వగ కాడ
ఖమాస్ రాగం - ఆది తాళం
మార్చు
పల్లవి:
వగ కాడ తగదిక రారా
మగువ నేచుట మంచిదటరా ఓహ్ ||
చరణం 1:
కృప లేదా సామి నా మీద
ఉపరతి సుఖమున నోలలాడించెద ఓహ్ ||
చరణం 2:
వినవేర వేణుగోపాలా
మనసున నీకు గల మర్మము దెలుపరా ఓహ్ ||
చరణం 3:
పసిబాల తాళ జాలరా
రసిక దాసు శ్రీరామునేలుకోర ఓహ్ ||