రాగం: పూర్వి కళ్యాణి - రూపక తాళం మార్చు

పల్లవి:
రామా నీ మహిమ దెలియ నెవరి తరమురా సీతా
రామ నీ మహిమ దెలియ నెవరి తరము రా ||

అనుపల్లవి:
పామరుడ తామసుడ పరమ నీచుడ న
న్నేమరకును బ్రోవ కున్న నెవ్వరి వాడ నగుదు కోదండ ||

చరణం 1:
మంద బుధ్ధి నన్ను బోటి మానవునకు నీ గుణాళి
యంద రాదు గదర ఎందెందు జూచినను పట్టాభి ||

చరణం 2:
నైక జన్మ పుణ్య ఫల విపాక విశేషము గని
నీ కరుణ సోకదురా నిక్కము నిక్కము నిక్కము కోదండ ||

చరణం 3:
దోసములే చేసినాడ దొరవు క్షమియించ గదర
దాసు కులాజ శ్రీరాముని తప్పులు దండము తో సరి ||