శ్రుతిలేని

         పాడకే నారాణి పాడకే పాట
         పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే.

రాగ మాలాపించి వాగులా ప్రవహించి
సుడిచుట్టు గీతాల సురిగి పోనీయ కే

         పాడకే నారాణి పాడకే పాట
         పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే !

కల్హార ముకుళములు కదలినవి పెదవులూ
ప్రణయపద మంత్రాల బంధించె జీవనము !

         పాడకే నారాణి పాడకే పాట
         పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే !

శ్రుతిలేని నా మదికి చతుర గీతాలేల
గతిరాని పాదాల కతుల నృత్యమ్మటే !

         పాడకే నారాణి పాడకే పాట
         పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే !