శృంగారనైషధము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
శృంగారనైషధము
ద్వితీయాశ్వాసము
| శ్రీరాజరాజవేమ | 1 |
వ. | అవధరింపుము. | 2 |
హంస నలునిచే విడువఁబడి కృతజ్ఞతఁ జూపుట
తే. | అట్లు పురుషోత్తముం డైనయతనివలన | 3 |
క. | చుట్టంబులుఁ జెలులుం దన | 4 |
సీ. | ఱిక్కించికొనియున్న ఱెక్క మొత్తముతోడి | |
తే. | నూర్మిపంక్తుల నుయ్యాల లూఁగి యాడుఁ | 5 |
వ. | ఇవ్విధంబునం గొంతదడవు గ్రీడించి యానీడోద్భవంబు భవార్చనాయోగ్యంబును రుద్రాక్షమధువ్రతపరివృతంబును బహుశైవలక్ష్మతాసమన్వితంబును నగుటఁ బద్మంబునుం బోని నిషధరాజు హస్తంబునకు గ్రమ్మఱ నరుగుదెంచె నమ్మహాభుజుండును భుజంబు సాఁచి యమ్మానసౌకంబు మన్నించి యిమిడ్చికొనియుండె నప్పుడు. | 6 |
తే. | ఇష్టమానస మయినయాహేమఖగము | 7 |
వ. | దేవా! యవధరింపుము ధర్మశాస్త్రమర్మపారగులైన పెద్దలు ‘దుర్బలకులజిఘాంసువులైన ఝషంబులను నీడద్రుమపీడా | |
| కరంబు లైననీడజంబులను ననవద్యతృణహింసానృశసంబు లగుమృగంబులను మృగయావినోదంబుల వధియించి మహీధవుండు కిల్బిషంబునఁ బొందం’ డని చెప్పుదు. రిప్పట్టునం బట్టువడిననన్ను విడిచిపెట్టి ప్రాణంబు రక్షించిన యుపకారికిం బ్రియంబు సేయుదు నన నేర్తునే! యైనను నీకు నొక్కప్రియంబు చేసెద. నయాచితోపపన్నం బయినహితంబు పరిహరింపం బని లేదు. నిఖిలభువననాయకుండ వైననీకు మముబోంట్లు సేయునుపకారం బవేక్షణీయంబు గాకుండుట యెఱుంగుదు. నైనను గృతజ్ఞతాగుణలేశంబు క్లేశపఱుచుచున్నయది. సన్నంబు దొడ్డయనువిశేషంబు విచారింపక హస్తకల్పజనాంతరం బయినదైవంబుప్రశస్తి విమర్శించి నాచేయుప్రయోజనం బంగీకరింపుము. | 8 |
హంస నలునికడ దమయంతి నభివర్ణించుట
సీ. | ప్రత్యర్థిసార్థసార్థకనామధేయుండు | |
తే. | మభ్రభారతి దమయంతి యంచు నొడివెఁ | |
| యబ్జసూతికి నైన శక్యంబు గాదు | 9 |
తే. | విదుషి యాయింతి దలఁదాల్చు వెండ్రుకలకు | 10 |
క. | ఖురకండూయనమిషమున | 11 |
క. | లలనకనుదోయిముందట | 12 |
తే. | రాజబింబంబునందు సారము హరించి | 13 |
క. | ప్రవిలేపనపాండరమును | 14 |
సీ. | జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన | |
| కాంతినిర్ఝర మీఁదుకామయౌవనముల | |
తే. | బాల్యతారుణ్యసీమావిభాగమునకు | 15 |
క. | జలదుర్గస్థమృణాళా | 16 |
క. | హాటకకలశంబులకును | 17 |
తే. | వలుదయును వట్రువయుఁ గాఁగ నలినభవుఁడు | 18 |
మ. | వనజాతేక్షణ యూరుయుగ్మమున లావణ్యంబునం గేళికా | |
| ధనదాపత్యతపఃఫలస్తనుల నత్యంతాభిరామాంగులన్ | 19 |
మ. | మృదురీతిం బ్రతివాసరంబు గమకర్మీభూతనానానదీ | 20 |
మ. | కమలేందీవరషండమండితలసత్కాసారసేవారతిన్ | 21 |
వ. | కాంచి, విబుధపురపురంధరీరామణీయకం బీరమణీరత్నంబుముందట నిస్సారంబు పొమ్మనియును విధాతచిత్తంబున నీమత్తకాశినికిం దగిన యుత్తముణ డగువరు డెవ్వండు గలిగియున్నవాఁడొకో యనియును జింతించుచుం గొంతదడవు నివ్వెఱపడి చూచుచుండిరి. ననంతరంబ యనురూపలావణ్యరేఖాసంపన్నుఁ డైనపిన్నవయసురాకొమరు నవలోకింతు నని లోకాలోకపర్యంతంబుగా నీలోకంబు విశ్వంబునుం బరిభ్రమించి యుర్వీశ్వరకుమారకుల నెల్లం బూర్వపక్షంబు గావించుచు వచ్చి వచ్చి యిచ్చోట నిన్నుం గనుంగొని సిద్ధాంతీకరించితి. సాదృశ్యనిబంధనంబై పొడమినసంస్కారబోధంబుఁ జిరకాలావలోకిత యగునబ్బాల యిప్పుడు నామనంబునం బొడగాననవచ్చుచున్నయది. | 22 |
క. | దమయంతీకిలకించిత | 23 |
తే. | సౌరభము లేనియట్టిపుష్పంబువోలె | 24 |
వ. | కావున నిఖిలవైమానికనికాయకామ్యమానయాన యమ్మాన్యవతికి నిన్నుం గూర్ప నాకు నేర్పు గల దక్కొమ్మ నెమ్మనంబున నిన్నుం దక్కఁ దక్కొరుం బరిగ్రహింపకుండ నట్లుగా భవద్గుణంబులు ప్రశంసించెద, నన్నుం బనిగొమ్ము, లెమ్ము, కార్యంబున నార్యులు నిజప్రయోజనంబు నెఱింగింతురు, గాని మాటలం బ్రకటింప రని పరిస్ఫుటంబుగాఁ బలికిన. | 25 |
తే. | ఆద్విజాధిపువలన సంప్రాప్తమైన | 26 |
వ. | ఇవ్విధంబున మందస్మితసుందరవదనారవిందుండై కరారవిందంబునం బతంగపుంగవునంగంబు నివురుచు మృదుభాషణంబుల నిట్లనియె. | 27 |
సీ. | అండజాధీశ నీయాకారరేఖతోఁ | |
| నీడోద్భవశ్రేష్ఠ! నీదుసౌశీల్యంబు | |
తే. | [1]నధికతాపపరీతాత్ముఁ డైననాకు | 28 |
మ. | త్రిజగన్మోహమహౌషధీలతిక ధాత్రీపాలకన్యావరో | 29 |
తే. | [2]సహృదయుండును హృదయంబు సమ్మతింప | 30 |
ఉ. | తియ్యనితేనెవోలె సుదతీతిలకంబుగుణంబు లుత్సవం | |
| ధాయ్యయుఁబోలె నయ్యె నది; ధైర్యము పల్లటిలెన్ ఖగేశ్వరా! | 31 |
శా. | కాలాంతఃపురకామినీకుచతటీకస్తూరికాసౌరభ | 32 |
క. | నెలనెల దప్పక యుండఁగ | 33 |
ఉ. | మోహము దాహమున్ మదికి మూఁడ్చుచు నున్నవి పాయవెప్డు సం | 34 |
హంస దమయంతికడకు దూతయై చనుట
వ. | కావునం దీరంబు లేనివిరహభారం బనుపారావారంబున మునుంగంబాఱుచున్న నాకుం దెప్పగా విరించి నిన్నుఁ గల్పించినాఁడు, మిముబోంట్లగు పెద్దలగుణంబులు పరార్థప్రవణంబులు గదా! పొమ్ము, కార్యము సాధింపుము, పునస్సమాగమంబయ్యెడు, నీవు వచ్చునంతకు నిచ్చోటన యుండుదుంజుమీ! చూతము గదా నీగమనవేగం! బని పల్కి యన్నీడజంబు వీడుకొల్ని క్రీడావనంబులో నొక్కనికుంజక్రోడంబునీడ నన్నరేంద్రుండు చంద్రకాంతశిలాతలం | |
| బున విశ్రమించి రాయంచపలుకులు మనంబునం దలపోయుచుండె. గలహంసంబును నలుని వీడ్కొని భూమండలమండనాయితంబైన కుండిననగరంబుస కభిముఖంబై ప్రార్థనాసిద్ధిసూచకంబులగు ననుకూలగంధవాహాదినానావిధశుభనిమిత్తంబులను సంధించుచు నికషపాషాణపట్టనిభం బయిననభస్థలంబునం దసపసిండిఱెక్క లొరపెట్టుచందంబున నెందంబుగా ఝంకారితపతత్త్రధారావిహారంబుగ గోడివడి డిగ్గునప్పు డల దిగువ నున్నపతంగంబులు వడవడ వడంకుచు నొంటికంటఁ గనుంగొన నొక్కొక్కమాటు విధూతపక్షతియును నొక్కొక్కసారి యూర్ధ్వాయనదుర్విభావంబును నొక్కొక్కమాటు వితతీకృతనిశ్చలచ్ఛదగుచ్ఛంబును నగుచు వనంబులు గడచి శైలంబులు దాఁటి నదులు లంఘించి చని చని ముందట. | 35 |
కుండిననగరవర్ణనము
ఉ. | అండజరాజు గాంచె లవణాంబుధివేష్టితమేదినీపధూ | 36 |
వ. | అప్పట్టణంబున కరిగి వప్రనదీప్రాకారంబు లగుప్రాకారంబులవలనను, నారసాతలగంభీరసలిలసంచారంబు లగుపరిఖాకూపారంబులవలనను, బ్రస్ఫుటస్ఫటికోపలవిగ్రహంబు లగుగృహంబులవలనను, శశిభిత్తివిమలభిత్తిసమత్సేధంబు లగుసౌధంబులవలనను, నింద్రనీలమణిచ్ఛాయాకల్పితాకాలకాలిక లగుచంద్రశాలికలవలనను, గేలీవిలోలబాలికాకుచ | |
| లికుచఘుసృణపంకకషాయితాంభఃపూరంబు లగుకాసారంబులవలనను, ఘనఘనాఘనఘటాకఠోరఘర్ఘరధ్వానగోధూమఘరట్టంబు లగుహట్టంబులవలనను, అనిలచలచ్చేలాంచలదండతాడనావిహితహేళిహయాళీకాలనక్రియాదత్తామారువిశ్రాంతు లగుప్రాసాదవైజయంతులవలనను, నవవికచవివిధకుసుమవాసనాపేటిక లగులీలోద్యానవాటికలవలనను, బటీరకర్పూరకస్తూరికాకుంకుమదహిమాంబుప్రముఖ నిఖిలపరిమళవస్తువిస్తారసౌరభోద్గారసముత్పణంబులగు నాపణంబులవలనను, హావభావవిలాసవిభ్రమైకభాజనంబు లగువనితాజనంబులవలనను, జనవిజితమరత్కురంగంబు లగుతురంగంబులవలనను, అసమసమరవిజయకారణంబు లగువారణంబులవలనను, నభిరామంబై యక్కలహంసంబునకుఁ గౌతుకం బాపాదించె. వెండియు. | 37 |
తే. | పరిఖ గుడివోల దనచుట్టు దిరిగి యుండఁ | 38 |
క. | నెలపొడుపుల సురనదిని | 39 |
తే. | క్రుంగఁబాఱుసహస్రాంశుఁ గూడ లేక | |
| బొలుచునపరాహ్ణవేళ నప్పురమునందు | 40 |
శా. | వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిస్తవా | 41 |
తే. | అమరు హాటకమయకవాటములతోడ | 42 |
మహాస్రగ్ధర. | దమయంతీకేళిధాత్రీధరశిఖరహరిద్రత్నభాదర్భసందో | 43 |
వ. | ఇట్టి విచిత్రశోభావైభవంబులకుం బట్టైన యప్పట్టణంబు గలయం గనుంగొని పతంగపుంగవుండు కన్యాంతఃపురప్రదేశంబున నొక్కశృంగారవనంబులోన సఖీమధ్యంబునఁ దారకామధ్యంబున శీతాంశురేఖయుంబోలె నున్నయారాజపుత్త్రిని వీక్షించి యభ్రమండలంబుననుండి విభ్రమభ్రమణరయవికర్ణస్వర్ణమయపర్ణపాళీచ్ఛాయాపటలంబు దిక్కులఁ బిక్కటిల్ల మెఱుంగు మెఱసినచందంబునం గొఱివి ద్రిప్పిన | |
| పోల్కి దమయంతీవదనచంద్రబింబంబు సేవింపం బని పూని వచ్చుపరివేషచక్రంబుచాడ్పున వలయాకారంబున నవతరించుచు నాకుంచితపక్షమూలంబును నివేశదేశాతతధూతపక్షంబునుంగా నాక్షణంబ వ్రాలిన. | 44 |
రాజహంస దూత్యము
ఉ*. | దుందుభివాద్యనిస్వనముతోఁ దులఁదూగెడు పక్షనాద మం | 45 |
వ. | అమ్మత్తకాశినులు దమచిత్తంబులు విముక్తతత్తత్విషయగ్రహణంబులై యాహంసంబునందుఁ బరబ్రహ్మంబునందునుం బోలె వర్తించుచుండం జూచుచుండిరి. విదర్భరాజుపట్టి తననెమ్మనంబునఁ బుట్టిన కౌతూహలంబుస నమ్మరాళంబుఁ బట్టం దలంచి యొయ్యనొయ్యన కదియ నేతెంచిన నజ్జాలపాదంబును నబ్బాలతలం పెఱింగి యెగసియం దప్పఁ గ్రుంకియు దాఁటుకొనియుఁ దనమీఁదవ్రాలు కేలుదోయియొడుపు దప్పించుకొనియెం గాంచనపత్త్రరథగ్రహణలీలావ్యవసాయంబు నిష్ఫలంబైన రాచూలిం జూచి చెలులు గలకలం జేసఱచి నగిరి హస్తతలతాళకోలాహలంబునం బులుఁగు బెదరించితిరి, దీన మీకు నేమి లాభం బయ్యె నని సఖీజనంబులం గనలి పలుకుచు మార్తాండు ననువర్తించు ఛాయాదేవియుంబోలె నిత్తోయజాక్షి, మానసౌకంబు వెనుకొని చనియె నన్నారీనివహంబుసు మేలంపుమాటలకైవడి హంసగమన హంసాభిముఖియైనయాత్రఁ బెద్దలు నిషేధింతురు | |
| సుమీ యనుచు మందగతిం బిఱుందన యేతెంచె. నీడోద్భవంబును నచ్చేడియమందగమనవిలాసంబు పరిహాసంబునకై యనుకరించునదియునుంబోలె ముందటం జరియించుచుం జేయీక యీఁకలు ముగిఁడించుకొని యీఱంబైన యొక్కలతాగేహంబు దూఱె నట్లు దూఱిన వెలరువాఱి చేయునది లేక నిషేధజనితరోషనిరుద్ధాశేషనిజవయస్యయు నాత్మచ్ఛాయాద్వితీయయుఁ బ్రస్వేదాంభఃకణవిభూషితాంగియు నిశ్శ్వాసవేగకంపితస్తనభారయునై యూరకుండె నప్పు డయ్యండజంబు మనుష్యభాషణంబుల. | 46 |
శా. | కాంతా! శైశవచాపలంబున లతాకాంతారవీథిం బరి | 47 |
ఉ. | ఆళియుఁబోలె నిప్పుడు వనాళియమార్గమునం జరించుని | 48 |
సీ. | నలినసంభవువాహనము వారువంబులు | |
| మధురాక్షరము లైనమామాటలు వినంగ | |
తే. | భారతీదేవి ముంజేతిపలుకుఁజిలుక | 49 |
వ. | ఒక్కనాఁడు విధాత వినోదార్థంబు వాహ్యాళి వెడలి వచ్చునప్పుడు మాకులస్వాము లైనయతనిరథ్యంబులు శ్రమంబునన్ డీలుపడి యున్నం జూచి యేను విమానదండంబు కంఠంబున ధరియించి విరించిచేతం బారితోషికంబు వడసితి. నేను దివ్యతిర్యగ్జాతిని. మముబోంట్లు పాశాదికంబులం గట్టుపడుదురె గుణపాశంబులం గాక! భూలోకంబున రాజబృందారకులు కొందఱు గలరు, వారితోఁ జెలికారంబు వాటించి యుండుదు, విశేషించి యందు నిషధదేశాధీశ్వరుం డగునలుం డను రాజుమీఁద మిగులం బక్షపాతంబు గలిగి యుందు. | 50 |
తే. | కనకశైలంబు డిగ్గి యాకాశసింధు | 51 |
మ. | రణకండూభరదుస్సహం బయినయా రాజస్యదేవేంద్రద | 52 |
తే. | అతనిబాహాపరాక్రమం బభినుతింప | 53 |
చ. | వినుకలిఁ గూర్మిఁ జిక్కి పృథివీభువనంబునకుం డిగంగ నే | 54 |
వ. | ఆరాజుకడం జనవు గలిగి వర్తింతు మఱియును. | 55 |
మ. | స్మరవాత్స్యాయనకూచిమారకృతశాస్త్రగ్రంథసందర్భముల్ | 56 |
వ. | భామినీజనంబులకు భావభవనవ్యాజ్ఞావిశ్వాసముద్రానిక్షేపభూమినై యుండుదు నన్నుఁ దివ్యజ్ఞాతిమాత్రంబుగాఁ దలంపవలదు, విరించివదనకమలవినిర్గతవివిధాస్త్రవాసనాపూర్ణకర్ణుండ నైనయేను సామాన్యుండనే! నన్నుం బనిగొమ్ము, ఈశరీరంబు పరోపకారార్థము గదా! పద్మాసనుని శిల్పప్రయాసంబు లక్ష్మీనారాయణులయెడలను గౌరీవృషభాంకులపట్టుననుంబోలె మీయెడల బరస్పరయోగ్యసమాగమంబునకు బాల్పడుంగాక! వేలాతిక్రాంతకాంతగుణాబ్ధివేణి వగునీవు నలునిపాణిపల్లవంబు పరిగ్రహింప నర్హురాలవు, కోమలంబగు మల్లికాముకుళదామంబు గర్కశం బగుకుశ | |
| సూత్రంబునం గట్టఁ బాత్రంబుగాని తెఱంగున నిషధరాజుదక్క వేఱొక్కండు నిన్ను వరియింపం బాత్రుండు గాఁడు. మఱియు నొక్కవిశేషంబు. | 57 |
చ. | అడిగితి నొక్కనాఁడు గమలాసనుతేరికి వారువంబనై | 58 |
ఉ. | నిర్ణయ మానృపాలునకు నీకును సంగతి యెల్లి నేఁటిలోఁ | 59 |
వ. | అనిన విని ముహూర్తమాత్రంబు చింతించి యాయింతి శకుంతవల్లభున కిట్లనియె. | 60 |
తే. | బాల్యమునఁ జేసి యేను జాపలముఁ బూని | 61 |
సీ. | దర్శనీయంబు నీతనువిలాసం బెప్డు | |
| ప్రౌఢియుక్తంబు నీప్రతిభావిశేషంబు | |
ఆ. | మత్స్యమూర్తి యైనమధుకైటభారాతి | |
వ. | నామనోరథంబు కంఠపథంబున వర్తించుచున్నయది, ప్రజల లజ్జాభియోగంబును దుర్లభజనానురాగంబును సమస్రాధాన్యంబు సధిష్టించి యున్నయవి, యందనిమ్రాఁకులపండ్లు గోయం దలంచెద, రాజుఁ బాణిగ్రహణంబున వశీకరింపం గోరెద, బాల్యచాపలంబున బేలనై యున్నదాన నని సాభిప్రాయంబుగాఁ బలికె నప్పుడు. | 63 |
తే. | రమణి మందాక్షమందాక్షరంబు గాఁగఁ | 64 |
వ. | ఓరాజవదన! రాజపాణిగ్రహణంబు దృష్టాంతీకరించి పలికిన నీసుభాషితంబులకు నర్థం బెయ్యది? యంతిమవర్ణంబునకు వేదవర్ణంబునుంబోలె నయ్యర్థంబు నావీనులు ప్రవేశింప నర్హంబు గాదె! తిర్యగ్జాత నైయుండియు మాయేలిక నాళీకభవునియాన, యేను జన్మించినయది యాదిగా నెన్నండును మృషాభాషణంబులు వలుక, సత్యంబు పలుకుదుం, | |
| బలికిన ప్రయోజనంబు సాధింతు, లోకాలోకపర్యంతం బైనథాత్రీమండలంబునందు నీ వెయ్యది యపేక్షించితి వప్పదార్థంబు గొని వచ్చి నీకు సమర్పింపంజాలుదుఁ, గందర్పాకారు లైనరాకుమారు లెల్లరు నాకు వశవర్తులై యుండుదురు, విశేషించి యన్నిషధభూవల్లభుండు నన్నుం మన్నించి యుండు. | 65 |
సీ. | అతఁడు పాణిగ్రహణార్హుండు విను నీకు | |
తే. | [4]మొదల సంఘటియించినఁ బొంది కార్య | 66 |
ఉ. | ఇప్పటినీతలంపు తెఱఁ గిట్టిద యౌ నిటమీఁద నెప్పుడే | |
| చెప్పెడి దేమి! బాలికలచిత్తము లంబుతరంగలోలముల్ | 67 |
వ. | శంకాకళంకితం బయినయివ్విషయంబునందు బ్రామాఁణికుండ నై యేను వర్తింప నంగీకరింపం గాని వేఱొక్కకార్యంబునకు నన్ను నియోగింపుము, దుర్ఘటం బయిన నది | 68 |
దమయంతి నలునిఁ దక్క నన్యుని వరియించ ననుట
తే. | నిషధభూపాలు వొల్ల కే నృపతి నొరుని | 69 |
తే. | అబ్జినీమానసానురాగాభివృద్ధి | 70 |
తే*. | అనలసంబంధవాంఛ నా కగున యేని | 71 |
ఉ. | దివ్యఖగేంద్ర! నమ్మవు మది న్నను నీయెడ నాకు విప్రలం | |
| కవ్యభిచారహేతు వనఁ గల్గినమాటయ వేదవాక్యముల్ | 72 |
తే. | తండ్రి నిషధాధిపతి కీక తక్కి యొరున | 73 |
శా. | తద్దాసీత్వపదంబు గైకొని కృతార్థత్వంబునం బొందుదుం | 74 |
తే. | అతనిఁ గోరుదు నే నంతరంగసీమ | 75 |
తే. | వింటిఁ దద్గుణనికరంబు వీను లలరఁ | 76 |
సీ. | ఆతనిఁ గూర్చి నాప్రాణంబు రక్షింపు | |
| మనురాగజలధి వేలాంతర్వినిర్మగ్నఁ | |
| తే. ధర్మపరులు వరాటికాదానమాత్ర | 77 |
చ. | మనమున లోకపాలు రెనమండ్రును మెచ్చఁ దృణీకరింతుఁ ద | 78 |
క. | కార్య మి దకాలయాపన | 79 |
తే. | అతఁడు శుద్ధాంతగతుఁ డైనయపుడు నీవు | 80 |
ఉ. | నాగతి విన్నవించుట యనర్హము సుమ్ము నిజావరోధసం | 81 |
తే*. | అధికరోషకషాయితస్వాంతుఁ డైన | 82 |
ఆ. | కదిసి నాతెఱంగు కార్యాంతరాసక్త | 83 |
వ. | కావున నవసరం బెఱింగి యాత్యంతికాసిద్ధి విలంబిసిద్ధుల యందు నీకు నెయ్యది శుభంబై తోఁచు నదియ చూచుకొనునది యని యప్పైదలి మదనోన్మాదంబునం జేసి లజ్జాభరం బుజ్జగించి కులకన్యాజనంబులకు నుచితంబులు గాని యతిప్రౌఢవచనంబులం బలికిన. | 84 |
ఉ. | ఆపరమేష్ఠివాహనకులాగ్రణి భీమతనూజ మన్మథా | 85 |
సీ. | విను మింతి! యీయర్థమును ఘటింపగఁ జేయఁ | |
| గన్నులు చల్లఁగాఁ గనుఁగొందు నేను మి | |
తే. | వీవు మారాజుపైఁ గూర్మి నిలుపు గలిగి | 86 |
తే. | వెలఁది! సంకల్పసోపానవితతియందు | 87 |
తే. | హంసతూలికాతల్పంబునందు మేనుఁ | 88 |
వ. | బాల! యాలేఖ్యమయభవన్మూర్తిసౌందర్యసందర్శనలాలసుండును నశ్రుధారాధౌతదీర్ఘలోచనుండును నిశ్శ్వాసపరంపరాసంపాతపరిమ్లానపాటలాధరుండునుఁ బ్రవాళశయ్యాశరణకమ్రశరీరుండును మదనదాహజ్వరారంభకంపితస్వాంతుండును నయి, విప్రలంభవేదనావికారంబున నకాండహాసంబును నకారణభయంబును ననవసరసముత్థానసంభ్రమంబును నలక్ష్యప్రేక్షణంబును నప్రతివచనవాగారంభణంబునుం గలిగి యార్తిధారాప్రవాహంబున మూర్ఛాంధకారపంకంబున మునుంగుచున్నవాఁడు, భవత్ప్రాపకం బైనదోషంబునకు వెఱవఁడు. దాస్యంబున కైన లజ్జింపడు. | 89 |
చ*. | మదనుఁడు రెండుచేతులను మార్పడ నేయఁగఁ దూపు లైదునుం | 90 |
వ. | మదనశరవేదనాదూయమానమానసుం డైన యతండు పుత్తేర నీసమ్ముఖంబునకు వచ్చితి. నీచిత్తంబులోని భావంబు నెఱింగితి. | 91 |
తే*. | తరుణి! వైదర్భి! నీ వెట్టి ధన్యవొక్కొ | 92 |
వ. | చంద్రుఁడునుఁ జంద్రికయుఁబోలెఁ బువ్వునుం దావియుం బోలె రసంబును భావంబునుఁబోలె నవినాభావసంబంధంబున నతండు నీవును నన్యోన్యప్రేమానుబంధంబున ధన్యత్వంబు నొందుండు. బాణిద్వయంబుచేతం బల్లవితంబును మందస్మితంబుచేతం గోరకితంబును శరీరసౌకుమార్యంబుచేతం బుష్పితంబును గుచభరంబుచేత ఫలితంబును నైనభవన్మూర్తికల్పపాదపంబునకు నృపతినందనుండు నందనోద్యానం బయ్యెడుం గాక మఱియును. | 93 |
తే. | మహితబంధాఢ్యరతికేళిమల్లయుద్ధ | 94 |
చ. | నెలఁతుక ! యానృపాలునకు నీకుఁ బరస్పరసంగమంబునం | 95 |
శా. | గ్రీవాలంకృతిపట్టసూత్రలతికాశ్రీకారరేఖాంకితన్ | 96 |
తే. | తరుణి! నతనాభిమండలోదంచనాభి | 97 |
హంస దమయంతి వీడ్కొని నలునకు దూత్యసిద్ధిం దెల్పుట
వ. | అని పలికి వీరె సఖులు వచ్చుచున్న వారు, మంత్రరహస్యంబులు బయలుపడ కుండవలయు, నన్ను వీడుకొల్పు, పోయివచ్చెద నని తదనుమతి వడసి గగనమార్గంబున నిషధాధిపరాజధానికి నభిముఖుండై చనియె నప్పుడు. | 98 |
మ. | మరువాలారుశరంబులం దొరఁగుకమ్మందేనెతోఁ గూడి య | 99 |
తే*. | ప్రాణబాంధవుఁ డైనయప్పక్షిరాజు | 100 |
వ. | ఇవ్విధంబునఁ బక్షవిక్షేపభేదసూచితనిజకార్యప్రయోజనసద్భావుం డై యమ్మహానుభావుఁడు దనరాక కెదురుసూచుచుం దటాకప్రాంతకేళీవనాంతరంబున నశోకానోకహచ్ఛాయాశీతలశిలాతలంబున నుపవిష్టుం డైననిషధరాజుం గనుంగొని తనపోయివచ్చిన వృత్తాంతం బంతయు నెఱింగించిన ముదితస్వాంతుండై. | 101 |
మ. | పరసత్వంబు నిగూఢకార్యఘటనాచాతుర్యసంపత్తియుం | 102 |
క. | పరవతి యగుదమయంతిని | 103 |
వ. | అని గారవించి. | 104 |
శా*. | ఏమేమీ! యని విన్నమాటయ వినున్ వీక్షించునెమ్మోము సాం | |
| ద్వీమత్తుం డయి చొక్కుఁ జిత్తమునఁ బృథ్వీనాయకుం డెంతయున్. | 105 |
హంస నలుని వీడ్కొని సత్యలోకంబున కేగుట
వ. | ఇవ్విధంబున నానందరసమగ్నుండై యన్నరేంద్రుం గనుంగొని విహంగపుంగవుండు కార్యంబు సంఘటితం బయ్యె, నింక నాకుం బంకజాసనునకుం బరిచర్య చేయం బోవలయు | 106 |
తే. | నిషధభూవల్లభుం డాత్మ నిండియున్న | 107 |
వ. | వచ్చి విదర్భరాజకన్యావియోగవిహ్వలుం డగుచుఁ గాలంబు గడపుచుండె. నంత నక్కడ. | 108 |
దమయంతీవిరహవర్ణనము
చ. | నలవసుధాకళత్రునిగుణంబె గుణంబుగ సారసౌరభా | 109 |
తే. | అతనుతాపజ్వరంబు మై నమరియుండఁ | 110 |
తే. | కమలనేత్రత కవస్థానవిముఖ మైన | 111 |
ఉ. | బాలిక చెక్కుటద్దములపజ్జలఁ గోమలమందహాసరే | 112 |
సీ. | అతివ సమ్ముఖవస్తు వగువస్తువును గాన | |
తే. | జామ శరకాండపాండిమచ్ఛాయ నొందె | 113 |
చ. | ఉదితమనోనురాగదహనోష్ణభరంబున నాలతాంగికిన్ | 114 |
మ. | దశ లంతంతకు నెక్కఁగా విరహసంతాపాతిరేకంబునన్ | 115 |
తే. | చెలులు శిశిరోపచారముల్ సేయుపొంటెఁ | 116 |
క. | బిసపన్నగభూషణయును | 117 |
తే. | మన్మథానలతాపంబు మాన్ప వేఁడి | 118 |
సీ. | చిగురుఁదామరపాకు జివ్వంచుఁ జనుదోయి | |
తే. | దర్ప మొలయ నాలీఢపాదమున నిల్చి | 119 |
వ. | ఇవ్విధంబునం బ్రతిపచ్చంద్రరేఖయుంబోలెఁ గళామాత్రావశేషయై విషమశరళరాశీవిషవిషవేదనాదూయమానమానస యగుచు శిశిరశైవాలపలాశగుచ్ఛంబులను సరసబిసకిసలయచ్ఛేదంబులను దుషారసలిలధారానేకంబులను గర్పూరపరాగపాళిసముద్ధూళనంబులను జందనచర్చామచర్చికాక్షాళనంబులను చంద్రకాంతశిలాతల్పంబులను గదళీదళతాళవృంతసంతానంబులను వాసరంబులు గడపుచు నొక్కఁడు విభావరీసమయంబునఁ గేళిసౌధమణిచంద్రశాలాప్రదేశంబున సఖీజనులు పరివేష్టించి యుండ నిండుచందురుం జూచి వైదర్భి యుపాలంభగర్భంబుగా నిట్లనియె. | 120 |
చంద్రదూషణము
ఉ*. | హాలహలద్వయంబు గలశాంబుధిఁ బుట్టె వినీలపాండుర | 121 |
సీ. | విరహిణీవధమహాదురితపంకకళంక | |
| చండదీధితికరజ్వాలమండలములోఁ | |
తే. | సైంహికేయనిశాతదంష్ట్రావిటంక | 122 |
సీ. | జననకాలమునాఁడు జలరాశికుక్షిలోఁ | |
తే. | కుంభసంభవుఁ డబ్ధితోఁ గూడఁ గ్రోలి | 123 |
తే. | ప్రాణసఖులార! వెన్నెల బయలి కిపుడు | 124 |
తే. | మనము గారానఁ బోషించి కనకపంజ | 125 |
తే. | శ్రవణపూరతమాలపల్లవచయంబు | 126 |
క. | రాహుగ్రహవదనగుహా | 127 |
వ. | అని మఱియును. | 128 |
మ. | అవతంసంబవు పార్వతీపతికి దుగ్ధాంభోధికిం గూర్మిప | 129 |
క. | చేయకుము చంద్ర! సుమన | 130 |
వ. | అని బహుప్రకారంబుల. | 131 |
తే. | ఇవ్విధంబునఁ గ్రథకైశికేంద్రతనయ | |
| బహువిధంబుల విధు దూఱి పలుకుచుండెఁ | 132 |
వ. | అనంతరంబ. | 133 |
మన్మథదూషణము
తే. | అంతరిక్షంబునం దతివ్యవహితుఁ డగు | 134 |
చ. | ననవిలుగాఁడ మన్మథ! యనాథవధూవధపాతకంబు నిన్ | 135 |
తే. | కామ! పరమేష్టి నీమనఃక్రౌర్య మెఱిఁగి | 136 |
ఉ. | రాక సుధాంశుమండలమురాకకు మాఱుమొగంబు సేయుచో | 137 |
సీ. | భువనమోహనసముద్భవ మైనయఘమున | |
| ప్రాల్గలరతిదేవిభాగ్యసంపదఁ గదా | |
తే. | తమ్మిపూఁజూలి నీయాగ్రహ మ్మెఱింగి | 138 |
వ. | అని పలికియు వైదర్భి లీలోద్యానంబునందు సరసరసాలకోమలకిసలయాస్వాదనకషాయకంఠకలకంఠకామినీకుహూకారుకోలాహలపంచమంబు వీతెంచిన నప్పల్లవాధరియుల్లంబు జల్లన నొల్లంబోయి మూర్ఛిల్లిన. | 139 |
సఖులు దమయంతికి శిశిరోపచారములు సేయుట
ఉ*. | గొజ్జఁగినీరు సల్లె నొకకోమలి ద్రిప్పె లతాంగి యోర్తులా | 140 |
సీ. | పద్మిని! కన్నీరు పన్నీటఁ దుడువుము | |
| కలకంఠి! చేర్పు చెంగలువయెత్తు దలాడఁ | |
తే. | బాలశైవాలమంజరీజాలకంబు | 141 |
దమయంతీ స్వయంవరప్రకటనము
వ. | అని పలుకుచు సంభ్రమించుసఖీజనంబులకలకలం బాలించి యిది యేమి కోలాహలం బని భీమభూపాలుండు దేవీసహితుండై యడుగఁ దద్వయస్యాజనంబులు దా రెఱింగిన తెఱం గెల్లను విన్నవింప నన్నరనాథుండు ముద్దుగూఁతుమనోభిలాషంబునకు ననుకూలంబుగా జగంబునం దెల్ల స్వయంవరంబుఁ జాటింపం బంచిన. | 142 |
తే. | సప్తసాగరపరివృతక్ష్మాతలమున | 143 |
ఆశ్వాసాంతములు
మ. | నవరత్నోపలదివ్యలింగవరదానప్రీతదాక్షాయణీ | 144 |
క. | ఆచక్రవాళశైల | 145 |
పృథ్వీవృత్తము. | చతుర్ముఖవిలాసినీశయవిలాసపంకేరుహ | 146 |
గద్య. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బయినశృంగారనైషధకావ్యంబునందు ద్వితీయాశ్వాసము. | |