వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/తెలుగు వారి జానపద కళారూపాలు
తెలుగువారి జానపద కళారూపాలు (1992) -మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
"నాటకం, సినిమా, రేడియో, టీవి, వీడియో, ఆడియో లేని నా చిన్ననాడు పల్లె ప్రజలను అలరించి, ఆనంద పర్చి, అనందడోలికలో ఊగు లాడించి, ఈ నాడు కాల గర్భంలో కలిసి పోతున్న నాటి జానపద కళా రూపాలు, నన్ను ఉత్తేజ పర్చాయి. ప్రభావితుణ్ణి చేశాయి. ఆ నాటి ప్రదర్శనాలను రాత్రి తెల్లవార్లూ కూర్చుని చూశాను. ఎన్ని కళా రూపాలు? ఎంత గొప్ప ప్రదర్శనాలు? వారు ఎంత గొప్ప కళా కారులు.
పది రూపాయల కోసం, పట్టెడన్నం కోసం వారు ఎంత నిస్వార్థంగా కళకు సేవ చేసారు? నా నటజీవితానికి తొలి రేఖలు దిద్దింది వారే. వారే నా మార్గ దర్శకులు, వారే నా గురుదేవులు. నాకే కాదు నాముందు తరాలవారికి, ఆమాటకొస్తే ఈ తరం కళాకారులకు కూడ వారె కళామూర్తులు." ఆ కళలు మరియుకళామూర్తుల గురించి పై విధంగా వ్యాఖ్యానించిన రచయిత మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి రచించిన తెలుగువారి జానపద కళారూపాలు చదవండి ..