వావిలాల సోమయాజులు సాహిత్యం-1/ఆంధ్ర కామాయని
నివేదన
మా తండ్రిగారు శ్రీ వావిలాల సోమయాజులుగారు సాహిత్య రంగంలో ఎంతటి మహోన్నతులో స్వయంగా గ్రహించగలిగేంతటి సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయం గానీ ప్రవేశంగానీ మాకు లేదు.
వారు బహుముఖీన ప్రజ్ఞాధురీణులని, ఆంధ్రసాహిత్యాకాశంలో వారొక ధ్రువతార అని నాన్నగారిని చూడటానికి మా యింటికి వస్తూపోతూ ఉండే కవి, పండితులనేకులు అంటూ ఉంటే వింటూండేవారము.
నాన్నగారు ఈ 'ఆంధ్ర కామాయనీ' కావ్యాన్ని తమ సాహిత్య కృషికి తలమానికంగా భావించేవారు. దీనిని యథామాతృకంగానే కాకుండా, మాతృకకు వన్నెపెట్టే విధంగా, హిందీ రాని తెలుగువారికిది స్వతంత్రమైన ప్రౌఢసుందర కావ్యమనిపించే విధంగా రచించారని మా తండ్రిగారు చెబుతుండేవారు.
ఈ ఆంధ్ర కామాయనీ కావ్యాన్ని నాన్నగారు సుమారు పాతిక సంవత్సరాలకు పూర్వమే రచించారు. అప్పట్లో ఇది 'స్రవంతి' అనే మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఏ కారణంచేతనో మా తండ్రిగారు దీనిని పుస్తకరూపంలో వెలువరించకుండా చాలా కాలం ఊరుకున్నారు.
1992 జనవరిలో నాన్నగారు దివంగతులైనారు. అంతకు కొంత కాలం పూర్వం నుంచీ వారు అస్వస్థులుగా ఉన్నారు. అప్పుడు ఈ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని వారు వేగిరపడ్డారు. కాని ముద్రణ పూర్తి అయ్యీ కాకుండానే వారు కీర్తిశేషులు కావటం మా దురదృష్టం.
వారు ఈ కావ్యాన్ని విద్యన్మూర్ధన్యులు, బహుభాషా కోవిదులు, మృదుమధురకవితా ప్రియంభావుకులు, రసజ్ఞ శేఖరులు, సహృదయ సమ్రాట్టులు, మన ప్రియతమ భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ పి.వి. నరసింహారావుగారికి అంకితం చెయ్యాలని కాంక్షించేవారు.
వారి అభిమతాన్ని మన్నించి ఈ గ్రంథాన్ని తమకు అంకితం చెయ్యటానికి అనుమతించిన గౌరవనీయులైన శ్రీ పి.వి. నరసింహారావు గారికి శతసహస్ర కృతజ్ఞతాంజలులు. నాన్నగారికి ఈ గ్రంథ రచనాకాలంలో చేదోడువాదోడుగా ఉన్న సుప్రసిద్ధ హిందీ విద్వాంసులు శ్రీ చావలి కోటీశ్వరరావుగారికి మా కృతజ్ఞతలు. వారి తోడ్పాటును నాన్నగారిలా ప్రశంసించారు.
తొలి నారాయణభట్టు నన్నయకు సద్యుక్తిన్ నిగూఢార్థముల్ చెలిమిన్ దెల్పిన రీతి దెల్పి, యట నాచే నాంధ్ర కామాయనీ కలహంసన్ సృజియింపఁజేసిన లసద్గణ్యుండు, పుణ్యుండు చా వలి కోటీశ్వరరాయ విజ్ఞుని మహాప్రౌఢిన్ ప్రశంసించెదన్.
ఈ కావ్యానికి సుప్రసిద్ధ కవివర్యులు డాక్టర్ శ్రీ ఆచార్య తిరుమల గారు 'ఆంతర్యం' అందించారు.
శ్రీ ఆచార్య భీమసేన్ 'నిర్మల్ గారు, (ఎమిరిటన్ ప్రొఫెసర్, హిందీ శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు) 'ప్రశంస' సంతరించారు. ఈ ఇరువురు పెద్దలకు మా నమస్కృతులు.
పాతిక సంవత్సరాల నుండి 'ఆంధ్రకామాయని' వ్రాతప్రతిని నాన్నగారితో పాటు పఠించి, అక్కడక్కడ కొన్ని మార్పులు, చేర్పులు సూచించి అక్షరసాలిత్యాలను సవరించి నాన్నగారికి మిక్కిలి తోడ్పడిన సుప్రసిద్ధ కవివర్యులు శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయులు గారికి మా నమోవాకాలు.
సుప్రసిద్ధ చిత్రకారులు, నాన్నగారికి శిష్యులు శ్రీ మారేమండ శ్రీనివాసరావు గారు అడిగినదే తడవుగా ఈ గ్రంథాన్ని అందమైన ముఖచిత్రంతో అలంకరించారు. వారికి మా అభినందనలు.
ఈ గ్రంథాన్ని చక్కగా ముద్రించి ఇచ్చిన 'వెల్కమ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు' వారికి మా సాధువాదములు.
నాన్నగారి ఈ కృషిలో ఇంకా ఎందరో విద్వద్వరేణ్యులు కవి తల్లజులు సహకరించి ఉండవచ్చును. వారందరినీ గూర్చి తెలియని మా అజ్ఞానాన్ని మన్నించ ప్రార్ధన. ఈ కృషిలో నాన్నగారికి సహకరించిన ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు.
ఇట్లు
వావిలాల బృహస్పతి
వావిలాల ఉమాపతి
వావిలాల గౌరీపతి
ఆంతర్యం
మహా విద్వత్కవీంద్రులైన బ్రహ్మశ్రీ వావిలాల సోమయాజులు గారు రచించిన ఈ “కామాయని” ఆంధ్రానువాద కావ్యం - ఒక వైదిక పారిజాతం, ఒక పౌరాణిక గాథారత్నం. ఒక ఐతిహాసిక భ్రమర విన్యాసం, ఒక కాల్పనిక ఊహా సౌందర్య శిల్పం!
మహాకవి జయశంకర్ ప్రసాద్ ప్రణీతమైన హిందీ “కామాయని” - గర్భిత మహాకావ్యం. ధర్మ సమ్మితమైన కామాన్ని రసవంతంగా వర్ణించే కావ్య కళా ఖండిక. అది తుల్య స్త్రీ, పురుషాధికార సంపన్నులైన శ్రద్ధా మనువుల ఇద్ద చరిత్ర. ఇందులోని దైవీయ, సౌర, భౌమ, శక్తుల అంతర్యామ సంగమం - ఒక మహాశ్చర్యకర విశేషం!
ఇటువంటి మహత్తర కావ్యానువాదానికి కేవలం శబ్దగత పరిజ్ఞానం చాలదు. భాషాగత విశేషపరిచయం చాలదు. అంతర్గత భావనా వైశిష్ట్య మర్మజ్ఞత కావాలి గాఢమైన శ్రద్ధ కావాలి, ప్రజ్ఞాపాటవం కావాలి, నాన్యతో దర్శనీయమైన సామర్థ్యం కావాలి తాత్వికమైన రహస్యాన్వేషణ కావాలి. ఇన్ని శక్తుల ఏకీకరణ రూపం శ్రీ సోమయాజులు గారు. సోమయాజులు గారివంటి వారు తప్ప ఇతరులిటువంటి అనువాదాలు చేయలేరు.
ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో భావకవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే నవ్యసాహిత్యం నడుస్తున్న రోజుల్లో భావకవిత్వం - విపులంగా గానీ, సుదీర్ఘంగా గానీ, కథా కథనాత్మకంగా గానీ, ప్రాబంధికంగా గానీ లేదు. ముక్తక ప్రాయంగా ఖండ కావ్య సదృశంగా ఉండేది. అది నిజంగా ఒక లోపం. ఆలోపం శ్రీ వావిలాలవారిని చాలా కలవరపెట్టింది, స్పందింపజేసింది. ఆ స్పందన వారి దృష్టిని జయశంకర్ ప్రసాద్ “కామాయని” మీదికి ప్రసరింపజేసింది. భావుకతా బహురస పరిశోభితం, నవ్యాతి నవ్యమైన ఆ కావ్యం వావిలాల వారి హృదయాన్ని ఆకర్షించింది. ఆయన మహా కవిత్వానువాద దీక్షావిధి ఒక తపస్వి అయ్యారు. ఆ తపఃఫలమే ఈ ఆంధ్ర “కామాయని”. నవ్యతా ప్రియులైన తెలుగువారి కిదొక అక్షర వరం! ఒక అవ్యయ స్వరం. ఈ ఆంధ్రకామాయని రచనకు వావిలాల వారికి సుమారు సంవత్సరన్నర పట్టింది. తర్వాత 1964-67 లలో ఇది "స్రవంతి" పత్రికలో ధారావాహికంగా ప్రచురింప బడింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ యిలా యీ పుస్తక రూపంలో..! ఇది వావిలాల వారి ఆత్మాభిమానానికి, రాజసప్రవృత్తికి తార్కాణం!
ఈ కావ్యంలో చింత, ఆశ, శ్రద్ధ, కామము, వాసన, లజ్జ, కర్మ, ఈర్ష్య, ఇడ, స్వప్నము, సంఘర్షణము, నిర్వేదము, దర్శనము, రహస్యము, ఆనందము, అనే 15 శీర్షికలతో విభాగా లున్నాయి. 'ఇడ' అన్వేషణారూపంలో ఉంది. కాస్తంత లోతుగా ఆలోచిస్తే ఈ పేర్లన్నీ మానసిక చిత్త వృత్తులకు పెట్టినవే అని తెలియకపోదు. మనసు ఒక అవ్యక్త మధుర జీవన గానం! అందుకే ఈ కావ్యాన్ని వావిలాల వారు “తేటగీతి”లో నడిపారు. మధ్యలో 'శ్రద్ధ' ఆలపించిన “రగడ" కూడా మధుర గేయమే. - భారతీయ వైదిక వాఙ్మయంలో 1. స్వాయంభువుడు, 2. స్వారోచిషుడు 3. ఉత్తముడు, 4. తామసుడు 5. రైవతుడు 6. చాక్షుషుడు 7. వైవస్వతుడు 8. సూర్య సావర్ణి 9. దక్ష సావర్ణి 10. బ్రహ్మ సావర్ణి 11. ధర్మ సావర్ణి 12. రుద్ర సావర్ణి 13. దేవ సావర్ణి 14. ఇంద్ర సావర్ణి అని 14 మంది మనువులున్నారు.
మన స్థానీయమైన ఈ చతుర్దశ మనుచరిత్రల్ని ఆధి భౌతిక, ఆధి దైవిక ఆధ్యాత్మిక సంస్థాగతం గానూ, జీవేశ్వర వ్యూహాత్మకంగానూ తెలుసుకోవలసి ఉంది. ఆ “మను” వంశ “ప్రవర” ఒకానొక తాత్విక భావ “వరూధిని”!
అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవ విశేషాన్ని ప్రబంధీకరించాడు. శ్రీ వావిలాల వారు ఈ కావ్యం ద్వారా "వైవస్వత" మను దర్శనం చేయించారు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కదా!
గీతాచార్యుడు జ్ఞానయోగంలో -
"ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్” అని ఎవరిని కాలాత్మకంగా గుర్తుచేసుకున్నాడో-ఆ వివస్వతుని కుమారుడే ఈ కావ్య కథానాయకుడు వైవస్వతుడు. ఇతడు “శ్రద్ధా” న్వితుడు. ఇతనిని గూర్చి ప్రత్యేక 'శ్రద్ధ' తో అధ్యయనం చేస్తేనే గానీ తర్వాత వచ్చే సూర్య, దక్ష, బ్రహ్మ, ధర్మ, రుద్ర, దేవ, ఇంద్ర బలాలు అర్థం కావు. అవన్నీ అంతరంగ తరంగాలు! ఈ మనువుల అంతరాలే మన్వంతరాలు! ఈవిషయాల్ని పురాణాలు విభిన్న కోణాల నుండి నిరూపించాయి. ఆ అధ్యయనం ధర్మ కామన! ఇది కామాయనీ మహదక్షర ఖేలన! దీక్షతో వావిలాల వారు సాధించిన ఈ మహా కావ్యానువాదంతో తెలుగు సాహిత్యానికి కథాకథన విశిష్టతా వైచిత్రాల్లోనూ, భావనా భంగిమలోనూ, శైలీ వాల్లభ్య సంచయనాల్లోనూ, శబ్దఘటనా సామర్థ్యం లోనూ ఎన్నెన్నో నవ్యతలు లభ్యమయ్యాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంతే కాదు భావకవితా వైశిష్ట్యం, భారతీయ రూపగుణ నిరూపణం ఇందులో చోటుచేసుకొని వుండటం ముదావహంగా భావిస్తున్నాను. రమ్యపాపం, అశ్రుమయ హిమానీ హాలహలజలం, కరుణా మనోజ్ఞ మౌనం, చంద్రికా పరీరంభ నీలమేఘం, పుష్పక్రీడ, అంత్యకిరణం, దీపికాజ్వాల యుమి సెడు దీప్తులు, ప్రణయ శిల, విలాసధార, లోకాగ్ని - మొదలైన ప్రయోగాలు గిలిగింతలు పెడుతున్నాయి. “కామము”, “వాసన” ఖండికల్లో భావకవిత్వం పరాకాష్ఠ నందుకొంది. మిగిలిన ఖండికల్లో వెన్నెల్లా పరచుకొని ఉంది. ప్రేమ సంప్రాప్తికి మనోభీష్టానికి ఘర్షణ నిరూపించబడింది. తే. అచలము న నంత మగు వీచికాళి మీది నాసనమువేసి కూర్చుంటి వయ్య స్వామి! శ్రమ కణమ్ముల పోల్కి తారకల నిటుల నిదె యొడలి నుండి జార్చె దీ వెవర వయ్య!! మొదలైన పద్యాల్లో ఎంత ఆహ్లాదకరమైన కవిత్వం ఉందో తే. లీలఁ బ్రళయమునను మిగిలితిమి మనము పొందదెఁ బునస్సమాగ మానంద మిపుడు శూన్య జగతీ ఘనోత్సంగ శుభ్ర తలిని నొలయు కలయికకు మిగిలియుంటి మిచట !! మొదలైన పద్యాల్లో అంత అగాధ భావ తీవ్రత ఉంది. ఈ కావ్యంలో లౌకిక పారలౌకిక కామ స్వరూప చిత్రణ, దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా జరిగింది. “రహస్య” మనే ఖండికలో మాయను గూర్చి అజ్ఞానాన్ని గూర్చి జ్ఞాన కర్మల్ని గూర్చి బుద్ధియోగాన్ని గూర్చి చేసిన ప్రస్తావన కావ్యాన్ని శిఖర స్థాయిని నిల్పుతున్నాయి. మనసుని గూర్చి ఎన్నెన్నో ధ్వనిగర్భిత మైన శబ్దాలు ఈ పద్యాల్లో ఉన్నాయి. ఆంధ్ర కామాయని 463 కామాయని విశ్వమంగళ కామన-విమల మానస తట వీథి జ్యోతిష్మతి గతిగ సంఫుల్ల లతిక గతిగ నిలిచిన ఆమె, నిత్యసుందర, సతత సత్య భూరి చైతన్య శుభ మహాపుణ్య వపువు! తే. భేద భావాళి సర్వమ్ము విస్మరించి దృశ్యముగఁ జేసి సుఖ దుఃఖ హేల నెల్ల "నేనె యిది" యను మీ వోయి మానవుండ! విశ్వమే నీకు నీడ యై వెలయు నయ్య!! అన్నది కామాయనీ కవితా హృదయ సందేశం! ఈ సందేశం వినినప్పుడు నేత్రాల్లో ప్రేమజ్యోతి ప్రతిఫలించకుండా ఎలా వుంటుంది ? "దేవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తితే” దురత్యయమైన ఈ మాయను తరించి ఆనందాన్ని పొందటానికే మనసుని అధ్యయనం చేయటం, ఎందుకంటే, “మన యేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" కదా! “చంద్రమా మనసో జాత" చంద్రుని నుండి మనసు పుడుతూ వుంది. ఎలా? వైజ్ఞానికంగా చంద్రుడు ప్రజ్ఞానాత్మ. రేతః, యశః, శ్రద్ధా - అనే మూడు చంద్రునిలోని మనోజ్ఞతలు. అందుకే మనువు - శ్రద్ధల బంధంలో వైదిక రహస్యం ఉంది. చాంద్రరసాన్ని 'శ్రద్ధ' అంటారు. ఇది దివ్యమైన ఆదిత్యాగ్నిలో హోమమై 'సోమం' గా మారుతుంది. ఈ సోమం, పర్జన్యాగ్నిలో హోమమై వర్ష రూపంలో పార్థివాగ్నిలో ఆహుతి కాగా ఓషధులు పుడుతున్నాయి. ఇవి ఆధ్యాత్మిక వైశ్వానరాగ్నిలో ఆహుతాలై రసాసృగాదిరూపాలు పొంది చివరికి “శుక్ర” రూపం పొందుతుంది. ఈ అన్న రూప శుక్రంలో చాంద్ర శ్రద్ధామయ సోమం, అంతరిక్ష వాయువు పార్థివ మృద్భాగం ఉంటాయి. విశకలన ప్రక్రియ చేత శుక్రంలో పార్థివ ధాతువు వెళ్లిపోగా, మిగిలిన వాటిని “ఓజస్సు” అంటారు. వాయు తత్త్వం పోగా మిగిలే సుసూక్ష్మ శ్రద్ధామయ సోమరసమే “మనస్సు”! "అన్నమయం హి సౌమ్య మనః" - విశ్లేషిస్తేనే గానీ మను చరిత్రలు గానీ, కామాయని కావ్యాలు గానీ అర్థం కావు. తాత్త్వికాభి నివేశం లేని 464 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 వారు మన పురాణ వాఙ్మయం మీదికి పోవటం అనవసరం. వేదోపబృంహణాలైన యివన్నీ ఆత్మవిద్యలు. ' ఆత్మ' అన్నదే తెలియక పోతే తదితరా లెలా తెలుస్తాయి? ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసశ్చ పరాబుద్ధిః బుద్ధిరాత్మా మహాన్ పరః మహతః పర మవ్యక్తం అవ్యక్తా త్పురుషః పరః పురుషాన్నపరం కించిత్ సాకాష్ఠా సా పరాగతిః !! వంటి కఠోక్తులెలా దృశ్యమాన మవుతాయి? "అమల చిత్ర జీవిత వికాసాత్త మధుర వర మహానంద శక్తి ప్రవాహ మిద్ది” అన్న వావిలాల వారి ఆంతర్యం మాత్రం ఎలా పట్టుబడుతుంది ? శ్రద్ధా సూత్రం తోనే జ్ఞాన నేత్రం విచ్చుకొనేది. “యదేవ శ్రద్ధయా కరోతి తదేవ వీర్య వత్తరం భవతి" మనోధర్మమే వీర్యం. ఈ మనోధర్మ సాధనే ఈ కామాయనీ కావ్య పరమార్థం! ఈ కావ్యం - 'చింత' తో మొదలై 'ఆనందం' తో ముగియటంలోని అంతర్యం కూడా మానవతా ధర్మ నిరూపణమే! అందుకే యిది మహాకావ్య మయ్యింది! వావిలాల వారు 'సోమ' యాజులయ్యారు! హైదరాబాద్ 18-11-91 ఆంధ్ర కామాయని నమస్కారములతో, విద్వజ్జన విధేయుడు, ఆచార్య తిరుమల 465 ప్రశంస హిందీ సాహిత్యచరిత్రలో భక్తికాలాన్ని (14 నుండి 16 శతాబ్దం) స్వర్ణయుగం అంటారు. అదే విధంగా ఆధునిక హిందీ సాహిత్యంలో ఛాయావాద కావ్యయుగం (1913 నుండి 1936 వరకు) స్వర్ణయుగం. ఛాయావాద మూల స్తంభాలయి, బృహత్రయి అని పేరొందిన ప్రసాద్, పంత్, నిరాలాలు, లఘుత్రయి లేక వర్మాత్రయి అని పిలువబడ్డ మహాదేవి వర్మ, రామకుమార్ వర్మ, భగవతీ ప్రసాద్ వర్మలు - ఈ ఆరుగురేగాక ఎంతో మంది ప్రఖ్యాత కవులు, ప్రేమచంద్ లాంటి విశ్వవిఖ్యాత కథా రచయితలు, ఆచార్య రామచంద్ర శుక్ల, శ్యామ సుందర దాసువంటి విమర్శకోత్తములు, తమ రచనా వైశిష్ట్యంతో హిందీ భారతిని సమ్యక్ రీతిలో సమర్పించిన ఛాయావాదయుగాన్ని స్వర్ణయుగం అనడంలో అతిశయోక్తి ఏ మాత్రం కాదు. ఛాయావాద కావ్యాన్ని మన తెలుగు సాహిత్యంలోని భావ కవిత్వంతో పోల్చవచ్చు. కావ్య లక్షణాలూ, ప్రవృత్తులూ అనే. సౌందర్యోపాసన, ప్రకృతి మానవీకరణం, ప్రకృతి నిత్య సాహచర్యంపట్ల ఆసక్తి, వైయక్తిక అత్మాభివ్యక్తి మొదలయినవి ఛాయావాద కావ్యంలోను, భావ కవిత్వంలోను సమతూకంలో కనిపిస్తాయి. అందుచేతనే కొంతమంది పరిశోధకులు ఈ రెండు కవితాధోరణులను సరిపోలుస్తూ, పరిశోధనా వ్యాసాలు వ్రాసారు. ఇటువంటి ఛాయావాద కావ్యయుగంలో 'కామాయనీ' మహాకావ్యం ఉత్తుంగ హిమశృంగం లాంటిది. ఛాయావాద ప్రవృత్తులకు ఆలంబనమయిన మహాకావ్యం ‘కామాయనీ' అయితే 'ఆంసూ' ఛాయావాద కవితా ప్రవృత్తులకు అద్దం పట్టే ఖండకావ్యం. 'కామాయనీ' ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక విమర్శకుడు సమస్త హిందీ సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయినా, 'కామాయనీ' లోని 'లజ్జా' సర్గంలోని ఒక్కపుట మిగిలి ఉంటే భావితరంవారు హిందీ సాహిత్యం సుసంపన్న మయినదేనని భావిస్తారని అన్నాడు. అట్టి మహత్కావ్యం 'కామాయనీ', ఖండకావ్యం 'ఆంసూ' రెండింటిని తెలుగు కావ్య రసజ్ఞులకు అందించడంలో బ్రహ్మశ్రీ నావిలాల సోమయాజులు గారు కృత కృత్యులయ్యారు. ఇంకో విశేషమేమిటంటే జయశంకర ప్రసాదు రచనల్లో 'అంసూ' ప్రారంభ దశకు చెందినది. 'కామాయనీ' ప్రౌఢదశకు చెందినది. సోమయాజులుగారు కూడా తమ చిరుత ప్రాయంలోనే 'ఆంసూ'ను 'కన్నీరు' అనే పేరిట తెలుగులోనికి 466 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 అనువదించి, ప్రౌఢవయః పరిపాకదశలో 'కామాయనీ' అనువాదం చేసారు. మూలం లోని కావ్యసౌందర్యాన్ని యథాతథంగా తెలుగు పాఠకులకందించిన శ్రీ సోమయాజులు గారు ధన్యజీవులు. ఛాయావాద యుగంలో లాక్షణిక పదప్రయోగాలతో కూడి, విశిష్ట ప్రత్యభిజ్ఞానం, సమరసతావాదాన్ని ప్రపంచించే ఈ మహత్కావ్యాన్ని అనువదించడానికి చాలా మంది ప్రయత్నాలు చేసారు. దాదాపు 20-25 సంవత్సరాల క్రితమే పూజ్యులు శ్రీ సోమయాజులు గారు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కొన్ని పద్యాలను కీ॥శే॥ కవి సామ్రాట్టులయిన నోరి నరసింహశాస్త్రిగారి సన్నిధానంలో నేను వినడం తటస్థించింది. తరువాత ఆ పద్యాలు (మరి కొన్ని కూడా) 'స్రవంతి'లో రెండు మూడు సంచికల్లో ప్రచురితమయ్యాయి. కారణాంతరాలవల్ల ఈ సత్ప్రయత్నానికి విఘ్నాలు ఏర్పడడంతో ప్రచురణ కార్యక్రమం ఆగిపోయింది. ఆరోజుల్లోనే మాన్యులు శ్రీ అయాచితుల హనుమచ్ఛాస్త్రిగారు (ఆ రోజుల్లో వారు అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో హిందీ ఉపన్యాసకులుగా ఉండేవారు) కూడా ఈ ప్రయత్నం చేసారు. వారు వర్ణవృత్తాలలో, ఛందోబద్ధంగా చేసిన అనువాదంలో కొంత భాగం 'స్రవంతి'లో ప్రచురింపబడింది. సమ్మాన్యులు డా॥ ఇలపావులూరి పాండురంగారావుగారు 1973లో ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత కీ॥శే॥ శ్రీ యం.ఎన్. రావు గారి ప్రోద్బలంతో ఈ కావ్యాన్ని మాత్రా ఛందస్సులో ఆంధ్రీకరించారు. అది 1974 జులై నెలలో అచ్చయింది. ఈ నాటికి శ్రీ వావిలాల సోమయాజులుగారి కృషి ఫలించి 'కామాయనీ'కి వారు చేసిన ఛందోబద్ధమయిన అనువాదం పుస్తక రూపంలో అచ్చవడం ఎంతో ముదావహం. శ్రీ సోమయాజులుగారు తెలుగులో గద్యపద్య రచన చేసి, విశిష్టమయిన గౌరవ ప్రతిపత్తులను సముపార్జించుకున్న వారు. మౌలికమయిన రచనలు వెలయించిన సోమయాజులు గారు అనువాదరంగంలో కూడా తమ రచనా పాటవంతో, ప్రతిభా వైదుష్యాలతో పాఠకుల హృదయాలను ఆకట్టుకున్నారు. సంస్కృత, ఆంగ్ల రచనల అనువాదాలు చేయడమేకాక జాతీయ భాష హిందీలో తలమానికాలవంటి రచనలయిన 'అంసూ', 'కామాయనీ' కావ్యాలకు వారు తెలుగు చేసారు. అనితరమయిన దీక్షతో వారు చేసిన ఈ అనువాదం సాహిత్య ప్రియుల మన్ననలందుకుంటుందని నా విశ్వాసం. ఆంధ్ర కామాయని 467 అనువాదరంగంలో కావ్యానువాదం క్లిష్టతరమయినది. కావ్యంలో భావ స్ఫూర్తితోపాటు, శబ్దప్రయోగ వైచిత్రికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అనువాదకుడు భావ సౌందర్యంతోపాటు, శబ్ద రమణీయతను కూడా అభివ్యక్తీకరించాలి. జయశంకర ప్రసాదువంటి మహాకవి, లాక్షణిక పద ప్రయోగం పట్ల మక్కువగల వ్యక్తి, తన రచనల్లో శబ్ద ప్రయోగానికి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చాడు. సోమయాజులుగారు మూలంలోని భావాన్నే గాక శబ్ద సౌందర్యాన్ని కూడా తమ తెలుగు అనువాదంలో తేవడానికి శ్లాఘనీయంగా ప్రయత్నించారు. ఉదాహరణకు 'చింత' సర్గలో మొదటి పద్యం. 'హిమగిరి కే ఉత్తుంగ్ శిఖర్ పర్ బైర్ శిలాకీ శీతల్ ఛాఁహ్, ఏక్పురుష, భీగే నయనోఁ సే దేఖ్ రహా థా ప్రలయ ప్రవాహ్ నీచే జల్ థా, ఊపర్ హిమ్ థా ఏక్ తరలాథా, ఏక్ సఘన్ ఏక్ తత్త్వకీ హీ ప్రధానతా కహో ఉసే జడ్ యా చేతన్ దీనికి సోమయాజులుగారి తెలుగు అనువాదాన్ని పరిశీలించండి. తే. 'తుహిన నగ శీర్షసీమ నుత్తుంగ శిఖరి నొక శిలా శీతలచ్ఛాయ నొంటి బురుషు డొక్క డుపవిష్టుడై కనుచున్నవాడు ఆర్ద్ర నయనాల బ్రళయ జలార్ణవమ్ము తే. క్రిందనీరము నుపరి బ్రాలేయ, మందు నొకటి తరల రూపమ్ము, వే టొకటి ఘనము ఏకతత్త్వ ప్రధానతే యిందురెంట 468 దాని జడమనుండు, మరి చేతన మనుండు' మరో ఉదాహరణను తిలకించండి. 'లజ్జ' సర్గాంతంలోని పద్యాలు 'దేవోఁ కీ విజయ్, దానవోఁ, కీ హారోఁ కా హోతా యుద్ధ రహా సంఘర్ష్ సదా ఉర్ అంతర్ మేఁ. జీవిత్ రహ్ నిత్య విరుద్ధ రహా. వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. ఆఁ. సూ సే భీగే ఆఁ. చల్ పర్ మన్కా సబ్ కుఛ్ రఖ్నీ హోగా తుమ్ కో అప్నీ, స్మిత్ రేఖాసే యహ్ సంధిపత్ర లిఖా హోగా, ఈ పంక్తులకు అనువాదాన్ని చూడండి. 'సమర మత్యంత తీవ్రమై సాగు నమర జన జయములకు, దను జాపజయములకును అనయమును బ్రవర్తిల్లు మానసాంతరమున గాఢ మౌచు వైరుధ్య సంఘర్షణమ్ము. తే. అశ్రు కణసిక్తమైన వస్త్రాంచలమున నుంచవలయు నెడందలో నున్నదెల్ల మధుర దరహాస రేఖతో మగువ ! నీవె ఈ సుసంధి పత్రమును లిఖింపవలయు 'కామాయనీ' చివరి సర్గ 'ఆనందం' లోని చివరి పంక్తులను పరిశీలించండి- “సమరస్ థే జడ్ యా చేతన్ సుందర్ సాకార్ బనా థా చేతనతా ఏక్ విలస్ తీ ఆనంద్ అఖండ్ బనా థా' ఈ పంక్తులకు అనువాదాన్ని గమనించండి- తే. 'జడము చేతన మయ్యెడ సమరసములు ఉండె సౌందర్య మచట రూపొందినట్లు ఒక్క చైతన్య మొలసె మహోజ్వలముగ నటనఖండ మహానంద మమరి యుండె'. సమరసతావాదాన్ని, సత్ చిత్ ఆనంద స్వరూపంగా పరిలక్షించిన మహాద్రష్ట, మహాస్రష్ట అయిన జయశంకర ప్రసాద్ గుండెలోతు లెరిగి, సోమయాజులు గారు చేసిన ఈ అనువాదం కావ్యానువాద ప్రియులైన పాఠకులకు అమితానందం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. 'కావ్యానువాదం అసంభవం' అనే ఆంధ్ర కామాయని 469 వారికి కనువిప్పు కలిగించే ఈ అనువాద కార్యాన్ని అతి సమర్థంగా నిర్వహించిన శ్రీసోమయాజులు గారు ధన్యులు. వారి కృషికి నా సాధువాదాలు, గౌరవ పురస్సర నమస్కారాలు. 1-1-405/7/1, Gandhinagar, Hyderabad-500 380 బుధజన విధేయుడు. Dr. Bhimsen 'Nirmal' Emeritus Professor, Dept. of Hindi Osmania University, Hyderabad-7 470 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
'ఆముఖం'
మానవులకు తొలిపురుషుడైన మనువు చరిత్ర, ఆర్యసాహిత్యంలో వేదములు మొదలు పురాణములు, ఇతిహాసములలో వ్యాపించి ఉన్నది. శ్రద్ధామనువుల సంయోగంతో మానవత్వపు వికాసకథను రూపకావరణంలో భావించే ప్రయత్నము అన్ని వైదిక ఇతిహాసములతో పాటు నిరుక్తముద్వారా కూడ ఏవిధముగా చేయబడినదో, గడచిన కాలంలో ఆవిధంగానే ప్రయత్నము జరిగియుండినప్పటికిని, మన్వంతరము యొక్క మానవత్వపు నవయుగ ప్రవర్తకుని రూపములో మనువుకథ ఆర్యుల అనుశ్రుతిలో దృఢముగా అంగీకరింపబడి యున్నది. అందుచేత 'వైవస్వత మనువు'ను చారిత్రక పురుషునిగానే భావించుట సముచితము. తరచుగ జనులు గాథకు ఇతిహాసమునకు మిథ్యా సత్యముల వ్యవధానమును భావింతురు. కాని సత్యము మిథ్యకంటే ఎక్కువ విచిత్రముగా నుండును. ఆదిమ యుగపు మనుష్యుల ప్రతియొక్క సమూహమును జ్ఞానో న్మేషపు అరుణోదయములో సంగృహీత మొనర్చిన భావపూర్ణ ఇతివృత్తములు నేడు 'గాథలు' లేక 'పౌరాణిక ఉపా ఖ్యానములు' అని వేరుచేయబడుచున్నవి. ఏలనన ఆ చరిత్రలతోపాటు మధ్యమధ్యలో భావనల సంబంధము కూడుకొని ఉన్నట్లు కన్పించును. ఘటనలు కొన్ని చోట్ల అతిరంజితముగ గన్పించును. తథ్య సంగ్రహకారిణియైన తర్కబుద్ధికి అట్టి ఘటనలయందు రూపకమును (ఐరిళీ రిజిలి) ఆరోపించుటకు సౌకర్యము కలుగుచున్నది. కాని వానిలో కూడ కొంత సత్యాంశము ఘటనతో సంబంధమైయున్నది అని అంగీకరింపవలసి యుండును. నేటి మనుష్యుల వద్ద వాని యొక్క ప్రస్తుత సంస్కృతియొక్క క్రమబద్ధమైన చరిత్రమాత్రమే యుండును. కాని వాని చరిత్రయొక్క హద్దు ఎక్కడ నుండి ప్రారంభమగునో సరిగా దానికి ముందు సామూహిక చైతన్యము యొక్క దృఢమైన, గహనమైన రంగులరేఖలతో గడచిన, ఇంకను పూర్వపు విషయముల ఉల్లేఖనము స్మృతిపటమున అంకితమై యుండును. కాని అది కొంచెము అతిరంజితముగా నుండును. ఆ ఘటనలు నేడు విచిత్రతాపూర్ణములై కాన్పించును. బహుశః ఇందువలననే మనము మన ప్రాచీన శ్రుతులకు నిరుక్తముద్వారా అర్థము చెప్పుకొనవలసి వచ్చెను. దాని వలన ఆ అర్థములు మన ప్రస్తుతాభి రుచితో సామంజస్యము నొందును.
శ్రద్దా మనువులు - అనగా మననముయొక్క సహకారముతో మానవత్వపు వికాసము రూపకమైనప్పటికిని, అది గొప్ప భావమయము శ్లాఘనీయమునై యున్నది. ఇది మనుష్యత్వము యొక్క మనోవైజ్ఞానిక చరిత్ర అగుటకు శక్తి కలిగియున్నది. నేడు మనము సత్యమునకు అర్ధము "ఘటన" అని చెప్పుకొనుచున్నాము. అయినప్పటికి దాని తిథిక్రమముతో మాత్రమే సంతుష్టినొందక మనోవైజ్ఞానిక అన్వేషణ ద్వారా చరిత్రయొక్క ఘటనలోనికి కొంత చూడగోరు చున్నాము. దాని మూలములో ఉన్న రహస్యమేది? ఆత్మానుభూతి, ఔను. ఆ భావము యొక్క రూపగ్రహణచేష్టయే సత్యము లేక ఘటనయై ప్రత్యక్షమగు చున్నది. ఆ సత్యములైన ఘటనలే స్థూల మరియు క్షణికములై మిథ్య మరియు అభావములుగా పరిణతిని పొందుచున్నవి. కాని సూక్ష్మానుభూతి లేక భావము చిరంతన సత్యము యొక్క రూపములో ప్రతిష్ఠితమై యుండును. దాని ద్వారా యుగయుగముల పురుషుల అభివ్యక్తి మరియు పురుషార్థముల అభివ్యక్తి జరుగుచున్నది.
జలప్లావనము భారతీయ ఇతిహాసములో దేవతలకంటే విలక్షణమైన, మానవుల యొక్క ఒక విభిన్న సంస్కృతిని ప్రతిష్ఠించుటకు మనువునకు అవకాశము గల్గించిన ప్రాచీన సంఘటన! ఇది చరిత్రయే. 'మనవే వైప్రాతః' ఇత్యాది వలన ఈ ఘటన యొక్క వర్ణన శతపథ బ్రాహ్మణానికి చెందిన 8వ అధ్యాయములో లభించుచున్నది. దేవగణముయొక్క ఉచ్ఛృంఖల స్వభావము, నిర్భాధాత్మ తుష్టియందు అంతిమ అధ్యాయము పొందెను. మానవభావము అనగా శ్రద్ధామనువుల సమన్వయము జరిగి ప్రాణులకు ఒక నూతన యుగపు సూచన లభించెను. ఈ మన్వంతరమునకు ప్రవర్తకుడు మనువు అయ్యెను. మనువు భారతీయేతిహాసమునకు ఆది పురుషుడు, రాముడు, కృష్ణుడు, మరియు బుద్ధుడు - ఈయన వంశీయులే! శతపథ బ్రాహ్మణములో ఆయన శ్రద్ధాదేవుడని చెప్పబడి యున్నది.
"శ్రద్దాదేవో వై మనుః" (కాం 1 ప్ర 1)
భాగవతములో ఈ వైవస్వత మనువు శ్రద్ధలతో మానవ సృష్టి యొక్క ఆరంభము భావింపబడినది.
"తతో మనుః శ్రద్ధాదేవః సంజ్ఞాయామాస భారత
(9-1-11)
ఛాందోగ్యోపనిషత్తునందు మనువు శ్రద్దల భావములక వ్యాఖ్యానము కూడ లభిం చుచున్నది.
"యథావై శ్రద్ధధాతి అధామనుతే నా - శ్రద్ధధన్ మనుతే” (7-19-1)
ఇది నిరుక్తపు వ్యాఖ్యవలెనున్నది.
ఋగ్వేదమున శ్రద్ధ, మనువు - ఈ ఇరువురు పేర్లు ఋషులవివలె కన్పించును. శ్రద్ధకు సంబంధించిన సూక్తము నందు సాయణుడు శ్రద్ధయొక్క పరిచయము నిచ్చుచు వ్రాసియున్నాడు.
"కామ గోత్రజా శ్రద్ధా నా మర్షికా”
శ్రద్ధ కామగోత్రము యొక్క బాలిక. అందుచేతనే శ్రద్ధ అనే పేరుతోబాటు ఆమె “కామాయని” అని కూడ పిలువబడుచున్నది. మనువు ప్రథమ పథ ప్రదర్శకుడు. మరియు అగ్నిహోత్రమును ప్రజ్వలితము చేయునట్టి మరియు నితరములైన అనేక వైదిక కథలకు నాయకుడు.
“మనుర్హవా అగ్రే యజ్ఞేనేజే యదనుకృతేమాః ప్రజ్ఞాయజస్తే" (5-1 శతపథ)
వీరిని గురించి వైదిక సాహిత్యమునందు చాల సంగతులు వెదజల్లబడి నట్లు లభించు చున్నవి. కాని వాటి క్రమము స్పష్టముగాలేదు. జలప్లావన వర్ణన శతపథ బ్రాహ్మణము యొక్క ప్రథమ ఖండమున (8వ అధ్యాయమున) ప్రారంభమగును. దానిలో వారి నావ ఉత్తరగిరియైన హిమవత్ప్రదేశమునందు చేరిన ప్రసంగము కలదు. అక్కడ ఓఘ జలావతరణము జరిగిన మీదట మనువు ఏ స్థలము నందు దిగెనో దానిని “మనోరవ సర్పణము" అందురు. - “అపీపరం వైత్వా వృక్షేనావం ప్రతి బధ్నీష్వ, తంతు త్వా మా గిరౌ సన్తముదక మన శ్చైత్సీద్ యావద్ యావదుదకం సమవాయాత్ తావత్ తావదన్వవసర్పాసి ఇతి సహతావత్ తావదేవా న్వవససరం. తదప్యేత దుత్తరస్య గిరే ర్మనోరవ సర్పణమితి. (8-1)
శ్రద్ధతో మనువు కలిసిన మీదట ఆ నిర్జన ప్రదేశమునందే నశించిన సృష్టిని మరల ఆరంభించుటకు ప్రయత్నము జరిగెను. కాని ఆసురపురోహితుడు లభించుటవలన (కలియుట వలన) ఆయన (మనువు) పశుబలిచేసెను. "కిలాతాకులీ ఇతిహాసుర బ్రహ్మవాసతు తౌ హోచతుః - శ్రద్ధా దేవో వైమనుః ఆవం ను వేదావేతి తౌ హాగత్యోచతుః। మనో యాజయాప త్వేతి”.
ఈ యజ్ఞము తరువాత మనువునందు జాగృతమైన పురాపరిచిత దేవ ప్రవృత్తి ఆయన ఇడ సంపర్కములోనికి వచ్చిన తరువాత ఆయనను శ్రద్ధయే కాక రెండవవైపునకు ప్రేరేపించెను. 'ఇడ' సంబంధమును గూర్చి శతపథమున ఇట్లున్నది. "ఆమె యొక్క ఉత్పత్తి లేక పుష్టి పాకయజ్ఞము వలన కలిగెను. ఆ పూర్ణయోషితను చూచి మనువు ఇట్లడిగెను, “నీ వెవరవు?" "నీ దుహిత" నని ఇడ ప్రత్యుత్తర మిచ్చెను. “నా దుహిత వెట్లయితివి?" అని మనువడిగెను. “నీ దధి, ఘృతాది హవిస్సులవలన నా పోషణ జరిగినది" అని ఆమె చెప్పెను”.
“తాం హ” మనురువాచ “కా ఆసి” ఇతి. "తవ దుహితా” ఇతి. "కథం భగవతి? మమ దుహితా" ఇతి. (శతపథ 6 ప్ర. 3 బ్రా)
మనువునకు ఇడపట్ల అత్యధికమైన ఆకర్షణ కలిగెను. మరియు శ్రద్ద నుండి కొంచెము దూరమయ్యెను. ఋగ్వేదమున ఇడ ఉల్లేఖనము చాల స్థలము లందు కన్పించును. ఈమె ప్రజాపతి మనువు యొక్క "ప్రథ ప్రదర్శిక” మనుష్యులను శాసించునది. అని చెప్పబడినది.
"ఇడా మకృణ్వన్మనుషస్య శాసనీమ్" (1-31-11 ఋగ్వేదము)
ఇడకు సంబంధించి ఋగ్వేదములో చాల మంత్రములు లభించును.
“సరస్వతీ సాధయన్తి ధియం న ఇడాదేవీ భారతీ విశ్వతూర్తి, తి స్రో దేవీః స్వధయావర్హి రేదమచ్చి ద్రంపాస్తు శరణం నిషద్య” (ఋగ్వేదము. 2-3-8)
“అనో యజ్ఞం భారతీ తూయ మేత్విడా మనుష్యదిహ చేతయన్తి, తిస్రో దేవీర్వర్హి రేదం స్యోనం సరస్వతీ స్వపనః సదస్తు" (ఋగ్వేదము 10-110-8) ఈ మంత్రముల యందు మధ్యమా, వైఖరీ, పశ్యంతీల ప్రతినిథియైన భారతీ సరస్వతీలతోపాటు ఇడ నామము వచ్చి యున్నది. లౌకిక సంస్కృతమున ఇడ శబ్దము పృథ్వీ అనగా బుద్ధి, వాణి మొదలైన వాటికి పర్యాయవాచకముగా నున్నది.
"గో, భూ, వాచస్విడా ఇలా" (అమరము) ఈ ఇడ లేక వాక్కుతో మనువు లేక మనస్సు యొక్క మరియొక వివాదము శతపథమున ఉల్లేఖింపబడి యున్నది. దానిలో ఇద్దరును తమతమ మహత్తు కొరకు పోట్లాడుకొందురు. “ఆఖాతో మనసశ్చ” ఇత్యాది (1 అధ్యాయము 5 బ్రాహ్మణము) ఋగ్వేదమున ఇడను బుద్ధిని సాధన చేయునట్టియు, మనుష్యునకు చేతనను ప్రదానము చేయునట్టియు 'ధీ' అని చెప్పియున్నది. పూర్వకాలమున బహుశః ఇడకు పృథ్వి మొదలైన వాటితో సంబంధమొనర్చ బడినది. కాని ఋగ్వేదము 5-5-8లో ఇడా సరస్వతులతో బాటు మహి యొక్క ఉల్లేఖనము స్పష్టముగా వేరుగా నున్నది. "ఇడా సరస్వతీ మహితిస్రో దేవీర్మయో భువః" వలన మహి నుండి ఇడ భిన్నమైనదని తెలియుచున్నది ఇడ “మేధస్ వాహినీ నాడీగా కూడ చెప్పబడినది.
బుద్ధివికాసము, రాజ్యస్థాపనము మొదలైనవి ఇడయొక్క ప్రభావముచేతనే మనువు చేసెనని ఊహింపవచ్చును. తరువాత ఇడమీద కూడ అధికారము చేయవలెనను ప్రయత్నము వలన మనువు దేవగణ కోపభాజనుడు కావలసివచ్చెను.
“తద్వై దేవానాం ఆగ ఆస” (7-4 శతపథము) ఈ అపరాధమునకై ఆయన శిక్ష ననుభవింపవలసి వచ్చెను.
“తం రుద్రో - భ్యావత్య వివ్యాధ” (7-4 శతపథ) ‘ఇడ' దేవతల యొక్క “స్వసా" బయుండెను. మనుష్యులకు చేతన ప్రధాన మొనర్చునట్టిది. అందుచేతనే యజ్ఞములలో 'ఇడాకర్మ' జరుగుచున్నది. ఇడయొక్క ఈ బుద్ధివాదము శ్రద్ధా మనువుల మధ్య వ్యవధానమును కలిగించుటలో సహాయక మయ్యెను. మరి బుద్ధివాదపు వికాసమున అధిక సుఖాన్వేషణము లో దుఃఖము లభించుట సహజము. ఈ ఆఖ్యానము ఇతిహాసములో రూపకపు అద్భుత మిశ్రణము జరుగునంత ప్రాచీన మైనది. అందుచేతనే మనువు, శ్రద్ధ, ఇడ-ఇత్యాదులు తమ ఐతిహాసి కాస్తిత్వమును ఉంచుకొనుచు సాంకేతికార్ధమును గూడ అభివ్యక్త మొనర్చినచో నాకే మియు నభ్యంతరములేదు. మనువు అనగా మనస్సు యొక్క రెండు పక్షములు హృదయము, మస్తిష్కము యొక్క సంబంధము క్రమముగ శ్రద్ధా ఇడలతో గూడ తేలికగా కలుగుచున్నది.
"శ్రద్ధాం హృదయ్య యా కూత్యా శ్రద్ధయా విన్దతే వసు" (ఋగ్వేదము 10-5-4)
వీటన్నిటి యొక్క ఆధారముననే “కామాయని” యొక్క కథాసృష్టి జరిగినది. ఔను “కామాయని” కథాశృంఖలమును కల్పుటకై అక్కడక్కడ కొంచెము కల్పనను గూడ ఉపయోగించు నధికారమును నేను విడువజాలక పోయితిని.
- జయ శంకర ప్రసాద్
1. చింత (ఆవేదన) 477 2. ఆశ (ఆసక్తి) 489 3. శ్రద్ద (ఆహ్లాదము) 502 4. కామము (అనురాగము) 512 5. వాసన (అనుబంధము) 522 6. లజ్జ (ఆమోదము) 538 7. కర్మ (ఆచరణ) 545 8. ఈర్ష్య (అసంతృప్తి) 564 9. ఇడ (అన్వేషణ) 575 10. స్వప్నము (ఆందోళన) 594 11. సంఘర్షణము (ఆదేశము) 610 12. నిర్వేదము (ఆప్యాయము) 629 13. దర్శనము(ఆలోకము) 644 14. 15. రహస్యము(ఆంతర్యము) ఆనందము (ఆనందం) 657 669
'కామాయని'
'చింత (ఆవేదన)'
తే. తుహిననగ శీర్షసీమ నుత్తుంగ శిఖరి
నొక శిలా శీతలచ్ఛాయ నొంటిఁ బురుషుఁ
డొక్కఁడుపవిష్టుఁడై కనుచున్నవాఁడు
అర్ధ నయనాలఁ బ్రళయ జలార్ణవమ్ము.
తే. క్రింద నీరము నుపరిఁ బ్రాలేయ, మందు
నొకటి తరలరూపమ్ము, వేఱోకటి ఘనము
ఏకతత్త్వ ప్రధానతే యిందు రెంట,
దాని జడ మనుండు, మరి చేతన మనుండు.
తే. స్తబ్ధమైన యాతని మానసమ్ము వోలెఁ
జెలఁగి హిమము సుదూరవిస్తృతినిఁ జెందె,
శాంత మటు తోఁచు ఘన శిలాచరణభూమి
ఘట్టన మొనర్చి తిరుగుఁ బ్రకంపనుండు.
తే. ప్రౌఢి గూర్చుండి తరుణతపస్వి రీతి
సాధన మొనర్చు నమరశ్మశాన మందు,
క్రింద విలయసాగర లహరీచయమ్ము
దీనదీనమ్ముగను నవసాన మొందె.
తే. ఆ తపోనిధి వోలె నత్యంత దీర్ఘ
ములును, బ్రాప్త హిమ ధవళములును నగుచు
గండశిల లట్లు సురతరుల్ గడ్డగట్టి
నిలిచె నొక రెండొ మూఁడొ యా నికటభూమి. 5
తే. సర్వ దేహాంగ మాంసపేశలత యొప్పు,
నమిత వీర్య మూర్జస్వితం బగుచునుండె
స్పీత ఘననాళములను వసించి శోణి
తమ్ము చరియించుచుండె స్వాస్థ్యమును బడసి.
తే. పౌరుషగుణ ప్రపూర్ణమౌ ప్రౌఢముఖము
చింతచే నైన భీరుతఁ జెదరియుండె
ఎడద యౌవన మధురవాహిని చెలంగి
యిపుడు ప్రవహింప, నతఁ డుపేక్షించుచుండె.
తే. మున్ను ఘన వట బద్దమై యున్న నౌక
నెలవు గొనియున్నయది పొడినేల మీఁద,
క్రమముగను తగ్గిపో జలప్లావనమ్ము
వెలువడఁగఁ జొచ్చె మున్గిన పృథ్వియపుడు.
తే. గాఢ కరుణా వినిస్సృత గాథ వోలె
వెలికిరా నతని ప్రగాఢవేదనమ్ము
నెఱిఁగియున్నట్టి దగుట హసించి నటుల
నొంటిఁ బ్రకృతిమాత్రమె వినుచుండె దాని
తే. "బహుళ చింతా సముజ్వల ప్రథమరేఖ!
ఓ మహాజగోపవన ఘనోరగమ్మ!!
పావకాద్రీంద్ర విస్ఫోట భయద మహిత
ప్రథమకంపనం బోలు నో ప్రబలమత్త!! 10
తే. “ఓ యభావ చపల మహామాయబాల!
లిఖిత లాలాటికా క్రూర లేఖనమ్మ!!
పచ్చపచ్చని సొగసుల పరుగులాట!
కపట మృగతృష్టికా తరంగమవు నీవు!!
తే. "ఈవు గ్రహకక్షఁ గల్లోల మెసఁగఁజేతు
తరళ గరళాన నొక చిన్ని తరఁగ వీవు
స్వర్గజన జీవితమునకు జరవు చింత!
చెవిటిదానవు విన వేమి చెప్పుకొన్న!
తే. "వ్యాధులకు సూత్రధారిణి వౌదు వోసి
యాధి! మధుమయశాపమ్మ వగుదు వీవు
ఓ హృదయగగన మహా భయోల్క! చింత!!
పరమసృష్టికి రమ్యపాపమ్మ వీవు.
తే. "చింత! న న్నెంత యోజింపఁజేసి తీవు
ఎంత లోఁతుపునాది రచించితేని
యట్టి చింతారహితజాతి నర్థి బ్రతుకు
నమరునకు నెన్నడే మృతియన్న దున్నె!
తే. "చేరి వ్యాపింతు మానస క్షేత్ర మందు
సస్యభూమి వర్షపలజలద మట్లు
అర్థి నెల్లర హృత్కుహ రాంతరముల
దాఁగియుందువు గుప్తనిధాన మటుల. 15
తే. "మతి మనీ షాశ బుద్ధియు మహిత చింత
యనున వెన్నియొ నామమ్ము లగును నీకు
లేదు స్థానమ్ము పాపినీ! లేదు సుంత
యేని నిలువక వెడలిపొ మ్మెచటికైన.
తే. "విస్మృతీ ! రమ్ము ! శిథిలతా !! విక్రమింపు
మోసి నీరవతా!! మౌన మొసఁగు మీవు
చేతనత్వమ !! వెడలి యే సీమకైన
శుభ్రజడతను నింపుమీ శూన్యహృదిని.
తే. "ఆ యతీతమ్ము, సౌఖ్యమ్ము నాత్మలోన
నెంత ఘనముగ నిపుడు యోజింతు నంత
గాటముగ నొందు దుఃఖరేఖాళి తివురు
నస్మదీయ నిస్సీమా హృదంతరమున.
తే. "అహహ! ఓ మహామహిత సర్గాగ్రదూత!
అసఫలుండ వైతివి, లీనమైతి వీవు
రక్షకుండ వౌదువొ లేక భక్షకుఁడవొ
నీవె నీ యెడ లీనమైనావు సుమ్ము.
తే. “వజ్ర సౌదామనీ వాత్యవర్ష పటలి!
లీల నర్తించినావు రాత్రింబవళ్ళు
అటుల భోగలాలసత మగ్నాత్ము లగుటె
యీవు పలుమారు లేతేర హేతు వయ్యె. 20
తే. "రత్నదీప ఘనాంధకారమ్ముఁ బోలు
నల నిరాశా సహిత భవిష్యమ్మ! ఓసి,
అమరజన ఘనాహంకార యజ్ఞవాటి
రమ్య సర్వస్వమును హవిర్భాగ మయ్యె!
తే. "తరళ మృత్యు రాహిత్య పుత్తలికలార!
ధన్య భవదీయ జయ నినాదములు ప్రబలి
శబలితస్వన దైన్య విషాద మొదవ
నిప్పటికిని బ్రతిధ్వనియించుచుండె.
తే. "అరయఁ బ్రకృతి యున్నది యజేయమ్మె యగుచు
జితుల మైతిమి, యవివేక చిహ్నితులము
మరచి మధుపానమత్తత న్మమ్ము మేమె
యీదుచుంటిమి తౌల్యంపు టేటినీట.
తే. "వారు మునిగిరి, మునిఁగెను వైభవమ్ము
ఆ సమస్తమ్ము రూపొందె నబ్ది పగిది
దేవతా సుఖవితతిపైఁ దెరలి యంత
దుఃఖజలధి నినాదమ్ము తుఱఁగలించె.
తే. "అట్టి మత్తవిలాస మే మయ్యె? అరయ
స్వప్నమో! కాక మృదుల విభ్రమమొ యద్ది
స్వర్గజనలోక సుఖవిభావరి చెలంగె
తరుణ మహనీయ తారకాతతుల తోడ. 25
తే. "అమరతరుణీ సుగంధ వస్త్రాంచలముల
సౌఖ్య జీవనపవన నిశ్వాస మొద వె-
వరలు సౌపర్య సౌఖ్యవిశ్వాస మపుడు
ముగ్ద కోలాహ లోజ్వల ముఖరితమ్ము.
తే. "అది సుఖము! కేవలము సుఖ మహహ! అద్ది
అమల మందాకినీ ప్రవాహమ్మునందు
పృథు తుషారములు ఘనీభవించినట్లు
త్రిదశజన సుఖమయ్యె కేంద్రీకృతమ్ము.
తే. "అమిత విశ్వబల విభవ హర్షములను,
నన్యసర్వస్వ మపుడు స్వాయత్తమయ్యె
ఆ సమృద్ధి సుసంచారవ్యాప్తి తోఁచె
లోల వీచీ మనోజ్ఞ కల్లోలరీతి.
తే. "అరుణకిరణాలు జలధికణాంతరముల
ద్రుమదళంబుల భాసించు నమలఫణితిఁ
గీర్తి దీప్తి శోభ లొనర్చె నర్తనముల
నాల్గు దిక్కుల నానందనవ్యతలను.
తే. "శక్తి యున్న-దౌను ప్రకృతి స్వర్గజనుల
పదతలమ్ముల వినయవిభ్రాంతి నుండె
తత్పదాక్రాంత మౌటచే ధరణితలము
అను దినమ్మును గంపించు నతిశయముగ. 30
తే. " అయిన సురలము స్వయము మే మందరమ్ము
నేల యీ సృష్టికాదు విశృంఖలమ్ము?
కనుకనే మాకు నిట్టు లాకస్మికముగ
వచ్చి వర్షించే భయద విపత్తు లపుడు.
తే. "నాశమయ్యె సర్వమును వినాశమయ్యె
నిర్జరీజన శృంగార నిరతిశయ ము
షస్సు బోలు యౌవనము, జ్యోత్స్నాస్మితము,
భ్రమర చింతావిహీన విలాసలీల.
తే. "వాసనా పూర్ణవాహినీవర మ దెంత
పరమ మధుఘన మత్త ప్రవాహ మయ్యె!
సంగమింప నది ప్రళయజలధి యందుఁ
బ్రిదిలి, కనువేళ నెడద కంపించి మూల్గె.
తే. “నిత్య యౌవన సుఖభోగ నిరతిశయత
సకలదిశల సుగంధాళిఁ జాదుకొల్పు
ననవరత మధుపూర్ణమౌ నా వసంత
మెచటి కేగెనో యేమొ యదృశ్యమయ్యె.
తే. "కుసుమిత నికుంజకేళుల కొమరు గొన్న
వారి పులకితాలింగనప్రౌఢి సడలె
ముగ్ద సంగీత తానముల్ మూగవోయె
కెరలి చెవుల సోకదు వల్లకీరుతమ్ము. 35
తే. “వాసనల నిండి నిశ్వాస పవనచయము
నిలువఁగా బోదు చెక్కిళ్ల నీడవోలె
సురత శైథిల్య వసనముల్ చుట్టుకొనవు
శ్రమ మనోజ్ఞము లగు వపుస్స్కంధములను.
తే. "ఓపి క్వణియించుఁ గంకణనూపురములు
చెలఁగి వక్షాన హారముల్ చిందుఁద్రొక్కుఁ
గలరవమ్ములఁ బ్రతిరుతిగతులు తోఁచు
స్వరలయమ్ములు గీతాళి సంగమించు.
తే. "సౌరభస్ఫూర్తి నమరు దిశాంతసమితి
చతుర కాంతిమెయి నభము చంచలమ్ము
అన్నిటను దోఁచుచున్నది యట్టివేళ
మలయపవన ముద్వృత్తి నున్మత్తకేళి.
తే. "ఆ యనంగ వ్యథానుభవాంగ భంగి
మలను నృత్యమ్ము సాగెను జెలఁగి చెలఁగి
షట్పదీ పుష్పరస మహోత్సవము వోలి
వరలె మదిరారసాసక్తి మరల మరల.
తే. "వర సురాగంధములఁ దోగు వదనములను
నరుణనేత్రాళి నలసత, హార్ద రాగ
మమరు సుందరములు కపోలములు వానిఁ
గనినఁ బీత కల్పక పరాగములు బెగడు. 40
తే. "ప్రతినిధులు తృప్తి నెఱుఁగని వ్యసనములకు
వాడి, దగ్ధమై, నిజ సృష్ట వహ్నికీల
భయద వాత్యా రయోద్ధత ప్రళయకాల
జలధి జలమున వారు నాశనముఁ గొనిరి.
తే. "ఓ యుపేక్షా సహిత సుర తోత్కలమ్మ!
ఓ యసంతృప్తి!! నిరవధి కోర్జిత సువి
లాసమా!! అనిమిష భయరహిత నయన
దర్శన క్షుధా ఘటిత విదాహ మహిత!!
తే. "వారి యుపగూహనమ్ములు దూరమయ్యె!
నుడిగిపోయె స్పర్శాపులకోద్గమములు
సురభి ళోజ్వల మధుమయ చుంబనచయ
కాతరతల ముఖాబ్జముల్ కష్టపడవు.
తే. "రమ్య మధు మదిరా సమీరములు తిరుగు
ధన్యతమ రత్నసౌధవాతాయనముల
మించి యీనాఁడు జలధి తిమింగలములు
క్రోధరస ముట్టిపడఁగ ఢీకొనఁగ వచ్చు.
తే. "త్రిదశకామినీ నేత్రముల్ లీలఁ జేయు
లలిత లావణ్య నీలోత్పలముల సృష్టి
అట్టి కన్నులఁ గనుపట్టు నక్కజముగఁ
బ్రళయకారిణి యౌ మహాభయదవృష్టి. 45
తే. "మ్లానరహిత సుగంధసుమాళి మణుల
రచితము లయిన మంజుహారాళి నాఁడు
శృంఖలము లయ్యె-నందు బంధింపఁబడిరి
నిర్జ రాప్సరస విలాసినీ గణమ్ము.
తే. "అమర యజనంపు పశుయజ్ఞ మందు నొదవు
నమిత పూర్ణాహుతిజ్వాల లబ్ధియందు
విలయ కల్లోల మహనీయ వీచికలుగ
నెంత భయదమ్ములై జ్వలియించుచుండె.
తే. "అంతరిక్షానఁ గూర్చుండి యరసి వారి,
ధీరతను వీడి యిటుల రోదింతు రెవరు?
అశ్రుమయ హిమానీ హాలహలజలమ్ము
లెల్ల వేళల నిటుల వర్షింపసాగె.
తే. "కలిగె హాహారవ భయదాక్రందనములు,
సురల వజ్రము లయ్యె సంచూర్ణితములు
అయ్యె బధిరమ్ము లఖిల దిశాంతములును
క్రూర భీమ శశ్వ న్మహాఘోష లెసగె.
తే. "క్షితిజతటమున జలదముల్ చెలఁగి మొరసె
పొగలు వ్యాపించె దిగ్దాహములను వీడి
ఘన గగనమున భీమ ప్రకంపనంపు
ఝంఝ యొదవించె గుదుపు లాశ్చర్యమొదవ. 50
తే. "అంధకారాన మలినమ్ములై వసించు
భాను నస్పష్టకాంతులు లీనమయ్యె
అపుడు వరుణుఁడు నిజకర్మ న్యస్తుఁడయ్యెఁ
జేరి పొరగట్టి తిమిరమ్ము చియ్యబట్టి.
తే. "మించెఁ బంచభూత భయద మిశ్రణమ్ము
అమల శంపాశకల నిపాతములు కలిగె
త్రిదశులు మహోల్క లనియెడి దివ్వటీల
వెదకిరి కనని తొలిసంజ-వెలుఁగుజాడ.
తే. "క్రుద్ధ భైరవ దీర్ఘనిర్దోషములకు
నవని కలఁగి కంపింపఁగా నాత్మఁ దలంచి
శాశ్వతాలింగనమునకై శ్యామగగన
మంత దిగివచ్చెనో యననపుడు తోఁచె.
తే. "కుటిలకాలుని క్లిష్టవాగురలఁ బోలు
జలధి కల్లోలమాలికల్ స్వనమొనర్చె
పడగలను విప్పి ఏ తెంచు వ్యాళగతుల
గదలివచ్చెను నురగలు గ్రక్కుకొనుచు.
తే. "క్రమముగాఁ బృథ్వి క్రుంగిపోఁ గడఁగె - నపుడు
పొలిచి యనలాద్రి ని శ్వాసములను బోలి
పావకజ్వాల లెల్లెడఁ బ్రజ్వలించె
కుంచితాంగియై వసుమతి గోచరించె. 55
తే. "క్రోధరస పూర్ణ జటిల నిర్దోష నిచయ
కంబుధి బలవ దూర్మికాఘాతములను
గదలె తిలకింప నొక మహాకచ్ఛపముగ
క్షోణి-వ్యాకులమ్మొందె, సంక్షోభ మొందె.
తే. "కామకేళీ విలాస వేగమ్ము వోలె
నపుడు భైరవజలరాశి యతిశయించె
అమిత నీల మహాఘనాంధ్యమును జేరి
కడఁగి విలయమహావాత్య కౌఁగలించె.
తే. "జలధి తటము చేరిక కనుక్షణముఁ జేరె
క్షీణమై, లీనమయ్యెను క్షితిజరేఖ,
హేలగాగ మర్యాదావిహీన మగుచు
వార్ధి జృంభించె నిఖిల విశ్వమును ముంచి.
తే. "కరక లతిభీకరధ్వనిఁ గురియఁదొడఁగె
ప్రకృతి సర్వము మర్దింపఁబడుచు నుండె
పంచభూతమ్ము లీలీల భయదరీతి
నెంతకాలము తమిఁ దాండవించినవియొ!
తే. "ఉన్న దయ్యెడ నవ్వేళ నొక్క నౌక
లేదు దానికిఁ జుక్కాని, లేవు తెడ్లు
విపుల తరళోర్మి, కలను నా వెళ్లి నౌక
పడుచు లేచుచు నున్నది యడలుఁగొనుచు-60
తే. "ప్రబల ఘాతలు తగిలె - నస్పష్టమైన
యొడ్డుజాడయొ కానరాకుండె - నంతఁ
బిఱికినైతి, నిరాశానిపీడితుడను
నైతి - విధినియతపథము నరయుచుంటి.
తే. "వీచికల్ రేగె నభము చుంబింప ననఁగ,
నగణిత క్షణప్రభలు నృత్యమొనర్చె
గరళ కాదంబినీ కర్ష గాఢపాత
సలిలబిందువుల్ సేసె స్వజాతిసృష్టి.
భావము లవెల్ల మేల్కొన్న పగిదిఁ దోఁచె. తే. దృష్తివాసన బలిసి గర్జింపసాగె తే.
“ఎవరి యుల్లాసము సముజ్జ్వలింపవలెనొ వేరుగా నామె యట నుపవిష్ట యయ్యె ఎందులకు నిది యెల్ల? మరెందు కిద్ది. చెలఁగి మజ్జీవితంపు సంచిత సుఖమ్ము రమ్యరూపమ్ము నొందె నీ రమణియందు నట్టి యామెతో నెట్టు లే ననఁగలాఁడ 'నీవు నా దాన' వంచు నా యెదను విప్పి.” తే. సఖియ ఆమె కాలేదు ప్రసన్నురాలు శుభ్ర మెదొ రహస్య మ్మిట సునిహితమ్ము ప్రాణములఁ బాసి యాయజ్ఞ పశువు సౌఖ్య మునకు నాటంకమగుచుఁ దా మనునో యేమొ! తే. - అలిగినది శ్రద్ధ - ఇప్పు డే నయిన నట్టి యలుక సవరించి తేర్చఁగా వలసియున్నె? మానమును వీడి యామెయే మార్గమునకు వచ్చునా? లేక ఏ నెట్లు మెలఁగవలయు? తే. అంత మనువు పురోడాశ మారగించి సొగియఁగా మానసము త్రావె సోమరసము ప్రాణసంచయ రిక్తాంశపాళి నెల్ల మాదకత్వమ్ముతోడ నింపఁగను సాగె. తే. స్నిగ్ధతా ముగ్ద మౌ గిరి శృంగ వీథి సంజవేళను ధూసర చ్ఛాయలోన గగన మలిన శశాంక రేఖను ధరించి యపుడు చెన్నొందియుండె దిశాంతమందు. 550 35 40 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 తే. శ్రద్ధ చేరెను శోకభారాన మరల నపుడు నిజ శయన గుహాగృహమ్ములోన ఒక విరక్తిభారము మ్రోయుచున్న యట్లు మించి తనలోనఁ దా విలపించు చుండె. తే. సన్ననౌ శుష్కకాష్టంపు సంధియందు ననలశిఖ యొండు జ్వలియించు చా గృహానఁ దనదు విస్పష్టకాంతితోఁ దమము నెల్ల దూర మొనరించుచుండె సంతుష్టి మెరసి. తే. - కాని శీతల పవనోర్మికలకు నద్ది యొక్కపరి తగ్గిపోవుచునుండె నొక్క పరి జ్వలించుచునుండె నవ్వానివలన- అయిన నద్దాని నెవ రేటు లాపఁగలరు? తే. శ్రద్ధ తన మృదువైన చర్మమ్ము నపుడు పరచుకొని, దానిపైన మైమరచి యుండె ఆమె యున్నది శ్రమమృదులాలసత్వ మొంది విశ్రాంతిఁ గైకొనుచున్న యటుల. తే. Gilb మహిత విశ్వమ్ము నిజ ఋజుమార్గ మందు నడచుచుండెను మెలమెల్లఁ గడగి-తారు. కలకుఁ గ్రమమున నొదవె వికాసగరిమ కట్టఁబడె మృగములు శీతకరురథాన. తే. శార్వరీ సుందరీమణి జారవిడిచెం దనదు జ్యోత్స్నామనోజ్ఞ వస్త్రాంచలమును పొలసి యద్దాని నీడలోఁ బొందుచుండె పరమ వేదనామయ సృష్టి బహుళసుఖము. తే. హిమమహీధరోచ్చయ శృంగకముల యందు నవ్వుచుండెను బ్రకృతి చంచల లతాంగి తనదు ధవళహాసమ్మును దనరఁ జిమ్మి స్నిగ్ధ సుషమల వ్యాపింపఁ జేయుచుండె. ఆంధ్ర కామాయని 45 551 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/552 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/553 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/554 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/555 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/556 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/557 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/558 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/559 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/560 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/561 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/562 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/563 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/564 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/565 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/566 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/567 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/568 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/569 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/570 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/571 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/572 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/573 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/574 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/575 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/576 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/577 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/578 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/579 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/580 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/581 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/582 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/583 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/584 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/585 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/586 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/587 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/588 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/589 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/590 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/591 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/592 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/593 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/594 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/595 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/596 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/597 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/598 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/599 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/600 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/601 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/602 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/603 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/604 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/605 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/606 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/607 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/608 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/609 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/610 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/611 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/612 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/613 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/614 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/615 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/616 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/617 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/618 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/619 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/620 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/621 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/622 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/623 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/624 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/625 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/626 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/627 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/628 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/629 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/630 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/631 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/632 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/633 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/634 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/635 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/636 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/637 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/638 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/639 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/640 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/641 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/642 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/643 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/644 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/645 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/646 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/647 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/648 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/649 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/650 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/651 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/652 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/653 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/654 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/655 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/656 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/657 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/658 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/659 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/660 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/661 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/662 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/663 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/664 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/665 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/666 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/667 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/668 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/669 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/670 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/671 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/672 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/673 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/674 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/675 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/676 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/677 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/678 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/679 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/680