శతావధానసారము/అమలాపురము

నందన సం॥ శ్రావణములో నమలాపురము శతావధానములో రచించిన 100 టికిఁ గొన్ని పద్యములు.

(కాళియ మర్దనుఁడు)

క! కాళీయమర్ధనుఁ గొల్చెద
నాళీక విలాసనయను నతసురవరు గో
పాళీగోపాళీయుతు
మౌళిగతమయూరపింఛు మాధవు ననఘున్.1

(కృష్ణకృతార్జుమోప దేశము) పంచచామరము. సమస్త మున్' మృషా సుమీ నిజము పాండునందనా? భ్రమ న్న శింపఁజేసి చూడు బంధు వెవ్వఁడో? మది" నిమిత్త మాత్ర ముండి నీవు నీదుశశ్త్రపంక్తులన్ గ్రమముగా సరిన్ హరించి రాజ్యమున్ గ్రహింపుమా2</poem> ............................................................................................

చ|| సురుచిరమాధురీ మహిమశోభిలుచుండెడి యాశుధారచే సరనులమానసమ్ము లను సస్యము లెల్ల నిగుత్వఁ జేసి పెం </poem>

(భీష్ముఁడు) సీసము.

ఎవ్వాఁడు ఖండించె నేపుమీఱెడిపాండునందను సేస నాసంద మొప్ప
నెవ్వాఁడు విష్ణుచే నెలమి జక్రము దాఁ బట్టించి ప్రతినను భంగపఱచే
నేన్వాఁడు శరముల నెసఁగఁ దల్పము చేసి "బాగుమీఱగ నందుఁబవ్వళించే
నెవ్వాఁడు మాఖశుద్ధేకాదశిథి హరి వాసమునకుఁ దానరిగె బ్రీతి
తే.గీ. నట్టి భీష్ముని సర్వ వేదాంతతత్త్వ
నీరరాశిఘటోద్భవు నిర్జరేశ
ముఖ్య సంస్తూయ మానసంపూర్ణబలు ని
వర్లన మొసర్చు కొలఁది. యెవ్వారి కొడవు,..........................3

(శతావధాన విఘటకాః) ప్రహర్షిణీ,

యే కేచి చ్ఛతక నయో యథా ప తేయుః
కుర్వంతు ప్రతిచరణం తథా ప్రయత్నం
లోకేదుర్జనయశసే స ఏవ తేషాం
నో బాధా భవతరుణీవశా త్కవీనాం....................................4

(సీతారామః) మణిబంధనృత్తమ్.

భావయ సీతారామ మముం, కొమద. మారా దాజిసుతం
నిర్జరమాన్యం స్తుత్య గుణం, నిర్జితశత్రం దుర్జనదం,..........5

(సమస్య) అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధ యోగీ.

శ్లో / విపిన మధివసంతం మౌనిరాడృశ్యశృంగం
స్వనగర ముప నేతుం తద్గతా .వారయోషాః
పర మతియతి బుద్ధ్యా సస్త్రీయా ఆజ్ఞ తాయా
అభిలషతి హి వేశ్యాలింగ సం సిద్ధయోగీ.............................6

..................................................................................................

పలరఁగఁ గోనసీమను మహాప్రతిభం గని తేజరిల్లు నీ
తిరుపతి వేంకటేశ కవిధీరుల నెంచ విరించి శక్యమే!

క॥ ధారుణీ నీసద్యశ మే, పారెడు వరతారహీర హారాజ్ఞలస
చ్ఛారద నారద నారద, పౌరదముల గెల్చుచు. సభాస్థలి సెందున్.

విధేయుడు భాగవతుల కృష్ణశాస్త్రి, అని యున్నది.

(సమస్య) వర్ణోదయం వాంఛతీ రాజహంషీ,

శ్లో! కీర్తో స్థిరాయాం భవత స్థిరాయాం
మందాక్షభారేణ విలోకితుం తాం
అసూయయం త్యాపది మగు కామా
నర్షోదయం వాంఛతి రాజహంసీ 7

(సమస్య) వ్యాఘో మృగం వీక్ష్య హి కాందిశీక..

శ్లో| శృతేఽపి మన్నామని కాందిశీకో
రామో భవే దిత్య భయం వసంతం
సీతే త్య వోచ ద్దశకంధరం చే
ద్వ్యాఘ్ర మృగం వీక్ష్య హి కాందిశీక:................8

(సమస్య) కువిందరాజం మనసా స్మ రామి.

శ్లో॥ దుశ్శాసనే నాపహృతాంశుకాయాం
హఠా తృభాయాం దృవదాత్త జాయాం
తదీయమానావనవ స్త్ర దాన
కుంద రాజం మనసా స్మరామి...................9

(సమస్య), చంద్రోదయం 'వాంఛతి చక్రవాకీ .

శ్లో బందీకృతే ర్కె దశకంధ రేణ, సదా స్థితే చందమసి స్థిరాయాం
వధం విధాతుంకిలతస్య రాము, చంద్రోదయం వాంఛతి చక్రవాకీ, 10

(సమస్య) మృగీ ము నిం పుత్ర మసూత సద్యః,

శ్లో॥ తపోననే సత్త్వవినాదశూన్యే, ము.నే కళత్రంచ మృగీ చ కా చిత్
గర్భం దదౌ తత్రము నేశ్చపత్నీ, మృగీమునింపుత్రమసూత సద్యః: 11

(సమస్య) భార్యాం నమతి సోదరః,

శ్లో॥ శుశీలేన సమాయుక్తా, ముత్త మశ్లాఘ్యవర్త నాం
ప్రతి వ్రతాగ్రణీం భ్రాతు ర్భార్యాం నమతి సోదరః ...................12

(సమస్య,) అవంత సుతం తదా.

శ్లో! ఇవటూరికులాబ్ధీందో, శాస్త్రిన్. మల్లయ నామక
వసు దేవో విష్ణురూప, మవందవ సుతం తదా......................13

.

(నమస్య) మానవతీలలామ కభిమానమె చాలును జీర యేటికిన్ .

ఉ! ఓనవనీతచోర? కృప యుంచి పటమ్ముల నిచ్చి 'వేగ మా
మానము గావుమన్న ప్రజమానిని పల్కుల కెంతో వింతన
వ్వాసన సీమ దోఁపఁ గమలాక్షుఁడు దా నిటు పల్కె మానినీ
మానవతీల లామ కభిమానమె చాలును జీర యేటికిన్ ,.....................3

శ్రీ. శ్రీ. శ్రీ.