శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 11

యెడల రేపుదాని వేగము నరికట్టజాలను. అదే అభ్యాసమై నిలుచును. చేసినచెడుగునకో ఆలోచించిన చెడ్డ ఆలోచనకో నేడుపశ్చాత్తాపము పొందియున్న యెడల ఆగుణము రేపు మరి పుట్టదు. ఇట్లేమంచిగుణములును. చనిపోవుకాలమున తలపును నిట్లే. కడచినకాలము నెట్లుపయోగింతుమో యట్లే మరుజన్మములోని తలపులుండును.


(11)

కర్మవిధికి ఆక్షేపములు.

'అంతయును విధికి లోబడియున్నది. మనమేమిచేసిన నేమి?' అని చెప్పుట కర్మవిధి కాదు. కర్మవిధియని హిందూ శాస్త్రములందు చెప్పబడు సిద్ధాంతము వేరు. 'పురుష ప్రయత్న మావశ్యకము; అదే ముఖ్యము' అనుటయే కర్మ విధి. 'పురుషప్రయత్నమువలన ఫలములేదు.' అని చెప్పిన కర్మవిధికి శుద్ధవిరుద్ధము. నిన్న చేసిన చేతకు ఫలమును నే డనుభవించియే తీరవలెననుటవలన మనుష్యుని స్వాతంత్య్రమును తీసివేయుట కాదు. పురుషప్రయత్నపుశక్తికి హిందూ మతసిద్ధాంతము సంపూర్ణప్రాముఖ్యమును,సంపూర్ణ స్వాతంత్య్రమునుు మనుష్యున కిచ్చుచున్నది. 'అంతయు నీశ్వరుని పని. ఈశ్వరుని యనుమతిలేక యొక్కటియుగాదు' అనుట నిజమే. కాని కర్మవిధి యీశ్వరుని చేష్టయే, వేరుకాదు. కర్మ విధి యనునది దైవముకాదు. అది దైవముచే నేర్పరుపబడిన యొకవిధి. జగమంతయు నొక చక్కని ప్రణాళికకు లోబడి యున్నది. అట్టి ప్రణాళికలో కర్మవిధియు నొకటి.

"ఔనౌను ! ఇదియొక కల్పనయేకాని వేరుకాదు. తల్లిదండ్రుల మొగము పోలిక, గుణము, ఇవి వారి సంతా నమునకును సంక్రమించుచున్నవి. ఇదే మన యనుభవము." అని కర్మవిధి కాక్షేపణ చేయవచ్చును. కాని యిది యాక్షేపణ కాదు. ఏయాత్మయే దేహమును ధరించుననుమాటవేరు. తండ్రి వలె కొడుకుండును అను దేహధర్మము వేరు. కొడుకుదేహమును గుణమును తండ్రినుండి సంపాదించినవగును, కాని యే తండ్రి కెవడు కొడుకై పుట్టినాడో ఎవరికితెలియును? కొడుకు దేహము తండ్రిదేహమును పోలియుండుననుట నిజమే. కాని ఆకొడుకుదేహములోనే ఆత్మచొచ్చియున్నదనుట వేరువిష యము. దానిని కర్మవిధి నిశ్చయించుచున్నది.

చెడురూపమునో, చెడుగుణములనో కొని యొకడు కడుపులోప్రవేశించి ఆరూపమును, ఆగుణములను పొందును. కాని అట్లు పొందుట కేయాత్మ తనకర్మముచేత తగియుండునో, యాఆత్మ యాతండ్రికడుపున పుట్టును. శరీరము, గుణము, ఇవి కర్మముచేతను పరంపరాగతములై యుండును. ఈ పరంపరకు బాధ్యత ఎవరిదని తీర్మానించునది యాయా యాత్మలకర్మము. ఒక యింజనీరు తనకు తెలిసినమాదిరిగ, తన యిష్టమునుబట్టి యింటిని కట్టవచ్చును. కాని దానిలో నివసించువాడు అతను చేయుకర్మముల ననుసరించి ప్రవేశించును. ఒకడు తనయింటిని శిధిలపరుపవచ్చును. దానికి తగిన పేదవాడొకడు తరువాత దానికి వెలనిచ్చియో, బాడిగనిచ్చియో దాని ననుభవించు టకు రావచ్చును. అట్లే తండ్రి తనయొడలిని గుణములను చెరచుకొని తనకు పుట్టినపిల్లల దేహమును గుణమును మొదటినుండియు చెరుపవచ్చును. కాని యాదేహములకు దగినయాత్మ అతనికి పిల్లలుగ దేహము బొందగోరివచ్చును. ఔరసపుత్రుడనుట దేహమును పొందుటమట్టుకే. ఏయాత్మ కును ఏయాత్మయు కొడుకు కాడు. కర్మమునకు దగినట్లు దత్తపుత్త్రునివలె వచ్చి చేరువాడే కొడుకు. ఐనను ప్రకృతి శాస్త్రములలో చెప్పబడి మనయనుభవమున కానబడు పరంపరావిధియైన దేహధర్మము, కర్మవిధిని కొరతపరుప చాలదు.


(12)

ప్రకృతి, జీవుడు, పరమాత్మ.

(గీత: 7, 9, 13, 15 అధ్యాయములు).

ప్రపంచముననున్న ప్రాణములేని యన్నివస్తువులు, స్థావర, జంగమ ప్రాణుల దేహములు ప్రాణుల యింద్రియ