శశికళ/ఆట పాటలు
< శశికళ
ఆట పాటలు
వాన చినుకుల ఆట
కోన వాగుల పాట
నీదు సొగసుల కులుకు
నీదు వలపుల పలుకు.
మెరుము తళుకుల ఆట
ఉరుము తబరువుల పాట
నీదు కలతల అలుక
నీదు విరసపు చెళుకు.
మలయా నిలుని జాలు
ఎలదేటి రుతి చాలు
నీదు తియ్యని ఆట
నీదు హాయను పాట.