వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/రామానుజన్ నుండి ఇటూ, అటూ
రామానుజన్ నుండి ఇటూ, అటూ (2016),వేమూరి వేంకటేశ్వరరావు,
వేమూరి వేంకటేశ్వరరావు(1937—) భారతదేశంలో తుని, మచిలీపట్నం, కాకినాడలలో విద్యాభ్యాసం చేశారు. ఉన్నత విద్యకి 1961లో అమెరికా ప్రయాణమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, డేవిస్ కేంద్రంలో విశ్రాంత ఆచార్యులు గా వుంటున్నారు. సైన్సు విషయాల మీద విశేషంగా తెలుగులో రాశారు. రామానుజన్ ప్రతిభ గణితంలో అనేక శాఖలలో కనిపిస్తూ ఉంటుంది. పరిచయం కావాలనుకునేవారికి, ఈ ప్రజాదరణ విజ్ఞాన పుస్తకం చాలా ఉపయోగం.
“ |
ఒక సారి జబ్బుతో మంచం పట్టి ఉన్న రామానుజన్ ని చూడటానికి ప్రొఫెసర్ హార్డీ (G. H. Hardy, 7 February 1877 – 1 December 1947) టేక్సీ చేయించుకుని వెళ్ళేరుట. ఆ టేక్సీ మీద ఉన్న 1729 ని చూసి అది "చాల చప్పగా ఉన్న సంఖ్యలా అనిపించింది" అన్నారుట, హార్డీ. "అయ్యయ్యో! అది చప్పనైనదేమీ కాదు, చాల ఆసక్తికరమైన సంఖ్య. రెండు పూర్ణ సంఖ్యల ఘనాల మొత్తం రెండు విధాలుగా రాయగలిగే సంఖ్యలన్నిటిలోను ఇది అతి చిన్నది" అని ఠక్కున సమాధానం ఇచ్చేరుట, రామానుజన్. ఈ గమనికని గణిత పరిభాషలో చెప్పవచ్చు: 1729 అనే సంఖ్య 1 నీ 12 నీ విడివిడిగా ఘనీకరించి ఆ లబ్దాలని కలిపినా వస్తుంది, లేదా 9 నీ 10 నీ విడివిడిగా ఘనీకరించి ఆ లబ్దాలని కలిపినా వస్తుంది. |
” |