయనీ తండ్రియగు తిప్పన్న యను త్రిపురాంతక ముంత్రి కూడ హరిహరరాయల కొలువులోనుండి యాతని రత్న బాండార మున కధికారిగానుండెనని యాకింది పద్యమున దేలుపబడియె.

'సీ. సత్యవ్రతాచార సత్కీర్తి. గరిమల
జంద్రుతోడను హరిశ్చంద్రుతోడ
నాభిమానస్పూర్తి వైశ్వర్యమహిమను
రారాసుతోడ రేరాజుతోడ
సౌభాగ్యవైభవ జ్ఞానసంపదలను
మారుతోడ సనత్కుమారుతోడ

ల్యాను . నన్ను
కమరో పను - మనం
+ ర నాగ పని ఆ
మల్లి కార్డును ఆపు - మంచి మనం

రాముని కత్న భౌంజు రాధ్య శుకును వినుకొండ దుర్గ పొలకుండునైన గ్రంధకర్త వల్లభరాయడు ములికినాట మూడు గ్రా మగ్రాములతో మోపూరు పాలించుట చూపిగాఁగల విషయము లీక్రింది పక్యమునఁ దేలుపఁబడియెను,


సీ. మూడు గాను 7% ము* : హూ...
మోపూరు - చే ముల్క్ నాటు
సాశ్వలాయ శాఖరు . దు ఋగ్వేద .బు

  1. మంకంబువా జతచే

బ్యక్ష మంచి భై వస్వాముచే
సిద్ధసాన స్వక శ్రీపంచం
గాదు కాయంస విశ్వామిత్రగోత్రంబు
సెలక గోతంబుగా వార్తకెక్క
"నెవ్వఁడాతి పురాంతే కాధీశ్వరునకు
రాయన పత్ని భండార రక్ష కనకరం
బాయల నూజుండు చంద్రామాంబికకు సుతుడు
మనుజుమాళుండె వల్లభామాత్యవరుఁడు

తిప్పనవినుకొండ దుర్గాధ్యక్షుడైనట్లును దానికి బైచనవల్లభమల్ల నయను మూవురు పుతులు గలరని క్రింది - పద్యమువలన దేటపడుచున్నది.

ఉ.గంధ పడి ప్రతి పురఘు స్మగ పొద బిసపమానపు

పంథయచక 9వ రి శు9తపర్వక దుర్గ మహాప్రభాస రా"

వల్లభ రాయఁడు
కంగా 4 2 కప్పునే చుడ సుధీని గాం బక్తుల
జాలన సకల్పప్పకు ము ఆ బై వనవల్ల భమస్తు

-

ఇటువంటి వంశచరిత్రముగలిగిన వల్లభామాత్యునకును శ్రీనాధునకును మెత్రి సంభవించుట వినుకొండపట్టణముననే కాని విద్యానగనమున గాదని తోఁచుచున్నది. వ్ల్లభరాయడు 1404 వ సంవత్సరమువఱకును కర్ణాటకరాజ్య పరిపాలనము చేసిన హరిహర రాయల రత్నభాండా రాధ్యక్షులుడైన తిప్పన పుత్రుండగుట చేత నొసంవత్సరమున కనంతరమున నుండెననుటకు సందేహము లేదు. అందు చేత నీక్రీడాభిరామము 1420 వ సంవత్స ప్రాంతమునందు రచింపఁబడెనని నిరా క్షేపముగాఁ జెప్పవచ్చునని శ్రీ వీ రేశలింగము గారు వ్రాయు ' నేల విడిచి సాముచేయుటవంటిదిగా నుండును. ఎందుకన క్రీడాభిరామమును రచించు చుండఁగా శ్రీనాథుఁడు కర్ణాట రాజధానికి జూడఁబోయి నపుడాతనికి నొకగీత పద్యరచనమునందు దోడ్చడె ననివక్కాణించు చున్నారు. ఇవి యొక పెద్ద విపరీత సిద్ధాంతము. గ్రీడాభిరామము వల్లభామాత్యవిరచితము 'కాదనియు శ్రీ సాథకవి విచితమైయుండు ననియు నొక పూర్వపక్ష వాదము గలదు. ఈ వాదమును నెల కొల్పినవారు శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారు ఆట్లనుట అతి సాహస మని శ్రీ వీరేశలింగము గారనుచున్నారు గాని రామకృష్ణ కవిగారట్లు సం దేహించుటకు హేతువులు లేకపో లేదు. శ్రీడాభిరామము శ్రీ నాధకవి విరచిత మని సందేహించుటకు హేతువు , నీక్రింద నుదాహరించు చున్నాఁడను,

1. శ్రీనాథుఁడు , వీథినాటకమును రచించెనని యొక ప్రతీతీ వ్యాపించి యుండుటయు వీథినాటకలక్షణము లేని యొక గ్రంథము కొన్నిచాటూక్తులతో గూడుకొని వీథినాటకము పేర వ్యవహారమునందుండుటయు, 2.క్రీడాభిరామములో ' కందుకకేలి సల్పెడు ప్రకారమునన్ ' అను పద్యమును, కుసుమంబద్దిన చీరకొంగు దొలయన్ ' అను పద్యమును శ్రీనాథుని వీధినాటకములోని దని యప్పకవి యుదాహరించి యుండుట. యుంచుట.

3 క్రీడాభిభిరామములోని

 గీ.కార్యసిద్ధాఎముకను ప.? కాలు కలవు
శకునమూసుట యది బృహస్పరముకంబు
వ్యా సమతము ముసుమ సాజాతీశయము
..............</poem


అను 26 వ పద్యమునందలి ప్రథమ ద్వితీయ చతుర్ద పాదములు శ్రీనాథుడిటీవల రచించిన భీమేశ్వర పురాణ త్రితీయాస్వాసములో'

<poem>గీ..గార్గ్య సిద్ధాంతమతము కాల కలవ
శకున మానుట యది బృహస్పతి మతంబు
విప్రజన వాక్య మరయంగ విష్ణు మతము
సర్వ సిద్ధాంత మభిజిత్తు సమ్మతమగు

అను .41వ పథ్యమునందలి ప్రదమ ద్వితీయ చతుర్ద పాదములుగా నుండుటయు

4.వల్ల భామాత్యుని నతిశయోక్తులతో స్తుతించు పెక్కు పద్య ములు క్రీడాభిరామమున నుండుటయు.

దీనికిఁ బ్రతిపతులుగ నుండువారిలో ముఖ్యులు శ్రీవీరేశలింగముగారు. వీరు చెప్పుసమాధానముల నొకింత పరిశోధించిన దీనిచందము 'తేటపడఁగలదు. శ్రీవీరేశలింగముగారు “కొందఱు శ్రీనాధుఁడేక్రీడాభిరామమును రచించి దాని కర్తృత్వమును వల్లభరాయని కారోపించెనని చెప్పుదురు గాని » ఇది సిద్ధాంతము చేయుటకుఁ దగిన సదాధారము లేవియుఁ గానరావు. అప్పకవికిఁ బూర్వమునందున్న వారును

వల్లభరాయనికీ: జేరువకాలమునందున్న వారగుటచేత నాతని గూర్చి యెక్కువగా దెలియఁదగికవారును నైన చిత్రకవి పెద్దన్న, ముద్ద రాజు రామన్న, శ్రీధరుఁడు మొనలైన లక్షణగంథకర్తబూర్వోక్తపద్యద్వయమును వల్లభరాయనివనియే తమతమ లక్ష్మణగ్రంధములయం దుదాహరించి యుండఁగా నల్లభరాయని కిన్నూఱుసంవత్సరములకు వెనకనుండిన యప్పకవియవి శ్రీనాథుని వనుట యజ్ఞానమూలమునఁ గాని తెలిసి చెప్పుట చేతగాను. వల్లభరాయని సందర్శింపబోయి నప్పుడాతఁడు క్రీడాభి రామమును రచించుచుండఁ గాఁ జూచియుండుటచేతనో తత్పద్యరచనమునం దాతనికిఁ దోడుపడి యుండుట చేతనో శ్రీనాధుఁకుతాను తరువాత రచించిన భీమఖండము సందు సంస్కృతశ్లోకమును దెనిగించుచు 'గార్గ్యసిద్ధాంతమత' మన్న పద్యములోఁ గొంతభాగ మట్లే వేసియుడవచ్చును. అంతకంతముచేతఁ బుస్తక మంతయు శ్రీనాథవిరచిత మనుట యతిసాహసము" అనిసమాధానము వ్రాసియున్నారుగదా! శృంగార దీపిక శ్రీనాథకృత మనుటకు శ్రీనాథుని శాసనములలోఁ గన్పట్టెడి శృంగార దీపికలోని 4, 5శ్లోకములు రెండు మాతమే యాధారములుగా నున్నవని దెలిపెడిశ్రీవీరేశలింగముగారు, శ్రీనాధుని శాసనములలోని శ్లోకములకే భేద మించుకయు లేక సరిగా నిందుఁగనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగారదీపికను రచించియుండు' నని సాహసించి చెప్పఁ గలిగినను, అట్టి సాహసము క్రీడాభిరామము పట్ల కలుగకున్నది. అప్పకవి యీ రెండు పద్యములను శ్రీనాధుని వీధినాటకములోని వనుటకు నజ్ఞానమే కారణ "మైనయెడల నెవరో పుల్లయ్య వీదినాటక మనక శ్రీనాథుని వీధినాటక ములోనివని యెందుకనవలయును? ఈ రెండు పద్యములు శ్రీనాథునివీధి నాటకమని వ్యవహరింపబడెడి జవాబు. గ్రంథములోఁగూడ నున్నవి గదా. అప్పకవినాటికే శ్రీనాథుఁడు వీధినాటకము రచించెనను సంగతి వ్యాప్తములో నన్నడనుమాట యైనను అప్పకవి గ్రంధమువలన స్థాపింపఁబడుచున్న దనుక స్పష్టముగదా. వల్లభామాత్యుఁడు 1420 లో క్రీడాభిరామము రచించుచుండఁగా జూచినవాఁడగుటచేతనో తత్పద్యరచనమునం దాతనికిఁ దోడుపడియుండుట చేతనో శ్రీనాథుఁడు 1430 వ సంవత్సర ప్రాంతమున అనఁగా 10 ఏండ్లకుఁబిదపఁ దానురచించిన భీమేశ్వరపురాణములో సంస్కృత శ్లోకమును దెనిగింపుచు క్రీడాభిరామ ములోని “గార్గ్యసిద్ధాంత" మన్న పద్యములోని మూడు చరణము. నట్లే వేసియున్నాడట! ఆహహా' ఎంత చక్కగా నున్నది.భట్టుమూ ర్యాదులను గూర్చి వ్రాయు సందర్భమున సిద్ధాంత 'మేల పనికిరా దయ్యెనో! క్రీడాభరామపీఠికలో వ్యతిరేకోక్తులతోఁ దన్ను దాను పొగడుకొనియుండునా? వానినీక్రింద నుదహరించుచున్నాను. చూడుడు. "మనుజమాత్రుండె వల్లభామాత్యవరుండు అను తుది పాదముగల సీసపద్యము నిదివజుకె యుదహరించి యున్నాఁడను.

కం. ఆహరవథి సమయ నృత్య
త్తుహి నాంశుధర ప్రచార దూతాధ్రదునీ
లహరీభ్రమ సుమఘుమములు
వహియప్పయ వల్లభన్న వాగ్వైభవముల్.


కం. హాటకగర్భవధూటే
వీటి కర్పూరశకల విసృమర పౌర
భ్యాటోప చాటుకవితా
పాటనమగు ధఱణీ వల్లభన్నకు నమగన్.

కం. హల్లీసక నటనోద్భవ వల్లభహరీ కృష్ణకంఠ వనమాల్యమిళ ద్దల్లన్ సురభులు తిప్పయ వల్లభరాయయప్రధాన వాగ్వైభవముల్",

కం. అమృతరససమధన సంభవ

ఘుమఘుమమిళ ఫయః పయోధి కోహలము

బ్రమియించు దిప్పనచిరో
త్తమునల్లభ విటునిచాటు భారఫణితుల్"

కం.భిల్లావతార మధుభి
ద్బల్ల భుజాస్ఫాల్యమాన పటు పజ్యా
దల్లీ మతల్లి చెల్లెలు
వల్లభరాయప్రథాన వాగ్వైభవముల్.

కం. నెల్లూరి తూము కాలువ
హల్లకముల కమ్మ దావి నపలాపించున్
సల్లలిత లీలదిప్పయ
పల్లభిరాయపథాన వాగ్భంబరముల్.

కం. ఉపమించెద ధారాధన
తపజరై రాజరాజు ధారానగరా
ధినధారాధర వాహుల
ద్రిపురాంతక వల్లభుని వితీర్ణప్రౌడిన్.

కం.పరివత్తు వీనికీంనిర్జన
పరిప్పడమణి ధనదజలదవ ఖచర నిశా
కరసురతరు సుధేనువు
అరుదేత్రిపురాని వల్ల భామాత్యునకున్


శా.పారాచారమువన్ వివేక సరణిన్ సౌభాగ్య భాగ్యంబులన్
దౌరంధర్యమునక్ బ్రతాపగరిమత్ దావంబున్ నష్ సజ్జనా
దారున్" దిప్పనమంత్రి వల్లభు నమాత్య గ్రామణింబోల్పగా
వ్వేరుమంర్తులును సింధువేష్టిత మహోర్వీచక్ర వాళంబునన్

సీ. మందార వారుణీ మదమూర్మి తాత్ముచే
వెడదకన్నుల చిన్నివడుసచేత
ఢమరు ఖట్వాంగదండక పాలపాణిచే
దూర్తబాలక చక్రవర్తిచేత

గుక్కున పరివార కోటి సేవితులిచే
వెలఁదికోఱలమోము వేల్పు చేత

విశ్వవిశ్వం బుపాలించు విభునిచేత
జార్వతీ దేవి గారాపుబట్టి చేత

నీప్సితముగాంచు దిప్పమంత్రీంద్ర తనయ
ద్మామణివల్లభత్యుండహరహరంబు


ఆమంత్రి శేఖరుడు రావి పాటి త్రిపురాంత దేవుం డను కవీశ్వ
రుం డొనరించిన ప్రేమాభిరామనాటకంబు ననుసరించి క్రీడాభి రామం
బును రూపకంబు తెనుంగు బాస రచియించినవాడు.

గీ. ఆతఁడెంతటివాడుప్రేమాభిరామ
మనగ నెంతేటి యది దానిననుసరించి
వీధియమ రూపకము మది వెఱపు లేక
తిప్పవి:భ్పుల్లభుడెట్లు తెనుఁగుజేసె

ఈవిధముగా వల్లభామాత్యుడు తనకుఁదానే పొగడుకొను చుండుట శ్రీవీరేశలింగముగారికి వింతగాను, వెగటు గాను గనుబట్ట లేదు. ఆత్మ గౌరవముగల కవి యెవ్వఁడు నీరీతిగాఁ దన్ను బొగడుకొనియుండడు. ఎంతటి స్తోత్ర ప్రియుఁడైనను నీరీతిగాఁ బొగడుకొన్న లోకము నవ్వునని సిగ్గుపడకమానఁడు. కావున నీపొగడ్తలన్నియును మఱియొక కవివై యుండ వలయును. అట్టికవి శ్రీనాథుడే గాని మఱియన్యుఁడుగాడు. తమ కవిత్వ మును గొంచె మతిశయోక్తులతోఁ బొగడుకొన్న మడికి సింగన, సంకు సాల నృసింహకవి మొదలగువారిని స్వాతిశయముకలవారని నిందించిన వీరేశలింగముగాగు వల్లభామాత్యునిపట్ల మౌనధారణము వహించి మిన్నకుండుట సత్యాశ్చర్యకరముగా నున్నది. “ఈవల్లభరాయని కవి త్వము మృదుమధురపద గుంభనము గలదయి పౌఢముగా నున్నది కాని కొన్ని చోట్ల గ్రీడాభిరామములోని వర్ణనము లసభ్యములయి య శ్లోలములయి నీతి బాహ్యము లయి యుండుట చేత స్త్రీలును సొమా న్యజనులును జదువఁదగినది కాదు." అని మాత్రము వ్రాసినారు. మఱి యును “జారత్వము దూష్యముగాఁ బరీగణింపఁబడక శ్లాఘముగా నెంచఁబడెడు కాలమునందుఁ జేయఁబకిన గ్రంథ విషయము మనము కాలమును నిందింపవలసిన దేకాని కవిని గర్జింపవలసిన పనిలేదు.” కాలమును నిందించినారు. ఈకడపటి యభిప్రాయమునే శ్రీవీరేశలింగము గారు పలుతడవులు వక్కాణించి యున్నారు. గావున నంచునగూర్చి ప్రత్యేకముగా మఱి యొక స్థానమునఁ జుర్చేంపబూని యిచ్చట విరమించు చున్నాము. కాలముకు మాత్రము నిందించెనే కాని కవిని మాత్రము శ్రీనాథుఁడు కాడనుకొనుటచేత జారుడనికాని పాపుఁడనికాని నిందిం పక విడిచి పెట్టినారు. ఒక వేళ అభాగ్యో పాఖ్యానము, ప్రహసనములు మొదలగునవి వ్రాసిన తామాకవిని నిందించినపక్షమున నయ్యవి తమకుఁగూడ నన్వయించునేమోయన్న భయముచేత విడిచి పెట్టినను పెట్టియుందురు. ఆవిషయ మలుండనిండు ఈ వీధినాటకము పై హేతు వులచేత వల్లభామాత్య విరచితము కాదేమో యని యెట్టి వానికిని సంది యము గలుగకమానదు. ఎట్లైనను అంతకుం గాకపోయినను గొంతవఱ కైనను శ్రీనాథుని చేయి యారచనమునఁ బాలుగొని యుండక పోదని, విశ్వసించవలసి వచ్చుచున్నది.


సీ. అలకాపు, బున నం గాత వర్ముఁడర్
గంధ్వపతికన్య కమలపాణి
యాదివ్యగంధర్వ కళావతారంబు
మధుమాపతోర్గంటీ మండలమున
నాసుందరాంగి దాక్షారామ మునఁబుట్టు
భువనమోహిని చిన్ని పోతియనఁగ
పట్టిసత్ స్త్రీజాతి యాసానికూతురు
చిర కాలమున సదాశివునికూడి
పొవనంబైన తమి లేటి సరసమున
పేగి కురువాటి కాదేశ విపినభూమి
గోవులను పేర చెంచులకులమునందు
గలీమిగిత్తుల యమ్మ నాఁ గలుఁగలదు.

అను పద్యములో . నుదాహరింపఁబడిన స్థలముల నన్నిటినీ జూచిన వాఁడేగాని మఱియొక్క, డిట్టి పద్యమును వాసి మధుమావతీ దేవి ?

పూర్వజన్మమున నిట్టిదని భావిజన్మమున నిట్లు పుట్టునని భూత ధివిష్య త్కాలముల జన్మములును జాతులును జెప్పుట సంభనము కాదు, ఈ దేశము లసన్నీటిని దిమ్మతిరిగి దేశముల యొక్కయుఁ బ్రజ ల యొక్కయు రీతుల నెరిగినవాడు శ్రీనాథకవివర్యుఁడు గాని వల్లభామాత్యుడు గాడని మన మెఱుంగుదుము. కనుక శ్రీనాథుఁడే క్రీడాభి రామమును రచించియు డవచ్చును.

క్రీడా కామకర్తృత్వ విమర్శనము.


ఈ పైరీతిని కీ డాభి రామమును గూర్చి 1918 సంవత్సరమున నేను బ్రకటించిన శ్రీనాథకవి జీవితము యొక్క ప్రథమముద్రణగ్రంథమున వ్రాసి ప్రకటించిన తరువాత ప్రభాకరశాస్త్రి గారు నా యభిప్రాయము బలపఱచుచు మఱికొన్ని దృష్టాంతములను జూపుచు1923 సంవత్సరమునఁ దాము ప్రకటించిన శృంగార శ్రీనాథ' మను గ్రంథమున నీ వాదమును గొంత విపులము గావించిరి. అందుపై నినా మిత్రులగు వేమూరీ విశ్వనాథశర్మగారు క్రీడాభిరామ గ్రంథకర్తశ్రీనాథుఁడు' యను శీర్షికతో ప్రభాకరశాస్త్రిగారు చూపిన హేతువులను ఖండించుచు 'దమ , యుక్తులచే క్రీడాభిరామ గ్రంథకర్త వల్లభరా యఁడే గాని శ్రీనాథుఁడు. కాఁడను వీరేశలింగముగారి వాదమునునిలువఁ బెట్టవలయు నని చేతనై నంతవఱకుఁ బ్రయత్నించి సమర్థింపఁబూనిన నొక వ్యాసమును భారతీపత్రిక యందుఁ బ్రకటించిరి. అటుపిమ్మట శర్మగారి వాదమును సంపూర్ణము ముగా ఖండించుచు క్రీడాభిరామ కర్తృత్వ విమర్శన' మను శీర్షిక పేరుతో దీర్ఘ పరిశోధ నముతో గూడిన యొక పెద్ద వ్యాసమును రాఘవాచార్యులుగా రాభారతీపతిక యం దే క్రీడాభిరామ గ్రంథకర్త వల్లభరాయుఁడు గాక శ్రీనాథుఁడే యై యుండవలయు సని. శర్మ గారికిఁ బ్రత్యుత్తరము . ప్రాసి యున్నారు.*[5] విమర్శకులకుఁ బ్రత్యేకము శ్రమ తొలగించుటకై విశే షముగాఁ బరిశోధనము చేసి పదపద్యభాపసొమ్యములు గల పద్యము లను శ్రీనాథకవి రచితములైన యితర గ్రంథములలోని పద్యములతో బోల్చి చూచుకొనుటకై క్రీడాభిరామమునుండి 'పెక్కు పద్యముల నెత్తి చూపి యున్నారు. కాని వ్యాసపీఠికలోని బుక్క రాయాదుల కాల - నిర్ణయమును గూర్చి చేసిన ప్రశంసలో నుదాహరించిన సంవత్సరము లన్నియు నిజమైన చరిత్ర కాలమునకు భిన్నములుగా నుండుటయే గాక రాజుల నామములు గూడ తప్పులుగా వ్రాయఁబడినవి. రాఘవా చార్యులుగారు విద్యాధికులయి యుండి చరిత్రము బాగుగాఁ దెలిసిన యీ కాలమునఁ గూడ నట్టి యాభాసచరిత్రమును . వెల్లడించుట చరి తజ్ఞులలో హాస్యాస్పదులగుటయే గాక చరిత్రమును దెలియనివారిని మాజు త్రోవలం బెట్టిన వారగుచున్నారు. తనకు చరిత్రము తెలి యనప్పు డావిషయమున మౌనము వహించుట గౌరవాస్పదమైన విషయము,

“ ప్రథమ దేవరాయ లనఁబడు హరిహరి రాయలు క్రీ. శ. 1425 నకుఁ బూర్వమునను, ద్వితీయ హరిహర రాయలు క్రీ. శ. 1425--1446 సంవత్సరములలోను రాజ్య మొనర్చినట్లు గర్ణాట రాజ్య చారిత్ర పరిశోధకులు వాసియున్నారు. ఇందు వల్లభరాయల తండ్రి ప్రధమ హరిహర రాయల యాస్థానమున రత్నభాండాగా రాధ్య క్షడైనచో కవియు క్రీ. శ.1450 ప్రాంతము " వాడగును. ద్వితీయ హరిహర రాయ లయినచో కవి క్రీ. శ. 1475 సంవత్సర ప్రాంతము వాడగును. అళియరామరాజు ముత్తాతయగు సోమభూపాలుని కంకిత మీయఁబడిన 'శ్రీ'ధరచ్చందమున (మంచనవింటినో యను క్రీడాభి


11 రామములోని పద్య ముదాహరింపఁబడినది. అళియ రామరాజు సదాశివరాయని కాలములో కర్ణాట రాజ్యమును బౌలించుచుండెను. సదాశివరాయలు క్రీ శ.1540 పాంతమువాఁడు సోమభూపాలువకు సోమరామ రాజునకు మూఁడు తరము లంతగ ముందుటచే శ్రీధరునకును భూపాలుకును క్రీ. శ. 1465 ప్రాంతము వారగుదురు. శ్రీధరునకుఁ బూర్వపువాఁడగుటచే కవి క్రీ. శ. 1450 సంవత్సర ప్రాంతమున నుండియుండును. కవి తండ్రియగు తిష్పనయుఁ బ్రథమ హరిహర రాయల యాస్థానమునందుండ నొప్పు."

ఈ పై వాక్యములు తమ వ్యాసములోఁ బీఠిక భాగమున రాఘవాచార్యులుగారు పొందుపజిచి యున్నారు. ఇయ్యవి వీరు నిజముగా చరిత్ర మెఱీగి వ్రాసిన వాక్యములు గావు. మీదుమిక్కిలి కర్ణాట రాజ్యచారిత్ర పరిశోధకు లిట్లు ప్రాసినారని వ్రాయుచున్నారు. నే నెఱిగినంతవఱకి ట్లెవ్వరును వ్రాసి యుండ లేదు.

విజయనగర రాజుల సరియైన ప్రభుత్వ కాలము

మొదటి హరిహరరాయలు క్రీ.శ. 1336, మొదలుకొని, 1355 వఱకు వీరబుక్కరాయలు " 1355 " 1377 " రెండవహరిహరరాయలు 1377 " 1406 " మొదటి దేవరాయలు 1406 " 1422 " విజయబుక్క రాయలు 1422 " 1423 " రెండవ దేవరాయలు లేక ప్రౌడదేవరాయలు 1423 " 1447 "


మనకవి వల్లభరాయఁడు ప్రౌఢ దేవరాయల కాలములోనున్నవాడు. వీనితండ్రి మొదటి దేవరాయల కాలములో నున్నవాడు. ఈ పై విజయనగర రాజుల నామములు సరియైనవనియు, వీరి పరిపాలనాకాల మెవ్వ రేవిధముగాఁ జెప్పినను ఒకటి కెండు సంవత్సరముల భేదముతో సరిపోకమానవనియు, శ్రీమాన్ కీలాంబి రాఘవాచార్యులు ఎమ్. ఏ. బి. ఎక్. గారు మఱొకమాఱు శద్ధతో బరిశోధించిన యెడ వారు తెలిసికొనఁగలరని నాదృఢమైన విశ్వాసము. అట్లుచేయఁ బార్థింతును . వారు చేసిన గొప్పతప్పేమన మొదటి దేవరాయలు, 'రెండవ దేవగా యలు లేక ప్రౌడ దేవరాయ ల నుటకు మాఱుగా ప్రథమ హరిహర రాయలు, ద్వితీయ హరిహర రాయులని వ్రాయుటయే. ద్వితీయ హరిహర రాయలు క్రీ. శ. 1425-1446 సంవత్సరములలో రాజ్య మొనర్చినట్లు మొదట వ్రాసి తరువాత కిందను 'ద్వితీయ హరిహరరాయ లయినచో కవి క్రీ. శ.1475 ప్రాంతము వాఁడగునని వ్రాయుట మఱియొక తప్పు. అళియ రామరాజు ముత్తాతయగు సోమభూపాలునకు శ్రీధరఛందస్సు అంకితము చేయఁబడినదనుట మఱియొక తప్పు. అళియరామరాజు ముత్తాత యార్వీటిబుక్క రాజు గాని సోమభూపాలుఁడు గాఁడు.

అళియ రామరాజు వంశము బాలభాగవతము సందును, నరపతి విజయము నందును దెలుపబడినది.

తాత పిన్నమరాజు కొడుకు సోమ దేవరాజు, వానికొడుకు రాఘవరాజు, వానికొడుకు పిన్నమరాజు, వానీకొడుకు బుక్క గాజు;వాని కొడుకురామ రాజు; వానికొడుకు తిమ్మరాజు; వానికొడుకు శ్రీరంగరాజు; వానికొడుకు అళియ రామరాజు.ఇట్లుండఁగా ఆళియ రామరాజు ముత్తాత సోమభూపాలుఁడనుట తప్పు. అళియరామరాజున కేగు తరములకుఁ బూర్వమున్న వాఁడు సోమ దేవ రాజు. ఈ సోమ దేవ గా జే సోమభూపాలుఁ డనుకొంద మన్న' నతఁడు క్రీ. శ. 1320 సంవత్సరమునకుఁ బూర్వుఁడు కాని ' తరువాత యుండఁడు. అతని కంకితము చేయఁబడిన శ్రీధరఛందస్సులో 1450 ప్రాంతమున వ్రాయఁబడిన క్రీడాభిరామములోని మంచనవింటినో?! మొవ్వ "రేవిధముగాఁ జెప్పిసను ఒకటి గెండు సంవత్సరముల భేదముతో సరిపోకమానసనియు, శ్రీ మాన్ కిలాంబి రాఘవాచార్యులు ఎమ్. ఏ. బి. ఎల్. గారు మఱోకమాఱు శద్ధతోఁ బరిశోధించిన యెడ వారు తెలిసికొనఁగలరని నాదృఢమైన విశ్వాసము. అట్లు చేయఁ బ్రార్థింతును . మీరు చేసిన గొప్పతప్పేయన మొదటి దేవరాయలు, రెండన దేవరా యలు లేక ప్రౌఢ దేవరాయలనుటకు మఱుగా ప్రథమ హరిహర రా యలు, ద్వితీయ హరిహర రాయని వ్రాయుటయే. ద్వితీయ హరిహర రాయలు క్రీ. శ. 1425--1446 సంవత్సరములలో రాజ్య మొనర్చినట్లు మొదట వ్రాసి తరువాత కిందను 'ద్వితీయ హరిహర రాయ లయినచో కవి క్రీ. శ. 1425 ప్రాంతము వాఁడగునని వ్రాయుట మఱియొక తప్పు. అళియ రామరాజు ముత్తాతయగు సోమభూపాలునకు శ్రీధర ఛందస్సు అంకితము చేయఁబడినదనుట మఱియొక తప్పు. అళియ రామరాజు ముత్తాత యార్వీటి బుక్క రాజు గాని సోమభూపాలుఁడు గాఁడు.

అళియ రామరాజు వంశము బాల భాగవతము నందును, నరపతి విజయము నందును దెలుపఁబడినది.

తాత పిన్నమరాజు కొడుకు సోమ దేవరాజు; వానికొడుకురాఘనరాజు; వానికొడుకు పిన్నమరాజు, వానికొడుకు బుక్క రాజు,వానికొడుకు రామ గాజు; వానీకొడుకు తిమ్మరాజు, వానికొడుకు శ్రీరంగరాజు; వానీకొడుకు అళియ రామరాజు. ఇట్లుండగా అళియరామరాజు ముత్తాత సోమభూపాలుడనుట తప్పు. అళియరామరాజున కేడు తరములకుఁ బూర్వమున్న వాఁడు సోమదేవ రాజు. ఈ సోమదేవ రాజే సోమభూపాలుఁ డనుకొంద మన్న సతఁడు క్రీ. శ. 1370 సంవత్సరమునకుఁ బూర్వుఁడు కాని తరువాత యుండఁడు. అతని కంకితము చేయఁబడిన 'శ్రీధర ఛందస్సులో 1450 ప్రాంతమున వ్రాయఁబడిన క్రీడాభిరామములోని మంచనవింటివో అనుపద్య ముదాహరింపఁ బకుటయెట్లు. అట్లొక వేళ యుండిన తరువాత నెవ్వరివలననో యందు చేర్చఁబకి యుండునుగాని గ్రంథకర్త చేర్చినవాఁడని చెప్పవలను లేదు. ఇంతకును. శ్రీధరక ఛందస్సు నంకితము పొందిన సోమభూపాలుఁ డే సోమభూపాలుఁడో రాఘవాచార్యులు గారు సరిగాఁ బరిశోదింప లేడనుకోనియెదను. ఇట్లు వ్రాసినందుకు రాఘవాచార్యులుగారు నన్ను క్షమింతురు గాక!

ఈ వీఠిక భాగమును విడిచి పెట్టిన యెడల శ్రీయాచార్యుల వారి వ్యాసము సర్వవిధముల యోగ్యమయినదిగా నున్నదనుటకు సందియ ము లేదు. ప్రతిపక్షుల వాదము మరల తలయెత్త కుండ జేయఁగలిగిరి. నావంటి విమర్శకునకును గ్రంథ పరిశోధన పరిశ్రమ బాధలు లేకుండఁ జేసి నందులకు వారి కనేక కృతజ్ఞ తాభివందనములను మనః పూర్వకముగా సమర్పించుచున్నాను. వినుకొండ వల్లభరాయఁడు:--

అశ్వలాయన శాఖయందు ఋగ్పేదంబు
కరతలాచులకంబుగాఁ బటించెం
బత్యక్ష మొనరించి థైరవస్వామిచే
సిద్ధసారస్వత శ్రీవరించె

అని వర్ణింపఁబడియుండియు, గవిసార్వభౌముని చేతిలో వెఱివెంగలయ్య యయిపోయినాఁడు.'తా నీగ్రంథకర్తృత్వమును గోరక గ్రంథము నంకితము బొందియుండినయెడల నాంధ్ర ప్రపంచమున నెంతో గౌరవము నొంది యుండును. "కవీంద్ర కాంక్షిత దశమహీరుహము' కావునవల్లభరాయఁడు యశము న విశేషధనమునొసంగి గ్రంథకర్తుృత్వము దనపైబెట్టిం చికొనసాహసించి యుండ నోపు. వల్లభరాయఁడు యశోలోభమున లోకమున నవ్వుల పొలగుచున్నాఁడు. ఎంతవిద్యాధికుఁ డయినను నెట్టి ప్రతిభాశాలి యైనను క్రీడాభి 26 రామగంథకర్తృత్వమును 'వల్లభరాయనికీ నిలుప 'సమర్థింపఁబూనువాడుగూడ లోకమునఁ బరహాసాస్పదుఁడు గాకమానఁడు. అట్లగుటనెఱింగియు విశ్వనాధశర్మగారు తగుదుననీ ముందుకు వచ్చుట వింతగా నున్నది. ఒకటిగాదు;రెండు కాదు; వందలకొలది నున్న వానిని సమర్థించు కెట్లు? ఇట్టి సందర్భమున యుక్తి ప్రయుక్తుల వలనఁ బ్రయోజన,ముండునా? పదసంవిధానమునందును, 'కారక ప్రయోగవైచిత్రి పద్యాప శ్రమ నిర్వాహములందును, అన్వయక మమునందును, ప్రతిపదమును శ్రీనాథుని జ్ఞప్తికిఁ దెచ్చుచుండఁ గాదనుటయెట్లు? సంస్కృత వాజ్ఞ్మయ మందును పూర్వకవుల పద్యములలోని భావములను, కూర్చును సర్వాచీనకవు లనుకరించుట సనాతన సంప్రదాయ మనవచ్చును. అది గంథ చౌర్యములోనికిఁ జేరదు. సందర్భము ననుసరించి దములకూర్పున మార్చుచూ, పూర్వకవి ప్రయోగములకు మెఱ గులు పెట్టుచు తరువా తికవులు తమ తమ కవితల వెలయింపఁ జేసి యు న్నారు గాని పద్యములకుఁ బద్యములే, పద్యములోని రెండేసి, మూడేసి పాదములను బదముల కూర్పునం దొకింతయు మార్చు లేకుండనే ప్రసి ద్ధాంధ్ర కవియు దొంగిలించి యుండలేదు. ఇది కేవలము దొంగతనము అని చెప్పరాదు. ఈగ్రంథ మామూలాగ్రము శ్రీనాథ రచనమనియె గన్పట్టుచున్నది

పదపద్యభావసామ్యములు

గీ. "గార్గ్యసిద్ధాంతమత ముషః కాలకలన
శకునమూనుట యుదే బృహస్పతిమతంబు
వ్యాసమతము మన ప్రసాదాతిశయము
విప్రజనవాక్య మగయం.. విష్ణుమతము,
గీ. గార్డ్యసిద్ధాంతమత ముషః కాలకలన
శకునమూనుట యది బృహస్పతిమతంబు

<విప్రజన వాక్య మరియంగ విష్ణుమతము
స్వసిద్దాంత యభిజిత్తు సమ్మతమగు, బీమఖండము,

శా. ప్రాలేయాహిత సంప్రతిదీప్తి పకిర ణ ప్రక్రీదవ : పల
జ్వాలా జాలజటాల జాంగలత వాచాలకోయిష్టియై
హర (అ. . ప. 109
శా, వాలెన్ దిక్కుల భానుబాజ్యతి కర ప్రక్రిపదపల.
జ్వాలాజాలజటాలబా గలతటీ వాచాలకోయిష్టులై,
(వీ. ప.

వీణా క్వాణ పొణింధమంబైన వీధి. ప. 100
కలమధుకవీణా క్వాణ పాణింధ మం బై , భీ. ఖం.2. 110.
పాణింధమం బను పకము శ్రీనాథుని కవనంబునఁ జెక్కుమా
జులు ప్రయోగింపఁబడియుండుట గాననగును.

గంధసార తుషార పాణీంథమంబు" భీ.ఖం. 1. 43
ప్రవాహధా భాగంథ పాణింధమం బైన కా.ఖం 2.. . 44
నీహార శ్రీరధారా శ్రేణి పాణి ధమం 'బైన కా , ఖం. 3. 117
మాణిబంధాశ్వ లక్షణ పొణింధమములు కా. ఖం. 4-119
కాలహటచ్ఛాయా పొణింధముంబై " 4. 118
కేసర పరాగ గంధ పొణీంధమంబై " 4- 272
నిశ్శ్వాసాగ్ని పాణీంధమం బేలా శృం.నై.2- 32
కోదండనా రాచ ధారా పొణింధమంబు , శృం, 8- 47
శృంగార నైషధమున 'నిశ్శ్వాసాగ్ని పాణీంధమం బేలా!' అను
పద్యమునకు మూలమునందు “పాణింధమం' బను పదము గాన రాదు

వ్యామోహ్య నితంబబింబ.... వీధి వ్యామగ్రహ్య స్తములగు భామినులు.... వ. టిట్టిభ! యదె చూడు వరుణ రాజపోరాంగనా విలాస దర్పణాను కారి యై యహర్పతీ కుంకఁబోయె... వీధి..

క. : "మాల ఖం.....బున
ది మై యొక్కింత తడువు. ద్య్నకరుడొప్పెన్
వరుణుని శుద్ధాంతంబున
నా నిందాక్షులకుచికలకు మిందు టద్దంబగుచున్ ,
భీమఖండము.

వ. నెఱసంజయు మసమస కని చీకటియుఁ గలసి దిక్సౌథకూటవాటి.
నికరంబుల వేలవిడిచిన గురివింద పూసల పేరునుం బోలెఁ బొలుపు
మిగిలె.., వీధి.

కి. పసుబాప యెండ కొనలును
మనసునకని యరలగలసి మనమలరించెన్
జసలనలుగడల గుంజా
పాసరంబుల సరుల వ్రేలవిడిచిన భంగిన్ శృం.నై. .
గన్నేరుపూఁ బాయకర మొప్ప నీర్కాని
మడుఁగు దోవతి పింజెవిడి చికట్టి - వీధి.43
గన్నేరుపూచాయ గనుపట్టు జిలుగైన
సలిల కాషాయవస్త్రంబుగట్టి శృం. నై.
గొజ్జంగిపూనీకు కులికి మేవించిన వీధి
గొఱ్ఱంగి పూ దేనె కులికి మేదించిన కా..ఖం.3- 118

గంగమట్టి లలాటకమునదీర్చి. . , వీధి
గంగమట్టియమీద గస్తూరి రసమున
బుండ్రకంబు లలాటకము నదీర్చి శి. మా.

వ్రీజాశూన్య కటీరమండలము 'దేవీ శంభళీ వ్రాతమున్ . వీధి
కఱివ్రీడాశూన్య కటిగోపుర ద్వార పరిరక్షకుఁడు. కా. ఖం.1. 2
లజ్జయఱంగని కటీమండలంబుమీఁద. కా. ఖం. 3- 240

మధు కైటభారాతి మడుఁగుఁ బాంపు- వీధి.221
మధుకైటభోరాతి మడుఁగు బాన్పు - కా, ఖం. 3- 169

 తోక చుక్కల బోలు లోకంపు జెలికన్ను
లా వైళమున సిగ్గునతక రింప....................................వీధి.137

తోక జుక్కలఁబోలుఁ దృక్తోయజముల శృం. 5- 60

హర్ష నైషధమున గానవచ్చు శ్లోకమున తోకచుక్కల బోలు'
అను దానికి మూలము గనంబడదు.
స, 03

నిద్దంపు వెలి పట్టు నెఱిక దూరిన యప్డు
తొడలమించులు వెలిదొంగలింప ..
అచ్చవెన్నెల చాయ నవఘళింపఁగఁ జాలు
నిద్దంపు వెలిపట్టు నెఱికగట్టి శృం. నై. F...

ఈ సీసపద్య పాదమునకు సరియైన మూలము హర్ష నైషధమున
గాన రాదు.
రా, 12

ఆ లీఢ పాద విన్యాస "మొప్పఁగ వ్రాలి క్రీ.రా.117
ఆలీడ పాద విన్యాసంబు శృంగార
వీరాద్భుతంబులకు విందు సేయ 6.22శృం. నై .
వ్యామగ్రాహ్య నితంబ బింబకుచహా
రాఖిల భద్రాకృతుల్ క్రీరా. 209
వ్యామ గ్రాహ్యకుచంబు లంటి యిదెనా
ప్రాణంబు రక్షించెదన్ శి.మా. 3- 87
వ్యామగ్రా హ్యాపయోధరల్ కా.ఖం 3.43

వ్యామలొ హ్యాపయోధరల్ హ.వి.5. 23 వ్యామగ్రాహ్యస్తు నులగు భామలు శృం.నై. 8. 98 మూగ్రంథమగు 'హర్ష నైషధమున నిది . గా సంబడదు,

నింగియింగిలీకంబునం బెట్టి..................క్రీ.రా.273
నింగియింగిలికాన సభ్యంగమార్చె.............కా.ఖం. 1-1-24

రోలంబంబులు మూతిముట్ట వెఱచెన్
గ్రొవ్వేడి చీరెండలన్ .............................క్రీ.రాం 153.

మొకరి తుమ్మెద మూతి ముట్టనో డెడి........శి.మా. 2. 107
కోమలి నిట్టూర్పు కొవ్వేడి నెత్తావి
మొకరి తేంట్లును మూతిముట్ట వెఱచె శృం, నై -2.113

శృంగార నైషధము నందలి పై పద్యభాగము మూల నైషధము
నుండి యంద్రీకరింపబడి యుండ లేదు. శ్రీనాథుని స్వక పోలకల్పిత మే.
కోయిలలు కొసరుట శ్రీనాథునకుఁ గడునింపు గూర్చు వర్ణ నమని.

కోకిలము పంచమశ్రుతి గొనరీనట్లు...........క్రీ.రా...101

కొసరి వసంతకాలమున కోయిల శ్రోల్చిన భంగి 'కా.ఖం.5-177
కోసరి నుద్యానఫుం స్కోకిలములు.............హ.వి. 7-135

కోకిల పంచమస్వరము క్రోల్చినభంగి...........క్రీ.రా.101
కొనరె నుద్యానపుంస్కోకిలములు .................హ.వి.7- 135
కోయిల పంచమ స్వరము క్రోల్చినభంగి .......క్రీ.రా. 177

కోకిలం 'బెప్డుకూయునో కొసరి యనుచు..........శృం. నై.4- 20
హర్ష నైషధమున నిదియుఁ గానరాదు..

కంఠ గైవేయ ఘంటి కాటంకారంబులును ...
కరిఘటాకంశ క్రైవేయ ఘంటికాలం కారంబు బ్రోది సేయుచు
హర్ష నైషధమున నిదియుఁ గాన రాదు............శృం.నై.9. 80
గంధదం తొవళ వేయ ఘంటికా'
టంకార ముఖర ఘంటాపథంబు .................... 'భీ ఖం..1-42

మహిషగైవేయ మంటా ధ్వనుల్ ..............................కా.ఖం. 5-22 కలకంఠ కామినీ కోమలకు హూకారంబు - శ్రీనాథుని స్వతంత్రవచన కలకంకీ కలకండ్ల కోమలకు హూశాకంబు తరంబుగన్ ...క్రీ.రా. 131

సముణ రాజ శుద్ధాంతకాం తానివాస
మాణిక్యదర్పంబై........................................................క్రీ.రా.273
వరుణుని శుద్ధాంతంబున
నరవిందాక్షులకు మించుటద్దంబగుచున్ .....................భీ.. ఖం.2-27.
కెంజిగురాకు 'మోవిని ధాత్వర్థంబనుష్ఠింతునో ...............క్రీ.రా.90
ణిసిధాత్వర్థ మనుగ్రహీంపదగవే నీరేజపుప్రత్రేక్షణా........శృం. నై.8.52.. 21.
హర్షనైషధ కావ్యమున నిది గాన రాదు. 'ణిసిచుంబనే,యను ధాత్వ
ర్గము ననుసరించి రచించిన యపూర్వప్రయోగమై యున్నది.
చరణాంగుళీ కుటిల సఖశిఖాకోటికుట్టనంబున ..............క్రీ. రా. 235

కుటీల పాటల చాటాంకరకుట్టనంబున ..........................కా.ఖం.
కుటిలచంచూపుట కోటికుట్టనమున................................శృం.నై.2-5

హర్ష నైషధమున నీశ్లోకము గానంబడుచున్న ది.
చాంపేయ కుసుమచ్ఛదచ్ఛాయా దాయడంబులైన , క్రీ.రా 51
కఠోర పాఠిన చ్ఛాయా దాయడంబులైన .........................బీ. ఖం
సుకుమార సుఖచ్ఛదచ్ఛటా దాయాదంబులై న...............కా.ఖం.
ద్యావాపృథ్వ్యంతరాళముల ..........................................క్రీ.రా.5
ద్యాహపృథ్వ్యవకాశ వేశలయశో
ధారానభ స్సింధుపై.....................................................కా.ఖం1-23.
ద్యావాపృథ్వ్యవకాశముల్..............................................కా.ఖం 6.240
ధ్యా వాభూమ్యంతర మట్టహాసడమరు
ధ్వానంబుల ...............................................................కా.ఖం.7. 32

దాహ కుండెక్కి విడిచిన వారువంపు
గొడమయును బోలి క్రీ.రా. 87


చుడాలకుల వరారోహవాహాకుం డెక్కి-
విడిచినవారు వంపుగొదమయుంబో లె శి.మా.396

ఉ. తియ్యనివింలో జోదు గతి దేవి చనుంగప నొత్తగిల్లి యొ
య్యొయ్యునపలక చక్కఁబడనొత్తెడుఁ జూచి తే పుష్ప బాణముల్
మయ్యెగ వ్రాసేఁ జిత్తం ముమాఁగిలి నూఁగిలి చిత్ర కారుఁడా
దయ్యము గాక వీని పసదావము టిట్టిభ వీనికిందగున్ , క్రీ.రా.192

తే, గీ, గించిన కడకంటి కొలఁ జూచి
వాడివాలిక పూందూ పువంక దీర్చు
బోరగి రతి దేవి పాలిండ్ల నొత్తగలి న
యించు విలుకాని వ్రాసినారిడుపునందు,
                                                                             శృం. నై.8-150. 2010

ఈపద్యమునకు మూలము నైషధమున గాన రాదు. ఇట్టి యపూర్వ
కల్పనలే శ్రీనాధుని ప్రతిభావి శేషమును 'వేనోళ్ళఁ జాటుచు నామహా
నీయుని యాంధ్రీకరణ పద్ధతిని వివరించుచున్నవి. మూలమునగాన రాని
యీభావసౌమ్యము నేమని చెప్పవలయు?

మఱియు

శా. పంచారించిన నీ పయోధర ములా స్ఫౌలింతునో లేఁత బో
మ్మంచుం గెంజిగురాకు మోవిణి సిధాత్వర్థం బనుష్టింతునో
పంచాస్త్రోపనిషద్ర హస్య పరమబ్రహ్మ స్వరూపంబు నీ
కాంచీదామపదంబు ముట్టుదునో యోకర్ణాటతాటంకినీ !

శ్రీనాథుని కవితారచనల నూధుర్యము నించుకయైన జనిగొన్న రసజ్ఞులగువారీ పద్యము శ్రీ నాథవిరచితమని గుర్తింపకుంధురా? పద్యసామ్యముగాని జ్ఞానైక్యముగాని లేక సమానమగు పోకడ గల పద్యములు పెక్కులుగన్పట్టుచున్నను గ్రంధవీ స్తరభీతి చే విడిచి పెట్టవలసి యున్నది. మఱియు శ్రీనాథుని రచన ముందెలున ట్టి వీధివిటంకము కుసుమం బెట్టిన, నిద్దంపుఁ జెక్కులనీడ, బీరెండ వేడి, కప్పురబోగెవంటకము చెక్కుటద్దములు,దాసనపుఁబువ్వుచాయ, పదియార్వెన్నె షసిండి, ఆకొ న్నాఁడవు, విజ్జోడు, పంచారించు, ఓలగందము, మిసిమింతుఁడు, ఇఱఱిం కులు, కట్ట్ఱట, ఉఱూతలు, ఇత్యాది పదము లెన్ని యేఁ బ్రయోగములు గంపఱుపవచ్చును.

శ్రీడాభిరామము త్రిపురాంతకుని ప్రేమాభిరామమున క్రాంధీ కరణముగావున, బై'నచూపిన భావవిశేషములు గొన్ని త్రిపురాంతకునివి కాగూడదాయనియు, నట్లు గానిచో నసలుకవియగు త్రిపురాంతకుని కే మోసముగల్గుననియు, శ్రీ విశ్వనాధశర్మగారు వ్రాయుచున్నారు. త్రిపు రాంతకుని ప్రేమాభిరామము నేడుమనలకు లభింపకున్నది. క్రీడాభిరా మఘు ప్రేమాభి రానుమునకు సరియైన యాంధ్రీకరణము గాదనియు, మూలములోని వర్ణనములఁ బెక్కింటిని బెంచి విస్తరింప జేసినాడని విశ్వ నాధశర్మగా రొప్పుకొనుచుండియు, నీగ్రంథకర్త చేసిన ప్రయోగము లన్నియుఁ ద్రిపురాంతకుని వేయని సాహసించి చెప్పుట సమంజసముగాఁ గన్పట్టదు. శ్రీనాథుని యంద్రీకరణము లెప్పుడును మక్కి కి మక్కి గారచిం పఁబట్టి యుండ లేదు. శ్రీనాథుఁడు భావములను విస్తరింపఁ జేసియు, స్వక పోలకల్పనలతోఁ బద్యములనల్లి కొన్ని తావుల మూలములకంటెను శోభను దెచ్చియున్నాడు. మనమిందలి సత్యములను దెలిసికొనవలసి యుండు నేని శృంగార నైషధమును మూలముతో *(బోల్చి చూచుకొన్న విస్పష్టముగాఁ దెలియఁగలదు. హర్ష నైషధ మునఁ గానరాని యనేకా పూర్వకల్పనలను దెలియఁగోరువారుకీర్తి శేషులయి: వేదము.వేంకటరా య శాస్త్రుల గారి శృంగారనైషధవ్యాఖ్యాసపీఠికను జూచినయెడల నిందుఁ జూపినవిగాక పెక్కు.లందుఁ గన్పట్టగలవు. పైనిచూ పఁబడిన పదపద్య భావసామ్యమును బట్టి క్రీడాభిరామము వల్లభరాయ విరచితముగాక శ్రీనాథ విరచిత మేయని యెట్టివానికై నను దోఁచకపోదు.


అధ్యాయము 6

సర్వజ్ఞ సింగమనాయని సందర్శించుట.


అట్లు ప్రౌఢ దేవరాయమహా రాయలవారి యాస్థానమున నరుణ గిరినాథ కవిసార్వభౌముని ముద్భటవివాదమున నోడించి వాని విజయ డిండిమమును బగులఁ గొట్టించి వానికవిసార్వభౌమ బిరుదమునుజూఁఱ యామహా రాయని మౌక్తి కాగారములో స్వర్ణాభి షేకమహోత్సవమును బొంది కర్ణాటక పద్మవన హేళియై సకలవిద్యా సనాధుఁడై న శ్రీనాథకవి సార్వభౌముఁడు తరువాత కొంతకాలమునకు విద్వాంసుఁడై సర్వజ్ఞ బిరుదాంచితుఁడై ప్రఖ్యాతిగనుచున్న రేచర్ల సింహభూపతిని సందర్శింపఁ బోయే నట! అట్లు పోవుచు నాతని యాస్థానమున దనకు విజయము కలుగుటకై శ్రీనాథుఁడు శారదాదేవి నుద్దేశించి యిట్లు స్తుతించెనట.


సీ, దీనారటంకాలఁ దీర్ధమాడించితి
                దక్షిణాధీశు ముత్యాలశాల
'పలుకుతోడై తాంధ్ర భాషామహా కావ్య
                నైషధగ్రంధ సందర్భమునకు
బగులగొట్టించి తుద్భట విహదప్రౌడి
                గౌడ డిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూషణక్రియాచూశక్తి రాయల యొద్ద
                బాదుకొల్పితి సార్వభౌమ బిరుద
మెటుల మెప్పించెదో నన్ను నింక మీద
                రావుసింగమహీపాలు ధీవిశాలు

  1. * "తేషాం కనిష్ణోషి చ జన్మ నాభూత్" జ్యేష్ఠాగుంఐ — రల్లధరాతలేంద్ర కాక లేదు చంద్రోపదోషాకరతాముసేర స్యామ్యోపిభూవందనతా ముపన్న*
  2. జిత్యా సల్పవికల్ప కల్పితంబలం తం చాల్ప భానుం కణే మీత్రీ కృశ్య సమాగతం గజపతీం కర్ణాటభూపంచతం హవ్వా కోమటి వేము సైశ్యనికరం భూయోపి రామేశ్యరాత్ రాజ్యం రాజమహేందరాజ్య ముకగోడల్లాడభూ మిశ్వచః " " అల్లాడ వేమా రెడ్డి కోడుమిల్లి శాసనము . "
    • ఆర్యవటశాసనము.
    భూలోక భోగ్యోదిత కల్పవల్లీ శిష్టాశ్రితా నిష్టవి భేదభల్లీ పవిత్ర చారిత్ర వధూమతల్లీ వేమక్షితీశస్య సుతాన్నతల్లీ తస్యాః పతిః పతి ర శేషమహీపతీనాం వే మాంబికాల్లయ నృపాలవరేణ్య సూము . శ్రీవీర భద్ర ఇతిస్వగుణైక భద్ర కీర్తి ప్రతాపతులి తేశ్వర వీక భద్రః
  3. * ఆశాసనమున నిట్లున్నది .

    శ్లో.ఆస్తి ప్రశస్త మతిరల్లయ వేమభూపో
    రాజ్యోన్నతో జగితి రోజుమ హేంద్రపు ర్యామ్
    మంత్రిహితోఽ స్యమతి నిర్జిత దేవమంత్రి
    ద్ధివ్య శ్రీ యాజయతి దేవయయన్న మంత్రి

    శ్లో. నాకేపుష్కర బాణవిశ్వగణి తేసంవత్సరే కీలక
    కార్తి క్యాంశనివాసరేకృత ధీశ్రీయన్న మంత్రీశ్వర
    ద్రాక్షా రామజ భీమలింగ పురత శ్రీసప్త గోదాతటే
    ప్రాచీగోపురముండపం సమకగా దమ్యం శిలా నిర్మితమ్.

    శ్లో. ద్వాదశ సంఖ్యాస్తంభే సదాబహిగ్ద్వార మండ షేవిహారన్ రక్షతు భీమేశోఽయం స్త్రీ దేవయ యన్న సచివచకల్పమ్

  4. * ఆస్తి ఖలు గాడేషు . . . . . .గ్రహార సాయక మణే : సామ వేద సాగర సాంయాతి కస్య అష్ట భాషా సామ్రాజ్యాభిషిక్త స్య బళ్ళాల రోయకటక కవికుల పర్వతప వేః నాగం క విగజస శ్రీకవి. ప్రభో, పౌత్రపు శ్రీ శ్రీ గాజు సోళవేశిక స్య బ్రహ్మాండ భౌండపి నం డమండశిత విజయడిండిమచండిమ్న ఆ శ్రీ మఖండము డసమణే : శ్రీడిండిమ ప్రభో రౌహిత్రం శ్రీనుచభిరామ నాయి కాస్తకంధయః సభాపతి భట్టా, కాచార్యఖాగి నేయ శ్రీడి ఒడిమక విసార్వభౌమ ఇత ప్రధిత బిరు బాలకి సామధేయం 'సర స్వతీప ప్రాచలబ్ధక విశాసనాథః శ్రీమా కారుణగిడే సాధః శేషకృతేన యోగానంద నామ్నా సహస నేన స ఖాని యోగ మనుతిష్టామి:-"
  5. *(1) 1927 సంవత్సరము, భారతీ సంపుటము ,4 సంచిక 4 చూడుఁడు. (2) అదేసంపత్సరము " " సంచిక 6 చూడుడు