లోకోక్తి ముక్తావళి/సామెతలు-మూ

2778 ముల్లాలు తిండిలేక మొత్తు కుంటుంటే పీర్లకు పంచదార

2779 ముల్లువచ్చి కొర్రడచి నట్లు

2780 ముల్లు ముంటతీస్తే పోయే దానికి దబ్బనాన తీసినట్లు

2781 ముష్టికి మూడు సంచులా?

2782 ముసలమ్మా బుఱ్ఱ వణికిస్తావేమటే వూరకుండి నేనేమి చేస్తా నన్నదట

2783 ముసలమ్మ సుద్దులు

2784 ముసలి దానికి ముండముద్దు

2785 ముసుకులో గుద్దులాట

మూ

2786 మూగవాని ముందర ముక్కు గోకు కున్నట్లు

2787 మూటికీ ముడి వేస్తే యేమీతేదు

2788 మూడు జన్మలసంగతి చెప్పగలను పూర్వజన్మమునందు యుచ్చి పెట్టుకోలేదు గనుక యీజన్మమునందు దేవుడు నాకు యివ్వలేదు, ఈ జన్మకు వొకరికి యివ్వలేనుగనుక ముందు జన్మకు నాకు యేమియులేదు

2789 మూడు దినాల ముత్తైదువ తనానికి ఆరు జోళ్లు లక్కాకులు

2790 మూడు నలలు సాముచేసి మూలనున్న ముసిలిదాన్ని పొడిచినాడు

2791 మూడు భాగాలు సిద్ధమైనవి, దివ్వెకట్ట ముడికి వచ్చినది దొరవారు సువారానికి రావచ్చు 2792 మూడు మూఠా వొకచుట్టే ముఫైమురా వొకచుట్టే

2793 మూడు రోజులుంటే మురికి చుట్టం

2794 మూడేండ్ల నాటి గుణము నూరేండ్ల వరకు

2795 మూర్తి కొంచెమైనా కీర్తి విస్తారం

2796 మూరెడు పోనేల బారెడు కుంగనేల

2797 మూరె డింట్లో బారెడు కర్ర

2798 మూల కార్తెకు వరి మూలకు చేరు తుంది

2799 మూల కురిస్తే ముంగారు పాడు

2800 మూల పున్నమ ముందర మాదిగైనా చల్లడు

2801 మూలము అంటే నిర్మూలమంటాడు

2802 మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరుపువ్వులుగ పండును

2803 మూల వర్షం ముంచును జ్యేష్ఠవర్షం తేల్చును

2804 మూలవిగ్రహాలు ముష్టియెత్తు కుంటుంటే ఉత్సవిగ్రహాలకు ధధ్యోజనాలు

2805 మూల వున్నదాన్ని ముంగిట్లోకి తెచ్చినట్లు

2806 మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు

2807 మూలుగు ముందటివలెనే తిండి యెప్పటివలెనే

2808 మూసిపెట్టితే పాసిపోయింది