శశికళ/నీలము
< శశికళ
నీలము
నీలి కలువ పుటాలలో
తేలిపోవు నీలి మలుపు
నీలరత్న హృదయంలో
సోలిపోవు కాంతి సూక్తి
నెమలి గళము వంపుల్లో
నృత్యమాడు నీలి నిగలు
నీలాకాశ రహశ్యము
కాళిందీ ఝరి నీరము
ముర్తించినవే కన్నులు
నర్తించెను కనుపాపలు
సూర్య సుతా శశి కళవే
ఆర్య సఖీ శశి కళవే !