రంగస్థల శాస్త్రము-రెండు భాగాలు: తెలుగు అకాడమీ-తెలుగు వికీపీడియాలో వ్యాసాలకు పనికివస్తుంది.
నా జీవితయాత్ర-టంగుటూరి ప్రకాశం: ఆంధ్రావతరణ గురించీ, తెలుగునాట స్వాతంత్రోద్యమ చరిత్ర గురించీ చాలా వివరాలు దొరుకుతున్నాయి. నాలుగోవంతు పూర్తయింది. కనుక కాపీహక్కుల చిక్కులు తీర్చగలిగితే బావుంటుంది.
అర్థశాస్త్రము: కట్టమంచి రామలింగారెడ్డి - కౌటిల్యుడి అర్ధశాస్త్రం ఆధారంగా చరిత్ర, సామాజిక అంశాలను అన్వయిస్తూ వ్రాసిన గ్రంధం. సామాజిక చారిత్రికాంశాల విషయంలో చాలా విలువైన గ్రంథం.
కట్టమంచి రామలింగారెడ్డి పీఠికలు - తెలుగులో ఆధునిక విమర్శ తీసుకువచ్చిన విలువైన విమర్శకులాయన. ఇప్పటికే ఉన్న పుస్తకాల వ్యాసాలకు ఆయన వ్యాఖ్యలు, రిఫరెన్సు చాలా మంచి చేర్పు అవుతుంది.
ప్రాచీన విద్యాపీఠములు :చిలుకూరి నారాయణరావు - ఆయన వ్రాసిన ఈ పుస్తకం నుంచి ప్రాచీన భారతీయ విద్య గురించి, విద్యాలయాల గురించి మంచి సమాచారం స్వీకరించవచ్చు. తద్వారా వ్యాసాల అభివృద్ధీను.