వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/సుమ ప్రియ (గీతి నాట్యము)

సుమ ప్రియ (గీతి నాట్యము)


వసంతుడు


ఉజ్వల రస పరమేశ్వరి
ఓహోహో అమృతమయీ!

జ్యోత్స్నా నభ సరసీమధు
కుముదవనీ గృహరమణీ ॥ఉజ్వలరస॥

క్రేంకారిత తుహినయవని
కాభ్యంతర దివ్యవాణి ॥ఉజ్వలరస॥

బాలాతప వికసితనవ
సితసరోజ దరహాసిని ॥ఉజ్వలరస॥

శ్ర వదాశా శుభతుందిల
శుచి శోభారాగధునీ ॥ఉజ్వలరస॥

లాస్య రచిత చరణాంబుజ
మణి మంజుల రవకింకణి ॥ఉజ్వలరస॥

తమసావృత హృదయకుహర
రుచి మండిత బహుళ ఘ్రణీ ॥ఉజ్వలరస॥


పుష్ప కన్యలు


(ప్రవేశించి)
ఒక పూవు
స్నిగ్ద కాంతి వాసంతిక
దుగ్దహస శామంతిక
కోకనదా కుసుమరాజ్ఞి
మందారమ మధుర రోచి

రారె రారె సఖులారా
సాగిరారె సఖులారా
నవవసంతు డరుదెంచును
నతులీయగ రారేలా

విరహతమము విరియును లే
ఎరసంజులు దరియుము లే
తావిదెసల క్రమ్మునులే -
                    రారె రారె సఖులారా


పుష్ప కన్యలు


(వసంతుని చుట్టూ మూగుతూ)
ఋతు నేతా వసంతా
నవశోభా లతాలతా
వచ్చినాడు వసంతుడు
నవశోభాలతాంతుడు.

నీ రాకకై నిఖిల జగము
నిలుపు బ్రతుకు కనుతుదలను
వలగొనియెడు కోరికతో
వలపు గ్రుక్కిళులు త్రావుచు
                           ఋతునేతా...

నందనవన సుందరి నిను
అందగాని రానిచ్చెనె


శోభా నవ తరుణిమ మా
శుష్క జీవ వనముల కిక
                                 ఋతునేతా...


షట్పదరాజు


చిరుగాలి కెరటాల
పరువు బరువుల మ్రోయు
ఏ పూవు చూచినా
ఎడద కనుతాపమ్మె

వాసనల బలమూని
వాతెరల మధువాని
బానిసలగా జేయు
పవనుడెంతటివాడు

బ్రతుకు టెలతోటలకు
ప్రసవప్రణయమె శిశిర
వమృత కుసుమాప్సరల
కకట బాని బ్రతుకె చిరుగాలి...

సుమప్రియ


నెమ్మదికి రావె యీ తుమ్మెదకు ఓ పూవ
అమ్ముకోబోకె నీ నెమ్మనము
ఓ పూవ

పొలతి బేలవె నీవు
ప్రొడతన మెరుగకా
ననకులమ్మున కెంత
నగుబాటె! నగుబాటె! ॥నెమ్మదికి॥

ఈ కోన నీకంటె
తావిగల పూవేది
ఆతురత ఏకాని
అతడెరుగడె సొగసు ॥నెమ్మదికి


షట్పదరాజు


ఏకోన పూవువౌ నీవు
నీతావి పూవులకు రాదు
హిమ వాలుకా స్వచ్ఛ
మెంత చల్లని చూపు
హిమ బంధు బంధురం
బెంత చక్కని రూపు ॥ఏ కోవ॥

ఏ చిరంతన పుణ్య
మోనాక ఫలమువో
ఏ మధువ్రత మూర్తి
హృదయాధి దేవతవొ ॥ఏ కోవ॥


సుమప్రియ


తుమ్మెదవా! తుమ్మెదవా
నమ్మరాని తుమ్మెదవా!
మనసిచ్చిన పాటలతో
మరులు కొల్పి యీ కన్నియ
మధువానిన వెనుక నీవు
మరల మోము చూపింపవు
                                   తుమ్మెదవా

వలపింపకు లే యెడదల
విలపించెడు వేదనతో
విరహ బాధ మెరుగకయీ
విరుల మనసు దొరుకదు పో
                                    తుమ్మెదవా

షట్పదరాజు


రాణివిలే సుమ రాణివిలే
ప్రాణ వీణ పలికించే
ప్రణయ నావ నడిపించే
రాణివిలే సుమ రాణివివే
జీవ మధువు క్రోవించే
జీవధనము పాలించే
రాణివిలే సుమ రాణివిలే
అచ్చరలను పొదలించే
అమరత్వము నొదవించే
రాణివి లే సుమరాణివి లే


సుమప్రియ:


జుం జుం జుమ జుమ జుం జూ జుమ్
మంజుల కుసుమ కుమారికనూ
మధుకరలోక మనోజుడవూ
జుం జుం జుమ జుమ జుం జుం జుమ్


షడ్పద రాజు:


జుం జుం జుమ జుమ జుం జుం జుమ్
సదమల సౌందర్యాకృతి వీ
ప్రవిమల ప్రణయ రసాకృతినీ
జుం జుం జుమ జుమ జుం జుం జుమ్


పుష్ప కన్యలు:


ఋతునేతా వసంతా
నవ శోభాల లతాం
    ★ ★ ★
జై ఆంధ్ర ధ్వజ జై జై
జయ అమరధ్వజ జై జై

తాతలు తండ్రులు
త్యాగ సంయోధులు
తనువుల నొసగిన
తల్లీ - జై

జై ఆంధ్ర ధ్వజ జై జై
జై అమరధ్వజ జై జై
శాత్రవరుధిర
సయోధుల నీదగ
శక్తి నొసంగుదము
తల్లీ - జై
జై ఆంధ్రధ్వజడు జై జై
జయ అమరధ్వజ జై జై
శాత్రవరుధిర
సయోధుల నొదగ
శక్తి నొసంగుము
తల్లీ - జై
జై ఆంధ్రధ్వజుడు జై జై
జయ అమరధ్వజ జై జై
అమరజయార్మల
మర్థింతుము ని
న్నాశిష మమ్మో
తల్లీ - జై

జై ఆంధ్రధ్వజ జై జై
జయ అమరధ్వజ జై జై

భరత ప్రజా
ప్రజా హృదయరాజ్ఞి
భవ్యజనని భరతావని
రత్నాకర సరసీరుహ
సింహళమ్ముద్ర పదపీఠా
శిశిరోఖ్యల శుభజ్యోత్స్నా


హిమవన్నగ సితమకుటా
హిందూ ప్రజా
చుంబిత సభ కాళిందీ
కువలయ రుచి కచభారా
కరమృదంగ
మృదు మంజుల మంజీరా
                      - హిందూ ప్రజా..
మధుతుందిల ఋతుమండల
సకల వనీశుక పికగళ
సంధ్యాదుతి కిమ్మీరిత
వింధ్యాచల నవమేఘాల
                      - హిందు ప్రజా....


ఆకాశవాణి, మద్రాస్, 8-12-46

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.