వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/అంకితము

శ్రీ

తాతగారిజీవితము

సమగ్రముగా నాంధ్రభాషాసేవకే

సమర్పింపబడినది.

శ్రీవారి యీజీవితచరిత్రగ్రంథము

శ్రీ వేంకటగిరిమహారాజా

శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్రులవారికిని,

ఆదినుండియు వారినిపోషించుచుండిన రెడ్డివర్యులకును,

వారికి ఆప్తమిత్రులును శిష్యులును నై

'ప్రతివర్షపర్యాప్త ధాన్యదాత'లైయుండిన

శ్రీ గునుపాటి ఏనాది రెడ్డిగారికిని,

వీరే కార్యదర్శిగా పదివేలరూప్యములను చందా వేయించి

ఋణనివర్తి గావించి తాతగారికి తుదిదినములలో

హృదయశాంతింగూర్చిన, మా నెల్లూరి మండలీయ

రెడ్డి సంఘమునకును,

ఇట్లే మిత్రభావముతోను శిష్యభావముతోను

తాతగారిని నిరంతరము ఆదరించుచు

శతాథిక గ్రంథములను వారిచే రచియింపించి

ఆంధ్ర భాషోద్ధరణముం గావించిన మహాశయుల కెల్లరకును

స్వయముగానే అంకితము

ఈమహనీయుల నామధేయములు

ఆంధ్ర వాఙ్మయమున చిరస్థాయిగా స్వర్ణాక్షరముల

వెలుంగుగాక.