వృక్షశాస్త్రము/అగరు కుటుంబము

370

ప్పుడేదీసి వేరుచోట బాతుదురు. ఇవి పదేండ్లకు ఫలితమునకు వచ్చును.

వర్షములును లేక, ఎండ ఎక్కువగను లేనప్పుడే ఆకులను కోయుట ఆరంబింతురు. లేత చెట్ల కేటేట కోయుదురు గాని ముదురు వాని ఆకులు రెండేసి ఏండ్ల కొక మాటే కోయుచుందురు. ఇట్లు చెట్టునకు నూరు సంవత్సరముల వరకు కోయవచ్చును.

దీని ఆకులను కొందరు వంటలో ఉప యోగించెదరు. కరక్కాయలతో గలిపి రంగు వేయుటలో వాడుదురు. మరియు ఔషధములలో వాడుదురు.


అగరు కుటుంబము.


అగరుచెట్టు కొండలమీద బెరుగును. లేకొమ్మల మీద పట్టు వంటి రోమములు గలవు.

ఆకులు
- ఒంట్రి చేరిక. లఘు పత్రములు బల్లెపాకారము. పొడవు 2 - 3/2 అంగుళములు. విషమరేఖపత్రము. సమాంచలము కొన వాలము గలదు.
పుష్పమంజరి
- రెమ్మగుత్తి. తెలుపు ఎకలింగపుష్పములు.
పుషనిచోళము
- సంయుక్తము 5 తమమెలు అల్లుకొని యుండును నీచము. 371
కింజల్కములు
-. 10 కాడలు మిక్కిలి పొట్టివి పుప్పొడి తిత్తులు వెడల్పుగా నుండును. కింజల్కములకు పైన 5 పొలుసులు గలల్వు.
స్త్రీ పుష్పము
- పుష్ప నిచోళము. పైదాని వలెనే యుండును.

అండాశయము అండ కోశము: ఉచ్చము రెండు గదులు. కీళము మిక్కిలి పొట్టి. గింజలు వ్రేలాడుచుండును.

ఈ కుటుంబపు చెట్లు విస్తారము శీసల దేశములలో పెరుగును. ఆకులు ఒంటరి చేరిగా నైనను, అభి8ముఖ చేరికగా నైనను వుండును. లఘు పత్రములు సమాంచలము. పుష్పనిచోళమే గలదు. ఏక లింగ పుష్పములు. అండాశయము గదిలో నొక్కొక గింజయే యుండును.

అగరు చెట్టు కాశ్మీరదేశ ప్రాంతముల కొండలమీద సాధారణముగ ఆరువది అడుగుల ఎత్తుపెరుగును. దాని మ్రాను యొక్క కైవారము 5 మొదలు 8 అడుగుల వరకు వుండును. ఇరువదేండ్లక్షమైన పిదప అగరు కొరకుదానినినరక వచ్చునందురు గాని కొందరు మంచి యగ రేబది సంవత్సరములలోపున రాదందురు. ఎన్నిసంవత్సరములు (నరికి 372

యుంచినను) నరుకక యుంచినను నన్ని చెట్ల యందునగరు లభించదు. కొన్ని చెట్ల యందు మాత్రము మాను లోను కొమ్మల యందును ముక్క ముక్కలవలె నగరేర్పడును. ఈ కారణము వల్ల నిట్లేర్పడు చున్నదో తెలియ వచ్చుట లేదు. మరియు నేచెట్టు నందేర్పడినది నరికిన గాని తెలియదు. అగరులే చిట్లంత ఉపయోగ కారులు కావు. కలపకును సువాసనయుండక తేలిగ గానుండును. అగరు నకు మంచి పరిమళము గలల్దు. పన్నీరు వలే దీనిని శుభ కార్యములందు ఉపయోగించురు. దీని తోడనే అగరు వత్తులను చేయుదురు. కాని ఇతర పరిమళ ద్రవ్యములతో కూడ వత్తులుచేసే వానినే అగరు వత్తులని అమ్ముచున్నారు. సాధారణముగా అంగళ్ళ యందుండు అగరు నూనెయు నిజముగా అగరు నుండి చేసినదేయని నమ్ముటకు వీలు లేదు, అగరును కొందరు ఔషథముల యందు కూడ ఉపయోగించు చున్నారు.

కాగితములు చేయక పూర్వము అగరు బెరడులను బలుచగ చీల్చి వానిమీద గొందరు వ్రాసెడు వారు. కాగితములు వచ్చినగొంత కాలము వరకు కూడ మంత్రవేత్తలగు బ్రాహ్మణులు యోగులును యంత్రశాలలందు 373

జేసిన కాగితము లంటరాదని ఈబెరడు చీలికలమీదనే వ్రాయుచువచ్చిరి.


మంచి గంధము కుటుంబము.

మంచి గంధపు చెట్టు

ఈకుటుంబములో చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరిచేరిక గానైనను, అభిముఖ చేరికగానై 374

ననుండును. సమాంచలము కణుపు పుచ్చము లుండవు. ఈనెలు పెద్దవి గావు. కొన్నిటి ఆకులు చిన్నవిగా బొలుసులవలెనే యుండును. కొన్నిటికి లేనేలేవు. పువ్వులు చిన్నవి. ఆకుపచ్చగానుండును. సరాళము. పుష్పనిచోళము కొన్నిటిలో ఉచ్చముగను కొన్నిటిలో నీచముగ నున్నది. మిధున పుష్పములు ఏకలింగ పుష్పములు కూడ గలుగు చున్నవి. పుష్ప విచోళపు తమ్మెలు చివర సన్నని ముల్లువంటి దొకటి కలదు. కింజల్కములు 3--6 పుష్ప నిచోళము నంటుకొని దాని తమమెలకెదురుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అండాశయములో అందములు రెండో మూడో వ్రేలాడు చుండును. కాయ కొన్నిటిలో లోపెంకు కాయ. మరి కొన్నిటిలో బగులని యెండు కాయ.

మంచి గంధపు చెట్లు విస్థారముగా పడమటి కనుమల మీదను, కూర్గు వద్దను బెరుగుచున్నవి. ఇవి చెట్లైనను గొంతవరకు బరాన్న భుక్కులు గానున్నవి. వీని వేరులు వ్యాపించి ఇతర వృక్షముల వేరులలో జొచ్చి అవి సంపాదించినా అహారమును తస్కరించుచున్నవి. మంచిగంధపుటాకులు నిడివి చౌక పాకారము పువ్వులు చిన్నవి. మొదట పచ్చగా నుండి తరువాత ఊదా అగును. ఆకులకు గాని, పు