ఆనంద భైరవి రాగం - రూపక తాళం

మార్చు

పల్లవి:
వనిత రో ఈ వన్నె లేల నే ఈ వేళ నాకు
తనువేల తరుణులేల ధనమేల ధామమేల ||

చరణం 1:

ఆకులేల పోకలేల అన్న మేల పానంలేల
శ్రీ కరుండు రాక యుండి ఆశలుడిగి యున్న వేళ ||

చరణం 2:

సొగసేల సొమ్ములేల అగరేల గంధ మేల
మగనికి దయ లేక మేను సగమై యున్నట్టి వేళ ||

చరణం 3:

భాసురాంగి తోట లేల పాట లేల ఆత లేల
దాసు రామ పాలు బాసి ఆసలుడిగి యున్న వేళ ||

"https://te.wikisource.org/w/index.php?title=వనితరో&oldid=410729" నుండి వెలికితీశారు