లోకోక్తి ముక్తావళి/సామెతలు-ము

2709 మిద్దెమీదపరుగు

2710 మిన్ను విరిగి మీదపడ్డట్టు

మీ

2711 మీకుమాట మాకుమూట

2712 మీగాలిమీద మెతుకుపడితే మిట్టిమిట్టి పడ్డాడు

2713 మీగాళ్లు వాచినమ్మా మీయింట్లోపెళ్ళి యెప్పుడంటే మోకాళ్లువాచినమ్మా మొన్ననే అయుపోయినదందిట

2714 మీగురువులు మాశిష్యులవద్దనే నేర్చుకున్నారు

2715 మీగొడ్డుకింత తవుడంటే మీఅబ్బాయికిన్నిపాలు

2716 మీదాకులు రాలంగ క్రిందాకులునవ్వినట్లు

2717 మీయింటికివస్తాను నాకేమిపెడతావు మాయింటికి వస్తావు నాకేమితెస్తావు

2718 మీసాలుతట్టపోసి వాసాలుతట్ట పోసికొనుము

2719 మీరుకొలుచునట్లు మీకుకొలువబడును

ము

2720 ముంజేతి కంకళాలకు అద్దముకావలెనా

2721 ముంజేయిఆడిన మోచేయిఆడును

2722 ముండకొడుకు కేకొడుకు రాజుకొడు కేకొడుకు

2723 ముండ బెంచినబిడ్డ ముక్కు తాడులేని యెద్దు

2724 ముండ ముప్పావుకు చెడ్డాడు నరకడు పావుకుచెడ్డాడు

2725 ముండ మొయ్యవచ్చునుగాని నిందమొయ్యరాదు


. 2726 ముండాకాదు ముత్తైదువా కాదు

2727 ముండ్లమీదపడ్డ గుడ్డ మల్లగా తీసుకోవలెను

2728 ముంతెడు నీళ్లకే జడిస్తే బానెడు నీళ్లెవరు పోసు కుంటారు

2729 ముంతెడుపాలకు ముత్య మంత చేమిరి (తోడు)

2730 ముందటివానికి ముంతంబలి వెనుకటి వానికి తెడ్డంబలి

2731 ముందరవల్లం నెనుకమిర్రు

2732 ముందరికాళ్ళకు బందాలువేసి ముండలతాళ్లు తెంపేవాడు

2733 ముందరున్నది ముసళ్ళపండుగ

2734 ముందునుయ్యీ వెనుకగొయ్యి

2735 ముందుజూస్తే అయ్యవారిగుఱ్ఱం వెనుకచూస్తే సాయబు గుఱ్ఱం

2736 ముందుపొయ్యే ముతరాచవాణ్ణి వెనుకవచ్చే బోయవాణ్ణీ పక్కవచ్చే వట్రాతివాణ్ణి నమ్మరాదు

2737 ముందు నీకంటిలోని దూలము తొలగించుకొని తరువాత నీపొరుగువాని కంటిలో నలుసును తీయుము

2738 ముందువచ్చినందుకు మున్నూరు వరహాలు దండుగ మళ్ళి యేలవచ్చినావే మాయదరితొత్తా

2739 ముందువచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములు వాడి

2740 ముందువచ్చినది మొత్తైదువ వెనుకవచ్చినది వెధవ

2741 ముక్కిడికితోడు పడిశము 2742 ముక్కుజొచ్చి కంట్లో ప్రవేసించే వాడు

2743 ముక్కు కోసినా ముందు ముగుడే మేలు

2744 ముక్కుపట్టని ముత్యము

2745 ముక్కుపట్టుకుంటే ప్రాణము పోదా

2746 ముక్కులో యేవేలు పెట్టినా వాటే

2747 ముక్కులో వెండ్రుకలు కొప్పు లోకొచ్చి మూగవాడు అమ్మా అన్ననాడు చూదాము

2748 ముక్కువుండేవరకు పడిశంవుంటుంది

2749 ముఖం చూస్తే కనపడదా మీగాళ్లవాపు

2750 ముఖం తేట ముడ్దికితీట

2751 ముఖం బాగాలేక అద్దము పగులగొట్టినట్లు

2752 ముఖం మాడువుదీపం యింటికి కొరగాదు, రంకుబోతు పెండ్లాం మొగుడికి కొరగాదు ఏడ్పుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు

2753 ముగ్గురిని గూర్చెను ముండ దయ్యము

2754 ముగ్గురి మధ్య ముంత దాగింది

2755 ముడి మూరెడు సాగదు

2756 ముడ్డిక్రిందికి నీళ్ళువస్తే లేవక మానదు

2757 ముడ్డిమీదకొట్టితే మూతిపంద్లు రాలినట్లు

2758 ముడ్ది ముఖంలేనిబిడ్డ తుది మొదలు లేని వాట

2759 ముదికొమ్మ వంగదు

2760 ముదిబ్రానుచేవ

2761 ముదిమి తప్పితే మూడు వర్ణాలు 2762 ముది ముప్పున అంగిట ముల్లు

2763 ముదిరి చచ్చినా యెండి విరిచినా వగవు లేదు

2764 ముదురున వేసినపైరు ముదిమి పుట్టిన కొడుకు

2765 ముద్దుచేసి కుక్కమూతికరచను

2766 ముద్దున పేరుచెడె మురిపాన నడువుచెడె

2767 ముద్దుముఖము గరుడసేవ

2768 ముద్దులు గులకరా ముదిపెండ్లి కొడకా అంటే పెండ్లి కొచ్చిన పేరంటాండ్రందరు నాపెద్దపెండ్లాలే అన్నాడట

2769 మున్నూటి కులానకు ముప్పూ లేదు మొండి కాలికి చెప్పూలేదు

2770 మున్నూరుసిఖలైనా కూడవచ్చునుగాని మూడుకొప్పులు కూడరాదు

2771 ముప్పదియేండ్ల ఆడుది మూడేండ్లమగవాడు ఒకటి

2772 ముప్పదియేండ్లు కష్టమనుభవించినవాడు లేడు

2773 ముఫ్పైమూడుకోట్ల దేవతలు ముక్కుపట్టించగలరుగాని నారాయణా అని అనిపించగలరా

2774 మురదన్న సందేహం నిస్సందేహం

2775 మురిపెము తిరిపెముచేటు ముసలిమగడు ప్రాణమునకు చేటు

2776 మురిపెమునకు మూడునల్లపూసలు కొలికకు ఒక తిరుగట్రాయి

2777 ములక కాయకు తగినముండ్లెప్పుడున్నవో కాకరకాయకు తగినగరుకు లప్పుడేవున్నవి 2778 ముల్లాలు తిండిలేక మొత్తు కుంటుంటే పీర్లకు పంచదార

2779 ముల్లువచ్చి కొర్రడచి నట్లు

2780 ముల్లు ముంటతీస్తే పోయే దానికి దబ్బనాన తీసినట్లు

2781 ముష్టికి మూడు సంచులా?

2782 ముసలమ్మా బుఱ్ఱ వణికిస్తావేమటే వూరకుండి నేనేమి చేస్తా నన్నదట

2783 ముసలమ్మ సుద్దులు

2784 ముసలి దానికి ముండముద్దు

2785 ముసుకులో గుద్దులాట

మూ

2786 మూగవాని ముందర ముక్కు గోకు కున్నట్లు

2787 మూటికీ ముడి వేస్తే యేమీతేదు

2788 మూడు జన్మలసంగతి చెప్పగలను పూర్వజన్మమునందు యుచ్చి పెట్టుకోలేదు గనుక యీజన్మమునందు దేవుడు నాకు యివ్వలేదు, ఈ జన్మకు వొకరికి యివ్వలేనుగనుక ముందు జన్మకు నాకు యేమియులేదు

2789 మూడు దినాల ముత్తైదువ తనానికి ఆరు జోళ్లు లక్కాకులు

2790 మూడు నలలు సాముచేసి మూలనున్న ముసిలిదాన్ని పొడిచినాడు

2791 మూడు భాగాలు సిద్ధమైనవి, దివ్వెకట్ట ముడికి వచ్చినది దొరవారు సువారానికి రావచ్చు