వృక్షశాస్త్రము/నాభి కుటుంబము
ఇక నేయో లక్షణములను బట్టి కుటుంబము లేర్పడుచున్నవో, ఆకుటుంబపు ఉపయోగము లేవియో తెలిసికొందము.
నాభి కుటుంబము
నాభి కుటుంబములోని మొక్కలు చాల భాగము శీతల ప్రదేశములలో బెరుగు చున్నవి. వీనిలో నించుమించు అన్నియు గుల్మములు. ఆకులు ఒంటరిచేరిక, ఒక జాతి మొక్కలందు మాత్రమభిముఖచేరిక గానున్నవి. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు లేవు. కింజల్కములు స్త్రీపత్రములు అసంఖ్యములుగా నున్నవి. గింజలలో అంకురచ్ఛదనము గలదు.
నాభి:.... ఒక మొక్క యొక్క ఎండ బెట్టినవేరు. ఈ జాతి మొక్కలన్నియు హిందూస్థానమున హిమాలయాపర్వతముల మీద బెరుగుచున్నవి. నాభి లోనే చాల రకములు గలవు. కొన్ని కొంచెము తెల్లగా నుండును, కొన్ని ఎర్రగా నుండును. కొన్నిచిన్నవి. ఇంకను ఎన్నో రకములున్నవి. ఈ రకములన్నియు బొడుము చేసి గోదుమపిండితోడనైనను, ఇట్టిది మరిదేనితో నైనను కలిపి మిక్కిలిచిన్నచిన్న మోతాదులుగ లోపలికి బుచ్చుకొనవచ్చును. అది నరములకు బలము చేయును; అతి 58 (పునరుక్తము)
ఇక నేయే లక్షణములను బట్టి కుటుంబము లేర్పడుచున్నవొ, ఆకుటుంబపు టుపయోగము లేవియో తెలిసికొందము.
నాభికుటుంబము.
నాభికుటుంబములోని మొక్కలు చాలాభాగము శీతల ప్రదేశములలో బెరుగుచున్నవి. వీనిలో నించుమించు అన్నియు గుల్మములు. ఆకులు ఒంటరిచేరిక, ఒకజాతిమొక్కలందు మాత్ర మభిముఖచేరికగానున్నవి. రక్షకపత్రములు, ఆకర్షణపత్రములు లేవు. కిందల్కములు స్త్రీపత్రములు అసంఖ్యములుగా నున్నవి. గింజలలో అంకురచ్చదనముగలదు.
నాభి:-ఒక మొక్కయొక్క ఎండబెట్టినవేరు. ఈజాతి మొక్కలన్నియు హిందూస్తానమున హిమాలయపర్వతములమీద బెరుగుచున్నవి. నాభిలోనే చాలారకములు గలవు. కొన్ని కొంచెము తెల్లగా నుండును, కొన్ని యర్రగానుండును, కొన్నిచిన్నవి, ఇంకను ఎన్నోరకములున్నవి. ఈరకములన్నియుబొడుముచేసి గోధుమపిండితోదనైనను, ఇట్టిది మదిదేనితోనైనను కలిపి మిక్కిలిచిన్నచిన్న మోరాదులుగ లోపలికి బుచ్చుకొనవచ్చును. అదినరములకు బలముచేయును; అతి బనికివచ్చును. కొందరు కూరగాయలందును దీనిని వాడు చున్నారు.
ఉవ్వ కుటుంబము.
ఉవ్వచెట్టు కొండల మీద బెరుగును. ఇది అందముగా నుండుట చే తోటలందును బెంచు చున్నారు.
ప్రకాండము: -- వంకరలు లేక తిన్నగా నుండును. కాని కొంచమే ఎత్తుండును. కొమ్మలు గుండ్రముగా వ్వాపించును.
ఆకులు: -- ఒంటరి చేరిక, లఘు పత్రములు తొడిమలు కురుచనివి. నిడివిచౌకపు నాకారము. రెండువైపులనున్నగనుండును. అంచున రంపపు పండ్లు గలవు. కొనసన్నము.
పుష్పమంజరి: -- కణుపుసందుల నొక్కొక్క పువ్వు గలదు. పువ్వులు పెద్దవి. భూమి వైపు వంగి యుండును.
పుష్పకోశము: -- రక్షక పత్రములైదు. గుండ్రముగాను దళసరిగాను నున్నవి. ఇదియు బెరుగుచు కాయను మరుగు పరచును. నీచము.
దళవలయము: -- అసంయుక్తము. వృంతాశ్రితము. 5 ఆకర్షణ పత్రములు. తెలుపు రంగు, వీనికి మంచివాసనగలదు.
కింజల్కములు: -- అసంఖ్యములు. కాడలు పొట్టివి. పుప్పొడి తిత్తులు సన్నము. మధ్యనున్న పుప్పొడితిత్తులు సన్నము. మధ్యనున్న పుప్పొడి తిత్తులు కీలాగ్రముక్రింద వంగి యున్నవి.
అండకోశము: -- విభక్తాండాశయము. ఉచ్చము ఒక్కొక్కగది