వృక్షశాస్త్రము/పొన్న కుటుంబము

97

బొమ్మ
....పెద్దపావలి కూరం.
పెద్ద పావలి కూర.
98

పెద్ద పావలి కూరయు, సన్న పావలి కూరయు:...మిక్కిలి తేమగా నున్న చోటుల బెరుగు చున్నవి. వీనిని కఋవు కాలమందు వండుకొని తిందురు. మరియు ఈని పచ్చి యాకులును, గింజలను కూడ నౌషదములలో వాడుచున్నారు. గింజలు మూత్ర విసర్జనమప్పుడు కలుగు మంట మొదలగు జబ్బులకును, శగకును, వాడుదురు. శరీరము నొప్పులుగా నుండి మందు కట్టవలసి వచ్చినపుడు, మందునకు బదులుగా, వచ్చి యాకులను నూరి గట్టవచ్చు నందురు.

పొన్న కుటుంబము.


ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో పెద్దచెట్లు, గుబురు మొక్కలు మాత్రము గలవు. ఈ మొక్కలలోను, జిల్లేడు మొక్కలో నున్నట్లు పాలుగలవు గాని అవి చిక్కగాను, సాధారణముగ పచ్చాగాను నుండును. ఆకులు లఘు పత్రములు, అభిముఖ చేరిక, నున్నగా నుండును. పువ్వులలో నేకలింగ పుష్పములు మిధున పుష్పములు గూడ నున్నవి. పుష్ప కోశపు తమ్మెలు మొగ్గలో నల్లుకొని యుండును; ఇది ఈ కుటుంబము యొక్క ముఖ్య లక్షణము.

పొన్నచెట్టు మనదేశములో చాలచోట్ల పెరుగు చున్నది. తురాయి ఆకుల వలె దీని యాకులు ఒక్కమాటు రాల 99

వు. ఇది సదా పచ్చగానుండి ఇంపుగొలుపు చున్నది. ఇది సంవత్సరము పొడవున పుష్పించును. పువ్వులకు మనోహరమగు వాసన గలదు. కృష్ణుడు గోపికా వస్త్రముల నపహరించి దీనిపై నెక్కెనని చెప్పుట చేత మనకాదరణీయము నైనది. దీని గింజలనుండి చమురు తీసి కొన్ని చోట్ల నౌషధముగ నుపయోగించు చున్నారు. అది కీళ్ళు నెప్పులు, పుండ్లు మొదలగు జబ్బులకు పైన రాసినచో గుణమిచ్చునందురు. దీని కలపయు బాగుగనే యుండును. పెట్టెలు, కుర్చీలు, తెరచాప కొయ్యలు, పనిముట్లు మొదలగునవి చేయుటకు బనికి వచ్చును.

నాగకేసరము
.... చెట్టు కూడ మిగుల అందముగా నుండును. ఆకులు అభిముఖ చేరిక. కురుచ తొడిమ, బల్లెపాకారము. పువ్వులు పెద్దవి. తెల్లగా నుండును. దీని వాసనయు మనోహరముగుగ నుండును.

తేయాకు కుటుంబము.


తేయాకు కుటుంబము చిన్నది. దీనిలో నన్నియు గుబురు మొక్కలు. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు, పువ్వులు పెద్దవి. వానికి చేటికి లుండును. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు అయిదేసి యుండును గాని నాలుగు మొదలు తొమ్మిదింటి వరకు గూడ గలుగు చుండును. ఇవిమొగ్గలో