వృక్షశాస్త్రము/మంచి గంధము కుటుంబము
373
జేసిన కాగితము లంటరాదని ఈబెరడు చీలికలమీదనే వ్రాయుచువచ్చిరి.
మంచి గంధము కుటుంబము.
- మంచి గంధపు చెట్టు
ఈకుటుంబములో చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరిచేరిక గానైనను, అభిముఖ చేరికగానై 374
ననుండును. సమాంచలము కణుపు పుచ్చము లుండవు. ఈనెలు పెద్దవి గావు. కొన్నిటి ఆకులు చిన్నవిగా బొలుసులవలెనే యుండును. కొన్నిటికి లేనేలేవు. పువ్వులు చిన్నవి. ఆకుపచ్చగానుండును. సరాళము. పుష్పనిచోళము కొన్నిటిలో ఉచ్చముగను కొన్నిటిలో నీచముగ నున్నది. మిధున పుష్పములు ఏకలింగ పుష్పములు కూడ గలుగు చున్నవి. పుష్ప విచోళపు తమ్మెలు చివర సన్నని ముల్లువంటి దొకటి కలదు. కింజల్కములు 3--6 పుష్ప నిచోళము నంటుకొని దాని తమమెలకెదురుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అండాశయములో అందములు రెండో మూడో వ్రేలాడు చుండును. కాయ కొన్నిటిలో లోపెంకు కాయ. మరి కొన్నిటిలో బగులని యెండు కాయ.
మంచి గంధపు చెట్లు విస్థారముగా పడమటి కనుమల మీదను, కూర్గు వద్దను బెరుగుచున్నవి. ఇవి చెట్లైనను గొంతవరకు బరాన్న భుక్కులు గానున్నవి. వీని వేరులు వ్యాపించి ఇతర వృక్షముల వేరులలో జొచ్చి అవి సంపాదించినా అహారమును తస్కరించుచున్నవి. మంచిగంధపుటాకులు నిడివి చౌక పాకారము పువ్వులు చిన్నవి. మొదట పచ్చగా నుండి తరువాత ఊదా అగును. ఆకులకు గాని, పు 375
వ్వులకుగాని చెట్తు బెరడునకుగాని సువాసన లేదు. మాను మధ్యనున్న దారువునకే గలదు. ఈ చందనములో శ్రీ చందనము, పీత చందనము, రక్త చందనము మొదలగు భేదములు వున్నవని అను చున్నారు. మొదటి రెండును ఈ చెట్టు యొక్క మంచి రకము. చెడ్డరకములే గాని రక్త చందనము దీనిది గాదు. ఈ రక్త చందనము తోడనే చందనపు బొమ్మలు చేయుదురు. ఈ చెట్టు చిక్కుడు కుటుంబము లోనిది. మంచి గంధపు చెట్లు ఎక్కువగా దక్షిణ దేశము నందుండినను చమురు దీయుట లేదు. మంచి గంధపు నూనె, అయోద్య వద్దను, హిందూస్థానమందలి వరి కొన్ని పట్టణములలోను చేయుచున్నారు. మంచి గంధపు చెక్కను పొడి గొట్టి రెండు దినముల నీళ్ళలో నాననిచ్చి బట్టి పట్టుదురు. నూనెయు నీళ్ళతో గలిసి ఆవిరియై రెండును జల్లారి నీళ్ళమీద నూనెదేలుచుండును. తరువాత దీనిని వేరు వేరు విధముల పరి శుభ్రము చేసెదరు. ఒక్కొక్కప్పుడు మడ్డి అంతయు బోవుటకు నొక సంవత్సరము వరకు నానూనెను అట్లే యుంచెదరు.
మంచి గంధము ఔషదములలో గూడవాడుదురు. ఇది ముఖ్యముగా పరిమళ ద్రవ్యములలో ఒకటి. బొట్టు పెట్టుకొనుటకు దీనినుపయోగింతుము. గౌరవము చూచించుటకై 376
గంధము రాయుచుందురు. వివాహాది శుభ కార్యములలోనీ చెక్కను వాడుదురు.
ఆముదపు కుటుంబము.
ఆముదపు చెట్టు 2 - 5 అడుగుల ఎత్తువరకు పెరుగును.
- ప్రకాండము
- - గుల్మము. కొయ్య వంటి దారు లేదు. లేత కొమ్మల మీదను, దొడిమల మీదను తెల్లని మెత్తని పదార్థము గలదు. అది లేగొమ్మలను ఎండకు ఎండి పోకుండ కాపాడును.
- ఆకులు.- ఒంటరి చేరిక. లఘు పత్రము. మొగ్గగా నున్నప్పుడు దానిని గప్పుచు 2 కణుపు పుచ్ఛములు గలవు. పత్రముతో దొడిమ చేరు చోట దీనికిరు పక్కల బత్రము మీద గ్రంధి గోళములు గలవు. తొడిమ పాత్రము యొక్క అంచుతో చేరక కొంచెము మధ్యగా కలియు చున్నది. తాళపత్ర వైఖరి 7, 8 తమ్మెలున్నవి. తమ్మెల అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. బహుకాష్టకము. రెండు వైపుల నున్నగా నుండును.
- పుష్పమంజరి
- - రెమ్మ గెల. ఏకలింగ పుష్స్పములు. ఒక కొమ్మమీదనే స్త్రే, పురుష పుష్పములు గలవు. వృంతమలడుగు భాగమున స్త్రీ పుష్పములు, పైభాగమున పురుష పుష్పములు.
- పురుష పుష్పము
పుష్ప కోశము. ( పుష్పనిచోళము) 3--5 రక్షక పత్రము ఒకదానినొకటి తాకుచుండును.
దళవలయము. లేదు.