లోకోక్తి ముక్తావళి/సామెతలు-నె

2008 నూరయ్యేవరకు నన్ను కాపాడితే ఆతరువాత నిన్ను కాపాడుతాను

2009 నూరి భరించలేనమ్మ తాగేమి భరిస్తుంది

2010 నూరు కల్లలాడైనా ఒకయిల్లు నిలపాలి

2011 నూరుకాకుల్లో ఒకకోయిల యేమి చేయగలదు

2012 నూరు కొరడా దెబ్బలకొక బొబ్బట్టు

2013 నూరు నోములు ఒక రంకుతో సరి

2014 నూరుమంది గ్రుడ్డివాళ్ళు పోగయి ఒక పాడు నూతిలో పడ్డట్టు

2015 నూరిమంది మొండి చేతులవాండ్లు పోగయి ఒక గొడ్దు గేదెకు పాలుపితుక లేక పోయినారు

2016 నూరుమాటలు ఒక వ్రాతకు సరికావు

2017 నూలి పోగు అతుకు

నె

2918 నెత్తి మూటకు సుంకమడిగినట్లు

2019 నెత్తి కాలనిది బోలెకాలదు

2020 నేమలికంట నీరుకారితే వేటగానికి ముద్దా

2021 నెయ్యి అని తాగకూడదు, నూనె అని తలకు రాచుగొ కూడదు