వృక్షశాస్త్రము/గుమ్మడి కుటుంబము

238

ధాతుక చెట్టును పువ్వులు గూడ అందముగా ఉండుటచే తోటలయందు పెంచు చున్నారు. దీని పువ్వులను ఎండబెట్టి యొక రంగు చేసెదరు. ఆకులలో తోలు భాగు చేయు పదార్థము కలదు. కొన్నిచోట్ల ఆకులను వండుకొని తిందురు. ఈ చెట్టు నుండి జిగురు కూడ వచ్చును. దీని కలప పొయిలోకి తప్ప మరెందులకు పనికిరాదు.

చెన్నంగి:- పెద్దచెట్టు. ఇది మన దేశమందటను గలదు. దీని కలప వాసములకు, దూలములకు బండ్లు, నాగళ్ళు మొదలగు వాని నన్నింటికీని బనికివచ్చును. దీని నుండి నారయు వచ్చును. ఒక రకము పట్టు పురుగు కూడ దీని యాకులు తిని బ్రతుక గలదు.

అగంధ్రపాకు మొక్క చిన్నది. ఆకులకు తొడిమలు లేవు. కొన్ని నొప్పులను బోగొట్టుట కీయాకులను గాచి పట్టు వేసెదరు.


గుమ్మడి కుటుంబము.


గుమ్మడి పాదు తోటలలో బెట్టుచున్నారు. లంకలలో నివి విస్తారముగా బెరుగు చున్నవి.

ప్రకాండము:- తీగ. రోమములుగలవు. ఆకుల దగ్గిర మూడు నాలుగు చీలికలుగ నున్న తీగలు గలవు. 239

గుమ్మడి.

1. పురుష పుష్పము. 2 స్త్రీ పుష్పము.

ఆకులు
- లఘుపత్రములు. ఒంటరిచేరిక హృదయాకారము విషమ రేఖ పత్రము రెండు వైపుల రోమములు గలవు.
పుష్ప మంజరి
- పచ్చని పెద్దవువ్వు ఒక్కొక్క కణుపు సందున నొక్కొక్కటి గలదు. ఏకలింగపుష్పములు. 240
పురుష పుష్పములు

పుష్పకోశము:- సంయుక్తము, 5 తమ్మెలు గలవు. ఆకు పచ్చరంగు తమ్మెలు సన్నముగా నుండును.

దళవలయము
- సంయుక్తము. 5 తమ్మలు, పశుపు రంగు పుష్ప కోశమునంటి యుండును.
కింజల్కములు
- 3 రెండింటి పుప్పొడి తిత్తులకు రెండేసి గదులు గలవు. కాని యొక దానికి నొకటే గది గలదు. పుప్పొడి తిత్తులు మెలికలు తిరిగి యుండును.
స్త్రీ పుష్పము

పుష్పకోశము దళవలయము. పైదాని యందువలె నుండును. అండ కోశము. అండాశయము:


గొమ్ముపొట్ల.

కొమ్ముపొట్ల తీగలు:- హిందూస్థానమునందెక్కువగా గలవు. కొన్ని తీగెలు మగవి. కొన్ని ఆడువి; మగ తీగలు మగపుష్పములను ఆడు తీగలు ఆడు పుష్పములను బూయును. నులి తీగలు చీలి యుండును.

ఆకులు
- ఒంటరి చేరిక, హృదయాకారము. నిడివి చౌకముగాగూడ నుండును. తొడిమపై రోమములుగలవు. విషమ రేఖ పత్రము కొన సన్నము అంచునపండ్లుగలలవు. 241
పురుష పుష్పము
.....
పుష్పకోశము
- సంయుక్తము 5 తమ్మెలు తమ్మెలు బల్లెపాకారము.
దళ వలయము
- సంయుక్తము అడుగు వరకు నైదు తమ్మెలుగ జీలి యున్నది. తెలుపు.
కింజల్కములు
- 3 రెండిటి పుప్పొడి తిత్తులు రెండేసి గదులు. ఒక దాని దొకగదియె. పుప్పొడి తిత్తులు మెలికలు తిరిగి యుండును.
స్త్రీ పుష్పము

పుష్పకోశము:, దళ వలయము: పైదాని వలెనె యుండును.

అండ కోశము:- అండాశయము నీచము. 1. గది కీలము సన్నము. అండ లంబన స్థానములు 8. కుడ్యసంయోగము.

పొట్టి బుడమ

పొట్టి బుడమ తీగెచాల చోట్ల పెరుగును. తీగె సన్నముగా నుండును. నులి తీగెలు చీలియుండవు.

ఆకులు
- ఒంటరి చేరిక లఘు పత్రములు. హృదయాకారము 5 తమ్మెలు గలవు గాని చిన్నవి. విషమ రేఖ పత్రము. అంచున రంపపు పండ్లుగలవు. కొనసన్నము. ఒక తీగె మీదనే కొన్ని తొడిమలు లేని ఆకులు కూడ గలవు.
పుష్ప మంజరి.
- కణుపుసందులందు స్త్రీ పుష్పములు పురుష పుష్పములు గలసి గుత్తులుగుత్తులుగా నున్నవి. పురుషపుష్పములకు వృంతముగలదు స్త్రీపుష్పములకు లేదు. 242

పురుష పుష్పము.

పుష్పకోశము
- సంయుక్తము. 5 దంతములు గలవు. ఆకు పచ్చ రంగు.
దళవలయము
- సంయుక్తము 5 చిన్న తమ్మెలు గలవు. పసుపు రంగు పుష్ప కోశము నంటి యుండును.
కింజల్కములు
- 3 రెండింటి పుప్పొడి తిత్తులు రెండేసి గదులు ఒక దాని దొక గదియె పుప్పొడి తిత్తులు మెకలు తిరుగవు.

స్త్రీ పుష్పము. పుష్ప కోశము, దళవలయము:..... పై వాని వలెనే యుండును.

అండకోశము
- అండాశయము నీచము అండములు చాలనుండవు. కుడ్య సంయోగము కీలము లావుగా నుండును. కీలాగ్రము గుండ్రము.

ఈకుటుంబము మొక్క లెక్కువగా ఉష్ణప్రదేశములలో పెరుగు చున్నవి. ఇవన్నియు దీగెలే. వానికి నులి తీగెలు గలవు. కొన్నిటి నులి తీగెలు, చీలి యుండును. ఆకులు, లఘు పత్రములు,. ఒంటరి చేరిక, అకుల మీదను, తీగెలమీదను కూడ రోమములు గలవు. పువ్వులు తెల్లగానైనను, పచ్చగా నైనను వుండును. ఏకలింగ పుష్పములు. కొన్ని తెగలలో మగ తీగెలు ఆడు తీగెలు గలవు. కింజల్కములు మూడు లేక ఒక తీగ తీగెయందు నైదు కింజల్కములును ఒక్కొక్క దాని పుప్పొడి తిత్తియందు నొక గదియు నుండుట చేత, నట్టి కింజల్క 243

ములు నాలుగు కలిసి రెండుగా ఏర్పడినవని యూహించుచున్నాము. అండ కోశము నీచము. కాయపై పెంకు కాండకాయ.

గుమ్మడి తీగెలు ఇసుక నేలలో ఏపుగా పెరుగును. వీని కాయలు మిగుల పెద్దవి. అవి చాల కాలము నిలువ యుండును. ఎండి పోకుండ వానిపై నున్న బిరుసైన చర్మము కాపాడు చున్నది. దీనిని కూర గాయగాను, పులుసులోను వాడుదుము.

బూడిద గుమ్మడి
- ఆకులు బొడుగగు నైదు తమ్మెలు గలవు. దీని గింజలను వర్షము లారంబించిన పిదప పాత వలెను. ఒక్కొక్క చోట రెండు గింజలకంటె పాతుట మంచిది కాదు. ఈ తీగెలకు నెరువును, నీరును తరచుగా దగులు చుండ వలెను. చిన్న మొక్కలుగా నున్నప్పుడు పురుగు పట్టుటయు గలదు. లేత కాయలను గొందరు కూర వండు కొందురు. ఈ కాయలపై నుండు తెల్లని బూడిద కాయలెండకు ఇగుర్చుకొని పోకుండ కాపాడును.
పొట్లకాయలు
- ఇవి వర్షాకాలములో కాయును. ఆకుల మీద గరుకగు రోమములు గలవు. వాని యందొక వాసన గలదు. గరుకగు రోమములుండుట చేతను, వాసన యుండుట చేతను సాధ్యరణముగ తీగెలను పసువులు దినవు. తరుచుగా తీగెలక్రింద రాలియుండు పువ్వులు మగ పువ్వులే. 244

కొమ్ముపొట్ల పువ్వులు పెద్దవి. కాయలను కూర వండు కొందురు. ఆకుల రసము, వేళ్ళ రసము కూడ ఔషదములలో వాడు చుందురు.

అడవి పొట్ల కాయలు చేదుగా నుండును. కాన సాధరణముగ తినరు. ఎండిన లేత కొమ్మలు కాయలు గింజలు కూడ ఔషదములలో వాడుదురు.


పొట్టి బుడమ తీగె డొంకల మీద ప్రాకును. తీగె సన్నము. కాయలు చిన్నవి. వీని నంతగా వాడుచుండి నట్లు గనవచ్చుట లేదు.

పాము బుడమ
- ఆకులు మిశ్స్రమ పత్రములు. పువ్వులు పచ్చగాను, చిన్నవి గాను నుండును. కాయ మూడుపలకలు,. మిక్కిలి చేదుగా నుండును. దీని గింజల నుండి తీసిన చమురుతో దీపములు వెలిగించుకొన వచ్చును.

నల్లబుడమ పాముబుడమ కంటే చిన్నది. కాని పువ్వులు పెద్దవి. దీని కాయలను వాడుటలేదు.

కొండ బుడమ
- ఆకులు కొంచెమించుమించు చిక్కుడు గింజ ఆకారముగ నుండును. కాయలు గుండ్రము. 245

వీనినే వరుగు చేయుచున్నాము. కాని ఎచ్చటను సేద్యము చేయు చున్నట్లు గన రాకున్నది.

తియ్య దొండ తీగె (ప్రకాండము) గుండ్రముగా నుండును. నులి తీగెలు చీలి యుండవు. కాయలు బుడమ కాయలంత యుండును గాని యంత కంటె కొంచెము లేత ఆకు పచ్చరంగు. కాయలు కూరకు బాగుగానుండును. ఇవి బలమును గలుగ జేయునందురు.

కాకిదొండ తీగె (ప్రకాండము) 5 పలకలుగా నుండును. ఆకుల మీద మెత్తని రోమములు గలవు. ఆకుల రసము ఔషధములో వాడుదురు.

బీరకాయ లించుమించు సంవత్సరము పొడువున వచ్చుచునే యుండును. కాని శీతాకాలములో నివి ఎక్కువ బాగుగ నుండును. ఇతర కాలములందొక్కక్కప్పుడు చేదుగా నుండుటయు గలదు. దీని ఆకులంతగా గరుకుగా నుండవు.

అడవి బీర తీగె బీర తీగ వలెనే యుండును. కాయలు మధ్య లావుగను రెండు వైపుల సన్నముగాను నుండును. ఇవి మిక్కిలి చేదు. వీనిని నమిలిన డోకు వచ్చును. వీని రసము నుడక బెట్టి తల నొప్పులకు పట్లువేసెదరు. 246

గుత్తి బీరయు బీర తీగె వలెనే యుండును. కాయలు చిన్నవి. నున్నగా నుండును. వీనిలో పీచు మెండు.

నేతి బీర ఆకులు మిశ్రమ పత్రములు. కాయలు పెద్దవి. బీరకాయ మీదనున్నట్లు అంచులు లేవు. నున్నగా నుండును. దీనిలో పీచు విస్తారముగా గలదు. ఈ పీచును మేజోళ్ళు "బ్రషు చేయుటలో వాడు చున్నారు.

కాకరాకులు మిశ్రమ పత్రములు. కాయలు చేదుగా నుండును. అయినను మనము కూర వండు కొందుము. కాయలు పండినపుడెర్ర బడును.

అఝర కాయలు చిన్నవి. ఇవియు చేదుగానె నుండును. వీనిని కూర వండుకొందుము.

దోస కాయలలో పందిర దోస కాయలని నక్క దోస కాయలని రెండు ముఖ్యమైన రకములు గలవు. పందిర దోస కాయలు వర్షాకాలములో గాని కాయవు. నక్క దోస గింజలు పాతిన పిదప పదిదినముల వరకు నీరు పోయుచుండవలెను. ఈ కాయలు పుల్లగా నుండును.


దోసకాయలు దోస కాయల వలెనే యుండును. కాయలు రెండడుగుల పొడుగు వరకు కూడ పెరుగును. వీని 247

పై మొట్టమొదట నల్లని చారలుండును. పండిన తరువాత తెల్లగానైనను నారింజ రంగుగానైనను మారును.

ఆనపకాయలు కూడ శీతాకాలములో కాయును. పువ్వులు తెలుపు. కొన్ని కాయలు గుండ్రముగాను, కొన్ని కోలగాను నుండును. లేత కాయలు కూర వండు కొందుము. ముదురు కాయలను దొలిచి బుర్ర లెండ బెట్టి వేణెలకు, తాంబురలకు ఉపయోగించెదరు. పాముల వాండ్రూదు నాగ స్వరము, ఆనప బుర్రలతోడ జేయుదురు.

పుచ్చ కాయలు ఇసుక నేలలో ఏపుగా బయలు దేరును., కాయలు కోలగాను, ఆనప కాయలకంటే చిన్నవి గాను నుండును. వీనిని కూర వండుకొందురు.

కర్బోజ కాయ కొంచెము గుండ్రముగా నుండును. పై చర్మము ఆకు పచ్చగా నుండును గాని లోపల కండ కొంచెము గులాబి రంగుగా నుండును. గింజలు నలుపు. చలువ చేయునని ఈ పండ్లు వేసవి కాలమందు తినెదరు. వీని గింజలు కూడ ఉపయోగ కరములగు చున్నవి. వాని నుండి తీసిన చమురు సబ్బుచేయుటకు పనికివచ్చును. 248

అవ్వగూద తీగె

పుష్పములు, ఫలములు, ఫలము చీలికయును.