రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ

మామకాభీష్టదాయ మహితమంగళం || ||రామ||


కౌసలేశాయ మందహాస దాసపోషణాయ

వాసవాది వినుత సద్వరాయ మంగళం || ||రామ||


చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ

హార కటక శోభితాయ భూరి మంగళం || ||రామ||


లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ

జలజ ఘతుక దేహాయ చారు మంగళం || ||రామ||


దేవకీ సుపుత్రాయ దేవ దేవోత్తమాయ

చావజాత గురువరాయ సర్వ మంగళం || ||రామ||


పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ

అండజాత వాహనాయ అతుల మంగళం || ||రామ||


విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ

సుముఖ చిత్త కామితాయ శుభగ మంగళం || ||రామ||


రామదాస మృదుల హృదయ, తామరస నివాసాయ

స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ||రామ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.