లోకోక్తి ముక్తావళి/సామెతలు-నూ

1990 నీవుకాకపోతే నీఅబ్బ మరివొకడు

1991 నీవు చచ్చిన రోజులేదు నేను యేడ్వనిరోజూలేదు

1992 నీవుచస్తే లోకమెల్లా యెముకలా

1993 నీవు తలచినప్పుడు బిడ్డను కనాలనా?

1994 నీవు పెట్టకపొతే పెట్టేయిల్లు చూపించు

1995 నీవు నొకందుకు పోస్తే నేను మరివక్కంద్కు తాగుతున్నా

1996 నీసాకులు చట్టుబండలుగాను నాలుగు బేకులు బేకు

1997 నీళ్లకంఠాయి విద్మహే, కొలుకురాయ ధీమహే, తన్నో గుడ్లూరు ప్రచోదయాత్

ను

1998 నువ్వులకు తగిన నూనె

1999 నుంటినిబొడిచి శెలగే అనేవాడు

2000 నుయ్యి తియ్యబోతే దయ్యం బయలు వెళ్లింది

2001 నువ్వుకు నూరు రోగాలు

2002 నువ్వులూ నూనె ఒకటి, గానుగవాడు వెరు

2003 నీళ్ళమీద వ్రాసినమాట

నూ

2004 నూటికిబెట్టి కోటికి గొరిగించేవాదు

2005 నూటికి నూలిపోగు, కోటికి గోవుతోక

2006 నూతికప్పకు సముద్రం చేరువా?

2007 నూనె పోగొట్టుకున్నవాడూ ఏడ్చినవాడు బొండాపకాయ పోగొట్టుకున్నవాడు పొర్లి పొర్లి యేడ్చినాడు 2008 నూరయ్యేవరకు నన్ను కాపాడితే ఆతరువాత నిన్ను కాపాడుతాను

2009 నూరి భరించలేనమ్మ తాగేమి భరిస్తుంది

2010 నూరు కల్లలాడైనా ఒకయిల్లు నిలపాలి

2011 నూరుకాకుల్లో ఒకకోయిల యేమి చేయగలదు

2012 నూరు కొరడా దెబ్బలకొక బొబ్బట్టు

2013 నూరు నోములు ఒక రంకుతో సరి

2014 నూరుమంది గ్రుడ్డివాళ్ళు పోగయి ఒక పాడు నూతిలో పడ్డట్టు

2015 నూరిమంది మొండి చేతులవాండ్లు పోగయి ఒక గొడ్దు గేదెకు పాలుపితుక లేక పోయినారు

2016 నూరుమాటలు ఒక వ్రాతకు సరికావు

2017 నూలి పోగు అతుకు

నె

2918 నెత్తి మూటకు సుంకమడిగినట్లు

2019 నెత్తి కాలనిది బోలెకాలదు

2020 నేమలికంట నీరుకారితే వేటగానికి ముద్దా

2021 నెయ్యి అని తాగకూడదు, నూనె అని తలకు రాచుగొ కూడదు