వృక్షశాస్త్రము/కొత్తిమెరి కుటుంబము

248

అవ్వగూద తీగె

పుష్పములు, ఫలములు, ఫలము చీలికయును.

249

అవ్వగూద తీగెమీద ఆకులు దూరము దూరముగా నుండును. పువ్వులు గెలలు తెలుపు రంగు. కాయ గుండ్రముగాను నారింజ రంగు గాను నుండును. ఇది మిక్కిలి చేదు. దీనిని ఔషధములలో వాడుదురు.

కొత్తిమెరి కుటుంబము.

కొత్తమెరి మొక్క చాల చోట్లనే పెరుగు చున్నది. ప్రకాండము. గుల్మము. ఏక వార్షికము.

ఆకులు
- ఒంటరిచేరిక. పత్రములు చీలి యుండును. కొన్ని లఘు పత్రములు. తొడిమ ప్రకాండము నావరించి యున్నది. సువాసన గలదు. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్ప మంజరి
- గుత్తి. వృంతముక్రింద చేటికన్నియు గలిసి గిన్నె వలె ఏర్పడు చున్నవి. పువ్వులు చిన్నవి. ఉపవృంతముల వద్దను చేటికలు కలవు.
పుష్ప కోశము
- సంయుక్తము: 5 దంతములున్నవి. అండాశయము అంటుకొని యుండును. ఉచ్చము.
దళ వలయము
- అసంయుక్తము: 5 ఆకర్షణ పత్రములు అండాశయము నంటి యుండును. ఇవి మొగ్గలో అల్లుకొని యున్నవి.
కింజల్కములు
- 5. కాడలు చిన్నవి. ఇవియు అండాశయము నంటి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు. 250
అండ కోశము
- అండాశయము నీచము. 2 గదులు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గింజ కలదు. కీలములు రెండు. కాయ విభజన ఫలము.

ఈ కుటుంబములోని మొక్కలన్నియు ఏక వార్షికములే. అవి ఏడాది లోపుగనే పుష్పించి చచ్చి పోవును. పత్రములు చీలి యుండును. వాని మీద రోమములు లేవు. పుష్పమంజరులు గుత్తులు. పుష్ప కోశమునకు దంతములు గలవు. అవి యన్నియు సమముగా లేవు. పువ్వులు సరళములు కావు. కాయలపైన చార లున్నవి.

కొత్తిమెరిని మన దేశమందంటను పైరు చేయు చున్నారు. దానిని సదా మొలపించుదురు గాని దనియములకై యైనచో కొన్ని ఋతువులలోనే పైరు బాగుండును. ఇతర కాలములలో పంట అంత సంవృద్ధిగా వుండదు. కొత్తి మెరికి సువాసన యుండుటచే దానిని కరివేపాకు వలెనే కూర, పులుసులలో వాడు కొను చున్నాము. ధనియములు గింజలు కావు. అవి కాయలే. ఒక్కొక్క కాయ రెండుగా చీలును. గింజలు లోపలి నుంది పైకి వచ్చుట లేదు.

ధనియములకు కూడ మంచి వాసనే కలదు. వానిని ఔషధములలో కూడ ఉపయోగింతురు. ఐరోపా దేశస్తులు వీటి నుండి చమురు తీయు చున్నారు. 251

జీలకఱ్ఱ విస్తారముగా పంజాబు దేశములో పైరగు చున్నది. దీని ఆకులును చీలి యున్నవి. పువ్వులు గుత్తులే. జీల కఱ్ఱను పోపులలోను ఔషధములలోను వాడుచున్నాము.

శతపుష్పము మొక్క చాలతోటులనే పెరుగుచున్నది. దానిని కొన్ని చోట్ల పైరు చేయు చున్నారు. కాయలను నీళ్ళలో గలిపి బట్టి పట్టి చమురు తీయుదురు. ఆ చమురును ఔషధములలోను సువాసన నిచ్చుటకు సబ్బులు చేయుటలోను వాడు చున్నారు. దీని ఆకులు కూడ సువాసన గల వగుటచే కూర లందు వాడుచున్నారు.

మండూక పర్ణి
- మన దేశము నందంతటను పెరుగు చున్నది. దీని ఆకుల నెండబెట్టి పొడి గొట్టి చిరకాలము నుండియు ఔషధములలో వాడు చున్నారు. ఈ పొడిని లోపలకు ఇచ్చుటయు ఇతర మందులతో కలిపి పైకి రాయుటయు కూడ గలదు. ఇది చర్మ వ్యాధులకు బాగుగ పని చేయునందురు.

ఇంగువ మొక్కలు ఆపుగనిస్థాను, పెరిష్యాదేశప్రాంతములందు ఎక్కువగా మొలచును. ఇవి ఉన్నతప్రదేశములందును, రాతినేలలందును మొలచును. చాల పెద్దదిగ ఎదిగిన మొక్క నాలుగడుగులకంటె ఎక్కువ ఎత్తుండదు. 252

ఇంగువ దానివేరులోనుండివచ్చును. తల్లి వేరు పైనున్న మన్నును ఒత్తి గించి దాని మొదట ఒక నాటు పెట్టుదురు. ఆనాటులోనికి ద్రవము వచ్చి చేరి చిక్క బడును. చిక్కబడిన పిదప దానిని కొంచెము వేరుముక్క తోడనే కోసి, తోలు సంచులలో పెట్టుదురు. అట్లు వేరులోనున్న పదార్థమంతయు వచ్చు వరకు కోయుదురు. ఇంగువలో కల్తి చాల గలుపు చున్నారు. ఆవేరు ముక్కలను బంగాళ దుంప ముక్కలను, తుమ్మజిగురును, మన్నును కూడ కలుపు చున్నారు.

ఇంగువను ఔషధములలో వాడుదురు. పోపులలో వేసి కొందుము. వేడి చేయుటకై బాలింత రాండ్రకు ఇత్తురు. దాని ననుదినము చొంచెము దినుచు వచ్చు చుండుట చేత మన్యపు జ్వరము రాదందురు.

వాము మనదేశమునందంతటను పైరగు చున్నది. దానికి ఎరువులంతగా అవసరము లేదు కాని నీరు చాల కావలయును. కాయలను బట్టి పట్టి చమురు దీయుదురు. చమురు పైన తెల్లగ ఉప్పు వంటి దొకటి చేరును. దానిని దీసి, పువ్వు అని అంగళ్ళ యందు అమ్ముదురు. దానిని నీళ్ళలో గలిపిన ఘాటుగనే యుండును. వామును కొన్నిపిండివంటలయందును, కూర గాయలందును ఔషధములలో కూడ వాడుదురు.

తొగరు కుటుంబము

వర్ణము : సంయుక్త దళవంతము.

తొగరుచెట్లు చాలచోట్లనే పెరుగుచున్నవి.

ఆకులు - అభిముఖచేరిక, లఘుపత్రములు. బల్లెపాకారము. తొడిమ కురుచగా నుండును. కణుపు పుచ్ఛములు గలవు. ఇవి రెండు పత్రములకుమధ్యనున్నవి. విషమరేఖ పత్రము, అంచు సరళితము. కొన సన్నము.

పుష్పమంజరి - కణుపు సందులందుండి గుత్తులుగా వచ్చును. పువ్వులు తెలుపు. సరాళము. మంచివాసన వేయును.