రామా దైవశిఖామణి


   తోడి రాగం    త్రిపుట తాళం

ప: రామ దైవశిఖామణి సురరాజ మహోజ్వల భూమణి || రామ ||

అ.ప: తామర సాక్ష సుధీమణి భవ్య తారక భక్త చింతామణి || రామ ||


చ 1: నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా

వేడుకై మిము పొగడ గంటిగా నన్ను దిగవిడనాడ వద్దంటిగా || రామ ||


చ 2: చింతసేయగ నేమిలేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా

ఇంతకు మిక్కిలి రాబోదుగా నే యితరుల గొలిచేది లేదుగా || రామ ||


చ 3: తమ్ముడు నీవొక జంటను రామదాసుని రక్షించుటను

సమ్మతి నుండు మాయింటను భద్రాచల వాస నీ బంటును || రామ ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.