రామాయణ విశేషములు-6
6
సాంఘికాచారములు
రామాయణ మూలగ్రంథ రచన క్రీ. పూ. 2500 ఏండ్లనాడు జరిగెనని తెలిపినాను. మరియు క్రీస్తుశకారంభమువరకు దానివి పెంచుతూ వచ్చిరనియు తెలిపినాను. ఈ కారణముచేత రామాయణమందు వర్ణింప బడిన సందర్భములనుబట్టి ఆనాటి సాంఘికాచారము లెట్టివిగా నుండెనో తెలుసుకొన వీలున్నను ఆ యాచారములు క్రీ. పూ. 2500 నుండి క్రీస్తు శకారంభ మధ్యకాలములోని వనియే చెప్పవలెను. కాని అవి ఒక నిర్ణయమగు కాలమందే వర్తించుచుండెనని చెప్పుటకు వీలులేదు. రామాయణములో అందందు సందర్భానుసారముగా వర్ణించిన భాగముల నుండి జనుల యాచారవ్యవహారములు, నాగరికత, విజ్ఞానము, దేశస్థితి, జనుల విశ్వాసములు మున్నగు నంశములు ఊహించుకొన వీలుకలుగు చున్నది. శ్రీరాముడు త్రేతాయుగములో నుండెనని పౌరాణికులు విశ్వ సింతురు. ఆ యుగములో సత్యము మూడుకాళ్లపై నడిచెననియు, రామ రాజ్యములో అంతయు ధర్మబద్ధముగా నుండెననియు చెప్పుదురు. అది నమ్ముటకు వీలులేదు. కైకేయీవర్తన మూలమున రామునికి వనవాసము తప్పదయ్యెను. ఆనాడు జాబాలివంటి నాస్తికులుండిరి. వానరులలో నీతి వర్తన సరిగా లేకుండెను. రాక్షసుల బాధ భరింపరానిదై యుండెను. మాంసభోజనము అన్ని జాతులలోను ఉండెను. మద్యపానము తప్పుగా భావింపబడినట్లు కానరాదు. జూదమును జనులు ఆడుచుండిరి. బోగము సానులుండిరి. ఇట్టివెన్నైనను చూపించవచ్చును. ఇవన్నియు కృతయుగ సత్యధర్మమునకు భంగము కలిగించునట్టివే. పౌరాణికముగా గాక చారిత్రకముగా వీలైనంతవరకు రామాయణ కాలమందలి జనుల సాంఘికాద్యాచార వ్యవహార విశ్వాసములను గురించి తెలుసుకొందము. మొట్టమొదట ఆ కాలమందలి వర్ణవ్యవస్థను గురించి విచారింతము.
వర్ణవ్యవస్థ
చాతుర్వర్ణ్య వ్యవస్థ అప్పటికే స్థిరపడియుండెను. కాని తర్వాతి కాలములోవలె ఆనాడు కులాల కట్టుబాట్లు కఠినముగా లేకుండెను. వర్ణాం తర వివాహములు తప్పుకాకుండెను. అంగరాజు కుమార్తెను బ్రాహ్మణు డైన ఋశ్యశృంగుడు వివాహమాడెను. బాల. 10-30 నానావిధ వృత్తులచే జీవించు కార్మికజీవులుండిరి. వడ్రంగులు బాల. 13-9 తాళములుచేసి అమ్ముకొనువారు అయో. 3-17 చెంబెడివారు ఆయో. 45-4 మణులను సానబెట్టువారు, కుమ్మరులు, సాలెవారు, ఆయుధ ములను చేయువారు, నెమిలిపింఛములతో వీవనలు చేయువారు, కట్టె పలకలు కోయువారు, దంతము పనిచేయువారు, సున్నపుగచ్చు పనిచేయువారు, అత్తరు పన్నీరు సుగంధద్రవ్యములను సిద్ధముచేసి అమ్మువారు, కమసాలులు, కంబళ్లు నేయువారు, పైకము తీసుకొని తలంటిస్నానము చేయించు పరిచారకులు, ఒడలుపిసికి నలుగులు పెట్టు వారు, వైద్యులు, మద్యములను సిద్ధముచేయువారు, చాకలివారు, కుట్టు పనివారు (దర్జీలు), బోగము స్త్రీలు, ఇంకను నానావిధ వృత్తులవారు అయోధ్యా నగరమందుండిరి. (అయో. 83-శ్లో. 12 నుండి 16 వరకు) వెట్టి పని చేయువారు కూడా ఉండిరి. (ఆయో. 81-20) వసిష్ఠుని కుమారులను “ముష్టికులు" అగునట్లు విశ్వామిత్రుడు శపించెను. (బాల. 59-17) ఈ ముష్టికులు నేటి తెలుగునాటి ముష్టివారు కారు. ముష్టివారి సంగతి అనుమానమే కాని రామాయణ కాలములో మున్నూరు వారు మాత్రము లేకుండిరి. ఈ విషయమెందులకు స్పష్టము చేయవలసి వచ్చిన దనగా సుప్రసిద్ధ చరిత్ర చతురాననులగు కీ. శే. చిలుకూరు వీరభద్ర రావుగారు శ్రీరాముడు త్రుంచిన శివధనుస్సును 'ఒక మున్నూరు కదల్చి తెచ్చిరి' అను పోతనామాత్యుని భాగవత వాక్యము నాధారము చేసుకొని “మున్నూరు కాపులు ఆ ధనుస్సును మోసికొని తెచ్చిరి, చూడుడు. అందుచేత రామాయణ కాలములో మున్నూరు వారుండిరి. వారిని సంస్కృ తీకరించి 'త్రిశతివంశము' వారు అని యందుము" అని ఒక పెద్ద వాద మును లేవదీసిరి. వాల్మీకి రామాయణములో శివ ధనుస్సును 5000 మంది మోసికొని వచ్చిరి.
నృణాం శతాని పంచశద్వ్యాయతానాం మహాత్మనాం
మంజూషా మష్ట చక్రాంతాం సమూహుస్తే కథంచన.
(బాల. 67-4)
కావున వాల్మీకి రామాయణమే మనకు ప్రధానము కాని బమ్మెర
పోతన భాగవతము మనకు ప్రమాణము కానేరదు. పైగా ఒక మున్నూరు
అంటే ఒకే ఒక మున్నూటి జాతి మనిషి శివ ధనుస్సును మోసుకొని
వచ్చెనని కానేరదు. మున్నూరు మంది మోసుకొని వచ్చిరని
యర్థమగును. ఆ మున్నూరు మంది యీనాటికి మున్నూరుజాతికి మూల
పురుషులనుట హాస్యాస్పదము పైగా మోసుకొనివచ్చినవారు సేవకులు.
అట్టివారి సంతతి యని చెప్పుకొనుటయు ప్రశస్తము కానేరదు. ఈ చర్చ
ఇచ్చట ఇంతకన్న విపులముగా చేయుట అప్రస్తుతమగును.
ఆ కాలములో వంటల వారుండిరి. వారికి ప్రత్యేక లక్షణముగా పోగులుంటూ ఉండెనేమో ?
"యస్యత్వాహారసమయే సూదాః కుండలధారిణః"
(అయో. 12-98)
ఉండిరి. (అయో. 48-28) రాజుల అంతఃపురముల వద్ద కావలి గాయుటకు గాను నపుంసకులు నియుక్తులై యుండిరి. (అయో. 65-7)
అనార్యులు
రామాయణ కాలపు భారతదేశమందు ఆర్యులకన్న అనార్యులే
ఎక్కువగా నివసించినట్లు చాలా నిదర్శనములు కలవు. ఈ అనార్యుల
యుత్పత్తిని గూర్చి వినోదకరమగు కథలను గూడా కల్పించిరి. విశ్వా
మిత్రుని సైన్యము నెదుర్కొనుటకు గాను వసిష్ఠుని కామధేనువు తన
హుంభారవము చేత పప్లవులను, మ్లేచ్ఛులను పుట్టించెనట. తర్వాత
యవనులను, శకులను, కాంభోజులను సృష్టించెనట. వీరందరును
విశ్వామిత్రునిచేత హతులుకాగా మరల కామధేనువు హుంభారవముచేత
కాంభోజులను, స్తనములనుండి పప్లవులను, యోని నుండి యవనులను,
శకృత్తునుండి శకులను, రోమములనుండి మ్లేచ్ఛులను. కిరాతులను,
హారీతులను పుట్టించెనట. (బా. 54,55 సర్గలు). దీనినిబట్టి పై అనార్య
జాతులు రామాయణకాలములో మనవారికి పరిచితులై యుండిరని
మాత్రము చెప్పవచ్చును. ఒకచోట పప్లవులను కామధేనువుయొక్క
హుంభారవమునుండి పుట్టిరనిచెప్పి వెంటనే వారు స్తనముల నుండి
పుట్టిరని చెప్పినారు. ఇది కల్పన యని నిరూపించుచున్నది. ఈ
కామధేను సంతానముతో యుద్ధము చేసిన విశ్వామిత్రుని కుమారులలో
ఒకడుతప్ప తక్కినవారందరును చనిపోయిరని చెప్పినారు. అటు
తర్వాత మరొకచోట అతనికి నూర్గురు కొడుకులుండిరని తెలిపినారు.
కామధేను సంతానమైన పై జాతులు భారతదేశములోని వారుకారు. వారు హిందూస్థానమునకు పడమటిదిక్కుననున్న ఈరాన్, అసీరియా, ఖాల్డియా, అయోనియా, ఫినీషియాదేశములందలి అతి ప్రాచీన నివాసులు. పప్లవులు పహ్లవులను ఈరాన్ జాతివారు. యవనులు గ్రీకు లేక అయోనియా ద్వీపములందలి జనులు. శకులను సిధియనులని చరిత్రకారు లన్నారు. మ్లేచ్ఛులు పఠాన్ జాతిభేదము “నమ్లేచ్ఛితవై నాపభాషితవై” అని పతంజలి వ్రాసెను. మ్లేచ్ఛులు అపశబ్దములు మాట్లాడేవారని తలచిరి. మాక్సుమూలర్‌గారు బెలూచిస్థానము జనులనే ఆర్యులు మ్లేచ్ఛులనిరని వ్రాసినారు.
కాశ్మీరు సంస్థానమునకు సరిహద్దు సూబాకునుమధ్య హజారా అను జిల్లా కలదు. అందు మలచ్ (Malach) మరియు లోరా అను ప్రాంతాలు కలవు. ఈ మలచ్ మండలమునే ఆర్యులు మ్లేచ్ఛదేశమనిరి. అందలి కొండలలోనుండు క్రూరజనులనే మ్లేచ్ఛు లనియందురు.
పైన తెలిపిన జాతులన్నింటితో ఆర్యులకు ప్రాచీనమందు వ్యాపారము విరివిగా జరుగుచుండెను. మరియు ఆర్యులతో సంబంధములు చాలా యుండెను. కాంభోజులు కాబూల్ నదీ ప్రాంతమం దుండినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయము. కాంభోజులు ఈరానీవారని గ్రీర్సన్ అన్నాడు. గచ్ఛతి అనుటకు మారుగ 'శవతి' (శవము అను అశ్లీలార్థము వచ్చు) ప్రాచీన రూపమును కాంభోజులింకా వాడుచున్నారని యాస్కుడు నిరుక్తమందు వ్రాసెను. రఘువంశములో రఘుమహారాజు దిగ్విజయములో పలక్షు (ఆక్సన్) నదీ తీరమందు హూణుల నోడించి తర్వాత కాంభోజుల నోడించెనని వర్ణితము. దీన్ని బట్టి కాంభోజులు ఆఫ్గనిస్థాన ప్రాంతమువారని తేలును. ఆఫ్గన్ సరిహద్దున కంబు నది కలదు. దాని నిప్పుడు కాబూల్‌నది యందురు. తత్రాంత వాసులే కంబుజులు - కాంభోజులు !
కొన్ని జాతుల అనార్యులుగా పరిగణింపబడినను అవి నీచముగా చూడబడుచుండెను. వసిష్ఠకుమారులు త్రిశంకుని యాగమునకు రానందున "శ్వామాంస నియతాహారులైన ముష్టికులు కండు” అని వారిని విశ్వామిత్రుడు శపించెను. ఇంకొకని నిషాదుడగునట్లు శపించెను. మరొక మారు శునశ్శేఫునికి మారుగా అంబరీషుని నరమేధములో తన కుమారులను యజ్ఞపశువులై ప్రాణము లర్పించుటకు విశ్వామిత్రు డాజ్ఞాపించెను. ఆ కుమారు లందులకు సమ్మతింపనందున క్రుద్ధుడై వారిని వసిష్ఠ కుమారుల వలెనే కుక్కమాంసము తిని బ్రదుకునట్టి ముష్టికు లగునట్లుగా శపించెను. ఇక్కడ గమనింపదగిన విషయమేమనగా ఇదే శునశ్శేపుని కథ ఐతరేయ బ్రాహ్మణములో భిన్నించినదిగా కనబడుచున్నది. అచ్చట హరిశ్చం ద్రుడు యజ్ఞకర్త. అచ్చట విశ్వామిత్రుని కుమారులు ఆంధ్రాద్య నార్యజాతులలో చేరిపోవునట్లు శప్తులైరి. ఇచ్చట ఆ ముచ్చటయే లేదు. బలెతరేయబ్రాహ్మణము మార్పులు చేయుటకు వీలులేని వైదిక గ్రంథ మగుటచేత అదియే ఎక్కువ విశ్వసనీయము. అచ్చటి యాంధ్రులును రామాయణములోని ముష్టికులును ఇంచుమించు ఒకే జాతిగా నుండిరా? చెప్పజాలము. ఆంధ్రనిషాద ముష్టికాదిజాతులవారు భారతదేశమందుండిన అనార్యజాతివారు. వీరుకాక వానరులు, రాక్షసులు, దక్షిణాపథమందును, జనపదమను దండకారణ్యపరిసర ప్రదేశములందును నివసించినట్లు కానవచ్చుచున్నది. వానర రాక్షసు లెవరు? అను విషయమును ప్రత్యేక ముగా వ్రాయుచున్నందున ఇక్కడ ఆ చర్చను వదలుకొన్నాను.
రామాయణకాలమందు దాక్షిణాత్యులు నెత్తినిండుగా వెంట్రుకలు పెంచుకొని పూలను ధరించుచుండిరట. ఈ వర్ణన స్త్రీలను గురించి చేసినది కాదు ఇది పురుషులను గురించియే చెప్పినమాట. (అయో. 93-19). నేటికిని అరవవారిలో ఈ లక్షణాలు కానవచ్చుచున్నవి.
నర మేధము
పైన తెలిపిన అనార్యజాతులయుత్పత్తి సందర్భములో నరమేధ
ప్రసక్తియు వచ్చినది. అందుచేత దానిని గురించి యిచ్చటనే కొంత చర్చింతము. ఆర్యులలో దేవతలకు మనుష్యులను బలియిచ్చు ఆచారము
విరివిగా ఉండినట్లు కానరాదు. శునశ్శేపుని కథవంటివి అరుదుగా కనబడు
చున్నవి. కథాసరిత్సాగరములో అలంకారవతీలంబకములో శ్రీరాముడు
నరమేధమును చేసినట్లు వ్రాసినాడు. అది కల్పితకథల సంకలనముకాన
ప్రమాణము కానేరదు. నరబలియొక్క యాచారము ఫినీకియాజాతివారిలో
విశేషముగా నుండెను. ఆ ప్రాంతమందే జ్యూ (యహూదీ) జాతివా
రుద్భవించిరి. వారిలోను ఈ యాచారముండెను. అసీరియా బాబిలోనియా
లోను ఈ యాచారముండెను. బైబిల్‌లోని పూర్వభాగములో (Old
Testament) ఇట్లు తెలిపినారు: దేవుడు ఒక భక్తునితో ఇట్లనెను- "నీ
సంతానములోని మొదటివానిని నీవు నాకు బలి యియ్యవలెను. అదే
విధముగా నీ యెద్దులలోను, మేకలలోను మొదట పుట్టినవాటిని నాకు
సమర్పింపవలెను” (ఎక్సోడస్ 22-29) ఇట్టి విషయమే కింగ్సు (3-24
నుండి 27) లో తెలుపబడినది ఆబ్రహాం (జ్యూ) తన జ్యేష్ఠకుమారుడగు
ఈసాక్‌ను తన దేవునికి బలి యిచ్చెను. తుదకు ఈ ఆబ్రహాంతో
దేవుడొక నిర్ణయము చేసుకొనెను. ఇకముందు పుత్రులను బలి యియ్య
నక్కరలేదు. దానికి మారుగా వారి లింగచర్మకర్తనము (ఖత్నా -
Circumcisoin) చేసిన చాలును. యూదులలోను ముసల్మానులలోను
నేటికిని ఈ 'చర్మ కర్తనము' వర్తించుచున్నది.
ఫినీకియాలో టైర్ అను పట్టణము గొప్ప ప్రసిద్ధమగు ఓడరేవు. అచ్చట మోలచ్ దేవునికి మేల్‌కార్తు అని, బాల్‌మేల్కార్త్ అనియు పేరుపెట్టి అతనికి నరబలు లిచ్చుచుండిరి. దేశారిష్టములు, యుద్ధములో ఓటమి కలిగినప్పుడు ఈ నరబలులు అధికముగా చేయబడుచుండెను. ఈ ఫెనీకులు ఉత్తర ఆఫ్రికా తీరములో కార్తేజ్ అను మహా నగరమును క్రీ. పూ. 700 లో నిర్మించిరి. అందు మోలచ్ విగ్రహాన్ని స్థాపించిరి. ఆ విగ్రహము మహాభయంకరముగాను అత్యున్నతముగాను ఉండెడిది. దానిని ఇత్తడితో చేసియుండిరి. లోపల అంతయు రంధ్రమయము. దానికి ఎద్దుతల యుండెను. దాని చేతులలో బలిగా నియ్యబడిన వానిని ఉంచుచుండిరి. చేతులను యంత్రములతో లాగుచుండిరి. విగ్రహము చేతులెత్తి నరుని తన నోటిలో వేసుకొనుచుండెను. విగ్రహము అడుగు భాగములో మహాజ్వాలగా మంటలు మండుచుండెను. ఆ నరుడు విగ్రహము కడుపులోబడి జ్వాలలో భస్మమగుచుండెను.
బైబిల్‌లో మరొకతావున (జడ్జెస్ 11-30-31 ) జప్తాహ అనువాడు తన కుమార్తెను బలియిచ్చినట్లు తెలిపినారు. ఈ విధముగా ప్రాచీనమందు కొన్నిజాతులలో నరబలు లుండెను. ఆ యాచారమునే కొందరార్యులు అనుసరించినట్లున్నది. తర్వాత ఈ యాచారమును నిషేధించినట్లు-
'నరాశ్వమేధౌ మద్యంచ కలౌ వర్జ్యా ద్విజాతిభిః (తిథ్యాదితత్త్వం)'
అనుదానిచే గ్రహింపవచ్చును.
హస్తినాపురి రాజులలో మహాభౌమయను రాజుండెను. అతడు 1000 నర మేధ యజ్ఞములు చేసెనట! “యఃపురుషమేధో పురుషాణా మయుత మానయత్ తత్తస్య ఆయుతానాయిత్వం"(మహాభారత- ఆది. 1,63,20) అతనికి ఆ కారణముచే అయుతానాయి అను పేరుకలిగెను. జనమేజయుడు సర్పయాగము చేసెను. అనగా నాగులనెడు ఆనార్యజాతివారు దుర్బలు డైన పరీక్షిత్తును చంపి రాజ్యమాక్రమించుకొనగా అతని కుమారుడు జనమేజయుడు మరల బలిష్ఠుడై వారినోడించి సంహారము చేసెనని యర్థము. అయుతానాయి కథయు నట్టిదైయుండును. జనమేజయుని యనంతరము 21 తరముల తర్వాత చండప్రద్యోతుడను రాజు తమ్ముడు కుమారసేనుడు ఉజ్జయినిని పాలించి నరమేధమును నిషేధించెనని ఒకరు వ్రాసినారు. హర్షచరితలో (అయిదవ అధ్యాయము) హర్షవర్ధనుని కాలమందు నరమాంస క్రయ విక్రయముండినట్లు కలదు! ఇది కథయో కల్లయో తెలియదు! మహాభారతారణ్య పర్వమందొక విచిత్రకథ కలదు. సోమకసహదేవుడనురాజు కొకేకొడుకు, బహుభార్యలును నుండిరి. అతని కొక్కకొడుకు తృప్తిని కలిగింపలేదు. యజ్ఞరహస్య వేత్తల బోధలనమ్మి ఆ ఏకైకపుత్రుని చంపి హోమములో వేసి దుఃఖించుభార్యల నా ధూమము నాఘ్రాణింపజేసెను. వారికి నూర్గురు పుత్రులు జన్మించిరట! (ఆరణ్య. 129 ఆధ్యాయము). ఇది హేయమగు కల్పన!
నరమేధమును గురించి శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తమ సంస్కృత వాఙ్మయ చరిత్రలో (భాగము, 1 పుట 199) వ్రాసినది సంగ్రహముగా నిందు తెలుపుచున్నాను.
"ఋక్సామ యజుస్సంహితలు నరమేధమును విధింపకున్నను యజుస్సంహితలో పురుషమేధ ప్రసంగము కనిపించుచున్నది. తైత్తిరీయ బ్రాహ్మణములో పురుషాలంభ విధియు గనిపించుచున్నది. ప్రాజాపత్య హవిర్నిష్పాదనమునకై 'ఏక వింశత్యా మాషైః పురుషశీర్షం' ఇత్యాది మంత్రములందు పురుష శిరస్సంపాదన విధానమున్నది. 'బ్రాహ్మణే బ్రాహ్మణ మాలభతే'— ఇత్యాదిగా 'ప్రతీక్షాయై కుమారీం' అనునంత వరకు (తై. బ్రా. 3-4; 1-19) 186 మనుష్యరూప పశువులు చెప్ప బడినవి. దీనిని బట్టి నరమేధ మొకానొక కాలమున నుండె ననుట విశ్వసనీయ మగుచున్నది. నరమేధము అయిదు దినములు చేయునట్టి సోమయాగము. దీనివలన గొప్ప తేజస్సు, మహావీర్యము పొందుట యీ యాగ ఫలమనినారు . . . వాజసనేయ సంహిత (30-31 అధ్యా యములలో) పురుష వేధవిధి కనబడుచున్నది. ...... ఏమయిన నీ దుష్టాచారము పుట్టినవెంటనే అణగిపోయినదనుట నిజము.”
ఈ చర్చవలన నింతమాత్రము గ్రహింపవచ్చును. కృష్ణ యజుర్వేదమును, తైత్తిరీయమును ఆర్య సమాజమువారు అంగీకరింపరు. అవి తర్వాతి సృష్టియందురు. నరాశ్వ గోమేధికా యజ్ఞములు ఆర్యులవి కావేమో! అవి (సితియన్) శకజాతి వారివి. వారి యాచారములను కొంతకాలము కొంద రార్యులు స్వీకరించి యుందురు. కాని నరమేధమును శిష్టు లంగీకరింప నందున అది తొందరగా రూపుమాసినట్లున్నది. పైగా శైవ శాఖలో నొక తాంత్రిక వర్గమువారు శక్తి పేర శివుని పేర నరబలులు రహస్యముగా నిచ్చినట్లు చెప్పుదురు. అట్టివారి కల్పన యీ నరమేధమై యుండును. ఒకవేళ ఆర్యులే తప్పుదారిలో పడినను తొందరగా మేల్కొని దానిని పరిహరించియుందురు.
అశ్వమేధము
నరమేధముతో పాటు అశ్వమేధ ప్రసక్తియు వచ్చినందున దానిని
గురించియు ఇందే చర్చింతము. ప్రాచీనకాలములో గుర్రాలకు చాలా
ప్రాముఖ్యముండెను. కస్సీ (Kassites) జాతివారు. బాబిలోనియా
ప్రాంతములోనివారు. వారినే ఋగ్వేదములో 'కేశిన్' జాతివారని
వ్యవహరించిరి. ఈ కస్సీలు గుర్రపుసవారిలో ప్రవీణులు. క్రీ. పూ.
1750 లో వారు గుర్రాలను తీసికొని బాబిలోనియా పైబడి అచ్చటి
వారిని జయించి రాజ్యము చేసిరి. మొట్టమొదటి సారి గుర్రములను
జూచి బాబిలోనియావారు భయపడిపోయిరట. కస్సీలవలెనే శకులు
(సితియనులు) గుర్రపు సవారీలో ప్రసిద్ధి నొందియుండిరి. గుర్రపు సవారీ,
ధనుర్విద్య వారి ప్రత్యేక లక్షణాలు. అంతేకాదు. గుర్రపు మాంసము
తినుట, గుర్రము పాలు త్రాగుట కూడా వారి ప్రత్యేకలక్షణాలై యుండెను.
ఈ కారణాలచేత ప్రాచీనకాలమందు అనార్య జాతులలో గుర్రమునకు
ప్రాముఖ్యముండెను. ఆర్యులును గుర్రముల సవారీలోను, ధనుర్విద్య
యందును శకులవలెనే ఆరితేరినవారు. వారిలో అశ్వమేధము ప్రబలి
యుండెను. అశ్వమేధమును సామ్రాజ్య చిహ్నముగా చేయుచుండిరి. లేదా
సంతానాది కామ్యకవ్రతముగా చేయుచుండిరి. దశరథుడు అశ్వమేధ
యాగము చేసెను. (బా సర్గ. 14). శ్రీరాముడును అశ్వ మేధము చేసెనని ఉత్తరకాండలో తెలిపినారు. అశ్వమేధమందలి కార్య కలాపము ఉత్తమ
మైనదిగా కానరాదు. ఆ వివరములోనికి ప్రవేశించుట ప్రకృత మన
వసరము. ఈ వివరములను తెలుసుకొన గోరువారు వాజసనేయసంహిత,
తైత్తిరీయ సంహిత, ఆపస్తంబ శ్రౌతము, ఐతరేయబ్రాహ్మణము
మున్నగునవి చూచుకొనగలరు.
చండాలురు
రామాయణకాలములో చండాలజాతి అను అంటరాని జాతి
యొకటి యుండెను. వారు కుక్కలను తినుచుండిరి. విశ్వామిత్ర వసిష్ఠ
కుమారులు శప్తులై కుక్కల తిను ముష్టికులైరి. ఈ ముష్టికులును
చండాల జాతిభేదము వారేమో? అయితే విశ్వామిత్రుడు కూడా ఒకప్పుడు
12 ఏండ్ల క్షామము వచ్చి ఆహారము లభించనప్పుడు చండాల వాటికలో
జొరబడి అచ్చట ఆరగట్టబడిన కుక్క మాంసమును సాపడెను. ఇదే
మయ్యా ఇట్టి చౌర్యము తమకు తగునా అని చండాలురు ప్రశ్నింపగా-
“పిబంత్యే వోదకం గావో మండూకేషు రుదంత్స్వపి
నతేధికారో ధర్మేస్తి మాభూదాత్మ ప్రశంసకః”
ఓరీ, ధర్మాధికారము నీకులేదు. అదంతా మాకు తెలుసునులే.
కప్పలు బెకబెకమని ఆక్షేపించితే చెరువునీటిని ఆవులు త్రాగకుండా
ఉంటవా మరి? అని యాక్షేపించెనని పురాణాంతరమందు వర్ణితమై
యున్నది.
త్రిశంకు చండాలుడు కాగా,
'నీలవస్త్రధరో నీలః పరుషో ధ్వస్త మూర్ధజః
చిత్య మాల్యానులేపశ్చ అయసాభరణో భవత్'
(బా. 58-10, 11)
కురుచలైన తలవెంట్రుకలతో శ్మశాన మందలి పూలను బూడిదను ఇనుప సొమ్ములను ధరించెను. ఈ వర్ణనను బట్టి చండాలుర రూపవేషములు గ్రాహ్యములగుచున్నవి. ఈ చండాలురు ఆటవిక జాతివారుగా ఉండి రేమో! ఈరాన్ సింధు మధ్యదేశము లందుండిరేమో? ప్రాచీన పారసీకులు చండాలురను 'జందాల్' అని పిలిచిరి.
నేటివలె నాడు ప్రజలు క్రొన్నెలదర్శనము చేసుకొని పూజించి రేమో! (బా.1-18) స్త్రీల కంగరాగము లుండెను. (బా. 3-18). అనసూయ యరణ్యములో సీత కంగరాగము లర్పించెనట! 'స్నానాని చాంగరా గాంశ్చ మాల్యాని వివిధానిచ' అని రామాయణమందే కలదు. అంగ రాగమనిన చందనాది విలేపనము. కుండలములు పురుషుల ప్రధాన భూషణములు (బా. 6-10, 11, 12) పురుషులు దండకడెములను (అంగదములు), పతకములను (నిష్కములు) ధరించెడివారు. స్త్రీలు నడుములందు రశనాదామములను కట్టుకొను చుండిరి. (జఘనం తవ నిర్మృష్టం రశనాదామ శోభితం. అయో. 6-43). ఈ యలంకరణము విశేషముగా అజంతా చిత్రములలో కాననగును. జాతరూపమయమైన తిలకముతో లలాటము నలంకరించుకొను చుండిరి. (అయో. 9-49) పెద్దవారు వరాహ రక్తమువంటి రక్తచందనము నలదు కొనుచుండిరి. (అయో. 16-9) రక్తచందనమును తిలకముగా నేటికిని ఉత్తర హిందూ స్థానమువారే యెక్కువగా వాడుచున్నారు. రాజుల ఛత్రములకు నూరు శలాకలు (కడ్డీలు) ఉండెను. అవి తెల్లనిగొడుగులు (అయో. 2-7; 26-10). రాజులకు పతాక ధ్వజము లుండెను. (అయో. 9-3: 17.3). పతాకము, ధ్వజము అని రెంటిని ఒకే పర్యాయము పలుతావుల వాడినారు. పతాకమనగా (నిషాన్) వస్త్రముపైగల చిహ్నము. ధ్వజమన పతాకాదండము (కట్టె). మాంసభోజనము
రామాయణ కాలమందు అందరును మాంసమును తినుచుండిరి. ఆవులను గూడా తినుచుండినట్లు సూచనలు కనిపించుచున్నవి. ఒకటి రెండు తావులందు గోవధ తప్పని తెలిపినారు. ఒకచోట ఇట్లు తెలిపినారు :
గౌర్హతా జానతా ధర్మం కండునాపి విపశ్చితా. (అయో. 21-30)
కండు మహర్షి ధర్మరహస్య మెరిగిన వాడైనను తండ్రియాజ్ఞను
పరిపాలించువాడై అతని యాజ్ఞచే ఆవును చంపెను. ఇచ్చట గోవధను
కండుమహర్షి యంతటివాడే చేసినను అది తప్పనియే ధ్వనింపబడినది.
కాని మరొక ఘట్టమును చూడుడు భరద్వాజ మహర్షి రామునకు మధు
పర్కమునకై యెద్దును అర్ఘ్యజలమును తెచ్చియిచ్చెను.
ఉపానయత ధర్మాత్మా గామర్ఘ ముదకం తతః. (అయో. 54-17)
గోమాంసమును తినుట రామాయణమందు అరుదుగా కనిపించినను
ఇతర జంతు మాంసభుక్తి బాగా కనబడుచున్నది.
మాంసమును ఎండించి వరుగుచేసి తినుచుండిరి. చేపలను తినుచు, మునివృత్తి నవలంబించినవారిలో చాలామంది మాంసమును వర్జించుచుండిరేమో? రాముడు కైకేయీదేవితో నిట్లనెను:
చతుర్దశహి వర్షాణి వత్య్సామి విజనే వనే
మధుమూలఫలై ర్జీవన్ హిత్వా ముని వదామిషమ్.
అయో. 20-29.
మునులు మాంసమును వదలి మధుమూలఫలములను తినుచుండి
రని పై ఉదాహరణములన అర్థమగుచున్నది. ఇల్వలవాతాపి అను
రాక్షస సోదరులు దొంగతద్దినములకు బ్రాహ్మణులను పిలిచి తుష్టిపూర్తిగా మాంసము తినిపించుచుండిరి. అగస్త్యమహర్షియు ఒకమారు
వారి శ్రాద్ధ భోజనములో మేకమాంసమును భుజించెను. ఆర. 11-66
దీనినిబట్టి మునులుకూడా ఎప్పుడు తప్పినను శ్రాద్ధములందైనను
మాంసమును తినుచుండిరని ఊహింపవచ్చును.
గంగానది దాటునప్పుడు సీతాదేవి యిట్లని మ్రొక్కుకొనెను: “గంగాదేవీ, మేము సుఖముగా తిరిగి వచ్చినట్లైన నీకు 10,000 ఆవులను, 1000 సురాభాండములను మాంసాన్నమును సమర్పించు కొంటాను.” (అయో. 52-89). అదే విధముగా యమునానదిని దాటు నప్పుడును ఇట్లు మ్రొక్కుకొనెను: “మేము సుఖముగా తిరిగి వచ్చి నట్లైన నీకు 1000 ఆవులు 100 కల్లుకుండలు సమర్పించుకొందును" (అయో. 55-20).
రాముడు గంగదాటి అరణ్యమును ప్రవేశించిన మొదటిదినమే నాలుగు జంతువులను ఆహారార్థమై వేటాడెను.
తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్
వరాహ మృశ్యం పృషతం మహారురుం
ఆదాయ మేథ్యం త్వరితం బుభుక్షితౌ
వాసాయ కాలే యయతు ర్వనస్పతిమ్. (అయో. 52-102)
సీతారామలక్ష్మణులు బాగా ఆకలికొనియుండిరి. అప్పుడు
రాముడు పందిని, మనుబోతును, దుప్పిని, నల్లచారల దుప్పిని చంపెను.
వాటి పరిశుద్ధమగు మాంసమును వారు భుజించిరి. యమునాతీరమందలి
వనమును చేరినప్పుడు రామ లక్ష్మణులు -
బహూన్ మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతు ర్యమునావనే.
(అయో. 55-98)
కుటీరమును నిర్మించుకొనిరి. దానిని ప్రవేశించుటకు పూర్వము వారు వాస్తుశాస్త్ర ప్రకారము ఒక జంతువును (జింకను) దానికి బలియిచ్చిరి. ఆ సందర్భములో రాముడు లక్ష్మణునితో ఇట్లనెను :
"ఐణేయం మాంస మాహృత్య శాలాం యక్ష్వామహే వయం
కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే! చిరంజీవిభిః " (అయో. 56-22)
లక్ష్మణా! జింకమాంసముతో ఈ పర్ణశాల నధిష్ఠించియుండు
దేవతలను తర్పింతము. చిరంజీవులుగా నుండగోరువారు వాస్తు శాస్త్ర
ప్రకారము భూతశాంతిని చేయవలెను అని చెప్పెను. ఇదే సందర్భములో
అత డింకను ఇట్లనెను: "ఈ ప్రకారము చేయుట విధి శాస్త్రదృష్టము."
ఆ మాటలను విని లక్ష్మణుడు జింకను వేటాడి తెచ్చి దానిని అగ్నిలో
కాల్చెను. నెత్తురు బాగా కాలి మాంసము బాగా పక్వమగువరకు కాల్చి
దానిచే దేవతల కారగింపుపెట్టి తాము భుజించిరి. పాయసమును,
నువ్వులను, బెల్లమును, మేక మాంసమును దేవతాపిత్రతిథులకు నివేదింప
కుండా ఒంటిగా భుజింపగూడదని ఆ కాలపు సాంఘికశాసనము.
(అయో. 75-30). భరతుడు దశరథుని శ్రాద్దకర్మ చేయునపుడు బ్రాహ్మ
ణులకు మేకలను, గోవులను, వెండిని, అన్నమును, వస్త్రములను దానము
చేసెను. (అయో. 77-3). భరతుడు రాముని పిలుచుకొనివచ్చుటకై వెళ్ళి
నప్పుడు గంగాతీరమం దుండిన గుహుడు భరతునికి మాంసము, చేపలు,
తేనె కానుకగా తీసికొనిపోయెను. (అయో. 8-410). అంతేకాదు. పచ్చి
మాంసమును ఎండించి వరుగుచేసిన మాంసమును (ఆర్ద్ర మాంసం చ
శుష్కంచ అయో. 84-17) కూడా పై నిషాదరాజు కానుకగా
సమర్పించుకొనెను. పితృ దేవతలకు వృషణములు కోసివేసిన మేకలను
శ్రాద్ధములందు నివేదించెడివారు. ఇంద్రునికి మేకవృషణముల నతికించి
తదాప్రభృతి కాతుత్థ్స పితృదేవాః సమాగమాః
అఫలాన్ భుంజంతే మేషాన్ ఫలైస్తేషా మయోజయన్.
(బా. 49-11)
భరద్వాజాశ్రమానికి భరతుడు ససైన్యముగా వెళ్ళినప్పుడు ఆ
మహర్షి వారందరికిని మద్య మాంసములతో విందు చేసెను. మద్యమన
నెట్టిదో ఇదే సందర్భములో తెలుసుకొందము. ఆనాడు నానా విధములగు
మద్యములు సిద్ధమగుచుండెను. మైరేయము అను సురతో భరద్వాజుడు
విందు చేసెను. (అయో. 91-15). మైరేయమంటే ఏమి? మిరా అనే దేశ
మెచ్చటనో ఉందనియు, అచ్చట ఖర్జూరాది ఫల రసములతో మద్యమును
సిద్ధముచేయుచుండి రనియు, అందుచేత దానిని మైరేయ మందురనియు
వ్యాఖ్యాతల అభిప్రాయము. రామాయణ వాఖ్యాత లిచ్చిన ఈ అభిప్రా
యము తప్పు. మైరేయమును మన దేశమందే సిద్ధము చేయుచుండిరి.
కౌటిల్యుడు తన అర్థశాస్త్రమం దిట్లు వ్రాసినాడు: "మేష శృంగిత్వక్క్వా
ధాభిషుతో గుడప్రతీవాపః పిప్పలీ మరీచ సంభారస్త్రిఫలయుక్తోవా
మైరేయః" (2-25). అనగా మేషశృంగి అను చెక్క కషాయమున్నూ,
బెల్లము, పిప్పలి, మిరియాలు, త్రిఫలము చేర్చి సిద్ధము చేసిన మద్యమును
మైరేయమందురు. సుర మూడువిధాలదిగా గౌడీ, పైష్టీ, మాధ్వీ
అను భేదములతో నుండెను. అనగా బెల్లము, గోధుమలు, తేనె అను
వానితో సిద్ధము చేయుచుండిరి. (అయో. 91-21). సీత రావణుని ధిక్క
రించుచు నీవు నా రాముని కే లేశమును సరిరావని యిట్లనెను:
“సురాగ్ర్య సౌవీరకయోర్య దంతరం పై తవ రాఘవస్యచ".
సురకును సౌవీరమునకును ఎంత అంతరాయమో నీకును నా రాఘ
వునికిని అంత భేదము అని సీతాదేవి పలికెను. దీనిని బట్టి సురాసౌవీర
ములలో చాలా భేదముండెనని స్పష్టము. ఇవెట్టి మద్యములు? సుర చెడ్డదనియు, దానికి మరణమే ప్రాయశ్చిత్తమనియు మనువు శాసించెను.
సురకు శుక్రాచార్యుని శాపముకూడ కలదు. సౌవీరము ఆ పేరు గల
గుజరాతు దేశమందు సిద్ధమగునట్టి మద్యమని యొకరు వ్రాసిరి. కాని
వైద్య గ్రంథాలలో యవలతోను లేక గోధుమలతోను సిద్దమగు సారాయియే
సౌవీరమన్నారు. సుర నిషిద్ధమద్యమనియు, సౌవీరము శిష్టులు త్రాగు
సారాయి యనియు సీతాదేవి యభిప్రాయము. కాని సీతాదేవియే అరణ్యా
నికి వెళ్ళునప్పుడు "గంగమ్మా, మేము క్షేమముగా తిరిగివచ్చితిమా నీకు
'సురాఘట సహస్రమును' (ఆయో. 52-89) సమర్పించు కొందును"అని
ప్రార్థించెను. సుర నింద్యమైనచో దానిని సీత యెట్లు నివేదించుకొనును!
గంగ యెట్లు స్వీకరించును? ఇది స్పష్టమగుటలేదు.
భరద్వాజుడు భరతునికిని, అతని సైన్యమునకును మేకలు, పందులు, జింకలు, నెమళ్ళు, కోళ్ళు వీటియొక్క మాంసమును వండించి పెట్టెను. మద్యమాంసములు నింద్యములుగా నుండినచో భరద్వాజు నంతటి మహర్షి తన యాశ్రమములో వివిధ జంతుమాంసములను వండించి ఆరగింపజేసియుండడు. భరతుడు వచ్చుటకుముందు చిత్ర కూటమందు ఉన్నతశిఖరముపై సీతారాములు కూర్చునియుండిరి. అప్పుడు రాముడు సీతకు మాంసపు తునకలు నోటికందించి తినిపించు చుండెను. (ఆయో. 96-1).
ఇదం మేధ్యం, ఇదం స్వాదు, నిష్టప్తమిదమగ్నినా' (అయో. 96-2) 'ఇదిగో సీతా, ఈ మాంసఖండము పరిశుద్ధమైనది. ఈ తునక రుచికరమైనది. ఇదిగో ఈ చియ్య ముక్క అగ్నిలో బాగుగా కాలినది చూడు. ఇదొక్కటి తినుము' అని రాముడు ఆమెను బుజ్జగించుచు (ఛందయన్) మాంసము తినిపించుచు ఆమెకానందము కలిగించుచుండెను. రావణుడు సీతను అపహరించుటకై బ్రాహ్మణవేషముతో పంచవటికి వెళ్ళెను. అతడు నిజముగా బ్రాహ్మణుడేయని సీత తలచి అతనిని దర్భాసనముపై కూర్చుండబెట్టి అతిథిసత్కారము బాగుగా చేయదలచి యిట్లనెను: "ఓ బ్రాహ్మణుడా! ఇక కొంతసేపాగుము నా భర్త జింకలను, ఉడుములను, అడవిపందులను, ఇంకా ఇతర జంతువులను వధించి తెచ్చును.” అనగా వాటితో నీకు విందు చేయుదును అను అర్థము ద్యోతక మగుచున్నది. (ఆర. 47-22,23). ఆ కాలములో బ్రాహ్మణులు ఉడుములను పందులను మున్నగు జంతువులను తినకుండిరేని సీతాదేవి ఆ బ్రాహ్మణవేషధారితో అనుచితమగు మాటలుచెప్పి అపచారము చేసి యుండునా?
కబ ధుడు రామునితో పంపాసరోవర విశేషములను తెలు పుచు “రాముడా, పంపాసరస్సులో హంసలు, నీరు కోళ్ళు, క్రౌంచ ములు, కురరములు ఉండును. వాటి మాంసములు పెద్ద వెన్నముద్దలవలె పుష్టికలవై రుచికరములై యుండును. మీరు వాటిని భక్షింపుడు" అని చెప్పెను. (ఆ. 73-13-14) హంసలంటే ఏ పక్షులు? బాతులే హంసలు. ఫిలాలజీలో హ, ఘగ మారును హంస ఘంసయయ్యె. ఘ, గ అయ్యెను. 'గంస్' తుదకు ఇంగ్లీషులో 'గూన్' బాతు అయ్యెను.
పంపాసరస్సులోని మరి కొన్ని విశేషములను కబంధు డిట్లు తెలిపెను: “అచ్చట బలసినట్టి, ముండ్లు చాలా లేనట్టి గండుమీలు, చోర చేపలు, రొయ్యలు మున్నగు వివిధ మత్స్యములు లభించును. లక్ష్మణుడు వాటిని బాణములచే చంపి వాటి పొలసులు పోవునట్లు రాచి, ఇనుప సలాకులకు గ్రుచ్చి, నిప్పుపై పక్వముచేసి భక్తితో నీకు భోజ నార్థము సమర్పించుకొనగలడు." (ఆర. 73-14, 15).
వాలిని రాముడు బాణముతో కొట్టి పడగొట్టగా మరణశయ్యపై నుండి వాలి యిట్లనెను: 'రామా, నా మాంసము, చర్మము, ఎముకలు ఏవియు నీకు పనికిరావుకదా! అయిదుగోళ్ళుగల అయిదుజంతువులు అనగా ఏదుబంది, అడవిపంది, ఉడుము, కుందేలు, తాబేలు - వీటిని మాత్రమే బ్రాహ్మణ క్షత్రియులు భక్షింపవచ్చును.'
పంచపంచనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ,
శల్యక, శ్శ్వావిధో, గోధా, శశః, కూర్మశ్చ పంచమః.
(కి. 17-37)
దీనినిబట్టి బ్రాహ్మణ క్షత్రియులు ఐదుగోళ్ల జంతువులలో పై
ఐదింటిని మాత్రమే తినుచుండిరని తెలియవచ్చుచున్నది. రాముడు
సీతావియోగ దుఃఖముచే బాధితుడై ఆనందదాయకములైన మద్యమాంస
ములను పరిత్యజించెను.
'న మాంసం రాఘవో భుంక్తే నచాపి మధు సేవతే.'
(సు. 36-41)
ఈ విధముగా రామాయణమందు సర్వవర్ణముల వారును మాంస
మును పవిత్రమైనదిగా రుచ్యమైనదిగా భావించి భుజించుచుండిరి. పైన
కనబరిచిన ప్రమాణములను బట్టి ఆ కాలములోని జనులు ఆవుల, ఎద్దుల,
మేకల, అడవిపందుల, మనుబోతుల, దుప్పుల, నల్లచారల దుప్పులను,
జింకలను, నెమళ్లను, కోళ్లను, ఉడుముల, హంసల, నీరుకోళ్ల, క్రౌంచ
ముల, గండుమీల, చోరచేపల, రొయ్యల, ఏదుబందుల, కుందేళ్ల,
తాబేళ్లను మరి యితరజంతువులను ఆసక్తితో తినుచుండిరని తెలియ
వచ్చుచున్నది.
పై జంతువుల మాంసాలు మాత్రమే తినుచుండిరనుటకాదు. ఇంకను ఇతర విధములగు మాంసముల తినియుందురు. మాంస మెక్కువగా లభించిన దానిని ఎండించి వరుగుచేసి వాడుకొనుచుండిరి. కూరలను కుండలలో భరద్వాజాశ్రమములోవలె ఉడికించుచుండిరి. లేదా తిత్తి ఒలిచి పేగులుతీసి కడిగి శుద్ధిచేసి లక్ష్మణుడు కుటీరమునకు బలియిచ్చినపుడు చేసిన రీతిగా సలాకులపై గ్రుచ్చి సెగచూపి కాల్చి 'కబాబులను'గా చేసి ఆరగించుచుండిరి. మాంసమునకు తోడుగా మద్యమును సేవించుచుండిరి. ఆ మద్యము నానా విధములైనట్టిదిగా నుండెను.
ఇతర పాకములు
రామాయణ కాలమందు మాంసభోజనమునకే ప్రాధాన్యముండెనని తలపరాదు. ఆదికాలమునుండి త్రైవర్ణికులు మాంసభుక్కులు కారను చాలామందికికల విశ్వాసము తప్పని యెత్తిచూపనైనది. జనులు నానారుచ్య పదార్థముల నారగించుచుండిరి. "పాయసం కృసరం ఛాగం వృధానో౽శ్నాతు నిర్ఘృణః" అయో. 75-30 పాయసము, కృసరము, ఛాగమాంసము ఒంటిగా తినరాదన్నారు! కృసరమనిన నేమి? కొందరు 'కృశర' అనియు వ్రాసిరి. విల్సన్ అభిప్రాయములో కిచిడియే కృసరము ఇది శబ్దశాస్త్ర ప్రకారము సరిపోవు తద్భవమే. శబ్ద కల్ప ద్రుమములో కృశర పదమువద్ద “కిచిడీ ఇతిభాషాయాం" అని అర్థము వ్రాసినారు. 'కృసరస్తు తిలౌదనమ్' అమరము.
అరణ్యకాండలో 56 సర్గ తర్వాత సీత కింద్రుడు ప్రత్యక్షమై పాయసము నిచ్చుటను వర్ణించు 26 శ్లోకాలు ప్రక్షిప్తభాగాలని నిశ్చయ మైనది. అందు పాయస వృత్తాంతము కలదు భరద్వాజుని విందులో అయో. 91-73 “రసాలదధ్నము" చేరియుండెను. శుంఠి పిప్పల మిరియాలు లవంగాలు తక్కోలము శర్కర అల్లము జీలకర్ర పెరుగులో కలిపి చేసిన పచ్చడి రసాలదధ్న మని వ్యాఖ్యాత యొకడన్నాడు. కాని ఇది సరికాదేమో? రసాలమన తియ్యమామిడిపండు. మామిడిరసమును పెరుగు చక్కెర సుగంధ ద్రవ్యాలతో కలిపి చేయునట్టి "శిఖరిణి" అనునదే రసాలదధ్నమని తలతును. ఇవికాక ఆహారములో "భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యంచ" (అయో. 50-39) అని నాల్గు విధములు ఆనాడే వ్యాప్తిలోనుండెను.
స్త్రీల స్థానము
రాముని కాలమందలి ఆర్యసమాజమందు (అనగా ఆర్యుల
సంఘములో) స్త్రీల కెట్టి స్థానముండెనో నిర్ణయించుట కష్టము. శ్రీరాముని
ఏకపత్నీవ్రతత్వమును సువ్యక్తముగా చూపదలచినారు. పాతివ్రత్య
మాహాత్మ్యమును నిస్సందేహముగా నిరూపించినారు. ఆనాటి స్త్రీలకిట్టి
లక్షణము సాధారణమని సూచించినారు. అయితే రాముని యనంతరము
నా యభిప్రాయప్రకారము ఇంచుమించు 800 ఏండ్లతర్వాత సంభవించిన
మహాభారతయుద్ధకాలములో స్త్రీలకు నియోగము, స్వేచ్ఛ, అనా
వృతత్త్వము, ద్వాదశౌరసపుత్రుల యంగీకారము ఇట్టివి చాలా
కనబడుచున్నవి. మహాభారతకాలమునకు పూర్వమందలి స్థితినిగురించి
పాండురాజు కుంతితో ఇట్లనెను:
అనావృతాః కిల పురా స్త్రియ ఆసన్ వరాననే
కామచారవిహారిణ్యః స్వతంత్రా చారుహాసిని.
(ఆదిపర్వము. 122 అధ్యా-శ్లో. 4)
శ్వేతకేతుతల్లిని ఒక బ్రాహ్మణుడు పట్టపగలే చేయిబట్టి కామ
శాంతికై గోడచాటునకు, శ్వేతకేతువు అతనితండ్రియు చూచుచుండగనే
లాగుకొనిపోగా తండ్రియగు ఉద్దాలకు డూరకనేయుండెను. కొడుకగు
శ్వేతకేతునకు మాత్రము తన తల్లిచర్యపై కోపము వచ్చెను. అప్పుడు
ఉద్దాలకు డిట్లన్నాడు:
అనావృతాహి సర్వేషాం వర్ణనా మంగనా భువి
యథా గావఃస్థితా స్తాత స్వేస్వేవర్ణా స్తథా ప్రజాః-
(ఆది. 122-14)
ధర్మస్సనాతనః' అన్నాడు పెద్దమనిషి ఉద్దాలకుడు. ఇదంతయు మహా భారత కాలమందును తత్పూర్వమందును వర్తించెనని వర్ణించియుండగా రామాయణకాలమందు ఎచ్చటను ఇట్టి స్త్రీల యనావృతత్వము గోపద్ధతి కానరాకుండుటకు కారణమేమి? రామాయణమును ఆదర్శకావ్యముగా చేయుటవలన మన కిట్టివి లభింపనేరవో లేక నిజముగా రామాయణ కాలమందు అంతయు ఉత్తమముగానుండి తర్వాతకాలము చెడిపోయి యుండునో నిర్ణయింపజాలము. లభ్యమగుచున్న సూచనలను మాత్రమిం ముదాహరించుచున్నాను.
రామునికాలములో భోగముస్త్రీ లుండిరి. ఋశ్యశృంగుని మోస గించి తీసుకొనిపోయినది వారే (బా. 10-5). అనారీంపశ్యుడగు ఆ తిక్క వటుని మోసగించుట ఒక ఘనత కాదు. రాముని మొదటి యౌవరాజ్యాభి షేక సమయానికి వారకాంతలు సభను రంజింపజేయుటకు రానేవచ్చిరి. (అయో. 14) రాజులు అనేకభార్యలను వివాహమాడుచుండిరి. దశరథు నికి ముగ్గురు పట్టపు భార్య లుండుటయేకాక 350 మంది పైభార్యలుండిరి. (అయో. 34-13). వీరు సవర్ణస్త్రీలే యనుటకు వీలులేదు. పుత్రకామేష్టి చేసినకాలములో దశరథుడు తనకు లభించిన దివ్య పాయసమును తన 350 మంది భార్యలకు పంచి పెట్టక 'అనురూప' లైన తన ముగ్గురుభార్యలకే పంచిపెట్టెను 'భార్యాణా మనురూపానాం' (బా. 16-20) అనుదానికి సజాతీయలైన క్షత్రియభార్యలని వ్యాఖ్యాత లభిప్రాయపడినారు. దశరథుని కూతురుగు శాంతను ఋశ్యశృంగుడను బ్రాహ్మణున కిచ్చి పెండ్లి చేసిరి. అనగా అనులోమ వివాహములు జరుగుచుండెను.
కై కేయి
ఈమెను గూర్చి ప్రత్యేకము వ్రాయవలసియున్నది. దశరథుని
పట్టపు భార్యలలో చేరినను ఈ కైకేయి సజాతీయ క్షత్రియ స్త్రీ యగునో కాదో అనుమానముగానే యున్నది. ఆమె మహాసౌందర్యవతిగా నుండి
యుండును. పైగా చిన్నభార్య యనగా ముద్దుల భార్య. అందుచేత
ఆమెకును తక్కిన యిద్దరితో సమానస్థానము లభించియుండును. ఆమె
కట్టి యధికారము లభించునో లేదోయను అనుమానముచేతనే కాబోలు
ఆమె తండ్రి దశరథుని యావద్రాజ్యమును ఓలిగా తీసుకొని ఆమె నిచ్చి
పెండ్లి చేసెను. స్త్రీ శుల్కము ఆర్యధర్మములలో చేరినట్టిది కాదు.
తన రాజ్యము నంతయు భార్యాశుల్కము క్రిందనే చెల్లించినందున
కైకేయి, కేకయరాజు దిక్కునుండి భరతునికి రాజ్య మిప్పించు
ప్రయత్నములు జరుగునని దశరథునికి ఒక దిక్కు అనుమానముండనే
యుండెను. అందుచేతనే రామునితో ఇట్లనెను:
విప్రోషితశ్చ భరతో యావదేవ పురాదితః
లావదేవాభిషేక స్తే ప్రాప్తకాలో మతో మమ. (అయో. 4-25)
భరతుడు ఇచ్చటికి వచ్చేలోపలనే నీ పట్టాభిషేకము కావలెను.
భరతుడు మంచివాడే కాని కాల వైపరీత్యమువల్ల జనుల బుద్ధులు
మారుచుండును (అయో. 4-26,27) అనియు చెప్పెను. బహుశః
భరతుని అతని మేనమామ యింటికి పంపివేసినదికూడా ఈ అనుమానము
చేతనే యేమో? పై శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. వాటినిబట్టి కైకేయి
అంతటి కఠిన కాదనవలసియుండును. అరణ్యావాసప్రారంభమందే
రాముడన్న శ్లోకాలున్నూ గమనింపదగినవి. అతడిట్లనెను:
"ఓయీ! లక్ష్మణా! ఈనాడు రాజు దుఃఖమందు మునిగినాడు. కైకేయీవశగుడై కామార్తుడై వృద్ధుడై మరేమి చేయగలడు? ధర్మార్థ కామములలో కామమే పైచేయికలదై పోయినదికదా! విద్యారహితుడైనను స్త్రీ కారణముగా అనుకూలుడగు కుమారుని త్యజించునా?" (ఆయో. 53-6 నుండి 10 వరకు). ఈ విషయాలను సమన్వయించిన దశరథుడు 118 రామాయణ విశేషములు బాగుగా వృద్ధుడు కాగా సుందరాంగియు దూరదేశపు రాజు కూతురును నగు కైకేయిని వివాహమాడి యామె ఓలికై తన రాజ్యమిచ్చుటొకటి, ఆమె కుమారునికే తన యనంతరము రాజ్యమిత్తుననుట రెండు ఈ వరముల నిచ్చియుండును. కాని రాముని జననము తర్వాత అతనియందే లగ్న మానసుడై వివాహానంతరము భరతుని అతని తాత యింటికండి తన మంత్రులను, ప్రజలను కట్టుకొని రాముడు మీకందరికినీ ప్రియుడేకదా, ఉ తమో తముడేకదా, మీకు రాజు కావలసిన వాడేకదా అని నూరిపోసి వారిచే ఒప్పించుకొని సర్వసన్నాహాలు చేసియుండును. ड కేయి తన పెండ్లినాటి పై రెండు వరాలుకోరి సాధించి యుండును. తుదకు రాముడడవికి పోవుట దశరథుడు చనిపోవుట జరిగెను. భరతుడు వచ్చెను. వచ్చి జరిగినదంతయు వినెను. ప్రజల ప్రాతికూల్యము, తల్లికి నింద, తండ్రి మరణము, తనయన్న యందు తనకుగల భ క్తి ప్రేమలు, అన్నలు, లు, వదినెయు జోగులై అడవిపాలగుట సహింపరానిదగుటయు, అతని మనస్సులో గొప్ప పరివర్తనము కలిగించి తనతల్లి హక్కులను తనకు సంక్రమించు రాచరికమును వదలుకొని యుండును. క థ యిట్లుండగా అకస్మాత్తుగా ఏనాటివో అనిర్దిష్టములగు రెండు వరములను గూనిది కైకేయికి జ్ఞాపకముచేసి పురియెక్కించి విషమపాకములోని కామెను దింపుట తర్వాతి కాలపు కల్పనయై యుండును. ఈ యూహ తప్పేయగుగాక! అగుచో పై యుదాహృత శ్లోకత్రయము (అయో. 4-25, 26, 27) ప్రతి ప్తములనియైన ననవలెను. కైకేయి తండ్రిదేశము గిరివ్రజము లేక రాజగృహము ఆనునట్టిది. అదెక్కడనుండెనో తెలియదు. కాని దానిజాడ కొంతవరకు గుర్తించ వచ్చును. భరతుడు ఏడుదినాలు రాత్రింబగళ్లు ప్రయాణముచేసిన తర్వాత రాజగృహమునుండి అయోధ్యకు రాగలిగెను. అయోధ్యకు పశ్చిమముగా రాజగృహముండెను. భరతుని పిలుచుకొనివచ్చుటకు వెళ్ళిన దూతలు అయోధ్యకు పశ్చిమముగా ప్రయాణముచేసి హస్తినాపురివద్ద గంగను రామాయణ విశేషములు 118 దాటి ప్రయాణము చేయుచూ చేయుచూ తుదకు బాహ్లిక దేశము చేరిరి. దానికి ఇంకా పశ్చిమముగానున్న విపాశానదిని దాటి గిరివ్రజమును చేరిరి. (ఆయో. సర్గ 68). బాహ్లిక దేశమే నేటి బలఖ్ (Balkb) మండలము. అది యిప్పుడు ఆఫ్గనిస్థానమున కుత్తరములో నున్నది. కాని ప్రాచీన కాలములో బలఖ్ ఈరాన్ (పర్ష్యా) దేశములో చేరియుండెను. అట్టి బలఖ్ దేశమునుండికూడా యింకా చాలాదూరము వెళ్ళినట్లు తెలిపినారు. కావున గిరివ్రజ మనునది ఈరాన్లోని మండలమని చెప్పవచ్చును. అట్టి గిరివ్రజమునుండి భరతుడు తన తాతవద్ద సెలవు తీసికొని అయోధ్యకు తిరిగి వచ్చునప్పుడు తాత మనుమనికి కొన్ని బహుమానా లిచ్చెను. అందు గాడిదలు చేరియుండెను. గాడిదలకును, కంచరిగాడిదలకును మన విజయనగర దేశములో ఆదరణ లేకపోయినను, ఆఫ్గనిస్థానములోను, ఈరానులోను మంచి గౌరవము కలదు. కేకయరాజుకు అశ్వపతి యను బిరుదముండెను. ఈరాన్ దేశము గుర్రాలకు ప్రసిద్ధినొందినట్టి దేశము. సామ్రాజ్య పతనానంతరమువరకును ఈరాననుండి మన దేశానికి నిరం తరము గుర్రములు దిగుమతి యగుచుండెను. కేకయ ఆను పేరు కూడా ఈరాను ప్రాచీన రాజులగు కైకోబాద్ రాజుల పేరులను పోలియున్నది. కేక యుడు భరతునికిచ్చిన బహుమానాలలో కంబళ్ళు, జింక చర్మాలు, కుక్కలు కూడా చేరియుండెను. కుక్కలు ఆర్యుల దృష్టిలో అపవిత్రమైనవి. కంబళ్ళు చలిప్రదేశమువారికే పనికివచ్చును. మనదేశములో మనుమలకు గాని అల్లుండ్రకు కాని గాడిదలను, కుక్కలను, కంబళ్ళను బహుమాన మిచ్చేవారు పూర్వమందు కానీ, ఆధునిక కాలమందు కానీ కానరాలేదు. దశరథుని రాజ్యమును ఓలిగాగొన్న కేకయరాజు స్వార్థిగా కనబడుచున్నాడు. అతని బిడ్డకు ఆ గుణమే బాగా అబ్బెను. ఆమెను గురించి యితరులు నిందించుట అటుండ ఆమె కుమారుడగు భరతుడే ఇట్లన్నాడు: RV-8 114 రామాయణ విశేషములు ఆత్మకామా, సదాచండీ, క్రోధనా, ప్రాజ్ఞమానినీ. (ఆయో. 70-10) కై కేయితల్లి జాడకూడ క్రూరమైనట్టిదనిన్నీ, తనమాట చెల్లింపుకై తన మగనిచావును గూడ లెక్కపెట్టలేదనిన్నీ, దశరథుని మంత్రియగు సుమంత్రుడు కైకేయిని దూరెను (అయో. స.35). ఈ కారణాలచే కై కేయి ఈరాజ్ దేశపు ఈరానీ సుందరాంగియై యుండెనని ఊహించు చున్నాను. అయితే అయోధ్యనుండి ఈరాజా ప్రాంతానికి పోవుటకు ఏడుదినాలు మాత్రమే పట్టుచుండెనా అను సందేహ మొక్కటి బాధించు చున్నది. t బహుభార్యాత్వము దశరథునికి నూర్లకొలది భార్యలుండిరను విషయమును గురించి వ్రాయుచు మధ్యప్రసక్తిచే కైకేయిని గురించి వ్రాసినాము. దశరథుని బహుధార్యాత్వము సువ్యక్తమే కాని రామాది సోదరులకును పెక్కు భార్యలుండిరా లేదా అని విచారింతము. పారంపర్యముగా వచ్చు హిందువుల భావనలో శ్రీరాముడును అతని సోదరులును ఏకపత్నీ వ్రతులై యుండిరి. అయితే రామాయణములో మూడుతావుల రామ భరతులకు బహుభార్య లుండినట్లు అనుమానము కలుగుచున్నది. వ్యాఖ్యాత లది కాదన్నారు. మంధర కైకేయికిట్లు బోధచేసెను: “రాముడు అభిషిక్తు డైనచో అతని యుత్తమస్త్రీలు ఆనందింతురు. నీ భరతునికి దుర్గతి కలుగును నీ కోడండ్రందరును ఆనందరహిత లగుదురు"(అయో.8-12). + రాధాకుముద ముఖర్జీగారు 'హిందూ సివిలిజేషన్' అను గ్రంథములో బాహ్లి కను మద్రదేశ మువద్దను మద్రకు పశ్చిమములో కేకయదేశమును చూపి నారు. అనగా గాంధారదేశమునకు దక్షిణములో కేకయ దేశముండెను. ఇతర పరిశోధకులు బాహ్లికను బలఖ్ గా నిర్ణయించినారు. రామాయణ విశేషములు 115 దీనినిబట్టి రామునికి సీతయేకాక ఇతర భార్యలును ఉండిరనియు, భరతునికి చాలామంది భార్యలుండిరనియు అర్థమగుచున్నది. సుందర కాండలో సీతాదేవి హనుమంతునితో రాముని కిట్లు సందేళ మం పెను. పితుర్ని దేశం సమయేన కృత్వా, వనాన్నివృత్త శ్చరితవ్రతశ్చ శ్రీ భిశ్చ మన్యే విపులేక్షణాభి, స్వంరంస్యసే వీతభయః కృతార్థః. 'నా గతి యేమో ఇట్లైనది. రామునికేమి కొదువ? అతడు వనవాస కాలానంతరము తన ఉత్తమస్త్రాలను పొంది రమించుచు సుఖముగా ఉండ గలడు' అని సీత యన్నది. లంకకు దారికోరినవాడై సముద్రుని ప్రసన్నునిగా చేసికొనుటకై రాముడు దర్భశయ్యపై పరుండెను. భుజైః పరమనారీణా మభివృష్ట మనేకధా అప్పుడు తన దక్షిణ బాహువును తలగడగా చేసుకొని పరుండెను. ఆ బాహువు ఉత్తమ స్త్రీలచేత బహు విధాల అలింగనము చేయబడి యుండి నట్టిది అని కవి వర్ణించినాడు. ఈ మూడు వాక్యాలను వ్యాఖ్యాత లిట్లు సమ్వయించుచు, "ఉత్తమ స్త్రీలనగా పరిచారికలని అర్థము చేసుకొనుడు. లేదా భూలమ్మలని యైనా సరిపెట్టుకొనుడు" అని వ్రాసినారు. ಎಲ್ಲ ತೆ నేమి పారంపర్యముగా వచ్చు జనాభి ప్రాయప్రకారము రామసోదరులు ఏక పత్నీవ్రతు లనుటకే ఎక్కువ ప్రమాణము లున్నవనిన పై మూడు ప్రమాణాలు ప్రక్షిప్తములనవలెను. అంతఃపుర వాసము ఆ కాలమందు రాజస్త్రీలకు అంతఃపురవాస ముండెను. అయితే అట్లనుటచే వారు 'గోషా’లో ఇరికి ఆసూర్యంపశ్యలై మగపురుగునకు కనబడనివారై ఘోరస్థితియందుండ లేదు. వారి ఉత్తమస్థానమునకు, 116 రామాయణ విశేషములు గౌరవమునకు ఎంత అవసరమో అంతపాటి అంతఃపురవాసమునే పాటించుచుండిరి. అయితే సీత వనవాసమునకు వెళ్ళునాడు ప్రజలందరికిని కనబడినప్పుడు జనులిట్లు చెప్పుకొనిరి: “ఎవరినైతే యింతకు పూర్వము ఆకాశమున సంచరించు భూతములుకూడ చూడజాలకుండెనో అట్టి సీత ఈనాడు రాజమార్గమందు అందరికిని కనబడుచున్నది.” (అయో. 88-8) ఇంత కఠినముగా రాణివాస ముండినట్లు కానరాదు. ఏలనగా రావణవధా నంతరము సీతను పిలుచుకొని వచ్చుటకై రాముడు విభీషణునికి ఆ ఆజ్ఞ యిచ్చెను. అప్పుడు సీతను పర్దా లేకుండగనే అందరును చూచునట్లుగానే తీసికొని రావలెనని చెప్పుచు రాణివాసతత్వమును గురించి ఇట్లు చెప్పేను; న న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః నేదృశా రాజసత్కారా వృత్త మావరణం స్త్రీయః. (యుద్ధ. 117-26) శ్రీకి ఇండ్లుకాని, వస్త్రాలు (ముసుగులు, పర్దాలు) కాని, ప్రాకా రాలుకాని, రాజమర్యాదలుకాని ఆవరణములు కాజాలవు. స్త్రీకి తన సదా చారమే మంచి ఆవరణము స్త్రీలను పరపురుషులు చూడకుండా మూసి పెట్టుటలో మంచి అర్థము కానరాదు. పరపురుషులు తమ స్త్రీలను కాంక్షింతురనియో, లేక తమస్త్రీలు స్వేచ్ఛగా సంచరింతురని భావించియేమో వారిని దాచియుంచుట. స్త్రీ పతివ్రతగా ఉండుటకై పర్దాలు గోషాలు ఏమియు సహాయపడజాలవనియు, శ్రీ కే మంచి పవిత్రమానసము ఉండవలెను కాని ఇతర నిరోధాలేమి అడ్డపడగలవని శ్రీరాముని అభి ప్రాయముగా కనబడుచున్నది. రాణివాసపు స్త్రీలకు ఎప్పు డంతఃపుర మవసరమో ఎప్పు డవసరములేదో శ్రీరాముడే యిట్లు వివరించియున్నాడు: . రామాయణ విశేషములు వ్యసనేషు న కృచ్ఛేషు న యుద్ధేషు స్వయంవరే స క్రతౌ న వివాహేచ దర్శనం దుష్యతి స్త్రీయః. 117 (యుద్ధ. 117-27) ఆపత్కాలములందు, వ్యసనము కలిగినప్పుడు, కష్టములు సంభ వించినప్పుడు, యుద్ధభూములందు, స్వయంవరములందు, యజ్ఞములందు, వివాహకాలమందు స్త్రీలు పరపురుషులకు అగపడుట దోషముకాదు. పైగా భర్త సమీప మందుండినపుడు అతని యనుమతి చొప్పున స్త్రీ యితరులకు కనబడవచ్చు ననియు రాముడు చెప్పెను. స్త్రీల వేదాధికారము (యుద్ధ. 117-28) మన కాలములో స్త్రీలకు వేదాధికారము లేదు. ఈ విషయములో వారును శూద్రులును సమానులే కాని పూర్వకాలమందు స్త్రీలకు ఉపనయ నాది సంస్కారములు జరుగుచుండెను. 'పురాకల్పేతు నారీణాం మౌంజీబంధన మిష్యతే.' అని హారీతుడు వ్రాసియుండెను అది కల్పాంతర విషయమందు రేమో! కాని రామాయణముతో స్త్రీలకు వైదిక కర్మలలో పురుషులతో సమానముగా అధికారముండినట్లు సూచనలున్నవి. అశ్వమేధాది యజ్ఞు ములలో భార్యలు లేనిది పురుషులు ఆ కర్మలు చేయకుండిరికదా! కౌసల్యాదేవి రామునికి యౌవరాజ్యపట్టాభిషేక మగునని విని తన కుమా రునికి మంగళాభివృద్ధి కలుగుటకై, ప్రాణాయామేన పురుషం ధ్యాయమానా జనార్ధనమ్. (అయో. 4-88) 118 రామాయణ విశేషములు ప్రాణాయామపూర్వకముగా పురుషసూక్త ప్రతిపాదితుడైన విష్ణు వును ధ్యానించేను. ప్రాణాయామము యోగపద్ధతి. పురుషసూక్తము ఋగ్వేదములోనిది. కావున ఆమె వైదిక సూక్తములను పఠించెను, మరియు, అగ్నిం జుహోతిస్మ తదా మంత్రవ త్కృతమంగళా. (అయో. 20-15) ఆమె స్వయముగా వేదమంత్రములను పఠించుచు హోమము చేసెను. కౌసల్యయే హోమము చేసెనని ఇచ్చట స్పష్టముగా నున్నను వ్యాఖ్యాతలు 'స్త్రీలకు వేదాధికారము లేనందున బ్రాహ్మణులచే హోమము చేయించెను' అని వ్రాసినారు. పై శ్లోకము తర్వాతనే యీ విధముగా చెప్పబడినది కౌసల్య హోమము ఇతరులచేతగూడా చేయించుచుండెను. దీనినిబట్టి కౌసల్య స్వయముగా హోమము చేసెననియు, వేదవిదులై న విపులచేతను చేయించెననియు స్పష్టమగుచున్నది. సీతారామలక్ష్మణులు అరణ్యానికి బయలుదేరిన మొదటి దినము సాయంకాలమందు గంగాతీరమున- వాగ్యత స్తోత్రయ స్సంధ్యాం సముపాసత సంహితాః. (అయో. 87-18) ముగ్గురును వాట్ని యతితో ఏకాగ్రచిత్తులై సంధ్య నుపాసించిరి. సీతాదేవి గాయత్రిని జపించుట స్త్రీల వేదాధికారమునకు ప్రమాణము. స్త్రీల యితర సమస్యలు ఆర్యులలో పూర్వకాలమందు దేవర న్యాయపద్ధతి యుండెను. దీనికి నిదర్శనములు మహాభారతమందు చాలా కలవు. పరాశరుని కాలమువరకు దీనికి చెల్లుబడియుండెను. దేవర అను శబ్దమందే రెండవ రామాయణ విశేషములు 119 నేటికిని మరదిని దేవరుడని వరుడు అను నరమిమిడియున్నది యందురు. హిందీలో ఈ పదము బాగా వ్యాప్తిలో నున్నది. ఇప్పటి కాలమందును లంబాడీలు మరికొన్ని జాతులవారు దేవర న్యాయమును పాటించుచున్నారు. రామాయణములో ఆనాటి జనులలో దేవర న్యాయము వర్తించుచుండినట్లు నిదర్శనములు కానరావు. మహాభారతకాలమం దుండిన యాచారము అందుకు 800 ఏండ్లకు ముందుండినకాలములో లేకుండెనా? అప్పుడును ఇది వర్తించియుండును. రామాయణమందు దీనికి ఒకే ఒక జాడ కనబడుచున్నది. రాముడు మాయామృగమును చంపినప్పుడు మారీచుడు 'హా లక్ష్మణా' అని యరచెను. దానిని సీత విని రాముని కేమో అపాయమయ్యెనని లక్ష్మణుని సహాయార్థము పొమ్మనెను. నిజ మెరిగిన లక్ష్మణుడు వెళ్ళుటకు నిరాకరించెను. అప్పుడు సీత అతనితో కఠినముగా ఇట్లు పలికెను: ఇచ్చసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ! మత్కృతే, లోభా త్వం మత్కృతే నూనం నానుగచసి రాఘవమ్. (ఆర. 45-6) "లక్ష్మణా, నీవు రాముని చావు కోరినావు. అతడు చనిపోతే నన్ను పొందవలెనని దుర్బుద్ధి కలవాడవుగా కనిపించుచున్నావు." దేవర న్యాయము వర్తించకుండినచో పతివ్రతా శిరోమణియగు సీతనోట ఎంతటి దుఃఖములోనుండినను ఎంత యాగ్రహము కలిగినను ఇట్టిమాట రానేరదు. కావున రామాయణకాలములో దేవరన్యాయము వర్తించుచుండెనని యూహింప శక్యమగుచున్నది స్త్రీలను దత్తుగా ఇచ్చుచుండినట్లు చెప్పజాలము కాని దశరథుడు తన ఒకే ఒక కూతురును రోమపాదునకు దత్తుగా ఇచ్చెనని వ్రాసినారు. ఇది యాకాలమందలి యాచారమో లేక అపవాదమో తెలియరాదు. 120 రామాయణ విశేషములు ఈ కాలములో పెద్దనగరములలోని విహారారామములందు పురుషులు సాయంకాలములందు వాహ్యాళి చేసి ఆనందించుచుందురు. రామునికాల మందును అయోధ్యానగరములోని స్త్రీలు సాయంకాలము లందు బాగా బంగారునగలతో అలంకరించుకొని గుంపులుగుంపులుగా ఉద్యానవనములందు సంచరించుచుండిరి. “నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హేమభూషితాః" (అయో. 87-17) మరియు యువకులు స్త్రీలతో సహ ఆరణ్యాలలో సంచరించుటకై వాహ్యాళి వెళ్ళి వచ్చుచుండిరి. నరా నిర్యాంత్యరణ్యాని నారీభిస్సహ కామినః (అయో. 67-17) ఈ విషయాలన్నింటిని పరికించిచూచిన పైన రామాయణకాల ములో స్త్రీలకు మంచి స్థానముండెను. ఏక పత్నీ వ్రతత్వమును శ్రీ రామాదుల ద్వారా బాగా సమర్థించినారు. పాతివ్రత్యమునకు సీతయు, అనసూయయు ముఖ్య పూజ్యస్థానములు. నావలు రామాయణ కాలమందలి జనుల విశ్వాసాలు నేడును చాలవరకు హిందువులలో వర్తించుచున్నట్లు కానవచ్చుచున్నది. నదులను దాటు నప్పుడు నేటికిని వాటికి నమస్కారముచేసి రాగిడబ్బులు దక్షిణగా సమర్పించుకొనుచున్నారు. రాముడు గంగను దాటునప్పుడు నౌకారోహణ మంత్రమును జపించెను. మం॥ సుత్రామాణం పృథివీద్యామనేహసం..... ఋగ్వేద. 10–68-10 రామాయణ విశేషములు 121 అను వేదమంత్రమును జపించెనని వ్యాఖ్యాతలు వ్రాసినారు. ఆ కాలమందు సముద్రప్రయాణము బాగుగా జరుగుచుండెనని పై మంత్రము సూచించుచున్నది. గంగ పైనుండు ఓడలు చిన్న స్టీమర్లవలె నుండెను. వాటికి స్వస్తికలని పేరుండెను. వాటిలో గదులు, కిటికీలు, అలంకారాలు, గంటలు మున్నగున వుండెను. అన్యా స్స్వ స్తిక విజ్ఞేయా మహాఘంటాధరా వరాః శోభమానాః పతాకాభి ర్యుక్త వాతా స్సుసంహతాః తత స్స్వస్తికవిజ్ఞేయాం పాండుకంబళ సంవృతాం స నందిఘోషాం కల్యాణీం గుహో నావ ముపాహరత్. అయో. 89-11, 12. ఇది పెద్ద ఓడలను గురించిన వర్ణన. అందొక్కొక్క ఓడలో 100 మంది ఓడను నడుపువా రుండుచుండిరి. “నావాం శతానాం పంచనాం కైవర్తానాం శతం శతం” (ఆయో. 84-8) అను శ్లోకమువలన విశదమగుచున్నది. ఇవికాక చిన్న చిన్న పడవలుకూడా గంగపై నడిపింపబడుచుండెను. వాటిని ప్లవములు అని పిలుచుచుండిరి. నావళ్చారురుహు శ్చాన్యే ప్లవై పేరు స్తథాపరే. వృ క్ష పూ జ (ఆయో.89-20) సీతాదేవి గంగను, యమునను దాటునప్పుడు ఆ నదులకు L మ్రొక్కులిడెను. గంగను దాటిన తర్వాత మఱిచెట్టును గూడ సీతాదేవి పూజించెను. 122 రామాయణ విశేషములు వివృద్ధం బహుభి ర్వృమై శ్శ్యామం సిద్ధిప సేవితం తస్మై సీతాంజలిం కృత్వా ప్రయుంజీతాశిష శ్శివాః. (ఆయో. 55-7) యమునానదివద్ద ఒక పెద్ద మఱిచెట్టు కలదు. దానికి సీత మ్రొక్కి మంచి కోరికలు కోరుకొనగలదు అని భరద్వాజు డాదేశించెను. ఆదేవిధముగా ఆ చెట్టును సమీపించినప్పుడు సీత యిట్లని మ్రొక్కు లిడెను. నమస్తేస్తు మహావృక్ష పారయే న్మే పతి ర్వతం కౌసల్యాంచైవ పశ్యేయం సుమిత్రాంచ యశస్వినీమ్. (అయో. 55-25) హిందువులలో ఇప్పుడు మఱిచెట్ల ప్రభావము తగ్గినట్లున్నది. వాటి పూజ కానరాదు. కాని అశ్వత్థపూజ దాని స్థాన మాక్రమించు కొన్నది. ఇది బౌద్ధమతవ్యా ప్త్యనంతరము వచ్చిన యాచారమై యుండును. మొహంజదారో హరప్పాశిథిలాలలోని కుండపెంకులమీది చిత్రాలలో అశ్వత్థవృక్షాలు కలవు. వాటిపై దేవతా విగ్రహాలనుంచి ఆనాటి అనార్యులు పూజించిరని తెలియుచున్నది. అశ్వత్ప్రనారాయణునికి వేపచెట్టులచ్చిని పెండ్లిచేయు వారున్నారు. మరియు శమీపూజ విజయ దశమినాడు చేయుట సుప్రసిద్ధము. తులసీమాహాత్మ్యము రానురాను ఎక్కువయ్యెను. ఇట్టి వృక్షపూజ లన్నియు అవైదికములే. ఇతర విశ్వాసాలు రాజులు ప్రయాణము చేయునప్పుడు అందందు తాము చేసిన తాత్కాలికపు విడుదులను దహించి వెళ్ళుచుండిరని భరతుని సైన్యము చేసిన చర్యలనుబట్టి తెలియుచున్నది. లక్ష్మి వెనుక నిలిచిపోకుండా తమ వెంటనే వచ్చుటకై అట్లు చేయుచుండిరేమో? భరతుడు గంగను రామాయణ విశేషములు 128 దాటుటకు పూర్వము తాను చేసియుండిన విడిదిని కాల్పించెను. (అయో. 89-15) ఈ యాచారము హిందూ రాజులలో విజయనగరసామ్రా జ్యాంతము వరకు వర్తించుచుండెనేమో? ఆముక్తమాల్యద, రాయ వాచకము మున్నగు విజయనగర చక్రవర్తులకాలపు వాఙ్మయములో రాజుల వెలిగుడారములను వర్ణించినారు. ఆచటినుండి చక్రవర్తులు ముందునకు సాగినపుడు వాటిని దహింపజేయుచుండిరని వర్ణించినారు. రామాయణ కాలమందు వడ్డీవ్యాపారము జరుగుచుండెను. అందు బ్రాహ్మణులు కూడా చేరియుండిరి. వారి వ్యాపారానికి ప్రత్యేక సౌకర్య ముండెను. అది ఇతరవర్ణాలకు నిషిద్ధమై యుండెను. అప్పు తీసుకున్న వాడు దానిని చెల్లింపకుండిన అప్పిచ్చిన బ్రాహ్మణుడు వాని యింటికడప కడ్డముగా తన ముఖమును కప్పుకొని భుజింపకుండా ప్రాయోపవేశముచేసి భూమిపై పండుకొనుచుండెను అప్పు చెల్లించువర కీ ప్రాయోపవేశము సాగుచుండెను. (ఆయో. 111-14) మృత్యువాసన్నమైన వారికి బంగారు చెట్లు కనిపించునని జనులు విశ్వసించుచుండిరి. (ఆర. 47-37) స్త్రీలకు ఎడమ కన్నదిరితే మంచి దనియు, అదే పురుషులకు చెడ్డదనియు, పురుషులకు కుడిక న్నదిరిన మంచిదనియు, అదే స్త్రీలకు చెడ్డదనియు నమ్ముచుండిరి. (కి. 5-32) ఈ విశ్వాసము హిందువులలో నేటికిని కలదు. క్రొత్తగా గృహప్రవేశము చేయుటలో మేలు గోరినట్లైన కుడికాలు మొదట కడపలోనికి పెట్టవలెను. ఎడమకాలు పెట్టగూడదు. హనుమంతుడు లంకాద్వారమందు ప్రవేశించి నప్పుడు ఎడమకాలు ముందు పెట్టెను. లంకకు నాశనము కోరి అతడు బుద్ధిపూర్వకముగా అట్లు చేసెను. (సుం. 4-8) ఈ కుడి యెడమకాళ్ల విశ్వాసము ఇప్పటికినీ మనయందు కలదు. క్రొత్త యెద్దును కొన్న వ్యవసాయకులు ఎద్దు కుడికాలిని ప్రయత్నపూర్వకముగా కడప లోనికి పెట్టించి దాటింతురు. నూతన వధూవరులచే అత్తవారి యిండ్లలో 124 రామాయణ విశేషములు ఇదే ప్రకారము చేయింతురు. నూతన గృహప్రవేశమందును ఇట్లే చేయుదురు. ఆ కాలమందు కఠశాఖాధ్యయనమున కెక్కువ ప్రాముఖ్య ముండెను. (అయో. 32-18) ఆర్యులు చనిపోయినప్పుడు దహన సంస్కారములే చేయుచుండిరి. (ఆర. 3-20) దహనకర్మ ఆర్యుల విశిష్టాచారము. ఒక కాలమందు ఆర్యులుగానుండి తర్వాత భిన్నించినట్టి ఈరాజు దేశపు పార్సీ మతస్థులు (జరథుస్త్రానుయాయులు) శవాలను దహించకుండిరి. పూడ్వకుండిరి. వాటిని ఎత్తుప్రదేశాలపై వదలివచ్చు చుండిరి నేటికిని పార్సీలలో ఈ యాచారమున్నది మరి యితర మానవ సంఘాలవా రందరును శవాలను పూడ్చుచుండిరి. ఆర్యులలోను అతి ప్రాచీనకాలములో శవాలను బయలులో వదలివచ్చు ఈరానీ ఆచారము కూడా అందుదు వర్తించుచుండెనేమో! పాండవులు ఆయుధములను శవాకారముగా కట్టి జమ్మి చెట్టుపై వ్రేలాడగట్టిన కథ గమనింపదగినది. వారట్లుచేసి పోవుచుండగా 'గొల్లలు మున్నగు మద్రజనులు' చూచి ఆదేమని విచారించగా పాండివు లిట్లనిరి: રમ "ఇది శతవృద్ధు, మా జనని, యిప్పుడు మృత్యువుబొందె నిట్లు యుదుము, కులప్రవృత్తమగుచున్న సనాతనధర్మ మిత్తెఱం గ, దహనకర్మ మొల్లమదిగా నిదిగా మును నిశ్చయించి మా మొదలిటివా కొనర్చు విధముం గొనియాడితి మేము నియ్యెడన్." (విరాట. 1-178) శవాలను చెట్లకు కట్టుట వారి పూర్వికులు చేయుచుండిన ఆచార మట. అది వారి సనాతన ధర్మమట. వారు దహనకర్మ మొల్లరట. ఈ మాటలు నిజముగాకుండిన ఇట్టి యాచారము అందందు వ్యాప్తిలో నుండ కుండిన 'గొల్లలు మున్నగు క్షుద్రజనులు' ఎంతటి తిక్కవారైనను . "" రామాయణ విశేషములు 126 ఆ మాటల నూరకనే నమ్మి నోరుమూసుకొని వెళ్ళిపోదురా? అయితే ఈ యాచారము క్రమముగా భారతీయార్యులు వదలుకొని రనియు, ఈరానీ జరథుస్త్రానుయాయులు మాత్రము దానిని వదలుకొనలేదనియు దీనివలన ఊహించవచ్చును. రాక్షసులు శవాలను పూడ్చుచుండిరని రామాయణమందు తెలిపినారు. భాద్రపదమాసము వేదాధ్యయనమునకు ఉత్తమకాలముగా పరిగ ణింపబడుచుండెను. (కి. 28-54) ప్రయాణములు చేయునప్పుడు సైనికులు ఏనుగులలద్దితో చలిమంటలు కాపుకొనుచుండిరి. (అయో. 69-7) బ్రాహ్మ ణులు బహుళముగా సంస్కృతమునే మాట్లాడుచుండిరని పలుతావులందు తెలుపబడినది. వాతాపిసోదరులు బ్రాహ్మణవేషముతో సంస్కృతములో మాట్లాడి జనులను మోసగించుచుండిరి (ఆర. 11-57) హనుమంతుడు సీతను మొదటిసారిగా చూచినప్పుడు తా నామెతో బ్రాహ్మణులవలె సంస్కృతములో మాట్లాడవలెనా యని తనలో వితర్కించుకొనెను. (సుం. 30-18) హనుమంతుడు గొప్పవిద్వాంసుడనియు వైయాకరణి యనియు, ఉ త్తరకాండలో వర్ణించినారు. అసౌ పునర్వ్యాకరణం గ్రహిష్యన్..ఉత్తర. 36-45. స సూత్రవృత్యర్థపదం మహార్థం ససంగ్రహం సాధ్యతివై కపీంద్రః నహ్యస్యకశ్చి త్సదృశోస్తిశాస్త్రి వైశారదే ఛందగతౌ తథైవ సర్వాసు విద్యాసు తపోవిధానే ప్రస్పర్ధతే...... (ఉత్తర. 86-46-47) ఈ శ్లోకాలను బట్టి హనుమంతుడు వ్యాకరణ సూత్రాలలోను, వార్తికములలోను, ఛందస్సులోను, శాస్త్రములందును, సకల విద్య లందును ప్రవీణుడని వర్ణించినారు. ఇట్టి వర్ణనవలన హనుమంతుని పాండిత్యవిషయములో అనుమానము కలుగుచున్నది. వ్యాకరణ సూత్రాలు 126 రామాయణ విశేషములు వార్తికాలు క్రీ. పూ. 5 వ శతాబ్దానంతరమే ఏర్పడెను. హనుమంతుని కాలములో ఆవి లేకుండెను. కావున ఈ ప్రక్షిప్తాలమూలాన సుందర కాండలో అతడు సీతతో సంస్కృతములో మాట్లాడ జూచినమాట నమ్మ రానిదగుచున్నది. సంస్కృతమును జనులలో ముఖ్యముగా బ్రాహ్మణులు మాట్లాడుచుండి రనుటయు విశ్వాసయోగ్యము కాదు. ఇల్వలుడు బ్రాహ్మణునివలె సంస్కృతములో మాట్లాడెనని అందు చేత ఆ కాలమందు బ్రాహ్మణులే సంస్కృతమందు మాట్లాడుచుండిరని గ్రహింపవచ్చును. కాని పతంజలికి పూర్వము అనగా క్రీ. పూ. 300 కంటే ముందుకాలములో శూద్రులుకూడా సంస్కృతమును మాట్లాడు చుండురనియో లేదా మాట్లాడితే అర్థము చేసుకొనుచుండిరనియో చెప్పక తప్పదు. “ప్రత్యభివాదే శూద్రే” (8-2-83) అను పాణిని సూత్రములో శూద్రులుకాని వర్ణత్రయము వారిని సంబోధించునపుడు ప్లుతము నుపయో గించ వలెనన్నారు. అందుపై పతంజలి మహర్షిగారిట్లన్నారు: "కుశల్యసి తుషజక ” తుషజక! (ఓరీ శూద్రా) నీవు కుశలివికదా అని తుషజకా! యనక హ్రస్వముగానే యుండవలెనని యుదాహరణ మిచ్చినారు. తుషజకునితో సంస్కృతముతో మాట్లాడితే వాడర్థముచేసుకొని సంస్కృ తములో ప్రత్యుత్తర మియ్యగల శూద్రుడే యనవలెను కదా! పతంజలికి పూర్వము శూద్రులకుకూడా సంస్కృతమువస్తే రామాయణ కాలములో అది వారి మాతృభాషయై యుండెనేమో? అట్లయినచో "ధారీయన్ బ్రాహ్మణం రూపమిల్వల సంస్కృతు వదన్" (అరణ్య. 11-68) అను శ్లోకభాగము ప్రక్షిప్త మనవలసివచ్చును ఇట్లనుటకు మరొక కారణము కూడా కలదు. పాణిన్యాచార్యులు తన సూత్రాలలో నంతటను వేదభాషను ఛందస్సు అనియు తదితరమగు గీర్వాణభాషను “భాష” యనియు వ్రాసినారు. అష్టాధ్యాయిలో “సంస్కృతము” అను పదమెందును కాన రాదు. తుదకు క్రీ. పూ. 300 ప్రాంతము నందుండిన పతంజలికూడా సంస్కృత శబ్దమును వాడినటుల కానరాదు. కాన సంస్కృతభాష అను రామాయణ విశేషములు 127 మాట పతంజలి యనంతరముదే యనవలెను. అట్లగుచో హనుమంతుడు సీతతో సంస్కృతముతో మాట్లాడుదునా వద్దా— "యదివాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్" అని తర్కించుకొనుటలో “సంస్కృత" పదమును వాడుటచే నీ శ్లోకము క్రీ.పూ. 200 తర్వాతనే ఎవ్వరిచేతనో రచితమై రామాయణమందు చేర్చ బడిన దనవలెను. క్రీస్తు శకారంభమునుండి సంస్కృతము బ్రాహ్మణుల విశిష్ట పఠనభాషగా నుండినట్లు పై ప్రమాణాలు నిరూపించుచున్నవి. నాటకము లలో స్త్రీ శూద్రులకు సంస్కృతము నిషిద్ధమగుటయు నీ విషయమును దృఢపరచుచున్నది. చాతుర్మాస్య ప్రాముఖ్యము ఆనాటికే సిద్ధమై యుండెను. (కిష్కి 27-48) మణిళిలతో చేసిన తిలక మును నొసట జనులు ధరించు చుండినట్లు కానవచ్చుచున్నది (కి. 26-27) నగరాలలో జనులు జూద మాడుచుండిరి. (బా 5-16) “చిత్రా మష్టాపదాకారం........." అని వర్ణించినారు. ఇందు అష్టాపదం అంటే జూదమాడెడి పీట అని వ్యాఖ్యాతలు వ్రాసినారు. ఈ పీట యెట్టిదో ఇదెట్టి జూదమో తెలుప లేదు. ఇది చతురంగపు ఆట ఆడుపలక అని నే ననుకొంటాను. చతురంగపు పీటలో 64 ఇండ్లు, ఎనిమిది పంక్తులు, ఒక్కొక్క పంక్తిలో ఎనిమి దిండ్లు ఉండును. శబ్దకల్పద్రుమములో అష్టపదం అను పదాని కిట్లర్థము వ్రాసినారు: “పంక్తో పంక్తా అష్టా పదాని యస్యేతివా.” కావున ఇది చతురంగపు ఆట అని నేను భావించుచున్నాను. ఇది సరియగు ఊహ యగుచో చతురంగ ప్రాచీనత ఇందు స్పష్టమగుచున్నది. చతురంగమునకు భిన్నమై జూదముగా భావింపబడిన ఆటను అక్షము అనుచుండిరి. అది 128 రామాయణ విశేషములు నింద్యముగా భావింపబడుచుండెను. ఇదే రామాయణమందు భరతుడు కౌసల్యతో తాను రాముని అడవికి పంపుట కంగీకరించినచో మద్య పానము, పరస్త్రీ సంగమము, అక్షఖేలనము జూదము చేసిన పాపము పొందుదును గాక అని శపథము చేసెను. అయో. 75–41 ఎద్దులను రెండువిధములగు పనులకు ఉపయోగించుచుండిరి. వ్యవసాయము చేయు ఎద్దులను భద్రకము లనిరి. మూటలు మోయు ఎద్దు లను శాలివాహములనిరి. బియ్యము మూటలనే ప్రధానముగా ఎద్దుల పై తీసుకొని పోవుచుండిరనియు ఆయోధ్యదేశ వాసులకు బియ్యమే ముఖ్య భోజ్యధాన్యముగా నుండెననియు శాలివాహిపదచరిత్ర తెలుపుచున్నది. అయో. 32_20 ఈ కాలములో లంచాలు ఎట్లు స్థిరపడిపోయిన సంఘజాడ్యమైయున్నదో అదే విధముగా ఆ నాడును లంచాలను తిను వారుండిరి. మంత్రు లంతటివారు కూడా దీని రుచిమరిగినవారుగా కనబడుచున్నారు. కుంభకర్ణుడు రావణునితో లంచాలు తినే మంత్రులను పరిహరింపవలెనని చెప్పెను. యుద్ధ. 63-18 అయితే ఇది రాక్ష సాచారమేమో అని సందేహింపవచ్చును. కాని ఆర్యులలోను లంచముల తినువారుండిరి. రాముని భరతుడు అరణ్యములో దర్శించుకొన్నప్పుడు భరతునితో నత డిట్లనెను: “నీవు చక్కగా పరీక్షించి ఉత్తములైన మంత్రులను నియోగించినావు కదా?" అని ప్రశ్నించెను. 100_26 అయో. రామాయణకాలమందు ఆపత్సమయములందుగూడా లత్తుక, మద్యమాంసములు, లోహము, విషము అమ్మి జీవించుట నీచవృత్తులుగా పరిగణింపబడుచుండెను. (అయో. 75–88) యామదుందుభులు జామునకొకమారు మ్రోగించుచుండిరి. యామ కాలములను తెలుపుటకు దుందుభులను (నగారాలను) రాచనగరులముందు మ్రోగించుచుండిరి. రామాయణ విశేషములు 129 'సువర్ణ కోణాభిహతః ప్రాణద ద్యామదుందుభిః' (ఆయో. 61-2) క్షత్రియులకు మృతాశౌచము 10 దినాలపాటు వర్తించుచుండెను. (ఆయో. 76-28). కుండలు, స్థాలీలు, దొప్పలు, కరంభ్యములు (వెడల్పు మూతలుగల పెద్ద పాత్రలు, కుంభ్యములు చిన్న కుండలు శ్రమములలో వాడబడుచుండెను. ఋష్యా ఆయోధ్య 91 సర్గ 67 నుండి 80 వరకు శ్లోకాలు ఈ కాలములో పై వర్ణములవారు మట్టి పాత్రలను హీనముగా జూతురు. వైదికాచారములకు మట్టి పాత్రలే పవిత్రమైనవి. ఇప్పటికి వివాహములలో, అంత్యక్రియలలో కుండలనే వాడుదురు. తెనాలి రామకృష్ణుని కాలములో బ్రాహ్మణుల యిండ్లలో కుండలు, అటకలు మున్నగునవి వాడినట్లు పాండురంగ మాహాత్మ్యములో వర్ణించి నాడు . మిద్దెలనుండి వాననీరు పారుటకై దోనులను ప్రణాళి' పెట్టు చుండిరి అంటే ఆ కాలమందలి యిండ్లకు మట్టిమిద్దెలుఁడెననియు వాటికి దోను లుండెననియు తెలియవచ్చుచున్నది. అయో. 62-10 ఈ కాలములో పాశ్చాత్యులు కనిపెట్టినామని చెప్పుకొను పరిపాలనతంత్ర ములో పురపాలక సంఘము లొక శాఖగా నున్నవి. అట్టి సంఘములందు వాడవాడకు కొందరు ప్రముఖులు ఎన్నుకొనబడినవారై సభ్యులుగా చేరి వాటిని పరిపాలింతురు. రామాయణ కాలమందు వృత్తులనుబట్టి నగరా లలో "శ్రేణులు" ఏర్పాటగుచుండెను. వాటిపక్షమున శ్రేణీముఖ్యులు ఎన్నుకొనబడుచుండిరి. న త్వాం ప్రకృతయ స్సర్వా శ్రేణీముఖ్యాశ్చ భూషితాః అనుప్రజితు మిచ్చంతి పౌరజానపదా స్తథా అయో. 26_147 RV-Y 130 నా స్తికులు కుండిరి. రామాయణ విశేషములు నానాశాఖ ఆర్యమతములో విశిష్టత యేమనగా, అందు మతస్వాతంత్యము సంపూర్ణముగా వర్తించుచుండెను. విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు తావులుండెను. మతముతో భిన్నించినంతమాత్రాన వారిని తలగొట్ట తిత్తిఒలిచి చంపించకుండిరి. విశేషమైతే వారిని గర్హించు చుఁడి3. ఈ కారణముచేత వైదిక మతములో రానురాను లుద్భవించెను. అందు ప్రకృతివాదులు, లోకాయతులు, సాంఖ్యులు, క్షణవాదులు. నా స్తికులు, చార్వాకులు బయలుదేరిరి. సాధారణముగా మతసంధికాలములో నా స్తికత పొడసూపును. పూర్వమతమును ఖండించుచు నూతన మతము విజృంభించినప్పుడు జనులు అటు పూర్వమతమందు పట్టుతప్పి క్రొత్త మతమందు పట్టుదొరకక నాస్తికతలో బడుదురు. జైనబౌద్ధ మతాల విజృంభణకాలములో నాస్తికత ప్రబలెను. రామాయణ కాలమందట్టి మతసంధి కానరాదు కానరాకున్నను అందు నాస్తికులను గురించి చర్చించినారు. అయితే ఆచర్చలోనే 'తథాగతుడు' 'బుద్ధుడు' ‘చోరుడు' 'నాస్తికుడు' అయినవాని మతబోధను గురించిన నిందకలదు. కావున రామాయణమందలి నాస్తికమత చర్చయంతయు బౌద్ధకాలము నాటిదే యనియు, అదంతయు ప్రక్షిప్తభాగమందు చేరి తర్వాతి కాలములో చేర్చబడినదనియు నేను విశ్వసించుచున్నాను. రామాయణములో ముత్తె రంగులగు నా స్తికశాఖలు తెలుపబడినవి. లోకాయతులు, చార్వాకులు, బౌద్ధులు అనువారు నాస్తికులై యుండిరి. బౌద్ధమత దూషణమును శ్రీరామ నిచే చేయించిన విషయమును ఇదివర లోనే చూపించియున్నాను. ఇక లోకాయతికులను గురించి అం దిట్లున్నది. రాముడు భరతునిట్లు ప్రశ్నించుచున్నాడు: "కచ్చిన్న లోకాయతికాస్ బ్రాహ్మణాం ప్రాత సేవసే” (ఆయో. 100-88) రామాయణ విశేషములు 181 'నాయనా! నీవు లోకాయతికులైన బ్రాహ్మణులను సేవింపవు కదా?' అని రాముడు ప్రశ్నించెను బ్రాహ్మణులలోనే ఈ నా స్తిక వాదులు ఉండిరని పై వాక్యము స్పష్టము చేయుచున్నది. ఈ లోకాయత మెట్టిదో రాముడే యీ విధముగా విశదీకరించినాడు: అనర్థకుశలా హ్యేతే, బాలాః పండిత మానినః ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః బుద్ధి మాన్వీ క్షికీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే. (అయో. 100-89) ఈ లోకాయత మతమును ప్రచారముచేయు బ్రాహ్మణులు బాలుర వంటి అజ్ఞానులు. తమకేమో చాలా తెలియునని గర్వించుచుందురు. వీరు అనర్థాలకే దారితీసేవారు. పైగా దుర్బుద్ధులు. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు ఉండనేఉన్న వికదా! వాటిని విడిచి పెట్టి కేవలము శుష్కతర్కాన్ని అవలంబించి నిష్ప్రయోజనముగా వాగుచుందురు అని రాముడనెను.... అన్వీక్షకి యన న్యాయదర్శనము. "ప్రత్యక్షా గమాశ్రితం అనుమానం సా అన్వీక్షా" అని న్యాయభాష్యమన్నది. అన్వీక్షకి విద్యను ప్రతిపాదించిన వాడు గోతముడు లేక గౌతముడు. ఇత డహల్యాపతి యని కొందరు భావించినారు. దానికి ప్రమాణములు లేవు. అక్షపాదుడను బిరుదముగల గౌతముడు వేరు. అతడు బుద్దునికాలమువాడని విమర్శకుల యభి ప్రాయము. లోకాయతికులకు అనగా నాస్తికులకు నైయాయికులకు అవినాభావసంబంధ మిందు నిరూపించుట గమనింపదగినది. రాముని కాలములో ముఖ్యమైన ధర్మశాస్త్రాలుండెనా? ఉన్నట్లుకానరాదు. ఇది కూడా ప్రక్షిప్త సూచనయే! లోకాయతికులను లౌకాయతికులకు అనియు పిలుచుచుండిరి. సూ॥ వరం సాంశయికా న్నిష్కా దసాంశయికః కార్షాపణ ఇతి లౌకాయితికాః (వాత్స్యాయన కామసూత్రములు 1-2-9) 182 రామాయణ విశేషములు రేపేదో నిష్కం దొరుకుతుందికదా అను నాశతో ఇప్పుడు దొరికే కార్షాపణమాత్ర ద్రవ్యమును లోకాయతులు వదలుకొనరట! అనగా లోకాయతికులు ప్రత్యక్ష వాదులు (Materialists), లోకే ఆయతంత ఇతి లోకాయతాఃజనులు కుయుక్తులచే భ్రమింపజేయువారు కాన వారు లోకాయతులని తార్కికులు నిర్ణయించిరి. ఇట్టి లోకాయతు లలో జాబాలి యొకడు. అతడు శ్రాద్ధము లేల పెట్టవలెను ఆని రామునితో వాదించెను. ఇది చార్వాకులు చేసినట్టి వాదము. చార్వా కులకును లోకాయతికులకును భేదము లేదు. ఏకవేణి స్త్రీలకు పతివియోగము కాని మహదాపద కాని సంభవించి నప్పుడు ఏకవేణీధరలై యుండుచుండిరి. (సుం. 57-39) వ్యసనములో నుండినప్పుడు ఒంటి జడను వేసుకొనుచుండిరనుట చేత సంతోష కాలములందు రెండు జడలును (ఈరానీ నారీమణులవలె) వేసుకొను చుండిరా? ఇది స్పష్టమగుట లేదు. ఆర్యజాతికి చెందిన ఈరానీ స్త్రీలు నేటికిని సాధారణముగా రెండుజడలను రెండుబుజాలపై వేసికొనుటను చూచుచున్నాము. ప్రాచీన భారతవర్షియార్య స్త్రీలును విలాసకాలములందు అట్లే యాచరించు చుండిరేమొ? వర్ణవ్యవస్థ ఆనాటి వర్ణవ్యస్థను గురించి యిదివరకే కొంత సూచించి యున్నాను. పూర్వము ఇప్పటివలె కఠినమగు వర్ణ విభేదములు లేకుం డెను. భోజన ప్రతిభోజనములన్ని వర్ణములలో వర్తించుచుండెనని ఇంతవరకు వ్రాసినదానిని బట్టి స్పష్టమే. గుహుడు నిషాదజాతివాడు. నిషాదులు ఆటవిక జాతివారు. అంటరానివారు. మహాభారత కాలమందు వారు నీచజాతివారుగాను అపవిత్రులుగాను చూడబడుచుండిరి. రామాయణ విశేషములు ఉ॥ విప్రుడ నున్న వాడ, అపవిత్ర నిషాది మదీయ భార్య, ర్తిప్రియ, దీనిఁబెట్టి చనుదెంచుట ధర్మువె నాకు, నావుడున్ విప్రులఁబొంది యున్న యపవిత్రులు పూజ్యులు కారె, కావున విప్రకులుఁడ! వెల్వడుము వేగమ, నీవును నీ నిషాదియున్. 188 (మహాభారతము ఆది. ద్వి. 81) అట్టి అపవిత్రుడైన నిషాదరాజగు గుహుడు తెచ్చిన మాంస మత్స్యములను భరతుడు స్వీకరించెను. శ్రీరామచంద్రుడా నిషాదుని కౌగిలించుకొనెను శబరిపేరును బట్టియే శబరకన్యక, ఆటవిక స్త్రీ, అంటే అంటరాని అనార్య శ్రీ ఆమె యిచ్చిన యాతిథ్యమును - శ్రీరాముడు స్వీకరించెను. వానరులు అనార్యులు. కావున అవర్ణులు. వారితో రామాదులు భుజించిరి. బ్రాహ్మణులు ఇతర వర్ణములవారి యిండ్లలో శ్రాద్ధాది కర్మలందు పాల్గొని మాంసయుక్త భోజనమును భుజించుచుండిరి. (చూడుడు, వాతాపికథ) వర్ణాంతర వివాహాలు జరుగు చుండెను. ఇట్లుండినను బ్రాహ్మణులకు కొన్ని విశిష్టతలు ప్రారంభ మయ్యెను. అప్పులు రాబట్టుకొనుటకై ప్రాయోపవేశము చేయు అధి కారము వారికేయుండెను. సంస్కృతమును వారు ప్రత్యేకముగా మాట్లాడుచుండిరి. బ్రాహ్మణులకు వివిధ దానాలు చేసిన పుణ్యము లభించునను భావన ఏర్పడెను. వారు మెల్లమెల్లగా మత్తువస్తువులను వదలుకొనిరి. బహిరంగముగా వీధులలో మద్యపానముచేయు బ్రాహ్మణుని తక్కువ చూపుతో చూచుచుండిరి. 12_78) 'ధిక్కరిష్యంతి రథ్యాను సురాపం బ్రాహ్మణం యథా' (అయో. యుద్ధ తంత్రము రామాయణములోని యుద్ధపద్ధతులను గమనించిన కొన్ని విశేష ములు స్ఫురించును. ఆర్యులకున్న వానరులు, రాక్షసులు బలాఢ్యులై 134 రామాయణ విశేషములు యుండినట్లు కానవచ్చుచున్నది. వానర రాక్షసవీరులు కు స్తీపట్లలోను చెట్లను ఊడబెరికి వాటిని ఆయుధాలను ఉపయోగించుటలోను, గదా యుద్ధములయందును, ప్రవీణులుగా కానవచ్చుచున్నారు. అట్టిది ఆర్యు లందు కానరాదు. కాని ఆర్యులలో మారణయంత్రా లెక్కువగా నుండుటచే వారు పశుబలముకల వానర రాక్షసులను లోబరచుకొనగలిగిరి. ప్రపంచ చరిత్రలో నేటివరకు కూడా ఈ రహస్యమే వర్తించుచు వచ్చినది. ఏ జాతికి మారణ యంత్రాలెక్కువగా నుండునో ఆ జాతి యితర జాతు లను లోబరచుకొనుచు వచ్చినది. ఏషియా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండా లను యూరోపువారు గెలుచుటలో ఈ రహస్యము తప్ప మరి వేరు రహస్యము కానరాదు. రామాయణ యుద్ధాలలో అమ్ములు, బాణములు, గుండ్లు, చెట్లు, కత్తులు, గదలు, డాలులు, రథాలు, గుఱ్ఱములు, ఏనుగులు ఉపయోగింపబడెను. ఆర్యులవద్ద శతఘ్నులు అను ఆయుధము లుండెను. (బాల. 5–11) అవి యినుప గుదియలని వ్యాఖ్యాత లభిప్రాయడినారు. అవి ఒక్కొక్క దెబ్బతో నూరుమందివరకు చంపగల్గు చుండెడివని పదము యొక్క యర్థము తెలుపుచున్నది. కౌటిల్యుని కాలములో స్థిరయంత్రము లనియు, చలయంత్రము లనియు రెండువిధాల యంత్రాలుండెను. ఆందు శతమ్మ చలయంత్రాలలో చేరినట్టిది. దాని స్వరూపమును గురించి ఆర్. శ్యామశాస్త్రిగారు ప్రాచీన వ్యాఖ్యాధారమును బట్టి యిట్లు వ్రాసినారు: 'A big pillar with immense number of sharp points on its Surface and Situated on the top of a fort wall' అనగా ఒక పెద్ద స్తంభానికి మొనలుగల వస్తువులు చెక్కి దానిని కోట బురుజులపై ఉంచుచుండిరని తెలిపినారు. శబ్దకల్పద్రుమకారుడు శతఘ్నీకిట్లు అర్థము వ్రాసినాడు: “శతం హంతీతి శతఘ్నీ - అస్య లక్షణం; రామాయణ విశేషములు 185 -ఇతి విజయ అయఃకంటక సంఛన్నా శతఘ్ని మహతీ శిలా- రక్షితః............శతఘ్నీ లోహకంటక కీలితయష్టి విశేషా ఇతి మల్లినాథః." చాలామంది శతఘ్న అంటే ఫిరంగి అని అర్థము చేసుకొను చున్నారు. అది కాదని చూపుట కింత విపులముగా వ్రాయవలసి వచ్చినది. రాజులు సైన్యములతో బయలుదేరినప్పుడు విడిది చేయు స్థలము లలో డేరాలు ఎత్తించుచుండిరి. (ఆయో. 88-29) ఒక్కొక్క రాజు కొక్కౌక్క విధమగు ధ్వజముండెడిది. ఇక్ష్వాకువంశము వారిది కోవిదార ధ్వజము (ఆయో. 81-8) డాలులు చర్మముతో చేయబడినట్టివై యుండెను. (అయో. 91-2) బాణములు వేగముగాను బలవత్తరముగాను పోవుటకై వాటికి నెమలియీకలను కట్టుచుండిరి (ఆర. 8-18) ఈ కాలములో ఉభయపక్షాల సైనికులు కనబడుటకు పూర్వము వారికి సారాయి, బ్రాందీ త్రాపి యుద్ధదుందుభులను (బ్యాండును) మ్రోగించి యుద్ధములోనికి వదలుదురు. రామాయణ కాలమందును భటులకు మద్యమును త్రాపి యుద్ధసన్నద్దులనుగా జేయుచుండిరి. అట్టి మద్య పానమునకు “వీరపాణము" అని పేరుండెను. (కిష్కి. 11-88) వీరులు త్రాగునట్టి పానము కావున అది వీరపాణమయ్యెను. శత్రు సైన్యమునకు నష్టము కలిగించుటకై బావులలో విషము కలుపుచుండిరి. ఫల వృక్షములను నాశనము చేయుచుండిరి. ఈనాడు రష్యా కనిపెట్టిన భూదహన తంత్రము వంటిది __Scorched earth policy). శత్రు సేనలోనికి చారులను బంపి వారి బలాబలములను, వారి యుద్ధాలోచనలను, వారి ప్రయత్నాలను కనుగొనుచుండిరి. చెట్ల లోను గట్లలోను దాగియుండి కూడ యుద్ధాలు (గోరిల్లా యుద్ధాలు) చేయుచుండిరి. అయితే ఇవన్నియు రాక్షసుల చర్యలని తెలిపినారు. (యుద్ధ. 4-12,18) 186 రామాయణ విశేషములు సైన్యములో ఇప్పుడు పల్టక్, బ్రిగేడ్, డివిజన్ అను విభాగా లుండునట్లుగా రామాయణ కాలములో కొన్ని సంఖ్యాయుక్తమైన సైనిక విభాగాలుండెను. ఒక ఏనుగు, ఒక రథము, మూడు గుర్రాలు, అయిదు గురు పదాతులు కల సేనను “పత్తి" (Unit) అని వ్యవహరించిరి ఇది అన్నిటికన్న చిన్న సైనిక వర్గము. మూడు పత్తులు సేనాముఖమనియు, మూడు సేనాముఖాలు ఒక గుల్మమనియు, మూడు గుల్మాలు ఒక గణమనియు, మూడు గణాలు ఒక వాహిని యనియు, మూడు వాహినులు ఒక పృతనయనియు, మూడు పృతనలను చమువు అనియు, లేక అనీక మనియు వ్యవహరించుచుండిరి. అయితే రామాయణములో సైనిక వర్గాల ముచ్చట కానరాదు. ఆందు మాట్లాడితే లక్షల, కోట్లు సంఖ్యలలోనున్న సైన్యములను పేర్కొన్నారు. అనీకముల శతసహస్రసంఖ్యలే అందు న్నవి. ఆకాలమఁదొక విశేషము కనబడుచున్నది. ఆర్యులే ధనుర్విద్య యందు ప్రవీణులై యుండినట్లు తోచుచున్నది. ఆ విద్యను ఇంకను వానర, రాక్షసులు నేర్చుకొనలేదు. వారు గదలతోను, వృక్షాలతోను, గుండ్లతోను, కత్తులతోను యుద్ధము చేయుచుండిరి. పైగా కు స్త్రీలుపట్టుట, ముష్టియుద్ధము చేయుట వారి ప్రత్యేక యుద్ధకళగా కనిపించుచున్నది. వాలి సుగ్రీవులు కుస్తీపట్టిరి. రాముడు బాణముతో వాలిని చంపుదుననగా సుగ్రీవుడు దాని మాహాత్మ్యమును మొదట విశ్వసింపక రాముని ధనుర్విద్యాపరీక్షను తీసుకొని సప్తతాళవృక్ష భేదనము చూచి పర్వాలేదులే అని తృప్తిపడెను. యుద్ధకాండలో సాధారణముగా వానర, రాక్షసు లందరును బాణములుతక్క తక్కినవాటితో యుద్ధము చేసినట్లు వర్ణించి నారు. కుంభకర్ణు నంతటివాడు ధనుర్విద్య నెరిగియుండలేదు. ఒక ఇంద్రజిత్తు, రావణుడుతప్ప తక్కినవారెవ్వరును ధనుర్విద్య నెరుగరు. వారిరువురుకూడా ఎరిగియుండిరో లేదో, అది కవి వర్ణనమేనో యేమో? రామాయణ విశేషములు 137 ఆస్త్రములముచ్చట యందందు కలదు. మంత్రాలతో పనిచేయు బాణాలను మన కాలములో నమ్మజాలము. అదియు కవి కల్పితమేమో? ఆర్యులలోనే ధనుర్విద్యాప్రాబల్య ముండెననుటకు రాము డొక్ష డే ఖరుని 14000 రాక్షస సైన్యాన్ని బాణములతోడనే హతమొనర్చిన దొక నిదర్శనము. వానరవీరు లెవ్వరును ఎందును ధనుస్సు నుపయోగించి నట్లు వ్రాయకుండుట మరొక విశేషము. ఆర్యులలో ధనుర్విద్యా పాటవము బహుకాలము వరకుండెను. తుదకు క్రీ. పూ. 6వ శతాబ్ద మందు రాజ్యముచేసిన పర్యాచక్రవర్తుల సైన్యాలలో ధనుర్ధరులైన హిందువుల సేన యొకటి ప్రత్యేకముగా నుండెను. సుప్రసిద్ధమైన ధర్మా పైలీ యుద్ధములలో పర్ష్యచక్రవర్తి పక్షాన గ్రీకులతో హిందూ ధానుష్క సైన్యము యుద్ధము చేసెను. ఆ సైన్యము నూలుబట్టలను కట్టుకొనియుండె ననియుబెత్తపు అమ్మలను, ఇనుప మొనలుగల బాణములను ఉపయోగిం చెనని చరిత్రకారులు వర్ణించినారు + ధనుర్విద్యను ప్రపంచమందు మొట్ట మొదట కనిపెట్టినది ఆర్యులే. వారు భార్గవార్యులు. ప్రపంచ గ్రంథాలలో నెల్ల అత్యంత ప్రాచీన గ్రంథరాజమగు ఋగ్వేదమందు ధనుర్విద్యను గురించిన చర్చ కలదు. ధన్వనా గా ధన్వనాజిం జయేమ, ధన్వనా తీవ్రాః సమదోజయేమ ధనుః శత్రోరపకామం కృణోతి, ధన్వనా సర్వాః ప్రదిశో జయేమ. (ఋగ్వేద మం. 6 సూ. 75 మంత్రం 2) - ధానుష్కులు తమ బలాబలములు పోటీ పరీక్షలు చేయుచుండిరని ఋగ్వేదమందు వర్ణించినారు. ఋగ్వేదమందలి మండలం 6 సూక్తము 75 లో ధనుస్సు, వర్మము, జ్యా, ఇషువులు, సారథి, రథము, ఆశ్వములు, + Ancient India, Vol. I, SK. Iyengar. 188 రామాయణ విశేషములు యుద్ధభూమి, కవచాలు మున్నగునవి విపులముగా వర్ణింపబడినవి. ఇది ధనుర్విద్యా ప్రాచీనతకు ప్రబల నిదర్శనము. ప్రాచీన కాలములో ఆర్యుల తర్వాత శకులు (సిథియనులు) ధనుర్విద్యయందు పాండిత్యము కలిగియుండినట్లు వర్ణింపబడినారు. అదే విధముగా ఆర్యులకెట్లు గుర్ర ములు ప్రధాన యుద్ధాంగములై యుండెనో శకులకును గుర్రములే ప్రధాన వాహనములై యుఁడెను. ఋగ్వేదమందు గుర్రములను పలు లావుల్లో వర్ణించినారు. ఏ జనులందు ఏ విద్య ప్రాముఖ్యము వహించి యుండునో దాని గురించిన చర్చయే వారిలో నెక్కువగా నుండును. నేటికిని భారతదేశ మందలి ఆటవికులలో వివాహాకాలమందు పెండ్లికూతురు అమ్ము పై విడిచిన బాణమును పెండ్లికుమారుడు తేగలిగితే వాని కా బాలిక నితు రట ! సీతా వివాహమునకు శివధనుస్సు నెక్కుబెట్టువాడే అర్హుడుగా నిర్ణయింపబడియుండెను. ద్రౌపదికి మత్స్యయంత్రమును పడగొట్టువాడే భర్తయగుటకు అర్హుడై యుఁడెను. రామునికి ధనుర్విద్యా గురువు విశ్వా మిత్రుడు. రాముని వివాహముతో విశ్వామిత్రుడు రామాయణమునుండి అకస్మాత్తుగా మాయమైపోయెను. మరల యెచ్చటను అతనిజాడ కాన రాదు. ఈ విచిత్రమునకు కారణమేమో దురూహ్యముగా నున్నది. ధనుర్విద్యను గురించి రామాయణము మరికొన్ని విశేషములు తెలిపినది. రాముడు భరతుని నిట్లడిగెను: ఇష్వస్త్ర వరసంపన్న మర్థశాస్త్ర విశారదం సుధన్వాన ముపాధ్యాయం కచ్చి త్వం తాతమన్యసే (అయో. 100–14) నాయనా! ధనుర్విద్యలో పారంగతుడును అర్థశాస్త్ర విశారదుడును నగు సుధన్వ గురుపాదులను మన్నించుచున్నావుకదా! అని శ్రీరాముడు రామాయణ విశేషములు 139 భరతునడిగెను. ఈ సుధన్వుడెవడు? రామాదులకు ధనుర్విద్యాగురువు విశ్వామిత్రుడొక్కడేయని తెలిపినారు కాని ఇంతకు పూర్వము కాని ఈ శ్లోకానికి పరమందుకాని ఈ సుధన్వుని జాడలేదు. ధనుర్విద్యలో మంచి నేర్పరియగువాడు సుధన్వుడని శబ్దారముండుటచేత అది నామవాచకము కాదని తలపవచ్చును. కాని అతడుపాధ్యాయుడనియు పేర్కొనుటలో అతడెవ్వడో తెలియవచ్చుటలేదు. కాని రామాదులు భార్గవ వంశము వాడగు విశ్వామిత్రునొద్దనే ధనుర్విద్యను నేర్చినటులు రామాయణమందు కలదు. విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులను పంపుటకు దశరథుడు నిరాకరింపగా విశ్వామిత్రుని కాగ్రహము కలుగునని వసిష్ఠుడు తలచు టయేకాక అతడే ధనుర్విద్యకు తగిన గురువని ఇట్లు దశరథునితో చెప్పెను. "ఈ విశ్వామిత్రుడు ముల్లోకములం దెవ్వరును నెరుగని వివిధాస్త్ర ప్రయోగముల నెరిగినవాడు. దేవాసుర యక్షకిన్న రాదు లెవ్వరును నింతటి విద్యనెరుగరు. పూర్వము కృశాశ్వుడను నతని పుత్రులు పరమధార్మికులుండిరి. వారు సర్వాస్త్రములను పూర్వమే కౌశి కునికి భార్గవవంశమువానికి) ఇచ్చియుండిరి. ఆ కృశాశ్వ పుత్రులు ప్రజాపతిసుతాసుతులు. వారు మహావీర్యులు. దీప్తిమంతులు. జయా వహులు. దక్షకన్యలైన జయయు, సుప్రభయు అస్త్రశస్త్రముల నూరిం టిని కనిపెట్టిరి......... ఆ శస్త్రములను గూడ నీ కుళికాత్మజుడగు విశ్వామిత్రుడు నేర్చినాడు. ఇతడు పూర్వములైన ధనుర్విద్యా విధానము లను సృష్టించగలవాడు. ఇతడు స్వయంసమర్థుడు. కాని నీ పుత్రుల హితార్థమే వచ్చినాడు. కాన బాలకులను పంపుడు" (బాల. 11. సర్గ, శ్లోకాలు 11 నుండి 21 వరకు). పై వాక్యాలవలన కొన్ని విషయములు మనకు స్ఫురించుతున్నవి. ధనుర్విద్యలో మొదట కృశాశ్వ వంశమువారు ప్రవీణులు. అశ్వాంత నామ వాచ్యులందరును ప్రాచీనమునుండియు ఈరానీ ప్రభువులు. కావున 140 రామాయణ విశేషములు ఈరానీ ఆర్యులలో నీ విద్య మొదట సృష్టియయ్యెననవచ్చును. తర్వాత వారినుండి భార్గవులా విద్యను గొప్పగా సాధించిరి. దక్షకన్యలుకూడా ధనుర్విద్యలో ప్రవీణులన్నదియు అందు క్రొత్త రీతులు కనిపెట్టిరన్న దియు ముఖ్యముగా గమనింపదగినది. ఆ కన్యకలకును కృశాశ్వ వంశ్యులకును నేమి సంబంధము కలదో తెలియదు. వారెక్కడివారో ఆదియు తెలియదు. ఆ విషయమేలనో అంత సూచన మాత్రముగా చెప్పి వదలివేసినారు. ఆ కన్నెల విద్దెలను గూడ విశ్వామిత్రుడు సాధించెను. ఆనగా ఎచ్చటెచ్చట ధనుర్విద్యాపాండితీ ప్రకర్ష కానవచ్చెనో అచ్చటంత టను విశ్వామిత్రుడు సాధన చేసెనన్నమాట. ఈ చర్చను బట్టి మొదట హింద్వార్యులలో ధనుర్విద్యా ప్రచారము బాగుగా చేసినవారు భార్గవ వంశ్యులనవచ్చును. భార్గవ రాముడు ధను ర్విద్యా గురుత్వ గర్వ దర్పితుడుగా నిరూపితుడు కదా! అయితే యీ విద్యలో హింద్వార్యులు గురువులకు గురువులైరి. దరయస్ (దారాయువస్) అను పర్షియా చక్రవర్తి గ్రీసు పై దండయాత్ర చేసినప్పుడు తనసేనలో హిందూధానుష్కుల పటలమును (పల్టనును) చేర్చి తీసుకొని పోయియుండెనని చరిత్ర చెప్పుతున్నది. ధనుర్విద్య క్షత్ర విద్యయని ప్రసిద్ధియేకాని సకల వర్ణములవారును దానిని సాధించినవారే. ఇప్పుడది ఆటవికుల విద్యగా నిలచినది. వారి లోను అది క్షీణించిపోతున్నది. ఈ శాస్త్రమును గురించి వ్రాయుటకు హిందువులే అర్హులు. కాని అదేమి గ్రహచారమో దీనిని గురించిన శాస్త్రము లిప్పుడు కానరావు. అపరార్జునుడను ప్రఖ్యాతిగాంచిన అప్పారావుగారను నాంధ్రునిచేత నైనను ఎవ్వరును నీ శాస్త్రమును వ్రాయించినవారు కారు. అతడు 1950లో దిక్కులేని చావు చచ్చెను. మన ఆదరణ ఇట్టిదే! ఆర్యుల సంస్కృతి రామాయణ విశేషములు 141 సంస్కృతి యనగా ఇంగ్లీషులో కల్చర్ అను పదమునకే సంపూర్ణారముకలదో ఆ యర్థమందే వాడుచున్నాను. ఆర్యుల నాగరికత, సంస్కృతి రామాయణకాలమునాటికే బాగా ప్రబలియుండెను. ఆర్యావర్త మందు అనగా గంగానదికి పశ్చిమోత్తరభాగములందు పట్టణములు, నగరములు, గ్రామములు సమృద్ధిగా ఏర్పడియుండెను. ఈ లక్షణము గంగకు దక్షిణమందును, జనస్థానమందును, దండకారణ్యమందును కానరాదు. అయోధ్యానగరము ఇంచుమించు ఈనాటి నగరాలవలె గొప్పదియై నాగరికత కలదియై యుండెను. వివిధవృత్తులవా రుండిరి. అయోధ్యానగరములో గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, ఆవులు, ఎద్దులు, గాడిదలు కూడా ఉండెను. (బా. 5-18). బాబిలోనియా జనులు క్రీ. పూ. 1700 ఏండ్లకుముందు గుర్రాలముఖమే చూచినవారు కారని తెలిపినాను. చూచిన తర్వాత వారు గుర్రమంటే "తూర్పునాటి గాడిద” అని వర్ణిం చిరి! అయోధ్యలో కూటాగారములు అనగా అంతస్థులుకల మేడలుండెను. (బా. 5-15). విమాన శిఖరా లుండెను. అనగా ఏడంతస్థుల మేడ లుండెను. (అయో. 32-8). అందు "కుథాస్తరణ తల్పము" లుండెను. (అయో. 30-14). అనగా అందు చిత్రకంబళములు, పరుపులు, పై కప్పులు, దుప్పట్లు ఉండెను. నగరాలలో నాటకములాడి వేషములు వేసుకొని ప్రజలకు వినోదాలు కలిగించుచుండిరి. (శైలూష ఇవ-అయో.80-8). రాజులకు సహజముగా వేటలందాసక్తి యుండెను. ఏనుగులను విషదిగ్ధ బాణములతో కొట్టి వేటాడుచుండిరి. (అయో. 30-28) ఆర్యుల విజ్ఞానముకూడా మంచి అభివృద్ధిదశలో నుండెను. జ్యోతిశ్శాస్త్రమందు వారికి నుంచి ప్రవేశముండెను. వాల్మీకికి జ్యోతిశ్శాస్త్ర సంబంధోపమానములు చాలా యిష్టము. ఉదాహరింప శక్యముకానన్ని పర్యాయములు ఇట్టి యుపమానములను వాడియున్నాడు. అంగారకాది 142 రామాయణ విశేషములు గ్రహాలు రోహిణిని వీక్షించుట లోకానర్థకమన్నాడు. (ఆర.46-5). బుధుడు రోహిణిని పొందితే జగత్పీడ కలుగు నన్నాడు. (యుద్ధ. 103-30). 'నా జన్మ నక్షత్రాన్ని సూర్యాంగారక రాహువు లాక్రమించి నవి' అని దశరథుడు విచారపడినాడు. (అయో. 4-18). శుభదిన శుభ నక్షత్రయోగమునుచూచి ప్రయాణముగాని ఉద్యమములను గాని సాగించు చుండిరి. (యుద్ధ. 4-8). ఇట్టివెన్నైనను కలవు ఈనాడు టెలిస్కోపు యంత్రాలద్వారా చూచి సూర్యునిలో మచ్చలు (Sun Spots) ఉన్నవని తేల్చినారు. ఇంతమాత్రము ఆనాడే వాల్మీకికి తెలియక పోలేదు. "ఆదిత్యే విమలే నీలం లక్ష్మ లక్ష్మణ దృశ్యతే" (యుద్ధ 28-9) "లక్ష్మణా! సూర్యునిలో నల్లనిమచ్చ కనబడుచున్నది సుమా!” అని రామునిచే వాల్మీకి చెప్పించినాడు. ఆ కాలమందు శిల్పనిర్మాణకుశలు లుండిరి. మయులను జాతి శిల్పవే త్తల జాతిగా నుండెను. వారి శిల్ప మొక మాయవలె నుండెను. "మాయే వ మయనిర్మితా" (యుద్ధ. 12-14) వ (12-14) ఈ మయు లెవ్వరు? వీరి సంతతి తర్వాత బహు పురాణాలలో కాని ప్రాచీన చరిత్రలందుకాని కానరాదు. మహాభారతమం దొక మయుడు వచ్చెను. అతడు నిర్మించిన “మయసభ” కౌరవయుద్ధాని కొక కారణ మయ్యెను. అతడు ఖాండవవనమందలి అనార్య నాగజాతిగా అందు నిరూపితుడైనాడు. ఈనాడు కొందరు విమర్శకులు మెక్సికో అమెరికా ఖండము లోని సుప్రసిద్ధమగు మయజాతివారే యీ మన మహాభారత మయునిజాతివా రని తేల్చుచున్నారు. "హిందూ అమెరికా" గ్రంథము వ్రాసిన చమన్లాల్గారు మెక్సికోకు హిందువులు అతి ప్రాచీనకాలములో వలసపోయి ఆ దేశమం దుండిపోయిరనియు, అందుచేత మయులు ఒక కాలమందలి భారతీయులనియు వాదించినారు. మయ బ్రహ్మ అను దేవజాతివా డొక డుండెననియు, అతడే ఇపుడు లభ్య అను రామాయణ విశేషములు 143 మానమగు 'మయవాస్తువు' అను శిల్పగ్రంథమును రచించెననియు మరి మొత్తానికి “మయుడు” అనార్యుడు, మహా కొందరి విశ్వాసము. శిల్పవేత్త. ఆయోధ్యలో ఏడంతస్థుల వరకు సౌధరాజములను నిర్మించి యుండిరనిస గృహనిర్మాణ శిల్పమెంతయో అభివృద్ధిపొంది యుండ వలెను. రాముడు శిల్పశాస్త్రప్రకారము కుటీరము నిర్మించుకొనెను. అదే శాస్త్రమును అనుసరించియే వాస్తుశాంతికై జింకను బలి యిచ్చెను. బాటలు అనగా రోడ్లు నిర్మించు 'ఇంజనీయర్లు' ఉండిరి. చారముతో కొలత పట్టువారు, త్రవ్వువారు, కూలీలు కర్మాంతికులు, శిల్పుల పర్యవేక్షకులు మేస్త్రీలు, వారిని రామాయణమందు స్థపతులు అని యన్నారు, వడ్లవారు వార్ధకులు, బాటలు వేయువారు మార్గణులు చెట్లను నరుకువారు వృక్షతక్షకులు, బావులను త్రవ్వువారు కూప కారులు, సున్నము గచ్చుపనిచేయువారు సుధాకారులు, మేదరవారు వంశకర్మకులు, గడ్డపారలలోను, రంపములతోను పనిచేయువారు- ఇట్టి వృత్తులవారు తండోపతండములుగా దేశమందు నిండియుండిరి. అయో. 80-1 నుండి 7 వరకు నీలుడు ఒక గొప్ప నిర్మాణ 7 . శిల్పవేత్త ఇంజనీయర్. అతని యాదేశప్రకారమే లంకకు వారధి కట్టబడెను. నీలుని తండ్రి కూడా అట్టివాడే. (యుద్ధ 22-45 సేతు నిర్మాణ ణ విశేషాల కీ సర్గను చూడుడు) ఇదంతయు వాస్తుశాస్త్ర సంబంధ మగు చర్చ. ఇక సాముద్రిక శాస్త్రమును గురించి చర్చింతము. జనులకు సాముద్రికమందు మంచి విశ్వాసముండెను. రామాయణ కాలమందు అనగా క్రీ. పూ. 2500 నాడు సాముద్రిక ముండెనా యని సంశయింప బనిలేదు. ఈ శాస్త్రము జ్యోతిషముతో లంకె వేసుకొని యున్నట్టిది. సాముద్రికమును మొట్ట మొదట హిందువులే కనిపెట్టిరి. రాను రాను 144 రామాయణ విశేషములు దానికి సంబంధించిన శాస్త్రము జీవనాధారముగా కల్పించుకొన్న కొందరి చేతులలో ఒక రహస్య గోప్యశాస్త్రమైపోయెను. కీరో (Cheiro) అను సుప్రసిద్ధ పాశ్చాత్య సాముద్రికవేత్త తన గ్రంథాలలో "నేనీ శాస్త్రమును హిందువులవద్ద నేర్చుకొంటిని” అని వ్రాసినాడు. వారీ శాస్త్రమును గురించి యిట్లభిప్రాయ మిచ్చినారు. “అతి ప్రాచీన కాలములో శబ్దసృష్టి ఆర్య జాతి మూలముననే కలిగినది......విషువత్తులు 25,600 ఏండ్ల కొకమారు కలుగునని సరిగా ప్రాచీన కాలమందే ఈ హిందువులు తెలిపిరి. ఇట్టి ప్రజ్ఞాబలముకల జాతీయే సాముద్రికమును కనిపెట్టెను. ఇప్పుడు మనము ఏ జాతులనైతే చాలా ప్రాచీనమైనవి అంటున్నామో అట్టి జాతులలో నాగరి కత ఏర్పడుటకు ఎంతో కాలానికి ముందుగానే హిందువులీ శాస్త్రాలను సృష్టించిరి. అనగా పర్ష్య, ఈజిప్టు దేశాల పేరులు కూడా తెలియరాని కాలానికంటే చాలా పూర్వమే యహూదీల పెద్ద తాత ఆబ్రహాం పుట్టకముందే, మూసా ( మోసెస్ ) ప్రవక్తకు దశ నిబంధనలు (Ten Commandments) ప్రసాదితము కాక పూర్వమే యీ శాస్త్రాలు వ్రాయబడెను. హిందువులనుండి యీ సాముద్రికము చీనా, తిబ్బెట్, పర్ష్య, ఈజిప్టు, గ్రీసు దేశాలలో వ్యాపించెను. క్రీ. పూ. 440 లో అనక్ష గోరస్ అను గ్రీకు పండితుడు తన శిష్యుల కీ శాస్త్రమును నేర్పు చుండెను.”+ † In the far off dawn of Civilization, the first evidence of a word language belongs to the Aryan race. To their descendants, the Hindus, we owe the discovery of the precesion of the equinoxes which takes place every 25,600 years and we, with all the marvellous scientific instruments at our disposal, have only in recent years proved their calculations to be correct. రాజరాజులు, రామాయణ విశేషములు 145 చక్రవర్తులు, నియంతలు, నియంతలు, మహాప్రధానులు, ప్రధాన సేనానులు, జగద్విఖ్యాత పురుషులు వేలకొలదిగా ఈ కీరో పండితునిచేత తమ సాముద్రిక భవిష్యత్తును చెప్పించుకొని అతడు చెప్పినవన్నియు సత్యమని పూని చెప్పియున్నారు. అట్టి కీరో యీ శాస్త్ర ప్రాచీనతను గురించి యే వాక్యములను సెలవిచ్చెనో వాటి విలువ అద్వితీయము. వారింక ను చాలా సంగతులు హిందువులనుగురించి వ్రాసిరి. అవి యిచ్చట అప్రధాన మగుటచే ఉదాహరించలేదు ఈజిప్టు చరిత్ర క్రీ. పూ. 4000 ఏండ్ల నుండి లభించుచున్నది. దాని పేరు, గురుతు, జాడ తెలియరానప్పుడే హిందువులు సాముద్రికమును కనిపెట్టి రనిన రామాయణకాలములో దీని చర్చ యుండుట ఏ మాత్రముస్నూ ఆశ్చర్యము కలిగించనేరదు. సీతకు పెండ్లి కాకముందే జ్యోతిర్విదులగు బ్రాహ్మణులు ఆమె చేతి రేఖలను పరీక్షించి ఆమెకు వనవాస దుర్యోగమున్నదని చెప్పి The intellectual power that was able to make such a discovery speaks for itself. It is this self same people that discovered the study of the Hand • The period of time when these studies were created by the Hindus, was long before the dawn of civilisation had reached nations we now call ancient, a period long before Persia or Egypt had been heard of; before Abraham, the Father of the Hebrews had been born, & before the 10 Commandments were given to Moses. From the Hindus the study of the Hand reached China, Tibet, Persia, Egypt & finally to Greece.... Anaxa- goras taught this study to his pupils in 440 BC- Chiero's Secrets of the Hand, PP 17,18,19. RV-10 148 రామాయణ విశేషములు యుండిరి. అయో. 29-9. జ్యోతిర్వేత్తలగు బ్రాహ్మణులేకాక తాపస వేషములతో దేశసంచారముచేయు స్త్రీలు కూడా యీ శాస్త్రమందు ప్రావీణ్య అయో. 29_13 . వీ రెవ్వరు? వీరే జిప్సీల మును సంపాదించిరి. . ఆను (Gipsy) పూర్వికులై యుందురు. జిప్సీల భాషలోని పదాలు అధిక భాగము సంస్కృత సమములై యున్నవనియు, వారు తమ భాషను రోమనీ భాష యని యందురనియు అనగా రామ యజమాని పదమునుండి ఏర్పడినదనియు జార్జి బరోగారు వ్రాసినారు . రామాయణ కాలమందు స్త్రీపురుష సాముద్రిక శాస్త్రములు వేరువేరుగా ఏర్పడినట్లు కానవచ్చుచున్నవి వాల్మీకి పురుష సాముద్రిక లక్షణాలను కొన్నింటిని వివరించినాడు. 1 ఎంత సంగ్రహముగా ఈ చర్చలను చేయదలచినను విషయము పెరిగిపోవుచున్నందున ఈ లక్షణాలు ఉదాహరింప వీలులేక పోయినది అభిలాషులు సుందరకాండము సర్గ 35 లోని 17 నుండి 21 వరకుండు శ్లోకాలను వాటిపై వ్యాఖ్యాతలు వ్రాసిన విపుల వ్యాఖ్యాన మును చూచుకొనగలరు. వాల్మీకి స్త్రీ సాముద్రిక లక్షణాలను గూడా ప్రత్యేకముగా వ్రాసియున్నాడు. అభిలాషులు యుద్ధకాండ సర్గ 48 లో 1 నుండి 15 వరకుండు శ్లోకాలను వాటిపై వ్యాఖ్యాతల వివరణను చదువుకొనగలరు. రామాయణ ప్రారంభమందే రాముని సాముద్రిక లక్షణముల నిట్లు వర్ణించినారు: “రాముడు విపులాంసుడు. మహాబాహువులు కలవాడు. కంబుగ్రీవుడు. మహాహనువు కలవాడు.” 'మహోరస్కో మహేష్వా సోగూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః . (బాల. 1-9, 10, 11.) ‡ Romano Lavo-lil by George Borrow. PP 3 to 8. రామాయణ విశేషములు 147 ఈ శ్లోకాలకు వ్యాఖ్య వ్రాసినవారు ఇవి సాముద్రిక ప్రతిపాదిత లక్షణములనియు 'జగద్వల్లభ' అను పుస్తకములో సాముద్రిక శాస్త్ర మున్నదనియు తెలిపినారు. ఈ జగద్వల్లభ యెట్టిదో తెలియదు. అదే వ్యాఖ్యలో వరరుచికూడ ఒక సాముద్రిక శాస్త్రమును రచి చినట్లు తెలిపి నారు. ఈ రెండు గ్రంథము లిపుడు కానరానట్లే! సంస్కృతములో మూడు సాముద్రిక గ్రంథాలు ముద్రితమైనవి. అవి పనికిరాని గ్రంథాలే! మనదేశమందిప్పుడు నిజమైన సాముద్రిక శాస్త్రవేత్తలు కానరారు. వాల్మీకికాలమునాటికే ఆర్యహిందువులలో వైద్యవిద్య మంచి పరిణతి పొందియుండెను. ఓషధీ ప్రభావమును మన పూర్వికులు బాగుగా గుర్తించిరి. చికిత్సలలో ఓషధులను వాడుటలో హిందువులే మొట్ట మొదటివా రని మరల చెప్పవలసియున్నది. హిమవత్పర్వత ప్రాంత మంతయు ఓషధులకు జన్మస్థానముగా మనవారు భావించియుండిరి. నేటికిని ఆ విశ్వాసమందు లోపమేమియు గలుగలేదు. విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి, సంజీవకరణి అను నాలుగు విధాల ఔషధ ములను మనవా రెరిగియుండిరి. (యుద్ధ. 102_22, 28) అయితే ఇందు సంజీవకరణినివా రెరిగియుండిరనుట సంశయాస్పదమే. హిందువులలో కొందరు అట్టి యౌషధమందు విశ్వాసము కలిగియుండిరి. క్రీ.శ. 649లో నారాయణస్వామి యను దాక్షిణాత్య హిందువును చీనాచక్రవర్తి పిలిపించి అతనిచే మృత్యుంజయ రసాయనమును చేయించెను. కాని ఆ చక్రవర్తి క్రీ.శ. 649 లోనే చనిపోయెను. తర్వాతి చక్రవర్తియగు కోత్సంగ్ అనువాడుకూడా ఈ విశ్వాసమునకు లోనై నారాయణస్వామిచే సిద్ధాషధ మును చేయించెను. ఈతడవ నారాయణస్వామియే చనిపోయెను. అక్కడి కిని చీనా చక్రవర్తికి సంజీవకరణియందు విశ్వాసము తగ్గలేదు. లోకా దిత్యుడు అను మరొక హిందువును పిలిపించెను. గరుడ పురాణములో 148 రామాయణ విశేషములు ఒక విధమగు పలాశమునుండి దీర్ఘాయువు నిచ్చు ఔషధమును సిద్ధము చేయు క్రియను వ్రాసియున్నారు. # - రామసైన్యములో నలుడెట్లు మంచి శిల్పియో సుషేణు డట్లు మంచివైద్యుడు. (యుద్ధ. 92-20) అయితే చిత్ర మేమనగా సుషేణుడు, జాంబవంతుడు, నలుడు, హనుమంతుడు - వీరందరును అనార్యులే. ఆనార్యులలో కూడ ఓషధీ ప్రభావ యెక్కువగా నుండుటకు ఆటవికులగు గోండు, చెంచు, ముండా మున్నగువారిలో ఓషధీ వైద్యము విశేషముగా నుండునని ప్రతీతి. శస్త్రవైద్యమును కూడా ఆ కాలములో అభ్యాసము చేసియుండిరి. 'గర్భస్థజంతో 8వ శల్యకృంతః' సుం. 28-6. (సర్జరీ) పిండము గర్భమందే మృతించిన దానిని తునకలుగా కత్తిరించి బయటకు తీయుచుండిరి. జాంబవంతుడు మంచి వైద్యవేత్త. హనుమంతునితో హిమవత్పర్వతమందు ఋషభ కైలాసగిరులమధ్య ఓషధీపర్వత మున్నదనియు, ఆందు నాలుగు ఓషధులు మృతసంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అనునవి కలవనియు చెప్పి వాటిని తెమ్మనెను. (యుద్ధ 74-38). హనుమంతుడు ఆకాశ గమనముతో హిమవంతమునకు పోవుట, ఓషధులు గల పర్వత భాగమునంతయు ఉత్పాటనముచేసి అరచేత పెట్టుకొని మరలు ఆకాశమార్గమున వచ్చుటయు, పని తీరిన తర్వాత దానిని యథాస్థానమందు వేసివచ్చుటయు, ఇదంతయు కవి కపోల కల్పితముగా కనబడుచున్నది దగ్గరి గుట్టలలో ఓషధులను వెదకి తెచ్చిన తెచ్చియుండును. ఇది వైద్యమును గురించిన చర్చ. ఇక గణితశాస్త్రమును గూర్చి విచారింతము. జ్యోతిషమునకు గణితమునకు దగ్గరి బాంధవ్యమున్నది. జ్యోతిషము తెలిసినవారికి
- ఓ.సీ. గంగూలీ వ్యాసము. మాడరన్ రివ్యూ, ఆగష్టు 1937 లో రామాయణ విశేషములు
149 12వ గణితములో పాండిత్యముండును. ప్రపంచానికి సరియగునట్టి గణితశాస్త్ర భిక్ష పెట్టినది హిందువులే. సున్నను మొట్ట మొదట కనిపెట్టినది హిందు వులే. ఆ సున్నయే కనిపెట్టకుండిన ప్రపంచ విజ్ఞాన శాస్త్రము ఇంచు మించు సున్నగానే యుండి యుండును. తొమ్మిది అంకెల తర్వాత ఇతర జాతులవారు పదికొక అంకెను పదకొండు కొకటి యీ విధముగా ఒక్కొక్కరూపమును వ్రాయుచూ పోయిరి ఎంతవరకని అట్లు అంకెలను సృష్టించుచు పోగలరు? అందుచేత కొన్ని జాతులవారు 1000 వరకు వెళ్ళేవరకు అలసిపోయిరి. కొన్ని జాతులలో లక్షకు పేరు లేదు. నేటికిని పాశ్చాత్య జాతులలో పది లక్షలకు మిలియ౯ అందురు. అటుపై వారికి కోటి, అర్బుదము శంఖము, వంటి సంఖ్యనామములు లేనేలేవు. బాబిలోనియావారు 12 నక్షత్ర రాసులను కనిపెట్టిరి. ఆ 12 సంఖ్యయే నేటికిని యూరోపు జాతులకు ప్రధానము. వారు లెక్కలను 12 వ ఎక్కముతో ఎక్కువగ గుణింతురు. డజన్ల మాటనే చెప్పుచుందురు. వారికి దశకము తెలియదు. (Decimal system) దశాంశ పద్ధతిని మొదలు కనిపెట్టినది హిందువులు. నేటికిని తురేనియు (Turanian race జాతి డజన్లతోనే వ్యవహారాలు చేసుకొందురు. వాల్మీకి కాలములో ఏక సంఖ్య మొదలుకొని మహౌఘమువరకు సంఖ్యానామము లేర్పడియుండెను. (“కోట్యాపరార్థేశ్చ” అయో. 15-48). అది వారు పొందిన గణితశాస్త్ర పరమావధి. మనవారు 4500 ఏండ్ల క్రిందటనే మిలియన్ (10 లక్షల) పేరుకంటె ఊహించజాలనట్టి అంకెల పేరులను కనిపెట్టి ముందునకు సాగిపోయిరన్న వారి ప్రజ్ఞాబలముయొక్క ఉచ్చస్థాయి కానవచ్చు చున్నది ఎట్లనగా నూరు లక్షలు కోటి, అటుపై శంఖము, మహాశంఖము, బృందము, మహా బృందము, పద్మము, మహా పద్మము, ఖర్వము, మహా ఖర్వము, సమ ద్రము, ఓఘము, మహోఘము అను సంఖ్యలను పేర్కొనిరి. (యుద్ధ. 28-34 నుండి 39 వరకు) ఇట్టి గణిత విజ్ఞాన మానాడే ఏర్పడినందున తర్వాతి కాలములో ఆర్యభటుడు, వరాహమిహి 150 రామాయణ విశేషములు రుడు, భాస్కరాచార్యుడు మున్నగు గణితాచార్య శేఖరులు హిందువు లలో ఉత్పత్తియైరి. వారు వ్రాసి పెట్టి పోయిన గణిత రహస్యములను పాశ్చాత్యు లిప్పుడు క్రొత్తగా పై మహోపాధ్యాయులు గతించిపోయిన 1500–2000 ఏండ్ల తర్వాత కనిపెట్టుచున్నారు! కాని గ్రీకు పండితులైన ప్రాచీన యూక్లిడ్, ఆర్కిమిడీసు పేర్లను ఎల్లప్పుడును విసుగులేకుండా పొగిడే మన యింగ్లీషు ప్రభుజాతికి బానిసజాతిలోని వరాహమిహిర భాస్కరాచార్యాదులు ఎన్నడును కానరారు! శుల్బసూత్రాలను యెత్తుకో నరు! అయితే సున్నను ప్రాచీనమందు కనిపెట్టలేదు. క్రీ. శ. 800 తర్వాతనే సున్న హిందువులచే మొదటిసారి కనిపెట్టబడెనని చరిత్రకారు లన్నారు. (చూ. National History of Indian people Vol_VI. P. 418) రామాయణములో చాతుర్వర్ణ్యముల వర్ణనము పలు తావులలో కలదు. "శూద్రాఃసర్వధర్మనిరతాః" (బా.6-18) అని ఆదిలోనే కలదు. ఈ గ్రంథమందు రామకాలమని నిర్ణయించిన క్రీ. పూ. 2500 ప్రాంత మందు బుద్ధభగవానుని కాలమందు ఘనీభవించిన జన్మప్రాముఖ్యముకల నాలుగు వర్ణములుండెనా? అందు శూద్రజాతి యుండెనా? శూద్ర చర్చకల భాగాలు ప్రక్షిప్తమనవలెనా? అనునవి చర్చనీయములు. వేదములలో ఋగ్వేదమే సంపూర్ణ ప్రామాణిక గ్రంథము. తర్వాతివాటిలో అర్వాచీ నత్వము, ఖిలత్వము, ప్రక్షిప్తము అను విషయాలు కలవని అనేకులు విమర్శించిరి. ఋగ్వేదమంతటను త్రైవర్ణికులే వర్ణితులు. వారికన్న తక్కువగా భావింపబడినవారు దస్యులు. వారార్యుల పొరుగుభూముల వారై శత్రువులై జితులై యుండినట్టివారు. అందుచేత దస్యశబ్దమునకు “దాస” (బానిస) అనియు, దొంగ అనియు అర్థమిచ్చిరి. అవి ద్వేష మువలన కల్పితమైన యర్థములు పరాజితులను బానిసలుగా నేలుట సర్వ ప్రపంచ మఁదాచారముగనుండెను అట్లున్నను దస్యులతో త్రైవర్ణికులు బాంధవ్యము చేసిరి. కవష ఐలూషుడు దస్యుడేకాని ఋషియయ్యెను. రామాయణ విశేషములు 151 ఋగ్వేదమంత్ర ద్రష్ట యయ్యెను. దస్యులు అనువారే దహ్యులు. వారు హిందూకుష్ పర్వత పశ్చిమవాసులు. ఫార్సీలో సకారము హకార మగుటచేత దస్య-దహ్య శబ్దములు రెండునొక్కడే! అటైతే శూద్రశబ్దము ఋగ్వేదములో లేదాయనిన కలదు. ఒకే చోట కలదు అది పదవ మండలమున పురుషసూక్తమున కలదు. అంత పెద్ద ఋగ్వేదములో అందును తుదిలో, అందును ఒకేఒక్క మారే శూద్రశబ్దము కనబడుటయేల? అది తర్వాత చేర్చబడిన సూక్తమనవలెనా? నాలుగు వర్ణాలకు జన్మప్రాధాన్యము కలిగిన తర్వాత ఋగ్వేదములో ప్రవేశింపబడియుండునా? అను సందేహము విమర్శకులకు కలిగినది. ఏ. నందీగారు ఇండియన్ ఎక్నాలజీలో ఇట్లు వ్రాసినారు “పురుష సూక్తము తర్వాతికాలములో దూర్చబడినది" (interpolation).యూరోపు ఖండ వేదవిమర్శకు లందరును నీ విషయమున నేకాభిప్రాయులు. కారణ మేమనగా ఋగ్వేదములోని భాషతో నీ సూక్తభాష భిన్నించినది. “దీని స్వరూపములో, శబ్దజాలములో ఇది ఆర్వాచీనమైనది ఇందు పూర్తిగా యజ్ఞవిధాన వర్ణనమున్నది. ఇందు వేదాంత పారిభాషిక పదాలున్నవి. ఇందు వసంత గీష్మ శరదృతువులు ముందువరుసగా వర్ణితములు. నాలుగు వర్ణాల ముచ్చటకలు దిదొక్కటే యొక్కటి. దీని యర్వాచీ నత్వము దీని భాషయే పట్టించును. నిదాఘమును తెలుపు గ్రీష్మ పదము ఋగ్వేదమందెందును ప్రయుక్తము కాలేదు. వసంత పదము వేదకవుల కలవాటైన పదముకాదు. ఋగ్వేదములో ఆది మరొక్కమారే, అదియు పదవమండలములోనే (184_4) వచ్చినది" అని మోక్షమూలుడు నిర్ణ యించెను. గ్రేస్ గారును ఇట్లేయన్నారు: “నాలుగు వర్ణములు మంత్రాలు చాలా ఇటీవలివే. ఈ మంత్రాలభాష అవైదికము. ఇవే పురాణములోనై న నుండిన నందివి బాగుగా అతికిపోయెడివి. మరియు సందర్భరహితముగా 152 రామాయణ విశేషములు ఈ మంత్రాలిరికినవి. ఎట్లన "బ్రాహ్మణోస్య ముఖమాసీత్ పద్భ్యాం శూద్రోజాయత" అనిన వెంటనే అదే ఊపులోనే ఇంద్రా గ్నులు విరాట్పురుషముఖమునుండి, భూమి పాదమునుండియు జనించే నన్నారు.” (సెన్సస్ రిపోర్టు 1871 సం1. పు. 2-30). ర మేశ చంద్ర దత్తుగారు పదవమండల మంతయు తర్వాతికాలమున అతికించినదే అని భావించినారు. వారనేక యుపపత్తులతో నిరూపించి మరల నిట్లన్నార రు: “పదవ మండలములో బహు ఋక్కులకు కర్తలు దేవతలట! ఇదొక్కటే ప్రక్షి ప్రకారుల దొంగతనమును పట్టించును. (ఏకాషంట్ ఇండియా పు. 38). కోల్బూకు ఇట్లే నిర్ణయించెను. “ఇతర సూక్తాలు మోటుగాను ఈ సూక్తము శ్రావ్యముగాను రచించుట దీని అర్వాచీనత్వమును పట్టిం చును" అనియనెను. వెబర్, మ్యూర్, మరి యితరులందరును ఈ సూక్త మాధునిక యనియే తేల్చిరి. ఋగ్వేదమఁదుగూడ స్వార్థులు హ సక్షేపము చేసిన యేది దిక్కు? కంచెయే చేనుమేసిన యెట్లు? ఈ చర్చయట్లుండనిండు. శూద్రపదమునకు చారిత్రకాధార మేమో కనుగొందము. శూద్రులు కాళ్లలో పుట్టినవారు కారు. ప్రాచీనకాలమందు ఆర్యులు సింధూదేశములోనికి ప్రవేశించిననాడు అచ్చట నుండిన ఆదిమనివాసులగు “శూద్రులు" అను జనులతో అతి ఘోరముగా పోరాడవలసి వచ్చెను. ఆ శూద్రవర్గమువారు మహావీరులు. కాని యార్యులవద్ద మేలైన యాయుధాలుండెను. తుదకు శూద్రులోడి బానిసలైరి. అందుచేతనే మనుస్మృత్యాదులలో శూద్రులకు హక్కు లేకుండుట. వారెల్లప్పటికి త్రైవర్ణికుల సేవచేయుట, వారు సంపాదించిన దంతయు బ్రాహ్మణాదులకు చెందుట, వారు పై వారితో సింహాసనమందు కూర్చునిన పిర్రలు కోయుట, "పద్యుహవాయ ఏతత్ శ్మశానో" శూద్రః అనుట, "శూద్రాయమతిం నదద్యాత్" అనుట, వేదముచ్చరించిన “జిహ్వాచ్ఛేదం కారయేత్" అనుట. వేద వాదము వినిన "త్రపుజతుభ్యం కర్ణాని పూరయేత్" ఆనుట, ఇవన్నియు సంపూర్ణముగా బానిసల 66 రామాయణ విశేషములు 153 లక్షణాలే కాని ఏదోకొంతయైన స్వేచ్ఛగల జాతిలక్షణాలు కానేకావుకదా! అయితే శూద్రులు కైబరు కనుమలవద్ద నుండిరనుట కేమి ప్రమాణము? అలెగ్జాండరు దాడి చేసినపుడతనితో యుద్ధము చేసిన వీర జాతులలో “ క్షుద్రక ” అను వర్గమొకటి. దానినే గ్రీకులు (ovydrakai) ఆక్సిద్రకై అనిరి. మరికొందరు వారిని శద్రీ (Sadrae) అనిరి. మరికొందరు గ్రీకు చరిత్రకారులు వారిని హిద్రకీ (Hydrakes) అనిరి. జీలం, రావీ నదుల మధ్య నుండిన అలెగ్జాండరు కాలపు వీరజాతిపేరు గ్రీకులో మాల్లాయి (Malloi). రావీ సల్లెజ్ నదులమధ్య నుండిన వీరజాతి పేరు అక్షుద్రకీ (ovydrakai). ఈ రెండు జాతులును ఏక జాతులనియు, మహావీరు లనియు, అలెగ్జాండరు సైన్యాన్ని ప్రతిఘటించిన వీరజాతియనియు గ్రీకు చరిత్రకారులు వ్రాసిరి. అలెగ్జాండరు కన్న ముందు ఇంచుమించు అతనికి వేయియేండ్లకు ముందు పై ముద్రక వీరజాతి ఆర్యులతో నిరం తరము తమయొక్కయు తమ యాదినివాసము యొక్కయు స్వాతంత్ర్య మునకె పోరాడి తుదకోడి యుందురు. అలెగ్జాండరు మల్లాయిలను క్షుద్రకులను ఓడించి వారినెట్లు వరుసబెట్టి చంపించెనో గెలిచిన ప్రాచీనార్యులును క్షుద్రకులను ఘోరముగా బాధించియుందురు. తుదకు వారిని బానిసలుగా చేసిరి. వారిని నాల్గవ వర్ణముగా తమ సేవకులనుగా నేర్పాటు చేసుకొనిరి. పర్ష్య ప్రాంతపు ప్రాచీన దహ్య (Dahae) (దస్య) జాతినెట్లు గెలిచి బానిసలుగా చేసియుండిరో సింధునదీ ప్రాంతాల లోని క్షుద్రకులను తర్వాతికాలములో గెలిచి బానిసలుగా చేసికొనిరనిన సత్యదూరము కానేరదు. క్షుద్రకులే తర్వాతి శాస్త్రపురాణాలలోని శూద్రక, శూద్రజాతివారైరని తలతును. తర్వాత యార్యులు గంగా ప్రాంతము, వింధ్య ప్రాంతము, దక్షిణా పథము, వంగ ప్రాంతమును ఆక్రమించుకొనినప్పు డక్కడి కార్మిక వర్గములను తమకు పసందుకాని వారిని, తమ్మెదిరించినవారిని, తమ యాచారములను స్వీకరింపనివారిని శూద్రజాతిలో చేర్చినట్లూహింతును. ఈ శూద్ర చర్చ యంతయు నా యూహయే. తప్పో ఒప్పో తోచినది వ్రాయనై నది. రామునికాలమందలి ఆశ్రమజీవనమును గురించి విపులముగా వ్రాయవలసిన అవసరము కానవచ్చుచున్నది. అయినను విషయవిస్త 154 రామాయణ విశేషములు రమ ఇప్పటికే ఏర్పడిపోయినది. అందుచేత దానిని వదలినాను. ఆభి లాషులు అత్రి భరద్వాజాగస్త్య మహర్షుల సంబంధమగు భాగములను చదివిన విశదమగును. ఆర్యావర్తమేది? అను విషయము చర్చనీయ మగుచున్నది. “వాల్మీకి భూగోళము” అను ప్రకరణమును వేరుగా వ్రాయుచున్నాను. అందీచర్చ చేయుదును. అతి ప్రాచీనకాలములో అనగా ఋగ్వేద కాలములో ఆర్యావర్తము ఇప్పటి భారతదేశ మనబడు భూభాగమందే లేకుండెనని నా కనుమానము కలుగుచున్నది రామాయణ కాలమువరకు అయోధ్యయే ఆర్యావర్తానికి తూర్పుహద్దనియు, గంగయే దక్షిణపు హద్దనియు నేనభిప్రాయపడు చున్నాను. ఈ విషయములో సనాతన పండితులు వివాదపడుదురని నే నెరుగుదును. అయినను నాకు తోచిన అభిప్రాయమును ముందు వెల్లడింతును. రాముని కాలములో ఆర్యులు తమ సంస్కృతిని గంగకు దక్షిణభాగమందు వ్యాపింపజేయు నుద్దేశ ముతో భరద్వాజుడు, అత్రి, అగస్త్యుడు మున్నగు ఋషులు దక్షిణభాగ మందు అందందు ఆశ్రమములను స్థాపించుకొని ఆర్యమత సంస్కృతు లను వ్యాపింపజేయు నభిమానము కలవారై యుండినట్లు కానవచ్చు చున్నది రాక్షసులచేత ఆవరింపబడిన జనస్థానములో ప్రాణములకు తెగించి అంతటి పట్టుదలతో అపాయస్థితిలో ఆశ్రమజీవనమును ఈ మునులు గడుపవలసిన వేరే అవసరము కానరాదు. ఆర్యుల వలసకు (Colonisation) వీరు నాందీభూతులై యుండిరి. దక్షిణా పథమందు ఆదేపనిగా దుష్టులను శిక్షించి నిర్మూలించుటకై అగస్త్యుడు వెళ్ళెనని రామాయణమందు స్పష్టముగా తెలిపినారు. నిర్జితా జీవలోకస్య తపసా భావితాత్మనా అగ స్త్యేన దురాధర్ష్యా మునినా దక్షిణేవ దీక్-(యుద్ధ 118-14) ఈ విధముగా రామాయణ కాలమందు సాంఘికాద్యాచార వ్యవహా రములు వర్తించుచుండెనని తెలుసుకొనగలుగుచున్నాము. ఇంతదూరము వ్రాసి ఇదంతయు సంగ్రహ విషయమే అని చెప్పవలసియున్నది. సూక్ష్మమముగా తరచుకొలది ఇంకను అనేకాంశములు పరిశోధకుల దృష్టికి వచ్చుచుండును.