లోకోక్తి ముక్తావళి/సామెతలు-చా

1254 చదువనేర్చిన ఆడుదానితో వండనేర్చిన మగవారితో నోపలేరు

1255 చన్నీళ్ళయినా చల్లార్చుకు తాగవలెను

1256 చలిజ్వరము అన్నములోచెయ్యి తియ్యబుద్దికాదు

1257 చలిపందిలి కుండలకు తూట్లుపొడిచినట్లు

1258 చలిపందిలి కుండలకు రాళ్లు తూట్లుపొడిచినట్లు

1259 చదువులలో మర్మమెల్ల చదివివానులేవోయి

1260 చదువూలేదు సంధ్యాలేదు సంతానం మెండు

1261 చల్లకువచ్చి ముంతదాచినట్లు

1262 చవకయైతే బజారుకు వస్తుంది

1263 చవకదూదర తిండికికారణం

1264 చవియెరిగినకుక్క చావకొట్టినాపోదు

1265 చస్తానని చద్దిఅన్నంతింటే చల్లగా నిద్రవచ్చినదట

చా

1266 చాఅంటే తూఅనలేడు

1267 చాకలిఅత్త మంగలిమామ

1268 చాకలికట్టనిగుడ్డ సైనుయెక్కని గుఱ్ఱమూలేదు

1269 చాకలివానిభార్యకు మంగలివాడువిడాకులిచ్చినట్లు

1270 చాపచిరిగితే చదరంతైనా వుండకపోదు

1271 చామలుచల్లి చేనువిడువవలెను

1272 చాలులో చామదున్నితే చేనుచేనుకే అవుతుంది

1273 చాలీచాలనందుకు చాకింటిగుడ్డలు చాలావున్నవి 1274 చావటిముందరికొంప కదపా పుల్లలకుసరి

1275 చావాచావనివ్వడు బ్రతుకాబ్రతుకనివ్వడు

1276 చావ్చుకు పెట్టితేగాని లంఖణాలకు దిగదు

1277 చావుకుమళ్లీ చావు వస్తుందా

1278 చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు

1279 చనువు చేసిన ఆలు చంకనెక్కును

చి

1280 చింత చచ్చినా పులుపు చావదు

1281 చింత చిగిలింత యేవు

1282 చింత పండితే జీడిపండు;తుంది

1283 చింతలేదు చింత లేకపోతే పులుసులేదు

1284 చిక్కి చికిలించేకన్నా వెళ్ళి వెక్కిరించేదిమేలు

1285 చిగిరింత ఐశ్వర్యము

1286 చిచ్చాయె చిచ్చాయె అంటే సందాయ నందాయె నన్నట్లు

1287 చిత్తకార్తెకు ఉలవచేను చిత్తుచిత్తుగా పండుతుంది

1288 చిత్తకురిస్తే చింత పండును

1289 చిత్త చిత్తరించి స్వాతి దయచేసి విశాఖ విసిరికొట్టకుండావుంటే వీసానికి పుట్టెడు పండుతానన్నదట

1290 చిత్త చిత్తము వచ్చినచోట పండును

1291 చిత్తజల్లు స్వాతివాన

1292 చిత్తము శివునిమీద భక్తి చెప్పులమీద