వరాహపురాణము/చతుర్థాశ్వాసము

చతుర్థాశ్వాసము

క.

శ్రీకీర్తిదివ్యతటినీ | ప్రాకటజలధౌతవిష్ణుపదతల! పుణ్య
శ్లోకకుల! సుకవి కోకిల | మాకందారామ! యెఱ్ఱమంత్రిలలామా!

1


వ.

ఆకర్ణింపుము. ప్రహ్లాదచరిత్రానంతరంబున మార్కండేయుండు రోమశున కిట్లనియె.

2


హరికథామృతపానాభిరతి

క.

మునివల్లభ! భవదానన | మను జలనిధివలన హరికథామృతపానం
బొనరించి, తృప్తి [1]నొందదు | పునరాకర్ణనపరత్వమునఁ గర్ణంబుల్.

3


ఉ.

కావున, నీశ్వరుండును జగంబును భిన్నములంచుఁ దోఁచు దు
ర్భావన మానునట్గఁ, గృపామతి సర్వమయాత్ముఁడైన ల
క్ష్మీవనితామనోహరు విచిత్ చరిత్ర ముపన్యసింపవే!
పావనవాగ్విశేషములపాటవ మేర్పడఁ బండితాగ్రణీ!

4


మ.

గరిమన్ లోకములన్ సృజింపఁ, బెనుపన్, ఖండింపఁగాఁ జాలు నీ
శ్వరుఁ డయ్యున్ హరి, దైత్యకీట[2]హృతికై జన్మించెఁ బల్మారు ను
ర్వరపైఁ దా నదియేల? సర్వసమతన్ వర్తించు [3]నేర్పయ్యు, నే
కరణి న్వైరము పూనె రాక్షనులపైఁ గారుణ్యశూన్యాకృతిన్.

5


క.

అనఘ! వసిష్ఠుఁడు, నారదుఁ | డును, సనకాదులుఁ దపఃపటుత్వము, బోధం
బును గల్గి, శక్తు లయ్యును | మును ముక్తులు గామి కేమి [4]మూలము చెపుమా!

6


క.

శ్రీరమణుఁడు మీనాద్యవ | తారము లంగీకరించి దానవకులసం
హార మొనర్చుట మొదలగు | [5]మీఱిన చరితములు దెలుపు మృదువాక్యములన్.

7


వ.

అని మార్కండేయుం డడిగిన, నుచితవాక్ప్రపంచంబున రోమాంచసమంచితాంగుం
డగుచు రోమశుం డమ్మహాత్మున కిట్లనియె.

8

చ.

వినుము మునీంద్ర! పూర్వమున [6]విష్ణుమయుండగు నాదిమూర్తిచే
వనజ[7]భవాండమందు, భవవారిజమిత్రమృగాంకయక్షస
న్మునిమను[8]మానవామరమనోభవకిన్నరరాజమానమై
జననము నొందె విశ్వమును సాగరశైలవనాంతరీపమై.

9


సీ.

నారాయణుం డాత్మనాభీసరోజమ | ధ్యమమున బ్రహ్మయై యవతరించి,
మహదహంకారాది మహనీయసాధన | సంపత్సమేతుఁడై చతురుఁ డగుచు,
నంబరసర్వంసహానలజలమారు | తము లనుపంచభూతములతోడ,
నిర్మించె, నవియును నిర్మంపఁ[9]గలవియు | ననఁ బెక్కు గలవు బ్రహ్మాండకోట్లు,


తే.

నందు నెచ్చట [10]నేకార్య మావహిలునొ | పుండరీకాక్షుఁడైన దేవుండు దక్క
నరసి [11]యిదమిత్థమని పల్క నజుఁడు నోపఁ, | డెట్లు మముబోఁటి కీటాత్ము లెఱుఁగఁగలరు.

10


మ.

హరిమాయా[12]పిహితంబులై పొడము [13]బ్రహ్మాండావళుల్ తద్రమా
వరుసామర్థ్యము, మూర్తివైభవగుణవ్యాపారకృత్యంబులున్
బరిపాటిం గొనియాడ వేదములు నప్రాజ్ఞంబులై యుండు, వి
స్తరభంగిం బ్రకటింప మాదృశులకున్ శక్యంబె? విద్వన్నుతా!

11


శ్రీహరి మాహాత్మ్యము

వ.

మునీంద్రా! వినుము. ఆ యాదిపురుషం గొందఱు కాలరూపి యనియును, గొందఱు
విజ్ఞానరూపి యనియును, గొందఱు తేజోరూపి యనియును, గొందఱు భాస్కరరూపి
యనియును, గొందఱు బ్రహ్మరూపి యనియును, గొందఱు శంఖచక్రగదాశార్జ్ఞచిహ్ని
తుండనియును, గొందఱు మృత్యుంజయుం డనియును, [14]గొందఱు పరబ్రహ్మం బనియును
బ్రతిపాదింతురు; కాని, తదీయ[15]తాత్త్వికరూపంబు నిర్ణయింపనేరరు. ఆ వైకుంఠ
నాయకుండును, బహురూపావృతాత్మకుండునునై [16]జ్ఞానయోగభక్తియోగకర్మయోగంబుల
నుపాసింపంబడి, తత్కర్మఫలంబుల నొసంగుచు సర్వభూతాంత[17]ర్యామియై యుండు.
వెండియు,

12

క.

గురువుల నమరుల ధాత్రీ | సురులను ధేనువుల నదుల సుస్థిరభక్తిన్
హరిరూపములుగఁ దలఁచిన | నరుఁ డేఁగుం బరమపదమునకు మునివర్యా!

13


సీ.

ఎన్ని బ్రహ్మాండంబు లన్నింటి కందఱు | బ్రహ్మలై హరి సృష్టిభరము పూను,
నెన్ని పాతాళంబు లన్నింటి కందఱు | [18]భోగీంద్రులై శౌరి భూమిఁ దాల్చు,
నెన్ని స్వర్లోకంబు లన్నింటి కందఱు | జంభారులై చక్రి జగము లేలు,
నెన్ని కైలాసంబు లన్నింటి కందఱు | భర్గులై శార్ఙ్గి ప్రపంచ మణఁచు,


తే.

నెవ్వఁ డేరూపమునఁ దన్ను నెఱుఁగఁగోరు | వాని కారూపమునఁ గానవచ్చుచుండు,
భక్తజనవత్సలత్వతత్పరుఁడు గాన | భక్తిమంతుల కతఁ డిచ్చుఁ బరమపదము.

14


మ.

అవతారంబు లనేకకోట్లు గల, వాయాబ్రహ్మకల్పంబునన్
భవశక్రాదినుతప్రచారుఁ డగుచున్ బ్రహ్మాండమధ్యంబునన్
వివిధాకారముల న్వహించి, త్రిజగద్విఘ్నంబుల న్మాన్ప సం
భవముం బొంది, మురారి క్రీడ సలుపు న్మత్స్యాదిరూపంబులన్.

15


ఆ.

సర్వ[19]వేదమయుఁడు, సర్వాంతరస్థాయి, | సర్వభూతమయుఁడు, [20]సర్వసముఁడు,
సర్వవైరిహరుఁడు శాశ్వతుం, డవ్యయుఁ, | డచ్యుతుండు ప్రోచు నఖిలజగము.

16


మ.

ఘనవిద్యాకులరూపసంపదలచే గర్వించి [21]మోహాంధతం
దనుఁ జింతించు వివేక మేమఱిన భక్తశ్రేణి బోధించి, యా
త్మనివాసస్థితి సౌఖ్యమిచ్చుటకునై , ధాత్రీస్థలిం బుట్టి యా
వనజాక్షుండు జగంబుఁ బ్రోచు వివిధవ్యాపార[22]పారీణుఁడై.

17


క.

భువనేశుఁడు శాసింపఁగ | నవివేకము దొఱఁగి, [23]దుర్మదాంధత్వముఁ బా
సి, వనట నొందక [24]మనుజుల్ | [25]ధ్రువమగు హరిపదముఁ జెందుదురు మునితిలకా!

18

చ.

హరి, నిజజన్మ[26]కర్మచరితామృతపాన మొనర్చు దాసులన్
బరమపదంబుఁ జేర్చుటకుఁ బల్మఱు ధాత్రి జనించుఁగాక, దు
స్తరబలగర్వకంటకనిశాచరకాననముల్ హరింపఁ, ద
త్కరక[27]మలాంతరోజ్జ్వలసుదర్శనవహ్నికణంబు చాలదే?

19


మ.

ధర నిక్షేపము, పాల వెన్న, తిలలం దైలంబు, ధారాధరో
దరసీమ న్సలిలంబు, పుష్పముల గంధవ్యాప్తి, బీజాళి నం
కురముల్, దారువులం గృశానుఁ, డిభరాట్కుంభంబుల న్మౌక్తికో
త్కరముం బోలె, నజాండకోటి హరియుం [28]దానుండు సంక్రాంతుఁడై.

20


తే.

ఇందిరాభర్తమాహాత్మ్య మిట్టి దట్టి | దని యెఱుంగఁగనేరక ఖి వేద
[29]వాగురులఁ జిక్కువడి బహుభాగవతుల | తవిలి వర్ణింప, [30]నితరుల తరమె తెలియ?

21


సీ.

మానవుండని భక్తిఁ బూని భావించిన | వారి కారూపమై వరము లొసఁగుఁ,
దేజోమయుండని తెలిసినవారికిఁ | దన్మూర్తియై కాంక్షితంబు లిచ్చు,
నమృతాంశుకోటీరుఁ డని కొల్చువారికి | నట్లయై యిష్టకృత్యము లొనర్చు,
నలినాసనుండని తలఁచినవారికిఁ | దాదృశుఁడై [31]సమ్మదంబు సేయు,


తే.

నిన్నియును నేల యెవ్వరి కెట్లు తోఁచు | నట్టి తెఱఁగున గోచరుండై తదీయ
కర్మకాంతారముల నీఱు[32]గా హరించి | నిముసమున నిల్పు వారల నిజపదమున.

22


క.

అనుమానింప కజాండము | లను బూర్ణుఁడు చక్రి, తత్కళారహితంబై
న నెలవు లేదని తెలిసిన | ఘనపుణ్యుఁడు, పరమపదసుఖస్థితిఁ జెందున్.

23


వ.

అది కావునఁ, బరమపురుషదృక్కోణదర్శనమాత్ర[33]నిర్మితంబులై చతుర్ముఖపంచ
ముఖషణ్ముఖసప్తముఖ[34]దశముఖశతముఖసహస్రముఖవిరించిపాలితంబులగు
బ్రహ్మాండంబు లనంతంబులు గలవు. అందుఁ జతుర్ముఖాధీనంబగు నీబ్రహ్మాండంబున,
నే నెఱింగిన వైష్ణవకథామృతవిశేషంబులు కొన్ని వివరించెద నాకర్ణింపుము.

24

వరాహపురాణము/117-118 పుటలు

సీ.

మూలముల్ [35]మీఁదు కొమ్ములు క్రిందునై చాల | నున్నతంబై మించు నొక్కతరువు
వేదపర్ణంబుల విలసిల్లుఁ, [36]దత్పక్వ | ఫలము లెవ్వారికిఁ దెలియఁబడవు,
ఆహారియును నిరాహారియునై రెండు | పక్షు[37]లు తరువునఁ బాయకుండు,
నతినిశ్చలంబైన యా ఖగద్వితయంబు | నురుశక్తి నైక్యంబు నొందఁజేసి


తే.

యమ్మహీజమ్ముఁ బాలింప నణఁపఁజాలి | తత్ఫలశ్రేణి [38]నిజభక్తతికి నొసఁగు
నీ మహత్త్వంబు, వర్ణింప నేర్తు నెట్లు? | శరధికన్యాకళత్ర! తామరసనేత్ర!

38


క.

బాలుఁడను బుద్ధిహీనుఁడ | నాలోకింపుము కృపాకటాక్షముల ననున్;
మేలుకొన సమయ మయ్యెను | [39]చాలింపుము యోగనిద్ర [40]సకలశరణ్యా!

39


వ.

అని యిట్లు హిరణ్యగర్భుం డుచితవాక్యసందర్భంబున నుతించి, ప్రార్థించిన, నా
జగద్గర్భుండు మేల్కనకున్న, నది యోగమాయాశక్తి[41]కృత్యంబని నిర్ణయించి, నిద్రారూపంబున
సంక్రమించిన జగన్మోహనకారిణియగు నా యోగమాయ నిట్లని స్తుతించె.

40


విష్ణుదుర్గాస్తవము

శ్లో.

వందే౽హం [42]దేవి! పాదారవిందే! మందేతరార్చితే!
[43]తావకే సేవకేష్టాపవర్గే! దుర్లే! మదంబికే!

41


వ.

అని నమస్కరించి, వెండియు నిట్లనియె.

42


క.

శ్రీపతిని యోగనిద్రా | రూపంబున నలము కాలరూపిణివగు నీ
శ్రీపదములు సేవించెదఁ | దాపత్రయదుఃఖజలధితారణమునకున్.

43


ఉ.

కంబుసమానకంఠికి, జగత్త్రయదేవకిరీటరత్నభా
చుంబితపాదపీఠి, కతిశోభనమూ ర్తికిఁ, బల్లవావళీ
బింబసమాధరోష్ఠి, కరిభీకరశూలసమేతయైన దు
ర్గాంబకు, విష్ణుశక్తికి ననంతనమస్కృతు లాచరించెదన్.

44

క.

ఘనరాజసమున బ్రాహ్మీ | వనజాక్షియు, సాత్త్వికమున వైష్ణవియుఁ [44]దన
ర్చిన తామసమున రౌద్రియు | ననఁ బరగుచు వొక్క నీవ [45]యంబుజవదనా!

45


తే.

శక్తులందెల్ల నాదిమశక్తి వీవ, | మూర్తులందెల్ల నాదిమమూర్తి వీవ,
హర[46]విరించాదివందితచరణ వగుచుఁ | ద్రిభువనంబును రక్షించు దేవి వీవ.

46


క.

నిఱుపేదలైన, నీపద | సరసిజములు గొలిచిరేని సాగర[47]వేలా
పరివృత[48]విశ్వక్షోణీ | [49]పరివృఢు లగుదురు త్రిలోకపావనచరితా!

47


చ.

ప్రణవము కామరాజము, ప్భంజనబీజము, [50]నిందిరావధూ
మణినిజబీజయుగ్మము క్రమంబున బిందుసమన్వితంబులై
ప్రణుతికి నెక్కఁ, గూర్పనగు భాసురతావకమంత్రము న్మనో
గణితము చేసి శాశ్వతసుఖంబులు గాంతురు సజ్జనోత్తముల్.

48


ఉ.

నీనిజరూపముం దెలియనేరని దుర్మతు లన్యదేవతా
ధీన మనస్కులై తిరిగి, దీపితవైదికకర్మ[51]మార్గమున్
గానఁగలేక, దైహికసుఖంబులకుం బెడఁబాసి, నారక
స్థాననివాసదుఃఖముల దైన్యము నొందుదు రెల్లకాలమున్.

49


సీ.

నిద్రయై యే దేవి నిఖిలభూతంబుల | చేష్టలు [52]మఱపించి చిక్కువఱచుఁ,
దృష్ణయై యేదేవి ధీరతాలతఁ ద్రించి | ధర మానవుల దీనదశకుఁ దెచ్చు,
[53]మాయేంద్రజాలమై పాయక యేదేవి | [54]విశ్వంబునకు భ్రాంతి విస్తరించు,
నాశాస్వరూపిణియై నిల్చి యేదేవి | నను నీషణత్రయపరుని జేయుఁ,


తే.

ద్రిభువనేశ్వరి యగుచు నేదేవి తనరుఁ, | బరఁగ బ్రహ్మాదిసకలరూపములు దాల్చి
యభినుతికి నెక్కు నేదేవి, యట్టి నిన్ను | భక్తి సేవింతు, భావింతుఁ బ్రస్తుతింతు.

50

సీ.

నినుఁ గాళ[55]రాత్రి [56]యంచు నుతింతు భువనేశ్వ | రీశక్తి యనుచు వర్ణింతు నిన్నుఁ,
[57]గౌమారి యని నిన్నుగణుతింతు, వైష్ణవి | యని నిన్ను [58]నెపుడుఁ గీర్తనమొనర్తు,
వారాహి యని నిన్ను వాక్రుత్తు, సర్వమం | గళ యని నిను వచోగరిమ [59]నుడుదు,
[60]బ్రహ్మాణి యని నిన్నుఁ బ్రస్తుతి గావింతు, | సావిత్రి యని నిన్ను [61]6సన్నుతింతు,


తే.

జనని! నిను దుర్గ యనుచుఁ బేర్కొని భజింతు, I సర్వలోకనమస్కృతచరణపీఠ
యనియు, నఖిలార్థదాయిని యనియు నిన్ను | సంతతముఁ గొల్తుఁ గల్యాణి! చంద్రవదన!

51


క.

ఈదుర్గాస్తవ మెప్పుడు | సాదరబుద్ధిం బఠించు సరసులు, సుతపౌ
త్రాదులతోడ సుఖస్థితి | మేదిని యేలుదురు బంధుమిత్రప్రియులై.

52

వైష్ణవీమాయ సాక్షాత్కారము

వ.

అని యిట్లు కొనియాడిన వనజాసనుని వినుతుల కనుమతించి, [62]జగన్మోహా
విధాయినియు నిత్యానపాయినియు నగు వైష్ణవమాయాదేవి కాకోదరరాజశయనునయన
[63]జలజంబులవలన వెలువడి చెలువంబగు లలనారూపంబు గైకొని, కలంకు లేని కొలంకున
నందంబులగు కెందమ్మివిరుల సిరులకుం దల్లి బందువులగు చరణతలంబుల దలంబగు
కెంజాయచేత రంజితంబులై, పదనఖంబు లవంధ్యసంధ్యారాగసాగరమౌక్తికాయమాన
తారకాసఖంబులై చెలువొందఁ, గల[64]హంసకేంకారమంత్రరాజంబులకు నోంకారబీజంబుల
చొప్పున నొప్పు మంజీరతారనినదంబులు వేదంబుల నుత్పాదింపఁ, గటితటఘటితకాంచన
కాంచీకలాపకలకలంబు మధ్యమస్థలంబునకై యస్తి నాస్తి వివాదం బొనరింపఁ బుట్టిన
తద్ఘంటికాపరస్పరకోలాహలంబు సొంపున నింపు సంపాదింపఁ, దోరంబగు నీహారంబుచేతఁ
[65]బొదుగుడుపడిన జక్కవకవచెలువంబునఁ [66]జిలువువలిపెంపుఁ[67]గంచెలమెఱుంగున,
మెఱుంగులు తుఱంగలించు వలుదచన్నులకెలంకులం దొలంకు ప్రభాంకురంబులు బాహు
శాఖల నలమికొనుచుండఁ, [68]దత్కుచపర్వతభరం బోర్వక యడంగిననడిమిం బొడగానక
వెదుకులాడునవియుంబోలె రత్నహారంబు లుభయపార్శ్వంబులకుం దూఁగియాడ, స్తన
గోవర్ధనగిరిద్వయంబు లెత్తిపట్టిన [69]మధ్యమాహరి కరదండంబుల నోజ రోమరాజి విరాజిల్ల,

నిద్దంబులగు చెక్కుటద్దంబుల మకరిపత్రంబులై పొంకంబులగు రత్నతాటంకంబులకాంతి
పటలంబు [70]తటంబులం బుటంబులు గొనుచుండఁ, జరమసంధ్యారుణజలధరరేఖాగ్రంబున
వీక్షణీయంబగు నక్షత్రంబు తెఱంగున నధరపల్లవోపరిభాగంబున [71]నాసాభరణమౌక్తికంబు
చూపట్ట, ఫాలభాగంబున మృగనాభితిలకం బరచందురునడిమి కందుచందంబున నయనా
నందం బొనర్ప, నాసిక యను తెర యిరుగడలం బరిణయంబునకు నాసన్నులైన చకోర
వధూవరుల సిరు [72]లంగీకరించిన దీర్ఘనేత్రంబులు శతపత్రమిత్రంబులు లావణ్యపత్రంబులు నై
చెలంగ, నంధకారంబునందుఁ గానంబడు తారకాజాలంబులీలం గబరికాభారంబునందు
మల్లికాకుసుమంబులు విలసిల్ల, గంకణకేయూరముద్రికాదిదివ్యభూషణకరంబులగు
కరంబులు [73]భక్తాభయంకరంబులయి శోభిల్ల, దివ్యాంబరాలంకృతయై, సహస్రసూర్యసంకాశ
ప్రభా[74]భారంబగు నాకారంబుతో సాక్షాత్కరించి, విష్ణుమాయాదేవి మందగమనంబున నేతెంచి,
యరవిందభవునిముందఱ నిల్చినంతఁ, బుండరీకాక్షుండును యోగనిద్ర చాలించి, నిజ
నాభిసరోజకర్ణికాసమాసీనుండగు హిరణ్యగర్భుని గృపాగర్భితంబులగు చూపుల నవలోకించిన,
నతండు నిటలతటఘటితాంజలియై యిట్లని విన్నవించె.

53


మ.

అరిషడ్వర్గము నిగ్రహించి, మమతాహంకారముల్ ద్రించి, బం
ధురభక్తిం దప మాచరించిన మహాత్ముల్ బోధవిద్యాధురం
ధరులుం గానని నీస్వరూపమును నేత్రప్రీతిగాఁ జూడఁగం
టి రమావల్లభ! వేయునేల? తుదముట్టెన్ జన్మ మబ్జేక్షణా!

54


క.

హరి విష్ణుండు రమాపతి | యరవిందాక్షుండు చక్రి యహిశాయి యతీ
శ్వరహృదయనిలయుఁడని నిను | మఱవక కీర్తింతుఁ గృతనమస్కారుఁడనై.

55


తే.

బాలుఁడను బుద్ధిహీనుఁడ భ్రాంతియుతుఁడఁ | గార్యకారణమూఢుఁడఁ, గాన నన్నుఁ
గరుణ రక్షింపు రక్షింపు కమలనాభ! | జనకకృత్యంబు పుత్రరక్షణమె కాదె?

56


సీ.

అవధరింపుము, దేవ! భువనత్రయము మున్ను | సృజియించి మానససృష్టి చేసి,
యా లోకములయందు [75]నద్రికాననవార్ధి | దేశనదీలోకదివిజమనుజ
తారకాగ్రహచంద్రతపనమునీశ్వర | కిన్నర[76]గారుడపన్నగేంద్ర
గంధర్వయక్షరాక్షసకామినీజన | పశుతురంగమకీటపక్షితతుల


తే.

ధృతి వినిర్మింపఁ, గాలచోదితము లగుచు | నవియు నన్యోన్యవైరమహత్త్వమునను
సమసె, నటమీఁది కృత్యంపుఁజంద మెఱుఁగ | నేరకున్నాఁడఁ గరుణింపు నీరజాక్ష!

57

క.

అని [77]విన్నవింపఁ ద్రిజగ | జ్జనకుఁడు లక్ష్మీవిభుండు సర్వముఁ జిత్తం
బున నూహసేసి, విశ్వము | నొనరఁగ నిర్మింప నపుడ యుద్యుక్తుండై.

58


విశ్వసృష్టి వికాసము

చ.

తనరఁగ నాత్మ నాకసముఁ, దద్గగనంబున మారుతంబు, నా
యనిలమునన్ హుతాశనము, నా యనలంబున వారి, యా జలం
బునను ధరిత్రి, నా ధరణిఁ బొందుగ నోషధు, లా మహౌషధీ
వనమున నన్నమున్ భువనవత్సలుఁడై సృజియించె నేర్పునన్.

59


క.

అది [78]సకలజంతుకోటికి | నుదరానలశాంతికరము హుతవహకీలా
వదనమున వేల్వఁగాఁబడి | త్రిదశప్రీతిదము గాఁగ ధృతి నొనరించెన్.

60


తే.

శౌరి మఱి[79]యు విరాడ్రూపధారి యగుచు | సర్వగతుఁడై యనంతరసర్గమునకుఁ
గారణంబగు ధాతృవర్గము సృజంచి | కరుణ తళుకొత్త వారలఁ గలయఁజూచి.

61


వ.

అందు, శిల్పవిద్యాకుశలుండగు విశ్వకర్మం బిలిచి, నీవు లోకత్రయంబునందు సౌధ
కేళీవనపురగ్రామాది విశేషంబులతోడంగూడ దేశంబులు నిర్మింపుమని నియమించి
యనంతరంబ.

62


ఉ.

అంబుజనాభుఁ డాత్మవదనాంబురుహంబున భూమిదేవ వం
శంబును, బాహుదండముల సంగతి రాజకులంబు, నూరుకాం
డంబుల వైశ్యజాతిఁ, జరణంబుల శూద్రగణంబు, నక్షియు
గ్మంబునఁ జంద్రసూర్యుల నఖండగతిన్ సృ[80]జియించి, వెండియున్.

63


క.

నాసాముఖమధ్యమమున | వాసవముఖహరిదధీశవర్గముఁ, బ్రాణో
ల్లాసమున గాడ్పు, ముఖని | శ్వాస[81]సమీరమునఁ బక్షిసర్పాదికమున్.

64


సీ.

వరుసఁ [82]గేశంబుల వాహినీస్తోమంబు, | రోమకూపముల [83]నంభోముచములుఁ,
గరరుహంబులఁ దారకాగ్రహనక్షత్ర | తిర్యగాదులు మఱి ధేనుకులము,
సితహాసమునఁ గామయుతసప్తవింశతి | భేదాంకదేవతాబృందములును,
నాసికఁ బితృదేవతాసమూహంబును, | రోషాతిశయమున రుద్రసమితిఁ


తే.

గూర్మి నిర్మించి, నిర్మాణకర్మపాట | వంబుఁ దనుఁ దాన మెచ్చి, సర్వంబుఁ జూచి ,
యాత్మమూర్తి సముద్భూతయైన మాయఁ | బిలిచి యిట్లని పలికె గంభీరఫణితి.

65

మ.

విను, మాయాసతి! సర్వజంతువులకుం [84]బేర్వేఱఁ దుల్యాంగనా
జనముం గొబ్బున యుష్మదంశమున సంజాతంబుగాఁ జేయు, చే
సినఁ, [85]గాంతాపురుషవ్రజంబు మిథునశ్రీ బొంది, యన్యోన్యమో
[86]నిబద్ధంబునఁ బాయలేక [87]సురతవ్యాసక్తిఁ గ్రీడింపఁగన్.

66


క.

వారలవలనఁ గుమారకు | మారీవ్రాతంబు వొడము, మఱియును దత్త
త్పారంపర్యవశంబునఁ | దోరములై నిగుడు సంతతులు లోకమునన్.

67


క.

[88]రేతోమయసృష్టిక్రమ | మీతెఱఁగున వృద్ఁ బొందు నింతి! భవన్మా
యాతిశయంబునఁ [89]జేతన | జాతంబు పరిభ్రమించు సంసారమునన్.

68


అవతారప్రసక్తి

సీ.

ఈ జగత్త్రయమున నెచ్చోటనైనను | మించి దుర్జనులు జన్మించిరేని,
వేదోక్తమార్గంబు విపరీతమగునేని, I మునుల యాగంబులు మునిగెనేని,
భూనాయకులు ధర్మహీనులైరేని, స | ద్విజులు విద్యలను గర్వించిరేని,
ధరణిఁ బాతివ్రత్యధర్మంబు చెడెనేని, | విషమదైత్యులు సంభవించిరేని,


తే.

కఠినపాషండజనములు గలిగిరేని, | దురితబలమున సత్యంబు విరిసెనేని,
యప్పు డచ్చోటఁ దగురీతి నవతరించి | దుష్టనిగ్రహ మొనరింతుఁ దోయజాక్షి!

68


వ.

అని యానతిచ్చినఁ బుండరీకాక్షు నాజ్ఞానుసారంబున, నమ్మాయాదేవి స్త్రీ[90]వ్యక్తి
నిర్మాణం బొనరించి, విశ్వసృష్టిచక్రంబు నాక్రమించి ప్రవర్తించె నని రోమశుండు
మార్కండేయునకుం జెప్పి, వెండియు నిట్లనియె.

70


అమరుల ప్రాదుర్భావము

ఆ.

కలితకీర్తిశాలి కశ్యపుఁ డొకనాఁడు, | మానవతిని జెఱఁగు మాసి యనల
నామతీర్థవారి [91]నాల్నాళ్ళు చేసిన | [92]యదితిఁ గాంచి, ప్రముదితాత్ముఁ డగుచు.

71

ఉ.

ప్రేయసిఁ జేరఁదీసి, రతిభేదములం గరఁగింప, నాసరో
జాయత[93]నేత్ర గర్భపుటమం దుదయించిరి విష్ణుభక్తిపా
రాయణులుం, బ్రశాంతులు, నిరంతరధర్మవిశుద్ధ[94]బుద్ధు, లా
మ్నాయపదానువర్తులు ననం దగు దేవవరుల్ క్రమంబునన్.

72


క.

వారలఁ ద్రిజగద్విభుఁ డం | భోరుహలోచనుఁడు నాకభువనమునం దిం
పారఁ బ్రతిష్ఠించె, దయా | పూరితహృదయారవిందభూషితుఁ డగుచున్.

73


దైత్యుల జన్మక్రమము

చ.

పదపడి కశ్యపాహ్వయుఁడు బంధురమోహభరాంధచిత్తుఁడై
మదనరసాతిరేకమున మానవతిన్, దితిఁ బుష్పిణిన్, సుఖ
ప్రదరతిఁ గూడ, దానియుదరంబునఁ బుట్టిరి యాతతాయు, లు
న్మదులు, హరిద్విషుల్, నిగమ[95]నాశకకృత్యులు, దేవశాత్రవుల్.

74


క.

హరి, నిజసేవాపరులగు | సురలకు విద్వేషు లగుచుఁ జూపోపని యా
దురితాత్ముల, దితిపుత్రులఁ, | బరిమార్చుచునుండుఁ ద్రిదశపాలనమునకై.

75


క.

[96]హరికిన్ దేహము సుర, లా ! సురలకు నెగ్గాచరింపఁ జూచినయేనిన్,
హరుఁడైనను విమతుం డా | హరికిం, దత్త్వార్థ మిది మహామునితిలకా!

76


ఉ.

పంకజనాభుఁ డాత్మపదభక్తుల కాపద వచ్చెనేని యా
యంకిలి దీర్చి కాచు, సకలార్థములన్ ఫలియింపఁజేయు, నే
వంక జయంబ యిచ్చు, మునివల్లభ! సజ్జనరక్షకై నిరా
తంకమతి న్వహింపఁడె యతండు ఝషప్రముఖావతారముల్?

77

భూసురప్రతతికృతాపరాధము

సీ.

తొల్లి భూమిసురుల్ తోయజాసను మీఱ | వేదాది[97]విద్యాప్రవీణు లగుచు
జగతిపై వర్తించు [98]నిగమతత్త్వార్థమ్ము | విడిచి యపార్థముల్ నొడివికొనుచు
గర్వాంధులైనఁ, దద్గర్వంబు వారింప | హరి, సోమకుండను నసుర నొకని
నిర్మించుటయు, వాఁడు నిగమంబులను విప్ర | మూలధనం బెల్ల మ్రుచ్చిలించి


తే.

యంబునిధిలోన దాఁగిన, [99]నవనిసురులు | వేదనిహీనులై, గర్వవాద ముడిగి
సంధ్య లుడివోయి, బ్రహ్మవర్చసము దొలఁగి | విహితయాగాదిసత్క్రియారహితు లగుచు.

78


క.

ఆపద్భవమగు పశ్చా | [100]త్తాపంబునఁ బొంది, పూర్వధర్మవిశేషో
ద్దీపితసుజ్ఞానంబున | శ్రీపతి మది నిల్పి తపము చేసిరి విప్రుల్.

79


ఉ.

నిర్గతగమ్యులైన యవనీసురు లుగ్రతపంబు సేయ, నం
తర్గతరోషుఁడై జలజనాభుఁడు దా శరణాగ[101]తావనా
నర్గళసత్కృపాపరత నత్తఱి ముందఱ నిల్చి, భూమరు
ద్వర్గముతోడ నిట్లను, నుదారగభీరవచోవిచర్చికన్.

80


చ.

వినుఁడు! మదీయరూపమగు వేదము నిందయొనర్చు మత్తులం
దునుముదు, విప్రులౌట మిముఁ దున్మగరాక, శ్రుతిప్రపంచముం
బనుపడ దాఁచినాఁడ, నిగమంబులఁ జేయుట విప్రకోటికిం
గనుఁగొన జీవుకన్న నధికంబుగదా! వివరింపనేర్చినన్.

81


క.

పశ్చాత్తాపంబునఁ గృత | నిశ్చయులై తపము సేఁత నిందా[102]సత్ప్రా
యశ్చిత్తమయ్యె, మీ రిఁక | నిశ్చిత్తులు గండు, మగుడ నిగమము లిత్తున్.

82


వ.

అని యుపలాలించి, యమ్మహీసురుల వీడ్కొని వారిజోదరుండు పారావారంబు
నకుం జని.

83

మత్స్యావతారవర్ణనము

సీ.

మధ్యాహ్నమార్తాండమండలప్రతిమాన | దారుణదీర్ఘనేత్రములతోడ
[103]నంత్యకాలోద్దండయమదండచండతా | లంఘనచతురవాలంబుతోడ
తిమితిమింగిలముఖ్యసమధికాంభశ్చర | గ్రాసార్థవివృతవక్త్రమ్ముతోడ
మైనాకముఖశైల[104]రీణతాయోగ్యాంగ | [105]సంధిగృహప్రపంచంబుతోడ


తే.

నొకమహామీనమై శౌరి యుదధిలోన | దురము గావించి [106]సోమకాసురుని దునిమి
శ్రుతులఁ గొనివచ్చి మేదినీసురుల కిచ్చె | నన, మృకండుతనూజుఁ డిట్లనియె మునికి.

84


చ.

అకట! నిజప్రయోజనసహాయతకై హరి తానె మున్ను [107]సో
ముకుని సృజించి, క్రమ్మర సముద్రములోన వధించెనన్న, నే
రికి విన నింపుగాదు; విషవృక్షమునైనను బెట్టి పెంచి, తాఁ
బెకలిచివైచునే కరుణపేరు నెఱుంగని ఘాతుకాత్ముఁడున్?

85


వ.

అనిన మార్కండేయునకు రోమశుం డిట్లనియె.

86


సీ.

వినుము, కార్యార్థమై వనజాక్షుఁ డొకవేళ | తనదాసులం దొకతప్పు వెట్టి,
యవనిపై రాక్షసులై సంభవము నొంది | గర్వితులగువారి గర్వ మడఁపుఁ
డని యానతిచ్చిన, నావిష్ణుభక్తులు | దారుణ బాహాప్రతాప మమరఁ
గ్రవ్యాదులై పుట్టి గర్వితారాతుల | నణఁగించి కృతకార్యులైన పిదప,


తే.

వీరు నా చేతఁ దెగ కన్యవీరవరుల | చేత హతులైన ముక్తికిఁ జేర రనుచు
నాత్మఁ దలపోసి, సమరంబులందుఁ దఱమి | తానె [108]వధియించు హరి యాతుధానవరుల.

87


క.

హరి యెవ్వనిఁ దాఁ జంపక | పరుచేఁ జంపించు, వాఁడు భవ[109]బంధుండై
ధరణీతలమున నక్తం | చరవంశమునందుఁ దిరుగ జననము నొందున్.

88


తే.

సురలు గర్వింప, యామినీచరులచేత | మానభంగంబు నొందించు; దానవేంద్రు
లాత్మదర్పింప, నప్పు డాయమరవరుల | చేతఁ దగుశిక్ష చేయించు శ్రీవిభుండు.

89

వ.

అని మత్స్యావతారవృత్తాంతంబు చెప్పి, సంతతానందుండును, రోమహర్షుండు నగు
రోమశుండు వెండియు నిట్లనియె.

90

కూర్మావతారవర్ణనము

మ.

హరిఁ బూజింపక దేవదైత్యులు మహాహంకారసంపన్నతా
గరిమన్ సాహసవంతులై, నిజభుజాగర్వంబు ప్రేరేప, మం
దరశైలంబున సాగరంబుఁ దరువన్, దద్వార్ధిమధ్యంబునన్
గిరిరాజంబు మునింగె, దానవవరుల్ గీర్వాణులుం జూడఁగన్.

91


మ.

సమదామర్త్యనిశాచరేశ్వరభుజాసత్త్వోద్భవంబైన గ
ర్వము సర్వంబును వీటిఁబుచ్చి, కరుణావ్యాసంగుఁడై , కూర్మరూ
పమునం దోఁచి మురారి యెత్తె భువనప్రఖ్యాతిగా [110]బాఢసం
భ్రమ[111]నశ్యజ్జలజంతుజాల మగు నామంథా[112]నకుత్కీలమున్.

92


క.

వ్రతదానతీర్థసేవా | క్రతుముఖ్యములైన విహితకర్మంబులు శ్రీ
పతి వర్జితంబులైనను | బ్రతిహతములు గాక యున్నె బహువిఘ్నములన్.

93


ఉ.

వెండియు దేవదానవులు విష్ణుపదాంబుజభక్తి లేక యు
ద్దండమదంబునం దిరుగఁ, దద్బల[113]గర్వము మాన్పఁ బంకజా
క్షుం డొకశాపకైతవము చూపి, జయాదుల దైత్యయోనిఁ బు
ట్టుండని [114]పంప, నందొకభటుండు హిరణ్యవిలోచనాఖ్యుఁడై.

94


ఉ.

ధారుణిఁ బుట్టి, బాహుబలదర్పితుఁడై, కనకాచలంబు బృం
దారకమందిరం బనుచుఁ దద్గిరితో ధరఁ బెల్లగించి, గం
భీర పయోనిధానమునఁ బేర్చి [115]గుభిల్లన [116]వైచె, వైచినన్
భూరిభయంబునం దివిజపుంగవముఖ్యులు కంపితాత్ములై.

95


శా.

బాహాగర్వము లుజ్జగించి, కరుణాపాథోనిధిం, బక్షిరా
డ్వాహుం [117]బ్రస్తుతి సేయ, విష్ణుఁడు దయావర్ధిష్ణుఁడై వచ్చి వా
రాహాకారము దాల్చి యెత్తె, నిజదంష్ట్రాదండకోటీఘనో
త్సాహుండై సచరా[118]చరంబగు ధరా[119]చక్రం బవక్రాకృతిన్

96

క.

దళిత హిరణ్యాక్షతనూ | గళితాసృఙ్మాంసశోణఘనఘోణాగ్రో
జ్జ్వలుఁడై ధర యె త్తిన హరిఁ I బలుమఱు వినుతించి రమరపతి మునిముఖ్యుల్.

97


క.

వినుము, క్రమంబున విజయుం | డనునతఁడు హిరణ్యకశిపుఁ డను దానవుఁడై
జనియించిన, నరకేసరి | తనువున హరి వాని నఖవిదారితుఁ జేసెన్.

98


వ.

అని చెప్పిన, మార్కండేయుండు విస్మితుండై, యంభోధరగంభీరస్వరంబున
రోమశున కిట్లనియె.

99

వరాహావతారవర్ణనము

సీ.

అనఘ! విశ్వేశ్వరుం డగు శంకరునకు నా | వాసమై యుండుఁ గైలాసశిఖరి,
యారాజతాచలం బసమానశృంగంబు | గాఁ బ్రసిద్ధికి నెక్కెఁ గాంచనాద్రి,
సకలాశ్రయము రత్నసానుశోభితమునై | యామేరుగిరి యుండు భూమినడుమ,
నది నవఖండమై పదికోట్లయోజనం | బుల వెడల్పున నొప్పు భూరిమహిమ,


తే.

నట్టి భూమండలమునెల్లఁ జుట్టి పట్టి | దనుజుఁ డేరీతి [120]జలధిలో మునుఁగవైచె?
నింత బాహాబలము వాని కెట్లు గలిగె? | నీ రహస్యార్థ మెఱిఁగింపు మిద్ధచరిత!

100


వ.

అనిన, రోమశుం డిట్లనియె.

101


చ.

వినుము మునీంద్ర! యాదనుజవీరుని దీర్ఘభుజాయుగంబు కాం
చనగిరిసార, మాతఁడు నిజంబగు నల్క సురాద్రి వార్ధిలో
మునుఁగఁగవైచి, దేవతలమూల [121]మడంచెద నంచు, నాత్మనా
శనసమయంబు గానక, ససంభ్రముఁడై కనకాచలేంద్రమున్.

102


ఆ.

పెనఁచి పట్టి, యూఁచి, పెకలింప [122]నుంకించు | నంత, రజతశైలమందు నున్న
భూతనాథుఁ [123]డలిగి బొటమనవ్రేల నా | త్రిదశశిఖరిఁ [124]గ్రుంగ నదుముటయును.

103


క.

హరచరణాంగుష్ఠంబునఁ | బరిపీడితమగుచు, దివిజపర్వత మేనూ
టిరువదియోజనములు స | త్వరమున దిగఁబడియె ధరణివలయముతోడన్.

104


వ.

ఇట్లు ధరావలయంబుతో సురనిలయంబగు సువర్ణభూధరంబు రసాతలంబున
గ్రుంగిన.

105

మ.

తలవంపయ్యె భుజంగరాజునకుఁ, దద్ధాత్రీభరం బానఁగా
నలవింతైనను [125]1లేమిఁ గూర్మపతి సర్వాంగంబులుం గుంచి య
ప్పులపాలై తిరిగెన్, దిశాకరి చయంబుం బెక్కుగండంబులం
జలనం బుప్పతిలంగ మ్రొగ్గెఁ గడునాశ్చర్యంబుగా నత్తఱిన్.

106


ఉ.

భేదము మాని వార్ధు లొక[126]పెట్టున నాల్గును మేరదప్పి, యే
కోదకమైనఁ గాంచి, సురయూధపులెల్ల భయాకులాత్ములై
యీదెస మాన్ప దిక్కుగలదే హరిదక్కఁ[127]గ నంచు, నాపదం
భోదసమీరు, నాపరమ[128]పూరుషు నిట్లు నుతించి రందఱున్.

107


సీ.

[129]“సకలజగన్నాథ! శంఖచక్రాంకిత! | జలజాలయాధీశ! జలజనయన!
దళి[130]తరాక్షస! జగత్కల్యాణ! సజ్జన | నిలయ! నీరదనీల! నీలదేహ!
గ్రహ[131]నాథ తారకారాజ రాజిత[132]నేత్ర! | ఘనతరహారకంకణకిరీట!
సచ్చిదానంద! నిశ్చల! దయాసాగర! | సత్య! సత్యజ్ఞాన! [133]సత్యసహిత!


తే.

జలజజాతాదినతనిజచరణనలిన! | అండజాధీశకేతన! యజ్[134]5దాత!
సతతనారదసంగీతసక్తచిత్త! | శ్రితజనానీకరక్షణ! శేషశయన!

108


క.

జయ సర్వమంగళాలయ! | జయ జయ యోగీంద్రహృదయజలరుహ వసతే!
జయ గోవింద! మురారే! | జయ జయ నః పాహి” యనిరి సకలామరులున్.

109


చ.

ఉరవడి వార్థిలో మునుఁగుచున్నది మేరువు ధాత్రితోడ, నె
వ్వరు నిది మాన్సనోపరు, జవంబున నేక్రియనైన రాక్షసుం
బొరిగొని, నీటిలోఁ గలసిపోయెడి ధారుణి నుద్ధరింపవే!
హరి! జగదీశ! మాధవ! జనార్దన! దానవలోకమర్దనా!

110


వ.

అని యివ్విధంబున.

111


క.

హరిమాయామోహితులై | సుర లది శీతాంశుఖండజూటకృతముగా
నెఱుఁగక, రాక్షసకృత మని | మొఱలిడుటయు, నాలకించి మురభంజనుఁడున్.

112

ఉ.

వారిభయంబు మాన్ప, సురవత్సలుఁ డాదివరాహమూర్తియై
ఘోరనిశాచరుం దునిమి, కుంభిని మేరువుతోడ నెంతయున్
బీర మెలర్పఁ, గొమ్ముతుద వేయవపాలున నుద్ధరించి, బృం
దారకకోటిఁ గాచె, [135]నది నాకు హరుం డెఱిఁగించె సర్వమున్.

113


చ.

అనుడు, మృకండునందనమహాముని రోమశుఁ బల్కె, నో కథా
వననిధి! యిందిరావిభుఁడు వామనమూర్తి ధరించి, యాచరిం
చిన చరితంబు కర్ణపుటచిత్తరసాయన మండ్రు కోవిదుల్,
వినియెదఁ దచ్చరిత్రము ప్ర వీణత [136]మీఱ నుపన్యసింపవే!

114


వ.

అనిన రోమశుం డమ్మహాత్మున కిట్లనియె.

115

వామనావతారవర్ణనము

మ.

హరి, రక్షోహరణంబు సేయుటకు మాయావామనాకారుఁడై
గరిమన్ ఛత్రము, యజ్ఞసూత్రమును, సత్కౌపీనమున్, మౌంజియున్
సరవిం దాల్చి, బలీంద్రుఁ గల్గొని, “విభో! స్వస్త్యస్తుతే" యంచు, వి
స్ఫురితాశీర్వచనంబు లిచ్చి, కుహనాపూర్వంబుగా నిట్లనున్.

116


చ.

అరయఁగ [137]మేరువైనఁ బరమాణునిభంబగు నన్య[138]యాచ్ఞకుం
దొరఁ[139]కొనెనేని, నీగతి ఘనుండగు నుత్తమదాత కల్గినం
దిరముగ నర్థి విద్య సురధేనువుపోల్కి ఫలించు, సిగ్గునం
[140]దఱుఁగని యర్థి మేరుగిరిఁ దక్కువగాఁ దలపోయు నుబ్బునన్.

117


క.

అడుగుట హీనము, వేఁడిన | నిడకుండుట యంతకన్న హీనము, విభు నె
క్కుడు వేఁడఁగఁ దగ దర్థికి, I నొడఁబడఁగా వేఁడ నిచ్చు టొప్పుం బతికిన్.

118


ఉ.

కుందక యిత్తు వర్థులకుఁ గోరినయర్థము లంచు , గోఁచి ము
ప్పందుము గట్టఁగాఁ దలఁచు పామరవిప్రుఁడఁ గాను, నాకు నా
నందముతోడ నిమ్ము చరణత్రయమాత్రధరిత్రి, దాన మి
న్నందెద, నల్పదానమున నైన సుఖంపనివాఁడు నార్యుఁడే?

119

క.

[141]అనవుడు, బలి యొడఁబడుటయు | దనుజాంతకుఁ డప్పు డొకపదంబున ధరణిన్,
ఘనమార్గము నొక[142]చరణం | బునఁ గలయఁగ నాక్రమించె భువనోన్నతుఁడై.

120


క.

దానవవర్యుని నురగ | స్థానంబున నిల్పి, యభయదానంబున ని
త్యానందపూరపూరిత | మానసులంజేసె హరి, యమర్త్యుల నెల్లన్.

121


క.

ఆవేళ మీఁదఁజూచిన | శ్రీవరు చరణంబు జలముచే నింపుగ వా
ణీవిభుఁడు గడుగ, నది దు | ర్గావల్లభుమౌళి నిల్చె గంగానదియై.

122


ఉ.

మానితలీలఁ బద్మజకమండలుపూరితవారి, యిందిరా
జానిపదంబు సోఁకి, దివిషన్నదియై ప్రవహించి, స్వర్గసో
పానమనంగఁ బొల్చె, విను, పాతకి యైనను ముక్తి[143]గామియౌ
మానవుఁ డానదిన్ మకర[144]మాఘదినంబులఁ దానమాడినన్.

123


వ.

అని చెప్పి వెండియు నిట్లనియె.

124

పరశురామావతారవర్ణనము

ఉ.

తామరసేక్షణుండు జమదగ్నికి రాముఁడనం జనించి, యు
ద్దామమదంబునం బితృవధం బొనరించిన క్షత్రియాన్వయ
స్తోమముఁ జుట్టుముట్టి, నిజదోర్బలశౌర్యమహత్త్వ మేర్పడన్
భీమకుఠారపాతములఁ బేర్చి హరించెఁ ద్రిసప్తవారముల్.

125

శ్రీరామావతారవర్ణనము

చ.

జయవిజయాహ్వయుల్ మును నిశాచరులై [145]జలజాయతాక్షుచే
క్షయమును బొంది, రెండవ యుగంబున రావణకుంభకర్ణులై
రయమున లోకముల్ చెఱుప, రాముఁడనా నుదయించి, వారి ని
ర్దయత వధించెఁ జక్రి, విను, తచ్చరితంబు సవిస్తరంబుగన్.

126

ఉ.

ఓమునిసార్వభౌమ! సుగుణోజ్జ్వల! నిష్ఫలనిర్మితంబు లీ
తామరచూలిచే విరచితంబగు విశ్వమునందు, మేషికా
స్తోమగళస్తనంబులును, శోభితదానవిహీనహస్తముల్,
రామకథాసుధారసతరంగిణిఁ దేలని కర్ణజిహ్వలున్.

127


వ.

కావున, రామాయణకథాక్రమంబు వినిపించెద. ఆకర్ణింపుము. తొల్లి రావణకుంభ
కర్ణాదిదానవబాధాపరిపీడితులై దేవతలు ప్రార్థించిన, నారాయణుడు భానువంశోద్భవుం
డగు దశరథనరేంద్రునకుం దనయంశంబున రాముండును, శేషునియంశంబున లక్ష్మ
ణుండును, శంఖచక్రాంశంబుల భరతశత్రుఘ్ను లన, నలువురు తనూభవులం బుట్టించిన,
వారు [146]క్రమక్రమప్రవర్ధమాను లగుచుండ, నొక్కనాఁడు.

128


క.

గాధితనూజుఁడు దశరథ | భూధవుకడ కేఁగుదెంచి, పూజితుఁడై శౌ
ర్యాధికుల రామలక్ష్మణ | యోధుల నిజయజ్ఞరక్ష యొనరించుటకున్.

129


ఉ.

పాటవ మొప్ప వేఁడి, జనపాలకుఁ డంపిన, వారితోఁ దపో
[147]వాటిక కేఁగుచో, నెదురు వచ్చిన రాక్షసిఁ, గామరూపిణిన్,
దాటకఁ జూప, నాదశరథక్షితిపాగ్రసుతుండు దాని లా
లాటము గాఁడనేసిన, నిలాస్థలిఁ గూలె నిశాటి చయ్యనన్.

130


క.

దాశరథి మఱియు యజ్ఞవి | నాశకులగు నుగ్రదైత్యనాథుల నుద్దం
డాశుగశతములఁ బొరిగొని | కౌశికుయాగంబు పూర్ణగతి నొందించెన్.

131


చ.

ప్రథనము లిట్లు గెల్చి, మునిరత్నముతోడ స[148]లక్ష్మణంబుగా
మిథిలకు నేఁగి, శంకరుని [149]మెచ్చులచాపము రెండుగాఁ బరి
శ్లథ మొనరించి, సీత, శుభలక్షణఁ గైకొని, భార్గవుం బర
శ్వథధరు నోర్చి, మోదమునఁ జాఁగి యయోధ్యకు [150]వచ్చి, వెండియున్.

132


క.

కేకయతనయావశుఁడై | భూకాంతుం డనుప, జనకపుత్రికతో సు
శ్లోకుండగు లక్ష్మణుతో | సాకేతపురంబు వెడలి సరభసగతులన్.

133

సీ.

దండకారణ్యంబు దరిసి, యచ్చోటు వాసి | చని, కుంభజాశ్రమమున వసించి,
తదనంతరము భరద్వాజాశ్రమమున శూ | ర్పణఖ నాసికఁ దున్మి పాఱవైచి,
ఖరదూషణాది రాక్షసుల ఖండించిన | దద్వార్త విని యల్గి, దశముఖుండు
మారీచు ననిపిన, నారాక్షసుఁడు చిత్ర | మృగమూర్తి దాల్చి సమీపసీమ


తే.

జనకజాదృష్టిపథమున సంచరించి, | తన్నుఁ బట్టంగ వచ్చిన దశరథేంద్ర
తనయు నెలయించుకొని, కొంతదవ్వు చనిన | రావణాసురుఁ డంత సంభ్రమముతోడ.

134


తే.

పర్ణశాలానివాసినిఁ, బరమసాధ్వి, | జనకసుతఁ దేరిపైఁ బెట్టుకొని రయమున
నాత్మపురి కేఁగె, నంత మాయామృగంబుఁ | జంపి రాముఁడు మగుడి యాశ్రమము చేరి.

135


క.

ధరణితనూభవఁ గానక | పరితాపము నొంది, [151]శోకపరవశుఁడై సో
దరసహితంబుగఁ బంపా | సరసీతీరమున కరిగి, జనపతి యచటన్.

136


ఉ.

పావనిఁ గాంచి, తన్మధురభాషల కుత్సవమంది, చేరి, సు
గ్రీవునితోడ సఖ్య మొనరించి, [152]1నిజస్థితి భానుసూనుచే
తో[153]విహితంబు సేయుటకు దుందుభికాయముఁ బాఱమీటి యు
ద్ధావనిఁ గూల్చె వాలి నొకయమ్మున ఖేచరులెల్ల మెచ్చఁగన్.

137


ఉ.

వానరరాజ్యపీఠమున వారిజమిత్రకుమారు నిల్పి, సీ
తానలినాక్షి పోయిన[154]పథం బరయన్ హనుమంతు నంప, నా
ధీనిధి గోష్పదంబు పగిదిం జలరాశి నతిక్రమించి, లం
కానగరంబు [155]సొచ్చి, జనకప్రియనందనఁ గాంచి నమ్రుఁడై.

138


క.

విభుఁ డిచ్చిన మణిముద్రిక | నిభగామిని కీయ, నమ్మహీసుత రామ
ప్రభుని గనుఁగొనినకైవడి | శుభహర్షము నొందెఁ, బవనసూనుఁడు మఱియున్.

139


ఉ.

రామునిసేమముం దెలిపి, రమ్యమృదూక్తుల నూఱడించి, యా
రామ యొసంగినట్టి ఘనరత్నముఁ గైకొని, యుత్సహించి, లం
కామణి[156]సౌధజాలములు కాలిచి, యక్షకుమారుతోడ ను
ద్దామబలాఢ్యులైన బహుదానవులం బరిమార్చి ధీరతన్.

140

మ.

తిరుగ న్వారిధి దాఁటి, రాఘవధరిత్రీనాథచూడామణిం
గరమర్థిం గని, 'కంటి సీత' ననుచుం గల్యాణవార్తాపుర
స్సరభావంబున, నింతిచేఁ గొనిన భాస్వద్రత్న [157]మర్పించి, తా
ధరణిం జాఁగిలి మ్రొక్కి నిల్చిన, మహోత్సాహంబుతో రాముఁడున్.

141


ఉ.

ప్రాణము ప్రాణమైన ప్రియభామిని మంగళవార్త దెచ్చి, నా
ప్రాణము నిల్పి, లోకమున భానుకులోద్ధరణప్రసిద్ధపా
రీణుఁడవైతి, తావకచరిత్ర [158]1విచిత్రమటంచు నా జగ
త్ప్రాణకుమారునిం బొగడి, పల్మఱుఁ గౌఁగిటఁ జేర్చి, యత్తఱిన్.

142


క.

భానుసుతానీతములగు | వానరసైన్యములతోడ వసుధ చలింపం
గా [159]నరిగి, వార్ధిఁ గట్టి, చ | మూనివహము సేతుమార్గమున దాఁటుటయున్.

143


సీ.

శరణాగతత్రాణబిరుదవిఖ్యాతుఁ డా | జానకీపతి, విభీషణుఁడు వచ్చి
మఱువుచొచ్చినఁ గాఁచి, మహిమ లంకాపుర | ప్రాకారముల చుట్టు వార [160]విడిసి,
కుంభకర్ణుని శౌర్యజృంభణంబు హరించి, I నారాచముల మేఘనాదుఁ గూల్చి,
దశకంఠకంఠకాంతారంబు నిజబాణ | [161]వితతిదావాగ్ని కాహుతి యొనర్చి,


తే.

జయము గొని, సీతతోడ లక్ష్మణునితోడఁ | బుష్పకారూఢుఁడై సైన్యములు భజింప
సురలు జయపెట్ట, నలరులసోన గురియఁ | దిరిగి రాముఁడు సాకేతపురికి నరిగె.

144


వ.

ఇవ్విధంబున జయవిజయులు రెండవజన్మంబున రావణకుంభకర్ణులై, రాఘవేశ్వరు
బాణంబులచేత ప్రాణంబులం బాసి, మూఁడవజన్మంబున ద్వాపరయుగంబునందు దౌవారికులు
శిశుపాలదంతవక్త్రులై జనియించి, లోకకంటకులై వర్తించుచున్న సమయంబున.

145

కృష్ణబుద్ధకల్క్యవతారకార్యములు

చ.

జలరుహలోచనుండు, హరి, సాధుజనావనశాలి, దేవతా
తిలకము, కృష్ణనామమున దేవకిగర్భమునం జనించి, య
చ్చలమునఁ గంస కేశి ముర సాల్వులతో శిశుపాల దంతవ
క్త్రులఁ దెగటార్చి, గోపికలకుం బ్రియుఁడై విహరించె వేడుకన్.

146


తే.

బుద్ధరూపంబు దాల్చి యంభోజనాభుఁ | డసురవీరుల మోహాబ్ధియందు ముంచె;
భావికాలంబునకుఁ గల్కిభావ మంది | ఖలజనంబుల మర్ధింపఁగలఁడు శౌరి.

147

క.

అది గావున, హరిచరితము | తుద మొద లిది యనుచుఁ దెలియఁ, దోయజభవుఁడున్,
బదినూఱుతలలు దాల్చిన | సదయుండును నోపఁ, డితరజనముల తరమే?

148


వ.

అని పలికిన రోమశునకు మార్కండేయుం డిట్లనియె.

149

మార్మికప్రశ్నము - ధార్మికసమాధానము

ఉ.

రోమశ! నీదుపల్కుల విరోధము గానఁగవచ్చె, నిందిరా
స్వామికరంబులం దెగినవారలు ముక్తి భజింతురంటి ము
న్నీమహి నా జయాదు లుదయించిరి ముమ్మరు ధాత్రి విష్ణుతే
జోమృతు లయ్యు, [162]నట్టి దిది సూక్ష్మము, నా కెఱిఁగింపు మేర్పడన్.

150


వ.

అనిన రోమశుం డిట్లనియె.
సీ. జయవిజయు లమరశాపంబు దగిలినఁ | బన్నగశాయికి విన్నవింప,
“నేడుజన్మంబు లహీనవైష్ణవభక్తి | సహితులై విప్రవంశమునఁ బుట్టుఁ
డటమీఁద మీకు శాపావసానం బగు” | నని పుండరీకాక్షుఁ డానతీయ,
నన్ని జన్మములు నీసన్నిధానము లేక | కాలంబు గడపుట - గలదె మాకు?

151


తే.

అరులమై మూఁడుజన్మము లంది, పిదప | మిమ్ముఁ జేరెద మని తారె సమ్మతించి
నలిననాభునితోఁ బల్కినారు గాన | ననఘ! జన్మత్రయము వారి కందవలసె.

152


వ.

అని యిట్లు దశావతారవృత్తాంతం బెఱింగించిన రోమశునకు మార్కండేయుం
డిట్లనియె.

153


క.

దేవకివరగర్భంబున | శ్రీవల్లభుఁ డుదయమంది, శ్రీకృష్ణుండై
యేవిధమున శిశుపాలమ | హీవరు [163]తల దునిమె నాన తిమ్ము మునీంద్రా!

154

కృష్ణావతారవర్ణనము

ఉ.

నావుడు, రోమశుండు మునినాథున కిట్లను, బ్రహ్మచేఁ బ్రియం
భావుకలీల, మున్ను శిశుపాలముఖు ల్వరమంది, మత్తులై
దేవతలన్ హరించి, దశదిక్కుల నొక్కట నాక్రమించి, బా
హావిపులప్రతాపమున నడ్డము లేక చరింప నయ్యెడన్.

155

మ.

[164]అమరాధీశసహాయులై సురలు, దుగ్ధాంభోధిలో శేషభో
గమహాతల్పమునన్ శయించిన రమా[165]కాంతున్ , జగద్గర్భునిం
గమలాక్షుం గని, చాఁగి మ్రొక్కి, కరయుగ్మంబుల్ శిరోవీథులం
బ్రమదంబొప్ప [166]ఘటించి, యిట్లని నుతింపంజొచ్చి రాదేవునిన్.

156


చ.

నియత[167]గుణచ్ఛటారహిత! నిర్జర[168]వంద్య! విరోధిదైత్యదు
ర్జయ! కరుణాసుధారసవిరాజితనేత్రసరోజ! సంశ్రిత
ప్రియ! కమలాముఖాంబురుహభృంగకులోత్తమ! నిత్య! నిర్మలా
శ్రయ! శశిభాస్కరాక్షియుగ! శంఖసుదర్శనశార్ఙ్గలాంఛనా!

157


సీ.

మాధవ! నరసింహ! మధుకైటభాంతక! | దేవ! జగన్నాథ! [169]దివిజవంద్య!
ధారాధరప్రభాపూరనిర్మలదేహ! | దారుణదైత్యేంద్రదర్పహరణ!
శతకోటిమన్మథసౌందర్యసంపన్న! | సాంద్రవైభవ! పతగేంద్రగమన!
కుండలద్యుతిగమ్యగండమండలభాగ! | దర్వీకరేశ్వరతల్పశయన!


తే.

సతతనారదసంగీత[170]సక్తహృదయ! | సచ్చిదానంద! నిర్గుణ! సర్వపూర్ణ!
భక్తజనలోకరక్షణ! పరమపురుష! | యాపదలఁ బాపి[171] మముఁ బ్రోవు మంబుజాక్ష!

158


ఉ.

భౌతికదేహధారులగు ప్రాణులు తావకనామమంత్రముం
బ్రీతి జపించి, ప్రాగ్దురితబృందము వాసి, పునర్భవాటవీ
వ్రాతము సొచ్చి పోక , యపవర్గముఁ గాంచి సుఖింతు, రర్కజై
వాతృకనేత్ర! భక్తజనవత్సల! మాధవ! మేదినీధవా!

159


శా.

ఆశాపాశవిముక్తులయ్యును వశిష్ఠాదుల్ మహాత్ముల్, పురో
డాశం బెవ్వరిఁగూర్చి వేల్చినను వేడ్కం [172]దత్తదాకారివై
ప్రాశస్త్యంబుగఁ బావకార్పితహవిర్భాగంబులన్ సమ్మదా
వేశం బొప్ప భుజించి, యాగఫల మీవే యిత్తు తత్కర్తకున్.

160

చ.

సరసిజనాభ! నీచరణసారసభక్తివిహీనులైన [173]దు
ష్పురుషులు వేదమార్గములఁ బోవక, దారసుతాదిసక్తులై
దురితము లాచరించి, తుద దుర్గతిఁ బొందుదు, రెంతవారలుం
బరమవివేక! నీమహిమ మపారము ముట్టనెఱుంగనేర్తురే?

161


తే.

అఖిలలోకేశ! పారపర్యంతరూప | పారపారగ! వారిజపత్రనేత్ర!
విశ్వ[174]రూప! నమోస్తుతే వేదవినుత! | పాహి [175]నస్త్రాహి దేవ! శేషాహిశయన!

162


చ.

అని వినుతింపుచుం ప్రణతులై హరికిన్, శిశుపాలముఖ్యదు
ర్జను లుదయించి, పద్మజవరంబున నున్మదులై, జగత్త్రయం
బునకు నొనర్చు బాధవిధమున్ వినిపించినఁ జూచి, యా సనా
తనుఁడగు వేల్పుఱేఁడు ప్రమదంబున వారలతోడ నిట్లనున్.

163


సీ.

అంబుజాసనదత్తమగు వరంబున మదో | [176]న్మాదులౌ శిశుపాలకాదిదనుజ
వీరుల బాధించువిధ మెఱుంగుదు, వారు | సమకాలమునఁ గాని సమసిపోరు,
పదఁడు, నిర్జరులు గోపాలకులయ్యును, | సురకామినులు గోపతరుణులయ్యు,
నామ్నాయములు గోసహస్రంబులయ్యును | మేదినిమిఁద జన్మింపుఁ డిపుడ,


తే.

యంత, యదువంశమందుఁ గృష్ణాహ్వయమున | భువనరక్షాపరుండనై యవతరించి,
దనుజవంశంబు [177]నున్మూలితంబు చేసి, | యెల్లి నేఁటనె భూభారమెల్ల డింతు.

164


వ.

అని, దనుజాంతకుం డంతర్ధానంబు నొందె. వాసవాదులు నిజనివాసంబున కరిగి,
నారాయణోపదిష్ట ప్రకారంబున, నిజాంశంబుల గోపాలకులయ్యు, నమరకామినులు గోపిక
లయ్యును, నిగమంబులు గోగణంబులయ్యును సంభవించిరి. తత్సమయంబున.

165


సీ.

విను ముగ్రసేననందనుఁడు కంసుం డను | వాఁడు, సోదరియైన వనజ[178]ముఖిని,
దేవకి యను నామధేయంబు గలదాని, | వసుదేవుఁ డను యదువంశజునకుఁ
బరిణయం బొనరించి, బహుపదార్థము లిచ్చి, యత్తవారింటికి [179]ననుపఁదలఁచి,
యరదంబుపై వధూవరుల నెక్కించి, తా | సారథియై నిల్చి, తేరు గడపి ,


తే.

నిరుపమోత్సాహభరితుఁడై యరుగుచున్న | యవసరంబున వినువారి కద్భుతముగఁ,
గంసునకుఁ గర్ణశూలంబు గాఁగ, నభ్ర | వాణి యిట్లని పల్కె దుర్వారఫణితి.

166

మ.

క్రమ మొప్ప న్వసుదేవుగేహమున కీకాంతామణిన్, దేవకిం
బ్రమదం బొందుచు నంపె దీ వకట! నీపాలింటికిన్ మృత్యువై
[180]కమలానాథుఁడు నిన్వధింపఁగలఁ, డీకంజాతపత్రాక్షి య
ష్టమగర్భంబున సంభవించి తుదఁ, గంసా! సంశయం బేటికిన్?

167


క.

అని యశరీరియుఁ బలికిన | సునిశితవాక్యంబు, తప్తశూలముమాడ్కిన్
దనచెవులు గాఁడిపాఱిన, | ఘనభయమున సంచలించెఁ గంసుం [181]డంతన్.

168


ఉ.

దేహవినాశమూలమగు తీవ్రవిషావృతమైనయట్టి యా
బాహువుఁ ద్రెంచి, మేను నిలుపందగు నందురు, కాన, సోదరీ
స్నేహము సేయుటొప్ప దని, చెల్లెలి ముందలపట్టి, యాజగ
ద్ద్రోహి గళంబుఁ ద్రెంచుటకు దోరసి యెత్తినఁ, జూచి యత్తఱిన్.

169


క.

వసుదేవుఁడు ప్రాణేశ్వరి | యసువుల [182]పోకడకు నులికి, యాకంసుని సా
హసకృత్యము మాన్పుటకై, | యెసఁగఁగ మృదువాక్యగతుల నిట్లని పలికెన్.

170


మ.

విను, కంసక్షితినాథ! కీర్తిసుగుణాన్వీ[183]తుండ, వీ సోదరీ
హననం బిట్లొనరింప నీ కగునె? విప్రానీకముం, గామినీ
జనులున్ [184]రాజు కవధ్యు, లీగగనభాష ల్నమ్మఁగావచ్చునే?
మనుజుం డాడిన నమ్మరాదఁట! సుధీమార్గంబుఁ బాటింపవే!

171


చ.

చలమున వేఁగురించి సతిఁ జంపినఁ, బాపము దక్కుఁగాని, కాఁ
గలపని కాకమానదు, జగన్నుత! కోపము మాను, ధర్మముం
దలఁప, దయావిశేషము మనంబున నిల్పుము, భామఁ [185]దున్మఁగా
వల, దటుగాకయున్న జనవల్లభ! వి న్మొకమాట చెప్పెదన్.

172


క.

సుదతీమణి గర్భంబున | నుదయించిన సుతులఁ జంప నొసఁగెద, నీబె
ట్టిద ముడుగు మనినఁ, గంసుఁడు | మదిఁ గోపము [186]మట్టుపఱచి మహితప్రౌఢిన్.

173

తే.

దేవకీవసుదేవులఁ దిరుగఁ దెచ్చి | యాత్మపురమునఁ గారాగృహంబునందు
నునిచెఁ, గొన్నాళ్ల కొకపుత్రుఁ [187]డుదితుఁడైన | దేవకీభర్త కంసక్షమావిభునకు.

174


క.

ఆనినుఁగు నొసఁగుటయుఁ, ద | త్సూనృతమున కాత్మ మెచ్చి, తోడనె మగుడం
గా నిచ్చెను వసుదేవున | కానందనుఁ గంసనృపతి యానందమునన్.

175


ఉ.

అంతట నొక్కనాఁడు కలహాశనమౌనివరుండు కంసభూ
కాంతుని గానవచ్చి, నృపకల్పితపూజలఁ బ్రీతిఁ బొంది, శ్రీ
కాంతుఁడు దేవకీతరుణిగర్భమునం దుదయించు గోప్యవృ
త్తాంతము చెప్పిపోవుటయు, నా చపలాత్ముఁడు భీతచిత్తుఁడై.

176


క.

[188]తొలుచూలువాఁడు మొదలుగఁ | జెలియలికిం బుట్టినట్టి శిశువులఁ, గోపా
కులచిత్తుఁడగుచు నార్వురఁ | బొలి[189]యించి, దురాత్ముఁ డుచితబుద్ధిచ్యుతుఁడై.

177


తే.

జనకుఁడగు నుగ్రసేనుని, ననపరాధు |శృంఖలాబద్ధచరణుని జేసి యునిచి,
జగతి [190]వాలించె నా జరాసంధముఖ్య | దానవశ్రేణి తనమాటలోన నడవ.

178

శ్రీకృష్ణజననము

ఉ.

వారిజనాభుఁ డంత యదువంశమునం దుదయించి, 'మేదినీ
భారము [191]మానుఁగా!' కనుచు భావమునం దలపోసి, యోగమా
యారమణిం గనుంగొని, ప్రియంబున నిట్లను “దేవి! దేవకీ
నీరజగంధిగర్భమున నిల్చినవాఁ డురగేంద్రుఁ, డాతనిన్.

179


తే.

వెలఁది! నీమాయ నచ్చోటు వెడలఁ దిగిచి | రోహిణీగర్భ[192]మందు నేరుపున నిడుము;
అల యశోదకు నందన వగుము నీవు; | ఏను దేవకియం దుదయించువాఁడ."

180


క.

అని నియమించిన, మాయా | వనితామణి యట్ల చేసె, వారిజనాభుం
డును దేవకి గర్భంబున | నొనరఁ బ్రవేశింప, నాపయోరుహముఖికిన్.

181


ఆ.

[193]తవనతప్పి యుములు తఱుచయ్యె మోమునఁ | [194]బలుకఁబాటు గొంత తొలఁకరించె,
నలసభావ మొదవె, నఖిలార్థములమీఁద | నరుచి పుట్టెఁ, దొడలు మెఱుఁగులెక్కె.

182

క.

పురుషోత్తముఁ డుదరంబునఁ | బెరుగన్, సతిబడుగునడుము [195]పెంపు వహించెన్,
సిరిగల దొర లోఁబడినను | నిఱుపేదలకై నఁ గలిమి [196]నెలకొనకున్నే?

183


చ.

హరి యుదయించి క్రోలఁగలఁ డంచుఁ దలంచి, సుధారసంబు వి
స్ఫురితసువర్ణకుంభములఁ బూర్ణము చేసి, వినీలపాత్రముల్
మఱువుగ మీఁద మూసినక్రమంబునఁ, జూడఁగ నొప్పె దేవకీ
తరుణికుచంబు, లగ్రములఁ - దార్కొనియుండిన [197]నీలిమంబునన్.

184


తే.

అతివ భక్షింప లోనికి నరుగు మంటి | పెల్ల గమి యొప్పెఁ, 'దనభారమెల్ల మాన్పు'
మనుచు గర్భస్థుఁడైన పద్మాక్షుఁ జేర | సూక్ష్మగతి నేఁగు మేదినీసుదతి యనఁగ.

185


తే.

దేవకీదేవిగర్భమందిరములోని | విష్ణుదీపంబు కొడి నాభి వెడలి పాఱ,
దాని యంజనరేఖచందమునఁ బొలిచె | మిగుల నలుపెక్కి నూఁగారు పొగడఁ [198]దగుచు.

186


చ.

క్రమమున నిట్టి చిహ్నములు గల్గిన గర్భము, [199]నాఁడునాఁట సం
భ్రమమున వృద్ధిపొంద, దశమంబగు మాసమునందు, సన్ముహూ
ర్తమునను, శంఖచక్రకలితంబగు వేషమువాని, దేవకీ
రమణి, కుమారునిం గనియె, రత్నవిభూషణభూషితాంగునిన్.

187


క.

[200]సుత[201]భూమికాధరుండై | యతివకు నిట్లుదితుఁడైన యబ్జాక్షు, జగ
న్నుతుఁ గనుఁగొని వసుదేవుఁడు | హితవాచాకౌశలమున నిట్లని పొగడెన్.

188


సీ.

జయ సర్వమంగళాస్పద! నిత్య! నిరవద్య! | జయ దయారసపూర్ణచారునయన!
జయ నిత్యకల్యాణ! సనకాదిసంసేవ్య | జయ లోకనాయక! [202]నియతపుణ్య!
జయ శంఖచక్రలాంఛన! కౌస్తుభాంకిత! | జయ కోటికందర్పసదృశరూప!
జయ భాగవతమనోజలజమధ్యనివాస | జయ సర్వ! [203]భోగిప్రశస్త[204]తల్ప!


తే.

జయ రమాకామినీనాథ! సకలపూర్ణ ! | జయ మహేంద్రాదివందితచరణకమల!
జయ సదానందమయ! జగజ్జాలరూప! | జయ ఝషాద్యవతారవిస్పష్ట చరిత!

189

క.

సనకాదియోగిపుంగవు | లును గానఁగలేని నిన్ను, లోకేశ్వరు, నేఁ
గనుఁగొంటి మత్పురాతన | జననార్జితపుణ్యచయము సఫలం బయ్యెన్.

190


క.

కోపించి చంపెఁ గంసుఁడు | చాపలమున మత్కుమారషట్కము, నిఁక నీ
రూప ముపసంహరింపుము | తాపత్రయహరణ! దేవతా[205]నుతచరణా!

191


వ.

అని వినుతించి, సాంత్వనాలాపంబుల విన్నవించిన వసుదేవునకు, నా దేవదేవుం
డిట్లనియె.

192


చ.

భయ మిఁక నేల? కంసముఖపార్థివభంజన మాచరింప నే
నయగతి మీకు నందనుఁడ నైతి, వ్రజంబున నందభామినీ
శయనమునందు న న్నునిచి, చయ్యనఁ దత్సుతఁ దెచ్చి, దేవకీ
శయనము నందుఁ బెట్టుము ససంభ్రమతం జను మీక్షణంబునన్.[206]

193


ఉ.

అని హితకార్యముం దెలిపి, యాశ్రితలోలుఁడు బాలుఁడైనఁ, గ
న్గొని, వసుదేవుఁ డెత్తుకొని, గొంకక రాత్రిఁ గళిందజానదిం
దనరఁగ దాఁటి, [207]నందవనితాశయనంబునఁ బుత్త్రు డించి, త
త్తనుభవఁ దెచ్చి, యాత్మసతితల్పముఁ జేర్చిన తత్క్షణంబునన్.

194


క.

ఆ పిన్నది [208]నినదంబుగ | వాపోయిన, నిద్రదేఱి వాకిటికాడన్
గాపున్నవాఁడు చెప్పినఁ, | గాపురుషాగ్రేసరుండు [209]కంసుం డలుకన్.

195


చ.

పవనజవంబునం బఱచి, [210]పాణిఁ గృపాణముతోడ సోదరీ
భవనము చొచ్చి, [211]కోలుపులి బాలమృగిం గబళించునట్లు, పా
టవమున మేనకోడలి దృఢంబుగఁ బట్టి, శిలాతలంబుపై
[212]న్రవమున నెత్తివైచుటయు, [213]నాశిశు వప్పుడు శక్తిమూర్తియై.

196


తే.

గగనవీథికి లంఘించి, కంసుఁ జూచి, | 'యోరి పాపాత్మ! నీపాలి వైరి వాఁడె
బాలుఁడై యున్నవాఁడు [214]వ్రేపల్లెలోన | నిక్క' మని చెప్పి, తాఁ బోయె నిలువ కచట.

197

వ.

అని చెప్పిన విని కంసుండు నిర్విణ్ణమానసుండై పశ్చాత్తాపంబు నొంది, వీరల [215]నడ్డ
పెట్టనేల? యని దేవకీవసుదేవుల శృంఖలాబంధవిముక్తుల జేసి, నిజనివాసంబున కనిపి,
తాను నాత్మమందిరమున కరిగె. అంత, నట [216]వ్రేపల్లెలోన నందుండు రోహిణీగర్భజాతుం
డగు రామునకును, గృష్ణునకును స్వపురోహితుండగు గర్గుచేత జాతకర్మాదిసంస్కారంబులు
చేయించి, విప్రులకు గోసహస్రంబుల నొసంగి, పరమోత్సాహంబున నున్న సమయంబున.

198


చ.

మదమునఁ గంసభూవిభుఁ డమాత్యులతోఁ గొలువుండి, కృష్ణుఁ డా
యదుకులమందుఁ బుట్టిన రహస్యము సర్వము నొక్కనాఁడు నా
రదమునిచే నెఱింగి, మును రౌద్రముగా దివినుండి యోగినీ
సుదతి యుపన్యసించిన వచోవిధముం దలపోసి, భీతుఁడై.

199


చ.

వ్రజమునఁ బుట్టినట్టి శిశువర్గమునెల్ల వధింపుమంచు నా
కుజనుఁడు పూతనం బనుప, ఘోరనిశాచరి మర్త్యకాంతయై
నిజకుచమండలి న్విషము నించి, చలింపక నందగేహ మ
క్కజముగఁ జొచ్చి, కృష్ణుఁ బొడగాంచి, తగన్ గిలిగింతవుచ్చుచున్.

200

కృష్ణుని బాలక్రీడలు

ఆ.

[217]చేఁపి పాలు గారెఁ జిన్నారి[218]యన్న! నా | చన్నుగుడువు మనుచు సంభ్రమమునఁ
జూచుకంబు నోరఁ జొనిపినఁ, గైతవ | బాలుఁ డపుడు తమకపాటుతోడ.

201


క.

కరములఁ దత్కుచకుంభము | దొరకంగాఁ దొడఁగి పట్టి, దుర్వారబల
స్ఫురణమునఁ గుడువఁ, దనచ | న్నెరియుటయును దైత్యభామ యేచిన నొప్పిన్.

202


క.

విడు [219]విడు మనుచును, బెదవులు | తడుపుచు, నోర్మొత్తుకొనుచుఁ, దనుఁ బడఁద్రోవన్
విడువక , తత్ప్రాణంబులు | వెడలఁగఁ గుచవిషము శిశువు వెసఁ బీల్చుటయున్.

203


వ.

బాలఘాతిని యగు నాపూతన విగతప్రాణయై, శైలంబుకరణిం గనుపించె. సురలు
హర్దోత్కర్షంబునం గుసుమవర్షంబులు గురిసిరి. వెండియు, నృశంసుండగు కంసుండు తమ్ము
హింసించుటకు ఘోరాకారులగు దానవవీరులం బనిచిన, బాలక్రీడాచరిష్ణుండగు విష్ణుండు
సంభ్రమంబున.

204

సీ.

శకటాదిఘోరరాక్షసుల నిర్మూలించి, | వృషభుని సమవర్తివీటి కనిపి,
[220]బకతృణవర్తుల వికలత నొందించి, | యఘదైత్యు విగళితప్రాణుఁ జేసి,
యమునాతరంగిణియందుఁ గాళియు నొంచి, | పల్లవతతి నగ్నివలనఁ గాచి,
ఘనుఁ బ్రలంబుని జంపి, మునిసతుల్ దెచ్చిన | [221]దివ్యాశనంబులఁ దృప్తి నొంది,


తే.

యశ్రమంబున గోవర్ధనాద్రి యెత్తి, | బహువిధంబుల బలరామసహితుఁ డగుచుఁ
గృష్ణబాలుండు తనయిచ్చఁ గ్రీడ సలిపె | శౌర్య ముప్పొంగ నందవ్రజంబునందు.

205


వ.

అంత.

206


చ.

కలుషగుణావతంసుఁ డగు కంసుఁడు చారులచేత రామకృ
ష్ణుల భుజసత్త్వవిక్రమయశోగుణవర్తనముల్ క్రమంబునన్
దెలిసి, తలంకి, వారల వధింప నుపాయము లూహ సేసి, యా
బలయుతమూర్తులం బిలువఁ[222]బంపెదఁగా కని నిశ్చితాత్ముఁడై.

207


తే.

ధీరు నక్రూరుఁ బిలిచి, యో భూరిపుణ్య! | చనుము తేరెక్కి నందగోష్ఠమున [223]కిపుడ,
రామకృష్ణుల నిటకు శీఘ్రమునఁ దెమ్ము | నావు, డక్రూరుఁడును దత్క్షణంబ కదలి.

208


ఉ.

మందకు నేఁగి, బాలుఁడగు మాధవుఁ గన్గొని, [224]సంస్తుతింపుచున్
వందన మాచరించి, యదువల్లభ! తా మధురాపురంబులో
నం దగు కార్ముకోత్సవ మొనర్పుచు, మిమ్మటఁ బిల్వఁబంచె, సం
క్రందనభోగ[225]శాలియగు కంసుఁ, డన న్విని శౌరి నవ్వుచున్.

209


శా.

ఆ యక్రూరునితో హితాన్నముల నాహారించి, కృష్ణుండు కౌం
తేయ[226]క్షేమ మతండు చెప్పినను బ్రీతిం బొంది, యా మంద నా
రే యెల్లం జనినం, బ్రభాతవిధు లర్థిం దీర్చి, తే రెక్కి, తే
జోయుక్తుల్ బలకృష్ణు లేఁగి, రల కంసుం జూడ సాక్రూరులై.

210


క.

అరుగునెడ, గోపికలు త | ద్విరహమ్మున కోర్వలేక వెనుదగిలిన, నా
హరి వారల నుచితోక్తుల | మరలంగా ననిపి, చనియె మధురాపురికిన్.

211

కంససంహారము

వ.

అంతఁ గంసుండు రామకృష్ణాగమనంబు చారులవలన నెఱింగి, నిజమందిరద్వారంబున
మదధారానిస్తంద్రంబగు కువలయాపీడకరీంద్రంబును నిలిపి, ముష్టికచాణూరాదిమల్లులు
గొలువ, నిజసభాభవనంబున రత్నసింహాసనాసీనుండై యుండె. అప్పుడు రామకృష్ణులు
రథావతరణంబు చేసి, యక్రూరు ననిపి, పాదచారులై, మధురాపురంబు ప్రవేశించి, రాజ
మార్గంబునఁ బౌరజనంబులకు లోచనోత్సవం బొనరింపుచు, నృపభవనంబు చేరంజని, తద్వా
రంబున నున్న మదదంతావళంబు నుత్పాటించి కుంభంబులు వ్రయ్య నడిచి, నేలం గూల్చి,
భీకరాకారులై కంసు సమీపంబునకుం జని,

212


మ.

కకుబంతద్విపతుల్యరూపముల, రంగక్షోణిఁ జాణూరము
ష్టికమల్లేంద్రు లెదిర్చినన్, యదుకులశ్రేష్ఠుల్ నిరాఘాటస
త్త్వకళాజృంభితముష్టిఘాతముల విధ్వస్తాంగులం జేసి, నే
లకు వ్రాల న్సమయించి, మల్లవిజయాలంకారులై వెండియున్.

213


చ.

కినుక మనంబునం [227]బొదలఁ గృష్ణుఁడు కంసునిమీఁది కొక్కచం
గన వడి దాఁటి, తచ్ఛిరము గాత్రముతోఁ బెడఁబాపి, కాలునిం
గనుఁగొన నంపి, తజ్జనకుఁ గ్రమ్మఱ రాజ్యమునందు నిల్పి, భూ
వినుతముగాఁగ ధర్మ మభివృద్ధి వహింపఁగఁజేసి వెండియున్.

214


ఉ.

[228]దేవకిఁ గాంచి మ్రొక్కి, వసుదేవునికిం బ్రణమిల్లి, వారిచే
దీవనలంది శౌరి, బలదేవుఁడుఁ దానును నిర్గమించి, బృం
దావనవాటికిం జని, ముదంబున గోపనితంబినీరతి
శ్రీవశుఁడై, మురారి విహరింపుచునుండెఁ గ్రమక్రమంబునన్.

215


ఉ.

 కౌరవపాండవప్రథనకోలమునం జని, సవ్యసాచికిన్
సారథియై, సుయోధనునిశౌర్యము మాపి, యుధిష్ఠిరు న్మహీ
భారధురీణతస్థితికిఁ బట్టము కట్టి, మురారిదైత్యసం
హార మొనర్చి, సర్వవిజయప్రమదంబున విఱ్ఱవీఁగుచున్.

216

ఉ.

ధీరత రుక్మిణీముఖసతీవితతిం గ్రమయుక్తిఁ బెండ్లియై
ద్వారక నేలుచుండునెడ, ధర్మతనూజుఁడు దిగ్జయార్జితో
దారపదార్థజాతములు తమ్ములు దెచ్చిన, రాజసూయ మిం
పార నొనర్పఁగాఁ దలఁచి, [229]యాప్తజనుం దనపాలి కంపినన్.

217


క.

ఇంద్రాదిదివిజ[230]వందితుఁ | డింద్రోపలనిభుఁడు, కృష్ణుఁ డిచ్ఛాపురుషుం
డింద్రజసాంద్రస్నేహుం | డింద్రప్రస్థమున కరిగె హితపరివృతుఁడై.

218

శిశుపాలవధ

సీ.

అత్తఱి, శ్రీకృష్ణుఁ డరుగుదెంచిన వార్త | విని, పాండుతనయు లావిష్ణుమూర్తి
కెదు రేఁగి, యర్ఘ్యాదివిదితార్చనంబుల | [231]వందనాదుల నుత్సవం బొనర్చి,
యతని సమ్మతమున నాధర్మసూనుండు | రాజసూయమహాధ్వర మ్మొనర్చి,
ధరణీసురుల నిష్టదక్షిణాదులఁ దన్పి | యవభృథస్నానంబు లర్థిఁ జేసి,


తే.

యార్యభూసురమునిసమూ[232]హములలోన | హరికి నర్పించె జనపాలుఁ డగ్రపూజ
యది విలోకించి, శిశుపాలుఁ డాగ్రహించి, సమదుఁడై పల్కెఁ దత్సభాసదులు వినఁగ.

219


ఉ.

ఈసభయం దకృత్య [233]మిది యిట్లొనరించి నరేంద్రుబుద్ధి పూ
ర్మేసెనొ? కాక, జ్ఞానమున మించిన సంయమివర్యు లుండఁగా,
భూసురు లుండఁగా, నృపతిపుంగవు లుండఁగ, నగ్రపూజకుం
గాసుకుఁబోని యీపసులకాపరి, [234]పేదరి గొల్లఁ డర్హుఁడే?

220


చ.

అని, తన కంత్యకాలము సమాగతమౌట యెఱుంగలేక, నిం
దన మొనరించు చైద్యుని, మదస్ఫురితానుచితప్రలాపునిం
గనుఁగొని, కృష్ణుఁ డా[235]ఖలుని కంఠమృణాళముఁ [236]ద్రెంచె, హేమభా
జన మను సాధనంబున నిశాచరభీకరరోషదీప్తుఁడై.

221

తే.

దేవకీదేవి కి ట్లిందిరావిభుండు | కృష్ణుఁడై పుట్టి, దైత్యుల గీటణంచి,
దేవసన్నుతచరితుఁ డాదేహ ముడిగి, | కమలనాభుండు నిజనివాసమున కరిగె.

222


తే.

ఎపుడు దానవు లుదయించి, రపుడు చక్రి | తద్వినాశంబు [237]గావింపఁ దగినయట్టి
వేష మంగీకరించి, యావిర్భవించుఁ | గాన, హరి[238]చర్య మంగళకారణంబు.

223

జీవుని జన్మకర్మబంధనము

సీ.

విను, పాంచభౌతికవిగ్రహంబులు దాల్చి, | భూవలయంబున జీవరాశి
మానసప్రేరిత మది, సంతతంబును | బహువిధఘోరపాపము లొనర్చి,
రౌరవప్రముఖనారకకూపములఁ గూలి, | యందుఁ బాతకఫల మనుభవించి,
[239]పాపానురూపరూపములఁ గమ్మఱఁ బుట్టి, | యజ్ఞానభవమోహ మాక్రమింపఁ,


తే.

బుత్త్రదారాదిసంగతిఁ బొదలుచుండుఁ | బాము మూర్కొన్నవానికి వేము తీయ
నైన కై వడిఁ, బుత్త్రమిత్రాది[240]రతుల | కధమసంసార[241]సుఖమును మధుర [242]మగును.

224


వ.

అట్టి సంసారంబునం దగులువడి, [243]విశిష్టాదు లాదానాదిక్రియాసంయుక్తులై, యధికారి
విశేషంబున జ్ఞానోదయపర్యంతంబు కర్మప్రకాశంబగు నిగమమార్గంబు విమర్శించి, కర్మంబు
లాచరింపుచుఁ, దత్కర్మనాశంబై, బాహ్యగతమనోమాయారహితంబగు సమ్యగ్జ్ఞానంబు
దొరకక మోహితులై వర్తింతు రని చెప్పి.

225

ఆశ్వాసాంతపద్యగద్యములు

స్వాగతము.

[244]రోషదూర[245]శమరూపితవేషా! | వేషయోగ్యగుణ[246]విస్ఫుటభూషా!
భూషణాకృతవిభుత్వవిశేషా! | శేషభోగిసమచిత్రమనీషా!

226


క.

ఫణిశయనచరణకమల | ప్రణమితనిజ[247]మూర్ధభాగ! భాగవతాళీ
గణనీయమహిమ! హిమకర | మణినిర్మలకీర్తిధామ మంత్రిలలామా![248]

227

మాలిని.

హరిపదయుగపూజాయత్తచేతఃపయోజా!
నరవినుతవివేకా! నందితప్రాజ్ఞలోకా!
భరితసుగుణరత్నా! భాగ్యయోగ్యప్రయత్నా!
సరససుజనమిత్రా! సర్వయామాత్యపుత్రా!

228

గద్యము

ఇది శ్రీహనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణి తనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీతంబైన
వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. బొందవు - త, తా; బొందదు - మ; నొందవు మా,తీ
  2. హతి - త,క; హరి - మా, తా, తి, తీ,హ,ర
  3. వాఁ డయ్యు - తీ
  4. మూల మ్మనఘా - తీ
  5. మీరిన కథలానతిమ్ము - క; మీరిశరీరములు - మ,మా,త, తి, తీ,హ,ర
  6. విశ్వ - మా
  7. భవాంత - తీ; భవామరేంద్రభవ - మా, త
  8. మానవాదిగ - మా,త
  9. గాఁగలయవి పెక్కు - తీ
  10. తానయై యతిశయిలుచు - మ, తా,క
  11. యరవింద - త
  12. విహితంబు - మ,మా, తా, తి, తీ,హ,ర,క
  13. బ్రహ్మాండంబు లా శ్రీరమా - తీ
  14. గొందఱు పరబ్రహ్మం బనియును - తీ. ప్ర. లోని పాఠము
  15. సాత్త్విక - మ,మా,త,తి,తీ,హ,ర,క
  16. ధ్యాన - అన్ని ప్ర.
  17. ర్యామియైన వాసుదేవుం డుండు - త
  18. భోగేంద్రులై - మ,త,తా, తి, తీ,హ,ర,క
  19. దేవ - మా; భూత - ర
  20. శాశ్వతుండు, మునుల సురల నరుల ముదముతో గోవుల, నవ్యయుండు బ్రోచు - క
  21. మోహాంధకుల్ - తి, తీ,క ; మోహెూద్ధతుల్ - త
  22. మేపారగన్ - తీ
  23. దుర్మదాంధత లేకన్, భువివనటబాసి మనుజులు - మ, తి,హ,ర, క ; దుర్మదాంధత విడి యీభువి - తీ
  24. యమరుల్ - మా
  25. ధ్రువముగ - మ,హ,ర,క
  26. పుణ్య - త
  27. కమలాంతరజ్వల - మ, మా,హ,ర,క
  28. దాగుండు - మ,మా,త,తి,హ,ర
  29. పటలముల - త, తా; వలయమున - మా; పృథుల జంకెడివార లీయుర్విమీద
    దవిలి (యతి?) - క
  30. లేరింకఁ దరమె తెలియ - తీ
  31. సమ్మతంబు - త
  32. నాహరించి (యతి?) - తీ
  33. నిర్జితంబు - తా
  34. దశముఖ - మా, త. ప్ర.పాఠము
  35. మెండుకొమ్మలు (యతి?) - మ,మా, తి,హ,ర,క; మెండల్పముగ శాఖములు గల్గి - తీ
  36. దత్వము - త
  37. లా తరువును - తీ
  38. నీభక్త - మ, తా; తద్భక్త - క
  39. పాలింపుము - తీ
  40. వదలి - తీ
  41. కృతంబని - త,హ,ర
  42. దేహి - త
  43. తావకసేవకిష్టా - మ; తావకే సేవకిష్టా - మా,త; తావకస్సేవకేష్టా - తి,తీ, ర; తావకీసేవకేష్టా - తా
  44. ననన్ ఘనతాస - మ,మా, తి, తీ,హ,ర,క
  45. యంబుజనేత్రీ-మ,మా,త, తి, తీ,హ, ర,క
  46. విరించ్యాది - త, తా, తీ
  47. చేలా - తీ
  48. వృక్ష - ర
  49. పరివృతు - త, తా; పరిపృథు-మ,మా,తి,హ,ర,క
  50. దేహకాంతియున్, రణవిజయంబు దుర్దశ శరణ్య హుతాశన లక్ష్మియుక్తమున్, బ్రణుకితి-మ,తా,క
  51. మాత్రమున్-మ, తా, తి,హ,ర, క ; సూత్రమున్-తీ
  52. వర్జించి-త
  53. మాహేంద్రజాల - త,తా
  54. విశ్వంబు - యట్టినిన్ను ,తి, తీర,ప్ర, లో లుప్తము
  55. గాళరాత్రి - తి,తీ.క
  56. యందు తీవ్ర
  57. గౌమారి - బ్రహ్మాణి యని హ. ప్ర. లో లుప్తము.
  58. వర్ణ నయే నొనర్తు (యతి?) - మ
  59. నందు - తీ; నుడుతు - మ, మా, తా, గ,క
  60. బ్రాహ్మియటంచు నిన్ - తీ
  61. సంస్మరింతు-మ, మా, తా, తి,హ,ర క
  62. జగన్మోహన - మా, త, తా,క
  63. జలంబుల - మత,క
  64. హంసక్రౌంచ-కలాప మ,మా, తి, తీ,హ,ర, క, ప్ర. లో లుప్తము
  65. బొనుగుపడిన - తీ
  66. జిలుగు-తీ
  67. గంచెలియ-అన్ని ప్ర.
  68. దత్కుచభరం - త
  69. మధ్యమహారికదండ - త,తా; మధ్యమహారకరదండ - మ,మా,హ; మధ్యమాహారి కరదండ-తి, తీ,ర
  70. నిటలంబుల - తీ
  71. నాసామౌక్తికాభరణంబు - తీ
  72. ఆలంకరించిన - త
  73. భక్తాభయశోభనంబులై - క
  74. ధారంబగు - మ,మా, త, తి ,హ,ర
  75. నర్థి - తి; నబ్ధి - తీ
  76. కింపురుష - మ,మా,త, తాతి,హ,ర,క
  77. వినుతింపఁగ - క
  78. జంతుకోటి కెల్లను నుదరా - తీ
  79. యునుజిద్రూప - తి,తీ,ర
  80. సృజియించె నత్తఱిన్ - తీ
  81. మున సమీరపక్షి - తీ
  82. దేశంబుల - త
  83. నంభోధిచయము (యతి?) - త; నంభోధరములు (యతి?) - మ,మా,హ, క
  84. వేర్వేఱ -త, తా,క
  85. దత్కాపురుష - తి,హ,ర
  86. నిబంధంబున - త, తీ,ర
  87. సురస - హ,ర
  88. ఈ ప క ప్ర.లో లుప్తము
  89. యాతను - తా
  90. వేష - క
  91. నాల్నాడ్లు - మ; నానాడ్లు - మా; నానాళ్లు - త, తా, ర; నాల్నాడు - క
  92. యతివ - మ, తి, తీ,హ,ర, క
  93. నేత్రి - అన్ని తాళపత్ర ప్ర.
  94. బంధు - మ, తి, తీ,హ,ర,క
  95. నాశరతుల్ పరతుల్ సురాహితుల్ - తా; సాదరకృత్యులు దేవశాత్రవుల్ (యతి?) - మ; మానులు పాపరతుల్ సురాహితుల్ - మా, త; మానులు వారపతుల్ సురాహితుల్ - తి తీ,హ, ర; దూరులు దారపతుల్ సురాహితుల్ - క
  96. హరిదేహంబులు సురలా - మ,మా,త, తా, తి, హ,ర ,క
  97. దివ్య - మా,త
  98. సర్వతత్వార్థమ్ము - మా,త
  99. నవనిసురలు - అన్ని ప్ర.
  100. త్తాపమునం బొంది - త; తాపంబును బొంది - తీ
  101. తార్చనా - మ, మా, తా, తి, తీ, హ, ర, క
  102. భిప్రాయ - మ,మా, తి,ర, క; దిప్రాయ - ఆ; సప్రాయ - తా; భిప్రాయశ్చిత్తులయ్యు - తీ,హ
  103. యవధికాలో - మా,త
  104. రీనతా - మ ,తీ, క; లీనతా - మా,త; దీనతో - తా; నతా - తి,హ,ర
  105. సంధి గృహా - మా,త; సంధిగుహ - తా; నందీగృహ - తి,హ; బందీగ్రహ - తీ; సందగృహ - ర; సందీహ - మ
  106. సోముకా - మ,మా
  107. సోమకుని (యతి?)-త,హ,ర
  108. హరియించు - తీ
  109. బద్ధుండై - తా
  110. బాడ - త: బాధ - తి; బాద - మా, తా, తీ; బాఠ-మ,హ,ర,క
  111. నశ్యం-అన్ని ప్ర
  112. నమత్కీలమున్ - వ ; సముచ్ఛైలమున్ - మా; నముంగీటమున్ - క
  113. వర్గము - తా
  114. పంపె - తీ
  115. గుభేలున - మ, చూ, తా,హ
  116. వైవఁజూచినన్ - తా
  117. సంస్తుతి - మా, త
  118. చరస్థపృథివీసర్వంబవక్రా - క
  119. చక్రంబు చక్రాకృతిన్ - మ, తా
  120. (వ?) నధి-మా ,తి,హ, గంగలో- తీ
  121. మణంచెద -త
  122. నూకించు - హ
  123. డొరగి - మ , తి, తీ,హ,ర,క
  124. శృంగ మదుము - మ,తా,తి
  125. లేక కూర్మ - తీ
  126. బెట్టుగ - మా, త
  127. నటంచు - తీ
  128. పుణ్యుని- మ,మా,త,తా,తి,హ,ర,క
  129. ఇది నిరోష్ఠ్యసీసపద్యము.
  130. తాఘతత - తీ; తదుర్జన - ర
  131. రాజ - తీ
  132. నయన - మ,మా, తి, తీ,హ,ర,క
  133. సహితరూప - మ,మా,తి; సహితహృదయ - తీ, ర; సహితరూఢ - క
  134. ధాత - తీ; నాథ - త; వాత - హ
  135. నిది - త,హ
  136. మీరు - తా
  137. జిత్రమైన - మా
  138. యాచ్న - అన్ని ప్ర.
  139. కొననీను - త
  140. దఱిఁగిన - తీ. భిన్న ప్ర.
  141. అనుటయు - హ
  142. పాదం - తీ
  143. గాంచు, నే - క
  144. మాస - తీ
  145. జలజాక్షుచేత సం - మ,మా, తా, తి, తీ,హ,ర,క
  146. క్రమంబుగ వర్ధ - తా,తి, తీ
  147. వాటికి నేఁగు - త
  148. లక్ష్మణుండు - హ
  149. మెచ్చగు - తి, తీ
  150. నేగి - తీ
  151. యడవిఁ బరికింపుచు - త
  152. జలస్థితి - మా,త
  153. విమలంబు - తీ; విదులంబు - తా; విముదంబు - మ,మా,తి,హ,ర,క
  154. విధం - క
  155. లోన - తి,తీ
  156. హర్మ్యసౌధములు - ర
  157. మున్నిచ్చి - త
  158. ముచిత్ర - త; పవిత్ర - క
  159. నేఁగి - మా,తి,ర
  160. విడిచి - అన్ని ప్ర.
  161. వితత - మ,మా,త
  162. నంటివిది - తా,హ; బుట్టినది - తీ
  163. లను - మ,తి, తీ,హ,ర,క
  164. అమరాంభోధి - తీ
  165. నాథున్ (యతి?) - తీ
  166. గ సంఘటించి వినుతిం - త
  167. గుణోజ్జ్వలామహిత - తీ
  168. నంద్య - తీ
  169. దివ్య - త
  170. సరస - క
  171. ననఁ గృపఁ బ్రోవవయ్య (యతి?) - క
  172. దత్ఫలాకారివై - హ
  173. తత్పురుషులు - తా
  174. నాథ - మ,మా, తి, తీ, హ,ర,క; నేత - త
  175. మాం పాహి దేవేశ పాహిశయన - తా
  176. ద్ధారులై - మ, తా, తి, ర; ద్గారులై - హ
  177. నిర్మూలితంబు - తా,తీ
  178. నేత్ర - తీ
  179. నంప - తి
  180. కమలాధీశుఁడు - క; కమలానాభుఁడు - మ
  181. డలుకన్ - మ,మా,త,తా,తి,హ,ర,క
  182. పోకపుడు - మ, త, తా, తి,హ,ర,క
  183. తుండవై, సోదరిన్ - త
  184. రేని - తీ
  185. ద్రుంచగా - తీ
  186. ముట్టమరచి - తా
  187. డుదితమైన - తా,హ; డుదయమైన - త
  188. ఈ ప. మా.ర. ప్ర లో లుప్తము.
  189. యించెం గంసుఁ డుచిత - త
  190. బాలించె - ర; పాలించె - తీ
  191. మాన్తుఁగాక - త,ర
  192. మునను - తి, తీ,హ,ర
  193. తపన దప్పి మా, త; తనువు దప్పి - తా,క; తమము దప్పి- తి,తీ
  194. బలకబారె - మ.మా, తా, తి, తీ,హ,ర,క
  195. పెంపొదవించెన్ - తా
  196. లోగొన (యతి?) - మ, తా,హ,ర
  197. నీలిమంబనన్ - మ.మా ,త, తా, తీ,హ,ర,క
  198. దగఁగ క; దగను - ఇతర ప్ర.
  199. నాఁడునాటి - అన్ని ప్ర
  200. నుత - త,తా,హ
  201. కామికా - తా
  202. నిరత - మా
  203. లోక - తీ; భోగ - త,తా
  204. తత్త్వ - ర
  205. నత - త, తా, తి, ర
  206. ఈ ప.త. ప్ర. లో లుప్తము.
  207. నందు వనితా - మ,మా,త
  208. నినదంబున - తా
  209. కడుక్రోధమునన్ - క
  210. బాణకృపాణ - మ,మా, త, తా, తి,హ, ర,క
  211. కోలు - తీ; కోర - త; కోరు -మ, మా,హ, ర,క
  212. రవమున (యతి?) - మ, త, తా, తి, తీ,హ,ర, క; స్రవమున (యతి?) - మా
  213. జయ్యన బాలయు (యతి?) - తీ
  214. రేపల్లె - అన్ని ప్ర
  215. నడ్డు - తీ
  216. రేపల్లె - అన్ని ప్ర.
  217. చేఁపె - ర
  218. నాయన్న - క
  219. విడువు మనుచుఁ - మ, మా, తా, తి, తీ,హ,ర, క
  220. వెస - తీ; బల - తి
  221. దివ్యోదనం - తా
  222. బంచెద - తా
  223. కీవు - తీ
  224. సంతసింపుచున్ - తా
  225. రాశి - మ
  226. క్షేత్ర - మ, హ, ర
  227. దొడర - త
  228. ఈ ప. తా.ప్ర. లో లుప్తము
  229. యాప్తజునిం - తీ
  230. వంద్యుం - మ, తా, తి,హ,క
  231. వందనాదుల - స్నానంబులర్థిఁజేసి ర.ప్ర. లో లుప్తము
  232. హములతోన - మ,మా,త, తీ,హ,ర,క
  233. విధి - తా కంటె భిన్న ప్ర.
  234. పాడరి - త, పాదరి (పాదలి?) - తా; పాపము - మా
  235. బలుని - తా
  236. ద్రుంచె - హ
  237. వారింప - తా
  238. సర్వ - తీ
  239. పాపానుకూల - తి,తీ,హ,ర
  240. గతుల - మా
  241. సుఖమతి - తీ; ముఖముఖ - తి
  242. మగుచు - మ,మా,హ,క
  243. విశిష్టులు సదాసావిక్రియా - మ; విశిష్టు లాదానవిక్రియా - తా; విశిష్టులు దాసాక్రియా - తి; విశిష్టులు సదానక్రియా - తీ; విశిష్టజనులు దాసాదిక్రియా - హ; విశిష్టులు దాసావిక్రియా - ర; విశిష్టులు దాసాదిక్రియా - క
  244. దోష (యతి?) - మ, మా
  245. మద - తా
  246. నిస్ఫుట (యతి?) - మ
  247. మూర్ధ్వ - అన్ని ప్ర.
  248. ఈ ప. ముక్తపదగ్రస్తము.