వికీసోర్స్:విలువైన పుస్తకాల జాబితా
సీఐఎస్-ఎ2కె వారి 2015-16 ప్రణాళికలో జరిగిన చర్చల ఫలితంగా ఈ పేజీ ఏర్పడింది. తెలుగు వికీసోర్సులో ఇప్పటికే సీఐఎస్-ఎ2కె వారు ప్రాజెక్టుగా స్వీకరించి సంస్థాగత భాగస్వామ్యాలున్న చోట విద్యార్థుల సహకారంతో పుస్తకాలను పాఠ్యీకరిస్తున్నారు. అలాగే పలు పుస్తకాలను కాపీహక్కుల పరిధిలో ఉంటే, వాటి రచయితలతో సంప్రదించి, వాటిని స్వేచ్ఛానకలు హక్కుల్లో పునర్విడుదల చేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తామని వారు ప్రణాళికలో తెలిపారు. కనుక సముదాయం ఈ విషయాన్ని గ్రహించి, ఇప్పటికే తెలుగు వికీపీడియా, విక్ష్నరీ, వికీకోట్ వంటి వాటిలో పనిచేస్తున్నవారు ముందుకువచ్చి తమ వ్యక్తిగత కృషికి మూలాలుగా ఉపకరించే విలువైన పుస్తకాలను తెలపాలన్న ఉద్దేశంతో ఈ పేజీని ఏర్పరిచాము. పేజీ చర్చలో కాపీహక్కులు ఉన్నవైనా, లేనివైనా, సందేహం ఉన్నవైనా పుస్తకాలను వీలైనన్ని వివరాలతో తప్పనిసరిగా ఇతర వికీల్లో కృషికి (తమ కృషే కానక్కరలేదు) ఈ పుస్తకం ఎందుకు పనికివస్తుందో సవివరంగా ప్రతిపాదనలుగా చేరిస్తే వాటిని ఈ పట్టికలో చేర్చుకుందాం. ఏ పుస్తకం విలువపైన అయినా సందేహం ఉంటే వాటిని గురించి అక్కడే చర్చించవచ్చు. ఒక మార్గనిర్దేశకమైన కృషిగా దీన్ని అర్థంచేసుకుని ఆ క్రమంలో సూచనలు చేయాల్సిందిగా మనవి.
పుస్తకం పేరు | రచయిత | ప్రచురణకర్త | కాపీహక్కుల స్థితి | వికీసోర్సులో చేరిక | వ్యాఖ్య | బాధ్యతలు స్వీకరించినవారు | ప్రస్తుతస్థితి |
---|---|---|---|---|---|---|---|
రంగస్థల శాస్త్రం-రెండు భాగాలు | కె.వి.గోపాలస్వామి | కాపీహక్కుల పరిధిలో ఉండివుండొచ్చు | ఉంది | ఇప్పటికే వికీసోర్సులో ఉన్న ఈ పుస్తకం విజ్ఞానసర్వస్వ వ్యాసాలకు పనికివస్తుంది. కనుక దీని కాపీహక్కుల స్థితి పరిశీలించి, సంస్థాగత భాగస్వామ్యం లేదా రచయితలను కోరడం వంటివాటి ద్వారా వీలైతే పుస్తకాన్ని స్వేచ్ఛానకలుహక్కుల్లో రీలైసెన్స్ చేయించాలి. ఆ పని పూర్తయితే పుస్తకాన్ని పూర్తిగా యూనీకోడీకరించాలి. | |||
నా జీవిత యాత్ర | టంగుటూరి ప్రకాశం | చాలామంది | కాపీహక్కుల పరిధిలోనే ఉండివుండొచ్చు | ఉంది | ఇప్పటికే వికీసోర్సులో ఉన్న ఈ పుస్తకం చారిత్రికంగా చాలా విలువైనది మాత్రమే కాక ఎన్సైక్లోపీడిక్ వాల్యూ కూడా కలిగినది. అప్పుడే దీనిలో నాలుగోవంతు శ్రీరామమూర్తి గారి కృషితో పూర్తయింది. ఆంధ్రావతరణ గురించి, తెలుగు నాట స్వాతంత్రోద్యమం గురించి, ఆంధ్రరాష్ట్ర రాజకీయాల గురించే కాక ఆనాటి సామాజిక స్థితిగతుల గురించి కూడా చాలా మంచి సోర్సు. కనుక స్వేచ్ఛానకలు హక్కుల్లో రీలైసెన్స్ చేయించగలమేమో ప్రయత్నించి చూడాలి. ఆ పనిపూర్తైతే పుస్తకాన్ని పూర్తిగా యూనీకోడీకరించాలి. | ||
ఆంధ్రదేశము విదేశయాత్రికులు | భావరాజు వేంకట కృష్ణారావు | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | ఉంది | ఈ పుస్తకం ఆంధ్రదేశంలో పలు సమయాల్లో పర్యటించిన విదేశీ యాత్రికుల కథనాలతో కూడివున్నది. దీనికి ఆయా కాలాలకు చెందిన పలు చారిత్రిక విశేషాలను అందించే విలువ ఉంది. కనుక చరిత్ర వ్యాసాల్లో దీని సహకారం చాలా బావుంటుంది. ఈ నేపథ్యంలో కాపీహక్కుల పరిధిలో లేని ఈ విలువైన గ్రంథాన్ని పూర్తిగా యూనీకోడీకరించాలి | ||
ఆంధ్రకవి తరంగిణి-ఆరు సంపుటాలు | చాగంటి శేషయ్య | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | ఉంది | కవుల జీవితాలను గురించివున్న ఈ పుస్తకం ఇప్పటికే కాపీహక్కుల పరిధికి ఆవల వుంది. దీనికి ఆయా కవుల వ్యాసాల్లో చేర్చుకునేందుకు చాలా ఎన్సైక్లోపీడిక్ వాల్యూ ఉన్నది. కనుక దీనిని పూర్తిగా యూనీకోడీకరించాలి. | ||
అబలా సచ్చరిత్ర రత్నమాల | బండారు అచ్చమాంబ | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | ఉంది | ప్రతిఏటా మార్చిలో మహిళలకు సంబంధించిన వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నాము, పైగా వికీపీడియాలో జండర్ గాప్ ఉందని దొరికిన అధ్యయనాల ఆధారంగా చెప్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం మహిళల గురించిన వ్యాసాల అభివృద్ధి, వికీలో మహిళల కృషి పెంచడం లాంటివి చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ పుస్తకం తెవికీలో మహిళల వ్యాసాలు పెంచేందుకు ఉపకరించడమే కాక జండర్ గాప్ కాంపైన్ విషయంలో సహకారిగా కూడా వుంటుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పుస్తకాన్ని పూర్తిగా యూనీకోడీకరించాలి | ||
ఆంధ్ర వీరులు-రెండవ సంపుటం | శేషాద్రి రమణ కవులు | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | ఉంది | మొదటిసంపుటం సంగతి అటుంచినా రెండవ సంపుటంలో చాలానే విలువైన వ్యాసాలు కనిపిస్తున్నాయి. వీటిలో చాలా వ్యాసాలకు వికీపీడియాలో వ్యాసాలను అభివృద్ధి చేస్తుండగా సహకరించే విలువ ఉంది. కనుక రెండవ భాగం మాత్రం యూనీకోడీకరించేందుకు ప్రాధాన్యత పొందింది. | ||
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (రెండు నుంచి ఆరు సంపుటాలు) ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) |
కొమఱ్ఱాజు వెంకట లక్ష్మణరావు | విజ్ఞాన చంద్రికా గ్రంథమాల | కాపీహక్కుల పరిధిలో లేదు | ఉంది | తెలుగు వికీపీడియాలో ఇప్పటికే పలు సందర్భాల్లో కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారి కృషిని సంస్మరించుకున్నాము. తెలుగులో తొలి విజ్ఞానసర్వస్వంగా ఈ గ్రంథానికి చారిత్రిక ప్రాధాన్యతే కాక గ్రంథం విజ్ఞానసర్వస్వం కావడంతో దానికి ప్రత్యేకమైన విలువ కూడా వుంది. |
||
ఆంధ్రుల సాంఘిక చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి | పలు ప్రచురణ సంస్థలు | కాపీహక్కుల పరిధిలో లేదు(రచయిత మరణించి అరవై ఏళ్ళు దాటుతోంది) | ఉంది | ఈ పుస్తకం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్ I, గ్రూప్ II పోటీపరీక్షల్లో కొన్ని సబ్జెక్టులకు పాఠ్యగ్రంథంగా గణుతికెక్కింది. అలానే ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు గతంలో రచయిత మరణానంతరం పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీనికి తెలుగు వికీపీడియాలోని అనేకానేక సంస్కృతి, చరిత్ర సంబంధిత వ్యాసాలను అభివృద్ధి చేసే శక్తివుంది. కనుక దీనిని యూనీకోడీకరించాలి. | ||
సూర్యరాయాంధ్ర నిఘంటువు | తెలియదు | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | లేదు | ఈ పుస్తకం తెలుగు నిఘంటువుల్లో అత్యంత ప్రసిద్ధికెక్కనది. దీనిని చేర్చడం వల్ల విక్ష్నరీకి చాలా ప్రయోజనం కలుగుతుంది. కనుక దీనిని వికీసోర్సులో చేర్చి యూనీకోడీకరించాలి. | ||
ఆంధ్ర వ్యుత్పత్తి కోశము | తెలియదు | తెలియదు | కాపీహక్కుల పరిధిలో వుంది | లేదు | విక్ష్నరీలో ప్రస్తుతం వ్యుత్పత్తుల గురించి పైలట్ ప్రాజెక్టు స్థాయి కృషి జరుగుతోంది. ఈ పుస్తకాన్ని వికీసోర్సులో చేర్చి పాఠ్యీకరించగలిగితే ఆ పైలట్ ప్రాజెక్టు స్థాయి కృషి విక్ష్నరీ మొత్తానికి విస్తరించగలదు. కాకుంటే దీనికి కాపీహక్కులు ఉన్నాయి. కనుక ముందుగా కాపీహక్కుల స్థితిగతులు గమనించి, తర్వాత కాపీహక్కుదారుని ఒప్పించి, స్వేచ్ఛానకలు హక్కుల్లో పునర్విడుదల చేయగలిగితేనే ప్రయోజనం. | ||
పదబంధ పారిజాతము | సంపాదకవర్గం: నార్ల వెంకటేశ్వరరావు, విద్వాన్ విశ్వం, తిమ్మావజ్ఝుల కోదండరామయ్య | ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ | అస్పష్టం | ఉంది | పదబంధ పారిజాతము గ్రంథానికే నుడికారముల బృహన్నిఘంటువుని మరో పేరు. నుడికారాలతో కూడివున్న ఈ పుస్తకాన్ని చాలా శ్రద్ధతో కూర్చారు పండితులైన సంపాదకవర్గంవారు. ఈ పుస్తకం విక్ష్నరీకి ఉపకరిస్తుంది. కాకుంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకే కాపీహక్కులు ఉన్నవా? ఉంటే అది రద్దయినాకా దానికి గల కాపీహక్కుల స్థితి ఏమైంది?(చాలా సంస్థలు రద్దైతే కాపీహక్కులు సార్వజనీనమవ్వవు వేరే సంస్థలకు బట్వాడా అవుతూంటాయి.) వంటి విషయాలు చూసుకుని, ఒకవేళ ఏ సంస్థ వద్దైనా కాపీహక్కులు వుంటే దానిని సంప్రదించి స్వేచ్ఛానకలు హక్కుల్లో పునర్విడుదలకు కృషిచేయాలి. ఆపై వికీసోర్సులో చేర్చి, పాఠ్యీకరించాలి. | ||
అర్థశాస్త్రము | కట్టమంచి రామలింగారెడ్డి | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | లేదు | కౌటిల్యుడి అర్థశాస్త్రం ఆధారంగా ఆయా విషయాలను చరిత్ర, సామాజిక శాస్త్రాలకు అన్వయిస్తూ రాసిన పుస్తకం. ఆయా శాస్త్రాల విద్యార్థులకే కాదు విజ్ఞానసర్వస్వ వ్యాసాలకూ ప్రయోజనకారి. కాపీహక్కుల పరిధిలో లేదు, వికీసోర్సులో చేర్చి పాఠ్యీకరించాల్సివుంది. | ||
కట్టమంచి రామలింగారెడ్డి పీఠికలు | కట్టమంచి రామలింగారెడ్డి | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | లేదు | కట్టమంచి వారు తెలుగునాట తొలిగా ఆధునిక విమర్శ పద్ధతుల్లో రాసిన రచయితగా గణుతికెక్కిన వ్యక్తి. ఇప్పటికే ఉన్న పుస్తకాల వ్యాసాలకు ఆయన వ్యాఖ్యలు, వివరాలు మంచి చేర్పు అవుతుంది. కనుక ఈ పుస్తకం వికీసోర్సులో చేర్చి పాఠ్యీకరించాలి. | ||
ప్రాచీన విద్యాపీఠములు | చిలుకూరి నారాయణరావు | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | లేదు | చిలుకూరి నారాయణరావు మంచి పరిశోధకులు, రచయిత. ఆయన రాసిన ఈ పుస్తకంలో ప్రాచీనమైన భారతీయ విద్య గురించి, విద్యాలయాల గురించి చక్కని సమాచారం దొరుకుతుంది. ఆ సమాచారం వికీపీడియాలో వ్యాసాల అభివృద్ధికి పనికివస్తుంది. వికీసోర్సులో చేర్చి పాఠ్యీకరించాలి. | ||
వైదిక వాఙ్మయ చరిత్ర | చిలుకూరి నారాయణరావు | తెలియదు | కాపీహక్కుల పరిధిలో లేదు | లేదు | చిలుకూరి నారాయణరావు వ్రాసిన మరో విలువైన గ్రంథం. వైదిక వాఙ్మయం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాచీన సాహిత్యంగా ప్రసిద్ధికెక్కింది. పైగా భారతీయ చరిత్ర, ప్రాచీన సామాజిక వ్యవస్థలు వంటివి వైదిక సాహిత్యంలో చాలా వివరాలే దొరుకుతాయి. ఇటువంటి విషయాలను తెలుగు వికీలో అభివృద్ధి చేసేప్పుడు చాలా అక్కరకొస్తుంది. వికీసోర్సులో చేర్చి పాఠ్యీకరించాలి. |