వృక్షశాస్త్రము/పావలి కుటుంబము

96

కనరు
....చెట్టు గుబురు మొక్క. దీనిమీద ముండ్లుగలవు. ఆకులు నిడివి చౌక పాకారము.
పెద్దకనరు
.... పైదానంత విరివిగా బెరుగుట లేదు. దీని ఆకులు అండాకారముగ నున్నవి.

పావలి కుటుంబము.


ఈ కుటుంబము చిన్నది. దీనిలో జేరు మొక్కలన్నియు గుల్మములే. పెద్దచెట్లు లేవు. ఆకులు, సమాంచలము. అభిముఖ చేరికగా నైనను, ఒంటరి చేరికగానైనను నుండును. కణుపుల వద్ద రోమముల వంటివి గలవు. రక్షక పత్రములు రెండు. అవి మొగ్గలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు నాలుగో, అయిదో గలవు. కొన్నిటిలో నడుగున నివన్నియు గలసి యున్నవి. దళవలయము కొన్నిటిలో వృతాశ్రితముగను, గొన్నిటిలో బుష్ప కోశాశ్రితముగ గూడ నున్నది. కింజల్కములు నాలుగు గాని అంత కంటె నెక్కువవ గాని యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాశయము ఒక గది అండములు రెండో, ఇంక నెక్కువయో యుండును. కీలము చివరి రెండుమొదలు ఎనిమిది చీలికల వరకు గలవు. ఈ చీలికలు కీలాగ్రముల వలెనే నుండును. 97

బొమ్మ
....పెద్దపావలి కూరం.
పెద్ద పావలి కూర.
98

పెద్ద పావలి కూరయు, సన్న పావలి కూరయు:...మిక్కిలి తేమగా నున్న చోటుల బెరుగు చున్నవి. వీనిని కఋవు కాలమందు వండుకొని తిందురు. మరియు ఈని పచ్చి యాకులును, గింజలను కూడ నౌషదములలో వాడుచున్నారు. గింజలు మూత్ర విసర్జనమప్పుడు కలుగు మంట మొదలగు జబ్బులకును, శగకును, వాడుదురు. శరీరము నొప్పులుగా నుండి మందు కట్టవలసి వచ్చినపుడు, మందునకు బదులుగా, వచ్చి యాకులను నూరి గట్టవచ్చు నందురు.

పొన్న కుటుంబము.


ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో పెద్దచెట్లు, గుబురు మొక్కలు మాత్రము గలవు. ఈ మొక్కలలోను, జిల్లేడు మొక్కలో నున్నట్లు పాలుగలవు గాని అవి చిక్కగాను, సాధారణముగ పచ్చాగాను నుండును. ఆకులు లఘు పత్రములు, అభిముఖ చేరిక, నున్నగా నుండును. పువ్వులలో నేకలింగ పుష్పములు మిధున పుష్పములు గూడ నున్నవి. పుష్ప కోశపు తమ్మెలు మొగ్గలో నల్లుకొని యుండును; ఇది ఈ కుటుంబము యొక్క ముఖ్య లక్షణము.

పొన్నచెట్టు మనదేశములో చాలచోట్ల పెరుగు చున్నది. తురాయి ఆకుల వలె దీని యాకులు ఒక్కమాటు రాల