ద్విజావంతి రాగం - మిశ్ర చాపు తాళం

మార్చు


పల్లవి:

వారి వీరి జోలి నా కేల రా సామి
వద్దు వద్దు చాలురా ||

అనుపల్లవి:

నోరు మూసు కొని యూర కున్న గాని
తీర దాయె దాని పోరు నే నేమి సేతు ||

చరణం 1:

అల దానితో నీవు కలసి కులుకు చున్న
నదె నాకు పది వేలు రా వలపు నాపై నీకు కలుగ కున్న నేమి
తొలి నోము ఫలమని తలచితి నే కాని ||

చరణం 2:

వల వల కన్నీరు వరద లై పారగా
తల వ్రాసె గా దైవము నిలచి నీతో నింక పలుకు లేమిటికిరా
అలరు తేనియ విస మైన గ్రోలెద గాని ||

చరణం 3:

వారక శ్రీ తోట్ల వల్లురి వేను గోపాల
మ్రొక్కెద మ్రొక్కెద ధీరు డైన దాసు శ్రీ రామ కవి కృతి
సార మైన విని సామి నన్నే లరా ||