లోకోక్తి ముక్తావళి/సామెతలు-గు
1127 గాలిలో దీపం పెట్టి దేవుడా నీమహిమ చూపు అన్నట్లు
1128 గాలివచ్చి నప్పుడుగదా తూర్పార పట్టవలెను
1129 గాలీవాన వస్తే కధే మానుతుంది
గి
1130 గింజలు ముత్తుము పిట్టలు పన్నిద్ధుము
గు
1131 గుండెలు తీసిన బంటు
1132 గుండ్రాయి దాస్తే కూతురు పెళ్లి ఆగుతుందా
1133 గుండ్లుతేలి చెండ్లు మునిగినట్లు
`1134 గుడినుండి గుళ్ళోరాళ్ళు తీసినట్లు
1135 గుడిపాము కరచినట్లు గంగిగొవు పొడిచినట్లు
1136 గుడి మింగేవానికి గుళ్లోలింగమెంత?
1137 గుడిమిం గేవానికి గుళ్లోలింగము వట్రవడియము
1138 గుడి మింగేవానికి దలుపు లప్పడములు
1139 గుడిలో గంటపోతే నంబి శఠమైనా వూడదు
1140 గుడివచ్చి మీద పడ్డట్టు
1141 గుడ్డికన్నా మెల్ల మేలు
1142 గుడ్దికన్ను తెరచినా ఒకటే మూసినాఒకటే
1143 గుడ్దిగుర్రాలకు పండ్లు తోముచున్నాడు
1144 గుడ్దినక్క పూరిన పడ్డట్టు 1145 గుడ్డిపాము కరచినట్లు గంగిగొవు పొడిచినట్లు
1146 గుడ్దిమామగారా నమస్కారమయ్యా అంటే రంధికి మూలమా రంకుల కోడలా అన్నాడట
1147 గుడ్దియెద్దు చేలోపడ్డట్టు
1148 గుడ్దివాడికి గుడ్దివాడు దారిచూపితే ఇద్దరు గోతిలో పడతారు
1149 గుడ్డివాడు కన్ను రాగొరునా పోగోరునా
1150 గుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినదట
1151 గుణము మానవే గుంటాలపోలీఅంటే నామనుమైనా మానుతానుగాని గుణము మాననందట
1152 గుద్దులాడేయింట్లో గుప్పెడుగింజలు నిలువవు
1153 గుమ్మడికాయలు పోయేదారి యెరుగడుగాని ఆవగింజలు పోయేదారి అట్టే కనిపెట్టుతాడు
1154 గుమ్మడికాయలు దొంగాంటే బుజాలు తడిమిచూచుకొన్నట్లు
1155 గుమ్మడిపండు వాటంగా బట్టయెగదోసి
1156 గుమ్మళ్ళు కుళ్ళీనవి ఆవలు అల్లినవి
1157 గురికి జానెడెచ్చు తక్కువగా కాల్చేవాడు
1158 గురువింద తన యెరుపేగాని నలుపెరుగదు
1159 గురువుకుతగ్గ శిష్యుడు
1160 గురువుకు పంగనామాలు పెట్టితినట్లు
1161 గురువుకు మించిన శిష్యుడు
1162 గురువుతో గుద్దులాటా 1163 గురువుమాట మీరరాదు గడ్డపారమింగరాదు
1164 గురువు నిలుచుండి తాగితే శిష్యుడు పరుగెత్తుతూ తాగుతాడు
1165 గుఱ్ఱం గుడ్దిదైనా దాణాతప్పదు
1166 గుఱ్ఱం చచ్చిందికాక గుంటత్రవ్వుటకు నొకరూక
1167 గుఱ్ఱపుచూపు గొర్రెతినుడు
1168 గుఱ్ఱపుతోకకు కళ్లెంపెట్టినట్లు
1169 గుఱ్ఱపుబండికి వొంటెద్దులబండి ఆదర్శంగా
1170 గుఱ్ఱం పేరు గోడ అయితే జీనుపేరు!మదురు. యింక అంతా తెలుసును
1171 గుఱ్ఱం వలె కుక్కనుపెంచి రెడ్డి తానే మొరిగెనట
1172 గుఱ్ఱానికి కడుపు మాడితే ఆరిక కసరైనా తింటుంది
1173 గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తినవేర్పవలెనా
1174 గుఱ్ఱమును తిన్నకుక్క అదేమి బ్రతుకును
1175 గుఱ్ఱానికీ తోకవుంటే అదే విసురుకుంటుంది కాని సావిట్లో గుఱ్ఱాలన్నింటికీ విసుతుందా?
1176 గువ్వగూడెక్కె అవ్వమంచమెక్కె
1177 గుసగుసయోచనలు గుడికిచేటు
1178 గుళ్లోదేముడికి వైద్యంలేకుంటే బూజారి పులిహోరకు యేడ్చినాడట
1179 గుళ్లుమింగేవానికి గుడిలింగాలు లక్ష్యమా