వావిలాల సోమయాజులు సాహిత్యం-1/మహాకవుల మతం

సభ్యతన్న 'ప్రవర్తనా

1 సౌందర్యం' రమ్యమైన వర్తనమ్ము పరిపూర్ణత నొందటాన్కి సహనమ్మును, ఆత్మనిగ్రహము, విశ్రాం తిని నొసగే పరిసరాలు వాతావరణమ్ము ఎంతో మహాకవుల మతం నమ్మింకొక టెదీ లేదు మనకీ భౌతికములైనవౌ అవసరాలు మనలనెప్పుడు త్వరపెడుతూ ఉంటాయి. అవి ఎంతో పరుషాలై ఎట్టి ప్రమాణాలను పా టించకుండ పరస్పరమ్ము త్రోసుకొంటు పరుగిడుతూ ఉంటాయి. వాటికెట్టి అవసరమ్ము, సత్యమైన మర్యాదయు, సంగీతము తీరుబాటుగాని, లక్ష్య సాధనమ్ము వినా అన్య విషయాలల్లో సహనం చిత్రకళా ఖండమ్ముల బోలు సృష్టి, కంఠస్వర మందును, చలనములలోన సంభాషణ పద్ధతిలో చేష్టలు మొదలైన యట్టి విషయమ్ముల సామరస్య మందున నా ఔదార్యము ప్రస్ఫుటమ్ము చేయబడుటె మర్యాదనిపించుకొనును. దానికి మనుజుని తత్వం ఉన్మీలన గావించుట గాని అన్యయౌ ప్రయోజ మహాకవుల మతం గాని లేవు. మన దేశం లోన నీరు తెచ్చుకోను ఆ ఖాళీ కిరసినుడ బ్బాలు మొరటు మొరటుగాను కోయంబడి, కర్రలచే అడ్డంగా బిగింపంబడి కేవలమ్ము నీటితోటి నింపబడుట అను ప్రయోజ నమ్ముగాక అవ్వి అన్య మైన యెట్టి ప్రయోజనము 397 ఆశింపవు. వాటి మొరటు తనము కవ్వి సిగ్గుపడవు మనవౌ ఆవశ్యకతల మూలమైన కారణాలు ఆహారము, వస్త్రమ్ములు నీడ ఇతరమౌ సుఖసౌ ఖ్యములన్నీ కావలెనని నిత్యము నిర్బంధించును అయితే మానవులు తాము కేవల మీ నిత్యావస రముల పట్టికలను త్రోసి పుచ్చి వారియందున నొక పరిపూర్ణమ్మయిన యొక్క ఆదర్శం కలదనియును, తమ వివిధాంశముల మధ్య పరిసరములతో తమకొక సామరస్య మున్నదనియు ప్రకటించుటకును తమదౌ కాలములో బహుభాగము వ్యయమొనరిస్తున్నారు. అనంతత్వలక్షణమ్ము అంతులేని విస్తరణలో లేదు. అట్టి అద్వైతమ్మని చెప్పబడే ఏకత్వపు రహస్యమ్ము నందున్నది. సృజనీకృతమైన విషయ సందోహము అంతులేని 398 ప్రాంతమ్మును, కాలమ్మును ఆక్రమించు. అయితే ఈ విషయపు సందోహాన్నం తటిలోన నిముడ్చుకొన్న సత్యానికి మాత్రమెప్పు డెట్టి పరిమితియును లేదు. అద్ది ఏకైకమ్ము, అద్వి తీయము మరి ఏదైనా స్వల్ప విషయమ్మునగానీ, ఘనవిషయమ్మున గానీ ఈ అద్వైతంపు స్పర్శ మనకు సోకినప్పుడనం తత్వ స్పర్శ గుర్తింపగ బడుతున్నది. ఒక్కమారు ఒక్కరితో మన వ్యక్తి త్వమ్మువలన లభియించే ఆనందము గూర్చి నేను ప్రస్తావన చేసినాను. మనలో నేకత్వ భావ మొక్కటి నిక్షిప్తమై ఉంటవలననే మనమీ ఆనందము అనుభవింప గా గలుగుతు ఉన్నామని అన్నాను. అతడు తనకు వావిలాల సోమయాజులు "అట్టిదయిన ఆనందపు టనుభవమ్ము ఎన్నండును కలుగలేదు" అన్నాడు. “కాని అద్ది అతిశయోక్తి అనియే నా అభిప్రాయము. తనలోపలి ఏకత్వపు భావనకును, పరిసరాల కును పొంతన భగ్నమౌట వల్ల కలిగినట్టి బాధ చేత అలా అతడు ఊ హించి ఉండగా వచ్చును. కానీ ఈ విషయమ్మే ఆయేకత్వపు నస్తి త్వాన్ని ఎంతో అధికంగా చాటుతోంది. శరీరమ్ము వ్యాధిగ్రస్తమ్మయినపు డే ఆరోగ్యపుటర్ధము మానసాన్ని కడు బలముగ హత్తుకొనును. దేహంలో కడు ముఖ్య మ్మయిన విధులు సామరస్య మే ఆరోగ్యమ్ము గనుక ఆనందము నిస్తోంది. జీవన మందలి విషాద సంఘటనలు జీవిత సం తోషమ్మును తాత్కాలిక ముగను భగ్న మొనరజేసి మహాకవుల మతం శాశ్వతమౌ ఆనందపు సూత్రాస్తిత్వాన్ని నిరూ పించుటకే గాని వాని అస్తిత్వము ప్రకటనగా వించుకొనుట కేర్పడినవి కానెకావు. మనయందలి ఏకత్వపు పరమావధి తోటి జీవులందరి పరి పూర్ణ ప్రేమమూలంగా తనదు అనంతత్వమ్మును తెలుసుకొనుట ఈ ఏక త్వాన్కి గల్గు సర్వవిఘా తాలు దైన్యమును కల్గిం చుచు నీచప్రవృత్తులవి జృంభణాన్కి దారితీయు ఈ నీచ ప్రవృత్తులు బహు విభిన్నతా దృక్పథమ్ము వలన జనించిన మాయా రూపమ్ములు. మనయందలి ఏకత్వము వల్ల పుట్టు ఆనందము తన్ను తాను వెల్లడిగావించుకొనే యత్నంలో సృజనశీల మౌతున్నది. అయితే మన అవసరాలు తీర్చుకొనను మన అందున పుట్టెడు కో రిక మాత్రం నిర్మాణా 399 నికి కారణమౌతున్నది జలకుంభం ఒకదానిని పాత్రదృష్టితో మాత్రమే దర్శించిన దాని ఉనికి కర్ధమేమి? అన్న ప్రశ్న ఉదయించు ప్రయోజనాత్మ కమ్ము అయిన తన రూపమె తన అస్తిత్వానికి కా రణమని అది అనవచ్చును. కాని అదే ఒక సుందర రూపమ్మును పొంది ఉన్న యప్పుడు అది తన ఉనికికి ప్రత్యేకంగా అర్థము చెప్పుకొనగ అవసరమ్ము ఏముండదు! దాని ఉనికి మాత్రమ్మే దాని పరమ ప్రయోజనమ్ము. ఈ సుందర జలకుంభము లైనట్టివి, తనలో నందర్భాగము, బాహ్యదృష్టికిని అనేక ములుగ తోచుచున్నట్టివి అయిన వస్తుసముదాయము అంతటిదౌ సమన్వయము చేత విచిత్రముగా మన యందలి ఏకత్వ భావ నా సంగీతమునకు సమ శ్రుతిలో స్పందించెడు నొక 400 ఏకత్వము తన రూపము అని వ్యక్తము గావించును. ఈ ప్రపంచ మందలి స త్య మెట్టిది? అద్ది ఈ ప్ర పంచమందు ఉన్న పదా ర్గాలదైన పరిమాణపు ఘనతయందుగాని వేద సంఖ్యలదౌ విశేషాన గాని లేదు. అద్ది ఆ ప దార్థమ్ముల అన్యోన్యపు సంబంధంలో ఉన్నది ఈ సంబంధమ్ము ఒక్క లెక్కకయిన, కొలతకైన అందనట్టిదై ఉన్నది. అద్ది వ్యక్తమైన పదా ర్థాలదైన వైవిధ్యం లోనగాక ఒక్కటియే అయిన యట్టి వ్యక్తిత్వం లో ఉన్నది. మనకు ఉన్న విషయ పరిజ్ఞానమెల్ల ఆ విషయాలకు విశ్వం తో గల సంబంధమ్మును గ్రహియించుటలోనే ఉంది. ఈ సంబంధమ్మె జగ త్సత్యమ్ము. జలబిందువు ఒకటి కేవ లమ్ము దానిలోని వివిధ వావిలాల సోమయాజులు మూల పదార్థాల సముదా యమ్ము కాదు. అది అచ్చెరు వయ్యెడు నా మూలపదా ర్థాలదైన అన్యోన్యపు సమ్మేళనయునను ప్రకట మౌనేకత్వంపు బాహ్య రూపమ్ము. ఈ ఏక త్వపు రహస్యమును తెలుపుట కై ప్రతి విషయమ్మును విడ దీసి చూచు విశ్లేషణ దృక్పథాన్కి శక్తిలేదు. పదార్థాల తత్వమెంతొ అగోచరమ్ము ఎందువల్ల నంటే మనదౌ వాస్తవి క ప్రపంచ మీ పదార్థ మీ తత్వరూపమును గ్రహించ టాన్కి నిరాకరణ వహి స్తోంది గనుక ప్రాపంచిక మహాశక్తులైన కేంద్ర శక్తియు, నభిముఖశక్తియు, నా పరాఙ్ముఖపు శక్తియు మనదుగ్రహణ శక్తికి గల పరిధికెంతో ఆవలనే ఉన్నాయి. ఈ శక్తులు సృష్టికర్త దర్బారులో ప్రవేశింపనర్హతలే నట్టి రోజు కూలీలు మహాకవుల మతం కాని కాంతి, శబ్దమ్ములు వివిధ రమ్య వేషాలను స్వీకరించి, ఇంద్రియాల సమక్షాన నృత్యమ్మొన రిస్తున్నవి. సదా మనకు ఈ ప్రపంచక దృశ్యము సిద్ధమైన విందుగాని ఆ విందును సిద్ధపరచు నెట్టి పాకశాలి కాదు. ప్రాపంచిక బాహ్యరూప మేగానీ దాని అంత రంగిక తత్వమ్ము కాదు. ఋతువులదే నాట్యచంక్ర మణము, పట్టుచిక్కనిదౌ కాంతిచ్చాయా విచిత్ర లీల, పంచభూతమ్ముల వివిధ శక్తి ప్రదర్శనము చిత్రవర్ణ విలసితమౌ పక్షాలతో జీవవిహం గాల జనన మరణమ్ముల మధ్య సలుపు విహారాలు ఇవియే మన కంటికి కను పించునట్టి దృశ్యమ్ములు. వీనికి గల ప్రాముఖ్యం దేశకాల బద్ధమైన వానిదియగు అస్తిత్వం లోనగాక, వానివైన 401 సామరస్య పరిభాషలో మన ఆత్మకు మాతృభాష సామరస్య పరిభాషతో వంటిదైన పై జెప్పిన అవ్వి మనకు తెలియబడుట లో ఉన్నది. ప్రాపంచిక ప్రాభవమ్ము కొరకు ప్రాకు లాడుటచే నాధ్యాత్మిక తయే లోపించిన యప్పుడు మనము ఈ మహాసత్యపు స్పర్శకు దూరులమౌటను దాని వైన ఆహ్వానము, ఆతిథ్యములను నిరాద రిస్తాము! “రాత్రింబవ ళులు మనలను విడువకుండ నీ ప్రపంచ మతి సన్నిహి తమ్ముగ మనతోనున్నది. అర్బనలో, భోగాలలో మగ్నులమై మనము మనదు శక్తులెల్ల వ్యర్థంగా వించుకుంటు ప్రకృతిలో ఉన్నయట్టి మనదౌ దా నిని కొంచెము కూడ తెలుసు కొనుట లేదు" అంటు వర్డు వర్తుకవీశుండు పడ్డ 402 వేదనలో ఈ సత్య మ్మే వ్యక్తమ్మౌతున్నది. కానీ ఈ దౌర్భాగ్యం మనకు ఈ ప్రపంచ మ్మతి సన్నిహితమ్మగుట చేత సంప్రాప్తించేది కాదు. ప్రకృతిలోని భిన్నత్వా న్నన్వేషణ గావిస్తూ పరుగులాడటములోన దానిలోని ఏకత్వపు రూపమ్మును దర్శింపగ లేకపోవటమ్ము వల్ల కలిగింది. భౌతిక విష యాలు భౌతికపు విషయా లుగ గ్రహింపబడినప్పుడు అవసరాలు వానికెట్టి పొత్తులేదు. ఎల్లప్పుడు అన్యోన్యం హింస చేసు కొనటానికి అతిసిద్ధము గా ఉంటవి. మనుజులలో వ్యక్తిగతమ్ము ఉద్రే కాలవోలె అవి నిరవధి కమ్ము అయిన స్వేచ్ఛాప్ర వృత్తి కోరుతుంటాయి. స్వభావమ్ము చేతను అవి నశ్వరాలు అయితే, ఒక వావిలాల సోమయాజులు మారీ విషయమ్ములొక్క ఏకత్వాదర్శనాన్కి లోబడితే వాని విప్ల వాత్మకాలు అయిన శక్తు లెల్ల నిగ్రహింపగబడి వానిలోని సృజన బహి ర్గతమౌను. శాంతి స్వరూ పమ్ములోను, దోషరహిత మైన పరస్పర సంబం ధాలలోను అంతర్నిహి తమ్ము అయిన ఐక్యతయే ఈ సృష్టి భోజనమ్ము నందు నధికమౌ కోరిక స్వాభావికముగను జుగు ప్సాకరమ్ము స్వార్థమయము దాన్కి 'సభా మర్యాద'ను పాటించే గుణము లేదు. అయితే, సామాజిక సౌ భ్రాత్రపుటా దర్శానికి లోబడినప్పుడు అది ఒక విధానాన్ని సంతరించు కోని ఒక్క అలంకార ముగను పరిణమిస్తుంది. మనుజ స్వభావాన కామ ముధృతమ్ము, వ్యక్తిగతము, నాశకరము నైనట్టిది. కాని అమలమైన ప్రేమ అను ఆదర్శప్రభా వమ్ము వలన అద్ది విశ్వ ప్రేమ అనే పరమ సత్య మునకు ప్రతీకమ్ము వోలె సంపూర్ణపు సౌందర్యం తో వికసిస్తూ ఉన్నది. ఈ విధంగ ఏకత్వం సృజియింపగ బూనుకోని అనేకత్వముగను వ్యక్త మౌట అనేకత్వము వివి ధత్వమ్మును విడిచిపెట్టి ఏకత్వముగా పర్యవ సించటమ్ము కానుపించు 2 మా ఉపవనమున బారులు తీర్చి నిల్చె శాఖా హ స్త్రాలతోటి ఉదయభాను నాహ్వానం చేస్తు ఉన్న నారికేళ వృక్షమ్ములు నా బాల్యమునందు నాకు తమసజీవ సాహచర్య మును అందిస్తుండేవి. నా ఊహాశక్తే నా బాహ్యజగత్తునునా ఊ హాజగమ్ముగా పరివ మహాకవుల మతం 403 ర్తన చేసేనంచు నేను ఎరుగుదును. ఏకత్వా న్నన్వేషణ గావిస్తూ బాహ్యజగముతో వ్యవహా రము చేసేదైనను ఊ హాశక్తే. పరిసరమో ప్రకృతి యిచ్చునట్టిది ఈ సాహచర్యమును వాస్తవ మైనదేను అని భావిం పగవలయును. నా ఊహా జగమునకతి సన్నిహిత మ్మైన అంశ ఒక్కటి ఈ ప్రపంచాన ఉన్నది మరి, లేత మనసులందునుండు సృష్టికర్త కున్న శక్తి కీయంశమె తట్టి మేలు కొలుపుతుంది. పలురంగుల దారాలతో తనకు నచ్చి నట్టి రీతిలో ఎన్నో రూపాలను (సృజన అనే చిత్రమైన వస్త్రంలో) కువిందమ్ము చేయుచున్న సృష్టికర్త కానందం ఈ సత్యం మనకు చాల సన్నిహితం ఐంది గనుక అది మన ఊహాశక్తితో అనుగుణ స్పందనము కల్గి 404 ఉంది. కొన్ని తంత్రులు మరి కొన్ని తంత్రులతో సమశ్రు తిలోనున్నచో నీ సమ శ్రుతి ఒక శాశ్వత సత్యము ప్రకటన చేస్తూ ఉందని మనకు తెలుసు. ఈ జగత్తు నుంచే మన కాల్పనిక మ్మౌజగతికి ప్రేరణ లభి యిస్తున్నది. అను అంశము వలనను ఈ సృజనాత్మక కల్పన ప్రకృతికి మనకు సామాన్యం అంటు తెలు స్తూ ఉన్నది. “ఏది ప్రాతదౌ మతమో దానిలోనె పాతుకోపో యిన ప్రాణిగ ఉండటమ్ము తలచిచూడ నెంతో మేలు. ఏకాంతపు బాధతీర ఎన్నెన్నో ఏవేవో స్వప్నాలు వహిస్తు నేను నా ఈ ఉపవనము నందు నిలచి అచట కడలి నుండి వెడలివచ్చు. 'ప్రోటియనునో, 'కొమ్ము నూదు ట్రైటాను” మనోనేత్రమార్గంలో కనియెద నా కరువు దీర” అన్న సుకవి వర్డ్సు వర్తు వావిలాల సోమయాజులు భావనలో కల్పనాజ గమ్ము ఇచ్చు సహాయాన మన మేకాంతమును పార ద్రోలగలము అను నాశా భావము దృఢముగ నున్నది. దాని సాహచర్యమ్మును ఇవ్వగలుగు అతిసన్నిహి తపు సత్యము నీ దృశ్య ప్ర పంచపు మాటున నుండే బయలు పరచగలుగు శక్తి కున్నట్లయితే మాత్రమే ఈ ఏకత పారద్రోలు టనునట్టిది సాధ్యపడును. మనము కొన్ని రూపాలను కల్పింపగ నెంతో శక్తి చేయుచునున్నాము వ్యయము. కల్పనలకు ఉపయుక్తము హేతుబద్ధమయిన యట్టి విషయమేదీ నిర్ణయింప బడుటలేదు. కేవలమీ సత్యపు వివిధ స్పర్శల కును వివిధములౌ స్పందన లను పొందగ గల్గుట మా త్రమ్మే జరుగుతున్నది. ఇట్టి రూపకల్పన అను శక్తిలోనె పసిబాలుడు తనకు గోచరించుచున్న మహాకవుల మతం లోకానికి ప్రతిగా ఊ హలోకము నొక్కదాన్ని తనకోసం నిర్మిస్తూ ఉన్నాడు. -మనలో గల పసితనమ్ము కనుపించే ఈ జగత్తు తెరవెనుకను ఉన్న తనదు శాశ్వత సుఖ జలధినుంచి వెలికి వచ్చు 'ప్రోటియన్లుగానో', పుష్ప ములతోటి అలంకృతమ్ము అయిన‘కొమ్ము నూదుచున్న ట్రెటాన్ గను' ఒకటే ఒక క్షణకాలం దర్శింపం గా గులుగుతు ఉంటుంది. జ్ఞానమ్మును గాని సహా యాన్నిగాని ఇవ్వనట్టి దియును, కేవలమ్ము వ్యక్తీ కరణము మాత్రము చేయున దియును క్రియాజాలములో పసివాడికి ఆనందం ఇవ్వగలుగుతున్నట్టిది అయినట్టిది "సఖుడు” అనే పరమైన సత్యమ్మే సృష్టి చేయుటమ్ములోన ఉన్నయట్టి ఆనందమె కల్పనలో మనకు ఉన్న 405 ఆనందానికి ప్రేరణ. ఒక్క కవి తన నుదుటి వ్రాత అయిన కలలు కనటమనే తత్వాన్నీ, ఆ స్వప్నపు వ్యర్థతనూ, వ్యర్థమైన వైనవాని కున్న శాశ్వ తత్వమ్మును గూర్చి ఇలా చెప్పినాడు. "లౌకికమో జగము నెదుట నిర్లక్ష్యపు నాశిరాన్ని ప్రతిదినము వంచి నిలుతు భావలోకమందున విహ రించునట్టి వాడొకండు బహుఫల ప్రదాత ఒకడు : ఈశ్వరుడే ఒక్కనాడు ఇద్దరి హరియిస్తాడు. కానీ ఈ లోకపు క్షే త్రమ్మునందు పంటకోయ బడ్డ వెనుక ప్రతిఫలమ్ము కొంత మిగిలితేను అవ్వి నేల కొరుగుముందు నేను నేలను రాల్చిన గింజలె” మరల మరల ఆ స్వప్నం తలయెత్తుతునే ఉన్నది సారమ్ము ప్రయోజనముగ గల ఆహారమ్ము కంటె యిది ఎంతో వాస్తవమ్ము 406 అయినట్టిది. చిత్రకార చిత్రానికి ఆధారమ్మౌ పటాన్కి మన్నిక, సారమ్ము రెండు నున్నాయి దానిని ఉత్పన్నముగా వించటాన్కి, విపణివీధి చేర్చటాన్కి ఎన్నెన్నో యంత్రమ్ములు, కర్మాగా రమ్ములెంతో అవసరమ్ము అయితే ఏ కర్మాగా రమ్ములోన ఉత్పన్నం చేయంగా వీలుగాని చిత్రకారు చిత్రమ్మొక స్వప్నమ్మును, ఒక్క మాయ. కాని పరమ సత్యమ్మును ఆవిష్కరణమ్ము చేయు నట్టిది ఆ స్వప్నమ్మే! పరముకాదు. కవి ఒక్కడు శిశిరమ్మును గూర్చి యిలా పలికినాడు. "వృద్ధురాలు శిశిర ఋతువు మూగవోయి నిలిచి ఉంట ఒక ఉదయం చుట్టూ ఒక మంచు మధ్య చూచినాను. నిశ్శబ్దం వింటు అది నీరసముగ నున్నదేమొ! వావిలాల సోమయాజులు పాడువడ్డ వనమునుండి వినబూనిని వీనుల కట వినబడదే పికము పాట!" ఇంకొక కవి మధుమాసం గూర్చి యిలా అన్నాడు : "ఓ మధుమాసమ్మా! హృద యోల్లాసమ!! కమనీయ మ్మైన నీదుకన్యాదర హాసమ్మును వెలుగునిమ్ము ! ఒక్కమారు వెంటనే నీ నయన కజ్జలంపు బాష్ప నవ్యవారి జారనిమ్ము!” చంద్ర మండలాన ఉండు వాడొక్కడే భూమికి దిగి వచ్చి ఒక్క గ్రామఫోను సంగీతం వింటున్నా డనుకొందం. దానివల్ల తన హృదయంలోనను ఉ త్పన్న మొందు ఆనందానికి మూలాన్నన్వేషణ చేయుబూను కొన్నాడని అనుకొందాం. అతడి యెదుట ఉన్నవి ఒక చెక్కపెట్టె, దాని పైన గుండ్రంగా తిరుగతు శబ్దాన్ని పుట్ట జేయునట్టి ఒక పళ్లెం అయితే కంటికి కన్పిం మహాకవుల మతం చనిదియు వివరించరాని యట్టిదైన సంగీతమ నే సత్యము తనకు లభిం పగ జేసేవ్యక్తిదైన సందేశం అతని వ్య క్తిత్వము అంగీకరింప వలసి ఉంది. ఈ సందే శము ఆ పరికరములందు గానీ, వానినుండి పుట్టు శబ్దజాలమందు గాని లేనె లేదు. హేతుబద్ధ ముగ నూహించినచో ఆ చంద్రమండలాన వసిం చేటి వాడు ఒక కవియే కావచ్చును. అట్టులయిన దారు పేటికందున, దే వత బంధింపబడినది ఒక నిర్జన దేవలోక మున ప్రమాద భరితమైన సాగరమందలి ఫేనము పైకి తెరచుకొనెడి ఒక్క దూరదూర మందలిదౌ మంత్రగవాక్షాన్ని తెరచు కొనుట కొరకు వేదనపడు చా దేవత గీతమాలి కలనల్లుతు ఉన్న దంచు కవిత చెప్పగావచ్చును. 407 ఇది ప్రత్యక్షమ్మో సత్యము కాదుగాని దాని సార మదియేను. గ్రామఫోను మనకు శబ్ద ముత్పన్నం ఔ సూత్రాలను తెలుపదు. కాని దాని సంగీతం వ్యక్తిగతమ్మయిన సాహ చర్యమ్మును మనకిచ్చును. వసంతంపు బాహ్యలక్ష ణాలు ఎండ, వానజల్లు ఒకటి వెనుక యింకొక్కటి రావటమ్ము గాని, వసం తపు ప్రభాస సుచ్ఛాయలు సున్నితమౌ మేళవింపు, మృదువు అయిన శబ్దమ్ములు, సన్నని సంచలనమ్ములు, ఇంద్రియమ్ములకు స్పర్శా ఘాతమ్మల గలిగించుట మాత్రమ్మే చేయలేదు. సంగీతం వలెనే అవి సైతం 'ఆనందపు అను భూతి' అనే యోగమ్మును మనకు ప్రసాదిస్తున్నవి. అందువల్ల కవి ఒక్కడు వాసంతీ రమణి గూర్చి ఊహాచిత్రణ చేసిన ఎంతటి భౌతిక వాదియు 408 అతనితో సహానుభూతి నొందకుండ మానలేడు కాని గణిత సూత్రమొకటి గాని, జీవశాస్త్రపు సి ద్దాంత మొకటిగాని, ఒక్క పూవు వలెనో, కన్నె వలెనో, లేక ఒక్క జంతువుగా వర్ణన గావిస్తే ఆ భౌతికవాదే ఆగ్రహ ఆవిష్ణుడు ఔట నిజము. ఎందువల్ల నంటారా? ఈ మేధా విషయక సి ద్ధాంతాలకు మనదు మనో వీణను స్పృశియించునట్టి ఇంద్రజాల మనెడు విద్య చేతగాదు. పక్షిజాతి సంగీతపు మాధుర్యం, సూర్యకాంతిలో మిలమిల మెరయు నార పల్లవాళి గగన వీధిలోన తేలి ఆడునట్టి తెలిమబ్బుల వలె ఆ సిద్ధాంతములు కలలుగావు మనము కేవ లము భౌతిక, గణితశాస్త్ర విజ్ఞులమే మాత్రమ్మును కాదనటం మన వ్యక్తి వావిలాల సోమయాజులు త్వమ్ముదైన సత్య మ్మిది నిజము, నిజము గాఢ నిజము. "మనసు స్వప్నలోకంలో విహరించే ఊహాజీ వులము. మనము సంగీతం సృజియించే స్రష్టలము. భావుకత్వమును సంగీ తపు సృష్టియు కేవలమ్ము మందబుద్ధుల కృషిగాదు పదములతో, మనుజులలో శిలలతోటి, లోహాలతో, రంగులతో రేఖలతో, రాగంతో, గీతంతో, సంగీతం సృజన చేయ గలుగునట్టి సృష్ట్యాత్మక ప్రేరణమ్ము” “అమరమైన గీతాలతో అద్భుతమౌ గాథలతో పెద్ద నగరము నిర్మితి, సామాజ్యపు వైభవమ్ము మానవలోకములోనే సృజియింపగా బడును. ఎల్లప్పుడు తర్కించుట కెంతో అలవాటు పడిన ఒక్క పండితుండీ "అల కోలుపోయినాను నేను” అని నాతో చెప్పినాడు ఇందుకు కారణము తాను దర్శించే రూపకమ్ము నందలి అంతర్గతయో గాన్ని గ్రహించటము ద్వార రూపకార్థమును గ్రహించు ప్రేక్షకుండు మనలోపలి విశ్వాసమె అయి యుండుట. కానీ తర్కమ్ము మనల రూపక మేదీ ప్రదర్శ నము పొందని నేపథ్య గృ హానికి కొనిపోతున్నది. అచటి దృశ్యమును వీక్షణ చేసి తర్కమలసటతో తలనూపుతు తనది అయిన భ్రమ తొలంగిపోయెనంటు ప్రలాపించు కాని ఎంతో వైవిధ్యము ఉన్న వస్తు సంతతితో వ్యవహరించు వేషధారణ ప్రదేశ మును ప్రశ్నించితిమో అది తెల్విమాలి నట్టిదిగా కనిపించుట, కాకపోతె సైతానటు అపహాస్యము గావించుట ఆచరించు. వాటు వల్ల నైజలక్ష ణమ్ము అయిన విశ్వాసము ఎందువల్ల నంటారా? మహాకవుల మతం 409 రూపకయోగమ్ములోని రహస్యమ్ము దానియందు లేదు గనుక. అద్ది మరో స్థానంలో ఉంటుంది. ఆ సమయానను విశ్వా సమ్మె అద్వితీయుడైన పరమేశ్వరు వద్దనుండి యే యీ యోగమ్ము మనకు సంక్రమించె. మన హృదయము లోననున్న ఆ పరమే శ్వరుడు కవాటాన్ని తెరచి ఆనందంతో యోగము నాహ్వానిస్తున్నాడు. అంటు సమాధానమ్మును చెప్పవలెను. వేషధార ణపు సామగ్రియు, రంగ స్థల పరికరములను నాట కపు కళలో సంయోజన చేయగబడి రూపకరూ పకమున ప్రదర్శింపబడుటె సత్యమనీ, నేపథ్య మ్మున కనిపించేది మహా భ్రాంతి అనీ తెలుపుటయే కళలదైన కర్తవ్యం కావ్య కరణ కర్తవ్యం రూపకసామగ్రి అంత నశిస్తుంది. రంగమ్ములు 410 మార్చబడును. అయిన నిత్య భావుకుండు పరమేశుడు శాశ్వతుండు అవినాశియు అందుచేత నీ రూపక మును స్వప్నము. నిత్య సత్య మౌచు నిలచి యుండిపోవు. 3 కవుల కవిత్వమ్ము, కళలు ఈ విశ్వములో మనుజుని కున్నయట్టి ఏకత్వపు గుణము గూర్చి, అట్టిదైన విశ్వాసము అతని యందు పెంచి, పోషణమ్ము చేస్తు ఉన్నాయి. ఇట్టి ఏక తత్వ మహాసత్యము మా నవునిదైన వ్యక్తిత్వమె ఈ సత్యం ప్రత్యక్షం గాను తెలుసుకొనదగిన ఒక్క మతము. అంతెగాని తర్కము విశ్లేషణమ్ము చేసి తెలుసుకొనంగాను తగిన తత్వ సిద్ధాంతము కానేకాదు. మన వ్యక్తిగ తానుభూతి వల్ల మనము సృష్టిచేసి నట్టివాని దౌ నర్థము మనకు తెలియు వావిలాల సోమయాజులు గనుకనే మన చుట్టు నున్న ఈ సృష్టికి అర్థమ్మును గూడ మనం తెలుసుకొనం గా గలుగుతునున్నాము. కీట్సు మహాకవివర్యుడు గ్రీకు పాత్రపైన ఒక్క గీతంలో "ఓసి మూక రూపమ్మా! అంతరహిత మైన కాలమటుల నీవు గూడ మమ్ము భావనా జగమ్ము నుండి వెలికి లాగు తున్నావే” అని గానం చేయటంలో కోపము లే నట్టి రూపములు అన్నిం ట్లోని ఉన్న, నిర్వచింప రాని యట్టి ఏకత్వ ర హస్యాన్నే అనుభవమ్ము నొందినాడు. ఈ రహస్య మే మనలను భావాతీ తమ్ములైన లోకాలకు తీసుకెళ్ళి అనంతత్వ ముతో మనకు ప్రత్యక్ష స్పర్శను కలిగిస్తున్నది ఇదియే కవి తాను చూచి లోకానికి ఆవిష్కర ణమ్ము చేయవలసినదే సత్యము. ఇదియేను కీట్సు మహాకవుల మతం కవితలోని వేదనా ని రాశలకును మధ్యనుండి అతికష్టంతో వెలువడు కాంతి రేఖలుగా దర్శన మిస్తున్నది. "మానవతా దారిద్ర్యము - మాసిపోని దారిద్ర్యము, బరువు బ్రతుకు దినాలున్ను, ఇరుకు దారి నడకలున్ను, మనకు నుదుటి వ్రాతలేను. అయిన నొకటి నిజము, నిజము. తమోరాశి త్రోసిపుచ్చు సమ్మోహన రూపమొకటి సౌందర్యము నింపుకొంటు విందొనర్చు నందఱకును, సత్యమిందు సౌందర్యపు రూపంతో వ్యక్తమౌతు ఉంటుందను సూచనిందు లో ఉన్నది. విశ్వసృష్టి అనెడి శాశ్వ తలపు చిత్ర వస్త్రంలో సౌందర్యం అన్నది ఒక హఠాత్సంఘటన మాత్ర మే అయితే అది బాధా కరమై వాస్తవ విషయా లతో తనకు ఉన్న యట్టి 411 వైరుధ్యం వలనను ఓ టమి పొందును. సౌందర్యం కేవలమొక ఊహాచి త్రమ్ము కాదు. దానికి స త్యంపు శాశ్వతమ్ము అయిన అర్థమొకటి ఉంటుంది. ములకు మనము బెదరనవస రము లేదనే కవి మతమ్ము. సాంప్రదాయకాలు అయిన మతముల వౌ నుక్కు వైన చట్రాలకు అలవాటయి నట్టివారికీ కవి మత మొక నిశ్చిత రూపములే నిర్వేద విషాదాలను నిదిగాను, అనంతమైన సృజియించే విషయమ్ములు మార్పుల కవకాశమున్న కేవలమ్ము మంచుతెరల యట్టిదిగా కనుపించును. అద్ది వాస్తవమ్ము - కాని బోలినవి, వాని మధ్య భాగమందునుంచి గొప్ప సౌందర్యం క్షణకాంతితో సాక్షాత్కారమునొందిన ప్రేమ పరమ సత్యమ్మని ద్వేషమసత్యమ్ము అనియు, సత్యము ఏ కమ్మని యును అది పరస్పరపు సంబం ధమ్ము లేనివౌ విభిన్న విషయమ్ముల సందోహం కాదని మన కర్ణమౌను. ఒక విస్పష్టమ్ము అయిన ఆదర్శానికి దాని భౌతిక ప్రతిబంధనమ్ము లకును మధ్య స్పష్టమైన వైరుధ్యం ఏమీ లే నంతవరకు కష్టనష్ట 412 కవి మతాన్కి లక్ష్య మనం తత్వమ్మును బంధనమ్ము చేసి భౌతిక ప్రయోజ నాలకు అనుకూలంగా మలచటమ్ము కాక, మనుజు చేత నత్వమును భౌతిక శృంఖలాల నుంచి వియో చన చేయుట గనుక, దాని కొక్క నిశ్చితపు రూపం ఏదీ లేదు. అది ప్రాతః కాలమువలె ఎంత అయిన చేతనమ్ము కాని కాల పరిధి గలది ఓః అంతటి కాంతివంతమైనట్టిది అది మన ఆలోచనలకు, అనుభవాలకును, వానిని తే వావిలాల సోమయాజులు జోవంతము చేస్తుంది. కవిమతాన్కి నిశ్చితమ్ము లౌ విధులును, సిద్ధాంతము లేమిలేవు. ఈ అనంత సృష్టిరూపమున సర్వద నిశ్చితమ్ము లయిన యట్టి నిర్ణయాల వైపునకై నడిపించుట కెన్నండును పూనుకోదు. దానికి తన చుట్టు అవధులెవ్వి లేవు ప్రకటమ్మగుచుండ మహా సత్యమునెడ మనకు ఉన్న దృక్పథమ్ము మాత్రమ్మే, కాన అది అనంతకాల దానియందు కనబడును. అభేద్యసూత్రబద్ధమైన మతమునందు అన్ని ప్రశ్న లకును నిశ్చితమ్ములయిన సమాధానములు ఉన్నను సంశయాలు అన్ని పాతి బెట్టబడుతు ఉంటాయి. కాని, వెలుగు నీడలు దో బూచులాడు నట్టిదియును ఆలమందలలో మధ్యన వేణువూదు పసుల కాప రిని బోలుచు, మేఘ సమూ హాలమధ్య వేణుగాన మును లోకములను ఆవి ష్కరణ చేయగా జాలును. అది దౌష్ట్యపు నస్తిత్వము నంగీకారమ్మొనర్చు. మనుజులొకరి వేదన నిం కొకరు నిరంతరము వింటు కూర్చుండే ఈ లోకపు అలపు, విరామము నెఱుగని వేగమ్మును, విసుగుదలలు ఉండుటలను కాదనదు. కాని యీ ప్రపంచమందు కోయిల కూతల ఆకస మున చంద్రుడు చల్లంగా రాజ్యమేలుచుండుటమ్ము అనునవియును గలవని అది జ్ఞప్తిచేయు. మొనరించే వాయుసహిత మైనదియును నైనభూమి “తెల్లని చుట్టును గల వాతావర ణమ్ము రీతి కవిమతమ్ము ఒక అనిశ్చితపురూపం పొందినది. అది ఎవరిని మహాకవుల మతం పద్మమ్ములు బాహ్యహరిత తృణభూములు, ఆకులమ ధ్యన దాగిన కృష్ణాంబర ములు మకరంతమ్ము తోటి 413 నిండినట్టి మధ్యాహ్నపు తొలిశిశువు, మంకెన పూ దేనె ద్రావ మరల మూగు తేటిగములు.” కాని యిందు ఏ ప్రక్కన, ఏ వేళలను ఒక్క సమాధానానికి అవసరమ్ము అయిన యట్టి నిర్దిష్టత కనుపింపదు అయితే అది ఎద అంతా నింపి భావనాప్రపంచ పరిధులు దాటించు నొక్క సంగీతమ్మును మాత్రం కలిగి ఉంది. ఈ సంగతి తెలియపరచు ఒక బెంగా లీ కవి మధుగీతమ్మును వినుడు మీరు : "ఉదయాన నీ నౌక తెరచాప రెపరెపలు హృదయాన్ని కదలించె మేలుకొంటిని దేవి! "అలలునను పిలిచినవి తీరమును వీడితిని నా జీవయాత్రాధి దేవతా! ఓ వనిత!!" “ఈ జీవ జలధికా 414 వల వెలయుదానిలో మా జీవనస్వప్న సుమతతులు విరియునా?" “ప్రశ్నించు నా హృదయ జలనిధి తరంగాలు ప్రభాకరప్రభల నీరవ బోలు నీ మందహాసప్రభా మహిత నిశ్శబ్దమ్ము సుందరంగా నాట్య భంగిమల జూపినది శాంత్య శాంతులమధ్య సాగినది దివసమ్ము పర్వినవి దశదిశల ప్రౌఢతర పవనాలు” "సంద్రమ్ము మధ్య వడి వ్యధితమైపోయినది మరల నా హృదయమ్ము ప్రశ్నింప సాగినది" "ఎక్కడుంది నీ శయనపు మందిరమ్ము ఓ లలనా! పగటి వెల్గులున్న చితికి బహుదూరంలో ఉందా? ప్రత్యుత్తర మేమిలేని ప్రశ్న అయ్యె నాదు ప్రశ్న” “సంధ్యాభ్ర నీరదాం చలకాంతి రేఖవలె వావిలాల సోమయాజులు సరళముగ ఒక నవ్వు వెలిగె నీ కనులలో” "రేయి అరుదెంచినది తిమిరావృతం బౌట తెలియగా బడదయ్యె రమ్యమౌ నీ రూపు” "గాలి హేలగ వీచె కదలి నీ ముంగురులు లలిత లాస్యము చేసి నాదు చెక్కిలిపైన రమణీయ రతిలో హృదయ సంభారమును కమనీయ వాసనల కదలించి వేసినది" “హస్తాల సారించి చీకటిలో నీ దివ్య చేలాంచలము నందు కొన వెదుక సాగితిని” “తిరిగి నా మనసు నిను ప్రశ్నింప మొదలిడెను ఈ రేయి వెలిగేటి రిక్కగమి కావలను వరలు నీ నిశ్శబ్ద గీతాలు గసుమములై విరియ నీ నిలయోప వనసీమ నున్నవో? నడిరేయి వెలిగేటి మహాకవుల మతం నక్షత్ర రుచి వోలె నేత్ర పర్వముగూర్చు నీ దివ్య హసనమ్ము నిశ్శబ్ద మధ్యాన నిర్మలముగా వెలిగె.” షెల్లీ కవిత : 4 కవిత అ స్పష్టతయును, సంశయము లేదన అన్వేషకులకు మధ్యనుండి ఈ మతమ్ము క్రమప్రవృద్ధి నొందటమ్ము మనకు బాగ స్పష్టమౌను. అతడు లేత వయసునందె మృతుడైనా, తుదకైనా తన విశ్వాసాన్ని ఎంతో సుస్పష్టము చేయగలిగె. ఈ విశ్వాసపు అంతిమ పరిపూర్ణత “మేధాసౌం దర్యమ్మును గూర్చిన గీ తమ్ము" అనే గీతికలో మనకు స్పష్టముగ గన్పడు వీని శీర్షికామూలము లో సౌందర్యమ్మనునది ప్రత్యేకపు విషయాలతో కనుపించే ఒక్క జడగు 415 ణము కాదని జడజీవన దీర్ఘమయిన ఒక పూవును గూర్చిగాన మొనరించెను. “తదుపరి సంతోషముతో, గర్వముతో నేను బయలు యందలి మిధ్యా వైరు ధ్యపురూపముగా ప్రకటిత మయ్యే ఒక శక్తి అనియు షెల్లీకవి భావముగా మనకు అర్థమౌతున్నది. షెల్లి జీవయాత్రకు చెం దిన అవసానపు దశలో అప్పుడపుడు దిజ్మాత్రము గా దర్శన మిస్తు నెడద శాంతి రహితతతో నింపు దివ్యతత్వముతో అతండు ముఖాముఖిగ దర్శనమ్ము చేసిన సమయమ్మునందు ఆతని హృదయాంతరాళ మందు గీతి వెలివడినది అతని సౌందర్యపు టను భూతులు సర్వము నాతని సత్యపురూపేమి అన్న ప్రశ్నతోటి బోధించెను, ఒక్కచోట అతడు వివిధ పుష్పాలతో కూర్చినట్టి గుచ్ఛమ్ముల లోననున్న అల్లరి రీతిగ నానం దమ్ముగాను, తనదు దివ్య మైన యట్టి కన్నీటితో తల్లి మోము తడుపుతున్న 416 దేరిన ప్రాంతమ్ము చేరి అచట దాని నర్పణగా వించగవలె ననుకొంటిని అయ్యొ! దాని నెవరి కిత్తు” అనుటతోటి ఆ గీతము పూర్తిచేసె. ఈ ప్రశ్నకు సమాధానమెదీ లేక పోయినాను ఒక ప్రత్యే కార్థముంది. ఒక సౌంద ర్యంపు సృష్టి ప్రేమకు చెం దిన సాఫల్యమ్మనియెడు నొక ఆశయ పరిపూర్తిని సూచించును. ఈ సౌంద ర్యంపు సృజనను నిరాశా నిస్పృహలతో నిండిన కొం దరు కవీశ్వరులు నిరసి స్తుంటారు. కానీ అది వ్యాధిగ్రస్తుండు అయిన బాలకుండు తన తల్లినె దండించెడు పని వంటిది విశ్వాసానికి పట్టిన ఈ రోగము సత్యమ్మును బాధించును. కానీ అది వావిలాల సోమయాజులు తన కోపం బాధలవౌ ఉనికితోడ ఆ సత్యము నే నిర్ధారిస్తున్నవి. అద్వితీయు డౌపరమే శ్వరుడు తనకు తానె చేయు ఆత్మార్పణయే సౌంద ర్యమ్ము అనునదే ఈ వి శ్వాసమ్ము. మేధాసౌం “ఎందులకో, ఎందులకో వికసించిన విజ్ఞానం వెలుగు మాసిపోవటాలు, జీవన మరణ వలయమ్ములు, మన జీవన స్వప్నమ్ములు మనికిలోని భయభీతులు మానవలోకపు వెలుగును మలపివేయు టెందులకో, మానవాత్మ పడువేదన దర్యమ్మును గూర్చిన గీ తమ్ములోన ప్రథమ భాగ మున షెల్లీ సౌందర్య ప్రకటనంపు చంచలత్వ మును, ననిత్యతను గూర్చి ఆ ప్రకటన ఈ సౌంద ర్యాన్ని సత్యదూరంగా, ఎంతో బలహీనముగను కానుపింపజేయటాన్ని గూర్చియె ఇటు వాపోవును "సాయంసంధ్యల వెలసిన రాగంలో, గానంలో మన ప్రేమయు మన ద్వేషం, మన ఆశల కవకాశం ఎందులకో, ఎందులకో, " అను ప్రశ్నల నుదయింపం గా జేయును కవి చెప్పు సమాధానమ్ము “ఒహోహో, సౌందర్యమ। అజ్ఞాతము, అద్భుతమ్ము॥ అయిన నేమి నీ రూపము మానవుడే అమరుడైతే, మహితశక్తి మంతుడైతె శార్వరి తారాకాంతుల పాదమతని గుండెలోన తేలియాడు మబ్బులలో పదిలంగా ఉంతువేమె॥ సంగీతము వీడినట్టి స్మృతిపథాల బరువులతో ఉన్న అనిత్యత్వ చంచ లత్వమ్ములు మన యందున” మహాకవుల మతం సౌందర్యపు పట్టు చిక్క నట్టిదైన తత్వమ్మే అమరత్వపు, సర్వశక్తి మత్వమ్ముల అస్తిత్వము 417 సూచిస్తూ, ఒక్క శాశ్వ తత్వానికి రూపమీయ టమ్ములోన వానిని ద ర్శింప యత్నమును చేయుము అని మనలను ప్రోత్సహించు పరమ సత్యమత్యంత శ్రమతో సాధింపవలసి నట్టిదైన ఘన విషయం సత్యలాభమే పరిశ్ర మాంతమ్మున దొరుకునట్టి ఫలముకాదు. అది సాధింపంగబడిన సర్వవిషయములను దర్శ నమ్మొసగును. మహాజ్ఞాన యాత్రయందు మనకు దారి చూపగలది యేది? దీనికై మానవజాతి సదా మార్గాన్వేషణ చేస్తూ ఉన్నారు. "రాక్షసులు, దేవతలు, రాత్రించర భూతాలు క్షణకాలం జీవించే అక్షరాల మాలికలే ఫలియించని సాధనలకు ప్రతిరూపాలౌట నిజము. అవి చూపే మంత్రతంత్ర మహిమలకే జగములోని 418 అనుమానపు భూతాలు, అదృష్టపు లాభాలు, అంతులేని మార్పులునూ అట్టె మాయమైపోవును లోకంలో అమలులోన ఉన్నయట్టి మతవిషయక సంప్రదాయములును నిత్య విధులు తలపగ కని కట్టువంటివని షెల్లీ భావమ్ము. అవి మానవు తీవ్రములౌ ప్రయత్నాలె గాని సాధానా ఫలాలు కావు. మనము అన్వేషణ గావించే పరమావధి మనల సూటిగానె పిలు స్తున్న దనియు, అద్ది మనకు స్వీయకాంతితోనె దారి చూపుతున్న దనియు నాత నికి తెలియును. సౌందర్యపు పిలుపే సత్యంపు పిలుపు సహితమ్మును అయి ఉన్నది. "పర్వతాలపైన కదలు మంచు మబ్బు తెరలవోలె మూగదైన వీణపైన రేయిగాలి పలికించె నవరసభర గీతివోలె నడిమిరేయి నీటిపైన వావిలాల సోమయాజులు నాట్యమాడు వెన్నెలవలె జీవిత దుస్స్వప్నానికి నీ కటాక్ష కాంతి సత్య సౌందర్య స్ఫూర్తి నొసగు సర్వగతము అయిన మనల పిలిచెడు ఈ సత్యదర్శ నాన్ని గూర్చి ఒక్క వంగ దేశ గ్రామ గాయకుండు ఇలా పాడుతుంటాడు: "స్వామి వేణుగాన రవము సకల జగతి ధ్వనియిస్తూ విశ్వవీధి విహరింపగ వీడు వెడల పిలచుచుండె వీనులకది వినబడనే వేయుచున్న అడుగులెల్ల వేణుగానలోలు శుభా వాసమందె అని ఎరిగితి అతడే గద వాహినులు అతడే గద జలనిధియు అంబునిధికి రేవు కూడ అతడే గద! అతడే గద!! షెల్లీ మత మతని జీవి తముతో బాటుగ నెదిగెను. షెల్లీ కా సిద్ధాంతీ కరణము గావింపగబడి ఇవ్వబడ్డ స్థిరమౌ విష యమ్ము కాదు మహాకవుల మతం సృష్టియత్నమున లభించు ఆనందముతో మాత్రమె సత్యమ్మును దర్శింపగల సృజనశీలమైన మనసు షెల్లీది. సత్యమ్మును ఎవ్వరికీ వారి విశి ష్టపు ప్రతీకలోని కనువదించు కొనుటవల్ల సత్యదర్శనమ్ము చేయ గల్గుటయే నిజము అయిన సృష్టికళ. 5 అట్టి సత్య దర్శనాన్కి మానవసాంగత్యమ్మే మానవుడికి ఉత్తమావ కాశమిచ్చు సామాజిక మాతని సామూహిక సృష్టిని దాని ద్వార అతని సా మాజిక వ్యక్తిత్వము తన సత్యపు సౌందర్యమ్ముల, తన ప్రయోజకతను మాత్ర మే ప్రకటించిన యట్లె తేను ఆ సమాజమొక్క కానబడని తారవోలె మూగగుండు కానీ శిథి లావస్థనె గాని సమా 419 జమ్ము అట్టులుండిపోవ టమ్ము జరుగ దెప్పుడయిన సామాజిక మానవాళి చేయు సమష్టి క్రియాక లాపము మూలాన సమా జమ్ను తనకు వ్యక్తిత్వము, చైతన్యము - రెండు నిండు గాను ఉన్న ఆత్మ ఒకటి ఉన్నదంటూ ఎల్లవేళ సూచిస్తూనే ఉన్నది. కడు విశాలమౌ సామా జిక వ్యవహారపు జీవిత మందు గూడ మనుజ జాతి తమ అఖండతను రహస్య స్పర్శననుభవించుచునే ఉన్నారు. ఈ ఏకా త్మకతా జ్ఞానము నుంచే మనుజజాతి అంతమునకు భగవద్భావమును జేరు కో గల్గిరి. అందువల్ల ప్రతి మతమును ఆ ఆ జా తుల విశిష్ట భగవద్రూ పములనుండియే జనించి నది అని చెప్పంగవచ్చు. మన నాగరకతలన్నీ మొట్టమొదట సమాధాన మును చెప్పం గావలసిన ప్రశ్న తమకు ఏ ఏ సం పదలు ఎంత ప్రమాణంలో ఉన్నవనుట కాదు, కాదు తాము చెప్పదలచినదేదో, దానినెట్లు చెప్పదలచు చున్నారో అనునట్టిది ఒక్క సమాజమ్ములోని ప్రజలు తమ్ము నియమముగా వించుకోని, తమకు నొక్క టైన సమగ్రతను ఇవ్వ గా గలిగిన ఆధ్యాత్మిక జీవన సరళిని నిర్ల క్ష్యము చేసిన, సరుకుల ఉ త్పత్తి వ్యాప్తులు, ఆదా య వ్యయాలు ఒక్క సరళ రేఖ ననంతమ్ముగాను, పొడిగించినయట్లు గాను నిరంతరము సాగుచునే ఉండవచ్చు” ఒక్క అసంపూర్ణత పరి ధుల ననంతముగ పెంచుట యే వృద్ధికి కాదర్ధము సమగ్ర తొకటి తనకంటే గొప్పదైన మరియొక సమ గ్రతవైపునకున్ముఖమై ప్రవహించుటె పెరుగుదలకు అర్థమ్ము. జీవజాల 420 వావిలాల సోమయాజులు మంతయు తమ జీవితాల ఇట్టి సమగ్రతలతోనె ప్రారంభముగావించును. పసిబిడ్డకు సైతము పని వానిలోన ఉండునట్టి దౌ సమగ్రతుంటున్నది పసిబిడ్డడు పూర్ణుడైన మనుజుని వలె కన్పించుట ఏహ్యమైన దృశ్యమ్ము జీవితమొక అంతరాయ రహతమ్మో సమ్మేళన ప్రక్రియయే గాని అంతు లేని కూడికలతో నున్న సమ్మిశ్రణ కాదెన్నడు. సంపద ఉత్పన్నమగుట, భోగమ్ములు, ఒక సృష్ట్యా త్మక మౌనా దర్శముతో మేళవింప బడిన యెడల అవ్వి అట్టి పరిపూర్ణత నందుకొనును. కాకయున్న అవి శాశ్వతముగను, అసం పూర్ణముగను నుండిపోయి నట్టి రూపములుగ కాను పించు చుండు. అట్టివి రైలు పట్టాలే ఉండి స్టేషన్ మా త్రమ్ములేని రైల్వేయిం జనును బోలి ఉంటుంది. మహాకవుల మతం అవ్వి నిగ్రహింపబడని శక్తులవలె చండమైన సంఘర్షణ వైపుకు పరు గిడటమ్మె, విపరీతం గా కృషి నొనరించి అలసి పోయిన యంత్రము వోలె హ ఠాత్తుగాను పడిపోవుటొ జరుగుతుంది. సృష్టి ద్వార మానవుండు తన సత్యం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రక్రియలో ఆతడు తనదు పూర్వ పరిపూర్ణత తిరిగి ఎంతో పూర్ణంగా పొందుతూనె ఉంటాడు. మానవుండు తన్ను తాను పరిపూర్ణంగా వ్యక్తము చేసుకొనుటకే సమాజ మేర్పడింది. ఈ వ్యక్తీ కరణ తనదు పరిపూర్ణ స్థాయి ననుసరించి మనుజు నందలి దివ్యత్వపు పరి పూర్ణ దర్శనమ్ము వైపు అతని నడిపిస్తుంది ఈ సత్య వ్యక్తీకర ణము అస్పష్టముగ నున్న మానవుడికి తనయందలి అనంతత్వమ్మున విశ్వా 421 సమ్ము సన్నగిలి ప్రాపం చిక ఘనతయె పరమాశయ మైనట్లుగ మిగులుతుంది. అనంతత్వ మందున వి శ్వాసమున్న అద్ది సృష్టి శీలమౌను. అర్థ సఫల తార్థమైన కాంక్షయ్ ని ర్మాణశీలమౌను. ఇందు రెంట నొక్కటతని గృహము రెండోదాతనిదౌ కా ర్యాలయమ్ము అన జెల్లును మనుజు నవసరముల సం ఖ్యాకముగా వృద్ధి నొందు టను నాగరకతయును బ్ర హ్మాండమైన కార్యాలయ మటులమారి గృహము దాని క్కొటైన అనుబంధపు రూపొందుచునుంటున్నది. భౌతిక ప్రాభవము కొఱకు ప్రాకులాడుటకు, నత్యధి క ప్రాముఖ్యమ్మేర్పడుటను సమాజమ్ము శూద్ర భావ మును గ్రహించి ఉంటున్నది. ఒక యుద్ధంలో పాల్గొన టమ్ముతోటి మహాక్షత్రి యుడు విజయము కంటే మిన్న అయిన స్వధర్మాన్ని, ఆత్మ 422 గౌరవాన్ని ఆదర్శం గా భావిస్తున్నాడు. కానీ ధన సంపాదన పరుడు అయిన శూద్రున కా యుద్ధంలో పాల్గొనటం లో విజయమే లక్ష్యమ్ము. కేవలము ప్రయోజనమే కాని అన్యమైన వైన ఏ ఇతరాదర్శాలకు బద్ధుడుగా నట్టివాని శూద్రుండని అంటారు శారీరక క్రియలు గాని, మానసిక క్రియలు గాని తమ పరమావధిగ నుండి మానవతా సమగ్రతయె లోపించిన నగ్నయాంత్రి కపు పరికరములను బోలు నట్టి వారికీ “శూద్రులు” అను నామం వర్తించును. నగ్నంగా నడయాడే కేవలమౌ మేధస్సులు, జీర్ణకోశములను బోలి నట్టివారు ఎదురైతే అప్పుడు “ఓ భగవంతుడ కరుణ ఉంచి వీరిని కొం చెము జీవముతో, సౌంద ర్యమ్ముతోటి ఆచ్ఛాదన వావిలాల సోమయాజులు గావింపుము తండ్రి" అంటు ఆక్రోశింపగవలె అని అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని పరికించే సందర్భాలల్లో షె ల్లీ కవీంద్రునకు నా పర మాత్మ దర్శనాన్కి మారు పేరు అయిన సౌందర్యపు దర్శనమ్ము లభించింది అప్పుడతడు అతడి వి శ్వాసము నిటు తెలియజేసె "చిరతరమౌ దాస్య శృంఖ లపు పరిధిని దాటజేసి ఇత్తువు అనే ఆశ తో మేళవితమ్ము గాని హాసరేఖ మదీయాధ రమ్ము పైన నాట్యమాడ లేదే ఈ నాడుగూడ" ఇదే షెల్లి కవికి ననం తుని యందున కల్గినట్టి విశ్వాసము. ఇది ఆతనిని వర్తమాన ప్రయోజనము సాఫల్యము రెంటికి నా వలన నున్న స్వేచ్ఛాపరి పూర్ణతలను లోకము వై పునకే నడిపించింది. పరమేశ్వరునందలి యీ విశ్వాసము ముక్త్యాద ర్శపువాస్తవికతలందలి విశ్వాసమె. ఇది మానవ లోకంలో ఉత్తమమౌ సృష్టి సర్వమునకును కా రణభూతము అయి ఉన్నది. అంతులేని మార్పులనే మలుపులున్న వక్రమార్గ మందు నిరవధికముగాను పయనించుట వాంఛనీయ మేగాకను నిష్ఫలమ్ము సైతమ్మును. కేవల స్వర ప్రస్తారంలో అంత ర్గతముగ ఒక సంగీతపు భావన ఉన్నప్పుడే అది గానము అవుతుంటుంది. పరిపూర్ణత దైన పరమ సత్యమునందలి దౌ మన విశ్వాసమె ఆ సంగీ తపు భావన. అదియే నా గరకతలో ఉన్న గొప్ప సృజన శక్తి. ఇది జాగృత మెపుడు కాదొ అపు డైశ్వ ర్యాధికారములయందున విశ్వాసము దాని స్థాన మాక్రమించు. భౌతిక శ క్తులయం దీ విశ్వాసము మహాకవుల మతం 423 ఘర్షణలకు దారి తీస్తు వినాశమ్ము. నా చరిస్తు నక్షత్రపు కాంతి ననుక రించు మతాబాలవోలె ఒక్కమారు ఉజ్వలముగ వెలిగి హఠాత్తుగను నుడిగి పోయి నాశనమ్ము నొంది బూడిద అయిపోతుంది. 6 అనాదిగాను ఘనవిశ్వా సము నిండిన 'మహనీయులు' సర్వమ్మును నున్నతమౌ నా దర్శమ్ముల వైపునకు పయనము గావించుడంచు మానవులను హెచ్చరిస్తు వచ్చినారు లౌకిక జను లవ్వారిని వీక్ష చేసి 'వారు లౌక్యమెరుగని వా' రెంటు అపహసించుచుంట సైతమనాదిగను జరుగు తునే ఉంది. కాని మాన వుని అందలి భావుకుండు అసంపూర్ణం (రవీంద్ర కవితకు అనువాదం) 424

వావిలాల సోమయాజులు