శశికళ/ఇంతలో...
ఇంతలో...
పదివారములుకాదొ దేవీ !
ఇంతలో
మది విరుగు నిరసనాదేవి !
హృదయాన కుమిలేటి
వ్యధ పోదు మంటలగు
కధగా మిగిలె ప్రేమ
కలలె ఇక నాకేమొ !
పది వారములు.......
ఏనాటికీ కళలు
ఎన్నటికి నీ కలలు
సౌందర్య పూజ, ఆ
నంద హారతి నీకు
పది వారములు......
శిల్ప దేవికి నీకు
చిత్ర విద్యను పూజ
నినుకొలుచు నా బ్రతుకు
నిలుపుదువె ఈ సిలుగు
పది వారములు.....
పాట కై నా హృదిని
పసిడి పల్లకి చేసి
మేళవించెడి తంత్రి
ఫెళ్లుమని తెంపుదువె !
పది వారములు......
ఆశాపరీమళము ఆరీపోవగ నీకు
ఆశాంతముల నలము
ఆశయా శోక సుమ
మే శమించు శోకమున
పదివారములు కాదొ దేవీ !
ఇంతలో
మది విరుగు నిరసనా దేవీ !