రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర/ఏడవ ప్రకరణము
ఏడవ ప్రకరణము
సహాయ కొత్వాలు
కాలము మారిపోయెను. నవాబ్ మీర్ మహబూబలీ పాషాగారు చనిపోయియుండిరి. జిల్లా పోలీసు సర్వాధి కారగు హెంకిన్ గారు ఉపకార వేతనముపై ఉద్యోగము నుండి విశ్రాంతి పొందియుండిరి. నిజామురాష్ట్ర ముసకు వచ్చిన ఆంగ్ల ఉద్యోగులలోను, దేశీయోద్యోగుల లోను ఇంతటి సమర్దుడు ఇదివరకు లభింప లేదని చెప్పవచ్చును. హేంకీన్ గారి కాలములో దేశమం దెందుచూచినను అల్లకల్లోలములు, దౌర్జన్యములు, దోపిళ్ళు జరుగుచుండెను. జిల్లా పోలీసు అధికారులలోను చాలమంది దౌర్జన్య యుక్తులుగా నుండిరి. పైగా వారికి పోలీసు విచారణా పద్ధతులు తెలియ నుండెను. అట్టి సందర్భములలో శాంతిని స్థాపించి, పోలీసు వారికి క్రమశిక్ష నిచ్చి, రాష్ట్రమునకు మహోపకార మొనర్చినారు. తెలంగాణములో బీద రైతులు ఇప్పటికిని హేంకిన్ గారిని తలచుకొను చుందురు. వారి నామమునుకూడ మార్చి
వారిని తెనుగువారినిగా జేసినారు. తెలంగానా జనులుహెంకినును వెంకన్న లేక యంకన్న అని పిలుతురు. నగరము లోని జిల్లా పోలీసు నాజిము కచ్చేరీని ఇప్పటికిని తెనుగుజనులు “యంకన్న కచ్చేరి" అని వాడుకొను చుందురు.వేంకట రామారెడ్డిగారు అతాఫుబల్దాను వదలి వనపర్తి రాజాగారు ప్రత్యేకముగా కోరినందున ప్రభుత్వమువారి అనుమతితో వనపర్తి రాజు గారి కార్యదర్శిగా పనిచేయు చుండిరని యిదివరకే వ్రాయబడినది. అట్లు వారు వనపర్తి లో నుద్యోగము చేయుచుండగా హైదరాబాదు నగరములోని కొత్వాలీ యుద్యోగములో కొన్ని మార్పులు జరిగెను.
నగరపు కొత్వాలుపని యనిన సామాన్యమైనది కాదు. ఉద్యోగము చిన్నదైనను ప్రాచీనమునుండి దాని ప్రాముఖ్య తనుబట్టి ప్రధానమంత్రి యుద్యోగము తర్వాత కొత్వాలీ యుద్యోగమే ప్రాధాన్యత వహించి యుండినట్టిది. కారణ మేమనగా హైద్రాబాదు నగరములో ప్రభువుగారును, గొప్ప నవాబులు, ప్రధానియు, ఇతర ముఖ్యాధి గారు లందరును నివ సింతురు. వారందరి యోగ క్షేమములు విచారించు కొనువాడు కొత్వాలు. పైగా కొత్వాలునకు ప్రతిదినము ప్రభువుగారి ప్రాపకముఁడుటచే ఉన్నతోద్యోగులు మొదలుకొని, గొప్ప కోటీశ్వ రులును, ధనికులును, బీదలను, అందరును కొత్వాలును గౌర
వముతో చూచుచుందురు. మరియు కొత్వాలు చేతి క్రింద సుమారు 3000 పోలీసు భటులును, వివిధోద్యోగులును, పని చేయుచుందురు.
పూర్వము కొత్వాలులు మహాప్రచండులై యుండి రనియు, వారు ఉచ్చరించినవే ఆజ్ఞలుగను, వారు వ్రాసినవే శాసనములుగను నుండుచుండినట్లు జనులు చెప్పుకొందురు.
మేకట రామా రెడ్డిగారు వసపర్తి లో నుండుకాలములో లాల్ ఖాన్ అను నతడు కొత్వాలు పని చేయు చుండెను. ఒక యింగ్లీషు వానిపై యేదో అభియోగము తెచ్చి కష్ట పెట్టుట అతని పతనమునకు కారణమ య్యెనని యందురు. ఇట్లుండ ప్రస్తుత నిజాము గారగు సవ్వాబ్ సర్ మీర్ ఉస్మానలీఖాన్ బహద్దరుగారు గుల్బర్గా ఉరుసును సేవించుకొనుటకై వెళ్లిరి. అచ్చట నవ్వాబ్ ఇమాద్జంగు బహద్దరు అను వారు మొదట జిల్లా పోలీసు నాజము " పని వేసి కొంత కాలము హైకోర్టులో కార్యదర్శిగా పనిచేసి, తర్వాత గుల్బర్గాలో రెండవమారు సెషన్ జడ్జిగ నియుక్తులై యుండిరి. నిజాం ప్రభువుగారు గుల్బర్గా ఉరుసునకు 'వేంచేసియుండినప్పుడు నవాబ్ ఇమాద్జంగుగారిని చూచి వారి శక్తి సామర్థ్యములను విచారించి మెచ్చుకొని తర్వాత వారిని నగర కొత్వాలుగ ఏర్పాటుచేసిరి.
పూర్వము గుల్బర్గాలో ఇమాద్జంజంగుగారు జిల్లా పోలీసు అధికారిగ నుండినప్పుడు వేకట రామారెడ్డి గారదే గుల్బర్గాలో మొహ తెమిమగ పనిచేయుచుండి”. ఆ సందర్భ ములో ఉభయులకును స్నేహము బాగుగా కదిరి యుండెను. పైగా ఒకరి గుణము లింకొకరికి బాగుగా పరిచితమైపోయెను.
ఇమాద్జంగు గారు కొత్వాలు పదవిని స్వీకరించిన తోడనే వారికి వేంకట రామా రెడ్డి గారు జ్ఞాపకమునచ్చిరి. నాకు తనకు ప్రధాన సహాయకులుగా నుండిన కాని తమ కచ్చేరీ వ్యవహార ములు సంస్కరింప బడజాలవని వారికి గట్టిగా స్ఫురించెను . అందుచేత వారు రెడ్డిగారిని వనపర్తి నుండి రప్పించుటకును తసకు ప్రధాన సహాయకులుగా నుంచుటకును ప్రభుత్వముతో వ్యవహారము సాగించిరి. ఆ సందర్బములో సర్ఫెఖాను కార్య దర్శిగారికి కొత్వాలు ఇమాద్జంగుగారు 1323 వ ఫసలీలో రెడ్డి గారిని తన శాఖకు పంపుమని ఇట్లు వ్రాసిం:- " నగర పోలీసు కచ్చేరీలో అత్యంతముగా విశ్వాస పాత్రుడైన వాని అవసరము కలదు. మరియు అనాడు పోలీసు పని యొక్క మంచి అనుభవము కూడ కలిగియుండిన వాడై యుండవలెను. లేకున్న మా కచ్చేరీలో ఏమియు సంస్కరించుటకు వీలు లేదు”. ఇట్టి గుణములు కలవారు రెడ్డి గారుతప్ప మరెవ్వరును లేరని ఇమాద్జంగు గారు వ్రాసి పత్రవ్యవహారము జరిపి రెడ్డిగారిని జిల్లా
పోలీసు శాఖనుండి నగర కొత్వాలీ శాఖ లోనికి మార్పుగా వించిరి. కేవలము మార్పు కావించుటయే కాక తనకు ప్రధాన సహాయకులను (అవ్వల్ మదర్గార్ కొత్వాల్) గా నెలకు 500 రూపాయీల జీతముపై వారిని నియమించిరి. రెడ్డిగారీ ప్రధాన సహాయ కొత్వాలీ పదవిలోనికి 12 బహిమన్ 1323 ఫసలీనాడు వచ్చిరి.
నవాబు ఇమాదుజంగుగారు మంచి దర్పముతో కూడి యుండినట్టివారు. నవాబీ పద్ధతి పై ఉద్యోగము నిర్వహించి నట్టివారు. పెద్ద పెద్ద అధికారులకును, జాగీర్దారులకును వారచిన భయము. క్రింది ఉద్యోగు లందరును సదా భయపడు చుండేవారు. వారి ఆజ్ఞ లనిన సింహస్వప్నములు, అల్లుండినను వాడు రెడ్డి గారి విషయములో మాత్రము సదా ప్రసన్నులై యుండిరి. వారిపై సంపూర్ణ విశ్వాసమును, నిండు (ప్రేమను, అధికాభి మానమును వహించి యుండిరి. వారి కాంపౌండు లోపలనే ఒక చిన్న బంగ్లాను రెడ్డిగారికి ఉచితముగా నివాసమునకై యిచ్చియుండిరి. అందుచేత రెడ్డిగారికి రాత్రిం బగళ్ళును వారి దర్శన మగుచుండెను. ఉభయుల దేశాభిప్రాయముగా నుండెను.
ఇమాదుజంగు గౌరు పోలీసుశాఖలో కార్యనిర్వాహమును, నగరములోని పోలీసు విధ్యుక్త చర్యల ఏర్పాటులను
స్వయముగా విచారించు కొనుచుండిరి. ఆ విషయములలో రెడ్డి గారికి జోక్యము లేకుండెను. కచ్చేరిలోని దఫ్తరము పనులన్నియు వారి వశము చేయబడియుండెను. వేంకట రామారెడ్డి గారు ప్రధాన సహాయకొత్యాలు అయినప్పటినుండియు పోలీసు కచ్చేరీలో, పోలీసు వారి విధులలోను, వారి ఏర్పాట్లలోను కొత్త కొత్త సంస్కారములు ప్రవేశ పెట్టి ప్రభుత్వము వారి అంగీ కారమును పొందుచు వచ్చిరి. అంతకు పూర్వము ప్రతి అమీన్ నాకాలో కూడ దప్తరము లుండుచుండెను. వీరు వచ్చిన తర్వాత అమీన్ల నుండి ఆ యధికారము తీసివేసి సదర్ అమానుల వద్దనే ఆ పనిజరుగు నట్లేర్పాటు చేసిరి. మరియు నిదేవిధ ముగా ఎన్నియో సంస్కారములు గావించిరి. తమ చేతి క్రింది వారితో దిట్టముగా పనితీసికొను చుండిరి. ఇట్లు వీరు పరిశ్రమీంచి సహాయపడుట చేతనే నవాబు ఇమాదుజంగుగారు తమ కొల్వాలీ నివేదికలో నొక మారిట్లు వ్రాసిరి: –
" మేకట రామారెడ్డిగారు ఈకచ్చేరీకి వచ్చినప్పటి నుండియు, కచ్చేరీ సమయములందే కాక ఇతర సమయములందును అపారమైన కష్టము లనుభవించి స్వయముగా పరిశీలించుచు ఏర్పాటులన్నిటి లోను లోపము లేనట్లుగా చేసియున్నారు. నేరము లన్నింటి యొక్క శాఖ వీరి అధీనములోనే యున్నది. అశాఖపై వీరు అతికఠినముగా విచారణలు కావించు
చుందురు. వీరు అత్యంతముగా విశ్వాస పాత్రులను, మంచి పరిశ్రము చేయువారును నై యున్నారు . వీరి మూలమున కొత్యాలీ కచ్చేరీలో సంస్కారములు కావించుటలో నాకు చాల సహాయము కలిగినది – నవాబు ఇమాదుజంగుగారు 1329 వ ఫనలీ వరకు కొత్యాలు ఉధ్యోగమును నిర్వహించుచు అదే సంవత్సరములో మరణించిరి, వేంకట రామారెడ్డి గారికి తామే కొత్వాలుగా నియమింప బడుదుగను నాశ లేకుండెను. హిందు స్థానమునుండి యెవ్వరైన కొత్త వారు వత్తురనియు, ఇంగ్లీషు అధికారి యెవ్వరైన నియుక్తు లగుదురనియు, వదంతులుండెను. ఇంకొక ముఖ్య కారణ మేమనగా, కొత్వాలీ యుద్యోగ చరిత్రలో నంతవరకు ఏ హిందువుకూడ నియక్తుడైయండ లేదు. పైగా వేంకట రామా రెడ్డిగారు 6 సంవత్సరములు ప్రథమ సహాయ కోత్వాలుగా నుద్యోగము నిర్వహించిన వాడైనను మ. ఘ. ప. నిజాంప్రభువు గారి సమక్షమున కెన్నడును వెళ్లిన వారు కారు. వారు ప్రతిదినము తమ బసకు పోవునపుడు ప్రభువుగారి దేవిడీ మీదుగనే పోవలసి వచ్చినను ఇంకొక చుట్టు బాటనుండి తమ యిల్లు చేరుకొనెడి వారు. వారంత గొప్ప యుద్యోగముచేసినను ప్రభువుగారి దేవిడీ లోనికి వెళ్ళయెరుగరు. ప్రభువు గారితో మాట్లాడుట కూడ వారికి తటస్థించ లేదు. ఇమాదుజంగుగారు చనిపోయిన కాలములో నవాబు ఫరీదూ ముల్కు అనువారు ప్రధాన మంత్రులుగా నుండిరి. ఇమాదుజంగు చనిపోయిన మూడవ దినమున ప్రభువుగారు వేంకట గామా రెడ్డిగారిని పిలిపించినారు. ప్రభువు గారి వద్ద ( పేషీలో) కార్యదర్శిగా నవాబ్ ఆజహర్ జంగ్ బహద్దరు అను వారు పనిచేయు చుండిరి. ప్రభువుగారితో ప్రథమపర్యాయము మాట్లాడవలసి వచ్చినందులకు రెడ్డి గారికి ఒక విధమగు భీతి కలిగెను. దర్బారు మర్యాద లెట్టివో, ఎట్లా చరించు కొన వలెనో, ఏమి అడుగుదురో, ఎమి చెప్పవలెనో. ఏమి పొరపా టగునో, ఏమి మాట వచ్చునో, ఏమో! అను తహతహ కలిగెను. ప్రభువుగారి ఆజ్ఞాబద్ధులై రెడ్డిగారు దేవిడీ ద్వారము వద్ద సేవలో నిలచినారు. ఆనాడు శుక్రవారము, నమాజుసమయము. ప్రభువు గారు దేవిడీ నుండి బయటికి విచ్చేసి నేరుగా సమాజుకై మక్కా మసీదుసకు వెళ్లిరి. వేంకట రామా రెడ్డి గారును వారి వెను వెంటనే మసీదువరకు వెళ్లి దూరముగా నిలిచియుండిరి. ప్రభువు గారు నమాజు చేసికొనిన తర్వాత “సహాయ కొత్వాలు ఎక్కిడ” అని : విచారించగా వారి పేషీలో నుండునట్టి నవాబ్ అజ్జర్ జంగు బహద్దరుగారు వెనుక భాగములో నిలిచి జంకుతు వెనుదీయుచున్న రెడ్డిగారిని ముందరకు నెట్టినారు. ప్రభువుగారు రెడ్డి గారిని నాలుగైదు మారులు ఎగదిగ అదేపనిగా చూచినారు. "సరే మంచిదిపో " అని సెలవిచ్చి దేవిడీకి వెళ్ళి “మరల ఆజ్ఞాపించు వరకు వేంకట రామారెడ్డి తాత్కాలిక కొత్యాలుగా పని చేయు చుండ వలెను." అని ఆజ్ఞాపత్రమును పంపినారు.
వేంకట రామా రెడ్డిగారు కొత్వాలీ యుద్యోగమును ఫసలీ 1326 వ సంవత్సరములో పొందినారు. మొదలు మొదలు ప్రభువుగారి సన్నిధికి వారు జ్ఞాపకము చేసినప్పుడు నాలుగైదు దినాల కొకమారు వెళ్లుచుండెడివారు. రాను రాను దినమును, ఒక్కొక్కమారు దినమున కెన్ని యోపర్యాయములును పోవలసిన వారై తమ ప్రభువుగారి సేవలో సప్రమత్తులై యుండిరి.