శృంగారపంచకము/కృష్ణశతకము

సరసోక్తియుక్త

కృష్ణశతకము




గ్రంథకర్త

సెట్టి లక్ష్మీనరసింహ్వము

సరసోక్తులు

'రామాయణము ఱంకు, భారతము బొంకు'
'బూతుమాట లాడితే, కాని వూకు సంకెళ్ళు పడతవి'
'బూతులేదు; ఆతులేదు; కాలెత్తవమ్యా కర్ర వెడతాను'

సరసోక్తియుక్త కృష్ణశతకము

శ్రీరమణీకళత్ర, సరసీరుహపత్రవిశాలనేత్ర, వి
స్తారకృపారసంబునఁ బ్రజాపరిరక్షణ మీవొ నర్ప భూ
భారము వృద్ధి కాగ, నది పాపఁగఁ గృష్ణుడ వై జనింపవే?
'నేరక వచ్చినన్ కడుపు నేరుపుతోడనె దించుకోవలెన్'.

1


క.

హరిహరి! 'గాడిద మొడ్డయె
గరుడస్తంభంబు' గాగ గాడిద కాళ్లన్
శిర మిడె వసుదేవుం డది
యఱచిన నీ కార్తి గల్గు నని శ్రీకృష్ణా.

2


క.

ప్రియమున దేవకి కనె ని
న్ను, యశోదకు నేగతిం దనూజుండవు నీ
వయితో? “దెంగులు గుఱ్ఱమ
నియుఁ బిల్ల దివాణము' దను విధమున గృష్ణా.

3


ఉ.

అంగన లెల్ల గొడ్డు ముసలమ్మ యశోద కుమారు గాంచె నం
చుం గమలాయతాక్ష, నిను జూడగ సాగిరి యద్భుతంబు హె
చ్చంగ 'విచిత్రవిప్రునకు చన్నులు పుట్టగ వీపు నందు, పం
చాంగపుబ్రాహ్మణుండు సారులు జూచుచు నన్ని నట్లుగన్.

4


ఆ.

నీదుబొడ్డు తమ్మిని విరించి యుంట నీ
బొడ్డుకోయ, నతని మొడ్డ తెగునొ?
“బొడ్డు కోయ, బోయి మొడ్డ కోసిన యట్టు"
లనుచు జంకె దాది యబ్జనాభ.

5

తే.

కంసుపంపున నిన్ జంప గా దలంచి
యరుగుదెంచిన పూతన యాదిగాగ
నసురవితతి నీచే గూలె నౌర! 'దెంగ
బోయి దెంగించుకొను' టిదే తోయజాక్ష.

6


తే.

చక్కని యొయారి యై వచ్చి చన్ను గుడుపు
పూతనను నీవు గూల్ప బెన్భూత మగుచు
మడిసె. 'ఇల్లాలి యొడిలోని మల్లెలుండి
విప్పిచూడ చుల్లలుగల చొప్పున' హర

7


మ.

ప్రకటం బౌ సుడిగాలిచందమున నిన్ బైకెత్తి కొంపోయి చం
పకయున్ నొంపకయున్ దురాత్ముడు తృణావర్తుండు పన్ ధూళి
గకముల్ గప్పెను, 'దేండ్రనాకొడుకు దెంగన్ లేడు, వంగన్ లే
డిక బూ కెల్లను పాడుచేసె' నను టిట్లేకాదె దామోదరా!

8


ఉ.

బాలుడ దైనకాలమున బల్లరు గొల్లవెలందు లుట్లపై
వేలగ గట్టు చెట్ల గల వెన్నను నింటికి ముద్దచొప్పనం
గ్రోలగ నీకు దృప్తి గలుగుం గద! 'ఇంటికి నొక్కయీక, యి
ల్లాలికి నొక్కగొంగళి' గదా? నవనీతహరా పరాత్పరా.

9


ఉ.

పెట్టిన యట్టి గొండెములు వేసిన బీగము లట్లె యున్న, నె
ప్పట్టున నీవు నీజనని ప్రక్కనె యున్నను బాలు మాయ మౌ
నుట్టిని! “ముద్ర ముదవలె నుండగ, ముగ్గురుబిడ్డ లెట్టులో
పుట్టి” రటన్నమాటయిదె పోగరుడధ్వజ, యో యధోక్షజా.

10


చ.

దుడుకుదనంబునన్ కడవ దొంతుల మీగడ లీవు పూర్తిగా
గుడిచి పరున్ని బేల యగు కోడలిమూతికి రుద్ద, దానిన
ప్పు డడచెనత్త! దెంగుకొని పోయినవారికి దెంగులే, కికం
దడకను దీయు నాతనిది తప్పరు చొప్పున నందనందనా.

11


ఆ.

నీదు చిన్నిబొజ్జ నిఖిలలోకము లెట్లు
పట్టె? అత్తపూకు ప్రత్తిగింజ,
మామమొడ్డ దొడ్డ మంచపుకో డను
నట్లుండె, తల్లి యరయ కృష్ణ.

12


చ.

మునులమనమ్ములందు, సిరి ముద్దియనిండు కవుంగిటన్ సత

మ్మును మునుకట్టి పొందు నిను మూఢతతోడ యశోదఱోట బం
ధన మొనరింప నెంచెనఁట దాన భయంపడినాఁడవే హరీ!
“చినిఁగినపూకు దెంగులకి సీ జడుపుం గనునే" యొ కప్పుడున్?

13


శా.

రాకాసుల్ నిను వేనవేలు బరిమార్పన్ బృంద యందుంటచే
నీ కేళీసమయంబు లందొకొకఁడే నిన్నా ఖలుల్ దాఁకరే?
'కాకుల్ గల్గినయూర నేకులను నేకం, గాకి యేతెంచి తాఁ
బూకుం బొడ్చె' న టన్న సామెతగతిన్ భూమీదవా, మాధవా.

14


క.

నినుఁ బరమాణుసమానుని
దన కుక్షిని నిలుపుకొనఁగఁ దలఁచి బకుఁడు మ్రిం
గె నహా! గం పంతటిపూ
కునా గాడిదమొడ్డ చిక్కుకొనునె మురారీ!

15


క.

కంఠముదిగిన యెడలను
శంఠంబును దెగ దటన్న సామెక యోవై
కుంఠా, యేమయ్యె బకు డ
కుంఠితగతి నిన్ను గ్రోలి కూలినవేళన్.

16


చ.

మదమున నిన్ను బట్టి పరిమార్ప నెదం దలపోసి కాళియుం
డెదురుగొనంగ, వానితల లెల్లను బిప్పిగ నీదుకాళ్ళతో
జదువగ లేదె నీవు? సరసంబునకున్ సరసుండు వోవ, జ
న్ను దగిలి కన్ను వోవుట కనుంగొన నిట్టిదె! గోపడింభకా.

17


మత్తకోకిల.

ఈతపండ్లకు చెట్టు నెక్కగ, నిత్తుపై ములు నాటిన
ట్లీత లాడ గళిందిజానది నీవు మున్జగ గాళియుం
డీతముల్ ఎఱుగంగ దెంగఁగ నెంచు నిన్ వడిబట్టి, యా
హా! తుదన్ పగనొందె శేషసయాన యోగరుడద్వజా.

18


చ.

గిలకకు నీరునున్ దిగిని కేవలబాలుని నిన్నుఁ బిల్చి, నీ
తళుకు మెఱుంగు చెక్కిలి ముదంబున నొక్కి, స్తనద్వయం బుర
స్థలమునఁ గ్రుమ్మి, రాధ రతి సల్పఁగ, అవ్వకు దూల తీఱిన
ట్టులు, మనుమండు నేర్చిన యటులు గనుపట్టెను గాదె మాధవా?

19

ఉ.

మాధవ, ప్రక్కలో నులకమంచముపై నిను వేసికొంచు తా
బాధలు చిన్నటంబడియె, బ్రాయమునం బువుఁబాన్పుమీఁద ని
న్నే ధవురీతిఁ జేర్చికొని యెంతయు మన్మథసౌఖ్యములు గనెన్
రాధిక కచ్చ నుచ్చయును, ఱైకను జేయి య టన్నవైఖరిన్.

20


ఉ.

కొంచెపుప్రాయ మందె రసికుం డగుచుం గసి దీఱ రాధికన్
దంచెను చిన్నికృష్ణుఁడు ముదంబొనఁగూర్చుచు నన్న వార్త చా
టించిన యట్లు ధాత్రిఁ బ్రకటిల్లెను. "పూకును డప్పుచేసి వా
యించుట” యన్నమాట కిదియే యగు కారణ మద్రిధారణా.

21


చ.

పటు విరహంపునొప్పులకుఁ బాల్పడి మోహముగన్న గోపికల్
కటకట! నీదు ప్రక్కఁబడఁగాఁ గడుఁ గోరియు, వస్త్రహీన లై
తటుకునఁ నీకుఁ గన్పడఁగఁ దద్దయు జంకిరి "మంత్రసానిముం
దటనె యుపస్థ దాఁచిన" విధంబున గోపవధూమనోహరా.

22


తే.

'నదిని నెల్వడి చేయెత్తి నాకు మ్రొక్క,
చేలముల నిత్తు', నని నీవు చెప్ప, గొల్ల
పడఁతులకు "పూకులోఁ బుండు, బావగారి
వైద్య” మను నట్టు లాయె నోవారిజాక్ష.

23


రత్నావళి.

"అమ్మఘవుజాతరన్ మానినచో నాపద వాటిల్లు నటంచున్
నెమ్మది భయపడనేల? “పూకు పెండ్లికి నగరకటకపున్ బాజా
సుమ్ము, మొడ్డపెండ్లికి ముఖలింగపుసొన్నాయిసు”మ్మనుట యిదియే
నమ్ము.” డని నీవు గొల్లలన్ మాన్పి, నగము నెత్త లేదే శౌరీ.

24


తే.

వజ్రసంరంభమున ఱాల వాన కురిసి
తుదకు. 'నత్త, నీకొడుకు గందోళిగాఁడె,
వత్తమీఁద చేతిని వేసి పల్కకుండు
నను నటులెచేసె, కృష్ణ, నీ వద్రినెత్త!

25


తే.

వనజనాభ నీ మొగముసొంపునకు వలచి,
పడఁతు లెందఱొ నీపయిఁ బడిరి "మొగము
తేట పూకుకు చే"టను మాట గలదు,
మొగముతేట మొడ్డకును జేటగుట క్రొత్త.

26

ఉ.

అవ్వలిమాట చూచుకొనరా! మగరాజుల కేమి! మొడ్డకున్
బువ్వులు చుట్టఁబెట్టుకొని పోదురు నన్ జతగూడ యుండినన్
ద వ్వగుకాఁపురంబులుఁ సదా తలవంపులు మీకుఁ గల్గునో
జవ్వనులార” యన్నను వ్రజప్రచుదల్ వినరా రమావరా?

27


తే.

గొల్లతలు శైశవమున నీ బుల్లిపండు
గుడిచి, స్ట్రాయంబునన్ మోవి కొఱికిరి, యదు
బాల, అసలున కధరోష్ఠపానము, మఱి
వడ్డికిన్ శిశ్నపాన మన్ వరుస మార్చి.

28


చ.

బలుతిమిరెంపుఁ బ్రాయమునఁ బైఁబడ వచ్చిన గొల్లయన్నుమి
న్నలఁ గవగూడుచున్, ముదమునన్ యమునాతటభూములందు వ
ర్తిలుదువు కాదె నీ వెపుడు? దెంగఁగ నేర్చినమొడ్డ నీళ్ళరే
వుల నిరతమ్ముఁ గాఁచు నకు పోలిక సుందరగోపబాలకా.

29


ఉ.

ఉద్ధవసుత్రఁ గొల్లెతల యొద్ద పరుండి, భగంబులం గనన్
బుద్ధియు నంత వారవలి మో మయినన్ గటు లంటఁగా గుణం.
లిద్దరిన్ జనింపఁగనె యేర్పడి నీకహ? పూకుఁ జూచినన్
బుద్ధియు, గుద్దఁ జూడ గుణయడె మది కన్నది టన్వయించితో.

30


క.

పెరిగితి గొల్లల నెన్నను,
మరిగితి వా గోపసతుల! మఱి వే రేలా?
ఇరుగమ్మ వండిపెట్టఁగ,
పొరుగమ్మయు దెంగిపెట్టు పోల్కి యిది హరీ

31


ఆ.

 "పత్త దేవళంబు, పై సిఁడ లింగంబు,
నందు లోని సాడె యమృత మగును
నాదు శిశ్నభక్తున” కటంచు గోపకాం
తలకుఁ జెప్పదువుగదా? ముకుంద.

32


శా.

కాళిందీతటసైకతంబుల రతుల్ గావించి నీతో, వ్రజ
స్త్రీలెల్లం దుడువంగ నీయరుగదా దేహంబు లందంటు త
ద్దూళుల్, ద్వద్విమరాంఘ్రిచిహ్నముల నొందుం కావునన్ శ్రీహరీ
ఔలే! ‘ఱంకుమగండు వీఁపు తుడువం' డం చుల్లసం బాడుచున్.

33

ఉ.

వేడుకకాఁడ నీవు వనవీథిఁ దొలంగి చనంగ, గొల్లపూ
బోఁడులు నీదువేషమున బూనుచుఁ గొందఱుఁ, గొంద ఱింతులై
క్రీడయొనర్చినారఁట! హరీ, విరహంబున నేమిలాభమో?
బోడియు బోడియుం గలియ బూడిదరాలు నటం చెఱుంగరో?

34


ఆ.

బృంద యందుఁ దిరిగి పెరుగునిన్ సాధింప
నేగ కౌర! కంసినృపతి చేఁత
కాని మగఁడు పూకుపైని గ్రుద్దినయట్లు
నీదుపితలఁ జెఱను నిలిపె గృష్న.

35


చ.

అనయము గోపికాజనసహస్రముతోడను రాసకేళి
దనరుచు బృంద నున్న నినుఁ దా మథురన్ వధియింపఁ బిల్వబం
పిన యల కంసు డీల్గె గది? వెల్గున గల్గిన కొర్రు తీసి గు
ద్దను దిగగొట్టుకొంటకు నిదర్శన మిద్దె సుదర్శనాయుధా.

36


తే.

అదనునకు వస్త్రగంధమాల్యాదులు లభి
యింపగ గ్రహించి కుజ్జతో నింపున రమి
యించి, కంసుని బరిమార్చ నేగితి హరి
అడవిలో దెంగి యాకున దుడిచి నట్లు.

37


శా.

 ఓరీ బాలకా, వజ్రకర్కశమదీయోరస్థలం బైన గ
న్గోరా పోరక పొర యంచు నిను చాణూకుం డనన్, వానితో
నీరేజేక్షణ, పూకు పూకెడును, పైనిన్ దోసె డన్నట్టులే
రారారావు లొనర్ప? పోరగను రారా, యం చిలం గూల్పవా.

38


తే.

దుష్టులగు వారు నీకు బంధువులెయైన,
నవని గూల్పవె వారి? మేనత్త కొడుక,
మెల్లగా దెంగరా యన్న మిన్నకుండు
నట్టివెర్రియు గలడె కంసాసురారి.

39


ఉ.

గోకులభూమికిన్ మగుడ గొబ్బున రామిని నీదు రాకకున్
రాకకుఁ గల్వలట్లు ప్రతిరాత్రియుఁ జూచుచు మన్మథజ్వర
వ్యాకులలైన గొల్లజవరాండ్రకు నక్కట! మిక్కుటంబుగా
"పూకునఁబోటు, బుఱ్ఱసలుపుం" గలిగెన్ మథురాపురీచరా.

40


తే.

మిగుల మఱుగుజ్జు గాన నిమ్మెలఁత మేన

నెగువభాగంబు కంటెను దిగువకుఱుచ,
నాడె మగునాయరాలికి నడుమ బొక్క
టంచు నెగనెత్తవే కుబ్జ నబ్జనాభ!

41


చ.

ఘనతరులైన మాగధముఖప్రతికూలనృపాలపాళిచే
దినదినగండ మౌటను మదింగని, రాధ వరాధరామృతం
బనయము గ్రోలుచుందువట! అత్తను దెంగిన నాయు వెక్కువౌ
ననియెడిమాట నిక్కముగ యాదవశేఖర, రాధికావరా.

42


ఉ.

“ఇక్కడ యుద్ధ మేల, జయ మేటికి? వీనిని నాదువెన్కనే
కుక్కను బోలె త్రిప్పి ముచికుందుని జేర్చిన జచ్చు, 'గొట్టగా
నక్కఱలేదు, తిట్టుటయు నక్కఱ లే, దని పట్టి వట్టలన్
నొక్కినయట్టు కాలయవనున్ వధియింపవె? యో చతుర్భుజా.

43


తే.

పెంచి యిళను రాధిక నీకు పెండ్లి చేయ నిన్ను; రాధికం,
బాసి యాకన్నె నీల్గదొడగె, పెంచుకోదియె యిత్తు
పొడిచి నట్టి లీల దయమాలి, యోవనమాలి మున్ను.

44


చ.

రమణుడ, నన్ను చేకొనగ రమ్మని రుక్మిణి వ్రాసిపంప, నా
కమలదళాక్షి నాకరణి గైకొన్ని యచ్చెలిమిన్నయన్న మీ
సములను నున్నగా గొరిగి సైతము వచ్చితి వౌర వీపు గో
కు మనిన, చన్ను పట్టుకొను కుర్రతనంబును జూపి కేశవా.

45


ఉ.

చేవ దలిర్పఁగా దనదు చెల్లెలిఁ జైద్యున కిత్తునంచు సం
భావన రుక్మి చేసినను, మాగధముఖ్యనృపాలు రడ్డినన్
కేవలశౌరి వీ నగుటఁ గేవల మిందిర యైన రుక్మినిన్
దేవిగఁ గొంటిఁ గాదె హరి! దెంగఁగఁబోయిన, ఆఁతులడ్డునా?

46


తే.

చాలురా చాలు, బావమీసలను గొఱుగఁ
గూడదని బలరాముండు, కోపపడఁగ
అట్టె వదలితి రెండవతట్టు, సగము
పెట్టి మేనత్తవావి యన్నట్టు కృష్న.

47


చ.

తమిఁ దనయన్న మీస మొకతట్టునఁ బోయెనటంచు రుక్మిణీ
రమణి విచార మొంద నది క్రమ్మఱ వచ్చుట యెంత యంచు హా
స్యము నొనరింపవే? మగఁడు చచ్చె నటంచును మొత్తుకోఁగ ఱం
కుమగఁడు చన్నుఁబట్టి పిసుకుంగదె? యంగజరూప, శ్రీపతీ.

48

ఉ.

దక్కగపోయె రుక్మిని వృథాగ నటంచును జైద్యుఁ డేడ్వఁగా,
మిక్కిలి రుక్మి దుఃఖపడె మీసము దక్కక పోయెనే యటం
చక్కట! ఇల్లు కాలిన దటంచు నొకం డొకప్రక్కనేడ్వ, వే
ఱొకడు సుల్ల కాలెనని యొక్కెడ నేడ్చినటులు, జనార్దనా.

49


మ.

తనభక్తిన్ దిననాథునిం దనిపి సత్రాజిత్తు మాణిక్యముం,
గొనితే, నయ్యది సత్యకెంబెదవిరంగుం గల్గుటంగోరి, దెం
గును నీవూరక తెచ్చుకొంటివిగదా! గూ దెఱ్ఱగానున్న గూ
దను దెమ్మం చడుగన్ మఱేమియగు? నో దామోదరా శ్రీధరా.

50


తే.

ఓ హృషీ కేశ, దెంగఁగా నొప్పుకొనెదొ
మొడ్డకోసికొమ్మనెదొ యన్ పోల్కి సత్య
పారిజాతంబు తేకున్న ప్రాణములను
విడుతునన్నఁ దెచ్చితివది పుడమి కదిర!

51


తే.

తాను వేఁడఁగా నరకవధం బొనర్చి తనిన
మోమోటమును లేక, యమరతరువుఁగూర్చి
వజ్రి నీతో పోరొనర్చె కృష్ణ
ఒడ్డు గడప మొడ్డను జూపు టున్నదెగద?

52


తే.

గర్వమున బాఱుఁ డధికుతోఁ గలను కోరుకొనఁగ
నీచేత బాహువులు కూలె గృష్ణ!
గొప్పకుం దొప్పి కాలుచుకొనఁగ, వేగి
నంత కెరుపును మంటయు నన్నయట్లు.

53


ఉ.

చేతులు వేయి నీకగుటచేతనె మేటిమగండ వౌదె? పృ
థ్వీతలమం దొకించుకయు దెంగఁగఁజాలని యట్టి మొడ్డె యౌ
రా! తెగ బారెడంచు వినవా? యని యుల్లస మాడి సాణునిన్
శాతశరాళి నొంచితివి సారసలోచన, పాపమోచనా.

54


చ.

 నినుఁ గని, శంఖచక్రములు నీవలెనే దరియించి, నీగతిం
దనకును వాసుదేవుఁ డను నామము కద్దను పౌండ్రకుం డిలన్
మును తెగటాఱె, నెమ్మివలె పూరుడుపిట్టయు గ్రుడ్డు పెట్టిఁ జొ
చ్చినయెడల పూకు బ్రద్దలయి చెచ్చెఱ, జచ్చునుగాదె? యచ్యుతా.

55


ఉత్సాహ.

బిట్టు భక్తితోడ నిన్ను భీష్మముఖులు కొలచి క
న్నటి మోదమున రవంతయైన దా నెరుంగమిం,
దిట్టె సభను నిన్ బురాణపూరుషా

పుట్టుకుంక యే మెరుంగు పోటునందు గల రుచిన్?

56


శా.

పంతంబున్ విడు, నూరుతప్పులను గావచ్చెంజుమా, నిన్నిఁకన్
ద్రుంతున్ వే శిశుపాల హేతువున కాతులు పీకుకో, కంచెకా
యంతలు కంతులు పుట్టుఁజుమ్మని యనంతా, నీవె వారించినన్
గంతులు మానని వాని పళ్ళెరమునన్ ఖండింపవే వింతగన్?

57


చ.

 మచ్చరమార నిన్ను బలుమా ఱవమాన మొనర్చు చైద్యుపై
దెచ్చెర పళ్ళెరం బొకటి చేతను గైకొని నీవు వేయగా
నచ్చెరు వార జచ్చెనుగదా? గ్రహచారము చాల కున్నచో,
కచ్చను గల్గుమొడ్డ భుజగం బయి చంపును గాదె శ్రీహరి.

58


చ.

మిగులగ గల్మియిత్తు వని మిత్రుడు రాగ, కుచేల. నాకు నీ
యగ గొని తెచ్చితే యడుకు? లంచు భుజించితి వౌర కృష్ణ! ఇ
ట్లెగురుచు దెంగుచుంటి, విపుడేమియొసంగెదొ? యన్ను మెప్పుగొ
ల్పగ, తలగుడ్డ యిత్తువని భావన చేసితి నన్నయట్లుగన్.

59


ఆ.

పిడికె డడుకు లిచ్చి యడుగుల నొత్తించు
కొని, కుచేలు డొందె గొప్పతనము
“ప్రాత డబ్బునిచ్చి, పత్తను జినుగంగ
దెంగు" టిదె కదా యనంగజనక?

60


ఉ.

అల్ల సురేంద్రఖాండవము నగ్ని దహింపగ గోరి నిన్ను దా
దొల్లి సమాశ్రయింప, నరుతోడ నుపాయ మొసంగి, ఖాండవం
బెల్లను గాల్ప నీ వతని కీయగ లేదె యనుజ్ఞ? అత్తపూ
కల్లుడు ధారపోసె నను నట్లుగ నాయె గదా గదాధరా?

61


ఉ.

 పుట్టము లొల్వ బుట్టములు పుట్టగ నీకృపచేత గృష్న. కిం
కెట్టులు మానభంగ మిపు డీమెకు నే నొనరింపజాలుదున్?
పెట్టిన యంతయున్న యదె పెండిలికూతుర, యన్నయట్లు క
న్పట్టె నటంచు కౌరవు డుపాయము తోచక మానె శ్రీహరీ.

62


ఉ.

హెచ్చుగ వద్దు, పాండవుల కేవుర కొక్కొకయూర లెక్కనే
యిచ్చిన జాలు కౌరవపతీ యని సంధిని నీ వొనర్పగా
వచ్చిన ధిఃకరించి చెడె వాడు మొదల్ చెడి మొడ్డ చేతికిన్
వచ్చినటుల్ ఘటిల్లెను దివాకరవిక్రమ, యో త్రివిక్రమా.

63


ఉ.

తల్లి సహోదరుండొకడు తత్పుత్రుడొక్కడు, నైన లోకమం

దల్లరి బావ గంసు, నరకాసురు, ద్రుంపవె? కృష్ణ, బంధువులం
దెల్లర గూల్పగా నరున వికగీతలు చెప్పుట బ్రమే
తల్లిని దెంగు పట్ల పినతల్లియు శష్పసమానయే సుమీ.

64


ఉ.

తాతలు తండ్రు లన్నలును, దమ్ములు పుత్రులు తోడివారు జా
మాత లెదుర్చుటం 'దొలిసమర్తనె గూద' య టన్న రీతిగా
చేతుల విల్లు పూనుటకె? చిత్తము గొల్లని సవ్యసాచికిన్
గీత లుపన్యసించి మది ఖేదముఁ బాపితి పార్థసారథీ.

65


ఉ.

దొంగతనంబునం బసుల తోఁకలకుం బసివాండ్ర జుట్టు లం
టంగను గట్టి యల్లరి యొునర్చిన నీకు నృపాలకోటిలో
సంగర ముద్భవిల్లు నటు సల్పుట క్రొత్తయె? సానిపాపకున్
దెంగులు నేర్పఁగా వలెనె! దీనజనావన, భవ్యజీవనా.

66


తే.

ఈవు కురుయుద్ధమున జక్రమెత్తననియు
శాంతవునిమీది కెత్తితివే చక్రహస్త?
'మాటలకు నాతుల కభేది' మౌట
మాటయంటివేమొ? నిల్పుకొన నీకైన వశమె.

67


శా.

“భంగిందెల్పెద ద్రోణు గూల్ప 'పడె నశ్వత్థామ' యంచంత'మా
తందం బ'న్మని ధర్మసూనునకు బోధం జేసి, సత్యంబు మా
ర్చంగా నాతడు బంక, నీ వతనితో, శాస్త్రప్రకారంబుగా
దెంగం, బుట్టును గుక్కపిల్ల" లన లేదే? ధూర్తగోపాలకా.

68


చ.

గద గొని భీమసేనుడును గాండివముం గొని క్రీడి నిల్వగా;
కదనమునందు నీ వెపుడు గాచెడు పాండవసేన గర్ణు పొం
దొదవుట జేసి గెల్వగ సుయోధను డూహ యొనర్చె నద్దిరా!
ఇదె కద, బుడ్డ నమ్ముకొని యేటను బడ్డ విధంబు మాధవా.

69


క.

 తొలుతటిజన్మమునందుం జెలియలగు సుభద్ర సతిగఁ జేకొంటిగదా
బళిర! మరుమేన? నీకున్ తల తమ్ముఁడు, గుద్ద బావ, తాండవకృష్నా.

70


ఆ.

వనజభవునికైన వర్నింపరాని నీమహిమయందు మూఢమానసుండ
నెంత పొగడ నేర్తునేన్? దోమ దెంగఁగ నెంత సాడు కార నెంత? కృష్న.

71


క.

నాకొలదిమది ననంతం, బై కన్పడు నీదు మహిమనంతయు నిలుపం
జేకురునె, పిల్లిపూకున రోకటినిం దూర్చినట్టి రూపునఁ గృష్నా?

72


ఉ.

ఆర్యుఁడ, వీశ్వరేశ్వరుఁడ, వత్యధికుడవు, నిన్ను గొల్వ బ్ర

హ్మాద్యమరాళి నేర్వ రటులయ్యనుఁ బూర్వముగానిభక్తితో
ఉద్యమ మే నొనర్చితిని నుల్లము నీ కిడ, గొల్లి గిల్లి నై
వేద్యము పెట్టినట్టు లరవిందదళాక్ష యెటుల్ గ్రహించెదో.

73


క.

ఘనుఁడ వగునీకు నే మది ననయంబును సల్పుసేవ యల్పమయినఁ గై
కొనుమా, కొండంతటి దేవునకున్ సిండంతపత్రి పోల్కిని గృష్నా.

74


చ.

కమలదళాక్ష నీపయిని కాంక్ష మదీయమనోబిసప్రసూ
నము నిపుడే సమర్పణ మొనర్పఁగ వచ్చితిఁ, బాపవాంఛిత
భ్రమరసమాకులం బగుటఁబట్టి గ్రహింపఁగ మానెదేమొ! పు
ణ్యమునకుఁ బూకొసంగు నెడ, నాతులుగల్గుట కల్గి నట్లుగా.

75


క.

ఆత్మనొసఁగు వారికె పరమాత్మా! మోక్షమని నీకు నర్పించితి నా
యాత్మను, హాత్మే పైసా చూత్మే లవడా యటన్న చొప్పిదియె కదా?

76


క.

చేతమున దైవభక్తి ప్రభూతం బగువేళ నిన్ను బోలిన దైవం
బీతఱి నాకు లభించుట, ఆఁతులలోఁ దేనెపట్టి న ట్లయ్యె హరీ.

77


తే.

ఎన్నడో నీపదధ్యాన మేను సలుపుచున్న
ప్రతినిమిషంబును నన్నుఁ బ్రోవడాయ ర
మ్మందు ఇచ్చుట డబ్బుగాని, ద్రొబ్బు
టొకజాము నరయ, నో తోయజాక్ష.

78

క.

 దానతపోజపలములు, నెమ్మేనిపవిత్రత, యుపస్థ మినహా కన్యా
దానంబు రీతి వ్యర్థములే, నీపదభక్తి లేనియెడలన్ గృష్నా.

79


మ.

 జను లీలోకపు దుచ్ఛసౌఖ్యముల నిచ్చంగోరి లుచ్ఛాప్రవ
ర్తనులై నిన్ మఱవంగ, వారలకు నంతం బందు రాకుండఁ ద
ప్పును జు మ్మక్షయమోక్షసౌఖ్యచయముల్ మూట్టోలికిం బూకు నా
కిన ముప్పావల కమ్మి చిక్కుపడు భంగిన్ దేవకీనందనా.

80


తే.

నీదు సేవచే నాకు జనించు పుణ్య
గణము చెడుఁ, జెడుకోర్కెలఁ గలిగెడిఁ
దురితములచే అవ్వతీయు గంధంబు తాత
బుడ్డకున్ సరి యనియెడి పోల్కిఁ గృష్న.

81


చ.

అనుపమతావకాంఘ్రియుగ ళాధికచింతన బాపబుద్ది నె
మ్మనమున బుట్ట దట్లయిన, మామకచిత్త మమౌఘ మందునే
మునిగెను, గొడ్డుపూకునకు మొడ్డలు దండుగ యన్న యట్టిరీ
తిని, పురుషోత్తమా, నను మదిం గరుణించి, యఘాళి బాపమే.

82

మ.

 “ఇది నాయింద్రియవర్గ మ ట్లగుటచే స్వేచ్ఛన్ మెలంగింతు,” నం
చు దలంపగను, బాపురే! విహితు డంచున్ వీపు నెక్కించుకొ
న్న దిగంజారుచు గుద్ద దెంగె నను చందానన్ బడంద్రోసె ను
న్మదతన్ నన్నె మదింద్రియంబులు, ముకుందా, రమ్ముకందార్పగన్.

83

స్వగ్నిణి

దెంగుచున్నన్, సదా దెంగుటే, మానివే
యంగ, లింగండు తెయ్యంచు లొంగం డికే
భంగిగా నిల్చు నీ పైని నాయాత్మ? నే
దెంగనా, మాననా దేవకీనందనా?

84


క.

ఏటికి నిను దలపగ నఘ
కోటి దొలతు ననెడిబిరుదు గొంటివయో! మో
మోటుమునకు బోవగ, గడు
పౌ టెరుగవె? పాప వే మ దఘముల జక్రీ?

85

రత్నావళి

మ.

భవబంధంబులయందు జిక్కువడి నే బాపంబులం జేసినన్
భవదీయాశ్రితరక్షణత్వబిరుదే పాడై చనన్ వీడు పా
పి విశేషంబుగ నంచు వీడకుమి నన్ పెండ్లాముపై గోప ము
ద్భవిలన్ చుల్న్ గోసికొన్నట్లు యశోదా, శ్రీయశోదాత్మజా.

86


ఆ.

గ్రుడ్డివాని కెపుడు మొడ్డమీదనె లోక
మెటులొ, యటులె జ్ఞానదృష్టి లేని
నాకు బాపమందె లోక మయ్యాంబికే
యునికి బోలెజూపు నొరుగు గృష్న.

87


యాదవాన్వయాంబోధిచంద్ర, చంద్రాభనిర్మలయశస్సాంద్రా
నాదు మానసంబున బుట్టిన యజ్ఞానము పోవుట దుర్లభమౌ
“గూదకు రాసిన యారికతవుడున్ గుంజినన్ వదల" దనురీతిన్

నీదయాప్రవాహమున నెపుడు నానిచి, యేగతి దొలగించెదవో?

88


ఉ.

చాల నఘాళి నామనము స్వల్ప దొడంగగ, నింద్రియంబునున్
వీలగు నంత దోడుపడి వెంటనె వర్తిలు ఉత్తమంపుటి
ల్లా లెపుడైన నూరు వెడలంగనె, యూరిని గల్గుచుల్ల ల
బ్బాలకు సారికావడుల భంగిని వచ్చును గాదె యచ్యుతా.

89


ఆ.

ఒడలు సోమరితన మొందింప మదిపాప
చింతగొలుప, నీదు సేవ మరతు
కుక్క గూడ పట్టుకొని లాగ, అత్తయు
సిగను బట్టిలాగు పగిది గృష్న.

90


ఉ.

 అంబుజనాభు నందు మన మా, వినయంబునుబూను, మన్న స
త్యంబుగ ధూర్తలక్షణ మ దంచును బూనదు డెంద, మేమిక
ర్మంబొకొ సాడు త్రాగర సమాదిగ యన్న సహించదమ్మ యాం
బం బొనరించు న న్నటు కృపన్ వినయం బొనగూర్పు శ్రీహరీ.

91


శా.

ఊహాతీతము నీమహత్వ మది యత్యుత్కృష్టమే యైననున్
సాహంకారులు దేవతాధముల మాహాత్మ్యంబె వర్నింతు రెం
తే హర్షంబున! మాచకమ్మ చనుదోయిం గాంచి సన్యాసిగా
దాహ! చంకలు గ్రుద్దుకొన్న గతి సత్యాచిత్తనిత్యప్రియా.

92


తే.

నీకు నన్యదైవతముల కే కరనిని
పోల్కి గలుగంగ నేర్చును? బూతుపిల్లి
గడ్డకున్ మరి గాడిద మొడ్డకు నెట్లు
సామ్యమగు వార్దిశయన యో జలజనయన.

93


ఉ.

ఇచ్చను గోరు వాంఛితము లెల్లను దైవతధేనువట్లుగా
నిచ్చలు నిచ్చునిన్ విడిచి, నీచులు పైఁబడి బాధపెట్టఁగాఁ
జొచ్చెడి క్షుద్రదేవతల జూచి భజించెద రో ముకుంద, పా
లిచ్చెడి యావు నమ్మి పయికెక్కుచు దెంగెడియెద్దు గొన్నటుల్.

94


ఆ.

అతనుజనక పాపతతిఁ బాపుకొన నీదు
సేవలేదె, క్షుద్రదేవసేవఁ

గాసిలంగ నేల? కత్తిలేదే యీక
కొఱకు పూకు కాల్చుకొనఁగనేల?

95


తే.

దేవదేవ, చిన్నాలును లేవు, సాతి
కలును లేవు? సిండను నీళ్ళెకారె నన్న
భంగి క్షుద్రదైవముల గొల్వంగ ముక్తి
యీరు సిరి యీరు మదిక్షోభయే ఫలంబు.

96


ఉ.

 ఏ కడనేని రౌద్రగుణమే వహియించిన క్షుద్రదేవతా
నీకములన్ భజించినను నిక్కముగాఁ దమరౌద్రభావమే
కాక మ ఱేమి చూపుదురు? కంసవిమర్దన, యోజనార్దనా
పూకును బూజ సేయుటకుఁ బోయిన నిత్తునె చూపు నత్తఱిన్.

97


చ.

 అసదృశత్కృపన్ శ్రితజనాళిని బోచెడి నీకుసల్ప పూ
జ సలుపఁ, దృప్తిగాంతు, వుపచారశతంబుల క్షుద్రదేవతల్
పిసరును సంతసంపడరు, పెట్టనిపోయని యమ్మగండె పి
త్తసిరుగ దెంగుచుండును గదా! మురళీధర రామసోదరా.

98


క.

నిను నమ్మితి కావున, నా
మనమున సుగుణములకొఱకు, మాటికి వెదుకం
జన దో కౌస్తుభధర, యా
"స్తసిశల్యపరీక్ష" కాఁగఁ జాలదుటసుమ్మీ.

99


ఉ.

 నా మన సెట్టి దుర్గుణగణంబులతోడను నిండియున్న, న
న్నోముఁడు లక్ష్మి నీవుఁ, దనయుం దలిదండ్రులువోలె నెంతయుఁ
బ్రేమ, సనారతంబు మిము వీడక యుండెదఁ “కుక్క టెంకి” నాన్
స్వామి, నృసింహ పుణ్యపురుషా, దయాపయోనిధీ.

100

సరసోక్తియుక్త
శ్రీకృష్ణశతకము
సంపూర్ణము