రామాయణ విశేషములు-3

3

రామ వాల్మీకుల కాలము

శ్రీరామచంద్రుడు ఈ భరతఖండములో ఎప్పు డుండెనో నిర్ణయించుట మహాకష్టము. అట్టి నిర్ణయ మంతయు ఊహాప్రపంచములో నుండునట్టిది. ఈ విషయములో మనపురాణాలు అంతగా సహాయపడవు. ప్రాచీన మహాపురుషులు, మహర్షులు మానవాతీతులనియు, అద్భుత కార్యములు జేసిరనియు, వేనవేలయేండ్లు జీవించిరనియు పురాణాలలో వ్రాసినారు. శ్రీరాముడు త్రేతాయుగములో నుండెననియు, శ్రీకృష్ణుడు ద్వాపరయుగములో నుండెననియు కొందఱు వ్రాసిరి. ఒక్కొక్క యుగము లక్షల సంవత్సరాల కాలముతో కూడియుండునని పురాణకారులే నిర్ణయించినారు. త్రేతాయుగము 12 లక్షల 96 వేలేండ్ల వరకుండెను. ద్వాపరము 8 లక్షల 64 వేల యేండ్లుండెను. కావున శ్రీరాముడు పౌరాణికుల లెక్కలప్రకారము కలియుగసంవత్సరాలు కలుపుకొని, వారు జీవించిన 11 వేల యేండ్లను కలుపుకొని, త్రేతాయుగము తుదిలోనే యుండెనని తలచినచో ఇప్పటికి కనిష్టము 21,78,000 యేండ్లకు పూర్వుడుగా నుండి యుండవలెను. శ్రీరాముడు పదకొండువేల యేండ్లు జీవించెననుటకు ప్రమాణము.

శ్లో. హత్వా క్రూరం దురాత్మానం దేవర్షిణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ బాల 15 స. 28 శ్లో.

రాము డిన్ని వేల యేండ్లు బ్రతికినది, ఇన్ని లక్షల యేండ్లకు ముందుండినదియు విశ్వసనీయము కాదు. అతడు శ్రీకృష్ణునికన్న పూర్వికుడని మాత్రము తెలియ వచ్చుచున్నది. చారిత్రక దృష్టితో వీలయినంతవరకు అతని కాలము నిర్ణయించు ప్రయత్నము చేయుదము. మొదట పాశ్చాత్య సాంస్కృతిక పరిశోధకుల యభిప్రాయము కనుగొందము. "కెప్టన్ ట్రాయర్" ఇట్లు వ్రాసెను: “హిందువుల గొప్ప రాజ్యాలు మా క్రీస్తుశకమున కంటే కనిష్టము 8000 యేండ్లకు ముందే చాల నాగరికత పొంది యుఁడెనని విశ్వసింతుము. అంతకు పూర్వమే రామాయణ కథానాయకుడైన రాముడు ఉండెనని చెప్పవలసియున్నది.[1] పాశ్చాత్య పండితులలో రామునికి ఇంతటి ప్రాచీన కాలమును నిర్ణయించినవారు ఈ ట్రాయర్ పండితులొక్కరే. ప్రొ. హీరెన్ గారు ఇట్లు వ్రాసినారు:

“అయోధ్యానగరము క్రీ.పూ. 1500 నుండి 2000 ప్రాంతములో నిర్మింపబడినదని చెప్పినచో అదెన్నటికిని అతిశయోక్తి కానేరదు.”[2]

పౌష్ (Fauche) అను ఫ్రెంచి పండితుడు క్రీ. పూ. 1320 లో రామాయణము రచింపబడెనని వ్రాసెను. ఇటలీ భాషలోనికి రామాయణమును భాషాంతరీకరించిన గొర్రెసియో (Gorreso) అను నతడు క్రీ.పూ. 1400 లో రామాయణము రచింపబడినట్లు అభిప్రాయపడెను. ఆర్ధర్ లిల్లీ అనువాడు ఇట్లు వ్రాసెను: “ప్రపంచములో రచితములయిన గాథలలో రామాయణము ఉత్తమస్థానము వహించుచున్నది. అది 30 లేక 40 శతాబ్దములనుండి ప్రచారమందున్నది.” మొత్తముపై చాలామంది పాశ్చాత్య పండితుల అభిప్రాయములో క్రీ. పూ. 1400 ఏండ్లకన్న పూర్వములో రామాయణము లేకుండెను. మరొక పాశ్చాత్యపరిశోధక వర్గమువారి అభిప్రాయములో రామాయణ మూలకథ క్రీ.పూ. 500 కంటే ముందుగానే రచింపబడెను. అటుతర్వాత క్రీ.పూ. 200 నుండి దానిలో చాలా భాగాలను పెంచుచు వచ్చిరి. ఈ అభిప్రాయమును “మెక్డోనెల్” గారు తమ “సంస్కృత వాఙ్మయ చరిత్ర" అను ఆంగ్ల గ్రంథములో వెలిబుచ్చిరి.

రమేశచంద్రదత్తుగారు ఇట్లభిప్రాయ పడినారు: "రామాయణ మూల రూపగ్రంథము ఎప్పుడు రచింపబడెనో చెప్పుటకు వీలులేదు. సూత్రవాఙ్మయములో మహాభారత సూచనలున్నవిగాని రామాయణమును గురించి యేమియు కానరాదు. కీ. పూ. 500 ప్రాంతములో విజయుడను వంగరాజు సింహళద్వీపమును జయించెను. అయితే సింహళము ఆర్యులకు అంతకంటె చాలాకాలానికి పూర్వమే విదితమైయుండెను. వింధ్యకు దక్షిణమున ఆటవికు లుండిరి. కోతులే విశేషముగా నుండెను. ఈ దక్షిణ భాగములో ఆర్యనాగరికత వ్యాపించినట్లు రామాయణములో తెలుపలేదు. ఈ కారణాలచేత రామాయణము పౌరాణిక యుగముయొక్క తుది భాగములో రచింపబడియుండును."* పౌరాణిక యుగము రమేశచంద్ర దత్తు యభిప్రాయ ప్రకారము క్రీ. పూ. 1400 నుండి క్రీ.పూ. 1000 వఱకు వ్యాపించియుండెను.

రమేశచంద్రదత్తుగారు ఒక్క యంశాన్ని బాగా కనిపెట్టినారని తోచుచున్నది. రామాయణములో శ్రీరాముని విష్ణ్వవతారముగా వర్ణించినారు. కాని దత్తుగారి అభిప్రాయములో విష్ణు వప్పటికి పౌరాణికులలో ప్రాధాన్యమునకు రాలేదు. ఇంకను ఇంద్రునకే ఆధిపత్య ముండెను. అట్టి యాధిపత్యమును శ్రీకృష్ణుడు తొలగించెను అని దత్తుగారు వ్రాసి దానికి సహకారముగా పారస్కరగృహ్యసూత్రములో (2-17-9) నాగేటిచాలు దేవత అనగా “సీత” ఇంద్రుని భార్యగా వర్ణింపబడినదని వ్రాసినారు.

  • Early civilization of India by R. C. Dutt, Vol II

"జనకుడు సీతయొక్క తండ్రి. అతడు యాజ్ఞ్యవల్క్య, శ్వేత కేతు, ఆరుణేయాదులకు బ్రహ్మవిద్యను బోధించెనని శతపథ బ్రాహ్మణములో వర్ణించినారు. యాజ్ఞవల్క్య వాజసనేయి అను నతడు జనకుని ఆస్థానపురోహితుడు. అతడు యజుర్వేదపృథక్కరణమును చేసెను. శుక్ల యజుర్వేదము, శతపథ బ్రాహ్మణము అను భాగాలుగా చేసెను” అని దత్తుగారు వ్రాసినారు. దీనినిబట్టి శతపథబ్రాహ్మణ రచనాకాలములో రామాయణము రచింపబడెనని వారి యభిప్రాయము.

సాధారణముగా పాశ్చాత్యుల జాడలలోనే మన హిందూస్థాన పండితులును నడతురు. పాశ్చాత్యులు కొన్ని చారిత్రకపు మైలురాళ్ళను స్థాపించుకొన్నారు. “యవన" అనేది ఒక మైలురాయి. ఆది క్రీ. పూ. 325 లో అలెగ్జాండరుతో మన దేశానికి దిగుమతి అయినది. ఆ కాలము లోను అంతకుముందు 300 సంవత్సరాలలోను సూత్రాలు వ్రాయబడినవి. ఆది రెండవ మైలురాయి. అంతకంటే 800 ఏండ్లకుముందు బ్రాహ్మణా రణ్యకోపనిషత్తులు వెలసినవి. (అనగా - క్రీ.పూ. 1200 ప్రాంతములో) అది మూడవమైలురాయి. బ్రాహ్మణములకు సూత్రములకు మధ్య కాలములో ముఖ్యపురాణాలు ప్రకాశమానమైనవి. అంతకంటే మరి అయిదారు నూర్ల మీడ్లకు ముందుకు వెళ్ళితే వేదాలకాలములో పడి పోతాము. అనగా క్రీ. పూ. 2000 ఏండ్ల కంటే ముందుకాలములో వేడాలు లేకుండెను. అది నాల్గవ మైలురాయి. ఈ విధముగా పాశ్చాత్య విమర్శకులు విమర్శించుతూ వచ్చినారు. ఇటీవల మోహ౯ జోదారోలోను హరప్పాలోను బయలుపడిన శిల్పాలను వివిధ వస్తువులనుబట్టి అచ్చటి నాగరికత క్రీ.పూ. 3000 ఏండ్లకన్న పూర్వముదని అంచనాలు వేయుట చేత పూర్వసిద్దాంతాలు తారుమా రగుచున్నవి. పైగా డాక్టరు ప్రాణనాథ గారు క్రీ. పూ. 4000 ప్రాంతమం దీ మోహన్ జోదారో నిర్మాణాలు జరిగే నని వాదించుచున్నారు. వారు ఋగ్వేద దశమమండలానికి ఈజిప్టులోని అతిపురాతన పిరమిడ్లనాటి రాజులకును ముడిపెట్టుచున్నారు. చర్చ మనకు సంబంధించినది కాదు చెప్పబోయిన దేమనగా, రామాయణ మూలగ్రంథ రచనయు, రాముని యునికియు, వాల్మీకి కాలమును క్రీ.పూ. 1400 కంటె పూర్వముదనియు, బహుశా క్రీ.పూ. 2500 ఏండ్ల నాటిదనియు నేను అభిప్రాయపడుచున్నాను. రామాయణము భారతము కన్నను పూర్వముదనుటలో సందేహములేదు. ఒక రిద్దరు అది తర్వాతి రచన యనినను అది రామాయణమందలి ప్రక్షిప్తభాగానికిమాత్రమే వర్తించును. మహాభారతములో రామాయణ కథాసంగ్రహము వ్రాయ బడినది. మరియు కొన్ని నీతులు రామాయణములోనివని చెప్పి యుదాహరించినారు. కావున మహాభారతము రామాయణముకున్న తర్వాతిదే.

మహాభారతకాలము

మహాభారత వీరు లుండిన కాలమును గురించి మహాభారత యుద్ధము జరిగిన కాలమును గురించి వివిధ పరిశోధకులు వివిధరీతిగా అభిప్రాయము లిచ్చినారు. శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ మహాభారత చరిత్రములో ఇట్లు వ్రాసినారు :

“మహాభారత యుద్ధకాలమునుగురించి ప్రాక్పశ్చిమదేశస్థ గ్రంథ కర్తల అభిప్రాయములు క్రింద నిచ్చుచున్నాను. పంచాంగక రలు క్రీస్తునకు పూర్వము 8100 ఏండ్లు కల్హణుడు 2447 " " " సుధా(ర)క రుడు 2447 " 1565 " " భాగవతము మత్స్య పురాణము వాయు పురాణము = "" " " విష్ణు పురాణము ధీరేంద్రనాధపాలు బంకించంద్ర బాలగంగాధరతిలకు

" 1530 1520 "" 1400 " కోల్ర్బూకు " " " " " " విల్సస్ ఎలిఫిన్ స్టన్ విల్ఫర్డు జకానన్ ఫ్రాట్ " " " " " 1 1870 " " 1300 " 1300 "

శ్రీ పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు తాము స్వయముగా “భారతయుద్ధము క్రీస్తునకు పూర్వము 16 శతాబ్దమఁదు జరిగిన "దని వ్రాసినారు. మోహన్ జోదారో పరికరాలను బట్టి పరిశోధకుల అభిప్రాయములో ఆర్యుల నాగరికత క్రీ. పూ. 8000 ఏండ్లకు పూర్వమునుండియే వచ్చినదని వ్రాసినది సమంజసముగా కనబడుచున్నది దానినిబట్టి రామాయణము 2500 ప్రాంతములోనిదని ఊహింపవచ్చును. మహాభారత రచనాకాల నిర్ణయము నీ చర్చలో ప్రధానముగా పెట్టుకొనుట అప్రస్తుత మగును. టూకీగా ఇంతమాత్రము చెప్పవచ్చును.

భాగవత, మత్స్య, వాయుపురాణములలో మహాభారత కాలము క్రీస్తునకు పూర్వము 15725 అని నిర్ణయింపబడినది విష్ణుపురాణములో క్రీ. పూ. 1580 అని చూపబడినది. అదంత వ్యత్యాస హేతువు కాదు. ఈ నాలుగు పురాణాలలోని రాజవంశావళి కాలాలను అబద్దమని త్రోసివేయ వీలులేదు. కావున మహాభారత యుద్ధకాలము క్రీ. పూ. 1585 గా గ్రహింపవచ్చును. రామాయణ కాలములో వింధ్యకు దక్షిణముననుండిన దేశాలు అరణ్య ప్రదేశాలై యుండెను. మహాభారత రచనాకాలమునాటికి అచ్చట నానానగరాలు, మండలాలు, ప్రభుత్వాలేర్పడెను. కురుపాండవుల పక్షముగా దక్షిణదేశమునుండి, ఆంధ్రపాండ్యాది ప్రభుత్వాలవారు గొప్ప సేనలతో సహాయార్థమై వెళ్ళిరి. అటవీప్రదేశము నాగరకత చెందిన దేశముగా మారుటకు 800 ఏండ్లయినను పట్టియుండును. ఈ విధముగా చూచినను రామునికాలము క్రీ. పూ. 2500 పూ. 2500 నాటిదై యుండును. (Count Bjornstjerna) జోరెన్సు జొర్నాగారు మహాభారతము క్రీ.పూ. 2000 కన్న పూర్వమున్నదని అభిప్రాయపడినారు. ఈ కారణముచేతను రామాయణము క్రీ. పూ. 2500 నాటి దనవలసియుండును.

ఇంద్రపూజాప్రాముఖ్యము

రమేశచంద్రదత్తుగారు ఒక అంశాన్ని స్పృశించి విడిచినారు. ఆది యింద్రపూజను గురించిన చర్చ. వైదిక పౌరాణికయుగాలను నిర్ణ యించుటకు ఇంద్రపూజ ఒక మంచి మైలురాయి. ఇంద్రపూజ విశేషముగా నుండెనా అది వేదకాలానికి సంబంధించినది. వైష్ణవప్రాముఖ్య మెక్కువగా నుండెనా అది భారతకాలము తర్వాతది అని నిర్ణయింపవలసి యుండును. మహాభారతములో శ్రీకృష్ణుడు గోవర్ధనధారిగా వర్ణింపబడినాడు. శ్రీకృష్ణుడు తన కాలములో వర్తించుచుండిన ఇంద్రపూజను తొలగించి విష్ణుపూజను ప్రచారములోనికి తెచ్చెను. ఈ మార్పుచేత ఇంద్రునికి కోపము వచ్చుననియు అతనివల్ల అందరికిన్నీ మహాబాధ కలుగుననియు జనులు భయపడిరి. అందులకు తగినట్లుగా అప్పుడు పానగండ్ల వర్షమున్నూ ధారావర్షమున్నూ విపరీతముగా దినాలపేరట కురిసెను. జనులు భయభ్రాంతులైరి. కృష్ణుడు వారికి ధైర్యము చెప్పెను. ఇదే గోవర్ధనగిరి గాథా విశేషమైయుండును. కృష్ణుని జీవితములో ఒకటి రెండుమార్లు ఇంద్రునితో కలహము కలిగినట్లు కనపడుచున్నది. పారిజాతముకొరకై ఒక తడవ యుద్ధము జరిగెను. దీనినిబట్టిచూడ ఇంద్రాధి పత్యము శ్రీకృష్ణుని కాలములో తొలగింపబడెను. వైష్ణవతత్వమునకు ప్రాముఖ్యమియ్యబడెను. అయినప్పటికినీ ఇంద్రుడు పెద్దవాడుగను విష్ణువు తమ్ముడుగను (ఉపేంద్రుడుగను చాలాకాలము చిత్రింపబడుచు వచ్చినారు. పూర్వ వాసన త్వరగా పోనందున ఈ సమాధానము పౌరాణికులచే కల్పింపబడినట్లున్నది. రామాయణములో అయిదారు లావులలో ఇంద్రపూజను గురించిన ముచ్చట వ్రాయబడియున్నది. ఇంద్రధ్వజ ఇవోద్ధూతః పౌర్ణిమాస్యాం మహీతలే ఆశ్వయుక్సమయే మాసి గతశ్రీకో విచేతనః. -కిష్కింధ 16-87 అధోక్షితః శోణితతోయ విస్రవైః సుపుష్పితాశోక ఇవానిలోద్ధతః విచేతనో వాసవసూను రాహవే విభ్రంశితేంద్రధ్వజవత్ క్షితింగతః. -కిష్కిం. 16-39.

రాముడు వాలిపై బాణము విడిచినప్పుడు అతడు పూజానంతరము క్రింద పడద్రోయబడిన ఇంద్రధ్వజమువలె విగతచేతనుడై పడిపోయెనని వర్ణించు సందర్భములో పై శ్లోకములు కానవచ్చుచున్నవి. "గౌడదేశమందు ఆశ్వయుజ పూర్ణిమనాడు ఇంద్రునుద్దేశించి ఒక పెద్ద గడకు ధ్వజముకట్టి. పూజించి యుత్సవానంతరము దానిని పడద్రోయుట సంప్రదాయమై యుండెను” అని వ్యాఖ్యాతలు వ్రాసినారు. రామాయణకాలములో దేశ మంతటను ఆ యాచార ముందెనని మూలములో నుండుటచే గౌడదేశ జ మందే యుండెననుట సరికానేరదు. ఈ వర్ణనను బట్టి రాముని కాలములో ఇంద్రపూజకై ఆశ్వయుజ పూర్ణిమ నిర్ణయింపబడెననియు దేశమంతటను ఇంద్రపూజలు జరుగుచుండెననియు ఊహించు నవకాశమున్నది. ఇంద్ర పూజలు కేవలము భారతీయార్యులలోనే కాక ఏషియా మైనరులోని హట్టి దేశములోను క్రీ. పూ. 1400 ప్రాంతములోనుండెను. ఈ కారణముచే రామాయణము క్రీ. పూ. 1400 కంటె చాలా పూర్వముదగును. మహా భారతకాలము కలియుగాదిలో అనగా కలియుగమందు ఇంచుమించు 653 సంవత్సరాలు గడచిన తర్వాతిదని కల్హణ పండితుడు అభిప్రాయ మిచ్చినాడు. దుర్యోధనుని తొడలను భీముడు విరుగగొట్టినపుడు శ్రీకృష్ణుడు బలరామునితో కలియుగము ప్రవేశించినది కదాయని సమా ధానమిచ్చెను. శ్రీరాముడు భారతకాలముకన్న పూర్వుడు కాన అతడు క్రీ. పూ. 2500 లో నుండియుండవలెను. ఒక విధముగా శ్రీరామునికిని శ్రీకృష్ణునికిని అంతగా అంతరము లేకుండెనని నేను అనుకొనియుంటిని. ఈ విషయమునే నా హిందువుల పండగలు అను గ్రంథములో పరశురామజయంతి చర్చలో ఇట్లు వ్రాసినాను.

పరశురాముడెట్లు రామాయణ భారతకాలములందు రెండు యుగాంతరములందు జీవించెను? దీనివలన శ్రీరామ శ్రీకృష్ణుల కాలము లందు చాల వ్యత్యాసము లేదనియు ఇంచుమించు వీరు సమకాలికు లనియు చెప్పవచ్చును. పరశురాముడు రామాయణ భారతకాలములో నుండుటను సమన్వయించుటకై పౌరాణికులతనికి చిరంజీవిత్వసిద్ధి నియ్య వలసివచ్చెను. యథార్థమేమన, శ్రీరాముని వార్ధక్యదశలో శ్రీకృష్ణుడు బాలుడుగా నుండియుండును. రామాయణ భారతములందు కనబడు వీరులలో పరశురాము డొక్కడేకాడు హనుమంతుడు భారతములో వృద్ధుడుగా కానవచ్చుచున్నాడు. ఇంకను కలరు. ఎట్లనగా సౌగంధికాపహరణ సందర్భములో (2) బభ్రువాహనుడు —— ఇతడు బొంబవంతుని మనుమడు. ఇతడు భారతవీరులలో నొకడు. (8) విభీ షణుడు--నలుడు దక్షిణ దిగ్విజయానికి వెళ్లినప్పు డితడు లంకలో వృద్ధుడై రాజ్యము చేయుచుండెను. (4) పరశురాముడు ఇతడు వసిష్ఠుని మనుమడు. (5) సుగ్రీవుడు -- సహదేవుని దిగ్విజయములో చున్నాడు. * కనబడు

ఈ విధముగాచూచిన రాముడు శ్రీకృష్ణునికన్న 50 ఏండ్లు లేక 70 ఏండ్లకు పూర్వుడై యుండియుండును. కాని రామాయణములోని దేశకాల భౌగోళిక పరిస్థితులను బట్టి యాలోచించిన ఈ నిర్ణయమును రాముడు వింధ్యను సమీపించగా అచ్చటి నిరాకరించవలసియుండును. నుండి దేశమంతయు అరణ్యముగాను, నిర్జన ప్రదేశముగాను అందందు ఆటవికులతో గూడినదియునై యుండెను. వింధ్యాద్రి దక్షిణ ప్రాంతాన్ని దండకారణ్యమనిరి, దండుడు లేక దాండక్యుడు భార్గవుని బిడ్డను బలవంతముగా ఎత్తుకొనిపోయెననియు భార్గవునిశాపముచే అతని దేశమంతయు పాడుపడి పోయెననియు రామాయణమందే వ్రాసినారు. ఈ యంశమునే పురస్కరించుకొని చాణక్యుడును, వాత్స్యాయనుడును ఇట్లు వ్రాసిరి: సూ॥ యథా దాండక్యోనామ భోజః, కామాత్ బ్రాహ్మణక న్యా మభిగమ్యమానః సబన్ధురాష్ట్రా విననాశ.

పై యంశాన్ని బట్టి దాండక్యుడు భార్గవుని సమకాలికుడని స్పష్ట మగుచున్నది. రాముని కాలములో ఇంచుమించు ఆర్యులకు ప్రవేశములేని దండకారణ్యము శ్రీకృష్ణుని కాలములో రాజ్యాలతోను అభివృద్ధినొందిన ప్రాంతాలతోను నిండినట్లు మహాభారతమునుండి విశదమగుచున్నది. కావున సుగ్రీవ, హనుమంత, పరశురామ, విభీషణాదుల చిరంజీవితమును భారతకాలములో కూడ వా రుండిరను విషయమును ప్రక్షి ప్తము

  • హిందువుల పండుగలు, పుటలు 193-196
    • రామాయణము, ఉత్తరకాండము, 80-91 సర్గలు. రామాయణ విశేషములు 47

లనవలెను. రామునికిని కృష్ణునికిని మధ్య ఇంచుమించు 800 సంవత్సర ములు గతించియుండును. సిచు. వైద్యాగారు రామాయణ విమర్శనమును గురించి వ్రాసిరి. ఆంగ్ల గ్రంథములో ఇట్లు వ్రాసినారు: "అభ్యంకరు గారు, విష్ణుపురాణమఁదలి వంశావళులను లెక్కించి రామునికిని కృష్ణునికిని మధ్య 36 గురు రాజులు గతించిరని వ్రాసినారను దానిని బట్టి ఉభయులకు మధ్య 980 సంవత్సరాలైనను ఆంతరాయము ఉండెనని అత డభిప్రాయపడినాడు.”

ఇంతకుముందు చూపిన ఇంద్రపూజా ప్రాముఖ్యమును గురించి రామాయణమందు చాలా నిదర్శనములు కలవు. అగస్త్యాశ్రమములో ఒక్కొక్క వైదిక దేవతకు ఒక్కొక్క పూజావేదిక యుండెను. బ్రహ్మ, అగ్ని, విష్ణు, ఇంద్ర, సూర్య, చంద్ర, భగ, కుబేర, ధాతృ, విధాతృ, వాయు, నాగరాజ, అనంత, గాయత్రీ, వసు, వరుణ, కార్తికేయ, ధర్మ, దేవతలకు వేదికాస్థానములుండెను. (అరణ్య-12 సర్గ -17 నుండి 20 శ్లో. వఱకు)

ఇందు విష్ణు, అనంత, నాగ, కార్తికేయ, ధర్మ అను పౌరాణిక దేవతలుకూడా చేరినారు. అయినను వైదిక దేవతా ప్రాముఖ్యము చాలా వ్యక్తమగుచున్నది.

సాలమన్ కాలములో ద్రావిడ దేశమునుండి నెమిళ్ళు, కోతులు, చందనము మున్నగునవి యెగుమతి యగుచుండెనని తెలిపినాను. నెమిలిని "తుకి” అని తమిళములో అందురనియు ఆ పదమునే హిబ్రూవారు వాడిరనియు ఇతర దక్షిణభారతీయవస్తువులకును అట్టి తమిళ నామములనే వాడిరనియు పరిశోధకులు నిరూపించినారు. సాలమన్ క్రీ. పూ. 1000 ప్రాంతపు హీబ్రూరాజు. అట్టి కాలములో దక్షిణాపథము మహానాగరిక దేశమై యుండుటయు సముద్రప్రయాణమును మధ్యధరా సముద్రమువరకు ఓడలలో సాగించుటయు మనదేశమందు సిద్ధముచేసిన వస్తువులను అక్కడ అమ్ము చుండిరనిన దాండక్యుని కాలములోని నిర్జనా రణ్యమింతటి నాగరకస్థితికి రావలెననిన ఎన్నియో శతాబ్దములు పట్టి యుండును. కావున సాలమన్ కాలానికి 1000 లేక 1500 ఏండ్లముందు ఈ దక్షిణాపథము నిర్జనారణ్యమై యుండియుండును.

ఋగ్వేదములో రాముడు

శ్రీ పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ “రామోపా ఖ్యానము.....తద్విమర్శనము" అను గ్రంథపీఠికలో నిట్లు వ్రాసినారు:

"రామ రావణుల యస్తిత్వము కల్పితముకాక సత్యమే యనుటకు ఋగ్వేదమున నీక్రిందిరీతిని సూచింపబడియుండెను.

“ప్రతద్దుశ్శీమే పృథవానే వేనౌ రామే చ మసురే మఘ యే యుక్త్వాయ పంచ శతాస్మయుపధా విశ్రామ్యేషాం” వత్సు ఋగ్వేదము 10_93_14

అనగా "ఏ దేవత లైదువందల రథముల నశ్వములతో గూర్చు కొని మాయందు ప్రేమగలవారై యజ్ఞమార్గముచే వచ్చుచున్నారో ఆస్తోత్రము, పృథవానునియందును, వేనుని యందును, అసురుడు బలవంతుడగుచుండగా రామునియందును, ధనవంతులయందును జెప్పు చున్నాము.”

శాస్త్రిగారిచ్చిన యర్థము బోధయగుటలేదు. బలవంతుడగు అసురుడంటే రావణుడనియు అతని వధను రాముడు చేసెనను సూచన పై మంత్రములో నున్నదని శ్రీ శాస్త్రిగారి యభిప్రాయమై యున్నది. జతీంద్రమోహన్ ఛటర్జీగారు తమ “పృశ్నిగాథ"యను గ్రంథ పీఠికలో ఇదే మంత్రము నుదాహరించి దానికిట్లు అర్థము వ్రాసినారు: “మఘవంతుల (Magians ఈరాను దేశజాతి) సంఘమును గురించియు అసురను గురించియు (అహుర అను రూపముతో ఈరానులో పూజింప బడుచుండిన దేవత) ఇప్పుడు నేను అసాధ్యుడైనట్టియు (దుస్సీమ - Indomitable) బలవంతుడైనట్టియు, (పృథువాన్ Redoubtable) రామునితో (అనగా) వేనునితో మాట్లాడుచున్నాను.” ఛటర్జీగారి అభి ప్రాయములో రాముడు, వేనుడు ఉభయులును ఒక్కరే అయితే యీ వేను డెవడు?

"యజ్ఞ రథర్వా ప్రథమః ప్రథన్ తతే తతో సూర్యో ప్రతపావేన అజని" ఋగ్వేద – 1,8,3,5.

మొదట అథర్వానుడు (జరథుస్తుడు) యజ్ఞపథమును ఏర్పాటు చేసెను. తర్వాత సూర్యవంశమువాడును సత్యవంతుడును (ప్రతపా) అయిన వేనుడు వచ్చెను అని జతీంద్రుడు పృశ్నిగా థాపీఠికలో 'వ్రాసెను. అతని సిద్ధాంతము తృతీయ పంథగా ఉన్నది. దానిని కొన్ని మాటలలో తెలుపుచున్నాను.

ఋగ్వేదములో అసురులు మంచివారే, దేవతలకు అసురులకు భేదము లేకుండెను.

“సమిద్యే ఆగ్నౌ కృతమిద్ వదేమ మహద్ దేవానాం అసురత్వ మేకం" ఋగ్వే. 3-55-1.

  1. I cannot refuge credence to this fact Viz. that the great states highly advanced in civilization, existed at least 8,000 years before our era. It is beyond that limit that I look for Rama, the hero of the Ramayana.
  2. Prof. Heeren-Historical researches, Vol. II. Page 227.