లోకోక్తి ముక్తావళి/సామెతలు-గూ
గూ
1180 గూట్లోదీపం కుక్షి లో ముద్ద
1181 గూట్లోదీపం నోట్లోముద్ద
1182 గూనికితోడు గుర్రపువాయువు
1183 గూనివాడు పడుకునేవీలు గూనివాడికే తెలుసు
1184 గృహప్రవేశానికి వెళ్లుతూ గుడ్లగూబను తోడుతీసుక పోయినట్లు
గొ
1185 గొంతుకోసేవాదు కత్తియేమరునా
1186 గొంతెమ్మ కోరికలు
1187 గొడారివానివద్ద తోలుకొన్నట్లు
1188 గొడ్లగాచేవానిని కొట్టనివాడు గొర్రెలకాచేవాణ్ణి తిట్టనివాడులేదు
1189 గొద్రాలి కేమి తెలుసు బిడ్డనొప్పులు
1190 గొడ్డుపోతేమొరుగురా బిడ్డచలి
1191 గొడ్దువాడు గొడ్దుకేడిస్తే గొడారివాడు తోలు కేడ్చినట్లు
1192 గొరగగా మిలినజుట్టు
1193 గొడ్డుపోతును బిడ్డను కనమంటే కంటుందా
1194 గొర్రె యేడిస్తే తోడేలుకు విచారమా
1195 గొర్రె కొవ్వితే గొల్లకే లాభం