లోకోక్తి ముక్తావళి/సామెతలు-చి
1274 చావటిముందరికొంప కదపా పుల్లలకుసరి
1275 చావాచావనివ్వడు బ్రతుకాబ్రతుకనివ్వడు
1276 చావ్చుకు పెట్టితేగాని లంఖణాలకు దిగదు
1277 చావుకుమళ్లీ చావు వస్తుందా
1278 చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు
1279 చనువు చేసిన ఆలు చంకనెక్కును
చి
1280 చింత చచ్చినా పులుపు చావదు
1281 చింత చిగిలింత యేవు
1282 చింత పండితే జీడిపండు;తుంది
1283 చింతలేదు చింత లేకపోతే పులుసులేదు
1284 చిక్కి చికిలించేకన్నా వెళ్ళి వెక్కిరించేదిమేలు
1285 చిగిరింత ఐశ్వర్యము
1286 చిచ్చాయె చిచ్చాయె అంటే సందాయ నందాయె నన్నట్లు
1287 చిత్తకార్తెకు ఉలవచేను చిత్తుచిత్తుగా పండుతుంది
1288 చిత్తకురిస్తే చింత పండును
1289 చిత్త చిత్తరించి స్వాతి దయచేసి విశాఖ విసిరికొట్టకుండావుంటే వీసానికి పుట్టెడు పండుతానన్నదట
1290 చిత్త చిత్తము వచ్చినచోట పండును
1291 చిత్తజల్లు స్వాతివాన
1292 చిత్తము శివునిమీద భక్తి చెప్పులమీద 1293 చిత్తయెండ పిట్టతల పగులును
1294 చిత్తలో చల్లితే చిట్టెడు కావు
1295 చిత్తవాన యెచ్చట పడితే అచ్చటనే
1296 చిత్తస్వాతి నందుల చినుకులు చాలినంత వర్షమిచ్చును
1297 చిత్తస్వారుల కురువకుంటే చీమకూడా నాంబ్రం
1298 చిత్తస్వాతులు కురువకుంటే చిగురుటాకులుమాడిపోవును
1299 చినుకులకు చెరువు నిండునా
1300 చినపేరి తాడుతెగితే పెదపేరితాడూ అప్పుడేతెగుతుంది
1301 చిన్నక్క చిలక పెద్దక్కగిలక చూస్తేచుక్క రేగితేకుక్క
1302 చిన్నక్కను పెద్దక్కను పెద్దక్కను చిన్నక్కనుచేసేవాడు
1303 చిన్ననాడూలేదు పెద్దనాడూలేదు చంద్ర శేఖరుడినాడు చెవుల పోగులా
1304 చిన్న పునర్వసు కార్తెలో చిట్టెడువడ్లు చల్లితే పుట్టేడు వడ్లు పండును
1305 చిదిగ్ పొదిగి చిన్నవానిపెండ్లి చేసేవరకు పెద్దనాని పెండ్లాము పెద్దలలోకలసినది
1306 చిన్నయిల్లు కట్టుకొని పెద్దకాపురం చేయవలె
1307 చియ్యబువ్వ చీకులాట గొల్లవాడువస్తే గోకులాట
1308 చిన్నవాడితండ్రి విద్యాంసుడు చిన్నవాడు చెయ్యందుకుంటే అక్కరలోకి వస్తాడు
1309 చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టవలెను
1310 చిన్నమూ కావలె చిదరా కావలె మేలిమీకావలె మెడ తిరగావలె 1311 చిలక తనముద్దేగాని యెదటిముద్దు కోరదు
1312 చిలక ముక్కున దొండపండు
1313 చిలుము వదిలితే చిద్రం వదులుతుంది
1314 చిల్లర శ్రీ మహాలక్ష్మి
1315 చిల్లిపేరే తూటు
చీ
1316 ఛీకటి కొన్నాళ్లు వెన్నెలకొన్నాళ్లు
1317 చీకట్లో జీవరత్నం
1318 చీపురుకట్టకు పట్టుకుచ్చు కట్టినట్లు
1319 చీపురుకు శిరివస్తే కోడియీక గొడుగు పట్టెనట
1320 చీమలు చెట్లెక్కితే భూములుపండును
1321 చీమలుపెట్టిన పుట్టలు పాము కిరువైనట్లు
1322 చీరకట్తినమ్మశృంగారంచూడుగుడ్డకట్టినమ్మకులుకుచూడు
1323 చీరపిట్టకు దొమ్మతెగులు
1324 చీరసింగారించేటప్పటికి పట్నం కొల్లపోయినట్లు
చు
1325 చుట్టమని చూడవస్తే యింటివారంతా దయ్యాలై పట్టుకున్నారట
1326 చుట్తూ చూరుమంగళం నడుమ జయమంగళం
1327 చుట్టుడు చాప విసురుడు తలుపు పెడసరపు పెండ్లాము