శ్రీమత్పరదేవతాయైనమః

శతావధానసారము.

తిరుపతివేంకటీయము.

(పూర్వార్థము.)

ఖర సంవత్సర ఆశ్వయుజ బ. 8 శనివారము కాకినాడలో శతావధానమందు రచించిన 103 టికి గొన్ని పద్యములు.

(సంశయించు సభానాయకునింగూర్చి చెప్పినది)

చ|| నిలిచియె వేయి పద్యముల నేర్పలరంగను సంస్కృతాంధ్రభా
     షలఁ దగఁ జెప్ప నేర్తు మని చాల బ్రతిజ్ఞ వహించినట్టిమే
     మెలమిని నూఱు పద్యముల నిప్పుడు చెప్పుట కెంతగొప్పయౌ?
     నిల వరబాదమన్వయపదీశసుధాకర? వేంకటాభిధా.
                  (శ్రీరామమూర్తి) సీసము.
     శ్రీమద్ధరణిజాత సీమంతినీమణీ హానద్విగుణిత ప్రభాబ్జకుండు
     నమితనిర్జరసంఘ కమనీయమకుట సంఘటిరత్న ప్రభాకలితవదుఁడు
     మహితమసృణ వనమాలాకలితగంధ వాసిత దిక్చక్రవాళకుండు
     ఖండితామరశత్రు మండల మణిగదాదండమండిత భుజాదండకుండు
తే||గీ|| భానువంశాబ్ధి సోముండు వరణుండు
         నైన శ్రీరామచంద్రుం డనంతకృపను
         సకల సవత్సమృద్ధులఁ జక్క నిచ్చి
         ధరణి రక్షించు నాచంద్రతారకముగ.1

                  (విక్టోరియా రాణిగారు) మత్తకోకిల
    నీరధారలు లేనిభూముల నీరధారల ముంపుచున్
    సారవత్తర మైనధాన్యము చక్కఁ బండఁగఁజేయుచున్
    భూరిసౌఖ్యము మానవాళికిన్ఁ బొల్పుమీఱఁగఁ జేయువి
    క్టోరియాభిధరాణి నెన్నఁ బటుల్ జగమ్మున లేరుగా.2</poem></poem> 

(స్త్రీ వర్ణనము) సీసము.

నీరజాతముఁ బోలునెమ్మొగమ్మున మేలుకస్తురినామమ్ము కళలుగులుక
రంగారఁ గట్టిన బంగారు సరిగంచు చీరు పాదములపైఁ జిందులాడ
వలలోఁ బడిన జక్కవలఁబోలి కుచపాళి కంచెల ఖండించు కరణి నిగుడ
నిరువంకఁ గువలయసరములు దాపినట్లతినీల నేత్రాంతగతులు సెలఁగ.

తే||గీ|| చెలి యొకతె వచ్చుచున్నది చెలులఁగూడి
        యలరువల్తుని మేల్పూవుట మ్మనంగ
        దానిఁ గూడంగఁ గల్గిన మానవులకుఁ
        వేఱె నాకాబలారతుల్ గోర నేల. 3

                            

(ఇంగ్లీషు విద్య) మత్తేభము


తిరిపెం బెత్తెడివారి నెయ్యది మహాదేవేంద్రులం జేయునో
వరనీచాన్వయజాతు నెయ్యది మహావంశోత్తమున్ జేయునో
ధరణిన్ వైదికునైన నెయ్యది తగన్ దా హూణుఁగాఁ జేయునో
వరశోభాకర మట్టిహూణకల నే వర్ణింపఁగా నేర్తునే. 4

              

(అతిబాల్య స్త్రీ వివాహము) చంపకమాల.


జనములు చిన్నికన్నెలకు సత్వర మొప్పఁగఁ బెండ్లి చేసినన్
ఘనమగు తెల్వి లేకునికిఁ గన్నియ లప్పుడు పెండ్లి యాడి యౌ
వనమున నాత్మకుం దగనివాఁడయినన్ దిగనాడి యాతనిన్
ఘనత దొలంగ జారరతికాంక్ష లొనర్చిన దోస మౌఁజుమీ. 6

              

(దేశాటనము వలని లాభము)


ఆ||వె||దేశచాలనంబు తెల్వి పుట్టఁగఁ జేయుఁ
        గరుణ మనమునందుఁ గలుగఁ జేయు
        నతిధిపూజలందు నాసక్తి పుట్టించు
        ధైర్యమిచ్చు రిక్తదశ నడంచు. 6

</poem>

ఇయ్యెడ రాజయోగి యను పత్రిక.

మాకాకినాడపురమ్మున పిఠాపురం రాజాగారి కాలేజిలో ఖర సం|| ఆశ్వయజ బ 8 నాఁడును మరల నా బ 14 నాఁడును బ్ర|| శ్రీ|| చెళ్లపిళ్ల వెంకటాచలశాస్త్రి.

(రామరావణ యుద్ధము) శార్దూలము.

రాముం డప్పుడు బాణసప్త కముచే రక్షోవరున్ గొట్టిన
భీముండై దశకంధరుండు విపులాభీలాతి హేతిచ్ఛటా
థామస్ఫూర్జితవీతి సూత్రుఁ డగుచున్ ధైర్యంబు పెంపారఁగా
భూమా స్త్రమ్ముల రాము నేయ నపు డాపో రయ్యె ఘోరమ్ముగన్7

(ప్రాతఃకాలము) మత్తేభము

..

కమలముల్ వికసింపఁ గోక వితతుల్ కాంతిన్ జెలంగఁ దగన్ విమలాకాశమహాంతరాళమున దీప్తి జ్వాల లింపారఁగా గమలాప్తుం డుదయింపఁ దూర్పుమల పైఁ గాంతిచ్ఛటల్ తారకా సముదాయమ్ములజాఱెదెల్వి గనియెన్ సర్వ ప్రపంచములున్ :8</poem>

(భోగముదాని సిగపూవు) ఉత్పలమాల,

సూనము చూడు మిత్రవర! సూనశరార భుజంగ సంఘస నానిత వారయోషీదసమానన వాంబుద కేశపాశస మ్మానము గాంచి మించెడు ఘుమంఘుమ వాసితభర్మనిరీతా నూనవిభూషణం బయి మహెన్నత భాగ్యదశావరీతమై.9</poem>

(కాకినాడలోని యుదక సదుపాయము)

తే||! బచ్చువం శాఖోసోముండు వరగుణుండు గర్వదూరుండు రామేశఘనుఁడు పేర్మి గచ్చుకుండ్లను గట్టించి కడ పె జలము కాకినాడ పురమునఁ గఱవు దీర. .10</poem>

(సభానాయకుఁడు)

తే|గీ గుణగణాధ్యుండు రసీకుండు గుశలమతియు పండితోత్త మహృత్పద్మ భానుమూర్తి దానకర్ణుండు దుర్జనదానహరుఁడు సభకు నాయకుఁడై యుంట సమ్మతంబు.11</poem></poem>

దివాకర్ల తిరుపతి శాస్త్రులవారివలన విద్వజ్జన మహాజనులసాన్నిధ్యమ్మున శతలేఖినీ క విత్వతంత్రము నడిపింపఁబడినది. ఆసభలు -మ! రా! రా! తో లేటీలక్ష్మీనరసింహము ".... గార్లవలనఁ గూర్పంబడిన వై కాకినాడ జగన్నాథపురములలో నుండు పెక్కండ్రు

.

(శ్రీరామమూర్తి) సీసము.

శ్రీమత్ప్రణ ప్రఖాస్తోమసంగత మేఘ మన జానకినిఁ గూడి తనరు వాఁడు అబ్జమ్ముపై 'నొప్పునళిచందమున మొగమ్మున మృగీమద నామ మొనరువాఁడు అంజనాచలము పై నల రారు నా గ్ధునియన బీతపటము 'మైఁ దసరు వాఁడు నీలశిలన్ గ్రాలు నిర్జరాపగ యన నురమున హారముల్ వఱలువాడు

తే! || నై న శ్రీరామచంద్రుఁ డనంతకృపను గాకినాడసభాసీమఁ గలసి యున్న సర్వమానవులను బ్రోచు సకలసంప దల మెసంగుచు నాచంద తారకముగ 12</poem>

(ఆదిశక్తి) చంపకమాల.

నిరతము మానసమునను నేర్పునఁ గొల్చెద శక్తి భక్తితో సరసిజసంభవాదిది విజుప్రక రార్చితపాదపంకజున్ సరసిజమిత్రచంద్రమఉషర్బుధరూపవిలోచ మోజ్జ్వలన్ దిరుపతి వేంక టేశ్వరసుధీమణిగీతసహస్ర నామకన్.13</poem>

(ఉద్యానవనము) ఉత్పలమాల,

మేలగుపుష్పకాననము మిత్రుఁడ? చూడుము వేడ్క మీఱగా బాలరసాలశా లిపిక పాళి మధువ్రతపాళిగానలీ లాలలితంబు సంతతరధాంగమరాళ యుగాభిశోభితో న్మీలదనంతపద్మ రమణీయసరోవర రాజమానమున్14</poem>

(బృందావనము)

తే! గీ॥ డంబు మీెఱె బృందావనంబు చూడు. మంబుజాక్షుండు కాం తాజసంబుతోడ నిచట వసియించుటను జేసి యిది సమస్త లోకములలోన మిగుల సుశ్లోకమయ్యె 15</poem>

పండితోత్తములచేతను,... ... ... . నొప్పియుండె, అపుడు పైవిద్వత్కవు లిరువురును శత మంట కవిత్వమారంభించి యేబదిపద్యంబులాంధ్రంబున . నేబది శ్లోకమ్ములు , సంస్కృత మ్మునఁ జెరి రెండుచరణంబులుగాఁ జెప్పిరి, ఆపద్యములనే శ్రీరాజయోగి యవకాశ

(లక్ష్మి) మత్తేభము..

కలధౌతాంబరు దేవి నామనముగఁ గాంక్షింతు నెక్కాలమున్
గలధౌతోజ్జ్వలదంగ విభ్రమకళాకళ్యాణజాలాస్పదన్
గలధౌతోదర ముఖ్య నిర్జరమసఃకంజాతసూరాయితన్
గలధౌతాదిధనాభిశోభితమహాగా రావళీ వాసినిన్{{float right|16}

.</poem>

(కఱపు) శార్దూలము,

ధారాపాతము లేక సస్య వితతుల్ తప్తము లయ్యె గడున్
జేరెన్ సర్వజనంబు నీ పురము నే జీవింప, వారందఱిన్
శ్రీరామేశఘనుండు ప్రోచి మును దా శ్రీవృష్టినాక్షామమున్
బాజ దోలెను దానిఁ గోర మరలన్ బాగెట్లగుఁన్ దెల్పుమా17

</poem>

(కావ్యము) స్వగ్విణి.

సార రాజన్యుల జక్క మెప్పించుచున్
జారువాక్చిత్ర విస్తార పద్యములన్
సూరిచేతోలసత్సూన సౌరభ్యమై
మీఱుకావ్యమ్ము నెమ్మిన్ బ్రశంసిం చెదన్.18

</poem>

(వేశ్య) భుజంగ ప్రయాతము.

చలాపాంగ దృష్టి ప్రసారము చేతన్,
విలాసమ్ములఁ జూపివిత్తమ్ము లాగున్
గలావీద్విరాగి ప్రకాండము నైనన్
గలంచున్ భువిన్ విత్త కాం తాజునంబౌ19

</poem>

చంద్రోదయము) ఉత్పలమాల.

శ్రీరమ గేహముల్ గునుకఁ జేయుచుఁ గోకములన్ గలంచుచున్
జారుచకోర సంతతులఁ జక్కఁగ వెన్నెల నాదరించుచున్
మారునకున్ సహా యఁడయి మానీనులన్ గలగంగఁ జేయుచున్
మీఱెడుఁ జంద్రు డుజ్జ్వలతమిస్రమహీధరవజ్రవజ్రమై,20

</poem>

..........................................................................................................

ముంబట్టి ప్రకటించును, శతఘంటకవిత్వము - చెప్పుట మిగుల నరుదైన కార్యము ఈ యాంధ్రదేశమ్మున నిట్టిపనులు చేసెడివారిలో, సిద్ధులు. శ్రీమాక్ మాడభూషి వేం కటాచార్యులవారును బ్ర. శ్రీ దేవులపల్లి సుబ్బారాయుశా స్త్రీ తమ్మన్నశాస్త్రి గార్లును

(మన్మధోపాలంభన), ఉత్పలమాల.

నీరజ వాసయై తనరునీరపుత్రికిఁ బుత్రకుండవై
నీరజశత్రుఁ గూడి నవనీరజగ-ధుల నేయ నాయమా?
నీరజమాన ముఖ్యశర? నీరజవిష్టర సోదరా! నినున్
నీరజముఖ్య సూనముల నేర్పునఁ బూజ లొనర్తుల బ్రోవరా.21

</poem>

(కేనల వేద పాఠకుఁడు) సుగంగి.

"వేద మెల్ల నభ్యసించి, వేత్తృతావిహీనుఁడై
మరం గర్మజాల మెల్ల మేలుగా నొనర్చినన్
లేదు లేదు లేదు ఫుణ్య లేశ మైన నంచు నా
వేదమే వచించుఁ గాస" వేది. వేత్త గావలెన్ 22

</poem>

(ఆసుపత్రి) శార్దూలము.

నీరోగార్త జనాళికిన్ శరణమై నీరోగులన్ జేయుచున్
శారీరాదీసమస్త పుస్తక సత్సారమ్ము నింగ్లీషు భా"
షారీతిన్ గృతీచేయుడాక్టరుల చేఁ జరుప్రభాభాసురం
బై రాజిల్లెడియాసుపత్రి గన నాహా! సౌఖ్య మొప్పారెడున్.,23

</poem>

(నాటకులు), చంపకమాల.

సలలితనాట్యచిత్రముల సభ్యులచిత్త ము లుల్లసిల్లఁగా
బలువడిఁ జేయుచున్ మిగులఁ బావనమై తనరారు విష్ణు చ
ర్యుల శివచర్యలన్ గమలజాసను చర్యల నెఫ్టుఁ బాడుచున్
వెలయుదు రిట్లు నాటకులు విశ్వజనీనక ళాధురీణు లై -.24

</poem>

శార్దూలము (శార్దూలము .) -

ఘోరాకారము సర్వహి౦సక ముసున్ గులాంతరా వాసమున్
రారాజద్ధరణీధరాకరకవక్త్ర వక్రమున్ మహాభీలగం
భీరారావపలాయమానమహిషీ భీశ్యుద్గ తాభీల సం
చారానేక మృగాళిదిజ్నీచయనున్ శార్దూలమున్ జూడుమా25

</poem>

..............................................................................................................

సైయుండిరి. వైవారు బాల్య వయస్సులోఁ బ్రస్తుతపుఁ బండితులవలె నీతంత్రమును సమర్థించినట్లుగా వినము. ఇది బహుకష్టతరమగు పనియును బూర్వకవులలోఁ గూడ

నొకరిద్దరిచే మాత్రమే చేయఁబడినట్లును గానుపించును. . . . . . . . . ప్రస్తుత పుఁ బండినులు

(ఉపరతి) రూపకాతిశయోక్తి.

క!! ఘనవితతి చంద్రుఁ గప్పెను
గనక లతన్ బూలు పూసెఁ గనకక నత్కుం
దనవసుమం బదరె నళియు
గనక ముదఱి జేరెఁ గాంత కాంతుని గవయన్26

</poem>

(సీతాకళ్యాణమ్) ఉపజాతి:,

ఏనామనూ నాకృతి భాసమానాం
మత్పుత్రకం తే ప్రదదే హి జాయాం
తధాచ కించిత్తు. లపామి. సంజ్ఞా
శాస్త్రం త్వయైషా విధి.నేవ. మాన్యా27

</poem>

(త్రిమూర్త యః )పృధ్వీ.

పురాంతక మురాంతక ద్రుహిణరూప మీడే మహః
కృపామృతఝరీలనన్న యననీరజాతం తతం
సమస్త మునిరాణ్మనఃకమల భాస్కరం సత్కరం
సురేంద్రముఖ దేవతామకుటరత్న శుంభత్చదం28

</poem>

(ఆంజనేయః) రథోద్ధతగతిః

మగుత్సుత మముం సదా హృది భజే
హరిప్రభునరం విశాలకగుణం
కుజారమణపజ్జ లేజమధువం
సదానరజనీచరాళిహరణం.29

</poem>

(మరణసమయః) క్షమా,

యమభటనిక రే సన్నిధిం సంగతే
మతి రతీచపలా జాయతే దుఃఖితా
భయమపి పృధులం బాధతే మానసం
నచగమనమతి ర్దారపు త్రాశయా30

</poem>

.................................................................................................

తర్క, వ్యాకరణములలో మంచి సమర్థులగుటచేత వీరు కేవల కవులు కాక విద్వత్కవుల నియు జెప్పఁదగియున్నారు. వీరి బట్టియే వీరిగురువులగు || (శ్రీ! చర్ల బ్రహ్మయ్య

శాస్త్రులవారి పాండి త్యాదిక. . మూహింపవచ్చును. . . ఈయిరువురు పండితు

(సమస్య) బకము స్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా,

క: ప్రకటతరకప్పగంతుల
నుకులోదధిపూర్ణచంద్ర సూరిజనేంద్రా?
సుకరముగ మక్షికాశా
బక మున్ వడి మింగుచున్న బల్లిం గనుమా31

</poem>

(సమస్య) అంధుం డర్థ నిశీధమందు గనె నయ్యర్కేందుబింబములన్,

శా! పుంధర్మేతసరస్వతీ కవులతో భూపాలకుం డాదితే
యాంధస్త్రీక్ష్ణగభస్తీ బింబముల దివ్య ద్వృత్తి వర్ణించి స
ధ్గ్రంథముల్ రచియింపుఁడీ యనినఁ దధ్గ్రంథానుసంధానని
ద్రాధుం డర్థ నిశీధమందుఁ గనె నయ్య ర్కేందు బింబములన్32

</poem>

(అసూయచే సభకురాని కుకవులు)

చ|| తెలుఁగుల నించుకంతఁ గని. తేలిక కబ్బము లల్లునట్టినా
రలు వరసంస్కృతాంధ్ర కవిరాజవిరాజితమై కరంబు పెం
పలరుసభాంగణంబున కహా? పిలువన్ దగ రాఁదలంతురే?
యిల వర బాదమన్వయనదీశ సుధాకర? వేంకటాభిథా,1

క! నీరసపుబకము దగఁ దా
సారస మగునా? కరీంద్రసమతం గనునా!
సైరిభము, కుకవిజనుఁ డిల
సారతరకవీంద్రు డగునె? చర్చింపంగన్ •2

/poem>

క: నాక బలిపళ్లెరముల
నాఁకట జీవించుకుకవు లరుగుదు రె? లస
న్నాక నిలయక విసమకవి
నాకాధిపు లున్న సభ కనాతురు లగుచున్3

</poem>

........................................................................................................

లును. . . . . . . . . . . . . శ్రీ బాదము వెంకటరత్నము గారియింట నొక పరియును ఆష్టావ ధానము చేసియు న్నారు అందలి విశేషములు మఱియొక సారి ముచ్చటింపఁదలఁచి యిటిప్పకీ యుదంతము సాంతంబుచే సెదము, . . . . . . . . . . . . . . . . . . .

(ఆనియున్నది.)

తే గీ|ఫలవిఘాతమ్ము గల్గెడి బ్రాహ్మణున” క
టంచుఁ బల్కుదు రఁట గృహమంద పొంచి
తమకుఁ గలైణి భంగము తా మెఱుంగ
రహహ! యేమందుఁ గుకవులయాగడంబు4

సీ! వంకగంధా వాప్తి , బరఁగెడిసూకరం బరుగునే! పన్నీ టీసరసులకును నింటఁబగల్భము లెలమిఁ బల్కేడి బంటు చేరు నే? రణమౌరసీమలకును గోటరమ్ముల మగ్గుగుడ్ల గూబలపిండులాసచేయునె? ప్రాతరాతపముల కనవరతాంగ నాజనలోలుఁ డగుగునే! కాశ్యయోధ్యా ప్రయోగగయ తే!!గీ|| ద్విజగణోత్త మకవిరాజదీప్త మైన సభకు గుండలి చేరునే చనిన శిరము నెత్తునే? వంచుకొని మూల నిరుకుఁ గాని గమ్యతరకీర్తి : వేంకటరత్న మూర్తి5</poem>

శ్రీ. శ్రీ. శ్రీ.