ఉగాది

ఈ ఉగాది ప్రేమ సఖీ!
నా ఊహల కందవేమి
      కలలోనే వచ్చినావు
      కలలానే కరిగినావు
            ఈ ఉగాది ప్రేమ సఖీ !
            నా ఊహల కందవేమె ?

ఒక కౌగిలి ఒదిగిస్తివి
కికురించితి ఒకముద్దును
      పకపక మను నవ్వులతో
      కకు బంతము కలసినావె
            ఈ ఉగాది ప్రేమ సఖీ !
            నా ఊహల కందవేమె !

గంధ మలది కాన్క లిచ్చి
విందు లిడితి విడియ మిస్తి
      సుందరాంగి చంద్రికలో
      మందుపెట్టి మాయమైతె
            ఈ ఉగాది ప్రేమ సఖీ
            నా ఊహల కందవేమె !