వ్యాసావళి/ప్రాఁదెనుఁగుఁగమ్మ
౩
ప్రాఁదెనుఁగుఁగమ్మ*
సిరిదాల్చుఱేడొగి జిన్నిచూడ్కులంజూచు తెనుగు జదువులరచ్చ తీర్పరులార!
గ్రిందనుగైవ్రాలు సేసినవేనయా! యణకువ మెఱయుచు, నాయోపుకొలది, దెనుగు జదువు గుఱించి, తేటతెల్లగను, విన్నపమొక్కంచు వినిపింతు మిమ్ము, మోడ్చియునిరుచేయు, మ్రోకరిలబడియు, నెఱగియు గైవారమొనరంగ జేసి, తద్దయమేడుదు. నాలింపుడయ్య. మీరపోలెను నేను బ్రాంబొత్తములు సాలజదువులెన; యొకింత సదివితినేని, మీరపోలెను నేను బ్రాబల్కులను వ్రాయనేరనయితి సానుకోర్చి యెన్నడును. మీకు బోలెన వారు వ్రాయగలగాదేని, మీఱట్టులకు మాఱుపల్కంగగాద, యని మీరు గడిదిగా గట్టడిసేసితిరటె; యిది నే వినియిదియల్లినాడ; గాకేను మీతోడ నెరసి తూగుదునె? మీరేడ? జగజ్జట్టులరటె! నాయెఱిగినవి గొన్ని ప్ర్రాబల్కులేర్చి, యింబుగానిండితి బాడిదప్పకయ.యట్లయ్యు, నేదేని, దప్పు మొగపడిన మన్నింపుడని మిమ్ము దురపిల్లివేద; వేడంగ నేటికి నేలంటిరేని, నావ్రేళ్లు నులిపెట్టి, నానాల్కనరికట్టి, మ్రోచేత వ్రాయు, ముక్కున బల్కునున్న, దిన్నంగవారొప్పుసేయనోపుడునె? నిచ్చలు మిమిబోలె మాటలాడెదను మాటలాడిన పగిదివ్రాలు వ్రాయం
_______________________________
- ఇక్కమ్మనుడులు నాయిచ్చమె నేనుగూర్చొతి, నానాల్కకనువగునట్టు; చదువరి నీనులగునట్టు పద్దెంబు లివియని పేర్క్రువ్వరేను.బద్దెంబు అనిపల్కి ప్రాబడి బరికించి దూరగదగదేరికేని గద్దెకూర్పునకై కట్టడిలేద గద్దెయుకాదీని గడియింపనురదలు గుఱువఱు నానేర్చినట్లు చదువంగ నొనగూరుపాంటె నునిచితిని; దన్నేని బెద్దల కయు చదువుంది.
61
ప్రాదెనుగు గమ్మ
వ్యాసావళి
63
ప్రాదెనుగు గమ్మ
బాసను గకవికలు సేసి, సింగారమునకునైసిగ్గుడిగం బ్రావి, రోంతయించుక లేక పాడిగడి మివిలి, బూతులు, ఱంకులు నొందించి చొన్పి లంజలమై జిగి మొఱమెచ్చి యాడి, రాజుల రెడ్లను దెల్లించి పుచ్చి, కూర్మియ సెయ్యమ్ముగలరట్లు తోతే వేనవేల్ బొంకులు బొల్లి పాడియును నిచ్చకమ్ములు సెప్పి తమ కరువుగూడు గొనుటకు నొందెను గాసుకు నొండె దమకయిత కన్నెలవారికి దార్చి, బాసవెలందిని వెలయాలిజేసి, నెలయాలి మటుమాయ యాకెకు మరపి, మిఱమిట్లు గొల్పగా గద్దెనెక్కించి, నేలకు సానిగాదాని నెలకొల్ప; అంసలాడియ మేటివాడెనుగు మిన్నయని యుచ్చమల్లిని నందొఱు గొల్వ, ఱంపలాడియ మేటినాదెనుగు మిన్నయని యుచ్చమల్లిని నందొఱు గొల్వ; దొంటిబాస వెలంది గటగటా క్రుళ్ళి తెవులు గదిరిన చివుకులంజెయయి త్రెళ్ళె* ద్రెళ్లినన్ సోకుడు దలినవాండ్రు నీమగునెక్కొల్పి మెఱుగులు పూసి, దానిగౌగిటజేర్చి ముద్దాడుచుండ్రు. చవిగ్రొలనడియాస బంటను నొక్కెద రెండినవాతెఱ; దొండపండట్టె! రిమ్మెత్తినట్టులు నాకుచు గుడుచుచు రిత్తచవులకు మెచ్చియాఱ్చు చుందురెల్ల వెంటకు గొఱంతించునేనియులేక, యెల్లెడ నెప్పుడు గూర్చు నమ్ముదియ గ్రేడింతుఱనియ్య గ్రేగంటనేని. జూడుడి తెనుగుల వెఱిలేని నడత! తన యాలు మొఱటని వెంగళిఱేడోకడు లంజెను జేపట్టి తనసాని నేసి; పాటలు, సదువులు, వాడెమ్ము, సొపగు. గఱపించి, యెన్నియేన్ మెఱుగులు దిద్ది, తానింద్రు డది రంభయని పాటపాడించి, తనకోర్కు లీడేరెనని త్రుళ్ళుచుండ, నాయెద్దెమయివడి లిబ్బి కాండ్రందు బెక్కుండ్రు రేమఱి, తెల్విదక్కి, తమయాండ్రును మొఱటు లని తారు వగచి, కల్ల మినుముల వాడలంజెలను జేరి, మొఱటుదనముదలగి నాడెమ్మ గ్రోలగడగుదురయ్యరే యాయబ్బకాండ్రు! పెద్దలీచొప్పున లంజెను నాడెంపు రాణిగానెన్నుచు, గుగనాలిదెగడి, యొబ్బెరా సిది యని యేవగింప, నట్టి ___________________________________
- మ.రా.శ్రీ జయంతి రామయ్య పంతులు గారి 64
వ్యాసావళి
పెద్దల నడయ మేల్ పాడిగా దలచి పజలదియు కొనియాడ నయ్యె గావలయు.
అట్లుండెనది; నిజము దలపోయుడయ్య, మగనాలు మొఱటయిన మగనాలుగదె కాన్చుకొలము పెంపొన గూర్చు కొడుకు గూంతు? నాడెమ్ము గలదయిన నంటుకత్తియ సంతు గోర రయ్యెదరుగా, బాపలేని, మగనాలు మొఱటట్టె! యాకెలో నేటిమొఱటొక్కొ? మగనాలి తనమదియ మొఱటే? మాలతొత్తేనియ మగనాల కావలచు; మెచ్చదు లంజెలమైబొల్లి మొఱుగు. తొడి, కట్టి, పూసినన్ లంజె బెండ్లముగ జేపట్టనోడును జెంచువాడేని. నాడెమది యేటిది? లంజలన కాని మొలకెత్తి యదిగెరల నోపనొక్కొ? మగనాలి తనమున నాడెమ్ములేదె? మగనాలి పొడిమి, మగనాలిసిగ్గు, మగనాలిపౌరణ, మిసిమియు, పౌరు, మగనాలి పేరమి, మగనాలిసొత్తు, మగనాలిజంపు మరియాదసొంపు, మగనాలినిక్కంపు బరువును, బెట్టు, నివియెల్ల గొఱగాని వని యాగనారి, మనువు నీరెల్లను బ్రతుకుతెన్నెల్ల గవలంగ ద్రొయరెకల్ల గొనియాడిరి మనలెస్సబాసయు కాదె మగనాలు? మొఱటేని మిన్నయేన్ మనుదలదానన, మొఱటేని దప్పు మరియదియు కాదె? మొ!రటు మొఱటనిదాని దెగడుటకాని యేరు రద్దిరిమెఱుగులు దానికయ్య? మరియాద దానికి గ్సఱవంగ గానేమి? నాడవదినదియు పాటి నేర దయ్యెడిదె? లంజెకున మరియాద నెక్కొన్నదొక్కొ! మగనాలి యిచ్చమై దిరుగునొక్కొ! మగనాలి నడతకు లంజియ నడతకు గల వాసినలేని యెఱుకవాండ్ర సన్నపు తలపులన యిప్పొటులెల్ల బాటిల్లె మననాట గను విచ్చిచుండు. యిచ్చమైగిరిగిన, నిలువాడు మగనాలు సాజంపు మేరలు మీర దెన్నడును. బొల్లిమరియాదల నెడ్డెల నేమఱ్చి లంజియగదె దాటు మేర లెల్ల! లంజెల నాడెమ్మ సక్కటిగా 65
ప్రాదెనుగు గమ్మ
వఱకు నాటను మనుదల యీచబోదె? యయ్యేని నాటను మగవాండ్ర పాజపుంజొప్ప సక్కటిగాగ దిద్దిమెత్తు రానాట నాడెనైం పజలమనులయ రెంపును బేరొంది కడుదనరు గాదె?
అలుగకుడు నాతోడ గలరూపు నేను విన్నవింతును వినుడు చెవి యొడ్డిమీరు. తొంటిపెద్దలబాస సాజంపుబాస. సొంపుమై నింపునై జదువనొనగూడు. వారలబడి దవిలి, చక్కగాబోక, వెఱ్ఱి వెంగళి వెడకు బుట్టుల వ్చెరవు నలవఱ్చికొని, పెద్దకయితగాండ్రంచు, బెద్దలు నెక్కండ్రు నెక్కేండ్లు పూని పెక్కుబాసలు సదివి, పెక్కుంబొత్తములు జివికిన మాటలనొగి బ్రోవునేసి పదనుగా దడిపియు బిసీకియు రుబ్బి, సంధులాదేశాలు నాగమమ్ములును, ఱాలును, నెఱసున్న అఱసున్నలునిచి యన్నియు నేర్పుమై గలియంగదంచి, డంగినయాముద్ద సన్నెపై నూఱి, యుక్కుగుండులపోలె మంటలి వేసి, వానిని దడియాఱ నెండనుబెట్టి, యేడుపిడకలుదెచ్చి యెర్రగా నేర్చి, పదిలముగ బెట్టియును గుడికలనుదాచి లేని చ్వయ్యును, నమలుచుందురు. ప్రాతగిల్లిన కొలది గప్పు గల్లుల కవిగట్టి వయ్యెను; వాని నే డేరోపని నమలంగ నలవి గా నెంత గొఱికినను. ఇట్టివియ మీరలయు మిమువంటివారలయు గడు మెచ్చి కొనియాడు నెక్కొన్న నుడులు. నెలకొన్నయయేని, కుక్కులయేని జేవకట్టెలయేని నెల్లప్రొద్దున్నె? యుక్కేని దినునట్టె త్రుప్పుడు సూరె! నేగేని దినునట్టెప్రువ్వునూరె! మిమిబోనివారి కవి యితమయినయ్యె; మిముబోని వారలు నెక్కండ్రురుండ్రె? ననువంటివారల యెల్లయందులను. మీకు బోలెడు మాకు మొసవగాదు; గదినెడునేవంబ; గడుపులో నఱుగక, తెగులు వాటిల్లును; గాద యింతకారి. వ్యాసావళి
67
ప్రాదెనుగు గమ్మ
వ్యాసావళి
59
ప్రాదెనుగు గమ్మ
వ్యాసావళి.
మిన్నకుండుదమ; కొరయాలి కోఱడము పాలు గానెల? తెనుగు వారలొన నిద్దఱ కొకడేని జదువకుండిన బోదు మొఱటుపేరు. మన తెన్గు వారిలో బార్లెదరయ్య? నూర్వురుకు మువ్వుర! వారిలో నేని జదువగ రరిది. వ్రాబల్క నుండి కడుగడిది; గఱవంగ బట్టదందఱకు.
మనలోన మిన్నలు నోటను బల్కీన పల్కులు మొఱటనుట మన పిచ్చిగాదె? వారాడు మాటల మన మాడెదమ కాదె! వారాడుమాటల మనకు వ్రాయంగ గాదు గాకేమనియు గాఱు లొక్కొ? తొలుదొల్త దెన్నాటి కాపుల పలుకుల గయితిమ్ము గూర్పంగ దొడగి యపుడు మొఱటులోకాక యవి సొక్కంపునడలో! యది మీకుదోపదె? తలపోయుడేల యీఱతాఱ తలంపుల బీఱవాఱ? బాపల మున్నుగా మాటలు పుట్టించి కమ్మనై గివ్వగా దెనుగయ్యెనయ్య బాపల కంటెను ముందర గాపులు పల్కరె ప్రాతలు దెనుగ నుడులు? దొంటిపెద్దల కట్టి యరమన లున్నె? తొంటి కాపు పలుక కొనియాడ రైరె? యేనాటి పెద్దల నుడుల నానాడు మేలు? నెన్నుటయ పాది యెల్లెడల? నీనాటి తెలుగులలొ నందు బెద్దల గడువింత గదురంగ దమనుడులు దార మొఱటని పూనిక నట్టి రట్టె తమ బాస లెస్సయ యనుడు, గడుగిన్క నదియేమొ కీడుగా మది జిత్తగించి కయ్యమ్మునకు గాలుద్రువ్వుచున్నారు! నగుదునో, వగతునో, యోయమ్మ చెల్ల! పేరొలగమ్మున రాజులు ప్రెగడలు మాటాడు మాటలును మొఱటలగునె? రచ్చతిన్నియలలో నంగళ్ళరొను దీర్పరుల మాటలును మొఱటుల యగునె? "భారత"కత సదివి విప్పి వినుపించు నాయయ్య మాటలును మొఱటు లన జన్నె? ప్రోలి పెద్దల మాట లని మొఱటులయ్యు తెనుగు జదువుల రచ్చ దీర్పరులరె? యన్నిట మిన్నలు, నుడి యటె 71
ప్రాదెనుగు గమ్మ
వ్యాసావళి
73
ప్రాదెనుగు గమ్మ
మట గావలయు. పెఱయని యిప్పనికి నెరవు లేవు. వలయునది దెలివుగా కులి వౌనె? నుడులకెల్ల నులివు బొంది; దెల్వినుండియనుఱ. యులివు సెవి గ్రువ్వగా దల? దూఱుదెల్వి. పుట్టెనిండుగ దెల్వి వొంగారకున్న జెవికి విందుగ వాత నుడి నెడలునెక్కో? ప్రామిన్కు లేనియు గ్రొమ్మిన్కులేని, దేటగాదలపులు గానె? తెనుగు నాటను జదువు పెంపొందకుండ గీ డెంత మూడెనోచుండి కనువిచ్చి. తెనుగునాటను బాస దికమక లాడి పాడయ్యె! బాసతో జదువును బ్రదుకు! గడుగీడుగా దొక్కచిత్తగింప?
బ్రాతల మేలండ్రు వెద్దలు పల్వురు; మాటమాత్రమ; యేరునొల్లరు వాని; నూరుపల్లెవారు బెద్దలు విన్నలు, నెల్లరు గ్రొత్తల కోరుచుండెదరు. పూడ్చిన పాతులు ద్రవ్వి నెలిపుచ్చ నలవియె యెల్లరకు? బుచ్చినన్, నెగట! ప్రాతనాణెమ్ములు పెద్దల పేర్చిస్సి యమవస నేరు సి, దీవింత్రె సార్లు? ప్రాతదుగాణులు సాతునకేగ నుప్పగలేనియ దొరకొన బడునె? ప్రాతత్రోవల నేడు గాసికి బోజన్నె, కాల్నడనేనియ గమ్మిబండులను? ప్రాతతేపల గడలి గడవంగ జొత్రె? పొగబండి నొగయోడ నేడుజ్జగింత్రె? ప్రాతపొత్తాలలో బేర్కొన్న ప్రోలుల తొల్లింటి వాసియు వన్నెయు జెన్నునేడు సూడగగాంత్రె యరసియు నేడ? బ్రాతకొత్తల బడుల గొలిచియు దూచి కోమట్లు బేరయిసేయ గన్ద్రె? వ్రాఱాలు జెక్కిన యక్కరాలిపుడు సక్కంగ గాడునో చదువంగనేని; వానిన నేడునున్ గివ్వబూనుదురె? తొంటెలిబిరుదులు నేడు వలతురె దొరలు? బంట్రౌతులని వారి గొనియాడదగునె? జగనోబృగండదన నే`ఱేడు గులుకు? నెవడిప్పు డోయంచు బల్కునుంకరియన, దళవాయి యనగను, జంగిలి యన? నెట్టరె మొగమున జప్పటు వ్యాసావళి
75
ప్రాదెనుగు గమ్మ
గదలాడుచు, బురపుర బొక్కచు, జాలి గూయిడుచు, బడలు సాలగబది వనరుచు నుండ్రట! కటకటా! యేలాకో యురయుడయ్య! "తెన్నటి కాపుల ప్రొదెన్గు ముత్తవ్వ ముదిసియు జివికియు బరిసె గాన నెండు డొక్కును బూడ్చియిక దప్పదగు దాని; నెల్లరు వలయు గ్రొమ్ముద్దియ గొల్వ"నని తూటలనిరట చెవి నూడుగాను! బెద్దయం బ్రొద్దయ్య; బెద్దముత్తయిదువ. నాలాయమున కింతవగగుంద నేల? పలుకు ముత్తవ లెల్ల రనటుల వోలె బిల్లల గన లావు కాకువోరె?
తెనుగు నాటను గల పెక్కూరుపల్లెలు వేరులు మాఱియ దనరునిపుడు. దొంటి పేరులు గొన్ని రాగి పట్టాల, ఱాలపై గానంగ నయ్యెడు గాదె? ప్రాత యక్కరములు సదువంగ నేర్చిన యయ్యలు సెప్పగల వాని నేర్చి, యిపుడు పేర్కొన్నచో దెలియబడునె యా యూళ్ళవారికేన్? బొత్తములనున్న యిప్పటి పేళ్ళవి గ్రొత్తవిగావున దప్పని వానిని ద్రోచి పుచ్చి, ప్రాత పేరులు నేర్చి మగుడ నచ్చొత్తి, బడుల బిడ్డలచేత జదివింపమేలె? యొకయూరి గామిడికి గమ్మెండు గిచ్చి, కమ్మపై బ్రానుడివ్రాసి యంపెదరె? "యంచెల" వారది యంచి పుచ్చుదురె? లెంకనొక్కని జీరి, ప్రాత పేరది సెప్పి, యొక యూరికేగంగ బనుచుడు, వాడు "నేనెఱుగ నదియేటి దేడనున్న" నడె? క్రొన్నుడి ముతకని నేటి పేర్వులుగ మీనాల్క యీకొనమి, మొదలమేల్ నుడియ పల్కి, వెంబడి వీరు పని సక్క నెఱవెఱ గ్రొన్నుడియు దెల్లముగ వాక్రువ్వవలయు; బ్రానుడి పద్దెంబు మున్నగా జదివి, పదపడిదేటగా గ్రొందెల్గు పల్కునయ్య నారట్టుల; మేలు నూరె! సుంకరు 'లంచెల ' యెకి మీడు, రచ్చతెర్పర్లు, గాపర్లు, బడి యయ్యవాండ్రు సుద్దిగా నూళుల ప్రాతపేరులను నేర్వంగ గాట్టడి సేయుమని ఱేని వేడంగ వలయును జుండి తడయకయు. ప్రాబొత్తములు మీకు దొరకొన్నవటె గొన్ని. యందుల ప్రానుడులు మన వ్యాసావళి
77
ప్రాదెనుగు గమ్మ
వెడలవైనింప నవి నేర్చి బాపాడగలడె యల నలువ? వేయేడు లగుదెంచె నిన్నయేగి. నన్నయనుడులెల్ల మాఱకయు యున్నె? ఈ కమ్ములో నున్న వెన్నియో మాటలు నన్నయనుడులేవి దెలియంగ బడునె యిప్పు డీ రాజేంద్రవరమున వారు? మీరువోలెను. గాద యెల్ల రవి నేర్వం. బ్రానుడి నేరని వారితో మీకు మనబోవక పోవరాద కాదె? పెఱవారి నిచ్చలు మాటాడు నుడుల నాడకుండగ బొనకుండనగునె? నారాగవలతులు నాకు మాఱక యుండనే రాగికట్టుడు రెల్లర నాల్క లీతోపు మీకెపుడు దోప చొక్కా! నుడి మాఱునని మీరు నొగిలెద రేల? మీరు మాఱక ఱాలువోలె నుండెదరె?
ఇంకను విను డయ్యి విన్నవించెదను మార్పులు దెనుగుల మనుదల మనుదలలోను. మనికిపట్టులు దొంటి యట్టివిగాన. కోఱముట్లు గ్రొత్తల యేడజూచినను. బ్రోయాలు గుండలు గట్టెయగ పలును గైబట్టనోడును గూడు వండగను. సెల్లికొయ్యల ద్రచ్చి నిప్పొదవ జేసి ప్రోయిని గుంపటిని జిచ్చు నెట్టెదరె? ఇంటను వలపల రేపు దొడంగి క్రొత్తల కదె కందు మత్తమిలు దలుకం? గాపుల పనులిపుడు బాపలు సేయ గాపులు నడతురు బాపల యట్ల. క్రింది కొలమున వారు పల్వురు నేడు గొలువుల బెద్దలయి కుదురు కొనంగ, బడులలో జదువులు సెప్పుచునుండ, రచ్చల దగవులు దిద్దుచునుండ, బాపలు వారల యండ జేరెదరు. తొలి నేల దయ్యాల గుఱుకొని చేసిన కట్టడి మివులంగ నడచినయట్టి కాపుల బాపల సంకలియ నునిచి వారిచే దండువు గొనక వలదె? కటకటా మాటలు మాఱిన కతనన కడలేని నంతను గుందెడు మీకు గుండెలు వ్రక్కలు గాకుండ బోకుండ నగు టెట్టులయ్య, మీకట్టెదుట ద్రెళ్లె వేల్పులు బాపలు నేసిన బైసి? యిమ్మెయి బ్రాతలు పరిపరి తెఱగుల నెన్నియో మాఱియు మాసియుండంగ, నాప్రాతలకు బేర్లుగానున్న ప్రానుడులు నవియును వ్యాసావళి
మాఱియు మాసియు బొయె. బ్రాత సరకుల పోవ, సరకుల పేరు మఱచుట నింతేటి? యిది వింతగాక: నీ మార్పు నాలాయమని యెఱుగ రామివలనొండె నెడ గొండె నరయుడయ్య. అలగొంత తొలిపట్టి యేపిని గోకొని మింటికి నేగునా డాలితోడ దమ్ములు గూలుడు, నుఱకయ వారల డొక్కలు డిగవిడున, వేల్పులదొరయ బాడియె నావుడు, జముబిడ్డ నాడె మిక్కిలి మనుకుక్క వారి డొక్కలకని? పాడివలనన పుట్టి, పాడిక నెలవయి, పాడిఱేడన బేరు గ్రువ్వబడియు, మిన్నేటి మగనికి ముని మనుమండయి వెలిగి మిన్నేటి పట్టిచే బాడి గఱచి, పాడిగనంజాల దొకొరి కని సలుప డొక్కా!
ప్రాంత చదువులు గొన్ని వెస్కేండ్లు పూచి పాతుడు వడుడును బరిగోయియున్న. గుద్దళ్ళుకొని మీరు నేడు బ్రొక్కలు నేసి యెలుకల మెట్టుట ద్రవ్వి, తడవి, దొరకొన్న యెమ్ములు గొన్ని వెలిపుచ్చి, యిదిగొ తొల్లింటి బాస వెలది నా నాకె యనుదంది తకతక నేల నాటాడి యెల్లర నాల్కల నెక్కి నెక్కొన్నె? పాతనుడులకు నున్నె పస యెన్నడున్నేని? యడుగదయ్యెద రింక ప్రాతలగడని, ప్రాత పల్కుల దూఱ, గినియెద యేరు? నేటిమాటల దెగడ, మో డొరవుగాక. ప్రానుడు నగ్గింప నుబ్బుదురె యేరు బనులు సక్కంగ గాగగగొరు నారు? ప్రానుడులగిత్తు? కయిలోళ్ల నిపుడు తీర్పుల యెడబళ్ళకమ్మలయు మీద? రవులు గదిరిన యట్టి గాదిలి పట్టి సానున్న యపు డొక్క మందులవాడు వ్రాబల్కులను మందు నది యిడుచొప్పు జెప్పగ దల్లికి నెటులుండు వగవు, దేడయ్యెనేనియు నొడ్లకు జక్కగా దెలియంగ నలతురేన్, దేటగాన తెలిసెనీ యన్నుడియ వలయు గాదె? యెద్దులతో మీకు బనిలేని నాడు మీకు వలచిన యట్ల చేయంగ జనును. బోతులు దక్కంగ నేర 79
ప్రాదెనుగు గమ్మ
ట్టిరుండ్రె? నేడుగా బుట్టెనె యీపాడి నేల? నాలాయమే తీరు నుడువుడు రెల్లరు వరికించి తెలియుడు రిత్తతేల? నివ్వెఱ గొందిన నార్తురే ప్రానుడి? నాలితో నెవ్వండు వ్రాబల్కులాడు గౌగిట దాబట్టి ముద్దాడునాడు? నెయ్యంపు నెచ్చెలులు గూడియున్నెడుల బ్రాబల్కు లాడంగ మురిసె మొదవెడునె? యుల్లమున మొల్లముగ వేడ్కనైగొనునె? యెలయు నెడ దయ్యనెడ నాకొన్న యెడల నొచ్చునెడ; గినియునెడ జాలికొన్నెడల బ్రాబల్కు దనకుడా వెడలి రానగునే? యొగ్గు నేసిన పగఱనెడలేక నీకమై బెల్చను బ్రబ్బుచు నుగ్గడించుండును, వెల్వెడనె నిక్కంపు గ్రొందెనుగు నుడులు, గన్నుల యమిసెడు నెరగళ్ళయట్ల, తోలు దొఱంగిన చిల్వరాయని తొక ద్రొక్కంగ వెసమార్చి చిలుము బొలట్లు? యలరునెడ దనియునెడ వేడ్కగొన్నెదల గులుకునెడ, మఱియు నెడ, నుబ్బియెన్నెడల వెలి కొలుకు వాతను పాజంపునుడుల; క్రొమ్మెఱుగు దీవలవి; యెద కొలిమి నేరు తళతళ మునుపయిడి పలుకులు; కూర్మివెల్లువ యల లవి; గ్రొవ్విరి తావుల; పలుకుల సాని దా వీణియ గోట మీటిన జెలగెడు మ్రోత వోలె హరపు మొల్లముగాగ జేయునుడులు; నంటనూడగదగు; నాచవి పుట్టించు; లేనగవు లేమ నాతెఱ దొండపండ్ల. యిటువంటి సాజంపు మాటల దొఱగి, ప్రాబల్కులను గుండు ఱాలను గప్పి, మీతలపు నొడ్లకు నెఱిగించి పుచ్చదొడగుట కన్నను మిన్నకుండుటయ మేలని తోచదె వగవగ మీకు?
నెఱవుమై జూడుడు; మిమ్మునరికట్టి, నిచ్చలు మీనుడువు నుడువులని విడిచి ప్రాబల్కులన కాని పలుకంగ గాద, ప్రాబల్కులన కాని చెవి సొన్న గాద; యవి యాననెట్టిన, మీరు రెన్నాళ్ళ యాపగిది సేయుడున్, వినునొదనకున్నె "నోరార దీపారు తెలితెల్గు బల్కులు పలుకంగ నేనాడు గాంతు మొక్కొగియిచ్చమై మానాల్క సాజంపు సొలపున వ్యాసావళి
దలంపుల తెలుపను వలను గనునె? యాలియు బిడ్దయు సెయ్యనియుదోడ నిచ్చమై మేమెపుడు ముద్దులు గులుక నరమరలేకుండ మాటాడగలుగు? వీనుల విందుల్గా మఱియెన్నడున్నేని జిన్నారి పొన్నారి నేటి తెలి తెల్గు వినగ గాంతుమె లేదొ," యని కుంది కుంది, యాచెట్టు కట్టడి ద్రెవ్వద్రోంద్రోవ గడగుదు. రంతియ కాదు; మగుడ నేరును నటుల నెదగు గట్టళ్ళ జేయవలవద యని చెప్పుదరి మీరు. గాదు నో, బయిసుక నట్టి మీదియు మెత్తుమందురుగాక; యందురె మీరు విన్న నెద్దలు నాక, సార్లు గాపుల రాక, యెల్లర కట్టివి లగ్గ; వలయునవి?దయ్యాలయునుఱెండ్ల ప్రాడెంకు లిపుడు మేటులయి సాబగులయి యుండెనేని, గగునె మనకెల్లరకునిచ్చమై మనుగ? యరిసెలు వడియాలు లెప్పలు గానిండు; దగునె నిచ్చలు బిడ్డలని యారగింప? వంకాయవ్రేచిన చిఱి కందిపప్పు సచ్చిన పెద్దలు దినరట్టె పో, నిలిచిన పెద్దలు బోసేయుచుండంగ, నిచ్చలు వానిని నేమమ్ము వట్టి యేరుజ్జగింతురు దొసగొందు ననుచు? నేమమ్ము నందఱ కనువైన మాద్రి నుండని నాడేరు నాటింతురయ్య? "లచ్చ" కొక్కరు లేర ప్రాబాసమేర మీఱక కట్టుమై నడచు వారు.
'నన్నియగట్టిన కట్లుద్రెంపెదరె? చదువుసానిని బోడిగావింత్రె ' యంచు దెప్పెద రీరలు నిజమునుఱక. ప్రాతకట్లని గొన్నివెద్దయుం బ్రొద్దెడు, గ్రొత్తపోగులులేమి, బ్రిదిలె దాచు, యింక గొన్ని సిక్కువడ ద్రెళ్లంగ వీకరి తెలియమి బెద్దల; యేమిసెప్ప? బ్రాదోన నారాజ్య బాటించరైరి. మీకు జిక్కయినవి మీరు నెఱికితిరేని, మాకు జిక్కయినవి మేమూడ్తుమయ్య. బాసకట్లెల్లను బంటికాట్లకులోగి, నాల్క దెబ్బలు వడియు నుమ్మిదడిసి, చినికితునకలుగానె పుటుకుమనుచు? గ్రొందెనుగు నెల్లరకు దెలియగాదట్టె! యూరూరినుడులని వేఱువేఱట్టై! యట్లేని, వేనవేల్ దెనుగు లెల్లడల ద్రిమ్మఱంచుండు వారెటుల నొండొడ్ల 81
ప్రాదెనుగు గమ్మ
వ్యాసావళి
గములపొప్త్తాలు వెంకన, రంగన, సూరన వోలె జేసిరె? యేనాట నీకట్టుగలదె? నుడినప్ప గెలగించి నుడులేఱి కూర్చి కయితమ్ము సెప్పెరే కమ్మగా నేరు? పెద్దల కబ్బాలు గాలించికదె వెంకన రంగనలు వ్రోవిడ నోసిరి? బాసను బరికించి బాసకట్టడి గనిరి గాక, గట్టడిమున్న చేసి మఱి వ్రాసిరె? ముందెద్ది విద పెర్ది సూడక కడక దల్చిబ్బునేయ మీపేర్మికి దగునె? పొత్తాల పుట్టువు నెఱినెఱుక గలరు! మీయట్టి రిట్టులన నేమి నాగలదు.
పెద్దలచే విన్నదించుక నేను బేర్కొంతి నొచ్చొట దెలియంగ బడగ. నీ కమ్మ్లలో నెను గడుబూన్కి పూని కూర్చితి లెక్కలు వ్రాతనుడులు నాయోపు నంతకు బ్రావరువడి వట్టి. ప్రాబాస సదువర్లు మెప్పనచ్చి పసదన మిత్తురని యాస నేసి దొరకొన్న పనియని తోతెంచు గాని "ప్రానుడి సిఱు దన తవిలి పోవగగాద. యిట ముందరేమయిన నయ్యె; నిట మున్ను దొలిచొప్పు సొప్పదద" నుచు గనుపించి చాటి చెప్పంగ నిట్లు వ్రాసితినయ్య. నాకదె సూడంగ మేలనగ రాద. చచ్చి క్రుళ్లిన డొక్కులా నుడులు ద్రవ్వి పిన్నబిడ్డలవాత వైనంగ జనదు. బూచులని పాఱుదురు వీగి తలడిల్లి. తొలుత మీరలు సదువురచ్చ గూర్పంగ, జదువు బెంపునకు నైనాలు జతనాలు సక్కజేయగలలార యని యాసనెసి యుంటను, మీసన్ను పన్నుగడలెల్లె బనుపడక గుఱికి నవి దవ్వుల నగుట, నగగూరి నాతోపు మిమ్ము వినిచిరిని. దగు చొప్పు మదినరసి నేటియదనునకు నొనరెడు పడు నొకడువాడిగాజేసి, పాఱులు గాపులు నాక, యెల్లరును జదువులు నేర్వంగ నియ్యకొనుడు. నిక్కంపు నాడెమ్ముదెల్విచే బొసగు; రిత్తనుడికారముల బొరయదయ్య, యిప్పటి మన యేలి కల బాస గాపులు మాలలు సులుకగా జదవంగ, నడువ బెట్లయ్యె? మన బాస వెఱలకు కాద మనకేని గడుగొడినె యెట్లయ్యె? నదియు 83
ప్రాదెనుగు గమ్మ
వ్యాసావళి
వూనకుడ, యించెడు నానుడు లెల్లను మీకు! గండయ్య, విండయ్య, కొండయ్య మేల. మన రచ్చ దయ్యము మనచును గాత! అక్కున సిగలోన జొక్కున మోమున సానుల నెలకొల్పు మాను దొరలు సిరి, సేవ, నుడి మెఱుగు సమకూర్చి మంత్రు తెనుగు జదవుల రచ్చతీర్పరుల నెల్ల. భళిరె! భళి! భళిరె! భళి1 భళిరె!
ఇట్లు మీ యడియరి
నీడ నేనిడితి గైవ్రాలు
గిడుగు వేంకటరామమూర్తి.